Ganesh Venkatraman
-
‘శబరి’ మూవీ రివ్యూ
టైటిల్: శబరినటీనటులు: వరలక్ష్మీ శరత్ కుమార్, గణేష్ వెంకట్రామన్, శశాంక్, మైమ్ గోపి, సునయన, రాజశ్రీ నాయర్, మధునందన్, బేబీ నివేక్ష తదితరులునిర్మాత: మహేంద్ర నాథ్రచన-దర్శకత్వం: అనిల్ కాట్జ్సంగీతం: గోపి సుందర్సినిమాటోగ్రఫీ: రాహుల్ శ్రీవాత్సవ, నాని చమిడిశెట్టిఎడిటర్: ధర్మేంద్ర కాకరాల కథేంటంటే...సంజన(వరలక్ష్మి శరత్ కుమార్), అరవింద్(గణేష్ వెంకట్ రామన్) ప్రేమించి పెళ్లి చేసుకొని ముంబై వెళ్తారు. కొన్నాళ్ల తర్వాత ఓ కారణంతో అరవింద్‌ని వదిలేసి కూతురు రియా(బేబీ నివేక్ష)తో కలిసి విశాఖపట్నం వచ్చేస్తుంది. ఉద్యోగం కోసం చాలా ప్రయత్నాలు చేస్తుంది. చివరకు తన కాలేజ్ ఫ్రెండ్, లాయర్ రాహుల్(శశాంక్) సహాయంతో ఓ కార్పొరేట్ కంపెనీలో జుంబా డ్యాన్స్ ట్రైనర్‌గా ఉద్యోగం సంపాదిస్తుంది. సిటీకి దూరంగా ఓ ఫారెస్ట్‌లో సింగిల్‌గా ఉన్న ఇంట్లోకి షిఫ్ట్ అవుతుంది. కూతురిని మంచి స్కూల్లో జాయిన్ చేస్తుంది. ఓ సారి తన బంధువుల ఇంటికి వెళ్లగా.. తన కోసం సూర్య (మైమ్ గోపి) అనే ఓ క్రిమినల్ వచ్చాడని, అడ్రస్ చెప్పమని బెదిరించారనే విషయం తెలుస్తుంది. అదే భయంతో ఇంటికి వెళ్లగా.. నిజంగానే సూర్య తనను వెంబడిస్తాడు. అతని నుంచి తప్పించుకునే క్రమంలో గాయాలపాలవుతుంది. మరోసారి రాహుల్ ఇంటికి వెళ్లి వస్తుండగా.. సూర్య కనిపిస్తాడు. భయంతో సంజన పరుగులు తీస్తుంది. చివరకు స్పృహతప్పి పోగా.. పోలీసులు కాపాడతారు. సూర్య గురించి పోలిసులు ఇన్వెస్టిగేట్ చేయగా.. అతను చనిపోయినట్లు తెలుస్తుంది. మరి సంజనను వెంబడిస్తున్న సూర్య ఎవరు? ఎందుకు వెంబడిస్తున్నాడు? ప్రేమించి పెళ్లి చేసుకున్న అరవింద్‌ని సంజన ఎందుకు వదిలేసి వచ్చింది? అరవింద్ చేసిన తప్పేంటి? కిడ్నాప్‌కి గురైన కూతురు రియాని కాపాడుకోవడం సంజన ఎం చేసింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే?ఇదొక సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ. ఇలాంటి సినిమాల్లో థ్రిల్ ఎలిమెంట్స్‌తో పాటు ట్విస్టులు కూడా ఊహించని విధంగా ఉండాలి. అప్పుడే సినిమా రక్తి కట్టిస్తుంది. శబరిలోనూ ఆ రెండు ఉన్నాయి. కానీ డైరెక్టర్ కథను డీల్ చేయడంలో కాస్త తడబడ్డాడు. ఎంచుకున్న పాయింట్ బాగుంది కానీ దాని చుట్టు అల్లుకున్న కథ.. రాసుకున్న స్క్రీన్‌ప్లే అంతగా అకట్టుకోలేకపోయింది. చాలా సన్నివేశాలు గత సినిమాలను గుర్తు చేసేలా ఉన్నాయి. లాజిక్స్ విషయంలో సినిమాటిక్ లిబర్టీ ఎక్కువగా తీసుకున్నాడు. కథంతా ఒక్క పాయింట్ చుట్టే తిరగడంతో సాగదీతగా అనిపిస్తుంది. అయితే మదర్ సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయింది. బిడ్డను కాపాడుకోవడం కోసం తల్లి చేసే పొరాటం ఆకట్టుకుంటుంది.సిటీలో ఓ మెంటల్ ఆస్పత్రి నుంచి ఓ వ్యక్తి తప్పించుకొని వచ్చి ఇద్దరిని చంపి, సంజన కోసం వెతికె సీన్‌తో కథను ఆసక్తికరంగా ప్రారంభించాడు. ఆ తర్వాత కథను రెండేళ్ల ముందుకు తీసుకెళ్లాడు. సంజన ఉద్యోగం కోసం వెతకడం.. ఈ క్రమంలో ఆమె బాల్యం.. అరవింద్‌తో పెళ్లి.. విడిపోవడానికి గల కారణాలను చూపిస్తూ ఎమోషనల్‌గా కథనాన్ని నడిపించాడు. అయితే ప్రతీది డీటెల్డ్‌గా చూపించడంతో కథనం సాగదీసినట్లుగా అనిపిస్తుంది. ఫస్టాఫ్ అంతా సింపుల్‌గా, నిదానంగా సాగినట్లు అనిపిస్తుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ ఆకట్టుకుంటుంది. ఇక సెకండాఫ్‌లో ఒక్కో ట్విస్ట్ రివీల్ అవ్వడంతో కథపై ఆసక్తి పెరుగుతుంది. కానీ సూర్య గురించి ట్విస్ట్ తెలిసిన తర్వాత కథనం మళ్లీ రొటీన్‌గానే సాగుతుంది. క్లైమాక్స్ ముందు వచ్చే ట్విస్ట్ కాస్త థ్రిల్లింగ్‌గా అనిపిస్తుంది. లాజిక్స్‌పై దృష్టిపెట్టి స్క్రీన్‌ప్లేని మరింత బలంగా రాసుకొని ఉంటే సినిమా ఫలితం మరోలా ఉండేది. ఎవరెలా చేశారంటే..సంజనా పాత్రకు వరలక్ష్మి శరత్ కుమార్ పూర్తి న్యాయం చేసింది. ఇనాళ్లు విలనిజం ఉన్న పాత్రలు పోషించిన వరలక్ష్మీ.. ఇందులో డిఫరెంట్ రోల్ ప్లే చేసింది. కూతురుని కాపాడటం కోసం పోరాడే సాధారణ మహిళ పాత్రలో ఒదిగిపోయింది. ఇక మైమ్ గోపి విలనిజం బాగా వర్కౌట్ అయింది. రియాగా చైల్డ్ ఆర్టిస్ట్ బేబీ నివేక్ష అద్భుతంగా నటించింది. అరవింద్‌గా గణేష్ వెంకట్రామన్ చక్కగా నటించాడు. లాయర్‌గా శశాంక్, పోలీసు అధికారి శంకర్‌గా మధుసూధన్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు.సాంకేతికంగా సినిమా పర్వాలేదు. గోపీసుందర్ నేపథ్య సంగీతం బాగుంది. పాటలు కథలో భాగంగా వస్తుంటాయి. కానీ అవి గుర్తించుకునేలా ఉండవు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. సినిమా నిడివి తక్కువే అయినా చాలా చోట్ల అనవసరపు సీన్స్ ఉన్నాయి. వాటిని మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. OTT లొ చూడదగిన చిత్రంసన్ నెక్స్ట్ ఓటీటీలో శబరి సినిమా ని కుటుంబమంతా కలిసి చూడొచ్చు. ఈ సినిమాలో ఎలాంటి అనుచిత సన్నివేశాలు లేకపోవడం, మరియు ప్రధానంగా తల్లి ప్రేమ, పోరాటం వంటి భావోద్వేగాలు ఉండడం, దీన్ని ఫ్యామిలీతో కలసి చూసేందుకు అనుకూలంగా చేస్తుంది. సస్పెన్స్-థ్రిల్లర్ అయినప్పటికీ, ఈ చిత్రం పరోక్షంగా కుటుంబ విలువలను కూడా ప్రతిబింబిస్తుంది, అందువల్ల కుటుంబం మొత్తం ఓటీటీలో ఈ సినిమాను కలిసి చూడొచ్చు అంతే కాకుండా వరలక్ష్మి నటన అందరిని ఆకట్టుకుంటుంది.దసరా పండుగకు ఇంటిల్లిపాది కలసి చూసే సినిమాల లిస్ట్ లో శబరి ముందు ఉంటుంది. -
మరోసారి తండ్రిగా ప్రమోషన్ పొందిన ఢమరుకం విలన్, పోస్ట్ వైరల్
గణేశ్ వెంకట్రామన్.. ముంబైలో పుట్టిపెరిగిన ఇతడు ఈనాడు, ఢమరుకం సినిమాలతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఆ మధ్య తమిళ బిగ్‌బాస్ మొదటి సీజన్లో పాల్గొని థర్డ్ రన్నరప్‌గా నిలిచాడు. బుల్లితెర నటి నటి నిషా కృష్ణన్‌ను ప్రేమించిన ఇతడు 2015లో పెళ్లి చేసుకున్నారు. 2019లో వీరికి సమీరా అనే కూతురు జన్మించింది. తాజాగా మరోసారి ఈ దంపతులకు పండంటి బాబు పుట్టాడు. ఈ విషయాన్ని గణేశ్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. ఇదెంతో ప్రత్యేకం.. 'నీ చిట్టి చేతులతో నా వేలిని పట్టుకున్నప్పుడు కలిగిన ఆనందం మాటల్లో చెప్పలేనిది. నేను నా జీవితంలో ఎన్నోరకాల పాత్రలు పోషించి ఉండవచ్చు. కానీ తండ్రి పాత్ర మాత్రం అన్నింటికంటే ప్రత్యేకమైనది. మాకు బాబు పుట్టాడు. సాధారణ ప్రసవం జరిగింది. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు. మేము చాలా సంతోషంగా ఉన్నాము. మాపై ప్రేమాభిమానాలు కురిపించిన అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు' అని రాసుకొచ్చాడు. ఈ పోస్ట్‌కు అభిమానులు, సెలబ్రిటీలు స్పందిస్తూ దంపతులకు శుభాకాంక్షలు చెప్తున్నారు. సినిమాల సంగతి.. కాగా గణేశ్ వెంకట్రామన్ 'ద ఆంగ్రేజ్' సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చాడు. 'అభియుమ్ నానుమ్' చిత్రంతో కోలీవుడ్‌లో అడుగుపెట్టాడు. ఆ తర్వాత కమల్‌హాసన్ హీరోగా నటించిన ఉన్నైప్పోల్, ఒరువన్ చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకున్నాడు. టాలీవుడ్లో నాగార్జున హీరోగా నటించిన ‘ఢమరుకం’ సినిమాలో విలన్‌గా నటించి ఇక్కడ పలు అవకాశాలు దక్కించుకున్నాడు. తెలుగులో చివరగా వారసుడు సినిమాలో కనిపించాడు. ప్రస్తుతం అతడు 'ఉన్ పార్వైయిల్', 'వనంగముడి', 'ద డోర్' సినిమాలు చేస్తున్నాడు. గతంలో బుల్లితెరపై ప్రసారమైన 'వేందర్ వెట్టు కల్యాణం' అనే గేమ్ షోకి వ్యాఖ్యాతగానూ వ్యవహరించాడు. View this post on Instagram A post shared by Ganesh VenkatRam (@talk2ganesh) చదవండి: సీక్రెట్‌గా బిగ్‌బాస్ బ్యూటీ ఎంగేజ్మెంట్? ఎవరా మిస్టరీ మ్యాన్? -
మరో బిడ్డకు స్వాగతం పలుకుతున్నాం: ప్రముఖ నటుడు
తమిళ సినిమాతో పాటు పలు తెలుగు సినిమాల్లో కూడా గుర్తింపు తెచ్చుకున్న నటుడు గణేష్ వెంకట్రామన్. 2015లో బుల్లితెర నటి నిషా కృష్ణన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. తాజాగా అభిమానుల కోసం ఈ జంట సోషల్‌మీడియాలో ఒక పోస్ట్ చేసింది. మరోసారి మాతృత్వ ప్రేమను పొందబోతున్నట్లు ఇన్‌స్టాలో నిషా తెలిపింది. వారికి ఇప్పటికే ఒక పాప ఉంది.. రెండోసారి గర్భం ధరించడంతో అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. బిగ్ బాస్ సీజన్-1తో గణేష్ వెంకట్రామన్ ప్రేక్షకులను మెప్పించాడు. (ఇదీ చదవండి: ఆ సినిమాతోనే మా ఇద్దరి మధ్య ప్రేమ మొదలైంది: తమన్నా) కోలీవుడ్‌లో 'అభియుమ్ నానుమ్' చిత్రంలో త్రిషకు ప్రేమికుడిగా సినిమారంగంలో అడుగుపెట్టాడు. ఆ తర్వాత కమల్‌హాసన్ హీరోగా నటించిన ఉన్నైప్పోల్, ఒరువన్ చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకున్నారు. టాలీవుడ్లో నాగార్జున హీరోగా నటించిన ‘ఢమరుకం’ సినిమాలో విలన్‌గా నటించి పలు అవకాశాలు దక్కించుకున్నాడు. విజయ్ నటించిన వారిసు చిత్రంలో కీలకపాత్రను పోషించాడు. బాలీవుడ్లో కూడా ఒక చిత్రంలో నటించబోతున్నాడు. View this post on Instagram A post shared by Nisha Ganesh (@prettysunshine28) (ఇదీ చదవండి: ఆదిపురుష్‌ను ప్రమోట్ చేస్తున్న మంచు మనోజ్ దంపతులు) -
10 ఏళ్ల తర్వాత కోలీవుడ్‌లో రీఎంట్రీ ఇస్తున్న హీరోయిన్
ఇంతకుముందు కోలీవుడ్‌లో చిత్తిరం పేసుదడి, దీపావళి చిత్రాల్లో కథానాయికగా నటించిన నటి భావన. మలయాళంలో హీరోయిన్గా రాణించిన ఈ మాలీవుడ్ భామ ఆ మధ్య తన జీవితంలో జరిగిన అనూహ్య సంఘటన కారణంగా నటనకు దూరం అయ్యారు. ఇటీవలే తిరిగి నటించడం ప్రారంభించిన భావన దాదాపు పదేళ్ల తర్వాత కోలీవుడ్‌కు రీఎంట్రీ ఇస్తున్నారు. నటుడు గణేశ్ వెంకట్రామన్ నెక్స్ట్ సినిమాలో భాగం కానున్నారు. గణేశ్ 'అభియుమ్ నానుమ్' చిత్రంలో త్రిషకు ప్రేమికుడిగా సినిమారంగంలో అడుగుపెట్టాడు. ఆ తర్వాత కమల్‌హాసన్ హీరోగా నటించిన ఉన్నైప్పోల్, ఒరువన్ చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకున్నారు. ఆ మధ్య బిగ్‌బాస్ రియాలిటీ గేమ్ షో ద్వారా ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. ఇకపోతే తాజాగా విజయ్ కథానాయకుడిగా నటించిన వారిసు చిత్రంలో విలన్‌గా కీలకపాత్రను పోషించారు. వారిసు చిత్రం తరువాత పలు అవకాశాలు వస్తున్నాయని చెప్పిన గణేశ్ తాజాగా నటి భావనతో కలిసి నటిస్తున్న చిత్రం గురించి మీడియాకు తెలిపారు. దీనికి జయంతి దేవ్ దర్శకత్వం వహిస్తున్నట్లు చెప్పారు. ఇది హారర్, థ్రిల్లర్ కథా చిత్రంగా ఉంటుందన్నారు. చిత్ర కథ కొడైకెనాల్, చెన్నై నేపథ్యంలో సాగుతుందన్నారు. దీనికి గౌతమ్ జార్జ్ చాయాగ్రహణం అందిస్తున్నారని, ఇతర వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు. చదవండి: పూజాకు బ్యాడ్‌టైమ్.. ఫ్లాపుల మీద ఫ్లాపులు.. స్పందించిన హీరోయిన్ -
నా నమ్మకం నిజమైంది
ఈషారెబ్బా, సత్యదేవ్, శ్రీరామ్, గణేష్ వెంకట్రామన్, ముస్కాన్ సేథీ ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘రాగల 24 గంటల్లో..’. శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో శ్రీనివాస్ కానూరి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 22న విడుదలైంది. హైదరాబాద్‌లో జరిగిన సక్సెస్‌మీట్‌లో శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ– ‘‘ఫస్ట్ డే ఫస్ట్ షో చూసి కాస్త నిరాశకు లోనయ్యాం. కానీ శనివారం మార్నింగ్ షో, మ్యాట్నీ షోలు హౌస్‌ఫుల్ అవ్వడం, అన్ని చోట్ల కలెక్షన్స్ కూడా బాగుండటంతో చాలా హ్యాపీ ఫీలయ్యాం. సినిమా చూసినవాళ్లు బాగుంది చూడమని ఇంకో పదిమందికి చెబుతున్నారు. నేను ఏదైతే నమ్మి సినిమాను తీశానో అది నిజమైంది. బుధవారం నుంచి తెలుగు రాష్ట్రాల్లో సక్సెస్ టూర్ ప్లాన్ చేశాం. ఈషా, సత్యదేవ్ బాగా నటించారు. శ్రీనివాస్ రాజీ పడకుండా ఈ సినిమా నిర్మించారు. ఆయన బ్యానర్లోనే ‘భార్యదేవోభవ’ అనే సినిమాని డైరెక్ట్ చేయబోతున్నాను. ఓ ప్రముఖ హీరో నటిస్తారు. పదిమంది హీరోయిన్లు ఉంటారు’’ అన్నారు. ‘‘విద్య’ పాత్రను బాగా చేశానని చెబుతుంటే సంతోషంగా ఉంది’’ అన్నారు ఈషా రెబ్బా. ‘‘థ్రిల్లర్ సినిమాని బాగా గ్రిప్పింగ్‌గా తీశాడని కె.రాఘవేంద్రరావుగారు ఫోన్ చేసి చెప్పడం మరచిపోలేని అనుభూతి’’ అన్నారు శ్రీనివాస్ కానూరి. సత్యదేవ్, సంగీత దర్శకుడు రఘు కుంచె, గణేష్ వెంకట్రామన్, రవివర్మ, ముస్కాన్, కెమెరామన్ అంజి మాట్లాడారు. -
నా గత వైభవాన్ని తీసుకొచ్చే సినిమా ఇది
ఈషా రెబ్బా లీడ్ రోల్లో సత్యదేవ్, శ్రీరామ్, ముస్కాన్ సేథీ, గణేశ్ వెంకట్రామన్ ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘రాగల 24 గంటల్లో’. శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కానూరి శ్రీనివాస్ నిర్మించారు. నేడు ఈ సినిమా విడుదలవుతున్న సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రీ–రిలీజ్ వేడుకలో దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ – ‘‘నా గత చిత్రాల మాదిరిగానే ఈ సినిమా కూడా హిట్ కొట్టి సక్సెస్ఫుల్ దర్శకుడిగా వెలుగొందుతాననే నమ్మకం ఉంది. నా గత వైభవాన్ని తీసుకొచ్చే సినిమా ఇది. నా పక్కనే నిలబడి నన్ను నడిపించారు నిర్మాత కానూరి శ్రీనివాస్. బతికున్నంత కాలం అతన్ని వదలను. మంచి సినిమా తీశామనే నమ్మకం ఉంది’’ అన్నారు. ‘‘అనుష్క, కాజల్, రెజీనా లాంటి హీరోయిన్స్ కథ విన్నా డేట్స్ కుదరక చేయలేదు. తెలుగందం ఈషారెబ్బాతో పని చేశామని గర్వంగా చెబుతున్నాం. శ్రీనివాస్‌రెడ్డిగారు అద్భుతమైన సినిమా చేశారు’’ అన్నారు నిర్మాత శ్రీనివాస్ కానూరి. ‘‘కథ విన్న తర్వాత ఈ పాత్రకు న్యాయం చేయగలనా? అని భయపడ్డాను. అద్భుతమైన కథ. మంచి పాత్రలను డిజైన్ చేశారు శ్రీనివాస్‌రెడ్డిగారు’’ అన్నారు సత్యదేవ్. ‘‘తెలుగు అమ్మాయిలకు లేడీ ఓరియంటెడ్ సినిమాలు రావాలంటే అదృష్టం కావాలి. తెలుగమ్మాయిలకు అవకాశాలు రావడం లేదు. శ్రీనివాస్ రెడ్డిలాంటి దర్శకులు ఉండబట్టే మేం ఇండస్ట్రీలో ఉన్నాం. శ్రీనివాసరెడ్డిగారు చాలా కూల్. సత్యదేవ్ మన తెలుగు విక్కీకౌశల్. ఇలాంటి టీమ్‌తో పని చేయడం సంతోషంగా అనిపించింది’’ అన్నారు ఈషా రెబ్బా. శ్రీరామ్, ముస్కాన్ సేథీ, గణేశ్ వెంకట్రామన్, రఘు కుంచె తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
ప్రేమకథలంటే ఇష్టం
‘‘రాగల 24 గంటల్లో’ చిత్రంలో అందరికంటే చివరిగా వచ్చింది నేనే. ‘అసలేం జరిగింది’ అనే తెలుగు సినిమా షూటింగ్లో పాల్గొని చెన్నైకి వెళ్లిన తర్వాత శ్రీనివాస్ రెడ్డి ఫోన్ చేసి, ఈ సినిమా లైన్ చెప్పడంతో నచ్చి, చేసేందుకు ఒప్పుకున్నాను’’ అని శ్రీరాం (ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ ఫేం) అన్నారు. సత్యదేవ్, ఈషా రెబ్బ, శ్రీరాం, గణేష్ వెంకట్రామన్, ముస్కాన్ సేథీ ముఖ్య పాత్రల్లో శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రాగల 24 గంటల్లో’. శ్రీనివాస్ కానూరు నిర్మించిన ఈ సినిమా నవంబరులో విడుదల కానుంది. ఈ సందర్భంగా శ్రీరాం చెప్పిన విశేషాలు. ► శ్రీనివాస్ రెడ్డిగారు నాకు ఫోన్ చేసినప్పుడు నా పాత్ర కాదు, పూర్తి కథ చెప్పమన్నాను. ఈ సినిమాలో కథే హీరో. ప్రతి పాత్రకు ప్రాధాన్యం ఉంటూ ఉత్కంఠగా సాగే కథ ఇది. సీరియస్ క్రైమ్ థ్రిల్లర్. ఒక హత్య చుట్టూ కథ నడుస్తుంది. ఓ రకంగా లేడీ సెంట్రిక్ సబ్జెక్ట్ అని చెప్పొచ్చు. చాలా ఉత్కంఠగా సాగుతుంది. ► ఈ చిత్రం స్క్రిప్ట్ మొత్తం 24 గంటల్లో నడిచే కథ. వాతావరణ విషయాల గురించి రేడియోలలో చెప్పేటప్పుడు ‘రాగల 24 గంటల్లో’ అని చెబుతుండటం మనకు తెలిసిందే. అందుకే ఈ కథకు ఆ టైటిల్ కరెక్టుగా సరిపోతుందని పెట్టాం. ఈ చిత్రంలో పోలీస్ పాత్ర చేశా. నా గత పోలీస్ చిత్రాలతో పోలిస్తే ఇందులో నా పాత్ర ఇంకా డెప్త్‌గా ఉంటుంది. తమిళంలో కూడా ఓ చిత్రంలో ఇలాంటి పోలీస్ పాత్ర చేస్తున్నాను. ► మర్డర్ మిస్టరీ కథాంశంతో చాలా సినిమాలు గతంలో వచ్చాయి. అయితే ప్రతి దర్శకుడు కొత్తగా చెప్పాలని ప్రయత్నిస్తారు. శ్రీనివాస్ రెడ్డి ఒక భిన్నమైన ట్రీట్మెంట్తో ఈ సబ్జెక్ట్‌ని తెరకెక్కించారు. పేర్లు అయిపోగానే నేరుగా అసలు కథలో లీనమవుతారు ప్రేక్షకులు. ఎక్కడా సాగతీత ఉండదు. ► తెలుగు సినిమాల్లో నటించడానికి నేనెప్పుడూ సిద్ధమే. అయితే మంచి కథలు కుదరకపోవడం వల్లే చేయడం లేదు. ప్రస్తుతం తెలుగులో ‘అసలేం జరిగింది’ చిత్రంతో పాటు కొత్త దర్శకుడు మధుకర్‌తో ఓ సినిమా చేస్తున్నాను. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. రొమాంటిక్ లవ్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ జరుగుతోంది. లవ్ ఎంటర్టైనర్లలో నటించడం నాకు చాలా ఇష్టం. తెలుగులో ఇలాంటి సినిమాలు వస్తున్నాయి. కానీ తమిళంలో మాత్రం రావడం లేదు. ► తమిళంలో లక్ష్మీరాయ్ హీరోయిన్గా ఒక చిత్రం, హన్సికతో మరో సినిమా.. ఇంకా 4 చిత్రాల్లో హీరోగా చేస్తున్నాను. ఆరు చిత్రాల్లోనూ నావి మంచి పాటలే. -
రాగల 24 గంటల్లో...
‘‘రేడియోల్లో, టీవీల్లో రాగల 24 గంటల్లో అని వాతావరణం విషయాలను చెప్పేవారు. అయితే మా ‘రాగల 24 గంటల్లో’ కొన్ని అనుకోని సంఘటనలు జరుగుతాయి.. అవి ఏంటి? అన్నదే సస్పెన్స్’’ అని దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సత్యదేవ్, ఈషా రెబ్బ, గణేష్ వెంకట్రామన్, ముస్కాన్ సేథీ ముఖ్య తారలుగా, హీరో శ్రీరామ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘రాగల 24 గంటల్లో’. శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వంలో శ్రీ నవహాస్ క్రియేషన్స్ పతాకంపై శ్రీనివాస్ కానూరు నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ– ‘‘ఇప్పటి వరకూ కామెడీ, ఎంటర్టైనర్ చిత్రాలను తెరకెక్కించిన నేను మొదటి సారి థ్రిల్లర్ సినిమా చేశాను. ఇందులోనూ వినోదం మిస్ అవ్వదు. అందరి పాత్రలు ఆద్యంతం ఆకట్టుకుంటాయి. జూలైలో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ‘‘సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు సత్యదేవ్. ‘‘ఈ సినిమాలో నటనకు ఆస్కారం ఉన్న మంచి పాత్ర చేశా’’ అని ఈషారెబ్బా అన్నారు. ‘‘ఇది పూర్తిస్థాయి సీరియస్ సినిమా కాదు.. ఆద్యంతం నవ్వులు పండిస్తూనే అందరిలో ఆసక్తి రేపుతుంది’’ అని శ్రీరామ్ అన్నారు. ‘‘షూటింగ్ పూర్తి కావొచ్చింది. విడుదల తేదీ ప్రకటిస్తాం’’ అని కానూరు శ్రీనివాస్ తెలిపారు. గణేష్ వెంకట్రామన్, నటుడు కృష్ణ భగవాన్ పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: రఘు కుంచె, కెమెరా: అంజి, సమర్పణ: శ్రీ కార్తికేయ సెల్యూలాయిడ్స్. -
నాయికలు పాటలకే పరిమితం కాకూడదు!
‘‘ఈ చిత్రం టీజర్ చూస్తే సినిమా బాగుంటుందనిపిస్తోంది. గిరిధర్ నిర్మించిన ‘లక్ష్మీ రావే మా ఇంటికి’ చిత్రానికి మించిన విజయాన్ని ఈ చిత్రం సాధించాలి. హీరోయిన్ను కేవలం పాటల కోసమే తీసుకుంటున్న ఈ రోజుల్లో హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రం చేస్తున్న దర్శకుడు గోవికి నా అభినందనలు’’ అని డాక్టర్ దాసరి నారాయణరావు అన్నారు. త్రిష, గణేశ్ వెంకట్రామన్ ప్రధానపాత్రల్లో రాజ్ కందుకూరి సమర్పణలో గోవి దర్శకత్వంలో గిరిధర్ మామిడి పల్లి, పద్మజ మామిడిపల్లి నిర్మించిన ‘నాయకి’ చిత్రం టీజర్‌ను దాసరి విడుదల చేశారు. ‘‘నాకిది ఫస్ట్ హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ. ఈ చిత్రంలో ఓ పాట కూడా పాడాను’’ అని త్రిష తెలిపారు. హీరో గణేశ్ వెంకట్రామన్, నిర్మాత గిరిధర్, దర్శకుడు గోవి, చిత్ర సమర్పకుడు రాజ్ కందుకూరి, సంగీత దర్శకుడు రఘు కుంచె, లైన్ ప్రొడ్యూసర్ ఎం. వెంకటసాయి సంతోష్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత రాంబాబు కుంపట్ట, కెమేరామ్యాన్ జగదీశ్ చీకటి తదితరులు మాట్లాడారు. -
నటుడు గణేష్ వెంకట్రామన్ రిసెప్షన్
-
గణేశ్ పెళ్లికి లైన్ క్లియర్
యువ నటుడు గణేశ్ వెంకట్రామన్ ప్రేమ వివాహానికి శుభం కార్డు పడింది. అభియుమ్ నానుమ్ చిత్రం ద్వారా తమిళ సినిమాకు పరిచయం అయిన నటుడు గణేశ్ వెంకట్రామన్. ఆ తరువాత కమలహాసన్ చిత్రం ఉన్నైపోల్ఒరువన్,తదితర చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు. ఇటీవల విడుదలైన అచ్చారం చిత్రంలో కథానాయకుడిగా నటించారు. ప్రస్తుతం పొల్లాదవన్ చిత్ర హిందీ రీమేక్‌లో విలన్‌గా నటిస్తున్నారు. కాగా గణేశ్ వెంకట్రామన్కు బుల్లితెర నటి నిషాక్రిష్ణకు మధ్య ప్రేమ మొలకెత్తింది. కొంత కాలంగా ప్రేమించుకుంటున్న ఈ జంటకు పెద్దల అంగీకారం లభించలేదు. అయినా వీరు పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యారు. ఆ మధ్య పెళ్లి నిశ్చితార్థం కూడా జరుపుకున్నారు. కుటుంబ సభ్యుల అయిష్టత కారణంగా వివాహ నిశ్చితార్థ కార్యక్రమాన్ని నిరాడంబరంగా నిర్వహించినట్లు వెంకట్రామన్ సన్నిహితులు పేర్కొన్నారు. అయితే ఇప్పుడు ఇరు తరపు కుటుంబ సభ్యులు ఈ ప్రేమ జంట పెళ్లికి సమ్మతించడంతో అక్టోబర్ 22న చెన్నైలో ఆడంబరంగా జరగనున్నట్లు వెంకట్రామన్ వెల్లడించారు. -
నయా ప్రేమ!
ప్రేమ గుడ్డి దంటారు. అది మహా చెడ్డది కూడా. కొందరిని కవ్విస్తుంది, మురిపిస్తుంది. చివరికి మాయ చేస్తుంది. చిత్ర రంగంలో చాలామంది నటీనటులు ప్రేమ మాయలో పడి కొట్టుకుపోయారు. తాజాగా నటి నయనతారకు కూడా ప్రేమ కలసి రాలేదు. ఈ భామను అదే ప్రేమ రెండుసార్లు మోసం చేసింది. అయినా నయనకు మనో నిబ్బరం ఎక్కువ. ముచ్చటగా మూడవసారి ప్రేమలో పడినట్టు తాజా ప్రచారం జోరందుకుంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ జయం రవికి జంటగా ఆయన సోదరుడు జయం రాజా దర్శకత్వంలో తనీ ఒరువన్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో నయనతార పోలీసు అధికారిగా లాఠీ చేతబడుతున్నారట. ఇంతవరకు బాగానే ఉంది. ఈ చిత్రంలో ఒక ముఖ్య పాత్రలో గణేష్ వెంకట్రామన్ నటిస్తున్నారు. ఈయన నయనతార స్నేహితుడిగా నటిస్తున్నారట. అయితే నిజ జీవితంలో కూడా వీరిద్దరూ చాలా స్నేహితంగా మెలగుతున్నారన్న వార్తలు ఊపందుకున్నాయి. ఇద్దరూ కలసి ఎక్కువ సమయం గడిపేస్తున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయాన్ని నటుడు గణేష్ వెంకట్రామన్ ఖండిస్తున్నారు. నయనతార తన సహ నటి మాత్రమేనని, తమ మధ్య మంచి స్నేహం మినహా మరేమీ లేదని అంటున్నారు. ఎవరైనా మొదట్లోనే అవును మేము ప్రేమించుకుంటున్నాం అని అంటారా? అయితే నిప్పు లేనిదే పొగ రాదన్న సామెత వీరికి తెలియంది కాదు సుమా!