Actress Bhavana Kollywood Re Entry With Ganesh Venkatraman, Deets Inside - Sakshi
Sakshi News home page

Bhavana: రీఎంట్రీకి రెడీ అయిన హీరోయిన్‌, వారిసు విలన్‌ నెక్స్ట్‌ మూవీలో..

Published Fri, Feb 10 2023 8:29 AM | Last Updated on Fri, Feb 10 2023 4:02 PM

Bhavana Kollywood Re Entry With Ganesh Venkatraman - Sakshi

ఇంతకుముందు కోలీవుడ్లో చిత్తిరం పేసుదడి, దీపావళి చిత్రాల్లో కథానాయికగా నటించిన నటి భావన. మలయాళంలో హీరోయిన్‌గా రాణించిన ఈ మాలీవుడ్‌ భామ ఆ మధ్య తన జీవితంలో జరిగిన అనూహ్య సంఘటన కారణంగా నటనకు దూరం అయ్యారు. ఇటీవలే తిరిగి నటించడం ప్రారంభించిన భావన దాదాపు పదేళ్ల తర్వాత కోలీవుడ్‌కు రీఎంట్రీ ఇస్తున్నారు. నటుడు గణేశ్‌ వెంకట్రామన్‌ నెక్స్ట్‌ సినిమాలో భాగం కానున్నారు. గణేశ్‌ 'అభియుమ్‌ నానుమ్‌' చిత్రంలో త్రిషకు ప్రేమికుడిగా సినిమారంగంలో అడుగుపెట్టాడు. ఆ తర్వాత కమల్‌హాసన్‌ హీరోగా నటించిన ఉన్నైప్పోల్‌, ఒరువన్‌ చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకున్నారు.

ఆ మధ్య బిగ్‌బాస్‌ రియాలిటీ గేమ్‌ షో ద్వారా ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. ఇకపోతే తాజాగా విజయ్‌ కథానాయకుడిగా నటించిన వారిసు చిత్రంలో విలన్‌గా కీలకపాత్రను పోషించారు. వారిసు చిత్రం తరువాత పలు అవకాశాలు వస్తున్నాయని చెప్పిన గణేశ్‌ తాజాగా నటి భావనతో కలిసి నటిస్తున్న చిత్రం గురించి మీడియాకు తెలిపారు. దీనికి జయంతి దేవ్‌ దర్శకత్వం వహిస్తున్నట్లు చెప్పారు. ఇది హారర్, థ్రిల్లర్‌ కథా చిత్రంగా ఉంటుందన్నారు. చిత్ర కథ కొడైకెనాల్, చెన్నై నేపథ్యంలో సాగుతుందన్నారు. దీనికి గౌతమ్‌ జార్జ్‌ చాయాగ్రహణం అందిస్తున్నారని, ఇతర వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు.

చదవండి: పూజాకు బ్యాడ్‌టైమ్‌.. ఫ్లాపుల మీద ఫ్లాపులు.. స్పందించిన హీరోయిన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement