
బాలీవుడ్ నుంచి జియో సినిమాలో ప్రసారమవుతున్న 'బిగ్ బాస్ OTT 2'లో రోజుకో అంశం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల షోలోని కంటెస్టెంట్ జైద్ హదీద్, ఆకాంక్ష పూరి వివాదం వైరల్ అయ్యింది. పూరి ఆకాంక్షను జైద్ హదీద్ తప్పుగా తాకినప్పుడు ఆమె గొడవ చేసింది. తాజాగా వారిద్దరూ ముద్దులు పెట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
(ఇదీ చదవండి: బ్రహ్మానందం కోసం మహేష్ బాబు ఏం చేశారంటే..?)
'బిగ్ బాస్ OTT 2' జూన్ 17 నుంచి జియో సినిమాలో ప్రసారం అవుతుంది. షో ప్రారంభం అయిన వెంటనే, ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించేందుకు షోలో ఇలాంటివి చాలా జరిగాయి. ముఖ్యంగా షో ప్రారంభం అయిన 24 గంటల్లోనే ఒక పోటీదారుడిని తొలగించడం బిగ్ బాస్ చరిత్రలో ఇదే మొదటిసారి. వెంటనే షోలోని పోటీదారులు జైద్ హదీద్, ఆకాంక్ష పూరిల వివాదం కూడా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది.
తాజాగా ఒక వీడియో కనిపించింది, దీనిలో ఆకాంక్ష, జైద్ 30 సెకన్ల పాటు ఫ్రెంచ్ ముద్దులు పెట్టుకున్నారు. ఇందులో బిగ్‌బాస్ 'డేర్ గేమ్' పేరుతో ఒక టాస్క్ ఇచ్చాడు. పోటీలో పాల్గొనేందుకు మొదట ఎవరూ ముందుకు రాలేదు. కానీ కొంత సమయం తర్వాత జైద్ హదీద్, ఆకాంక్ష పూరి గేమ్‌లో పాల్గొన్నారు. అలా 30 సెకన్ల పాటు ఓపెన్‌గా ముద్దు పెట్టుకునే ధైర్యం చేశారు. ఆ తర్వాత కూడా కొందరు కంటెస్టెంట్స్ ధైర్యం చేసి ఫ్రెంచ్ కిస్ చేశారు. దీంతో నెటిజన్లు షో నిర్వాహుకులపై దుమ్మెత్తిపోస్తున్నారు. టాస్క్‌ల పేరుతో ఇలాంటి పిచ్చి పనులు ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. బిగ్‌బాస్ బుర్ర పనిచేస్తుందా అంటూ మండిపడుతున్నారు.
#SalmanKhan had said he will let #BiggBossOTT2 contestants cross the line, Lets see who he reacts to this Kiss by #AkankshaPuri and #JadHadid pic.twitter.com/ZFV1h3J80d
— The Khabri (@TheKhabriTweets) June 29, 2023
(ఇదీ చదవండి: ఆస్కార్‌లో కొత్త రూల్.. ఈ అర్హతలు ఉంటేనే ఎంట్రీ)
Comments
Please login to add a commentAdd a comment