Bhavana
-
ముట్టుకున్నా నొప్పి?!
నాకు డెలివరీ అయ్యి సంవత్సరం అవుతోంది. నార్మల్ డెలివరీనే! కానీ ఇప్పటికీ ఎక్స్టర్నల్ వెజైనా ఏరియాలో చాలా నొప్పిగా ఉంటోంది. ముట్టుకున్నా నొప్పి అనిపిస్తుంది. ఏ మందులు వాడినా, ఇన్ఫెక్షన్కి మందులు వాడినా ఏమీ తగ్గలేదు. నాకు సలహా ఇవ్వండి.విశాల, నాచారంమీరు చెప్పే నొప్పిని వల్వల్ పెయిన్ అంటారు. ఏ ఇన్ఫెక్షన్ లేనప్పుడు, ఏ కారణం తెలియనప్పుడు దీనిని డయాగ్నైజ్ చేస్తారు. కొన్నిసార్లు ప్రసవం జరిగే సమయంలో గాయపడినా, భయానికీ ఒత్తిడికీ గురైనా ఈ నొప్పి మొదలవుతుంది. కొన్నిసార్లు ఏ కారణం లేకుండా కూడా వస్తుంది. ఈ నొప్పికి గైనకాలజిస్ట్‌ని కలవాలి. ఇంటర్నల్‌గా చెక్ చేసి వెజైనల్ ఇన్ఫెక్షన్ ఉందా లేదా అని చూస్తారు. అవసరమైతే వెజైనల్ స్వాబ్ చేస్తారు. లిడోకేయిన్ 2% లోకల్ అప్లికేషన్ జెల్లీ వాడమని చెబుతారు. ఈ ఆయింట్మెంట్ని వెజైనా, వల్వా భాగంలో ఎక్కడ నొప్పి ఉంటే అక్కడ అప్లై చేసుకోవాలి. ఇది బాగా పని చేస్తుంది. ఈ ఆయింట్మెంట్ని ప్రతిరోజూ 3–4 సార్లు అప్లై చేసుకుంటూ, మీరు రోజువారీ పనులు చేసుకోవచ్చు. నడుము కండరాలు బలం పుంజుకోవడానికి ఎక్సర్సైజ్ కూడా చెయ్యాలి. ఈ క్రీమ్‌కి అలర్జీ చాలా అరుదుగా రావచ్చు. చాలా మందికి ఈ క్రీమ్‌తో నొప్పి తగ్గుతుంది. వెజైనల్ వాషెస్, స్ట్రాంగ్ సోప్స్, ఫెర్ఫ్యూమ్లు వాడకూడదు. కొంతమందికి సెన్సిటివిటీ తగ్గడానికి ఓరల్ ట్యాబ్లెట్స్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. నొప్పి ఎక్కువకాలం కొనసాగుతుంటే, ఫిజియోథెరపిస్ట్ ద్వారా నడుము కండరాల బలానికి ఎక్సర్సైజెస్ నేర్పిస్తారు.నాకు మొదటి నుంచీ రక్తంలో ఐరన్ శాతం తక్కువ అని చెప్పారు. ఇప్పుడు 3వ నెల. వయసు 22 సంవత్సరాలు. రక్త పరీక్ష చేయించినప్పుడు ఐరన్ శాతం మాత్రమే ఎందుకు తగ్గుతుందో తెలియడం లేదు. ఎలాంటి ఆహారం తీసుకోవాలి?– సృజన, శంకరపల్లిఐరన్ తక్కువ ఉన్న వాళ్లకి నీరసం, అలసట ఎక్కువ ఉంటాయి. హీమోగ్లోబిన్ 10 శాతం కన్నా తక్కువ ఉంటే రక్తహీనత అంటారు. గర్భధారణ సమయంలో రక్తంలో ఐరన్ శాతం బాగా ఉన్నప్పుడే రక్తకణాలు బాగా ఉంటాయి. ఈ రక్తకణాలు ఆక్సిజన్‌ను శరీరంలోని అన్ని అవయవాలకు పంపిస్తాయి. మీరు తీసుకునే ఆహారంలో ఐరన్ శాతం పెరగాలంటే కొన్ని ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. మాంసాహార పదార్థాలు అంటే చికెన్, మటన్, చేప, పౌల్ట్రీలో ఐరన్ శాతం ఎక్కువగా ఉంటుంది. లివర్, లివర్ ఉత్పత్తుల్లో ఐరన్ శాతం ఎక్కువ ఉన్నా గర్భధారణ సమయంలో తీసుకోకూడదు. వాటిలోని విటమిన్–ఎ పెరిగే బిడ్డకి ప్రమాదం. శాకాహార పదార్థాలు చాలావాటిలో ఐరన్ శాతం ఎక్కువగానే ఉంటుంది. ఆకుకూరలు, కూరగాయలు, రాజ్మా, బఠాణీ వంటి గింజలు, బ్రొకొలీ, సోయా ఉత్పత్తులు, పనీర్‌లలో ఐరన్శాతం ఎక్కువ ఉంటుంది. ఐరన్ శాతం పెరగాలంటే విటమిన్–సి కూడా అవసరం. అందుకే ఐరన్ ఎక్కువ ఉండే ఆహర పదార్థాలతో పాటు విటమిన్–సి కూడా తీసుకోవాలి. విటమిన్–సి ఎక్కువగా ఉండే సిట్రస్ ఫ్రూట్స్– నారింజ, కివీ, నిమ్మ వంటివి తీసుకోవాలి. టీ, కాఫీలు తాగకూడదు. భోజనంతో పాటు అస్సలు తీసుకోకూడదు. గర్భిణీలకు 3, 7, 9 నెలల్లో తప్పనిసరిగా కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అనే రక్తపరీక్ష చేస్తారు. దీనిలో మీ ఐరన్ శాతం తెలుస్తుంది. డైట్‌తో పాటు కొంతమందికి ఐరన్ సప్లిమెంట్స్ కూడా ఇవ్వవలసి వస్తుంది. కొంతమందికి రక్తహీనతతో పాటు విటమిన్– బి12 కూడా తక్కువ ఉండొచ్చు. అలాంటి వారికి అదనంగా సప్లిమెంట్స్ ఇవ్వాలి. డైట్, మందులతో ఐరన్ పెరగనప్పుడు హెచ్బి ఎలక్ట్రోఫోరెసిస్, ఐరన్ స్టడీస్ అనే అడ్వాన్స్డ్ టెస్ట్ చేసి సమస్య ఎక్కడ ఉందో కనిపెట్టి, ఫిజీషియన్ సూచన మేరకు ట్రీట్మెంట్ చేస్తారు. -
అమ్మ పెట్టె నల్ల చుక్కలు.. స్నానమే చేయలేదనుకుంటారు: అనన్య పాండే (ఫోటోలు)
-
టీడీపీ నేత కాలేజీలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
సాక్షి ప్రతినిధి, ఒంగోలు : టీడీపీ నేత గోరంట్ల రవికుమార్‌కు చెందిన శ్రీహర్షిణి జూనియర్ కళాశాలలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న వడ్డిముక్కల భావన(16) ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. జరుగుమల్లి మండలం పచ్చవ గ్రామానికి చెందిన వడ్డిముక్కల చిన బ్రహ్మయ్య, ధనలక్ష్మి దంపతుల చిన్న కుమార్తె భావన. వినాయక చవితి సెలవుల సందర్భంగా భావన 4వ తేదీన ఇంటికి వెళ్లింది. తిరిగి 16 మధ్యాహ్నం కాలేజీకి వచ్చింది. రాత్రి 8 గంటల సమయంలో తల్లికి ఫోన్ చేసి మాట్లాడింది. ఇంతలోనే ఏం జరిగిందో ఏమో గానీ కళాశాల టెర్రస్‌పై ఉన్న షెడ్డు కప్పునకు ఉన్న ఫ్యాన్‌కు తెల్లవారుజామున ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఉరికి వేలాడుతున్న భావనను మంగళవారం ఉదయం విద్యార్థినులు చూసి సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారొచ్చి భావనను కిందకు దింపడంతో అప్పటికే బాలిక మృతి చెందింది. వెంటనే ఆమె తల్లికి ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. ఫీజులు కట్టాలంటూ కాలేజీ యాజమాన్యమే వేధించి తన బిడ్డను పొట్టనపెట్టుకుందని ఆమె కన్నీటిపర్యంతమైంది. బాలిక తల్లి ధనలక్ష్మి ఫిర్యాదు మేరకు వన్‌టౌన్ సీఐ నాగరాజు కేసు దర్యాప్తు చేస్తున్నారు. భావన తండ్రి పదేళ్ల కిందట చనిపోవడంతో తల్లి కూలి పనులు చేసుకుంటూ ఇద్దరు పిల్లలనూ పోషిస్తోంది. కాగా, కళాశాలలో విద్యార్థిని ఆత్మహత్య విషయం తెలిసి కూడా గోరంట్ల రవికుమార్ పత్తా లేకుండా పోయారు. ఆయనతో పాటుగా కళాశాల హెచ్ఆర్ సురే‹Ù, కేర్ టేకర్ చాముండేశ్వరి కూడా కనిపించలేదు. కళాశాల ప్రిన్సిపాల్‌కు బదులుగా డీన్ ఆంజనేయులు మీడియాతో మాట్లాడారు. ఒక్కసారిగా వీరంతా కనిపించకుండా పోవడంపై మృతురాలి సోదరి ఐశ్వర్య అనుమానం వ్యక్తం చేశారు. రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సభ్యురాలు బత్తుల పద్మావతి బాలిక మృతదేహాన్ని పరిశీలించారు. కళాశాల చైర్మన్ అందుబాటులో లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కళాశాల నిర్వాహణ లోపాలపై ప్రశి్నంచారు. మూడు రోజుల్లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని జిల్లా అధికారులను ఆదేశించారు. భావన ఆత్మహత్యపై సమగ్ర విచారణ చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వినోద్, పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు రాజశేఖర్ డిమాండ్ చేశారు. -
వయనాడ్ వారియర్స్: ఈ తల్లి ఒక అద్భుతం!
ప్రకృతి ప్రమాదాలు సంభవించినప్పుడు పాత బట్టలు, గిన్నెలు తీసుకుని బయల్దేరతారు కొందరు. కానీ, తల్లిని కోల్పోయి పాలకోసం ఏడుస్తున్న చంటిపిల్లలకు తన పాలు ఇవ్వడానికి బయల్దేరింది ఆ తల్లి.ప్రకృతి ప్రకోపంతో వయనాడు తల్లడిల్లితే ఆ విషాదంలో కొందరు శిశువులు తల్లిపాలు లేక అల్లాడారు. అయితే ఆ వార్త తెలిసిన వెంటనే ఇడుక్కికి చెందిన భావన బాధిత శిబిరాల దగ్గరకు వెళ్లి తన పాలు అందించింది. నాలుగేళ్ల వయసు, నాలుగు నెలల వయస్సు గల ఇద్దరు పిల్లలు ఆమెకు ఉన్నారు. ఆమె భర్త సజిన్ డ్రైవర్‌గా పనిచేస్తాడు. సేవా కార్యక్రమాలు కూడా చేస్తాడు. వయనాడ్‌లోని పసికందుల అవస్థను భార్యకు చెప్పి తల్లి పాలు ఇచ్చేందుకు ప్రోత్సహించాడు.ఇడుక్కిలోని వారి ఇంటి నుండి పికప్ ట్రక్‌లో కేరళలోని వయనాడ్ కొండలపైకి వెళ్లి మెప్పాడిలోని శిబిరాల్లో కుటుంబాలకు సేవ చేసిన తర్వాత ఇడుక్కికి తిరిగి వచ్చారు ఆ దంపతులు. ‘మేం కొన్ని శిబిరాలు, హాస్టళ్లను సందర్శించాం. నేను ఆరు నెలల కంటే తక్కువ వయస్సు ఉన్న కొంత మంది పిల్లలకు నా పాలు ఇచ్చాను. కొందరికి ఆహారాన్ని తినిపించాను. కొండచరియలు విరిగిపడి గాయపడిన తల్లులు కోలుకున్న వెంటనే తమ పిల్లల బాధ్యతలు స్వీకరించారు. మేం ఒక కుటుంబంగా పిల్లల్ని చూసుకున్నాం. నేను చేస్తున్న పని తెలిసి చాలా మంది మెచ్చుకున్నారు. కొందరు మా ట్రిప్‌ను స్పాన్సర్ చేస్తామన్నారు. కానీ, ఆ మాత్రం ఖర్చును భరించలేమా? నేను తల్లిని, పిల్లలకు తల్లి పాలు ఉత్తమమని నాకు తెలుసు. అందుకే, వాటిని కొందరికైనా అందించాలనుకున్నాను’ అని భావన చెప్పింది. -
డెలివరీ టైమ్‌లో.. సైన్ కావాల్సి వస్తే?
నాకిప్పుడు తొమ్మిదోనెల. అమెరికా నుంచి వచ్చాను. ఇక్కడే డెలివరీ ప్లాన్ చేస్తున్నాను. మావారు యూఎస్‌లోనే ఉన్నారు. నా లేబర్ టైమ్‌లో ఏదైనా అవసరమైతే ఎవరిని అప్రోచ్ కావాలి? ఏదైనా సైన్ కావాల్సి వస్తే నేను ఒప్పుకుంటే సరిపోతుందా? – చిక్కేపల్లి మనోజ్ఞ, హైదరాబాద్ప్రెగ్నెన్సీ, డెలివరీ అనేవి ఆడవాళ్ల జీవితంలో చాలా ముఖ్యమైన ఘట్టాలు. బిడ్డకు జన్మనివ్వడమనేది మరచిపోలేని అనుభూతిగా ఉండాలి. అలాంటి సురక్షితమైన ప్రసవానికి మంచి ఆసుపత్రి అవసరం. నిజానికి ఇది ఆడవాళ్ల ఫండమెంటల్ రైట్. దీన్ని అర్థం చేసుకున్న ఆసుపత్రి, అందులోని వైద్య సిబ్బంది.. డెసిషన్ మేకింగ్‌లో మిమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తారు. ప్రెగ్నెన్సీ చెకప్స్ నుంచి వైద్యపరీక్షలు, ఇన్వెస్టిగేషన్స్, స్కాన్స్ వంటి వాటన్నిట్లో మీ సమ్మతి తీసుకుంటారు. అంటే ఏదైనా మీ ఇష్టప్రకారమే జరగాలని అలా కన్సెంట్ అడుగుతారు.అలాగే ఏది సురక్షితమో కూడా డాక్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీ ఇష్టానికి వ్యతిరేకంగా ఏదీ చెయ్యరు. మీ కుటుంబం అభిప్రాయాన్ని, సలహా, సూచనలను మీరు ఎల్లవేళలా తీసుకోవచ్చు. కానీ మీ నిర్ణయాన్నే డాక్టర్ ఫాలో అవుతారు. ప్రెగ్నెన్సీ సమయంలో భావోద్వేగాలు తరచుగా మారుతుంటాయి. కాబట్టి ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్, ప్రసవం వంటివాటికి సంబంధించిన అన్ని ప్రొసీజర్స్, టెస్ట్‌ల గురించి మీకు అర్థమయ్యే భాషలో రాసి ఉన్న బుక్లెట్స్ని మీకు ఇస్తారు. మీరు చదివాక మీ సందేహాలను తీరుస్తూ మళ్లీ ఒకసారి వాటన్నిటి గురించి సంబంధిత డాక్టర్ చక్కగా వివరిస్తారు.ప్రీనాటల్ టెస్ట్, లేబర్ ఇండక్షన్, ఫీటల్ మానిటరింగ్స్, వెజైనల్ ఎగ్జామినేషన్స్, ఎపిడ్యురల్స్, ఎపిసియోటమి, ఫోర్సెప్స్ డెలివరీ, సిజేరియన్ లాంటి అన్ని ప్రక్రియల గురించి.. వాటికున్న రిస్క్స్, బెనిఫిట్స్ గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీకేది మంచిదో.. మీకేది సూట్ అవుతుందో చెప్తారు. ఫైనల్ డెసిషన్ మీరు తీసుకోవాలి. మీకు సురక్షితంగా ప్రసవం చేసే బాధ్యతను డాక్టర్ తీసుకుంటారు. ఒకవేళ ఏ కారణం చేతనైనా మీరు ఆ టెస్ట్, ప్రొసీజర్, చెకప్ వద్దనుకుంటే ప్రత్యామ్నాయ మార్గాల గురించీ చెప్తారు. వాటికి సంబంధించిన నిర్ణయాన్ని తీసుకోవడానికి తగిన సమయమూ ఇస్తారు.ఫలానా టెస్ట్ చేయకూడదు అని మీరు నిర్ణయించుకుంటే దాని పర్యవసానాల గురించి, తర్వాత ప్రెగ్నెన్సీ కేర్ ఎలా ఉంటుందో కూడా డాక్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. డాక్యుమెంటేషన్ ప్రొసీజర్స్ కూడా వివరిస్తారు. అవన్నీ మీకు పూర్తిగా అర్థమయ్యే మీరు ఓ నిర్ణయానికి వచ్చారా అనీ చెక్ చేస్తారు. మీ భర్త, మీ కుటుంబం అభిప్రాయాన్ని మీరు పరిగణనలోకి తీసుకున్నా.. ఫైనల్‌గా మీరు చెప్పే నిర్ణయాన్నే డాక్టర్ కన్సిడర్ చేస్తారు. ఎలెక్టివ్ ఆపరేటివ్ ప్రొసీజర్స్‌కి మీ సమ్మతి చాలా ముఖ్యం. ఒకవేళ అత్యవసర పరిస్థితిలో ఏదైనా ప్రొసీజర్ చేయాల్సి వస్తే మీ నుంచి వర్బల్ కన్సెంట్ తీసుకుంటారు. లేబర్ వార్డ్ స్టాఫ్, నర్స్‌లు అందరూ సపోర్టివ్‌గానే ఉంటారు. మీకు సౌకర్యంగా ఉండేలా చూస్తారు.– డా. భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ -
నేచురల్‌గానే వచ్చింది! జాగ్రత్తలు ఎలా?
నాకు 42 ఏళ్లు. ప్రెగ్నెంట్‌ని. మూడో నెల. పిల్లల కోసం కొన్నేళ్లు ట్రీట్మెంట్ తీసుకున్నాను. ఇప్పుడు నేచ్యురల్గానే వచ్చింది. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పగలరు. – ఆకునూరి శైలజ, వైరాఈరోజుల్లో చాలామంది 35 ఏళ్ల తర్వాతే గర్భం దాలుస్తున్నారు. 40 ఏళ్లు దాటినా ఆరోగ్యకరమైన బిడ్డ పుట్టే అవకాశాలున్నాయి. పౌష్టికాహారం, క్రమం తప్పని వ్యాయామం, సరైన మందులు, చెకప్స్ ఉండాలి. పాజిటివ్‌గా ఉండాలి. హై రిస్క్ ప్రెగ్నెన్సీస్‌ని డీల్ చేసే ఆసుపత్రిలో చూపించుకోవాలి. ఇప్పుడు అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ద్వారా 40 ఏళ్లు దాటిన వాళ్లకు కూడా ఐవీఎఫ్ ద్వారా పిల్లలు కలుగుతున్నారు. అయితే ఈ వయసులో గర్భం దాల్చినవాళ్లకు బీపీ, సుగర్, థైరాయిడ్ సమస్యలు ఎక్కువ రావచ్చు.బిడ్డకీ జన్యుపరమైన సమస్యలు, బరువు తక్కువగా ఉండటం, నెలలు నిండకముందే ప్రసవించడం వంటి చాన్సెస్ పెరగొచ్చు. అయితే కరెక్ట్ డయాగ్నసిస్, ట్రీట్మెంట్తో వీటిని మేనేజ్ చేయవచ్చు. ఇది తొలి చూలు అయితే ఆరోగ్య సమస్యలు వచ్చే రిస్క్ తక్కువుంటుంది. మలి చూలు అయి.. ఇంతకుముందు ప్రెగ్నెన్సీలో కాంప్లికేషన్స్ లేదా గర్భస్రావం అయినా.. 40 ఏళ్ల తర్వాత ఇంకా రిస్క్ పెరుగుతుంది. జెస్టేషనల్ డయాబెటిస్ అంటే ప్రెగ్నెన్సీలో వచ్చే సుగర్ వ్యాధి రిస్క్ నాలుగు రెట్లు ఎక్కువ. అందుకే ప్రతి చెకప్‌లో యూరిన్‌లో సుగర్ టెస్ట్ చేస్తారు. ఒకవేళ యూరిన్‌లో సుగర్ నిర్ధారణ అయితే అప్పుడు బ్లడ్ సుగర్ టెస్ట్ చేస్తారు. డయాబెటాలజిస్ట్, డైటీషియన్ కన్సల్టేషన్తో మేనేజ్ చేస్తారు.సుగర్ కంట్రోల్ కానప్పుడు మాత్రమే తల్లికి, బిడ్డకి కాంప్లికేషన్స్ వస్తాయి. రెగ్యులర్‌గా బిడ్డ ఎదుగుదలను చెక్ చేస్తే స్కాన్స్‌ని రిఫర్ చేస్తారు. అయితే 40 ఏళ్లు దాటిన గర్భిణీల్లో అయిదవ నెల లోపు గర్భస్రావం అయ్యే రిస్క్ ఎక్కువ. అందుకే 3 నుంచి 5 నెలల్లో డాక్టర్ సూచించిన మందులను తప్పకుండా వాడాలి. శారీరకంగా ఎక్కువ శ్రమ లేకుండా చూసుకోవాలి. 7 వ నెల నుంచి ప్రతి రెండు వారాలకు ఒకసారి చెకప్‌కి వెళ్లాలి. బిడ్డ కదలికలను ఎలా ట్రాక్ చేయాలో వివరిస్తారు. కదలికలు తక్కువగా అనిపిస్తే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి.తొమ్మిదవ నెల నిండుతున్నప్పుడు ప్రసవానికి ప్లాన్ చేస్తారు. సిజేరియన్ డెలివరీ అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. బిడ్డ బరువు, తల్లి ఆరోగ్యపరిస్థితిని బట్టి డెలివరీ ప్లాన్ చేస్తారు. బీపీ, సుగర్ ఉన్నవారిలో ప్రసవం తర్వాత బ్లీడింగ్ ఎక్కువ ఉండొచ్చు. దానికి సిద్ధపడే మందులు ఇస్తారు. ప్రెగ్నెన్సీ, ప్రసవం.. ఆరోగ్యంగా.. సుఖంగా జరిగిపోవడానికి బరువును నియంత్రణలో పెట్టుకోవాలి.సమతుల, పౌష్టికాహారాన్ని తీసుకోవాలి. జంక్, ప్రాసెస్డ్ ఫుడ్ జోలికి వెళ్లకూడదు. నిపుణుల పర్యవేక్షణలో యోగా, వ్యాయామం వంటివి చేయాలి. కాఫీ, ఆల్కహాల్ వంటివి మానెయ్యాలి. ఇన్ఫెక్షన్స్ సోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఫీటల్ మెడిసిన్ కన్సల్టెంట్‌తో క్రమం తప్పకుండా మూడవ నెల, అయిదవ నెలల్లో స్కాన్స్ చేయించుకోవాలి. ఈ జాగ్రత్తలన్నీ పాటిస్తే ప్రెగ్నెన్సీ రిస్క్‌ని తగ్గించవచ్చు.– డా. భావన కాసు, గైనకాలజిస్ట్ & ఆబ్స్టేట్రీషియన్, హైదరాబాద్ -
ప్రెగ్నెన్సీలో.. గ్యాస్ ట్రీట్మెంట్ ఎలా?
నేను ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తున్నాను. లాస్ట్ ఇయర్ సివియర్ గ్యాస్ట్రైటిస్తో డాక్టర్ దగ్గరకి వెళితే Hiatus Hernia అని డయాగ్నోస్ చేశారు. నాకు గ్యాస్ ప్రాబ్లం చాలా ఎక్కువ. దీనివల్ల ప్రెగ్నెన్సీలో వాంతులు ఎక్కువవుతాయా? మందులు వాడకూడదు అంటారు కదా.. మరి ప్రెగ్నెన్సీలో గ్యాస్ ట్రీట్మెంట్ ఎలా? – పేరు, ఊరు రాయలేదు.Hiatus Hernia అనేది చాలా కామన్. మామూలుగా పొట్టకి, ఆహారనాళానికి మధ్య డయాఫ్రమ్ అనే రెస్పిరేటరీ కండరం.. జంక్షన్‌ని టైట్‌గా క్లోజ్ చేసి పెడుతుంది. ఈ గ్యాప్ వదులైనప్పుడు పొట్టలోని యాసిడ్స్ ఆహారనాళంలో పైకి వచ్చి గ్యాస్, ఎసిడిటీ, వాంతులను ప్రేరేపిస్తాయి. అధిక బరువు, ప్రెగ్నెన్సీ లాంటి కండిషన్స్‌లో ఈ గ్యాప్ ఎక్కువై గ్యాస్ ప్రాబ్లమ్ పెరుగుతుంది. వయసు పెరిగే కొద్ది వీక్ కూడా కావచ్చు.ప్రెగ్నెన్సీలో యాసిడ్ రిఫ్లెక్స్ పెరుగుతుంది. ఇప్పటి నుంచే జీవన శైలిలో కొన్ని మార్పులు చేసుకుంటే ఏజ్చ్టీuటఏ్ఛటnజ్చీని మేనేజ్ చేయవచ్చు. ప్రెగ్నెన్సీలో మందులు వాడే అవసరం తగ్గించుకోవాలి. ఎసిడిటీని పెంచే ఆహారం అంటే ఆరేంజ్ జ్యూస్, టొమాటో సాస్, సోడా వంటివి అవాయిడ్ చేయాలి. వేపుళ్లు, కొవ్వు పదార్థాలు, వెనిగర్, చాక్లెట్స్, కాఫీలు తగ్గించాలి. కొంచెం కొంచెం ఆహారాన్ని నెమ్మదిగా.. ఎక్కువసార్లు తినటం అలవాటు చేసుకోవాలి. అలాగే తిన్న వెంటనే పడుకోకుండా.. మూడు నాలుగు గంటల గ్యాప్ ఉండేలా చూసుకోవాలి. తల కింద ఎత్తు పెట్టుకుని పడుకోవాలి. రాత్రి భోజనం పెందరాళే ముగించాలి. స్కాన్ చేసి.. హెర్నియా పెద్దగా ఉందని కనుక చెబితే.. కొంతమందికి డాక్టర్లు సర్జరీని సూచిస్తారు. లాపరోస్కోప్ ద్వారా చేస్తారు. ఒకవేళ ప్రెగ్నెన్సీలో గుండెలో మంట, ఎసిడిటీ ఎక్కువుంటే సురక్షితమైన కొన్ని సిరప్లు, జెల్స్, మాత్రలను ప్రిస్క్రైబ్ చేస్తారు.మొదటి మూడునెలల్లో వీటి అవసరం ఎక్కువుంటుంది. యాంటాసిడ్ జెల్స్ చాలావరకు రిలీఫ్‌నిస్తాయి. జీవనశైలి మార్పులతోనే చాలామందికి రిలీఫ్ వస్తుంది. నెలలు నిండే కొద్ది ముఖ్యంగా చివరి మూడు నెలల్లో బిడ్డ బరువుతో ఈ ఏజ్చ్టీuటఏ్ఛటnజ్చీకి ఇబ్బంది కలగొచ్చు. అలాంటప్పుడు భోజన వేళలను సర్దుబాటు చేసుకోవడంతో పాటు డైటీషియన్‌ని సంప్రదించి సలహాలు, సూచనలు తీసుకుంటే ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవచ్చు.– డా. భావన కాసు, గైనకాలజిస్ట్ & ఆబ్స్టేట్రీషియన్, హైదరాబాద్ -
ప్రెగ్నెన్సీ.. దీర్ఘకాలం వాయిదాలో సమస్యా? అయితే ఇలా చేయండి!
నాకు మూడేళ్ల బాబు ఉన్నాడు. ఇంకో బిడ్డను కనడానికి రెండు మూడేళ్ల సమయం కావాలనుకుంటున్నాం. ప్రస్తుతం సేఫ్టీ మెథడ్స్ వాడుతున్నాం. కాని ఎటువంటి టెన్షన్ లేని, ఎక్కువ కాలం ఉండే సైడ్ ఎఫెక్ట్స్ లేని కాంట్రాసెప్టివ్ పద్ధతి ఏదైనా ఉంటే సూచించండి. – నిర్మల గ్రేస్, యలమంచిలిప్రెగ్నెన్సీని దీర్ఘకాలం వాయిదా వేసుకునే సురక్షితమైన పద్ధతులు ఇప్పుడు చాలానే వచ్చాయి. తొలి కాన్పు తర్వాత .. రెండో బిడ్డ కోసం మూడు నుంచి అయిదేళ్ల పాటు గ్యాప్ ఇవ్వాలనుకునే వారు.. ఇంట్రాయుటెరిన్ డివైజ్ (ఐయూడీ) కాపర్ టీ కాయిల్, ఇంట్రాయుటెరిన్ సిస్టమ్ మరేనా కాయిల్, కాంట్రాసెప్టివ్ ఇంప్లాంట్ వంటి పద్ధతులను అవలంబించవచ్చు.అవి శరీరంలోకి ఇన్సర్ట్ చేసేవి. ఒక్కసారి శరీరంలో అమర్చితే ఆటోమేటిగ్గా వాటి పని అవి చేసుకుంటూ పోతాయి. వీటిని డాక్టర్ పర్యవేక్షణలోనే అమర్చాలి. ఈ పద్ధతుల వల్ల గర్భం రాకపోవడమే కాదు.. నెలసరి సమయంలో అధిక రక్తస్రావం, కడుపునొప్పి వంటివీ తగ్గుతాయి. అంతేకాదు బరువు పెరగడమనే సమస్యా ఉండదు. వీటిని స్థూలకాయులూ వాడొచ్చు.మధుమేహం, మూర్చ వ్యాధికి మందులు వాడుతున్నా ఈ పైన చెప్పిన గర్భనిరోధక పద్ధతులను అవలంబించవచ్చు. మళ్లీ గర్భం దాల్చాలనుకున్నప్పుడు డాక్టర్ దగ్గరకు వెళితే లోపల అమర్చిన ఈ డివైజ్‌ను తీసేస్తారు. నెలసరి సమయంలో అధిక రక్తస్రావంతో బాధపడుతూ, పిల్లల్ని కూడా వద్దు అనుకునేవాళ్లు ఈ మరేనా కాయిల్‌ను వాడొచ్చు. దీనికి హార్మోన్ కాయిల్ ఉంటుంది. అది రోజు కొంచెం హార్మోన్‌ను విడుదల చేస్తూ బ్లీడింగ్‌ని తగ్గిస్తుంది.ఆ హార్మోన్ వల్ల గర్భధారణ కూడా జరగదు. కాపర్ టీ కాయిల్‌ను గర్భాన్ని నిరోధించడానికి వేస్తాం. ఈ పద్ధతుల గురించి డాక్టర్‌తో డిస్కస్ చేస్తే.. పరీక్షించి.. మీకు సూటయ్యే మెథడ్‌ను సూచిస్తారు. అవుట్ పేషంట్‌గానే ఈ ప్రక్రియను పూర్తిచేస్తారు. పీరియడ్స్ అయిన వెంటనే ఈ డివైజ్‌ను అమరుస్తారు. ఒకసారి వేసిన తర్వాత అయిదేళ్ల వరకు మార్చాల్సిన అవసరం ఉండదు. మీరు డాక్టర్‌ను సంప్రదిస్తే ఏ డివైజ్ వెయ్యాలి అనేది డాక్టర్ మీతో డిస్కస్ చేస్తారు.డా. భావన కాసు, గైనకాలజిస్ట్ అండ్ అబ్‌స్టెట్రీషియన్, హైదారాబాద్ -
నెలసరి ముందు బాగా తలనొప్పా! పీఎంఎస్ అంటే ఏంటో తెలుసా?
నా వయసు 25 ఏళ్లు. ఇటీవల నాకు నెలసరి ముందు బాగా కడుపునొప్పి, తలనొప్పి వస్తున్నాయి. భావోద్వేగాలను అదుపు చేసుకోలేకపోతున్నాను. జాబ్‌లో కూడా ఏ పనిమీదా కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను. నాకేమైనా సమస్య ఉందంటారా? – రాజీవ, బనగానపల్లిమీరు ఎదుర్కొంటున్న సమస్యను ‘ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్’ (పీఎంఎస్) అంటారు. ప్రతి వందమందిలో ఇద్దరికి మీలో ఉన్నంత తీవ్రంగా ఈ సమస్య ఉంటుంది. దీని లక్షణాలు దినచర్యను ప్రభావితం చేసేంతగా ఉంటాయి. చాలామందిలో నెలసరి మొదలవడానికి రెండువారాల ముందు నుంచి శారీరక, మానసిక మార్పులు కనిపిస్తాయి. బరువు పెరగడం, మానసికంగా బలహీనం కావడం, తలనొప్పి, చిరాకు, కోపం, నిద్రలేమి, నీరసం ఉంటాయి.పీఎంఎస్‌కి సరైన కారణం తెలియదు. హార్మోన్ల అసమతుల్యత వల్ల వస్తుందనుకుంటాము. మీలో కలిగే మార్పులన్నీ కాగితంపై రాసుకోవాలి. దీనిని మెన్స్ట్రువల్ డైరీ అంటారు. ఇలా రెండు మూడు నెలలు మెన్స్ట్రువల్ డైరీ రాశాక, సమస్యకు కారణాలు కొంతవరకు తెలుస్తాయి.ముఖ్యంగా జీవనశైలిలో మార్పులు– అంటే, ప్రతిరోజూ వ్యాయామం చేయడం, పోషకాహారం తీసుకోవడం, నెలసరికి రెండు మూడు వారాల ముందు నుంచి టీ, కాఫీలు తగ్గించడం, జంక్‌ఫుడ్ మానేయడం వంటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే, కొంతవరకు ఫలితం ఉంటుంది. యోగా, ధ్యానం వంటివి చేయడం ద్వారా మానసిక స్థైర్యం పెరగడమే కాకుండా, పీఎంఎస్ లక్షణాల తీవ్రత తగ్గుతుంది.అలాగే, డాక్టర్ పర్యవేక్షణలో కొన్ని మందులు కూడా వాడాల్సి ఉంటుంది. విటమిన్–డి, విటమిన్–ఇ లాంటి సప్లిమెంట్లు ఉపయోగపడతాయి. పైమార్పులు, సప్లిమెంట్లతో ఫలితం కనిపించకపోతే, డాక్టర్ల పర్యవేక్షణలో అవసరమైన మందులు తీసుకోవలసి ఉంటుంది. అత్యంత అరుదుగా శస్త్రచికిత్స చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది.డా. భావన కాసు, గైనకాలజిస్ట్ అండ్ అబ్‌స్టెట్రీషియన్, హైదారాబాద్ -
ప్రొలాప్స్ అంటే ఏంటి? నా ఈ సమస్యకు అదే కారణమా?
నాకిప్పుడు 45 ఏళ్లు. ప్రొలాప్స్ ఉందని డయాగ్నసిస్ చేశారు. నాకు ప్రసవం చాలా కష్టమైంది. నా ఈ సమస్యకు అదే కారణమా? నాకు సర్జరీ అంటే భయం. సర్జరీ కాకుండా ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్ ఏదైనా ఉందా? – వేముల సూర్యకళ, సిరిసిల్లప్రొలాప్స్ అంటే గర్భసంచి కిందకు జారటం. సాధారణంగా కండరాల బలహీనత, ప్రసవమప్పుడు ఎదురయ్యే ఇబ్బందుల వల్ల పెల్విక్ మజిల్స్, లిగమెంట్స్ వదులు అవుతాయి. కొంతమందికి జన్యుపరమైన కారణాలూ ఉండొచ్చు. హార్మోన్స్ చేంజెస్ కూడా కారణం కావచ్చు. అదేపనిగా దగ్గు వస్తున్నా, మలబద్ధకం ఉన్నా గర్భసంచి జారొచ్చు. ఈ సమస్య ఉన్నప్పుడు దగ్గినా, తుమ్మినా యూరిన్ లీక్ కావడం, బ్యాక్ పెయిన్ ఉంటాయి. కాళ్లు లాగుతున్నట్లనిపిస్తుంది.ప్రొలాప్స్ తొలిదశలోనే డిటెక్ట్ అయితే ట్రీట్మెంట్ ఈజీ అవుతుంది. లిగమెంట్స్ స్ట్రెంతెనింగ్, పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్, అధిక బరువుంటే బరువు తగ్గడం, పౌష్టికాహారం వంటివాటితో మేనేజ్ చేయొచ్చు. ఫిజియోథెరపీ టీమ్ సపోర్ట్ తీసుకోవాలి. ప్రొలాప్స్ తర్వాత స్టేటెజెస్లో ఎక్సర్సైజెస్తోనే సమస్యను పరిష్కరించలేం. తర్వాత స్టేజెస్‌లో ప్రాలాప్స్కి బెస్ట్ ట్రీట్మెంట్ అంటే సర్జరీయే. అయితే సర్జరీని వద్దనుకుంటే ఖజీnజ ్క్ఛటట్చటyని సూచిస్తారు.ఇది సిలికాన్ లేదా ఠిజీny∙మెటీరియల్‌తో తయారవుతుంది. దీన్ని పేషంటే స్వయంగా వెజైనాలో ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఆ డివైజ్.. జారిన గర్భసంచిని పైకి ఎత్తిపెడుతుంది. పేషంట్ని చెక్ చేసి, తగిన సైజ్ Ring Pressaryని డాక్టర్ సూచిస్తారు. ఇది రౌండ్‌గా ఉంటుంది. దీన్ని చేతితో పట్టుకుని కంప్రెస్ చేయొచ్చు. లూబ్రికెంట్ జెల్లీతో ఇన్సర్ట్ చేసుకోవాలి. క్లినిక్‌లో డాక్టర్ పర్యవేక్షణలో చేయాలి. ఇన్సర్ట్ చేసుకున్నాక. కాసేపు నడిచి.. యూరిన్ పాస్ చేశాక.. సౌకర్యంగా అనిపిస్తే Pressaryతోనే ఇంటికి పంపిస్తారు.45 రోజులకు ఒకసారి వచ్చి.. చెక్ చేయించుకోవాలి. ఆరునెలలకు ఒకసారి కొత్త Pressaryని మార్చుకోవాలి. సమస్య తీవ్రతను బట్టి దీన్ని ఎన్ని రోజులు వాడాలనేది డాక్టర్ చెబుతారు. అయితే దీనివల్ల వెజైనాలో విపరీతంగా నొప్పి వస్తున్నా.. మూత్ర విసర్జనప్పుడు ఇబ్బంది పడుతున్నా.. వెజైనల్ డిశ్చార్జ్ ఉన్నా, దుర్వాసన వేస్తున్నా, బ్లీడింగ్ అవుతున్నా, వెజైనాలో అల్సర్స్ ఫామ్ అయినా వెంటనే డాక్టర్ని సంప్రదించాలి.– డా॥ భావన కాసు, గైనకాలజిస్ట్ & ఆబ్స్టేట్రీషియన్, హైదరాబాద్ -
సెకండ్ టైమ్ కూడా సిజేరియన్ అయితే.. ఏదైనా సమస్యా..!?
ఇప్పుడు నేను ప్రెగ్నెంట్‌ని. సెకండ్ టైమ్. తొలికాన్పు సిజేరియన్. అయితే కుట్లు సరిగా మానలేదు. ఇప్పుడూ సిజేరియన్ అయితే అలాంటి పరిస్థితే వస్తుందేమోనని భయంగా ఉంది. కుట్లు త్వరగా మానేలా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? – ఎన్. ప్రణిత, శ్రీరాంపూర్సిజేరియన్లో కరిగిపోయే కుట్లు వేస్తారు. లేదంటే ఎన్సేషన్ గ్లూతో క్లోజ్ చేస్తారు. మామూలుగా అయితే ఇవి మానడానికి ఒకటి నుంచి రెండు వారాలు పడుతుంది. కానీ శరీరతత్వాన్ని బట్టి మనిషికి మనిషికి తేడా ఉంటుంది. బరువు ఎక్కువున్నవాళ్లు, రోగనిరోధక శక్తి తక్కువున్న వాళ్లు, ఇన్ఫెక్షన్స్ ఉన్నవారిలో కుట్లు మానడానికి ఎక్కువ సమయం పట్టొచ్చు. సాధారణంగా .. స్కిన్ వూండ్ని క్లోజ్‌చేసి డ్రెస్సింగ్ చేస్తారు. ఈ డ్రెస్సింగ్ వల్ల గాయం నుంచి ఏదైనా లీకేజ్ వచ్చినా.. అబ్సార్బ్ అయిపోతుంది.గాయం మానడానికి కావల్సిన కండిషన్‌ను క్రియేట్ చేస్తుంది. గాయానికి మనం వేసుకున్న దుస్తులు తగలకుండా చేస్తుంది. అయితే కుట్లు సరిగా మానకపోతే అక్కడ ఇన్ఫెక్షన్ అవుతుంది. అంటే కుట్ల దగ్గర క్రిములు పెరిగి.. చీము పడుతుంది. ఇలా ఇన్ఫెక్షన్ అయితే కుట్లలో పెయిన్ వస్తుంది. ఎర్రగా మారి వాపూ ఉంటుంది. నీరు, బ్లడ్ వంటి ద్రవాలు లీక్ అవుతుంటాయి. దుర్వాసన వేస్తుంది. హై టెంపరేచర్‌తో జ్వరం వస్తుంది.ఇలాంటి మార్పులు ఏమైనా ఉంటే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. త్వరగా డాక్టర్ దగ్గరకు వెళితే ట్రీట్మెంట్ ఈజీగా అయిపోతుంది. ఆసుపత్రిలో చేసిన డ్రెస్సింగ్ డ్రైగానే ఉంటే మూడు రోజుల తర్వాత ఆ డ్రెస్సింగ్‌ని తీసేసి.. ఇంట్లోనే మీరు డ్రెస్సింగ్ చేసుకోవాలి. ఒకవేళ డ్రెసింగ్ తడిగా ఉంటే మాత్రం డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. ఇంట్లో డ్రెసింగ్ చేసుకునే ముందు సబ్బు నీటితో చేతులు శుభ్రంగా కడుక్కొని .. తడి లేకుండా తుడుచుకోవాలి.గ్లోవ్ హ్యాండ్‌తోనే డ్రెస్సింగ్‌ని తీసేసి.. మళ్లీ ఫ్రెష్‌గా డ్రెసింగ్ చేసుకోవాలి. కరిగిపోయే కుట్లయితే సాధారణంగా 7–10 రోజుల్లో కరిగిపోతాయి. విప్పే కుట్లయితే 14 రోజుల తర్వాత డాక్టర్ తీసేస్తారు. అప్పటి వరకు కుట్లకు మీరు వేసుకున్న దుస్తులు తగలకుండా కుట్ల దగ్గర కట్టు ఉండటం మంచిది. స్నానం చేసేటప్పుడు తడవకుండా చూసుకోవాలి. కుట్లు విప్పాకే పూర్తిగా షవర్ బాత్ చేయడం మంచిది. కుట్ల మీద స్ట్రాంగ్ సోప్‌ని వాడకూడదు. అలాగే జెల్స్, లోషన్స్ రాసుకోవద్దు.టాల్కం పౌడర్ కూడా వేయొద్దు. ఆపరేషన్ అయిన రెండు వారాలకు కుట్లు పూర్తిగా మానిపోతాయి. అప్పటి నుంచి నడుముకి బెల్ట్ పెట్టుకోవాలి.. నడుము నొప్పి రాకుండా! ఒకవేళ కుట్ల దగ్గర ఇన్ఫెక్షన్ ఉంటే డాక్టర్ చెక్ చేసి.. కుట్ల దగ్గర స్వాబ్ టెస్ట్ చేసి.. ఏ బ్యాక్టీరియా పెరుగుతోంది.. దానికి ఏ యాంటీబయాటిక్స్ ఇవ్వాలో చూసి.. ట్రీట్మెంట్ ఇస్తారు.– డా॥ భావన కాసు, గైనకాలజిస్ట్ & అబ్స్టేట్రీషియన్, హైదరాబాద్ -
Health: మెనోపాజ్ వల్ల హార్మోన్స్ సమస్యా? అయితే ఇలా చేయండి!
మెనోపాజ్ వల్ల హార్మోన్స్ తగ్గిపోతాయి కదా.. దాని ప్రభావం ఆరోగ్యం మీద పడకుండా ఉండటానికి మాత్రల ద్వారా హార్మోన్స్‌ను రీప్లేస్ చేయవచ్చా? – జి. సోనీ, సిద్ధిపేటమెనోపాజ్ తరువాత హార్మోన్స్ డెఫిషియెన్సీ వల్ల సైడ్ఎఫెక్ట్స్, ఇబ్బందులతో చాలామంది బాధపడుతుంటారు. వాటిని తగ్గించడానికి చాలామంది హెచ్ఆర్టీ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారిప్పుడు. అయితే దీనిని డాక్టర్ పర్యవేక్షణలోనే తీసుకోవాలి. అదికూడా వైద్య పరీక్షల అనంతరం. ఈ హెచ్ఆర్టీ అందరికీ సరిపడకపోవచ్చు.ఈ హార్మోన్స్ థెరపీతో ముఖ్యంగా హాట్ ఫ్లషెస్, రాత్రిళ్లు చెమటలు పట్టడం, మూడ్ స్వింగ్స్, వెజైనా పొడిబారిపోవడం వంటి సమస్యలను పరిష్కరించవచ్చు. ఆస్టియోపొరాసిస్ అంటే ఎముకలు గుల్లబారడం వంటి సమస్యనూ నివారిస్తుందీ హెచ్ఆర్టీ. ఈ సింప్టమ్స్ అన్నీ మెనోసాజ్ వచ్చిన కొన్నినెలలకు కనపడతాయి. ట్రీట్మెంట్ మొదలుపెట్టాక కనీసం మూడు నెలలు అయితే కానీ దాని ప్రభావం కనిపించదు.ఒకవేళ ఏవైనా సైడ్ ఎఫెక్ట్స్ కనిపిస్తే డోస్, ప్రిపరేషన్ మార్చేయవచ్చు. అయితే బ్రెస్ట్ క్యాన్సర్, ఒవేరియన్ క్యాన్సర్, అంతకుముందు బ్లడ్ క్లాట్స్ ఉన్నా, హై బీపీ, లివర్ ప్రాబ్లమ్ ఉన్నవారిలో హెచ్ఆర్టీ సురక్షితం కాదు. హెచ్ఆర్టీలో హార్మోన్స్‌ను సింగిల్ డోస్‌గా కానీ.. కంబైన్డ్ డోస్ టాబ్లెట్స్‌గా కానీ ఇస్తారు. ఇవి ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిరాన్ హార్మోన్స్‌తో ఉంటాయి. స్కిన్ పాచెస్, జెల్స్, పెసరీస్ కూడా ఉంటాయి. హెచ్ఆర్టీకి ప్రత్యామ్నాయాలు కూడా ఉన్నాయి.జీవనశైలిలో మార్పులు అంటే క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, పోషకాహారం తీసుకోవడం, మసాలా ఆహారపదార్థాలు, టీ, కాఫీ, ఆల్కహాల్ వంటివాటికి దూరంగా ఉంటూ.. తాజా ఆకుకూరలు, బాదం పప్పు, అక్రోట్స్, సోయా బీన్స్ వంటివి తీసుకుంటూంటే మెనోపాజ్ సింప్టమ్స్ అంతగా బాధించవు.. తగ్గుతాయి కూడా.ఇవి చదవండి: Health: లోయర్ బ్యాక్ పెయిన్‌తో ఇబ్బందా! ఆలస్యం చేశారో?? -
Health: లోయర్ బ్యాక్ పెయిన్‌తో ఇబ్బందా! ఆలస్యం చేశారో??
నాకు 35 ఏళ్లు. చాలా రోజులుగా లోయర్ బ్యాక్ పెయిన్‌తో సఫర్ అవుతున్నాను. డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలా? ఎక్సర్‌సైజెస్‌తో మేనేజ్ చేయొచ్చా? ఎలాంటి ఎక్సర్సైజెస్ చేయాలి.. ఎలాంటివి చేయకూడదు? – వి. శుభదా, హైదరాబాద్లోయర్ బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడు త్వరగా ట్రీట్మెంట్ తీసుకోవడం మంచిది. ఎక్సర్సైజెస్ కూడా స్టార్ట్ చేయాలి. ఆలస్యం చేయడం వల్ల సమస్యలు ఎక్కువవుతాయి. స్పైన్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. దాని చుట్టూ లిగమెంట్స్, జాయింట్స్, మజిల్స్ ఉండి.. దాన్ని ప్రొటెక్ట్ చేస్తాయి. అదేపనిగా రెస్ట్ తీసుకోవడం వల్ల ఉపయోగం ఉండదు. కదలికలతోనే స్పైన్ ఆరోగ్యంగా ఉంటుంది. దానికి పూర్తిగా విశ్రాంతి ఇస్తే కదలికలు తగ్గి ఇంకా పెయిన్ పెరిగే ప్రమాదం ఉంటుంది.రెండు రోజుల కన్నా ఎక్కువ బెడ్ రెస్ట్ తీసుకోకూడదు. స్పెషలిస్ట్‌ని సంప్రదించి సమస్య ఎక్కడుందో తెలుసుకోవాలి. మొబిలిటి పెరిగే వ్యాయామాలు చేయాలి. జాయింట్స్ బిగుసుకుపోకుండా చూసుకోవాలి. జాయింట్స్ స్టిఫ్‌గా అయిపోతే బ్యాక్ పెయిన్ మరింత ఎక్కువవుతుంది. యాక్టివ్‌గా ఉంటే కండరాలు స్ట్రాంగ్‌గా ఉంటాయి. వాకింగ్, స్విమ్మింగ్, యోగా, డాన్సింగ్ వంటివి చేయొచ్చు. Knee రోలింగ్, Knee to Chest, పెల్విక్ టిల్ట్స్ వంటి సింపుల్ ఎక్సర్సైజెస్ చేయాలి.ఇవన్నీ కూడా ఫిజియోథెరపిస్ట్ సమక్షంలో ప్రయత్నించాలి. కొంచెం నొప్పి తగ్గాక బ్యాక్ ఎక్స్టెన్షన్ ఎక్సర్సైజెస్ చేయాలి. వెల్లకిలా పడుకుని మోకాళ్ల కిందిభాగంలో రెండు పిల్లోస్‌ని, బోర్లా పడుకునే అలవాటున్నవారు పొట్టకింద రెండు పిల్లోస్, పక్కకు తిరిగి పడుకునేవారు రెండు మోకాళ్ల మధ్యలో ఒక పిల్లోను సపోర్ట్‌గా పెట్టుకోవాలి. అలాగే కూర్చుని ఉన్నప్పుడు నడుము వెనకభాగంలో పిల్లోని సపోర్ట్‌గా పెట్టుకోవాలి. లోయర్ బ్యాక్ పెయిన్ సూచనలు కనిపించగానే వెంటనే సంబంధిత డాక్టర్ని సంప్రదించాలి.మూత్ర విసర్జన కష్టమవుతున్నా, మలమూత్రాల మీద నియంత్రణ తప్పినా, మల ద్వారం దగ్గర నంబ్నెస్ ఉన్నా.. కాళ్లు నిస్సత్తువగా అనిపించినా.. తిమ్మిర్లున్నా, బాలెన్స్ తప్పుతున్నా, కాళ్లల్లో తీవ్రమైన నొప్పి ఉన్నా దగ్గర్లోని ఫిజీషియన్ని లేదా న్యూరాలజిస్ట్‌ని సంప్రదించాలి. అవసరమైన టెస్ట్‌లు చేస్తారు. పైన చెప్పిన పరిస్థితులు ఉంటే ఇంట్లో ఎలాంటి చిట్కా వైద్యాలు చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించాలి.ఇవి చదవండి: విడిపోతామని భయంగా ఉంది! అసలు కారణమేంటి? -
నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
సినిమా ఇండస్ట్రీలో వచ్చామా, పనిచేశామా, వెళ్లిపోయామా అనేలా ఉంటారు. మరికొందరు మాత్రం ఊహించని వివాదాల్లో చిక్కుకుంటూ ఉంటారు. భావన అలాంటి హీరోయిన్ అని చెప్పొచ్చు. 'మహాత్మ', 'ఒంటరి' లాంటి తెలుగు సినిమాలతో ఆకట్టుకున్న ఈ బ్యూటీ జీవితంలో కాంట్రవర్సీలు బోలెడు ఉన్నాయి. కిడ్నాప్, లైంగిక దాడికి గురవడం, అబార్షన్ అయిందని రూమర్స్.. ఇలా చెప్పుకొంటూ పోతే చాలానే ఉన్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనపై వచ్చిన పుకార్ల గురించి స్పందించింది.(ఇదీ చదవండి: ఏడాది తర్వాత ఓటీటీలోకి హిట్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?)కేరళకు చెందిన భావన.. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ సినిమాలు చేస్తూ గుర్తింపు తెచ్చుకుంది. అయితే కెరీర్లో మంచి ఫామ్‌లో ఉన్నప్పుడు కిడ్నాప్ అయింది. ఓ స్టార్ హీరోని ఈమెని ఎత్తుకెళ్లి, లైంగిక దాడికి పాల్పడ్డాడని అప్పట్లో వార్తలొచ్చాయి. ఈ కేసులో మలయాళ హీరో దిలీప్ని అరెస్ట్ కూడా చేశారు. ఈ రచ్చ తర్వాత కొన్నాళ్లకు సినిమాలకు బ్రేక్ ఇచ్చిన భావన.. 2018లో నిర్మాత నవీన్ ని పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం సినిమాలు చేసుకుంటోంది. తాజాగా ఈమె నటించిన 'నడికర్' అనే మలయాళ మూవీ థియేటర్లలో రిలీజైంది. ఈ ప్రమోషన్లలో మాట్లాడుతూ.. అప్పట్లో తన అబార్షన్ గురించి వచ్చిన రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చింది.'అమెరికా వెళ్లి అబార్షన్ చేయించుకున్నానని అన్నారు. అలువాలో గర్భస్రావం అయిందని, కొచ్చి-చెన్నైలోనూ అబార్షన్ చేయించుకున్నానని ప్రచారం చేశారు. ఇలా పలుమార్లు జరగడం వల్ల నేను చనిపోయానని కూడా మాట్లాడారు. వాటిని ఇప్పుడు గుర్తుచేసుకుంటే చిరాకేస్తోంది. అప్పుడు నా గురించి వచ్చిన రూమర్స్ విని మెంటల్‌గా చాలా డిస్ట్రబ్ అయ్యాను. కానీ ఇప్పుడు మాత్రం స్ట్రాంగ్‌గా నిలబడ్డాను' అని భావన చెప్పుకొచ్చింది. (ఇదీ చదవండి: నీ ముఖానికి డ్యాన్సా? ట్రోలింగ్‌పై స్పందించిన నటి) -
Health: సిజేరియన్ చేయించుకోవడంలో ఏమైనా ప్రమాదం ఉంటుందా?
నాకిప్పుడు 9వ నెల. ఫస్ట్ టైమ్ డెలివరీ చాలా కష్టమైంది. ఇప్పుడు నాకు సిజేరియన్ చేయించుకోవాలనే ఉంది. దీనివల్ల ఏదైనా ప్రమాదం ఉంటుందా? ఇప్పుడు ఆపరేషన్‌ను సేఫ్‌గా చేసే సదుపాయాలు చాలానే ఉన్నాయట కదా! ఫస్ట్ టైమ్ నార్మల్ డెలివరీ అయితే రెండోసారి సిజేరియన్‌కి వెళ్లకూడదా? దయచేసి నా డౌట్స్ క్లియర్ చేయండి! – ప్రసూన వనరాజు, హన్మకొండఏ మెడికల్ రీజన్ లేకుండా సిజేరియన్‌కి వెళ్లటం మంచిదికాదు. మీకు మొదటి కాన్పు నార్మలే అయింది కాబట్టి ఈ సెకండ్ డెలివరీ త్వరగా.. ఈజీగా అయ్యే చాన్సేసే ఎక్కువ. అయితే మీకు ఫస్ట్ డెలివరీ కష్టమైందని సిజేరియన్‌కి వెళదామనుకుంటున్నారు కాబట్టి ఎందుకు కష్టమైందో.. ఆ ప్రాబ్లమ్ ఏంటో మీరు మీ గైనకాలజిస్ట్‌తో వివరంగా చర్చించండి. అది మళ్లీ రిపీట్ అయ్యే ప్రాబ్లమ్ లేదా పెల్విక్ ఫ్లోర్ ప్రాబ్లమ్ కాకపోతే నార్మల్ డెలివరీకి ప్రయత్నించడమే మంచిది.రిస్క్స్, ప్రయోజనాలు రెండూ రెండు (నార్మల్ లేదా సిజేరియన్) డెలివరీల్లో ఉంటాయి. రికవరీ టైమ్ నార్మల్ డెలివరీ కన్నా సిజేరియన్ డెలివరీలో ఎక్కువ. అనవసరంగా సిజేరియన్ చేయకూడదని ప్రభుత్వం నుంచీ సీరియస్ అడ్వయిజెస్ ఉన్నాయి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ఇదే మాటను చెబుతోంది. దీన్నిబట్టి ఆపరేషన్ రిస్క్ ఎక్కువనే కదా అర్థం. ఇందులో షార్ట్ టర్మ్ / లాంగ్ టర్మ్ రిస్క్స్ ఉంటాయి. వెజైనల్ బర్త్‌లో కొంత ఆందోళన, అన్ప్రిడిక్టబులిటీ ఉంటాయి. పెయిన్ రిలీఫ్ ఇష్యూస్ ఉంటాయి. ఈ రిస్క్‌ని ఆపరేషన్‌తో నివారించినా సిజేరియన్తో కుట్ల దగ్గర ఇన్ఫెక్షన్ రిస్క్ ఉంటుంది.ఇది పదిమందిలో ఒకరికి వస్తుంది. తగ్గటానికి కొన్ని నెలలు పడుతుంది. అలాగే సిజేరియన్ అయిన వాళ్లల్లో కాళ్లల్లో, ఛాతీలో రక్తం గడ్డకట్టే ప్రమాదం అయిదు రెట్లు ఎక్కువ. అంతేకాదు బ్లీడింగ్ ఎక్కువై రక్తం ఎక్కించాల్సి వచ్చే రిస్క్ కూడా సిజేరియన్ కేసుల్లోనే ఎక్కువ. అధిక బరువు ఉన్న వారిలో ఈ రిస్క్స్ రెండింతలెక్కువ. బిడ్డలో కూడా టెంపరరీ బ్రీతింగ్ ప్రాబ్లమ్ ఉంటుంది. కొన్నిసార్లు ఎన్ఐసీయూ కేర్‌లో అడ్మిట్ చేయాల్సి రావచ్చు. సిజేరియన్‌ను ఎంత జాగ్రత్తగా చేసినా వెయ్యిలో ఒకరికి బవెల్ / బ్లాడర్ ఇంజ్యూరీ, యురేటర్ ఇంజ్యూరీ కావచ్చు. మళ్లీ తర్వాత డెలివరీ కూడా సిజేరియనే చేయాల్సి వస్తుంది.తర్వాత ప్రెగ్నెన్సీలో ప్లెసెంటా సిజేరియన్ స్కార్‌కి అతుక్కుని బ్లీడింగ్ ఎక్కువయ్యే ప్రమాదం ఉండొచ్చు. వెజైనల్ డెలివరీలో కూడా కొన్ని రిస్క్స్ ఉంటాయి. ఇన్స్ట్రుమెంటల్ డెలివరీ చాన్సెస్ ఉండొచ్చు. వెజైనల్ టేర్స్ లేదా ఎపిసియోటమీ (్ఛpజీటజీ్టౌౌఝy) పెయిన్ ఉండొచ్చు. కానీ పైన చెప్పిన సిజేరియన్ రిస్క్స్ కన్నా ఇవి చాలా తక్కువ. తేలికగా ట్రీట్ చేయొచ్చు. ఈరోజుల్లో మంచి పెయిన్ రిలీఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ ఆలోచించి .. మీకు ఇంతకుముందు ఎదురైన ఇబ్బంది ఈసారి తలెత్తకుండా భద్రంగా వెజైనల్ డెలివరీ చేయటమే మంచిది. ఒకసారి మీ గైనకాలజిస్ట్‌తో అన్ని సవివరంగా చర్చించి మీకు, పుట్టబోయే బిడ్డకు ఏది సురక్షితమో ఆ సలహా, సూచనను తీసుకోండి.— డా. భావన కాసు, ఆబ్స్టేట్రీషియన్, హైదరాబాద్ -
ప్రెగ్నెన్సీ నిలుపుదలలో.. పెరుగుతున్న భయం తగ్గాలంటే?
నాకు ఇదివరకు రెండుసార్లు 5 వ నెలలో నొప్పులు రాకుండానే అబార్షన్ అయింది. సెర్విక్స్‌కి కుట్లు వేసినా ప్రెగ్నెన్సీ ఆగలేదు. ఇప్పుడు రెండవ నెల. ఈ ప్రెగ్నెన్సీ నిలవాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పగలరు. – వి. మౌనిక, సికింద్రాబాద్మీరు చెప్పిన కండిషన్‌ని సెర్వైకల్ ఇన్‌కంపిటెన్స్ అంటారు. కొంతమందికి పుట్టుకతోనే సెర్విక్స్ వీక్‌గా ఉంటుంది. దీనివల్ల గర్భస్థ శిశువు బరువు పెరిగే కొద్ది మోయలేక మూడు నెలల తర్వాత గర్భస్రావం లేదా కాన్పు సమయం కంటే ముందుగానే వాటర్ బ్రేక్ అవడం లేదా నెలలు నిండకుండానే ప్రసవం అవుతుంది. ఇన్ఫెక్షన్ లాంటివి ఏవీ లేకుండా, నొప్పులూ లేకుండా సెర్విక్స్ తెరుచుకుని అబార్షన్ లేదా నెలలు నిండకుండానే డెలివరీ అయిపోతుంది. మొదటి ప్రెగ్నెన్సీలో అలా అయినప్పుడు రెండవసారి ప్రెగ్నెన్సీలో 3వ నెలలో ట్రాన్స్‌వెజైనల్ సర్క్లేజ్ అంటే వెజైనాలోంచి సెర్విక్స్ దగ్గర టేప్‌తో కుట్లు వేస్తారు.ఇవి సెర్విక్స్‌ని మూసి ఉంచుతాయి. నెలలు నిండిన తరువాత 37–38 వారాల్లో ఈ కుట్లను విప్పి నార్మల్ డెలివరీ కోసం వెయిట్ చేస్తారు. అయితే కొన్ని కేసేస్లో ఈ కుట్లు వేసినా అబార్షన్ అవుతుంది. అలాంటి వారికి ట్రాన్స్‌అబ్డామినల్ అప్రోచ్ అంటే ప్రెగ్నెన్సీకి ముందు లేదా మూడవ నెలలో పొట్టను ఓపెన్ చేసి సెర్విక్స్‌కి కుట్లు వేస్తారు. ఇవి సెర్విక్స్‌ని టైట్‌గా క్లోజ్ చేసి ఉంచుతాయి. ఈరోజుల్లో ఈ ప్రొసీజర్ని లాపరోస్కోపీ ద్వారా చేస్తున్నారు. పొట్ట మీద కోత లేకుండా చిన్న చిన్న రంధ్రాలు చేసి వాటి ద్వారా సెర్విక్స్‌కి కుట్లు వేస్తారు.ఇది తల్లికీ, బిడ్డకూ ఇద్దరికీ సురక్షితమైన ప్రక్రియ. దీనికోసం ఆసుపత్రిలో జాయిన్ అవాల్సిన అవసరం లేదు. డే కేర్‌లోనే చేసేస్తారు. చేసిన రోజే ఇంటికి వెళ్లిపోవచ్చు. కొన్ని జాగ్రత్తలు, సూచనలు చెప్తారు. అయితే ఈ కుట్లు తీయడం కష్టం కాబట్టి.. ఈ కేసుల్లో సిజేరియన్ డెలివరీయే చేయాల్సి ఉంటుంది. కుట్లు అలాగే ఉండి.. తర్వాత వచ్చే ప్రెగ్నెన్సీని కాపాడుతాయి. ఒకవేళ తరువాత పిల్లలు వద్దు అనుకుంటే సిజేరియన్ టైమ్‌లోనే కుట్లు తీసేస్తారు. ఈ ప్రక్రియను అనుభవజ్ఞులైన లాపరోస్కోపీ సర్జన్ చాలా భద్రంగా చేస్తారు. కాన్పు సమయం దగ్గరపడుతున్నా.. లేదా నొప్పులు మొదలైన వెంటనే ఆపరేషన్ చేసి బిడ్డను తీస్తారు.ఏదైనా గర్భిణీ మానసిక, శారీరక ఆరోగ్యాన్ని బట్టి నిర్ణయం తీసుకోవడం మంచిది. మీరు ఒకసారి గైనకాలజిస్ట్‌ని కలసి, రెండవ నెలలో రక్త, మూత్ర పరీక్షలు చేయించుకొని యూరిన్ లేదా వెజైనాలో ఏ ఇన్ఫెక్షన్ లేదని నిర్ధారణ చేసుకోండి. వయబిలిటీ స్కాన్ చేస్తారు. సెర్విక్స్‌కి కుట్లు వేయాలి అనే నిర్ణయానికి వస్తే అవి ఏ టైమ్‌లో వేయాలో నిర్ధారించుకుంటారు. మామూలుగా అయితే.. మూడవ నెలలో గర్భిణీలందరికీ చేసే Nuఛిజ్చి∙్టట్చnట uఛ్ఛిnఛిy టఛ్చిn (Nఖీ స్కాన్) తర్వాత లాపరోస్కోపిక్ సెర్వైకల్ సర్‌క్లేజ్‌కి ప్లాన్ చేస్తారు. ఇప్పటివరకు జరిగిన పలు అధ్యయనాల్లో.. ఇలా కుట్లు వేసిన వారిలో 89 శాతం మందిలో గర్భం నిలబడి.. సురక్షితంగా బిడ్డను కన్నట్టు వెల్లడైంది.— డా. భావన కాసు, ఆబ్స్టేట్రీషియన్, హైదరాబాద్ -
స్టార్ హీరో సినిమా రీరిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న సతీమణి
పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ పుట్టినరోజు సందర్భంగా 'జాకీ' సినిమా కర్ణాటక వ్యాప్తంగా మళ్లీ విడుదలైంది. ఈ చిత్రాన్ని KRG స్టూడియో రాష్ట్రవ్యాప్తంగా 120కి పైగా స్క్రీన్లలో విడుదల చేసింది. మార్చి 17న పునీత్ రాజ్‌కుమార్ పుట్టినరోజు ఉంది. దీంతో ఆయన అభిమానుల కోరిక మేరకు జాకీ చిత్రాన్ని నేడు రిలీజ్ చేశారు. పునీత్ రాజ్‌కుమార్ 2021 అక్టోబరు 29న వ్యాయామం చేస్తుండగా అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన విషయం తెలిసిందే. పునీత్ రాజ్‌కుమార్ మరణించిన తర్వాత ఆయన నుంచి రీరిలీజ అయిన తొలి సినిమా జాకీ కావడంతో చాలా వరకు థియేటర్లలో పూలతో అలంకరించారు. తెల్లవారుజామున 4.30 నుంచి 'జాకీ' స్పెషల్ షోలు వేశారు. అభిమానులతో పాటు సినిమాను చూసేందుకు పునీత్ సతీమణి అశ్విని కూడా వెళ్లారు. వెండితెరపై తన భర్తను చూసి ఆమె భావోద్వేగానికి లోనైంది. కొన్నిసార్లు కన్నీళ్లు కూడా పెట్టుకున్నారుజ ఈ దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అశ్వినితో పాటు పునీత్ రాజ్‌కుమార్ కుటుంబ సభ్యులు కూడా సినిమా చూశారు. దునియా సూరి డైరెక్షన్లో 2010లో జాకీ సినిమా విడుదల అయింది. కన్నడ ఇండస్ట్రీలో ట్రెండ్‌సెట్టింగ్ చిత్రాలలో ఒకటిగా, పునీత్ రాజ్‌కుమార్ కెరీర్లో ల్యాండ్‌మార్క్ సినిమాల్లో ఒకటిగా జాకీ చిత్రం నిలిచింది. పునీత్ రాజ్‌కుమార్ సరసన భావన ఇందులో నటించింది. Best ever Fan Show For me 🥺🔥👑 Stadium gintha jasthi soun ithu 🔥#Jackie #DrPuneethRajkumar pic.twitter.com/8HnpUMZDeP — Venka appu (@Venkaappu777) March 15, 2024 -
Sarkaaru Noukari Review: ‘సర్కారు నౌకరి’ మూవీ రివ్యూ
టైటిల్: సర్కారు నౌకరి నటీనటులు: ఆకాశ్, భావన, తనికెళ్ల భరణి, రమ్య పొందూరి, సత్య సాయి శ్రీనివాస్ తదితరులు నిర్మాత: కె రాఘవేంద్ర రావు దర్శకత్వం: గంగనమోని శేఖర్ సంగీతం: శాండిల్య నేపథ్య సంగీతం: సురేష్ బొబ్బిలి సినిమాటోగ్రఫీ: గంగనమోని శేఖర్ ఎడిటర్: రాఘవేంద్ర వర్మ విడుదల తేది: జనవరి 1, 2023 ప్రముఖ సింగర్ సునీత కొడుకు ఆకాష్ గోపరాజు హీరోగా నటించిన తొలి సినిమా సర్కారు నౌకరి. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు నిర్మాతగా వ్యవహరించడంతో చిన్న సినిమా అయినా సరే సర్కారు నౌకరిపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఇటీవల విడుదలైన ట్రైలర్ ఆ అంచనాలు మరింత పెంచేశాయి. కొత్త సంవత్సరం సందర్భంగా నేడు(జనవరి 1, 2024) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. సర్కారు నౌకరి కథేంటంటే.. ఈ సినిమా కథంతా 1996లో సాగుతుంది. గోపాల్(ఆకాష్ గోపరాజు) ఓ అనాథ. చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోవడంతో కష్టపడి చదివి సర్కారు కొలువు(ప్రభుత్వ ఉద్యోగం) సాధిస్తాడు. మహబూబ్ నగర్ జిల్లా కొల్లాపూర్ గ్రామానికి హెల్త్ ప్రమోటర్‌గా వెళ్తాడు. పెద్దరోగం (ఎయిడ్స్)పై అవగాహన కల్పిస్తూ, కండోమ్స్ పంచడం అతని డ్యూటీ. సర్కారు నౌకరోడని సత్య(భావన)అతన్ని పెళ్లి చేసుకుంటుంది. గోపాల్ని కొల్లాపూర్ గ్రామస్తులు మొదట్లో చాలా బాగా గౌరవిస్తారు. మండల ఆఫీస్‌లో పనిచేసే సార్ భార్య అంటూ సత్యకు కూడా ఊరి ప్రజలు రెస్పెక్ట్ ఇస్తారు. కానీ గోపాల్ చేసే పని కండోమ్‌లు పంచడం అని తెలిశాక.. ఊరంతా అతని ఫ్యామిలీని అంటరాని వాళ్లుగా పరిగణిస్తారు. బుగ్గలోడు అంటూ గోపాల్ని హేళన చేస్తారు. దీంతో అతని భార్య ఉద్యోగం మానేసి.. వేరే ఊరికి వెళ్దామని కోరుతుంది. గోపాల్ మాత్రం తన ఉద్యోగాన్ని వదులుకోనని చెబుతాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవ జరిగి సత్య పుట్టింటికి వెళ్తుంది. మరోవైపు ఊర్లో ఎయిడ్స్ వ్యాధి మరింత వ్యాపించడంతో చాలా మంది ప్రాణాలు కోల్పోతారు. ఒకవైపు వరుస అవమానాలు..మరోవైపు భార్య గొడవ..అయినా గోపాల్ తన ఉద్యోగాన్ని ఎందుకు వదిలేయలేదు? పెద్దరోగంపై అవగాహన కల్పించేందుకు గోపాల్ ఎం చేశాడు? ఊరి సర్పంచ్(తనికెళ్ల భరణి)ని ఎలా వాడుకున్నాడు? ఎయిడ్స్‌పై అవగాహన కల్పించే ఉద్యోగాన్నే గోపాల్ ఎందుకు ఎంచుకున్నాడు? గోపాల్ గతమేంటి? కొల్లాపూర్‌తో అతనికి ఉన్న సంబంధం ఏంటి? తదితర విషయాలు తెలియాలంటే సర్కారు నౌకరి చూడాల్సిందే. ఎలా ఉందంటే.. 1996లో జరిగిన యాదార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు శేఖర్. అప్పట్లో ఎయిడ్స్ వ్యాధి ప్రభావం చాలా ఉండేది. సరైన అవగాహన లేక ప్రజలు ఎయిడ్స్ బారిన పడేవారు. కండోమ్‌ల వాడకం కూడా తెలిసేది కాదు. వ్యాధి ఎలా వస్తుందో కూడా చాలా మందికి తెలిసేదికాదు. అంటూవ్యాధి అంటూ ఎయిడ్స్ బారిన పడిన వారిని ఊరి నుంచి వెలేసేవారు. అలాంటి సంఘటనలు కొల్లాపూర్ గ్రామంలో కూడా జరిగాయట. వాటినే కథగా మలుచుకొని సర్కారు నౌకరి చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు. ఓ మంచి సందేశాన్ని కామెడీ, భావోద్వేగాలు రెండింటిని జొప్పించి కమర్శియల్ అంశాలను బ్యాలెన్స్ చేస్తూ కథను తెరకెక్కించాడు. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో చాలా సహజంగా కథనం సాగుతుంది. అయితే ఇప్పుడున్న ప్రేక్షకుల మూడ్‌కి పూర్తి విరుద్ధమైన కథ ఇది. ప్రస్తుతం ప్రేక్షకులంతా యానిమల్, సలార్ లాంటి యాక్షన్ చిత్రాలపై మక్కువ చూపిస్తున్నారు. సర్కారు నౌకరిలో అలాంటి సన్నివేశాలేవి ఉండవు. కానీ గ్రామీణ నేటివిటీ, మన చుట్టు జరిగిన కొన్ని సంఘటనలు తెరపై కనిపిస్తాయి. కొన్ని సన్నివేశాలు గుండెల్ని పిండేస్తాయి. ఫస్టాఫ్ అంతా చాలా కామెడీగా సాగుతుంది. హీరో హీరోయిన్ల పెళ్లి, రొమాన్స్.. అప్పట్లో పూర్లో ఉండే పరిస్థితులు, జనాల ప్రవర్తన ఇవన్నీ కాస్త నవ్వులు పంచుతాయి. ఇంటర్వెల్ సీన్ ఎమోషనల్‌గా టచ్ చేస్తుంది. ఇక ద్వితియార్థంలో కథనం చాలా ఎమోషనల్‌గా సాగుతుంది. గంగ(మధులత)-శివ(మహదేవ్)ల మధ్య వచ్చే సన్నివేశాలు..పాట ఆకట్టుకుంటుంది. అలాగే శివ పాత్ర ముగింపు, హీరో ప్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ కూడా గుండెల్ని పిండేస్తుంది. అయితే కథనం చాలా సహజంగా, చాలా ఎమోషనల్‌గా సాగినా..ప్రేక్షకులను ఫీల్ అయ్యేలా చేయడంలో దర్శకుడు కొంతవరకు మాత్రమే సఫలం అయ్యాడు. ఎయిడ్స్‌పై అవగాహన కల్సించడం కోసం హీరో చేసే ప్రయత్నాల్ని తెరపై బలంగా చూపించలేకపోయాడు.కొన్ని చోట్ల కథనం స్లోగా సాగుతూ ఆర్ట్ ఫిల్మ్స్‌ని గుర్తు చేస్తుంది. అయితే దర్శకుడు మాత్రం చాలా నిజాయితీగా సినిమాను తెరకెక్కించాడు. గ్రామీణ నేపథ్య చిత్రాలను ఇష్టపడేవారికి, నైంటీస్ జనరేషన్ వాళ్లకి సర్కారు నౌకరి నచ్చుతుంది. ఎవరెలా చేశారంటే.. సింగర్ సునీత కొడుకు ఆకాశ్ తొలి సినిమా ఇది. అయినా చాలా చక్కగా నటించాడు.తన పాత్రకు తగ్గట్టుగా హవభావాలను పలికించాడు. ఎమోషనల్ సన్నివేశాలల్లో అనుభవం ఉన్న నటుడిలా నటించాడు. కొన్ని సన్నివేశాల్లో అనుభవలేమి కనిపించినా..మున్ముందు మంచి నటుడిగా రాణించే అవకాశం ఉంది. గోపాల్ భార్య సత్యగా భావన తనదైన నటనతో ఆకట్టుకుంది. గోపాల్ స్నేహితుడు శివగా మహదేవ్, అతని మరదలు గంగగా మధు లత తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. ఇక కొల్లాపూర్ సర్పంచ్‌గా తనికెళ్ల భరణి తన మార్క్ హాస్యంతో కొన్ని చోట్ల నవ్వించాడు. బలగం సుధాకర్ రెడ్డి, సాహితి దాసరి, సమ్మెట గాంధీతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతిక విషయాలకొస్తే.. సురేష్ బొబ్బిలి నేపథ్య సంగీతం బాగుంది. శాండిల్య పాటలు ఆకట్టుకుంటాయి.శేకర్ గంగనమోని కెమెరా వర్క్ బాగుంది. అప్పటి పల్లెటూరి వాతావరణాన్ని తెరపై చక్కగా చూపించాడు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నాయి. -
చిన్నపుడు మా అక్క నన్ను బాగా కొట్టింది: విరాట్ కోహ్లి
When Virat Kohli Revealed His sister beat him badly: ‘‘చిన్నపుడు నాకొక అలవాటు ఉండేది. పెద్ద వాళ్లను కూడా ‘నువ్వు’ అంటూ ఏకవచనంతో పిలిచేవాడిని. మా అక్కతో మాట్లాడుతున్నపుడు కూడా ‘నువ్వూ.. నువ్వూ’ అంటూ సంభోదించేవాడిని. అలా ఏకవచనంతో పిలవడం మా అక్కకు నచ్చేది కాదు. ఓరోజు తనకు బాగా కోపం వచ్చింది. ఇంకోసారి ఇలా మాట్లాడతావా అంటూ నన్ను బాగా కొట్టింది. అప్పటి నుంచి పెద్ద వాళ్లందరినీ .. ‘మీరు’ అని మర్యాదగా సంభోదించడం మొదలుపెట్టాను’’ అంటూ టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి తన చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నాడు. భారత ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్ సునిల్ ఛెత్రితో సంభాషణ సందర్భంగా గతంలో కోహ్లి ఈ మేరకు వ్యాఖ్యలు చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఇందులో తన బాల్య జ్ఞాపకాలను నెమరు వేసుకున్న కోహ్లి.. చిన్నపుడు తను అల్లరిపిల్లాడిలా ఉండేవాడిని చెప్పుకొచ్చాడు. రూ. 50 నోటు చూడగానే చించి పడేసి.. ‘‘పెళ్లి వేడుకలకు వెళ్లిన సమయంలో చాలా మంది నోట్లు గాల్లోకి ఎగురవేసి డ్యాన్సులు చేయడం చూశాను. అలా అది నా మైండ్‌లో ఉండిపోయింది. ఓరోజు మా ఇంటికి చుట్టాలు వచ్చారు. సరుకులు తెమ్మని మా అమ్మ నాకు 50 రూపాయలు ఇచ్చింది. ఆ నోటు చూడగానే పట్టరాని ఆనందంలో మునిగిపోయాను. ఎగ్జైట్మెంట్లో ఏం చేస్తున్నానో తెలియకుండానే.. మెట్ల మీదకు వెళ్లి నోటును చించి.. ముక్కలు పైకి ఎగురవేసి డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాను. ఆ తర్వాత కాసేపటికి వట్టి చేతులతో ఇంటికి తిరిగి వచ్చాను’’ అంటూ సరదా సంఘటన గురించి పంచుకున్నాడు. తన అల్లరి కారణంగా.. చాలా మంది తమ్ముళ్లలాగే తాను కూడా అక్క చేతిలో దెబ్బలు తిన్నానని పేర్కొన్నాడు. సౌతాఫ్రికా పర్యటనలో కాగా సరోజ్- ప్రేమ్ కోహ్లి దంపతులకు జన్మించిన విరాట్ కోహ్లికి అక్క భావనా కోహ్లి ధింగ్రా, అన్న వికాస్ కోహ్లి ఉన్నారు. ఇక క్రికెట్ ప్రపంచంలో మకుటం లేని మహరాజుగా వెలుగొందుతున్న విరాట్ కోహ్లి.. ఇటీవల వరల్డ్‌కప్-2023 సందర్భంగా 50వ వన్డే శతకం బాది.. సచిన్ టెండుల్కర్ వన్డే సెంచరీల రికార్డును బద్దలుకొట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం.. కోహ్లి టీమిండియాతో కలిసి సౌతాఫ్రికా పర్యటనలో ఉన్నాడు. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా సెంచూరియన్‌లో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఈ ఢిల్లీ బ్యాటర్ 38 పరుగులు చేశాడు. చదవండి: #KL Rahul: కేఎల్ రాహుల్ అరుదైన ఘనత.. ప్రపంచంలోనే తొలి బ్యాటర్‌గా View this post on Instagram A post shared by @Virat Kohli (@virat_kohli_era__18) -
కొత్త ప్రపంచాన్ని సృష్టించారు
‘‘సర్కారు నౌకరి’ సినిమా ట్రైలర్ బాగుంది. ఈ మూవీ ద్వారా తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించారు. ఈ చిత్రం విజయం సాధించాలి’’ అని దర్శకుడు శేఖర్ కమ్ముల అన్నారు. గాయని సునీత కుమారుడు ఆకాష్ హీరోగా పరిచయవుతున్న చిత్రం ‘సర్కారు నౌకరి’. గంగనమోని శేఖర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో భావన హీరోయి¯Œ . ఆర్కే టెలీషోపై కె.రాఘవేంద్రరావు నిర్మించిన ఈ సినిమా జనవరి 1న విడుదలకానుంది. ఈ మూవీ ట్రైలర్‌ని హైదరాబాద్‌లో రిలీజ్ చేశారు. కె.రాఘవేంద్రరావు మాట్లాడుతూ–‘‘వెంకటేశ్, మహేశ్ బాబు, ఎన్టీఆర్‌లను హీరోలుగా పరిచయం చేశాను.. వారంతా ఇప్పుడు గొప్ప స్థాయిలో ఉన్నారు. ‘సర్కారు నౌకరి’ తో పరిచయమవుతున్న ఆకాష్ కూడా వారిలా మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. ‘‘ఆకాష్ ΄ాడగలిగినా నటనపై ఎక్కువ ఆసక్తి ఉండటంతో హీరోగా పరిచయవుతున్నాడు’’ అన్నారు సునీత. ‘‘నిజజీవిత ఘటనల ఆధారంగా ఈ సినిమా తీశాం’’ అన్నారు గంగనమోని శేఖర్. ‘‘నాకు తొలి అవకాశాన్ని ఇచ్చిన రాఘవేంద్రరావుగారికి ధన్యవాదాలు’’ అన్నారు ఆకాష్. -
సర్కారు నౌకరికి డేట్ ఫిక్స్
ప్రముఖ గాయని సునీత కుమారుడు ఆకాశ్ హీరోగా పరిచయవుతున్న చిత్రం ‘సర్కారు నౌకరి’. ఈ చిత్రంలో భావన హీరోయిన్. గంగనమోని శేఖర్ దర్శకత్వంలో ఆర్కే టెలీ షో పై దర్శకుడు రాఘవేంద్ర రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శుక్రవారం ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. ‘‘సర్కారు నౌకరి’ని కొత్త సంవత్సరం సందర్భంగా జనవరి 1న ఘనంగా విడుదల చేయనున్నాం’’ అని యూనిట్ ప్రకటించింది. ఈ చిత్రానికి సంగీతం: శాండిల్య, సహనిర్మాత: పరుచూరి గోపాలకృష్ణా రావు. -
మనుషులు దూరంగా ఉన్నా.. విరాట్ కోహ్లి తోబుట్టువు, వ్యాపారవేత్త భార్య!
Who Is Bhawna Kohli Dhingra, The Only Sister Of Virat Kohli: విరాట్ కోహ్లి.. ఈ పేరు వినగానే రికార్డులే గుర్తుకువస్తాయి. ఆధునిక ప్రపంచ క్రికెట్లో మకుటం లేని మహరాజుగా కొనసాగుతున్న రన్‌మెషీన్ రూపం కళ్ల ముందు కదలాడుతుంది. బ్యాట్ చేతబట్టి రికార్డుల అంతు తేల్చేందుకు సిద్ధమైన వేటగాడిలా రంగంలోకి దూకిన ఆటగాడు స్ఫురణకు వస్తాడు. మరి.. ఢిల్లీలోని ఉత్తమ్‌నగర్‌లో పెరిగిన ఆ కుర్రాడు టీమిండియా రికార్డుల రారాజుగా ఎదిగేందుకు దోహదం చేసిన అంశాలేమిటి అంటే?.. ఆట పట్ల అంకితభావం, అసాధారణ ప్రతిభాపాటవాలు.. 35 ఏళ్ల వయసులోనూ వారెవ్వా అనిపించే ఫిట్నెస్.. అభిమానుల నుంచి వచ్చే సమాధానాలు ఇవే. అవును ఇవన్నీ నిజమే.. అయితే, అన్నిటికి మించి చిన్ననాటి నుంచి అనుకున్న లక్ష్యం దిశగా కోహ్లిని ప్రోత్సహించిన కుటుంబానికే ఈ జాబితాలో పెద్దపీట వేయాల్సి ఉంటుంది. కోహ్లి తండ్రి ప్రేమ్ కోహ్లి క్రిమినల్ లాయర్. తల్లి సరోజ్ గృహిణి. ఈ దంపతులకు ముగ్గురు సంతానం. భావనా, వికాస్, విరాట్. అందరిలో భావనా పెద్దది.. విరాట్ చిన్నోడు. PC: bhawna dhingra instagram తమ్ముడితో పాటు క్రికెట్ ఇద్దరు తమ్ముళ్లపై ఆ అక్కకు ప్రేమ ఎక్కువే. అయితే, చిన్నోడు కాబట్టి విరాట్ అంటే మరింత ఇష్టం. మూడేళ్లకే క్రికెట్ బ్యాట్ చేతబట్టి తండ్రి బౌలింగ్‌లో ముద్దుముద్దుగా విరాట్ బ్యాటింగ్ చేస్తూ ఉంటే కుటుంబమంతా సంతోషపడిపోయేది. భావనా అయితే మరీనూ!! విరాట్‌తో కలిసి క్రికెట్ ఆడుకోవడం ఆమెకు ఇష్టమైన వ్యాపకం. కొడుకును క్రికెటర్‌గా చూడాలనుకున్న తల్లిదండ్రుల నిర్ణయం కోహ్లి కెరీర్‌ను మలుపుతిప్పగా.. తోబుట్టువుగా తానేం చేయాలో అన్నీ చేసింది భావనా. తమ్ముడికి ఎల్లవేళ్లలా.. ముఖ్యంగా తండ్రి మరణం తర్వాత నైతికంగా మద్దతుగా నిలిచింది. కోహ్లి అంతర్జాతీయ క్రికెటర్‌గా ఎదుగుతున్న క్రమంలో పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్లిపోయినప్పటికీ.. తల్లికి మద్దతుగా నిలుస్తూ తమ్ముడి గురించి అన్ని విషయాల్లో శ్రద్ధ వహించేది. తన తమ్ముడు రికార్డుల రారాజుగా ఎదిగినా తనకు మాత్రం ఇప్పటికీ చిన్నపిల్లాడే అని మురిసిపోతూ ఉంటుంది భావనా. కోహ్లిల ఏకైక ఆడపడుచు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆమె.. తల్లిదండ్రులతో తమ చిన్ననాటి ఫొటోలు పంచుకుంటూ పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ ఉంటుంది. తాము మనుషులుగా దూరంగా ఉంటున్నా తమ మనసులు మాత్రం దగ్గరే అంటూ సందర్భాన్ని బట్టి ఇద్దరు తమ్ముళ్ల పట్ల ప్రేమను ప్రదర్శిస్తూ ఉంటుంది. ఇక వన్డే వరల్డ్‌కప్-2023 తర్వాత కూడా విరాట్ కోహ్లిని అనునయిస్తూ.. గెలిచినా ఓడినా అభిమానులంతా టీమిండియా వెంటే అంటే సందేశం ఇచ్చింది భావనా. ఈ నేపథ్యంలో వార్తల్లో నిలిచిన భావనా గురించి నెట్టింట ఆరా తీసే వారి సంఖ్య ఎక్కువైంది. వ్యాపారవేత్తతో వివాహం చిన్ననాటి నుంచి క్రికెట్‌పై మక్కువ ఉన్న భావనా ఢిల్లీలోని హన్స్‌రాజ్ మోడల్ స్కూళ్లో పాఠశాల విద్య పూర్తి చేసుకుంది. దౌలత్ రామ్ కాలేజీ నుంచి డిగ్రీ పట్టా అందుకుంది. ఇక కోహ్లిల ఆడపడుచు అయిన భావనా వ్యాపారవేత్త సంజయ్ ధింగ్రాను పెళ్లాడి.. భావనా కోహ్లి ధింగ్రాగా మారింది. ప్రస్తుతం ఆమె ఎంటర్‌ప్రెన్యూర్‌గానూ రాణిస్తోంది. విరాట్ కోహ్లి ఫ్యాషన్ లేబుల్ వన్8సెలక్ట్‌తో భావనా కలిసి పనిచేస్తున్నట్లు సమాచారం. కేవలం విరాట్‌తోనే కాకుండా అతడి భార్య అనుష్క శర్మ, కూతురు వామికాతోనూ ఆమెకు మంచి అనుబంధం ఉన్నట్లు సోషల్ మీడియా పోస్టుల ద్వారా తెలుస్తోంది. అన్నట్లు భావనా- సంజయ్ దంపతులకు మెహక్ , ఆయుష్ సంతానం. మేనమామ విరాట్ కోహ్లి రిసెప్షన్ సందర్భంగా వీళ్లిద్దరు అప్పట్లో ఫొటోలకు ఫోజులిచ్చారు. చదవండి: వరల్డ్‌కప్-2023 తర్వాత రీఎంట్రీ ఇచ్చిన రోహిత్ శర్మ.. అభిమానులు ఖుషీ! -
నాకు మా బావ అంటే చాలా ఇష్టం.. కానీ
నాకు మా బావ అంటే చాలా ఇష్టం. మేనరికం పెళ్లి మంచిదికాదని తెలిసినా ఈ పెళ్లిని అవాయిడ్ చేయలేను. పెళ్లికి ముందే జెనెటికల్ కౌన్సెలింగ్ తీసుకుంటే నాకేమైనా హెల్ప్ అవుతుందా? – ఎన్‌కేఎస్, గుంటూరు మేనరికం పెళ్లి అనుకుంటే.. పెళ్లికి ముందే ఫ్యామిలీ అండ్ కపుల్ జెనిటిక్ కౌన్సెలింగ్ తీసుకోవడం చాలా అవసరం. దీనిని ప్రీకన్సెప్షనల్ జెనెటిక్ కౌన్సెలింగ్ అంటారు. మేనరికం పెళ్లిళ్లలో తరతరాలుగా అంటే తాతముత్తాతల నుంచి వస్తున్న సేమ్ జీన్స్‌తో కొన్ని జన్యుపరమైన లోపాలతో పిల్లలు పుట్టే రిస్క్ లేకపోలేదు. రక్తసంబంధీకుల మధ్య పెళ్లిళ్లు జరిగినప్పుడు కొన్ని రెసెసివ్ జెనెటిక్ వ్యాధులను చూస్తాం. మేనరికం పెళ్లిళ్లలో కాగ్నీషియల్ డిసీజెస్ అంటే పుట్టుకతో వచ్చే లోపాలు రెండు.. మూడు రెట్లు ఎక్కువ. మీరు కౌన్సెలింగ్ వెళ్లినప్పుడు మీ ఇద్దరి ఫ్యామిలీ ట్రీలో వంశపారంపర్యమైన జబ్బులు, డిజార్డర్స్ ఏవైనా ఉన్నాయా అని మీ మీ కుటుంబాల ఆరోగ్య చరిత్రను క్షుణ్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. జన్యుపరమైన వ్యాధి ఉన్న కుటుంబసభ్యుల వ్యాధి నిర్ధారణ, ఆ జన్యువుకి సంబంధించి ఎలాంటి మ్యుటేషన్ ఉంది వగైరా వివరాలను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. అది క్యారియర్‌గా కపుల్కీ ఉన్నట్టయితే అది పిల్లలకు వచ్చే రిస్క్ ఎంత ఉందో చెప్తారు క్యారియర్ టెస్టింగ్‌లో.. భవిష్యత్‌లో గర్భస్థ శిశువుకి చేసే శాంప్లింగ్ ద్వారా ఆ వ్యాధి బిడ్డకు వస్తుందా లేదా అని కూడా తెలిపే డిటెక్షన్ టెస్ట్స్ ఉంటాయి. పుట్టే పిల్లలకు అవకరాలు ఉండే రిస్క్ ఎక్కువగా ఉంటే ప్రెగ్నెన్సీ మూడవ నెల, అయిదవ నెలలో వైద్యపరీక్షలతో కనిపెట్టి గర్భస్రావం చేయించుకోమని సూచిస్తాం. అందుకే బేసిక్ టెస్ట్స్కి హాజరవడం చాలా అవసరం. సాధారణంగా మేనరికం పెళ్లిళ్లలో బెటా తలసీమియా, సిస్టిక్ ఫైబ్రోసిస్, సికిల్ సెల్ అనీమియా వంటివి ఎక్కువ. వీటిని పెళ్లిచేసుకునే జంటకు చేసే మామూలు రక్తపరీక్షతో కూడా కనిపెట్టి రిస్క్‌ను అంచనావేయొచ్చు. జన్యుపరమైన వ్యాధులకు చికిత్స లేదు.. నివారణ మాత్రమే చేయగలం. నాకు 43 ఏళ్లు. పీరియడ్స్ రెగ్యులర్‌గా రావడంలేదు. స్కానింగ్ ద్వారా ఇంకెన్ని రోజుల్లో నాకు పీరియడ్స్ ఆగిపోవచ్చనేది తెలుసుకోవచ్చా? – జి. ప్రసన్నకుమారి, కోటగిరి మెనోపాజ్ అంటే నెలసరి పూర్తిగా ఆగిపోవడం. మామూలుగా నెలలు ఆగి.. ఏడాది వరకూ రాకపోతే దాన్ని మెనోపాజ్‌గా పరిగణిస్తాం. పెరీమెనోపాజ్.. అంటే మెనోపాజ్ కంటే రెండుమూడేళ్లు ముందు.. వెనుక టైమ్ అన్నమాట. అండాశయాల్లో అండాలు తయారుకానప్పుడు పీరియడ్స్ ఆగిపోతాయి. ఈస్ట్రోజెన్ హార్మోన్ బాగా తగ్గిపోతుంది. మెనోపాజ్‌కి సగటు వయసు 51 ఏళ్లు. నలభై అయిదేళ్లలోపు ఆగిపోతే ఎర్లీ మెనోపాజ్ అంటారు. అల్ట్రాసౌండ్ స్కానింగ్‌లో గర్భసంచి లైనింగ్ పలుచగా ఉండడం, అండాశయాల్లో అండాలు లేదా ఫాలికిల్స్ లేకపోవడం.. మెనోపాజ్ అని చెప్పడానికి కొన్ని మార్గాలు.. సూచనలు. నిర్ధారించడానికి ఫాలికల్ స్టిములేటింగ్ హార్మోన్ అనే రక్తపరీక్ష చేసినప్పుడు అది 35 కన్నా ఎక్కువ ఉంటే మెనోపాజ్ అని నిర్ధారిస్తారు. కొన్నిసార్లు ఒంట్లోంచి వేడివేడి ఆవిర్లు, ఆ వెంటనే చెమటలు, మూడ్‌స్వింగ్స్ వంటి లక్షణాలు కూడా ఉంటాయి. నెలలు ఆగిపోయిన తర్వాత కూడా గర్భసంచి లైనింగ్ పలుచగా కాకుండా దళసరిగా అంటే 5ఎమ్ఎమ్ కన్నా ఎక్కువగా ఉంటే తర్వాత పరీక్షల కోసం సూచిస్తాం. దీనిని ఎండోమెట్రియల్ హైపర్ప్లాజియా అంటారు. అందుకే 40 నుంచి 45 ఏళ్లలోపు నెలసరి ఆగిపోతే టీఎస్‌హెచ్, థైరాయిడ్ పరీక్షలను కచ్చితంగా చేయించాలి. డా‘‘ భావన కాసు గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్ హైదరాబాద్ -
10 ఏళ్ల తర్వాత కోలీవుడ్‌లో రీఎంట్రీ ఇస్తున్న హీరోయిన్
ఇంతకుముందు కోలీవుడ్‌లో చిత్తిరం పేసుదడి, దీపావళి చిత్రాల్లో కథానాయికగా నటించిన నటి భావన. మలయాళంలో హీరోయిన్గా రాణించిన ఈ మాలీవుడ్ భామ ఆ మధ్య తన జీవితంలో జరిగిన అనూహ్య సంఘటన కారణంగా నటనకు దూరం అయ్యారు. ఇటీవలే తిరిగి నటించడం ప్రారంభించిన భావన దాదాపు పదేళ్ల తర్వాత కోలీవుడ్‌కు రీఎంట్రీ ఇస్తున్నారు. నటుడు గణేశ్ వెంకట్రామన్ నెక్స్ట్ సినిమాలో భాగం కానున్నారు. గణేశ్ 'అభియుమ్ నానుమ్' చిత్రంలో త్రిషకు ప్రేమికుడిగా సినిమారంగంలో అడుగుపెట్టాడు. ఆ తర్వాత కమల్‌హాసన్ హీరోగా నటించిన ఉన్నైప్పోల్, ఒరువన్ చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకున్నారు. ఆ మధ్య బిగ్‌బాస్ రియాలిటీ గేమ్ షో ద్వారా ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. ఇకపోతే తాజాగా విజయ్ కథానాయకుడిగా నటించిన వారిసు చిత్రంలో విలన్‌గా కీలకపాత్రను పోషించారు. వారిసు చిత్రం తరువాత పలు అవకాశాలు వస్తున్నాయని చెప్పిన గణేశ్ తాజాగా నటి భావనతో కలిసి నటిస్తున్న చిత్రం గురించి మీడియాకు తెలిపారు. దీనికి జయంతి దేవ్ దర్శకత్వం వహిస్తున్నట్లు చెప్పారు. ఇది హారర్, థ్రిల్లర్ కథా చిత్రంగా ఉంటుందన్నారు. చిత్ర కథ కొడైకెనాల్, చెన్నై నేపథ్యంలో సాగుతుందన్నారు. దీనికి గౌతమ్ జార్జ్ చాయాగ్రహణం అందిస్తున్నారని, ఇతర వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు. చదవండి: పూజాకు బ్యాడ్‌టైమ్.. ఫ్లాపుల మీద ఫ్లాపులు.. స్పందించిన హీరోయిన్ -
నాకిప్పుడు 43 ఏళ్లు అనుకోకుండా ప్రెగ్నెన్సీ వచ్చింది..
మా పాపకు పద్దెనిమిదేళ్లు. ఛాతీ మరీ ఫ్లాట్‌గా ఉంది. ఇంప్రూవ్ అవడానికి ఏమైనా మందులు ఉన్నాయా? వాడితే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? – పి. పుష్పలత, అమలాపురం బ్రెస్ట్ డెవలప్మెంట్ సాధారణంగా తొమ్మిది నుంచి పదకొండేళ్ల మధ్య మొదలవుతుంది. ఈ గ్రోత్ ప్రతి అమ్మాయికి డిఫరెంట్‌గా ఉంటుంది. దాదాపుగా 17 – 18 ఏళ్లు వచ్చేసరికి బ్రెస్ట్ గ్రోత్ పూర్తవుతుంది. పరిమాణం, ఆకారం అందరమ్మాయిలకు ఒకేలా డెవలప్ అవదు. మస్సాజ్లు, క్రీములు, మాత్రలు, వ్యాయామం.. లాంటివేవీ కూడా బ్రెస్ట్ సైజ్‌ని, షేప్‌ని చేంజ్ చేయలేవు. రొమ్ములు ఫ్యాటీ టిష్యూతో ఉంటాయి. అది మజిల్ కాదు కాబట్టి వ్యాయామంతో బ్రెస్ట్స్ సైజ్‌ను పెంచలేం. బరువు తగ్గినప్పుడు బ్రెస్ట్ సైజ్ కూడా కొంత తగ్గవచ్చు. బరువు పెరిగినప్పుడు పెరగవచ్చు. కానీ ఇది తాత్కాలిక మార్పు మాత్రమే. కాస్మెటిక్ బ్రెస్ట్ సర్జరీ ద్వారా బ్రెస్ట్ సైజ్‌ను పెంచే అవకాశం ఉంది. కానీ దానికి సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలానే ఉంటాయి. స్కార్ టిష్యూ ఫామ్ అవడం, బ్రెస్ట్ ఫీడ్ చెయ్యలేకపోవడం వంటి శాశ్వత సమస్యలు కూడా ఉండొచ్చు. కొన్ని అరుదైన వ్యాధుల్లో కూడా బ్రెస్ట్ చాలా చిన్నగా ఉండొచ్చు. టర్నర్ సిండ్రోమ్ అనే జన్యుపరమైన డిజార్డర్‌లో కూడా ఫ్లాట్ చెస్ట్ అండ్ నిపుల్స్ ఉండొచ్చు. అలాంటి అనుమానాలేమైనా ఉంటే ఒకసారి గైనకాలజిస్ట్‌ని సంప్రదించండి. కొన్ని రక్తపరీక్షలు చేస్తారు. నాకిప్పుడు 43 ఏళ్లు. అనుకోకుండా ప్రెగ్నెన్సీ వచ్చింది. ఈ వయసులో పిల్లల్ని కంటే ఆరోగ్యంగా పుడతారా?ఇది నాకు తొలి కాన్పు. పిల్లల కోసం మందులు వాడీవాడీ విసిగిపోయి ఆపేశాక వచ్చిన ప్రెగ్నెన్సీ అండీ...! – ఎన్. చంద్రప్రభ, సిర్పూర్ కాగజ్‌నగర్ నలభై ఏళ్లు దాటిన ప్రెగ్నెన్సీలో చాలా రిస్క్స్ ఉంటాయి అనేది చాలామంది భయం. కానీ సింగిల్టన్ ప్రెగ్నెన్సీ సాఫీగా సాగే అవకాశం లేకపోలేదు. 25– 35 ఏళ్ల మధ్య ఉండే కాంప్లికేషన్స్ కన్నా కొంచెం ఎక్కువ రిస్క్ ఉండొచ్చు. వాటిలో ఆపరేషన్ ద్వారా డెలివరీ అవటం, నెలలు నిండక ముందే కాన్పు అయ్యే రిస్క్ వంటివి ఎక్కువ. ఐవీఎఫ్, కవలల ప్రెగ్నెన్సీలో ఈ రిస్క్ ఇంకాస్త పెరుగుతుంది. మొదటి మూడునెలల్లో పుట్టుక లోపాలు .. డౌన్‌సిండ్రోమ్ లాంటివి, గర్భస్రావం, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వంటి ప్రమాదాలు ఎక్కువుంటాయి. బాడీ పెయిన్స్, కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులూ ఎక్కువుండొచ్చు. డాక్టర్ని సంప్రదించినప్పుడు వాటికి తగిన ట్రీట్మెంట్ను ఇస్తారు. తొలి మూడునెలల్లో తప్పనిసరిగా జెనెటిక్ స్క్రీనింగ్ టెస్ట్స్ చేయించుకోవాలి. ప్రతినెల బీపీ, సుగర్, థైరాయిడ్ పరీక్షలూ చేయించుకోవాలి. ప్రతినెల తప్పకుండా గైనకాలజిస్ట్‌ను సంప్రదిస్తూ టైమ్‌కి చేయవలసిన స్కానింగ్‌లు, పరీక్షలు చేయించుకుంటూండాలి. సరైన చికిత్సతో నలభై ఏళ్లు దాటిన తర్వాత కూడా సురక్షితమైన, ఆరోగ్యకరమైన ప్రెగ్నెన్సీ, కాన్పూ సాధ్యమే. నేను కెరీర్ ఓరియెంటెడ్. సరోగసీ ద్వారా పిల్లల్ని కనాలనుకుంటున్నాను. దానివల్ల బ్రెస్ట్ ఫీడ్ ఇవ్వడం కుదరదు కాబట్టి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుందా? – రంజనీ ప్రసాద్, పుణె సరోగసీ ద్వారా పిల్లల కోసం ప్లాన్ చేసినా కొంతమంది.. మందుల ద్వారా బ్రెస్ట్ ఫీడ్‌కి ట్రై చేయవచ్చు. దాన్ని లాక్టేషన్ ఇండక్షన్ అంటారు. సరోగసీ బేబీ డెలివరీ టైమ్ కన్నా ముందు నుంచే మీరు బ్రెస్ట్ ఫీడ్ ట్రై చేయడానికి ప్రిపరేషన్ చేసుకోవాలి. అందరికీ ఇది సక్సెస్ కాకపోవచ్చు. కానీ బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల ప్రయోజనాలు అందరికీ తెలిసినవే. ఏడాది వరకు బ్రెస్ట్ ఫీడింగ్తో నాలుగు నుంచి అయిదు శాతం వరకు బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ తగ్గుతుంది. బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ అనేది హార్మోన్స్, జన్యుపరమైన, జీవనశైలి మీద ఆధారపడి పెరుగుతుంది. 5 నుంచి 10 శాతం జన్యుపరమైన కారణాలుంటాయి. బ్రెస్ట్ ఫీడ్ ఇవ్వనందువల్ల బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ కొంచెం మాత్రమే మారుతుంది. ఆరోగ్యకరమైన జీవనశైలి.. అంటే అధిక బరువు లేకుండా, సరైన బీఎమ్ఐ ఉండేలా క్రమం తప్పకుండా వ్యాయామాలు చేస్తూ .. పోషకాహరం తీసుకుంటూ ఉంటే క్యాన్సర్ రిస్క్ తగ్గుతుంది. హైరిస్క్ జన్యుపరమైన కారణాలు ఉన్నవారిలో అంటే బీఆర్సీఏ (ఆఖఇఅ) జీన్ పాజిటివ్ అని స్క్రీనింగ్‌లో తేలినవారిలో ప్రాఫిలాక్టిక్ సర్జరీల ద్వారా ఆ రిస్క్‌ను తగ్గించవచ్చు. బ్రెస్ట్స్ అల్ట్రాసౌండ్, మామోగ్రఫీ ద్వారా తొలిదశలోనే క్యాన్సర్ మార్పులను కనిపెట్టవచ్చు. ఈ రోజుల్లో సరోగసీతో పిల్లల్ని కన్నా కొన్ని మందుల ద్వారా బ్రెస్ట్ ఫీడ్ ఇచ్చేలా బిడ్డ.. తల్లి స్పర్శ పొందేలా చూస్తున్నాం.