
లోహిత్, జయలక్ష్మి
శివాజీ రాజా, జాకీ, గుండు సుదర్శన్, సీవీఎల్ నరసింహారావు, భావన ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘అక్షరం’. జాకీ తోట దర్శకత్వంలో నటుడు లోహిత్ కుమార్ నిర్మించిన ఈ సినిమా భీమినేని ఫిలిమ్స్ ఎల్.ఎల్.పి పతాకంపై ఈ నెల 26న విడుదలవుతోంది. లోహిత్ కుమార్ మాట్లాడుతూ– ‘‘అందరికీ అన్నీ ఉచితంగా ఇవ్వాలనుకుంటున్న ప్రభుత్వాలు విద్యను మాత్రం అందరికీ ఒకేలా ఎందుకు ఇవ్వడం లేదని ప్రభుత్వాలను, మోయలేని బరువులు పిల్లల మీద రుద్దుతున్న తల్లిదండ్రులను ప్రశ్నించే చిత్రమిది. తల్లిదండ్రుల శ్రమను అర్థం చేసుకోవాలని పిల్లలకి తెలియజెప్పే చిత్రం కూడా. నేడు మనం చదువుకోవడం లేదు.. చదువు కొంటున్నాం. దాని వల్ల సహజమైన జ్ఞానం అనేది నశించింది’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment