తమిళ సినిమాతో పాటు పలు తెలుగు సినిమాల్లో కూడా గుర్తింపు తెచ్చుకున్న నటుడు గణేష్ వెంకట్రామన్. 2015లో బుల్లితెర నటి నిషా కృష్ణన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. తాజాగా అభిమానుల కోసం ఈ జంట సోషల్‌మీడియాలో ఒక పోస్ట్ చేసింది. మరోసారి మాతృత్వ ప్రేమను పొందబోతున్నట్లు ఇన్‌స్టాలో నిషా తెలిపింది. వారికి ఇప్పటికే ఒక పాప ఉంది.. రెండోసారి గర్భం ధరించడంతో అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. బిగ్ బాస్ సీజన్-1తో గణేష్ వెంకట్రామన్ ప్రేక్షకులను మెప్పించాడు.
(ఇదీ చదవండి: ఆ సినిమాతోనే మా ఇద్దరి మధ్య ప్రేమ మొదలైంది: తమన్నా)
కోలీవుడ్‌లో 'అభియుమ్ నానుమ్' చిత్రంలో త్రిషకు ప్రేమికుడిగా సినిమారంగంలో అడుగుపెట్టాడు. ఆ తర్వాత కమల్‌హాసన్ హీరోగా నటించిన ఉన్నైప్పోల్, ఒరువన్ చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకున్నారు. టాలీవుడ్లో నాగార్జున హీరోగా నటించిన ‘ఢమరుకం’ సినిమాలో విలన్‌గా నటించి పలు అవకాశాలు దక్కించుకున్నాడు. విజయ్ నటించిన వారిసు చిత్రంలో కీలకపాత్రను పోషించాడు. బాలీవుడ్లో కూడా ఒక చిత్రంలో నటించబోతున్నాడు.
(ఇదీ చదవండి: ఆదిపురుష్‌ను ప్రమోట్ చేస్తున్న మంచు మనోజ్ దంపతులు)
Comments
Please login to add a commentAdd a comment