Shivaji Raja
-
ఆహాలో అదరగొడుతున్న 'వేయి శుభములు కలుగు నీకు'
శివాజీ రాజా తనయుడిగా 'వేయి శుభములు కలుగు నీకు' అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు విజయ్ రాజా. జయ దుర్గాదేవి మల్టీ మీడియా పతాకంపై రామ్స్ రాథోడ్ దర్శకత్వంలో తెరకెక్కించారు. విజయ్ రాజాకు జోడిగా తమన్నా వ్యాస్ నటించారు. తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను మెప్పించారు. థియేటర్లలో అందరినీ ఆకట్టుకున్న ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో సినీ ప్రియులను అలరిస్తోంది. లవ్, కామెడీ, హారర్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ చిత్రంలో విజయ్ రాజా నటన మెప్పిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు థియేటర్లో మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. అలాగే ఓటీటీ ప్రేక్షకులను సైతం విపరీతంగా ఆకట్టుకుంటోంది. మిలియన్ల వ్యూస్‌తో ఆహాలో అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రంలో మాస్టర్ జయదేవ్, శివాజీ రాజా, ఢీ ఫేం ఫాల్గుణి, సత్యం రాజేష్, జ్ఞాన ప్రియా, వెంకట్ నారాయణ, అపూర్వ, మీనా, అనంత్, షాయాజి షిండే, శ్రీకాంత్ అయంగార్, రోహిణి, జబర్దస్త్ అప్ప రావు, జబర్దస్త్ మురళి, రేసింగ్ రాజు, కోట యశ్వంత్ ముఖ్య పాత్రలు పోషించారు. -
ఆ హీరోలను చూస్తుంటే అబ్బో అనిపిస్తోంది
Happy Birthday Shivaji Raja: ‘‘కరోనా సమయంలో నా శక్తికి మించి చాలామందికి నిత్యావసర సరుకులు పంపిణీ చేశాను. అందులో కలిగిన సంతృప్తి నాకు ఎక్కడా దక్కలేదు. ‘శివాజీ రాజా చారిటబుల్ ట్రస్ట్’ ఏర్పాటు చేసి, పేద కళాకారులకు సేవ చేయాలనే ఆలోచన ఉంది’’ అని నటుడు శివాజీ రాజా అన్నారు. నేడు (శనివారం) ఆయన పుట్టినరోజుని పురస్కరించుకుని హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ– ‘‘నా అసలు పేరు శివాజీ రాజు.. కానీ ఒకరోజు ఏచూరిగారు ‘శివాజీ రాజా’ పేరు బాగుంటుందని చెప్పడంతో అప్పటి నుంచి మీడియాలో నా పేరు మారిపోయింది. 1985 ఫిబ్రవరి 24న చెన్నైలో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టాను. ఎం.వి. రఘు దర్శకత్వం వహించిన ‘కళ్ళు’ నా తొలి సినిమా. ఆ మూవీ ద్వారా ఉత్తమ నూతన నటుడిగా నంది అవార్డు అందుకున్నాను. ఇండస్ట్రీకి వచ్చిన 37 ఏళ్లలో దాదాపు 500 సినిమాలు చేశాను. నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఒట్టి చేతులతో వచ్చాను. ఎంత మంచి పేరు సంపాదించుకుంటే అంత మంచి పేరొస్తుంది. పునీత్ రాజ్‌కుమార్‌గారు చనిపోయినప్పుడు నాలుగు రాష్ట్రాలు కదిలొచ్చాయి.. అంతకంటే మంచితనం ఇంకేముంది? మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) లో ఇరవై ఏళ్లుగా రకరకాల బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తించాను (అధ్యక్షుడిగా కూడా). నేను హీరోగా చేసిన ఏ సినిమా నాకు సక్సెస్ ఇవ్వలేదు.. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చేసిన చిత్రాలకు, సీరియల్స్‌కు నంది అవార్డులు వచ్చాయి. నా ట్రస్ట్ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లోని పేద కళాకారులను ప్రోత్సహిస్తా. నేను మొదటి నుంచి చిరంజీవిగారి అభిమానినే. ఈ తరం హీరోల్లో అల్లు అర్జున్, మహేశ్‌బాబు, ప్రభాస్‌లను చూస్తుంటే నిజంగా అబ్బో అనిపిస్తుంది. నాకు వ్యవసాయం చేయడం ఇష్టం. మణికొండలో ఉన్న స్థలంలో, మొయినాబాద్‌లోని పొలంలో వ్యవసాయం చేస్తున్నాను. నా సొంత బ్యానర్ లో మా అబ్బాయి (విజయ్ రాజా)తో ‘కళ్ళు’ సినిమా రీమేక్ చేయాలని ఉంది. ప్రస్తుతం తను ఓ హిందీ, మూడు నాలుగు తెలుగు సినిమాలు చేస్తున్నాడు. ఇటీవల అనారోగ్య కారణాల వల్ల నేను ఎక్కువ సినిమాలు చేయలేదు. ఇప్పుడు బాగుంది. కొన్ని సినిమాలు చేస్తున్నాను’’ అన్నారు. -
నరేశ్‌పై శివాజీ రాజా సంచలన ఆరోపణలు, ‘మా’ వివాదాలకు అతడే కారణం
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికలు ఒకవైపు దగ్గర పడుతుంటే, మరోవైపు అభ్యర్థులు ఒకరిపై ఒకరు మాటల యుద్ధానికి దిగుతున్నారు. దీంతో ఎన్నడూ లేని విధంగా ఈసారి ‘మా’ ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలిపస్తున్నాయి. ఇక లోకల్-నాన్ లోకల్ అనే అంశంగా కూడా ఈ ఎన్నికల్లో వినిపిస్తోంది. అధ్యక్ష బరిలో ఉన్న ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు ప్రచారంలో భాగంగా ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకోవడం ఎన్నికల వివాదం మరింత ముదురుతోంది. ఈ క్రమంలో ‘మా’ మాజీ అధ్యక్షుడు శివాజీ రాజా నటుడు నరేశ్‌పై సంచలన ఆరోపణలు చేశాడు. ఇప్పుడు ‘మా’ ఎన్నికల్లో జరుగుతున్న వివాదాలకు నరేశ్ కారణమంటూ ఆరోపించాడు. ఆదివారం(అక్టోబర్ 10) ‘మా’ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తాజాగా ఆయన ఓ చానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ సారి జరిగే ‘మా’ ఎన్నికలపై తాను స్పందించాలనుకోవడం లేదని స్పష్టం చేశారు. అనంతరం నరేశ్ గురించి మాట్లాడుతూ.. ఇక గతేడాది నాగబాబు మద్దతు లేకపోయి ఉంటే నరేశ్ విజయం సాధించేవాడు కాదన్నాడు. అప్పుడు నాగాబాబు, నరేశ్‌కు ఎందుకు మద్దతు ఇచ్చాడో ఇప్పటికి తనకు అర్థం కావడం లేదన్నాడు. చదవండి: విష్ణు ప్యానల్‌కే ఓటు వేయాలంటూ మోహన్ బాబు లేఖ ఇక నరేశ్ ఆడే పాచికలాటలో ప్రాణ మిత్రులు కూడా విడిపోవాల్సి వచ్చిందంటూ తీవ్ర విమర్శలు గుప్పించాడు. ఈ మేరకు శివాజీ రాజా ‘‘మా’ నరేశ్ చిన్నపిల్లాడు. ఎప్పుడు అబద్దాలే చెబుతాడు. అతడి నోటివెంట నిజాలు వచ్చిన రోజున నేను ఆశ్చపోతాను. గతంలో నాపై నరేశ్ ఎన్ని అసత్య ప్రచారం చేశాడు. నరేశ్ రాకతోనే ఆసోసియేషన్‌లో రాజకీయాలు మొదలయ్యాయి. నేను ‘మా’ అధ్యక్షుడిగా ఉన్పుడు అమెరికాలో ఫండ్ రైజింగ్ ఈవెంట్ నిర్వహించాము. అప్పుడు చిరంజీవితో పాటు పలువురు హీరోహీరోయిన్లతో కలిసి ఈ కార్యక్రమానికి హజరయ్యాము. కానీ అదే సమయంలో ‘మా’కు జనరల్ సెక్రటరీగా ఉన్న నరేశ్ మాత్రం రాలేదు. అమెరికా రాకుండా ఇక్కడ సమావేశాలు పెట్టి నా గరించి తప్పుడు ప్రచారం చేశాడు’ అని ఆయన ఆరోపించారు. అలాగే ఈ అమెరికా పర్యటనకు విమాన టికెట్ట వ్యవహరంలో నేను, శ్రీకాంత్ డబ్బులు వాడుకున్నామని ఆరోపణలు చేశాడు. అయితే దీనిపై చిరంజీవి.. సినీ పెద్దలతో ఓ కమిటీ వేసి విచారణ జరిపి.. ఇందులో నిజం లేదని, నరేశ్ ఆరోపణలు అవాస్తవాలే అని తేల్చారన్నారు. శ్రీకాంత్, నేను డబ్బులు వాడుకోలేదని కూడా ఆ కమిటీ వెల్లడించిందని ఆయన చెప్పాడు. అయినా కూడా నరేశ్ ఇప్పటివరకూ మాకు క్షేమాపణలు చెప్పలేదన్నాడు. ఇక తన హాయాంలో ఏర్పాటు చేసిన ప్రోగ్రామ్‌ల ద్వారా వచ్చిన ఫండ్‌ని ఇప్పుడు ‘మా’ సంక్షేమం కోసం నరేశ్ వినియోగిస్తున్నాడని, అతని రాకతోనే అసోసియేషన్‌లో రాజకీయాలు ప్రారంభమయ్యాయన్నారు. ఇప్పుడు ‘మా’ ఎన్నికలు రచ్చకెక్కడానికి కూడా అతడే కారణమని, చిన్న విషయాలకు కూడా అబద్ధాలు ఆడతాడని పేర్కొన్నాడు. శ్రీకాంత్‌కు తనకు నరేశ్ క్షమాపణలు చెప్పేవరకు తనని ఇలాగే తిడుతూ ఉంటానని, అతడి వల్లే మా స్నేహ్నాలు కూడా చెడిపోయాయని ఆయన తెలిపారు. చదవండి: ‘మా’ ఎన్నికలపై ఎమ్మెల్యే ఆర్కే రోజా ఆసక్తికర వ్యాఖ్యలు ‘‘మా’ సభ్యుల కోసం ఓ వృద్ధాశ్రమం నిర్మించాలని నేను అనుకున్నాను. దానికి ఫండ్ రైజ్ చేయడం కోసం యూఎస్‌లో మరోసారి ప్రోగ్రామ్ పెట్టాలనుకున్నాను. దీనిపై పలువురు స్టార్ హీరోలతో చర్చించాను వారు కూడా ఒకే అన్నారు. అలాగే హీరో ప్రభాస్‌ను కూడా సంప్రదించాను. ప్రభాస్ షూటింగ్లో భాగంగా ఈ ప్రోగ్రామ్‌కు రాలేనని, దీనిపై మీరంతగా శ్రమించకండన్నారు. తన వాటాగా ‘మా’ కోసం 2 కోట్ల రూపాయలు కేటాయిస్తానని చెప్పాడు. ఆ మాట నాకెంతో తృప్తినిచ్చింది. ఇలా స్టార్‌హీరోహీరోయిన్స్ ప్రోగ్రామ్‌కి ఓకే అన్నాక.. నరేశ్ ప్రెస్‌మీట్ పెట్టి నాపై తీవ్ర ఆరోపణలు చేశాడు. ఆ తర్వాత వెంటనే ‘మా’ ఎన్నికలు జరిగాయి. మా ప్యానల్ ఓడిపోయింది. దాంతో ఆ ప్రోగ్రామ్ ఆగిపోయింది. నా కల అలాగే నిలిచిపోయింది’’ అంటూ ఆయన చెప్పకొచ్చాడు. -
‘అప్పుడు ఇప్పుడు’విడుదల ఎప్పుడంటే...
సుజన్, తనీష్క్ హీరో హీరోయిన్లుగా, చలపతి పువ్వల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘అప్పుడు-ఇప్పుడు’.ఈ చిత్రాన్ని యు.కె.ఫిలింస్ బేనర్ పై ఉషారాణి కనుమూరి, విజయ రామకృష్ణం రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. (ఫీల్ గుడ్ కామెడీ ఎంటర్ టైనర్ రూపొందిన ఈ చిత్రంలో శివాజీరాజా, పేరుపు రెడ్డి శ్రీనివాస్, చైతన్య ముఖ్య పాత్రల్లొ నటిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. సెప్టెంబర్ 3న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. (చదవండి: ‘శ్రీదేవీ సోడా సెంటర్’పై మహేశ్ బాబు రివ్యూ) ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.. ‘ఇటీవలే విడుదలైన టీజర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. విశ్వనాధ్ విడుదల చేసిన పాటతో పాటు పూరి జగన్నాద్ విడుదల చేసిన టీజర్‌కు అదరిపోయే రెస్పాన్స్ వచ్చింది. దర్శకుడు చలపతి చాలా అద్భుతంగా తెరకెక్కించాడు . అన్ని రకాల కమర్షియల్ హంగులతో తెరకెక్కిన ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తీ చేసుకుని వచ్చే నెల 3న విడుదల చేస్తున్నాం’ అన్నారు. -
అదరగొడుతన్న ‘కత్తి ఖతర్నాక్’ పాట
నటుడు శివాజీ రాజా తనయుడు విజయ్ రాజా హీరోగా నటించిన చిత్రం ‘వేయి శుభములు కలుగు నీకు’. రామ్స్ రాథోడ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తమన్నా వ్యాస్ హీరోయిన్. జామి లక్ష్మీప్రసన్న సమర్పణలో తూము నరసింహ పటేల్, జామి శ్రీనివాసరావు నిర్మించారు. ‘కత్తి ఖతర్నాక్..’ అంటూ సాగే ఈ చిత్రంలోని ప్రత్యేక పాటను శివాజీరాజా విడుదల చేశారు. రామ్స్ రాథోడ్ మాట్లాడుతూ –‘‘మా చిత్రానికి గ్యానీ సింగ్ మంచి సంగీతం అందిచారు. ‘కత్తి ఖతర్నాక్..’ పాటకు స్పందన బావుంది’’ అన్నారు. ‘‘ఈ చిత్రాన్ని దర్శకుడు బాగా తీశాడు.’’ అన్నారు తూము నరసింహ పటేల్. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: విక్రమ్ రమణ. -
అయ్యో! శివాజీ రాజాకు ఏమైంది, ఇలా అయిపోయారు..
శివాజీ రాజా.. సినీ ప్రేక్షకులకు పెద్దగ పరిచయం అక్కర్లేని పేరు. నటుడిగా, కారెక్టర్ ఆర్టిస్టుగా, హీరోగా, విలన్‌గా ఇలా ఎన్నో వందల సినిమాల్లో నటించిన శివాజీ రాజా తాజా లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాస్తా బోద్దుగా ఉండే ఆయన బాగా చిక్కిపోయి దర్శనం ఇచ్చారు. ఇలా ఆయనను చూసి అందరూ షాక్ అవతున్నారు. దీంతో ఆయన లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. కాగా గతేడాది ఆయన గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. అయితే ఇంతవరకు మీడియాకు దూరంగా ఉన్న ఆయన ఆస్పత్రి నుంచి కోలుకుని ఇంటికి వచ్చినప్పటికి తన ఆరోగ్యంపై ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. అలా మీడియాకు ఇంతకాలం దూరంగా ఉన్న శివాజీ రాజా తన తనయుడు వినయ్ రాజా హీరోగా ఎంట్రీ ఇస్తున్న ‘వేయు శుభములు కలుగు నీకు’ సినిమాలోని ఓ సాంగ్ విడుదల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇందులో ఆయన బరువు తగ్గి చిక్కిపోయి కనిపించడంతో అందరి దృష్టి ఆయనపై పడింది. ఏంటి ఆయన ఇలా అయిపోయారు, శివాజీ రాజాకు ఎమైందంటూ ఫాలోవర్స్, అభిమానులు కంగారు పడుతున్నారు. అయితే ఆయనకు గుండెపోటు వచ్చాక బరువు తగ్గిపోయారని, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగానే ఉన్నట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఆయన పూర్తిగా తన ఆరోగ్యంపైనే దృష్టి పెట్టారని ఈ క్రమంలో ఎక్కువగా బయటకు రావడం కానీ మీడియాతో మాట్లాడటం కానీ చేయడం లేదని వారు స్పష్టం చేశారు. కాగా శివాజీ రాజా 35 ఏళ్ల పాటు ఇండస్ట్రీలో నటుడిగా రాణించారు. తన కామెడియన్‌గా, విలన్‌గా, హీరోగా పలు సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారు. అలా 400పైగా చిత్రాల్లో నటించిన ఆయన కొంతకాలం మా ఆధ్యక్షుడిగా కూడా పనిచేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య రిత్యా నటనకు బ్రేక్ ఇచ్చారు. -
Jetty Movie: ఒక ఊరిలో జరిగిన కథ
నందితా శ్వేత, కృష్ణ , కన్నడ కిషోర్, మైమ్ గోపి, ఎమ్యస్ చౌదరి, శివాజీరాజా, జీవా, సుమన్ శెట్టి నటించిన చిత్రం ‘జెట్టి’. సుబ్రహ్మణ్యం పిచ్చుక దర్శకత్వంలో వేణుమాధవ్ నిర్మించిన ఈ చిత్రం టైటిల్ లోగోని లాంచ్ చేశారు. సుబ్రహ్మణ్యం పిచ్చుక మాట్లాడుతూ –‘‘కొన్ని వందల గ్రామాల్లోని వేల మత్స్యకార కుటుంబాల తరాల పోరాటం ఒక గోడ.. ఆ గోడ పేరే జెట్టి. అనాదిగా వస్తున్న ఆచారాలను నమ్ముకొని జీవనం సాగిస్తున్న మత్య్సకారులున్న ఒక ఊరిలో జరిగిన కథ ఇది. మత్స్యకారుల జీవన శైలి, వారి కట్టుబాట్లతో తెరకెక్కించాం. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో సినిమాని విడుదల చేస్తాం. మా చిత్రంలో సిద్ శ్రీరాం పాడిన పాట హైలెట్‌గా ఉంటుంది.. త్వరలోనే ఆ పాటను రిలీజ్ చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: కార్తిక్ కొండకండ్ల. -
నవ్వుల రాజా
నటుడు శివాజీ రాజా తనయుడు, ‘ఏదైనా జరగొచ్చు’ ఫేమ్ విజయ్ రాజా హీరోగా రెండో సినిమా షురూ అయింది. రామ్స్ రాథోడ్ దర్శకత్వం వహిస్తున్నారు. జయ దుర్గాదేవి మల్టీ మీడియా పతాకంపై తూము నరసింహ పటేల్ నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభం అయింది. తమన్నా వ్యాస్ కథానాయిక. హీరో నాగశౌర్య ముహూర్తం సన్నివేశానికి క్లాప్ ఇచ్చారు. రామ్స్ రాథోడ్ మాట్లాడుతూ– ‘‘వినోద ప్రధానంగా ఈ సినిమా ఉంటుంది. విజయ్ రాజాకి కరెక్ట్‌గా సరిపోతుంది’’ అన్నారు. ‘‘ఈ చిత్రకథ విన్నాను.. బాగుంది’’ అన్నారు శివాజీ రాజా. ‘‘ఇందులో అయిదు పాటలుంటాయి. హైదరాబాద్, వైజాగ్, చెన్నై, మున్నార్, గోవా.. వంటి ప్రదేశాల్లో షూటింగ్ జరపనున్నాం’’ అన్నారు తూము నరసింహ పటేల్. ‘‘కథ చాలా బాగుంది. మంచి పాత్ర చేస్తున్నాను’’ అన్నారు విజయ్ రాజా. ఈ చిత్రానికి కెమెరా: కె బుజ్జి, సంగీతం: గ్యానీ సింగ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: విక్రమ్ రమణ. -
శివాజీరాజాకు గుండెపోటు
సీనియర్ నటుడు, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) మాజీ అధ్యక్షడు శివాజీరాజా గుండెపోటుకు గురయ్యారు. మంగళవారం రాత్రి ఆయనకు గుండెపోటు రావడంతో కుటుంబసభ్యులు హుటాహుటిన స్థానిక స్టార్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం డాక్టర్లు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఒక్కసారిగా బీపీ లెవల్స్ పడిపోవడంతోనే శివాజీ రాజాకు గుండెపోటు వచ్చినట్లు డాక్టర్లు తెలిపారని ఆయన సన్నిహితులు వివరించారు. అంతేకాకుండా ఆయనకు స్టంట్ వేయాలని డాక్టర్లు సూచించినట్లు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని, మరో 24 గంటల పాటు వైద్యుల ప్రత్యేక పరిశీలనలో ఉంటారని పేర్కొన్నారు. ఇక శివాజీ రాజా గుండెపోటుకు గురయ్యారనే వార్తతో సినీ ప్రముఖులు, అభిమానులు ఆందోళనకు గురయ్యారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకొంటున్నారు. 400కు పైగా సినిమాల్లో నటించిన ఆయన కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అలాగే, టీవీ సీరియల్స్‌లోనూ నటించారు. చదవండి: రాణీ ప్రియాంక పారితోషికంలో పాతిక కట్ -
అక్షర సందేశం
శివాజీ రాజా, జాకీ, గుండు సుదర్శన్, సీవీఎల్ నరసింహారావు, భావన ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘అక్షరం’. జాకీ తోట దర్శకత్వంలో నటుడు లోహిత్ కుమార్ నిర్మించిన ఈ సినిమా భీమినేని ఫిలిమ్స్ ఎల్.ఎల్.పి పతాకంపై ఈ నెల 26న విడుదలవుతోంది. లోహిత్ కుమార్ మాట్లాడుతూ– ‘‘అందరికీ అన్నీ ఉచితంగా ఇవ్వాలనుకుంటున్న ప్రభుత్వాలు విద్యను మాత్రం అందరికీ ఒకేలా ఎందుకు ఇవ్వడం లేదని ప్రభుత్వాలను, మోయలేని బరువులు పిల్లల మీద రుద్దుతున్న తల్లిదండ్రులను ప్రశ్నించే చిత్రమిది. తల్లిదండ్రుల శ్రమను అర్థం చేసుకోవాలని పిల్లలకి తెలియజెప్పే చిత్రం కూడా. నేడు మనం చదువుకోవడం లేదు.. చదువు కొంటున్నాం. దాని వల్ల సహజమైన జ్ఞానం అనేది నశించింది’’ అన్నారు. -
‘ఏదైనా జరగొచ్చు’ మూవీ రివ్యూ
టైటిల్ : ఏదైనా జరగొచ్చు జానర్ : డార్క్ కామెడీ హారర్ నటీనటులు : విజయ్ రాజా, బాబీ సింహా, పూజా సోలంకి, సాషా సింగ్, వెన్నెల కిశోర్ సంగీతం : శ్రీకాంత్ పెండ్యాల నిర్మాత : సుదర్శన్ హనగోడు దర్శకత్వం : రమాకాంత్ టాలీవుడ్లో విలన్‌గా, కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎన్నో సినిమాలు చేసిన సీనియర్ నటుడు శివాజీ రాజా తనయుడు.. విజయ్ రాజాను హీరోగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన సినిమా ఏదైనా జరగొచ్చు. తమిళ నటుడు బాబీ సింహా కీలక పాత్రలో నటించిన ఈ సినిమాతో దర్శకుడిగా రమాకాంత్, సంగీత దర్శకుడిగా శ్రీకాంత్ పెండ్యాలలు పరిచయం అయ్యారు. మరి వీరందరికీ ఈ సినిమా బ్రేక్ ఇచ్చిందా..? కథ : జై (విజయ్ రాజా) తన స్నేహితులతో కలిసి ఈజీగా డబ్బు సంపాదించేందుకు ప్లాన్ చేస్తుంటాడు. ఓ ప్రైవేట్ సంస్థలో రికవరీ ఏజెంట్‌గా చేరిన జైకి శశిరేఖ(పూజ సోలంకి) పరిచయం అవుతుంది. తొలి చూపులోనే శశితో ప్రేమలో పడ్డ జై, ఆమె ఇబ్బందుల గురించి తెలుసుకొని ఎలాగైన సాయం చేయాలనుకుంటాడు. ఆ ప్రయత్నాల్లో భాగంగా కాళీ(బాబీ సింహా) అనే రౌడీ దగ్గర క్రికెట్ బెట్టింగ్‌లో డబ్బు పెట్టి సమస్యల్లో చిక్కుకుంటాడు. కాళీ జీవితంలో ఎవరికీ తెలియని ఓ రహస్యం జై అతని స్నేహితులకు తెలుస్తుంది. జైకి తెలిసిన ఆ రహస్యం ఏంటి..? కాళీ నుంచి జై అతని స్నేహితులు ఎలా తప్పించుకున్నారు? అన్నదే మిగతా కథ. నటీనటులు: ఈ సినిమాతో హీరోగా పరిచయం అయిన విజయ్ రాజా పరవాలేదనిపించాడు. కామెడీ, లవ్ సీన్స్‌లో ఆకట్టుకున్నాడు. కాళీ పాత్రకు బాబీ సింహా సరిగ్గా సరిపోయాడు. సీరియస్ లుక్‌లో మంచి విలనిజం చూపించాడు. ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో ఆయన నటన మరింతగా ఆకట్టుకుంటుంది. బేబీ పాత్రలో నటించిన సాషా సింగ్ నటన కాస్త అతిగా అనిపిస్తుంది. హీరోయిన్గా పూజా సోలంకి లుక్స్ పరంగా ఆకట్టుకున్నా నటనతో మెప్పించలేకపోయింది. సెకండ్ హాఫ్‌లో వెన్నెల కిశోర్ తనదైన కామెడీ టైమింగ్‌తో కాసేపు నవ్వించే ప్రయత్నం చేశాడు. ఇతర నటీనటులు తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు. విశ్లేషణ : సూపర్ నేచురల్ పాయింట్‌తో కథను రెడీ చేసుకున్న దర్శకుడు ఆ స్థాయిలో సినిమాను తెరకెక్కించటంలో తడబడ్డాడు. ఆసక్తికరంగా సినిమాను ప్రారంభించినా తరువాత రొటీన్ సన్నివేశాలతో బోర్ కొట్టించాడు. హీరో, అతని ఫ్రెండ్స్ డబ్బు కోసం చేసే ప్రయత్నాలు, లవ్ ట్రాక్ అంత ఆసక్తికరంగా అనిపించవు. ఇంటర్వెల్ ట్విస్ట్‌తో ద్వితీయార్థంపై ఆసక్తికలిగేలా చేసినా, ఆ టెంపోను కంటిన్యూ చేయలేకపోయాడు. అసలు ట్విస్ట్ రివీల్ అయిన తరువాత కూడా కథనం నెమ్మదిగా సాగుతూ విసిగిస్తుంది. ప్రీ క్లైమాక్స్‌లో వెన్నెల కిశోర్ కామెడీ బాగానే వర్క్ అవుట్ అయ్యింది. హారర్ సినిమాలో సంగీతానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. కానీ తొలి ప్రయత్నంలో శ్రీకాంత్ పెండ్యాల తన మార్క్ చూపించలేకపోయాడు. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్ : బాబీ సింహా వెన్నెల కిశోర్ కామెడీ మైనస్ పాయింట్స్ : కథా కథనం సంగీతం లాజిక్ లేని సన్నివేశాలు సతీష్ రెడ్డి జడ్డా, సాక్షి వెబ్ డెస్క్. -
సినిమాకి ఆ ఇద్దరే ప్రాణం
‘‘దాదాపు 35 ఏళ్ల క్రితం ‘కళ్ళు’ సినిమా ద్వారా నేను హీరోగా పరిచయమయ్యా. ఆ సినిమా నాకు 17 అవార్డులు తీసుకొచ్చింది. ఆ చిత్రంలో హీరో నేనే అయినా గొల్లపూడిగారు, రఘుగారే హీరోలని ఇప్పటికీ చెబుతుంటాను. ఎందుకంటే రచయిత, దర్శకుడే సినిమాకు ప్రాణం. ‘ఏదైనా జరగొచ్చు’ సినిమా కూడా రమాకాంత్‌దే’’ అని శివాజీ రాజా అన్నారు. ఆయన తనయుడు విజయ్ రాజా హీరోగా, పూజా సోలంకి, సాషా సింగ్ హీరోయిన్లుగా కె. రమాకాంత్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఏదైనా జరగొచ్చు’. సుదర్శన్ హనగోడు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 23న కె.ఎఫ్.సి ఎంటర్టైన్మెంట్స్ ద్వారా రిలీజ్ అవుతోంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఫంక్షన్లో బాబీ సింహా మాట్లాడుతూ– ‘‘ఈ కథ విన్నప్పుడు ఇలాంటి కథను దర్శకుడు ఎలా ఆలోచించారు? ఎలా సీన్లు రాసుకున్నారు? వాటిని ఎలా కనెక్ట్ చేశారు? అని ఆశ్చర్యపోయాను. విజయ్ రాజాకి తొలి సినిమా అయినా బెరుకు లేకుండా నటించాడు’’ అన్నారు. ‘‘ఇదొక డార్క్ కామెడీ హారర్ థ్రిల్లర్. తెలుగు స్క్రీన్‌పై ఇప్పటి వరకు చూడని ప్రేమకథ మా సినిమాలో చూస్తారు’’ అన్నారు రమాకాంత్. ‘‘ఈ చిత్రం ద్వారా సంగీత దర్శకుడిగా పరిచయం కావడం సంతోషంగా ఉంది. ఈ ప్రాజెక్టు నాలుగు ఏళ్ల క్రితం స్టార్ట్ అయింది. అన్ని పాటలు అప్పుడే కంపోజ్ చేశాం’’ అన్నారు శ్రీకాంత్ పెండ్యాల. ‘‘జిగర్తండా’లో బాబీ సింహాగారి నటన చూసి ఆయనతో కలిసి నటించాలనుకున్నా. నా ఫస్ట్ సినిమాకే ఆ అవకాశం రావడం అదృష్టం’’ అన్నారు విజయ్ రాజా. ‘‘ఒక మంచి సినిమాలో భాగం అయినందుకు సంతోషంగా ఉంది’’ అన్నారు సుదర్శన్ హనగోడు. ఈ చిత్రానికి సహ నిర్మాత: పి. సుదర్శన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: విజయ్‌ప్రకాష్ అన్నంరెడ్డి, కెమెరా: సమీర్‌రెడ్డి. ∙సుదర్శన్, బాబీ సింహా, శివాజీరాజా, విజయ్ రాజా, రమాకాంత్ -
సినిమా గురించి ప్రేక్షకులే మాట్లాడతారు
‘‘ఏదైనా జరగొచ్చు’ సినిమాకి హీరో, హీరోయిన్, దర్శకుడు... అన్నీ రమాకాంతే. మూడేళ్లు ఈ కథని మోస్తూ వస్తున్నాడు. అనుకున్న అవుట్‌పుట్ రావడం కోసం రాజీపడకుండా పనిచేశాడు. ఈ సినిమా బాగుందని నేను చెప్పను. విడుదలయ్యాక ప్రేక్షకులే చెబుతారు’’ అని నటుడు శివాజీరాజా అన్నారు. విజయ్ రాజా హీరోగా, పూజా సోలంకి, సాషా సింగ్ హీరోయిన్స్‌గా కె.రమాకాంత్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఏదైనా జరగొచ్చు’. సుదర్శన్ హనగోడు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 23న విడుదలవుతోంది. ఈ చిత్రం ట్రైలర్‌ని శివాజీరాజా విడుదల చేశారు. ‘‘ఏప్రిల్ 1న పుట్టిన ముగ్గురు ఫూల్స్ చేసే స్టుపిడ్ పనుల వల్ల ఎలాంటి ఇబ్బందుల్లో పడ్డారు? అన్నదే కథ’’ అన్నారు. ‘‘నటుడిగా నిరూపించుకునే పాత్ర ఈ సినిమాలో దొరికింది’’ అన్నారు అజయ్ ఘోష్. ‘‘మా సినిమాని పెద్ద హిట్ చేస్తారని ఆశిస్తున్నా’’ అన్నారు సుదర్శన్. ‘‘నాపై నమ్మకంతో ఈ సినిమా తీసిన రమాకాంత్గారికి రుణపడి ఉంటాను’’ అన్నారు విజయ్ రాజా. పూజా, సాషా సింగ్, అనంతపురం జగన్ పాల్గొన్నారు. -
మాకు హ్యాట్రిక్ మూవీ అవుతుందనుకుంటున్నా
‘‘లీసా’ నాకు చాలా ఇంపార్టెంట్ మూవీ. హారర్‌ను త్రీడీలో ట్రై చేశాం. 2డీలో తీసి 3డీలోకి మార్చకుండా మొత్తం 3డీలోనే షూట్ చేశాం. వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. మా సినిమా ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాను’’ అని అంజలి అన్నారు. అంజలి ప్రధాన పాత్రలో రాజు విశ్వనాథ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘లిసా’. ఈ చిత్రాన్ని సురేశ్ కొండేటి తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ చిత్రం ప్రీ–రిలీజ్ ఫంక్షన్లో శివాజీరాజా ట్రైలర్‌ను రిలీజ్ చేసి, మాట్లాడుతూ – ‘‘తెలుగు అమ్మాయి అంజలి పక్క రాష్ట్రం వెళ్లి అక్కడ సక్సెస్ కావడం చాలా సంతోషం. తను తెలుగులోనూ బాగా బిజీ అవ్వాలి. సురేశ్ కొండేటి కష్టాన్ని నేను దగ్గర నుంచి చూశాను. పత్రికాధినేత నుంచి నిర్మాతగా అతను ఏది చేసినా సక్సెసే’’ అన్నారు. ‘‘ఇది కేవలం పిల్లలు మాత్రమే కాదు ఫ్యామిలీలు కూడా ఎంజాయ్ చేసేలా ఉంది’’ అన్నారు దర్శకుడు ముప్పలనేని శివ. ‘‘3డీ సినిమాలకు నేను పెద్ద అభిమానిని. ట్రైలర్ మైండ్ బ్లోయింగ్‌గా ఉంది’’ అన్నారు రచయిత జేకే భారవి. ‘‘షాపింగ్ మాల్, జర్నీ’ సినిమాలు నా కెరీర్లో మంచి హిట్స్‌గా నిలిచాయి. అంజలి మంచి ఆర్టిస్ట్. ఈ సినిమాని ప్రేక్షకులు తప్పకుండా సక్సెస్ చేస్తారనుకుంటున్నాను. షాపింగ్ మాల్, జర్నీ తర్వాత అంజలి, నా కాంబినేషన్లో ఇది హ్యాట్రిక్ మూవీ అవుతుందనుకుంటున్నాను’’ అన్నారు సురేశ్ కొండేటి. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ చంద్రహాస్ ఇప్పలపల్లి, కాసాని వీరేశ్, నటుడు భద్రం, దర్శకుడు రాజు విశ్వనాథ్ మాట్లాడారు. -
మంచి జరుగుతుంది.. విజయం దక్కుతుంది
‘‘విజయ్ రాజాను చూస్తుంటే ‘బొబ్బిలిరాజా’లో శివాజీరాజా గుర్తొస్తున్నాడు. ఇటీవల వచ్చిన ‘నేనేరాజు నేనే మంత్రి’తో సహా మా కాంబినేషన్లో వచ్చిన ప్రతి చిత్రం హిట్ అయింది. ‘ఏదైనా జరగొచ్చు’ అని టైటిల్ పెట్టారు.. మంచే జరుగుతుంది, హిట్టే వస్తుంది’’ అని రచయిత పరుచూరి గోపాలకృష్ణ అన్నారు. నటుడు శివాజీరాజా తనయుడు విజయ్ రాజా హీరోగా కె.రమాకాంత్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ఏదైనా జరగొచ్చు’. పూజా సోలంకి, సాషాసింగ్ కథానాయికలుగా కె. ఉమాకాంత్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ– ‘‘శివాజీరాజా కూడా హీరో అవుదామని ఇండస్ట్రీకి వచ్చాడు.. హీరోగా చేశాడు. మంచి నటుడిగా, మానవతావాదిగా పేరు సంపాదించాడు. వాళ్లబ్బాయి భవిష్యత్తు బాగుండాలి’’ అన్నారు. ‘‘పదేళ్లక్రితం మా సినిమా ‘విరోధి’లో విజయ్ నటించాడు. అప్పుడే ఇంత పెద్దోడు అయ్యాడా అనిపిస్తోంది’’ అన్నారు నటుడు శ్రీకాంత్. ‘‘విజయానికి కావాల్సిన అంశాలన్నీ ఈ చిత్రంలో కనిపిస్తున్నాయి’’ అన్నారు దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి. ‘‘విజయ్ దేవరకొండ అంతటి సక్సెస్‌ను విజయ్ రాజా అందుకోవాలని ఆశిస్తున్నాను’’ అన్నారు నిర్మాత అచ్చిరెడ్డి. ‘‘నాకు కావాల్సిన వాళ్లంతా ఈ వేడుకకు రావడం హ్యాపీగా ఉంది. వీళ్లందరి ప్రేమాభిమానాలు, సపోర్ట్‌తోనే 450 సినిమాలు చేశా. అదే ప్రేమను నా కొడుకుపై చూపిస్తూ ఆశీర్వదించడం ఆనందంగా ఉంది’’ అన్నారు శివాజీరాజా. ‘‘హాలీవుడ్లో నా ఫేవరెట్ డైరెక్టర్ క్వెంటిన్ టొరంటినో. ఈ సినిమా పోస్టర్స్, ట్రైలర్ చూశాక రమాకాంత్లోనూ ఆయన శైలి కనిపించింది’’ అని హీరో తరుణ్ అన్నారు. ‘‘శని, ఆదివారాలు శ్రీకాంత్‌గారి ఇంటికెళ్తే.. ఎంత హార్డ్ వర్క్ చేస్తే అంతపైకి వస్తారని రోషన్‌కు, నాకు చెప్పి ప్రోత్సహించేవారు’’ అన్నారు విజయ్ రాజా. ‘‘ఇదొక కాన్సెప్ట్ బేస్డ్ సినిమా. థ్రిల్లర్ అండ్ హారర్ కామెడీ ఉంటుంది’’ అన్నారు రమాకాంత్. నిర్మాత సి. కల్యాణ్ తదితరులు పాల్గొన్నారు. -
విజయ్ పెద్ద స్టార్‌గా ఎదగాలి
‘‘నేను అసోసియేట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నప్పటి నుంచి శివాజీరాజాతో పరిచయం ఉంది. మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఓ గుర్తింపును సంపాదించుకున్నారు. ఇప్పుడు హీరోగా పరిచయమవుతోన్న ఆయన తనయుడు విజయ్ పెద్ద స్టార్‌గా ఎదగాలి. ఈ సినిమా పెద్ద హిట్ కావాలి’’ అని దర్శకుడు వీవీ వినాయక్ అన్నారు. నటుడు శివాజీ రాజా తనయుడు విజయ్ రాజా హీరోగా పరిచయమవుతోన్న చిత్రం ‘ఏదైనా జరగొచ్చు’. పూజా సోలంకి, సాషాసింగ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కె.రమాకాంత్ దర్శకత్వంలో వెట్ బ్రెయిన్ ఎంటర్టైన్మెంట్, సుధర్మ్ ప్రొడక్షన్స్ పతాకాలపై నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్‌ని వినాయక్ విడుదల చేశారు. ఈ సందర్భంగా నటుడు శివాజీ రాజా మాట్లాడుతూ – ‘‘ఏదైనా జరగొచ్చు’ సినిమాతో సినీ రంగంలోకి అడుగు పెడుతున్న మా అబ్బాయి విజయ్‌ని ప్రేక్షకులు ఆశీర్వదించాలి. వినాయక్‌గారి చేతుల మీదుగా ఈ చిత్రం టీజర్ విడుదల కావడం ఆనందంగా ఉంది. ఆయనకు నా స్పెషల్ థాంక్స్’’ అన్నారు. ‘‘ఇదొక క్రైమ్ హారర్ థ్రిల్లర్. మంచి సహకారం అందిస్తున్న నటీనటులు, సాంకేతిక నిపుణులకు థాంక్స్’’ అన్నారు రమాకాంత్. బాబీ సింహా, నాగబాబు, అజయ్ ఘోష్, ‘వెన్నెల’ కిషోర్, పృథ్వి, ఝాన్సీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సహ నిర్మాత: సుదర్శన్ హనగోడు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: విజయ్ ప్రకాశ్ అన్నంరెడ్డి, కెమెరా: సమీర్ రెడ్డి, సంగీతం: శ్రీకాంత్ పెండ్యాల. -
ఏమో.. ఏదైనా జరగొచ్చు
నటుడు శివాజీరాజా తనయుడు విజయ్ రాజా హీరోగా నటించిన చిత్రం ‘ఏదైనా జరగొచ్చు’. సాషాసింగ్ కథానాయిక. రమాకాంత్ దర్శకత్వంలో ఉమాకాంత్ నిర్మించిన ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను సీనియర్ పాత్రికేయులు వినాయకరావు, డిజిటల్ పోస్టర్‌ను పసుపులేటి రామారావు రిలీజ్ చేశారు. రమాకాంత్ మాట్లాడుతూ– ‘‘సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన చిత్రమిది. కథ, కథనాలు ప్రేక్షకులను కట్టిపడేసేలా ఉంటాయి. ఓ సిటీలో జరిగే కథ ఆధారంగా తెరకెక్కింది. విజువల్ ఎఫెక్ట్స్ బాగా వచ్చాయి. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. మేలో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ‘‘కొత్తవారి దర్శకత్వంలో సినిమా చేస్తే కథ కొత్తగా ఉంటుందనే నమ్మకంతో రమాకాంత్ దర్శకత్వంలో మా అబ్బాయిని హీరోగా పరిచయం చేస్తున్నా. యువతరానికి కనెక్ట్ అయ్యే చిత్రమిది’’ అన్నారు శివాజీరాజా. ‘‘కథ వాస్తవికతకు దగ్గరగా ఉంటుంది. మా నాన్నగారు గర్వపడే సినిమా చేశా. కెమెరామెన్ సమీర్ రెడ్డిగారు మంచి విజువల్స్ ఇచ్చారు’’ అన్నారు విజయ్‌రాజా. -
‘మా’ వివాదం.. శివాజీ రాజా సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్ : మూవీ ఆర్టిస్ట్ అసోషియేన్ వివాదం మరింత ముదురుతోంది. నరేష్, శివాజీ రాజల మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలు కొనసాగుతున్నాయి. ఎన్నికల ఫలితాలతో వివాదానికి తెరపడుతుందని భావించినా అలా జరగలేదు. ఎలక్షన్లలో శివాజీ రాజా ప్యానల్‌పై నరేష్ ప్యానల్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే గెలిచిన వర్గం ఈ నెల 22న ప్రమాణ స్వీకారం చేయాలని భావించినా శివాజీ రాజా అడ్డుపడుతున్నాడంటూ ఆరోపిస్తూ నరేష్ వర్గం మీడియా ముందుకు వచ్చారు. (చదవండి : ‘మా’లో మరో వివాదం) అయితే ఈ విషయంపై క్లారిటీ ఇచ్చిన శివాజీ రాజా ‘బైలా ప్రకారం ఏప్రిల్‌లో ప్రమాణ స్వీకారం చేయాలని సూచించాను. గతంలో నేను కూడా 25 రోజులు ఆగి ప్రమాణం చేశాను అంతేగాని వారి ప్రమాణం సీక్వారంపై నేను కోర్టుకు వెళతానని చెప్పలేదు’ అన్నారు. ఈ సందర్భంగా శివాజీ రాజా పలు ఆరోపణలు చేశారు. గతంలో మా చాలా బాగుండేది అన్న శివాజీ గత నాలుగేళ్లుగా రాజకీయాలు ప్రవేశించాయని ఆవేదన వ్యక్తం చేశారు. ‘గత 22 ఏళ్లుగా మాలో ఎన్నో పదువుల్లో సేవ చేశాను, ఈసీ మెంబర్ నుంచి అధ్యక్షుడి వరకు అన్ని బాధ్యతలు నిర్వహించాను. ఇప్పుడు నాకు కుర్చీ మీద వ్యామోహం లేదు. కానీ నరేష్ వర్గం ప్రెస్‌మీట్ పెట్టి మా పరువు బజారు కీడ్చటం బాధకలిగించింది. అందుకే నేను మీడియా ముందుకు రావాల్సి వచ్చింది. అమెరికా ఈవెంట్ సందర్భంగా అవకతవకలు జరిగినట్టు ఆరోపణలు చేయటం సరికాదు. ఆ ఈవెంట్‌పై చిరంజీవి అధ్యక్షతన వేసిన కమిటీ క్లీన్ చీట్ ఇచ్చింది. (చదవండి : ‘మా’ అధ్యక్షుడిగా నరేష్ విజయం) ఫిలిం స్టార్స్‌ను బిజినెస్ క్లాస్‌లో తీసుకెళ్లామనటం కూడా కరెక్ట్ కాదు. గతంలో నరేష్ కూడా పలు తమిళ నటీనటుల సంఘం ఈవెంట్ కు బిజినెస్ క్లాస్‌లో వెళ్లి సూట్ రూమ్‌లో స్టే చేశారు. తారలకు సముచిత గౌరవం ఇవ్వటం ధర్మం అందుకే బిజినెస్ క్లాస్‌లో తీసుకెళ్లాం. ఇన్నేళ్లల్లో నరేష్ మాకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. ప్రతీసారి మా అమ్మ(విజయ నిర్మల) 15 ఇస్తున్నారు అంటారు. ఆ 15 వేలతోనే మా నడుస్తుందా? ఎన్నికల సమయంలో తప్పులు జరిగాయి. నారాయణరావు అనే వ్యక్తి అక్కడే జీవితకు ఓటేయండి అంటూ మైకులో చెప్తున్నారు. అయినా నేను ఆరోపణలు చేయలేదు. జీవితా రాజశేఖర్‌లు అన్ని పార్టీలు మారారు.. ఇప్పుడు మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ మీద పడ్డారు. శ్రీరెడ్డి, డ్రగ్స్ విషయంలో నేను సరిగ్గా స్పందించలేదని జీవిత గతంలో అడిగారు. కానీ శ్రీరెడ్డి విషయంలో కార్డు ఇవ్వమని కొందరు, ఇవ్వొద్దని కొందరు అన్నారు, అందుకే ఆ సమయంలో సరైన నిర్ణయం తీసుకోలేకపోయాం. మా డైరీ ప్రింటింగ్ సమయంలో నరేష్ ఈ సారి తాను ప్రింట్ చేయిస్తానని బాధ్యత తీసుకున్నాడు. 14 లక్షలు ప్రింటింగ్ కోసం కలెక్ట్ అయినట్టుగా వెల్లడించారు. కానీ అకౌంట్లో 7 లక్షలు మాత్రమే జమ అయ్యాయి. మిగతా 7 లక్షలు ఏమయ్యాయి. ఎప్పుడు వస్తాయి. అవి జమ చేసి ప్రమాణం చేస్తే బాగుంటుంది. తప్పులు వాళ్లు చేసి అవతలి వాళ్లు వేదనకు గురి చేయటం కరెక్ట్ కాదు’ అన్నారు శివాజీ రాజా. ఎన్నికల కొద్ది రోజుల ముందు నాగబాబు ప్రెస్‌మీట్ పెట్టి నరేష్ వర్గానికి మద్దుతు తెలపటంపై స్పందించిన శివాజీ రాజా ‘నాగాబాబు నేను చాలా ఏళ్లుగా మంచి స్నేహితులం.. నాగబాబు నాకు గిఫ్ట్ ఇచ్చాడు, త్వరలోనే నేను రిటర్న్ గిఫ్ట్ ఇస్తా’ అన్నాడు. -
‘మా’లో మరో వివాదం
ఎన్నికల తరువాత కూడా ‘మా’ (మూవీ ఆర్టిస్ట్ ఆసోషియేషన్)లో వివాదాలు సద్దుమణగటం లేదు. శివాజీరాజా, నరేష్‌ల మధ్య మొదలైన వివాదం చిలికి చిలికి గాలి వానలా మారింది. గత టర్మ్‌లో ఒకే ప్యానల్లో కలిసి పని చేసిన శివాజీ, నరేష్‌లు ఈ సారి ప్రత్యర్థులుగా బరిలో దిగారు. ఉత్కంఠ కలిగించిన ఈ ఎన్నికల్లో నరేష్ ప్యానల్ ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఎన్నికల తరువాత కూడా వివాదాలు కొనసాగుతున్నాయి. నరేష్ వర్గం ఈ నెల 22న బాధ్యతలు స్వీకరించేందుకు ముహూర్తం నిర్ణయించుకుంది. అయితే శివాజీ రాజా మాత్రం ‘తమకు మార్చి 31 వరకు గడువు ఉందని కోర్టు వెళ్తామన్నా’రని నరేష్ వెల్లడించారు. అంతేకాదు పెండింగ్‌లో ఉన్న చెక్కులపై సంతకాలు పెట్టేందుకు కూడా పూర్వ సభ్యులు సహకరించటం లేదన్నారు. తమకు కుర్చీ పిచ్చి లేదన్న నరేష్, ఎన్నికల సమయంలో శివాజీ రాజా తీరుపై కూడా అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు మా సభ్యులను శివాజీ వర్గం ఎత్తుకెళ్లిందని ఆరోపించారు. చట్టపరంగా ఎన్నికల్లో గెలిచిన తరువాత ఎప్పుడైనా బాద్యతలు స్వీకరించే హక్కు మాకు ఉందన్న నరేష్, పెద్దలతో సంప్రదించి నిర్ణయం తీసుకుంటామన్నారు. మా కోసం పనిచేయడానికి వచ్చామని తమకు అడ్డంకులు సృష్టించవద్దని కోరారు. -
‘మా’ అధ్యక్షుడిగా నరేశ్
‘మా’ నూతన అధ్యక్షుడు ఎవరు? అనే ఉత్కంఠకు తెరపడింది. సీనియర్ నరేశ్ మా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. హైదరాబాద్‌లోని ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్‌లో ‘మా’(మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) ఎన్నికలు ఆదివారం జరిగిన విషయం తెలిసిందే. అధ్యక్ష పదవికోసం సీనియర్ నరేశ్, శివాజీరాజా ప్యానళ్ల మధ్య హోరాహోరీ పోరు సాగగా నరేశ్ విజయం సాధించారు. ‘మా’ అసోసియేషన్‌లో దాదాపు 800 ఓట్లు ఉండగా 472 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సారి పోలింగ్‌కు బ్యాలెట్ పత్రాలను ఉపయోగించడంతో కౌంటింగ్ ఆలస్యమైంది. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఎన్నికల ఫలితాలను వెల్లడించారు. నరేశ్‌కు 268 ఓట్లు పోల్ కాగా, శివాజీ రాజాకు 199 ఓట్లు వచ్చాయి. దీంతో 69 ఓట్ల ఆధిక్యంతో నరేశ్ గెలుపొందినట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. ‘మా’ ఉపాధ్యక్షులుగా ఎస్వీ కృష్ణారెడ్డి, హేమ, జనరల్ సెక్రటరీగా జీవితా రాజశేఖర్, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా రాజశేఖర్, జాయింట్ సెక్రటరీగాలుగా గౌతమ్‌రాజు, శివబాలాజీ, కోశాధికారిగా రాజీవ్ కనకాల విజయం సాధించారు. కాగా హేమ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి, గెలుపొందడం విశేషం. ‘మా’ ఈసీ (ఎగ్జిక్యూటివ్ కమిటీ) సభ్యులుగా అలీ, రవిప్రకాశ్, తనికెళ్ల భరణి, సాయికుమార్, ఉత్తేజ్, పృథ్వీ, జాకీ, సురేశ్ కొండేటి, అనితా చౌదరి, అశోక్ కుమార్, సమీర్, ఏడిద శ్రీరామ్, రాజా రవీంద్ర, తనీష్, జయలక్ష్మి, కరాటే కల్యాణి, వేణుమాధవ్, పసునూరి శ్రీనివాస్ ఎన్నికయ్యారు. -
‘మా’ అధ్యక్షుడు ఎవరు?
... అనే ఉత్కంఠ చిత్ర వర్గాల్లో నెలకొంది. హైదరాబాద్‌లోని ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్‌లో ‘మా’(మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) ఎన్నికలు ఆదివారం జరిగాయి. సీనియర్ నరేశ్, శివాజీరాజా ప్యానెల్స్ బరిలో నిలిచాయి. ‘మా’లో సుమారు 800మంది సభ్యులు ఉండగా 472 ఓట్లు పోలయ్యాయి. బ్యాలెట్æపద్ధతిలో ఓటింగ్ విధానం జరగడంతో లెక్కింపు ఆలస్యమైందని తెలిసింది. ఆదివారం అర్ధరాత్రి దాటాకే రిజల్ట్ వచ్చే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ‘మా’ నూతన అధ్యక్షుడు శివాజీరాజానా? నరేశా? అన్నది నేడు అధికారికంగా ప్రకటించనున్నారు. జమున, రోజా రమణి, గీతాంజలి, కోటా శ్రీనివాసరావు, కృష్ణ, విజయ నిర్మల, చిరంజీవి, నాగార్జున, బాబూమోహన్, గిరిబాబు, రాళ్లపల్లి, విజయ్ చందర్, చలపతిరావు, జయసుధ, వై.విజయ, జయలలిత, ఆర్. నారాయణమూర్తి, రాజశేఖర్, జీవిత, లక్ష్మీ మంచు, ‘అల్లరి’ నరేశ్, నాని, రానా, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, సుధీర్‌బాబు, సునీల్, అలీ, తరుణ్, జేడీ చక్రవర్తి, ప్రియమణి వంటి పలువురు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కృష్ణ, జమున, కోటా శ్రీనివాసరావు చిరంజీవి, నాగార్జున, జయసుధ -
రసవత్తరంగా ‘మా’ పోలింగ్
-
‘మా’ హీరో ఎవరు?
సాక్షి, హైదరాబాద్: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఆదివారం జరగనున్న ఈ ఎన్నికల్లో సీనియర్ నటులు శివాజీరాజా, నరేశ్ ప్యానెళ్లు పోటీ పడుతున్నాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి సవాళ్లు.. ప్రతిసవాళ్లు, ఆరోపణలు.. ప్రత్యారోపణలతో పోటాపోటీగా మేనిఫెస్టోలు విడుదల చేశారు. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మా ఎన్నికలు జరుగనున్నాయి. సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు మొదలు పెట్టి 3 గంటల్లో ఫలితాలు ప్రకటించే అవకాశం ఉంది. ఈ సారి పోటీ పడుతున్న శివాజీరాజా, నరేశ్ ప్యానెళ్లు సాధారణ ఎన్నికలను తలపించేలా వ్యూహ ప్రతివ్యూహాలతో ప్రచారం సాగించారు. హోరాహోరీగా ప్రచారం చేస్తూ అగ్ర నటుల మద్దతు కూడగట్టేందుకు యత్నించారు. గతంలో ఒకే ప్యానెల్లో పని చేసిన నరేశ్, శివాజీరాజా ప్రస్తుతం రెండు వర్గాలుగా పోటీ పడుతుండటం ఈ ఎన్నికలపై ఆసక్తిని పెంచింది. జీవిత, రాజశేఖర్ మద్దతు కూడగట్టుకున్న నరేశ్ 26 మంది సభ్యులతో బరిలోకి దిగారు. శ్రీకాంత్, ఎస్వీ.కృష్ణారెడ్డి మద్దతు కూడగట్టుకున్న శివాజీరాజా తన ప్యానెల్‌తో పోటీలో నిలిచారు. ఇరు ప్యానెళ్ల మధ్య హోరాహోరీ పోరు కనిపిస్తోంది. గత ప్యానెల్లో చేసిన కార్యక్రమాలను కొనసాగిస్తామంటూ, కళాకారుల సంక్షేమం కోసం కొత్త హామీలు గుప్పించారు. తమను గెలిపిస్తే రూ.6 వేల పింఛన్‌తో పాటు కళాకారుల పిల్లల వివాహాలకు రూ.1,00,116 ఆర్థిక సాయం అందిస్తామని నరేశ్ ప్రకటించారు. తమను గెలిపిస్తే 50 మంది నటీనటులకు 6 నెలల పాటు నిత్యావసర సరుకులు ఉచితంగా అందిస్తామని, రూ.7,500 పింఛన్ ఇస్తామని శివాజీరాజా హామీ ఇచ్చారు. మొత్తానికి ఫిలింనగర్లో వారం రోజుల ప్రచార సందడి శనివారం సాయంత్రం ముగిసింది. ఆదివారం ఫిలించాంబర్‌లో జరుగనున్న ‘మా’ఎన్నికల్లో 745 మంది సభ్యులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. సర్వత్రా ఆసక్తి రేపుతున్న ఈ ఎన్నికల్లో సభ్యులు ఎవరికి పట్టం కడతారో వేచిచూడాలి. -
దేవుడు దిగొచ్చినా వచ్చేసారి పోటీ చేయను
‘‘ఈ సారి ‘మా’ ఎన్నికల్లో పోటీ చేయకూడదనుకున్నా. కానీ నా ప్యానల్ సభ్యులు పట్టు బట్టారు. పద్మ అనే మహిళ నేను పోటీ చేయకుంటే ఆత్మహత్య చేసుకుంటాననీ, ‘మా’ పింఛన్ తీసుకోనని చెప్పారు. వీరందరి ప్రేమ పోటీ చేసేలా చేసింది. దేవుడు దిగొచ్చినా వచ్చేసారి పోటీ చేయను’’ అని ‘మా’ అధ్యక్షుడు శివాజీ రాజా అన్నారు. 2019–2021కి ‘మా’(మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) ఎన్నికలు ఈ ఆదివారం జరగనున్నాయి. శివాజీరాజా ప్యానల్ సభ్యులు హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్ నిర్వహించారు. శివాజీరాజా మాట్లాడుతూ– ‘‘నా గురించి శ్రీకాంత్ మాట పడుతున్నాడు.. నాకు సపోర్ట్ అందించేందుకు ఎస్వీ కృష్ణారెడ్డిలాంటి గొప్ప దర్శకుడు వచ్చారు. ‘మా’ ఎన్నికల టైమ్‌లో ఎవరూ టీవీల్లో మాట్లాడకూడదన్నది రూల్. కానీ సోదరుడు నరేశ్, బావ రాజశేఖర్, అక్క జీవితలు టీవీల్లో మాట్లాడుతూ మాపై బురద జల్లుతున్నారు. గత నెల 26న నా పుట్టినరోజున నన్ను ‘మా’ ఆఫీసులో వెయిట్ చేయించి, తను రాకుండా నరేశ్ అవమానించారు. పైగా ‘చూశావా.. నేను పగబడితే అంతే’ అంటూ ఫోనులో మరొకరితో చెప్పారు. ఇలా పగబట్టే వ్యక్తి అధ్యక్షుడిగా అవసరమా? ఆ టైమ్‌లో బాధపడ్డాను. ఇండస్ట్రీ వదిలి అరుణాచలం వెళ్లి సెటిల్ అయిపోదామనిపించింది. అవకాశాలు లేని 50 మంది చిన్న ఆర్టిస్టులకు 6నెలలకు సరిపడా వంట సరుకులు ఉచితంగా ఇచ్చేందుకు ఓ వ్యక్తి ముందుకొచ్చారు. ప్రస్తుతం ‘మా’ ఆధ్వర్యంలో 35మందికి నెలకి రూ.5000 ఇస్తున్నాం. దీన్ని ఈ దఫా నుంచి రూ.7500 ఇవ్వాలని నిర్ణయించాం’’ అన్నారు. ‘‘‘మా’ కి సొంత భవనంతో పాటు వృద్ధ కళాకారులకు ఓల్డేజ్ హోమ్(గోల్డేజ్ హామ్) నిర్మించాలనుకుంటున్నాడు. నా వంతుగా శివాజీకి సహాయ పడాలనే ఉపాధ్యక్షునిగా పోటీ చేస్తున్నా’’ అని డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి అన్నారు. ‘‘2.90కోట్ల రూపాయలున్న ‘మా’ సంక్షేమ నిధిని శివాజీ రాజా 5.70కోట్లకు పెంచారు. ఈ దఫా నా నామినేషన్‌ని సరైన కారణం లేకుండా తిరస్కరించారు. నేను ట్రెజరర్‌గా ఉండటం నరేశ్‌కి కూడా ఇష్టం లేదేమో?’’ అన్నారు పరుచూరి వెంకటేశ్వరరావు. ‘‘అధ్యక్షునిగా ఒక్కసారి అవకాశం ఇవ్వండి అంటున్న నరేశ్‌గారు ‘మా’ జనరల్ సెక్రటరీగా ఏ మాత్రం సేవ చేశారు?’’ అని ప్రశ్నించారు ‘థర్టీ ఇయర్స్’ పృథ్వీ. ‘‘మా’ కి సొంత భవనం, గోల్డేజ్ హోం పూర్తి కావాలంటే శివాజీ ప్యానల్‌ని Vð లిపించాలి’’ అన్నారు హీరో శ్రీకాంత్. -
సేవ చేస్తుంటే కామెంట్లు చేస్తున్నారు!
‘‘మా(మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) అధ్యక్షునిగా రెండేళ్లు పూర్తయింది. ఆర్టిస్టులంతా మరోసారి అధ్యక్షుడిగా ఉండాలని కోరారు. నేను ఉండను.. ఎవరైనా పోటీ చేయండి అని అన్నాను. కానీ ఈ ఒక్కసారికి చేయండి అంటూ ఆర్టిస్టులు అడిగారు’’ అని ‘మా’ అధ్యక్షుడు శివాజీరాజా అన్నారు. నేడు ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా సోమవారం ఆయన విలేకరులతో పంచుకున్న విశేషాలు... ► నాకు పుట్టినరోజులు చేసుకునే అలవాటు లేదు. 32ఏళ్ల కెరీర్లో పరిశ్రమలో ఇదే తొలిసారి. ఓసారి మిత్రుల కోసం బర్త్ డే పార్టీ ఇచ్చాను. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడే జరుపుకుంటున్నా. ► ‘మా’ అసోసియేషన్ సిల్వర్ జూబ్లీ సంవత్సరం ఇది. ఏ గొడవలు లేకుండా సంతోషంగా ముందుకు సాగాలి. కష్టాల్లో ఉన్నవారికి సాయపడే తత్వం నాది. ఈ రెండేళ్లలో రకరకాల సేవలు చేసాను. దానిపై కామెంట్లు చేయడం బాధ అనిపించింది. ఈసారి తనీష్, ఖయ్యూమ్ లాంటి యువకులు మా ప్యానెల్లో పోటీ చేస్తున్నారు. భవిష్యత్ తరం బావుండాలనే ప్రయత్నమిది. ► మూవీ ఆర్టిస్టుల సంఘం ఎన్నికల్లో ఎవరైనా పోటీకి దిగొచ్చు. ‘మీ అబ్బాయి హీరోగా కెరీర్ మొదలు పెట్టాడు.. హ్యాపీగా ఉండొచ్చు కదా? అంటే.. నా చుట్టూ ఉన్నవారికి మంచి చేసేందుకు ఇలా చేస్తున్నా. ► ఆర్టిస్టులకు గోల్డేజ్ హోమ్(ఓల్డేజ్ హోమ్) నిర్మాణం నా డ్రీమ్. ఈ హోమ్ నిర్మాణానికి హీరో, దర్శకుడు రంగనాథ్గారి మరణమే కారణం. ఆయన చివరి రోజుల గురించి అందరికీ తెలిసిందే. ఇందుకోసం ఓ ఎన్నారై ఆరు ఎకరాల భూమిని దానమిస్తానన్నారు. శంకర్పల్లి సమీపంలో పది ఎకరాలు ఇచ్చేందుకు వేరొక వ్యక్తి సిద్ధంగా ఉన్నారు. ఈ రెండిటిలో ఏదో ఒకటి ఫైనల్ చేయాల్సి ఉంది. ‘గోల్డేజ్ హోమ్’ కోసం ఇప్పటికే కొన్ని విరాళాలు అందాయి. -
తెలుగు వారికి ప్రాధాన్యం ఇవ్వండి
‘‘తెలుగు సినిమాలో తమిళ నటీనటులు ఉండొచ్చా? లేదా? అనేది ప్రస్తుతానికి అప్రస్తుతం. కానీ, ఉంటే అనువాద చిత్రం అనే భావన వస్తుంది. మన తెలుగు వాళ్లను మనం తీసుకుంటే ఇంకా బాగుంటుంది. హీరోయిన్స్ ఎలాగూ తప్పదు.. చిన్న చిన్న నటీనటులను కూడానా? మన వారికి ప్రాధాన్యం ఇవ్వండి. వాళ్లు కుదరకపోతేనే ఇతర భాషల వారిని తీసుకురండి’’ అని నటుడు, ‘మా’ అధ్యక్షుడు శివాజీరాజా అన్నారు. శ్రీనివాసరెడ్డి ముఖ్య పాత్రలో అమర్, ప్రదీప్వర్మ, ఉదయ్, అభి, సి.టి., ఖాదర్, లక్ష్మి, శృతి, కావ్య, దేవి, వీణ, జాస్మిన్ ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘చెడ్డీ గ్యాంగ్’. కనగాల రమేష్ చౌదరి దర్శకత్వం వహించారు. రాజ్ ప్రొడక్షన్స్ ఇంటర్నేషనల్ పతాకంపై విక్కీరాజ్ నిర్మించిన ఈ సినిమా టీజర్‌ని హైదరాబాద్‌లో విడుదల చేశారు. రమేష్ చౌదరి మాట్లాడుతూ– ‘‘30ఏళ్లుగా అసిస్టెంట్ డైరెక్టర్‌గా, కో– డైరెక్టర్‌గా పని చేస్తున్న నేను ‘చెడ్డీ గ్యాంగ్’ సినిమాతో దర్శకుడిగా మారాను. పదిమంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు కేరళ అడవులకు టూర్‌కు వెళతారు. అక్కడి కోయవారి నిబంధనలను అతిక్రమించి ఓ సమస్యలో ఇరుక్కుంటారు. ఆ తర్వాత వాళ్లు ఎలా బయటపడ్డారనేదే ఈ చిత్ర కథాంశం’’ అన్నారు. ‘‘మలేషియాలో తెరకెక్కించిన క్లైమాక్స్ సినిమాకు హైలైట్‌గా నిలుస్తుంది. బాలీవుడ్ బ్యూటీ స్నేహా కపూర్ చేసిన ఐటమ్ సాంగ్ యువతను ఆకట్టుకుంటుంది’’ అని విక్కీరాజ్ అన్నారు. సెన్సార్ సభ్యులు ఎంఎస్ రెడ్డి, పాటల రచయిత లక్ష్మణ్, పద్మాలయ మల్లయ్య పాల్గొన్నారు. -
‘వైజాగ్’ ప్రసాద్ ఇకలేరు
ప్రముఖ నటుడు ‘వైజాగ్’ ప్రసాద్(75) ఇకలేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం గుండెపోటుతో మృతిచెందారు. తెల్లవారుజామున బాత్రూంకు వెళ్లిన ఆయన అక్కడే పడిపోవడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. అయితే.. అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ప్రసాద్ స్వస్థలం విశాఖపట్నంలోని గోపాలపురం. ఆయన అసలు పేరు కొర్లాం పార్వతీ వరప్రసాదరావు. కళా రంగంలో ‘వైజాగ్’ ప్రసాద్‌గా స్థిరపడ్డారు. 1963లో నాటక రంగంలోకి ప్రవేశించిన ఆయన ‘అప్పు పత్రం, భలే పెళ్లి, భజంత్రీలు, కాల ధర్మం, ఆకలి రాజ్యం, హెచ్చరిక, వేట కుక్కలు, కాలకూటం, ఋత్విక్, గరీబీ హఠావో’ లాంటి నాటికలతో ప్రేక్షకులను అలరించారు. సుమారు 700 నాటికల్లో నటించిన ఆయన 1983లో ‘బాబాయ్ అబ్బాయ్’ చిత్రం ద్వారా సినీ రంగంలోకి ప్రవేశించారు. ‘నువ్వు నేను, భద్ర, జై చిరంజీవా, గౌరి, నీరాజనం, జెమిని, అల్లరి బుల్లోడు, సుందరకాండ, రాణిగారి బంగ్లా, శివరామ రాజు’ తదితర చిత్రాల్లో ఆయన నటించారు. ప్రసాద్‌కి కుమార్తె రత్నప్రభ, కుమారుడు రత్నకుమార్ ఉన్నారు. విషయం తెలుసుకున్న వారు అమెరికా నుంచి హుటాహుటిన హైదరాబాద్‌కి బయలుదేరారు. ‘వైజాగ్’ ప్రసాద్ మృతికి ‘మా’ అధ్యక్షులు శివాజీరాజా, జనరల్ సెక్రటరీ డా. నరేష్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. -
‘మా’ సమస్య పరిష్కారమైంది
‘మా’ (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ) సిల్వర్ జూబ్లీ వేడుకల్లో నిధులు దుర్వినియోగం అయ్యాయంటూ ‘మా’ జనరల్ సెక్రటరీ నరేశ్ ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘మా’ అధ్యక్షుడు శివాజీరాజా, నరేశ్ మధ్య వాగ్వివాదాలు జరిగాయి. ఈ వివాదం త్వరగానే సద్దుమణిగింది. ఇండస్ట్రీ ప్రముఖులం ‘తెలుగు ఇండస్ట్రీ కలెక్టీవ్ కమిటీ’ ఏర్పరచుకొని, జరిగిన సమస్యను పరిష్కరించుకున్నాం అంటూ శనివారం ప్రెస్మీట్లో వెల్లడించారు. ఈ సందర్భంగా నిర్మాత సురేశ్‌బాబు మాట్లాడుతూ – ‘‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్, ఫెడరేషన్, ఫిల్మ్ చాంబర్, కౌన్సిల్ మరికొన్ని.. వాటిన్నింటిని కలిపితేనే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. ఇటీవల మా మధ్యలో కొన్ని మనస్పర్థలు వచ్చాయి. దాని కోసం అందరం కలసి ఓ సపరేట్ బాడీ ఏర్పర్చుకున్నాం. ఏదైనా ఇష్యూ ఉంటే ముందు మాలో మేం మాట్లాడుకోవాలని నిర్ణయించుకున్నాం. ఆ ఇష్యూ జరిగినట్టు ఇంకోసారి జరగకూడదని భావించాం. ‘మా’కి రావాల్సిన డబ్బులన్నీ వచ్చేశాయి. అందులో ఎటువంటి అవకతవకలు జరగలేదు. వాళ్లు సైన్ చేసుకున్న అగ్రిమెంట్స్ అన్నీ క్లియర్‌గా ఉన్నాయి. అగ్రిమెంట్లో లేని చాలా విషయాలు ఇండస్ట్రీ చేతుల్లో ఉండవు. థర్డ్ పార్టీ వాళ్ళ వల్ల ఏర్పడే వాటిని మేం సెటిల్ చేయలేం కదా? దాని వల్ల మాకు ఎటువంటి లాస్ రాలేదు’’ అన్నారు. తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ – ‘‘ఇటీవలే ‘తెలుగు ఇండస్ట్రీ కలెక్టీవ్ కమిటీ’ అని పెట్టుకున్నాం. ఏదైనా సమస్యలు వస్తే పరిష్కరించుకోవాలి అనుకుంటూ వస్తున్నాం. అనుకోకుండా చిన్న సమస్య ఏర్పడింది. అది పరిష్కరించాం. ఇక నుంచి కూడా హెల్తీగానే జరుగుతుంది, జరగాలి కూడా. సినిమాకు సంబంధించిన ఏ విషయమైనా కలెక్టివ్ కమిటీనే చూస్తుంది. సాల్వ్ చేస్తుంది. ప్యూచర్లో చేసే ఈవెంట్స్ కూడా ఇది వరకులానే మాములుగానే చేస్తారు’’ అన్నారు. ‘మా’ జనరల్ సెక్రటరీ నరేశ్ మాట్లాడుతూ – ‘‘ఫిల్మ్ ఇండస్ట్రీ సెలబ్రిటీలకు, సామాన్యులకు డైరెక్ట్‌గా కనెక్ట్ అయి ఉంది. ఇందులో కొన్ని వెల్ఫేర్ కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. కొన్నిసార్లు అభిప్రాయభేదాలు రావడం సహజం. మనుషులు కలసి పని చేసేది కాబట్టి. టీఎఫ్ఐ కమిటీ ఏర్పాటు చేసి పెద్దలను కూర్చోబెట్టి వాళ్ళకు మా సమస్యలను వివరించి, చర్చించుకున్నాం. ఇండస్ట్రీ ఇంకా బెటర్ అవ్వడానికి ఈ కమిటీ ఏర్పాటు చేసుకున్నాం. గతం గతః. రానున్న రోజుల్లో సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ బాగా చేయడమే మా లక్ష్యం. త్వరలో మహేశ్‌బాబు ప్రోగ్రామ్ కూడా ఉంది. ఇవన్నీ సక్సెస్ చేస్తాం. దానికి పూర్తి సపోర్ట్ చేస్తాం. ఇక నుంచి అన్ని కార్యక్రమాలు పారదర్శకంగా 100శాతం సక్సెస్ చేస్తాం. ఒకటో తారీఖు నుంచి జనరల్ సెక్రటరీగా పూర్తి బాధ్యతలు తీసుకుంటున్నాను’’ అన్నారు. ‘‘టీఎఫ్‌సీసీ నిర్ణయమే మా అందరి నిర్ణయం. చిన్న చిన్న మనస్పర్థలు ఉన్నాయి. అన్ని ఫైల్స్‌నీ పెద్దల చేతుల్లో పెట్టాం. ఈ పెద్దలంతా మా ఇద్దరికీ చుట్టాలు కాదు. మొత్తం చూసి ఇందులో ఎటువంటి తప్పు జరగలేదని చెప్పారు. ఇకముందు మహేశ్‌బాబు, ప్రభాస్ ప్రోగ్రామ్‌లను కలసి కట్టుగా చేస్తాం. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ని ఉన్నత స్థితిలో నిలబెట్టడమే మా లక్ష్యం’’ అని ‘మా’ అధ్యక్షుడు శివాజీ రాజా అన్నారు. ఈ కార్యక్రమంలో పి.కిరణ్, డా. కె.ఎల్. నారాయణ తదితరులు పాల్గొన్నారు. -
‘మా’ డబ్బుతో టీ కూడా తాగలేదు
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌లో(మా) మరో వివాదం తలెత్తింది. ‘మా’ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో నిధులు దుర్వినియోగం అయ్యాయని ఆరోపణలు రావడం ఇండస్ట్రీలో హాట్‌టాపిక్ అయింది. దీనిపై స్పందించిన ‘మా’ కార్యవర్గం సోమవారం ఫిల్మ్‌ఛాంబర్‌లో సమావేశమై చర్చించింది. సమావేశం అనంతరం ‘మా’ అధ్యక్షుడు శివాజీరాజా విలేకరులతో మాట్లాడుతూ –‘‘మా’ నిధులు దుర్వినియోగం అయ్యాయనే వార్తల్లో నిజం లేదు. అసోసియేషన్ డబ్బుతో నేను ఇప్పటి వరకూ టీ కూడా తాగలేదు. ఫోన్ కూడా సొంతదే వాడుతున్నా. నా పిల్లల మీద ఒట్టు.. నేను తప్పు చేశానని, డబ్బులు తిన్నానని.. కనీసం 5పైసలు దుర్వినియోగమైనట్లు నిరూపిస్తే పెద్దమ్మ తల్లి సాక్షిగా గుండు చేయించుకుని, నా ఆస్తి మొత్తం ‘మా’కు రాసిస్తా. అంతేకాదు.. ‘మా’ సభ్యత్వం శాశ్వతంగా రద్దు చేసుకుంటా. సిల్వర్ జూబ్లీ వేడుకలకు ఒప్పందం ప్రకారమే డబ్బు వసూలైంది. త్వరలో ‘మా’ ఎన్నికలు సమీపిస్తున్నందున కొంతమంది తాము చేసే ప్రతి పనిని తప్పుబడుతూ ఆరోపణలు చేస్తున్నారు. ‘మా’లో సభ్యుల మధ్య ఎలాంటి విభేదాలు లేవు’’ అన్నారు. ‘మా’ కార్యవర్గ సభ్యుడు, హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ– ‘‘తనపై ఆరోపణలు నిరూపిస్తే మా అసోసియేషన్ నుంచి శాశ్వతంగా తప్పుకుంటా. మా సిల్వర్ జూబ్లీ ఇయర్ సందర్భంగా నూతన బిల్డింగ్ కట్టబోతున్నాం. దీని కోసం చిరంజీవిగారిని కలిస్తే రెండు కోట్లు డొనేషన్ ఇస్తానని చెప్పి, ఇప్పటికే కోటి రూపాయలు ఇచ్చారు. ఫండ్స్ కోసం అమెరికాలో ప్రోగ్రాం చేయడంతో చిరంజీవిగారు ముఖ్య అతిథిగా వచ్చారు. తర్వాత హీరోలు మహేశ్‌బాబు, ప్రభాస్ కూడా వస్తారు’’ అన్నారు. ‘‘మా’ అసోసియేషన్‌లో ప్రస్తుతం రూ.5 కోట్ల వరకు డబ్బులున్నాయి’’ అని ‘మా’ కోశాధికారి, రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు చెప్పారు. నన్ను దూరం పెట్టారు ‘మా’ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో నిధులు దుర్వినియోగం ఆరోపణలపై ‘మా’ జనరల్ సెక్రటరీ, నటుడు నరేశ్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన ఫిల్మ్‌ఛాంబర్‌లో విలేకరులతో మాట్లాడుతూ– ‘‘మా’ అధ్యక్షుడు శివాజీరాజా బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించడం వల్లే ఈ పరిస్థితి వచ్చింది. తనపై వచ్చిన ఆరోపణలకు శివాజీరాజా సమాధానం చెప్పాల్సిందే. విదేశీ కార్యక్రమాల గురించి తను ఎటువంటి వివరాలు నాకు చెప్పలేదు. అమెరికా ఈవెంట్ కోసం శివాజీరాజాతో సహా మరికొందరు బిజినెస్ క్లాస్‌లో 3 లక్షలు చెల్లించి మరీ ప్రయాణం చేసిన డబ్బంతా ఎవరిది? మహేశ్‌బాబు ప్రోగ్రాం కోసం శివాజీరాజాను నమ్రత దగ్గరకు నేనే తీసుకువెళ్లా. ఆ తర్వాత వేరే వాళ్ల నుంచి నాకు కాల్స్ వచ్చాయని నమ్రత నాకు చెప్పారు. ఈ ప్రయత్నాలు నన్ను తప్పించడానికే. వచ్చే ‘మా’ ఎన్నికల్లో పోటీచేయదలచుకోవడం లేదు. ఏప్రిల్ నుంచి నా కాల్స్‌కి శివాజీరాజా స్పందించటం లేదు. నిధుల దుర్వినియోగం వివాదంపై రిటైర్డ్ ఐపీఎస్ అధికారితో హైపవర్ నిజనిర్ధాణ కమిటీ వేద్దామంటే శివాజీరాజా అంగీకరించడం లేదు. ఈ విషయాన్ని చిరంజీవిగారి దృష్టికి కూడా తీసుకువెళ్లాను’’ అన్నారు. -
‘మా’ నిధుల గోల్‌మాల్‌పై నరేశ్ ఆగ్రహం
-
‘మా’ నిధుల గోల్‌మాల్‌పై నరేశ్ ఫైర్
సాక్షి, హైదరాబాద్ : మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) సిల్వర్ జూబ్లీ వేడుకల్లో నిధుల దుర్వినియోగం ఆరోపణలపై మా జనరల్ సెక్రటరీ, సీనియర్ నటుడు నరేశ్ స్పందించారు. ‘మా’ లో నిధుల దుర్వినియోగం జరిగింది వాస్తమేనన్నారు. ‘మా’ అధ్యక్షుడు శివాజీరాజా బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించినందు వల్లే ఇటువంటి పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు. తనపై వచ్చిన ఆరోపణలకు శివాజీరాజా సమాధానం చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. తాను ఎవరిపై ఫిర్యాదు చేయాలనుకోవడం లేదని.. కానీ ధర్మం కోసం పోరాడక తప్పదని పేర్కొన్నారు. ‘మా’ అధ్యక్షుడు ప్రవర్తిసున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన నరేశ్.. తాను అన్ని ఆధారాలతోనే మాట్లాడుతున్నానని తెలిపారు. నిజనిర్ధారణ కమిటీకి అంగీకరించడం లేదు.. ‘మా’ జనరల్ సెక్రటరీ హోదాలో ఉన్న తనకు శివాజీరాజా ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదని నరేశ్ ఆరోపించారు. ఏప్రిల్ నుంచి శివాజీరాజా తన ఫోన్ కట్ చేసాడంటూ... ఆయనకు సంబంధించిన కాల్, మెసేజ్ డాటాను బయటపెట్టారు. నిజాలు నిర్భయంగా మాట్లాడుతాను కాబట్టే తనను దూరం పెడుతున్నారని ఆరోపించారు. మాలో చోటుచేసుకున్న ఈ వివాదంపై రిటైర్డ్ ఐపీఎస్ అధికారితో నిజనిర్ధాణ కమిటీ వేయాలని తాను చెప్పానని.. అయితే శివాజీరాజా మాత్రం అందుకు అంగీకరించడం లేదని తెలిపారు. ఈ విషయాన్ని చిరంజీవి దృష్టికి కూడా తీసుకువెళ్లానన్నారు. మూడు లక్షలు ఖర్చు చేసి... విదేశీ కార్యక్రమాల గురించి శివాజీరాజా తనకు ఎటువంటి వివరాలు చెప్పలేదని నరేశ్ ఆరోపించారు. అమెరికా ఈవెంట్ కోసం శివాజీరాజాతో సహా మరికొందరు బిజినెస్ క్లాస్‌లో 3 లక్షలు చెల్లించి మరీ ప్రయాణం చేశారని.. ఆ డబ్బంతా ఎవరిదంటూ ప్రశ్నించారు. తప్పు జరిగినందువల్లే తాను ఫారిన్ టూర్లకు వెళ్లడం లేదని ఆయన పేర్కొన్నారు. మా తరపున క్రికెట్ మ్యాచ్ నిర్వహించిన విషయం కూడా తనకు తెలియదని వాపోయారు. సెక్రటరీగా ఉన్న తనకు అసలు ఎటువంటి విలువ ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నమ్రత నాకు కాల్ చేశారు.. మా మీటింగ్ లో జరిగే ప్రతి మాట రికార్డ్ అవుతుందని చెప్పారు.. కానీ సంవత్సరం నుంచి రికార్డులు అన్ని తీసివేశారని నరేశ్ ఆరోపించారు. మహేష్ బాబు ప్రోగ్రాం కోసం తానే శివాజీరాజాను నమ్రత దగ్గరకు తీసుకు వెళ్ళానని నరేశ్ అన్నారు. తాను అడిగినందువల్లే ఆ ప్రోగ్రాం ఫిక్స్ అయిందని పేర్కొన్నారు. కానీ ఆ తరువాత నుంచి వేరే వాళ్ల నుంచి నమ్రతకు కాల్స్ వస్తోంటే.. నమ్రత తనకు కాల్ చేశారని నరేశ్ పేర్కొన్నారు. ఈ విషయాలన్నీ గమనిస్తుంటే తనను కావాలనే తప్పించడానికి చేసిన ప్రయత్నంగా అనిపించిందని నరేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తాను మనస్తాపం చెందానని... వచ్చే ఎన్నికల్లో పోటీచేయదలచుకోవడం లేదని వ్యాఖ్యానించారు. -
మా నుంచి శాశ్వతంగా తప్పుకుంటా
-
నిరూపిస్తే ఆస్తి మొత్తం రాసిస్తా : శివాజీ రాజా
సాక్షి, హైదరాబాద్: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా)లో వివాదం నెలకొంది. సిల్వర్ జూబ్లీ వేడుకల్లో నిధులు దుర్వినియోగం అయ్యాయని ఆరోపణలు రావడంతో మా కార్యవర్గం స్పందించింది. సోమవారం సమావేశమైన సభ్యులు అనంతరం మీడియాతో మాట్లాడారు. మా అధ్యక్షుడు శివాజీ రాజా మాట్లాడుతూ.. మా అసోసియేషన్ డబ్బులతో ఇప్పటి వరకు టీ కూడా తాగలేదని, ఫోన్ కూడా సొంతదే వాడుతున్నానని తెలిపారు. ‘నా పిల్లల మీద ఒట్టు..నేను తప్పు చేశానని, డబ్బులు తిన్నానని నిరూపిస్తే నా ఆస్తి మొత్తం ‘మా’కు రాసిస్తాను.’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ‘మా’ ఎన్నికల కోసం కొంతమంది ఎదురు చూస్తున్నారని, వాళ్లు తాము చేసే ప్రతి పనిని తప్పుబట్టడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. ‘మా’లో సభ్యుల మధ్య ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. మా నుంచి శాశ్వతంగా తప్పుకుంటా: హీరో శ్రీకాంత్ తనపై ఆరోపణలు నిరూపిస్తే మా అసోసియేషన్ నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని హీరో శ్రీకాంత్ అన్నారు. మా అసోసియేషన్ జూబ్లీ ఇయర్ సందర్భంగా నూతన బిల్డింగ్ కట్టబోతున్నామని తెలిపారు. దీని కోసం మెగాస్టార్ చిరంజీవిని కలిసామని ఆయన రెండు కోట్ల డొనేషన్ ఇస్తానని, ఇప్పటికే కోటి రూపాయలు ఇచ్చారని చెప్పారు. ఫండ్స్ కోసం అమెరికాలో ప్రోగ్రాం చేసామని, చిరంజీవి ఛీప్ గెస్ట్‌గా వచ్చారని తెలిపారు. తరువాత స్టార్ హీరోలు మహేశ్ బాబు, ప్రభాస్‌లు వస్తారని చెప్పారు. సైరా షూటింగ్ వల్ల ఒక్క ప్రొగ్రామ్‌కే చిరంజీవిగారు వచ్చారని, దీంతో కోటిరూపాయలు వచ్చాయన్నారు. అగ్రిమెంట్ ప్రకారం కోటి రూపాయలే ఇస్తామన్నారని, ఈవెంట్ మేనేజర్లకు ఎక్కువ వస్తే తమేం చేస్తామని ప్రశ్నించారు. చిరంజీవి స్టామినాను ఎవరు తక్కువ చేయలేరని, ఆయన అమెరికాలో ఈవెంట్స్‌కు రారని ప్రచారం చేశారన్నారు. మా అసోసియేషన్ అకౌంట్స్ అన్ని క్లియర్ గా ఉన్నాయని స్పష్టం చేశారు. తన మీద చేసిన ఆరోపణలు నిరూపించాలని శ్రీకాంత్ సవాల్ విసిరారు. మా అసోసియేషన్‌లో ప్రస్తుతం రూ.5 కోట్ల వరకు డబ్బులున్నాయని పరుచూరి వెంకటేశ్వరావు తెలిపారు. -
ప్రతిదీ న్యూసే!
మనిషి చావు, జ్ఞాపకం, ప్రేమ, స్నేహం... ఇలా చేయాలనుకుంటే ప్రతిదీ న్యూసే. కానీ ఆ న్యూస్‌ను క్యాష్ చేసుకోవాలనుకుంటాడు ఓ యువకుడు. అవసరమైతే న్యూస్‌ను క్రియేట్ చేసేందుకు సిద్ధం అవుతాడు. ఈ ప్రయాణంలో అతను ఎదుర్కొన్న సవాళ్ల నేపథ్యంలో రూపొందిన సినిమా ‘ఇదం జగత్’. అనిల్ శ్రీ కంఠ దర్శకత్వంలో సుమంత్ కథానాయకుడిగా నటించారు. అంజు కురియన్ కథానాయిక. శివాజీ రాజా, సత్య, ఆదిత్యా మీనన్ కీలక పాత్రల్లో నటించారు. జొన్నలగడ్డ పద్మావతి, గంగపట్నం శ్రీధర్‌లు నిర్మించిన ఈ సినిమాను ఈ నెల 28న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ‘‘ఇటీవల రిలీజ్ చేసిన టీజర్‌కు మంచి స్పందన లభిస్తోంది. నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో సుమంత్ కనిపిస్తారు. ఆయన పాత్ర సినిమాకు హైలైట్‌గా ఉంటుంది. కథకు ‘ఇదం జగత్’ టైటిల్ బాగా యాప్ట్ అవుతుంది. పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందన్న నమ్మకం ఉంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సహనిర్మాత: మురళీకృష్ణ దబ్బుగుడి, సంగీతం: శ్రీచరణ్ పాకాల. -
మేము సైతం
కేరళలో వరదల తాకిడికి జనజీవనం అస్తవ్యస్తమైన సంగతి తెలిసిందే. ఈ ప్రకృతి విపత్తు వల్ల కుదేలైన కేరళ రాష్ట్రాన్ని ఆదుకునేందుకు పలువురు సినీ ప్రముఖులు విరాళాలు అందజేస్తున్నారు. కేరళ సాయానికి సంబంధించి శనివారం సాయంత్రం మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ సమావేశం నిర్వహించింది. కేరళ ప్రజలకు తమ వంతు సాయంగా 10లక్షల రూపాయలను విరాళంగా ఇవ్వాలని నిర్ణయించినట్లు ‘మా’ అధ్యక్షుడు శివాజీరాజా తెలిపారు. ‘‘హీరోల మద్దతు లేకుండా ఏమీ చేయలేం. ‘మా’కు హీరోలే వెన్నెముక. చిరంజీవి కుటుంబం స్పందించడం ఆనందంగా ఉంది’’ అని శివాజీరాజా, రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు అన్నారు. చిరంజీవి కుటుంబం దాదాపు 61 లక్షల (చిరంజీవి 25, రామ్‌చరణ్ 25, చిరంజీవి తల్లి అంజనాదేవి లక్ష, రామ్‌చరణ్ సతీమణి ఉపాసన పదిలక్షల రూపాయల మందులు) రూపాయలను కేరళకు సాయంగా ప్రకటించినట్లుగా పేర్కొంది. కేరళకు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ‘మేము సైతం’ అంటూ బాగా సహాయం అందుతోందని చెప్పొచ్చు. మహేశ్‌బాబు 25 లక్షలు, అల్లు అర్జున్ 25లక్షలు, సూర్య–కార్తీ 25 లక్షలు, నయనతార 10 లక్షలు, రామ్ 5 లక్షలు, విజయ్ దేవరకొండ 5లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చారు. వీరితో పాటు మరి కొంతమంది సినీ ప్రముఖులు విరాళాలు అందజేయడం జరుగుతూనే ఉంది. -
సస్పెన్స్.. థ్రిల్
కృష్ణసాయి, జహీదా శామ్ జంటగా పి.ఎస్. నారాయణ దర్శకత్వంలో ఎం.ఎస్.కె ప్రమిదశ్రీ ఫిలింస్ బ్యానర్‌పై ఎం.ఎస్.కె.రాజు నిర్మిస్తున్న ‘వీడు అసాధ్యుడు’ చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి నిర్మాత సీతారామరాజు కెమెరా సిచ్చాన్ చేయగా, నటుడు శివాజీ రాజా క్లాప్ ఇచ్చారు. నటుడు శివకృష్ణ గౌరవ దర్శకత్వం వహించారు. పి.ఎస్.నారాయణ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాకు హీరో, నిర్మాత ఎం.ఎస్.కె.రాజుగారే. హీరోగా కృష్ణసాయి అని స్క్రీన్ నేమ్ పెట్టుకున్నారు. క్రిమినల్ లాయర్‌గా పనిచేసే ఆయన సినిమా నిర్మించాలనే ఆకాంక్షతో ఈ రంగంలోకి అడుగుపెట్టారు’’ అన్నారు. ‘‘సినిమాపై ప్యాషన్‌తో ఈ రంగంలోకి వచ్చాను. సామాజిక స్పృహ ఉన్న సస్పెన్స్ థ్రిల్లర్ ఇది. మంచి కంటెంట్‌తో కమర్షియల్ కథాంశంతో తెరకెక్కిస్తున్నాం’’ అన్నారు ఎం.ఎస్.కె.రాజు. ‘‘మంచి పాత్ర చేసే అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థ్యాంక్స్’’ అన్నారు జహీదా శామ్. ఈ చిత్రానికి çశంభుప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ∙కృష్ణ సాయి, జహీదా శామ్ -
సుమంత్‌కి మరోవైపు...
సుమంత్ సాఫ్ట్ హీరో. ఇప్పటివరకూ చేసిన క్యారెక్టర్స్ సుమంత్‌కి అలాంటి ఇమేజ్‌నే తెచ్చాయి. ఇప్పుడు తనలో మరో కోణం చూపించడానికి రెడీ అయ్యారు. సుమంత్‌ని నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్లో మనం చూడబోతున్నాం. విరాట్ ఫిల్మ్స్ అండ్ శ్రీ విఘ్నేష్ కార్తీక్ సినిమాస్ పతాకాలపై అనిల్ శ్రీ కంఠం దర్శకత్వంలో సుమంత్ హీరోగా ‘ఇదం జగత్’ పేరుతో ఓ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. జొన్నలగడ్డ పద్మావతి, గంగపట్నం శ్రీధర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సుమంత్ నెగటివ్ షేడ్ రోల్లో కనిపించనున్నారు. చిత్రనిర్మాతలు మాట్లాడుతూ – ‘‘ఇప్పటివరకూ తన కెరీర్లో చేయనటువంటి వైవిధ్యమైన పాత్రలో సుమంత్ కనిపించనున్నారు. ఎవరూ ఊహించని విధంగా ఈ పాత్ర ఉంటుంది. ఆడియన్స్ కచ్చితంగా థ్రిల్ అవుతారు. సుమంత్ క్యారెక్టర్ సినిమాకి హైలైట్‌గా నిలుస్తుంది. నిర్మాణానంతర కార్యక్రమాలు తుది దశకు చేరుకున్నాయి. ఆగస్ట్ ద్వితీయార్థంలో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. అంజు కురియన్ కథానాయికగా పరిచయం కానున్న ఈ చిత్రంలో శివాజీ రాజా, ‘ఛలో’ ఫేమ్ సత్య, ఆదిత్యా మీనన్, కల్యాణ్, షఫీ తదితరులు ఇతర పాత్రలు చేశారు. ఈ చిత్రానికి సంగీతం: శ్రీచరణ్ పాకాల, కెమెరా: బాల్‌రెడ్డి, ఎడిటింగ్: గ్యారీ బీహెచ్, కో–ప్రొడ్యూసర్: మురళీకృష్ణ దబ్బుగుడి. -
నాన్న గర్వపడేలా చేస్తా
‘‘మా అబ్బాయి సత్యానంద్‌గారి వద్ద యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్‌లో శిక్షణ తీసుకున్నాడు. నేనున్న ఫీల్డ్‌లోకే తను కూడా రావడం హ్యాపీ’’ అని నటుడు, ‘మా’ అధ్యక్షుడు శివాజీరాజా అన్నారు. ఆయన తనయుడు విజయ్ రాజా హీరోగా పరిచయమవుతోన్న చిత్రం ‘ఏదైనా జరగొచ్చు’. కె.రమాకాంత్ దర్శకత్వంలో వెట్ బ్రెయిన్ ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తోన్న ఈ చిత్రం బుధవారం ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి డైరెక్టర్ రవిరాజా పినిశెట్టి కెమెరా స్విచ్చాన్ చేయగా, దర్శకుడు కె.రాఘవేంద్రరావు క్లాప్ ఇచ్చారు. మరో డైరెక్టర్ హరీష్ శంకర్ గౌరవ దర్శకత్వం వహించారు. శివాజీరాజా మాట్లాడుతూ– ‘‘విజయ్ నన్ను సలహా అడిగినప్పుడు ‘నీకు ఎలా అనిపిస్తే అలా చెయ్.. చిరంజీవిగారిలా కష్టపడు. ఆయనలా సేవాగుణం కలిగి ఉండు’ అని చెప్పా. 32 ఏళ్లుగా నన్ను ఆదరిస్తున్న ప్రేక్షకులు మా అబ్బాయ విజయ్‌ని కూడా అదరించాలని కోరుకుంటున్నా’’ అన్నారు. ‘‘చంద్రశేఖర్ ఏలేటిగారి వద్ద దర్శకత్వ శాఖలో పని చేశాను. ఆ అనుభవంతో ఈ సినిమా డైరెక్షన్ చేస్తున్నా. హారర్ జానర్లో సాగే కామెడీ థ్రిల్లర్ ఇది’’ అన్నారు కె. రమాకాంత్. ‘‘నేను హీరో అవడానికి అమ్మానాన్నల సపోర్ట్‌తో పాటు మా మామయ్య సపోర్ట్ ఉంది. నాన్న గర్వపడేలా చేస్తానన్న నమ్మకంతో హీరోగా తొలి అడుగు వేస్తున్నా’’ అన్నారు విజయ్ రాజా. రచయితలు పరుచూరి బ్రదర్స్, డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి, నిర్మాత కె.అచ్చిరెడ్డి, చిత్ర ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ విజయ్ ప్రకాష్ అన్నంరెడ్డి, హీరోలు శ్రీకాంత్ , తరుణ్ పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: శ్రీకాంత్ పెండ్యాల. -
సినిమాలంటే అంత పిచ్చి
మహాదేవ్ హీరోగా, మమతా సాహాస్, సునైన హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘నివురు’. ఋషికృష్ణ దర్శకత్వంలో అభిరామ్ నిర్మించిన ఈ సినిమా టైటిల్ లోగోని ‘మా’ అసోసియేషన్ అధ్యక్షుడు శివాజీరాజా విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ –‘‘హీరో మహాదేవ్ చిన్నప్పటి నుంచి అందరి హీరోల పేర్లను పచ్చబొట్టు పొడిపించుకున్నాడు. అతనికి సినిమాలంటే అంత పిచ్చి. సంగీతం, ఛాయాగ్రహణం అద్భుతంగా ఉన్నాయి. ఈ చిత్రం హిట్ అవ్వాలి’’ అన్నారు. ‘‘నాకు చిన్నప్పటి నుంచి సినిమా తప్ప వేరే ప్రపంచం తెలియదు. చదువు పెద్దగా అబ్బకపోయినా, సినిమా మీద ప్యాషన్‌తో ఎన్నో కష్టాలకోర్చి ఈ చిత్రాన్ని తెరకెక్కించాం’’ అన్నారు మహాదేవ్. ‘‘మా ఇల్లు అమ్ముకుని, ఆటో తోలుకుంటూ ఈ సినిమా రూపొందించాం. ఈ చిత్రం హిట్ అయ్యి, మా కష్టానికి తగ్గ ప్రతిఫలం రావాలి’’ అన్నారు అభిరామ్. రైటర్ డైమండ్ రత్నబాబు, నటుడు కాశీ విశ్వనాధ్, సంగీత దర్శకుడు యం.ఎల్. రాజా పాల్గొన్నారు. -
ప్రత్యేకహోదాకి ‘మా’ మద్దతు
ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేకహోదా సాధన కోసం చేస్తున్న ఉద్యమానికి ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’(మా) మద్దతు ప్రకటించింది. ఈ మేరకు ‘మా’ అధ్యక్షుడు శివాజీరాజా, కార్యవర్గ సభ్యులు ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలోని తెలుగు ప్రజలందరూ బాగుంటేనే తెలుగు చిత్రపరిశ్రమ బాగుంటుంది. ఏపీకి ప్రత్యేకహోదా సాధన మహోద్యమంలో ‘మా’ కూడా భాగస్వామ్యం అవుతుంది. ప్రత్యేకహోదా ఆంధ్రుల హక్కు. దాన్ని సాధించే వరకూ ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ప్రభుత్వం, ఉద్యమకారులకు పార్టీలకు అతీతంగా వెన్నుదన్నుగా ఉంటూ అండదండలు అందిస్తాం’’ అని ‘మా’ పేర్కొంది. -
హోదా ఉద్యమానికి ‘మా’ మద్దతు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, విభజన హామీల సాధనకు పోరాటం ఉద్ధృతమవుతోంది. ఇప్పటికే వివిధ పద్ధతుల్లో నిరసనలతో కేంద్రంపై ఒత్తిడిని పెంచేందుకు అనేక కార్యక్రమాలు రూపొందించిన ప్రత్యేక హోదా సాధన సమితి తాజాగా సినీ పరిశ్రమ మద్దతు కోరింది. ఆదివారం మూవీ ఆర్టిర్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు, సభ్యులను హోదా సాధన సమితి ప్రతినిధులు కలిశారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితిని వారికి వివరించారు. ఈ సమావేశం అనంతరం ప్రత్యేక హోదా ఉద్యమానికి ‘మా’ సంఘీభావం తెలిపిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ తెలిపారు. -
ఉగాది ముందే వచ్చినట్లుంది – శివాజీరాజా
రచన స్మిత్ ప్రధాన పాత్రలో ఆర్కే ఫిలింస్ పతాకంపై ప్రతాని రామకృష్ణగౌడ్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న సినిమా ‘మహిళ కబడ్డి’. రీసెంట్గా మూడో షెడ్యూల్ కంప్లీటైంది. ఈ చిత్రం కోసం ఉగాది పండగపై పాటను సంగీత దర్శకుడు బోలే షావళి çస్వరపరిచారు. ఈ పాటను ఉగాది పండగ సందర్భంగా ఆవిష్కరించారు. ‘‘ఆర్కే ఫిలింస్ నా సొంత బ్యానర్ లాంటింది. నా కెరీర్ ప్రారంభ దశలో ఈ బ్యానర్లోనే నటించాను. ఉగాది పండగపై చేసిన పాటను లాంచ్ చేయడం ఆనందంగా ఉంది. బోలే షావళి అద్భుతంగా కంపోజ్ చేయగా, సింగర్ వరం బాగా పాడారు. ఈ పాటతో ఉగాది ముందే వచ్చినట్లు అనిపిస్తోంది’’ అన్నారు శివాజీరాజా. ‘‘మహిళలు ఎందులోనూ తక్కవ కాదనే కాన్సెప్ట్‌తో రూపొందిస్తున్న చిత్రమిది. ఒక పల్లెటూరి అమ్మాయి భారతదేశం గర్వపడే స్థాయికి ఎలా ఎదిగింది? అన్నదే కథ’ అన్నారు ప్రతాని రామకృష్ణగౌడ్. ముత్యాల రాందాస్, ఏడిద శ్రీరామ్, సింగర్ వరం, బోలే షావళి పాల్గొన్నారు. -
నీతోనే హాయ్
అరుణ్ తేజ్, ఛరిష్మా శ్రీకర్ జంటగా యలమంచలి సమర్పణలో కెఎస్‌పీ ప్రొడక్షన్స్ పతాకంపై బీయన్ రెడ్డి అభినయ దర్శకత్వంలో డా‘‘ ఏఎస్ కీర్తి, డా‘‘ జి.పార్థసారథి రెడ్డి నిర్మిస్తున్న ‘నీతోనే హాయ్..హాయ్’ చిత్రం ప్రారంభోత్సవం హైదరాబాద్‌లో జరిగింది. హీరో శ్రీకాంత్ ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ ఇవ్వగా, ‘మా’ అధ్యక్షుడు శివాజీరాజా కెమెరా స్విచాన్ చేశారు. ప్రముఖ దర్శకుడు రేలంగి నరసింహారావు గౌరవ దర్శకత్వం వహించారు.దర్శకుడు మాట్లాడుతూ– ‘‘నా కథను నమ్మి ఈ చిత్రాన్ని నిర్మించడానికి ముందుకొచ్చిన మా నిర్మాతలకు కృతజ్ఞతలు. వారు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను. డబ్బున్న వ్యక్తులు, మధ్య తరగతి కుటుంబానికి చెందిన వాళ్ల మనస్తత్వాలకు ఉన్న తేడాలు ఏంటీ? అన్న కాన్సెప్ట్ ఆధారంగా తెరకెక్కిస్తున్నాం. బుధవారం నుంచి షెడ్యూల్ స్టారై్టంది. త్రీ షెడ్యూల్స్‌లో సినిమాను కంప్లీట్ చేయాలనుకుంటున్నాం’’ అన్నారు.‘‘బీయన్ రెడ్డి అభినయగారి పట్టుదల, తపన చూసి ఈ చిత్రాన్ని నిర్మించడానికి ముందుకొచ్చాం. రవికల్యాణ్గారు మంచి సంగీతం ఇచ్చారు. మా తొలి ప్రయత్నాన్ని ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. ‘‘ఈ సినిమా టీమ్ అందరూ మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను’’ అన్నారు ప్రవీణ్. నటుడు బెనర్జీ, అరుణ్‌తేజ్, ఛరిష్మా శ్రీకర్ పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ఈదర ప్రసాద్. -
అమెరికాలో మా వేడుకలు
మా (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సిల్వర్ జూబ్లీ వేడుకలను ఏప్రిల్ 28న అమెరికాలో నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ‘మా’ అధ్యక్షుడు శివాజీరాజా మాట్లాడుతూ– ‘‘ఫిల్మ్ స్టార్ ఈవెంట్స్– తిరుమల ప్రొడక్షన్స్ సంయుక్తగా అమెరికాలో ఈ వేడుక నిర్వహిస్తున్నాయి. ఈ కార్యక్రమానికి చిరంజీవిగారు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. మే నెలలో జరిగే ఓ ఈవెంట్‌కు మహేశ్‌బాబు వస్తానన్నారు. హీరోయిన్లు కచ్చితంగా ‘మా’లో మెంబర్షిప్ తీసుకోవాలి. ఏదైనా సమస్య వచ్చినప్పుడే ‘మా’ ముందుకు వస్తున్నారు. ఒక చేతితో ‘మా’ మెంబర్ షిప్ ఫారమ్, మరో చేతితో ఫిర్యాదు ఫారమ్ తీసుకొస్తున్నారు. ‘మా’ సిల్వర్ జూబ్లీ సందర్భంగా 35 మందికి ఈ నెల నుంచి 3000 పెన్షన్ అందేలా చర్యలు తీసుకుంటున్నాం’’ అన్నారు. ‘మా’ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీకాంత్, జనరల్ సెక్రటరీ నరేష్, కార్యవర్గ సభ్యుడు సురేష్, అమెరికా ఈవెంట్ ఆర్గనైజర్లలో ఒకరైన రాధాకృష్ణ రాజా, స్టీఫెన్ పల్లామ్ (అమెరికా), రాంబాబు కల్లూరి (అమెరికా), నిఖిల్ నాంచారి (అమెరికా), ‘మా’ వైస్ ప్రెసిడెంట్ బెనర్జీ, కల్చరల్ కమిటీ చైర్మన్ సురేశ్ కొండేటి తదితరులు పాల్గొన్నారు. -
చిరు, మహేష్ ‘మా’కు రెండు రెక్కలు..
సాక్షి, హైదరాబాద్: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) భవనాలకు మెగాస్టార్ చిరంజీవి, సూపర్‌స్టార్ మహేశ్ బాబుల పేర్లను పెట్టనున్నట్లు ‘మా’ అధ్యక్షుడు శివాజీ రాజా ప్రకటించారు. ఈ ఏడాదితో ‘మా’ ఏర్పడి 25 ఏళ్లు పూర్తవుతోంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ మేరకు ‘మా’ సిల్వర్ జూబ్లీ ఉత్సవాలను అమెరికాలో సెలబ్రేట్ చేస్తున్నట్లు తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి, సూపర్‌స్టార్ మహేష్ బాబులు ‘మా’ కు రెండు రెక్కలు అని కొనియాడారు. ఇంతకాలం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌కు తోడుగా ఉన్నవారందరికి మా అధ్యక్షుడు కృతజ్ఞతలు తెలిపారు. ‘యూఎస్‌లో మా కార్యక్రమానికి చిరంజీవి పెద్ద మొత్తంలో స్పాన్సర్ చేశారు. సైరా సినిమాతో చిరంజీవి బిజీగా ఉన్నప్పటికి ఆహ్వానించగానే ఏమి ఆలోచించకుండా వస్తానని చెప్పారు. మహేశ్ బాబు కూడా యూఎస్‌లో జరిగే మా సిల్వర్ జూబ్లీ కార్యక్రమానికి హాజరవుతారు. ఆ ఇద్దరి హీరోలకు ‘మా’ ఎప్పటికి రుణపడి ఉంటుందని’ మా అధ్యక్షుడు అన్నారు. ‘మా’ ఉత్సవాలకు మద్దతుగా నిలిచిన సీనియర్ హీరోలు బాలకృష్ణ, మోహన్ బాబు, నాగార్జున, వెంకటేష్, మిగిలిన హీరోలకు మా అధ్యక్షుడు శివాజీ రాజా కృతజ్ఞతలు చెప్పారు. -
త్వరలో విజయకృష్ణ ట్రస్ట్ స్టార్ట్ చేస్తాం – నరేశ్
సీనియర్ హీరో నరేశ్ జన్మదిన వేడుకలు శనివారం సూపర్ స్టార్ కృష్ణ నివాసంలో అభిమానుల సమక్షంలో జరిగాయి. ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ – నరేశ్ కెరీర్ ఇప్పుడు మంచి బూస్ట్‌లో ఉంది. ‘శతమానం భవతి’ సినిమా దర్శకుణ్ణి సన్మానించడం సంతోషంగా ఉంది. నిర్మాత ‘దిల్’ రాజు ఒకే ఏడాది ఆరు హిట్స్ సాధించడం విశేషం. నరేశ్ ఇలానే మంచి పాత్రలు చేయాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. ‘‘అటు సినిమాలతో అలరిస్తూ ఇటు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్న నరేశ్ ఇలానే కొనసాగాలని కోరుకుంటున్నాను’’ అన్నారు విజయ నిర్మల. ‘‘అప్పుడే 50 ఏళ్లు అంటే నమ్మబుద్ధి కావటం లేదు. నా దర్శక–నిర్మాతలకు కృతజ్ఞతలు. వినోదం పంచటం, సేవ చేయటమే నా ధ్యేయంగా పెట్టుకున్నాను. విజయ కృష్ణ పేరుతో త్వరలో ట్రస్ట్ ఏర్పాటు చే స్తాను’’ అన్నారు నరేశ్. నటుడు మురళీమోహన్ ‘మా’ అధ్యక్షుడు శివాజీ రాజా, వేగేశ్న సతీష్ తదితరులు పాల్గొన్నారు. -
ఐయామ్ విత్ ‘మా’
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) 25వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ‘మా’ నూతన కార్యవర్గం ప్లాన్ చేసింది. ఈ విశేషాలను మీడియాతో పంచుకున్నారు. ‘మా’ అధ్యక్షుడు శివాజీ రాజా మాట్లాడుతూ–‘‘24 ఏళ్ల కిందట చిరంజీవిగారు స్థాపించిన ‘మా’ 25 సంవత్సరంలోకి అడుగుపెట్టడం చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా ‘ఐయామ్ విత్ మా’ నినాదంతో సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నాం. ఈ వేడుకలకు శుభ సూచికంగా ‘ఓల్డేజ్ హోమ్’ ఏర్పాటు చేయబోతున్నాం’’ అన్నారు. ‘‘ఓల్డేజ్ హోం, ‘మా’కు సొంత భవనం ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నాం’’ అన్నారు ‘మా’ జనరల్ సెక్రటరీ నరేశ్. ఈ వేదికపై సీనియర్ నటుడు రాళ్లపల్లి, సీనియర్ పాత్రికేయలు గుడిపూడి శ్రీహరి, నటుడు శివ బాలాజీలను ‘మా’ తరఫున సన్మానించారు. -
తొందరపాటు నిర్ణయం
‘‘డబ్బున్న కుటుంబంలో పుట్టిన ఓ అమ్మాయి తొందరపాటులో ఓ నిర్ణయం తీసుకోవడం వల్ల తండ్రి ప్రేమకి దూరమవుతుంది. ఆమె తీసుకున్న తొందరపాటు నిర్ణయం ఏంటి? తర్వాత ఎటువంటి పరిస్థితులు చోటుచేసుకున్నాయి? తండ్రికి దగ్గరయిందా? లేదా?’’ అనే కథాంశంతో తెరకెక్కిన సినిమా ‘అమ్మాయిలంతే అదో టైపు’. గోపీ వర్మ, మాళవికా మీనన్, శివాజీ రాజా ముఖ్య తారలుగా కృష్ణమ్ దర్శకత్వంలో గాయత్రి రీల్స్ పతాకంపై రూపొందిన చిత్రమిది. కృష్ణమ్ మాట్లాడుతూ– ‘‘భావోద్వేగాలే హైలెట్‌గా తెరకెక్కిన ప్రేమకథా చిత్రమిది. నేటి యువతరం, తల్లిదండ్రుల ఆలోచనలకు తగ్గట్టుగా ఉంటుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలో పాటలు, అక్టోబర్‌లో సినిమా రిలీజ్‌కి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. సాయి, భద్రమ్, వేణుగోపాల్, భరత్ నటించిన ఈ చిత్రానికి కెమెరా: శ్రీనివాస్. -
డ్రగ్స్ అమ్మేవాళ్లను పట్టుకోవాలి... తీసుకునేవాళ్లను కరెక్ట్ చేయాలి
– డి. సురేశ్‌బాబు ఓ స్టంట్ మాస్టర్... ఇద్దరు నిర్మాతలు... ముగ్గురు యువ హీరోలు... నలుగురు దర్శకులు... మొత్తం పది మంది సినీ ప్రముఖులకు డ్రగ్స్ కేసులో తెలంగాణ ఎక్సైజ్ శాఖ నోటీసులు జారీ చేసిందనే వార్త తెలుగు చలనచిత్ర పరిశ్రమలోనూ, ప్రజల్లోనూ సంచలనమైంది. ఈ వార్తలపై తెలుగు సినిమా పెద్దలు స్పందించారు. డ్రగ్ కల్చర్‌ను ప్రోత్సహించేది లేదని స్పష్టం చేశారు. బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిర్మాత డి. సురేశ్‌బాబు మాట్లాడుతూ– ‘‘డ్రగ్స్ విషయంలో ప్రభుత్వం, పోలీసులు ఎంతో సంయమనంతో వ్యవహరిస్తున్న తీరు అభినందనీయం. స్కూల్స్, ఐటీ కంపెనీలు, ప్రతిచోటా చాలా సెన్సిబుల్‌గా హ్యాండిల్ చేస్తున్నారు. సమస్యను సమూలంగా నిర్మూలించేందుకు కృషి చేస్తున్నారు. ముందు డ్రగ్స్ సప్లై చేసేవారిని పట్టుకోవాలి. తర్వాత డ్రగ్స్ తీసుకునేవాళ్లను కరెక్ట్ చేయాలి. మా ఇండస్ట్రీలోనూ అలాంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే సరి చేయాలి. దీనికోసం అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తాం. మా తరఫున ఎలాంటి సహాయం చేయడానికైనా రెడీ’’ అన్నారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ– ‘‘సమాజంలోనూ, చిత్ర పరిశ్రమలోనూ 0.001 శాతం మంది డ్రగ్స్‌కి బానిసలయ్యారనే వార్త విచారకరం. దాన్ని కూడా నిర్మూలించాలి. ప్రభుత్వ సూచనలను సీరియస్‌గా తీసుకోవాలి. అయితే... ఈ సమస్యను సెన్సేషన్ చేసి, వాళ్లనూ–వీళ్లనూ అరెస్ట్ చేసి, హడావిడి చేయకుండా ప్రభుత్వాధికారులు ఎంతో సెన్సిబుల్‌గా వ్యవహరిస్తున్నందుకు ఆనందంగా ఉంది. చిత్ర పరిశ్రమలోని పది–పదిహేను మంది వల్ల సినిమా రంగం అంతటికీ చెడ్డ పేరొస్తుంది. దీనిపై వాళ్లంతా ఆలోచించుకోవాలి. తొలిసారి డ్రగ్స్‌ను టేస్ట్ చేయాలనుకుని, తర్వాత వాటికి బానిసలై జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. అసలు డ్రగ్స్‌ను టేస్ట్ చేయకుండా ఉండడమే ఉత్తమం’’ అన్నారు. ‘మా’ అధ్యక్షుడు శివాజీరాజా మాట్లాడుతూ– ‘‘మంచి పనులు చేయడంలో తెలుగు చిత్రసీమ ఎప్పుడూ ముందుంటుంది. గతంలో ‘నీరు–మీరు’, ‘హుదూద్’, మొక్కలు నాటే కార్యక్రమాలు చేశాం. ఇప్పుడు డ్రగ్స్ మహమ్మారిని తరిమేయాలని అనుకుంటున్నాం. తెలుగు చిత్రసీమలో ముప్ఫైవేలమంది కార్మికులున్నారు. వాళ్లలో 0.001 శాతం మంది డ్రగ్స్ వాడటం వల్ల ఆ ప్రభావం అందరి మీదా పడుతోంది. దీనికి పరిష్కార మార్గం ఆలోచించే ప్రయత్నంలో ఉన్నాం’’ అన్నారు. రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ– ‘‘మన సొసైటీలో సినిమా జనాల సంఖ్య చాలా తక్కువైనా... ఇండస్ట్రీ అంతా పర్ఫెక్ట్గా ఉండాలన్నది మా తాపత్రయం. అలాగే, ప్రజలు కూడా మన ఇంట్లో ఎవరూ డ్రగ్స్ తీసుకోవడం లేదు కదా.. పక్కింటి పిల్లలు తీసుకుంటే మనకేంటి? అని వదిలేయొద్దు. వాళ్లను మందలించండి. వాళ్ల పేరెంట్స్‌కి చెప్పండి. అందులో తప్పు లేదు. వాళ్లూ మన పిల్లలే అనుకుని, ముందడుగు వేస్తే సొసైటీ నుంచి డ్రగ్స్ మహమ్మారిని తరిమేయొచ్చు’’ అన్నారు. ‘మా’ సభ్యులు శ్రీకాంత్, ‘సీనియర్’ నరేశ్, ఏడిద రాజా పాల్గొన్నారు. ముంబయ్ టు హైదరాబాద్ వయా రేవ్ పార్టీస్! డ్రగ్ కల్చర్ రేవ్ పార్టీల ద్వారా ముంబయ్ నుంచి హైదరాబాద్ వచ్చిందని అల్లు అరవింద్ అన్నారు. డ్రగ్స్‌కు యంగ్‌స్టర్స్ ఎలా ఎడిక్ట్ అవుతున్నారనే విషయం గురించి ఆయన మాట్లాడుతూ– ‘‘ముంబయ్‌లోని ఓ యంగ్‌స్టర్‌ను నేను ఓసారి ఏంటిది? అని ప్రశ్నిస్తే... ‘అంకుల్! రేవ్ పార్టీలకు వందలమంది వెళ్తుంటారు. అందులో నలుగురో... పది మందో... సపరేట్గా పక్కకు వెళ్లి డ్రగ్స్ తీసుకుంటారు. తర్వాత మళ్లీ కలిసినప్పుడు డ్రగ్స్ అంటే ఆసక్తి ఉన్నోళ్లను తమ బ్యాచ్‌లోకి లాక్కునేందుకు ప్రయత్నిస్తారు. ఇదంతా వందలో 20, 30 మందికి తెలుస్తుంది’ అన్నాడు. అలాంటి రేవ్ పార్టీలు మన దగ్గర కూడా జరుగుతున్నాయని చెప్పడానికి విచారిస్తున్నా. యువతకు నేను చేసే హెచ్చరిక ఏంటంటే... రేవ్ అండ్ డ్రగ్స్ పార్టీల నుంచి తప్పుకోండి. ‘మేం కళ్లు మూసుకుని పాలు తాగుతున్నాం. ఏం ఫర్వాలేదు’ అనుకోకండి. డ్రగ్స్ వలలో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారనేది ప్రభుత్వానికి తెలుసు. వాళ్ల దగ్గర మీ లిస్టుంది. మీ జీవితాలు నాశనమవుతాయి. మీ ఫ్యామిలీ బాధ్యత తీసుకుని మిమ్మల్ని (డ్రగ్ ఎడిక్ట్ యంగ్‌స్టర్స్) కంట్రోల్ చేస్తుందో... మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటారో మీ ఇష్టం’’ అన్నారు. -
మా ఉందని ధైర్యంగా బతకాలి
– ‘మా’ జనరల్ సెక్రటరీ శివాజీ రాజా ‘‘గత మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో మేం 10 శాతం హామీలిచ్చాం. కానీ, కళాకారుల సంక్షేమానికి 100 శాతం కృషి చేశాం. ఇది ‘మా’ సభ్యుల సహకారంతో సాధ్యమైంది. ఇకపై ఏ కళాకారుడూ బాధపడకూడదు. ఏదైనా ఆపద వస్తే ‘మా’ ఉందనే ధైర్యంతో గుండెపై చేయి వేసుకుని ధైర్యంగా బ్రతకాలి’’ అని ‘మా’ జనరల్ సెక్రటరీ శివాజీ రాజా అన్నారు. ప్రస్తుత ‘మా’ కమిటీ రెండేళ్ల గడువు ముగియడంతో హైదరాబాద్‌లోని ప్రొడ్యూసర్ కౌన్సిల్ హాల్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ‘మా’ జాయింట్ సెక్రటరీ నరేశ్ మాట్లాడుతూ– ‘‘గత ఎన్నికల్లో ‘మా’లో రెండు వర్గాలుగా విడిపోయి పోటీ చేశాం. ‘ప్రస్తుత కమిటీ బాగా పనిచేస్తోంది. ఈసారి పోటీ లేకుండా కొత్త కమిటీ ఎన్నికకు కృషి చేస్తానని’ దాసరి నారాయణరావుగారు అన్నారు. కొత్త అధ్యక్షునిగా శివాజీరాజా, జనరల్ సెక్రటరీగా నా పేరు ‘మా’ కమిటీ, ఈ.సీ. మెంబర్లు ఏకగ్రీవంగా ప్రతిపాదించారు. త్వరలో పూర్తి వివరాలు చెబుతాం’’ అన్నారు. ‘మా’ వైస్ ప్రెసిడెంట్ శివకృష్ణ, ఈ.సీ. మెంబర్లు గీతాంజలి, ఏడిద శ్రీరాం, గౌతమ్ రాజు, హరనాథ్ బాబు, హేమ, జయలక్ష్మి, మానిక్, నర్సింగ్ యాదవ్, సురేశ్ కొండేటి, పి.శ్రీనివాసులు, శ్రీ శశాంక తదితరులు పాల్గొన్నారు. -
అంతే.. అదో టైప్
గోపీరంగా, మాళవికా మీనన్, శివాజీ రాజా ముఖ్య పాత్రల్లో కృష్ణం దర్శకత్వంలో గాయత్రి రీల్స్ పతాకంపై వై.వి.ఎస్.ఎస్.ఆర్. కృష్ణంరాజు నిర్మిస్తున్న చిత్రం ‘అమ్మాయి లంతే...అదోౖ టెపు’. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోంది. నిర్మాత మాట్లాడుతూ – ‘‘ఇదొక మంచి ప్రేమ కథా చిత్రం. సంపన్న కుటుంబంలో పుట్టిన ఓ అమ్మాయి, ఆటో డ్రైవర్ని ప్రేమిస్తుంది. తన తండ్రి గౌరవం కంటే ప్రేమే ముఖ్యమంటూ ప్రియుడితో కలిసి హైదరాబాద్‌కి వెళ్తుంది. అప్పుడు ఆ తండ్రి కూతురు కోసం ఎటువంటి తపన పడ్డాడు? తన తొందరపాటు నిర్ణయం వల్ల తండ్రి ప్రేమకి దూరమయ్యాన ంటూ కూతురు పడే బాధ ఏంటి? ఆ తర్వాత ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి? అనే భావోధ్వేగాల మధ్య కథ సాగుతుంది. జనవరిలో పాటలు, సినిమాను విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. సాయి, భద్రమ్, వేణుగోపాల్, భరత్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: శ్రీనివాస్. -
ఆ రాతిరంతా జాతరే...
నిద్రలేని రాత్రులు కంటి నిండా నిద్ర లేకపోతే మనిషి ఆరోగ్యమే కాదు, మనసూ అల్లకల్లోలమవుతుందని అందరూ అంటారు. అది ఎంతవరకూ నిజమో నాకు తెలీదు. ఎందుకంటే నేను నిద్రలేని రాత్రులు గడిపినా ఏనాడూ నా మనసు గతి తప్పలేదు. నిద్రలేని రాత్రి అనగానే నాకు మొదటగా చిన్నప్పుడు జరిగిన ఓ సంఘటన గుర్తొస్తుంది. అప్పుడు నేను పదో తరగతి చదువుతున్నాను. ఎవరైనా బాగా చదువుతున్నావా అంటే చాలు... సూపర్‌గా చదివేస్తున్నాను, తప్పకుండా మంచి మార్కులతో పాసవుతాను అని గొప్పగా చెప్పేవాడిని. మా ఇంట్లో వాళ్లకే కాదు, ఊరందరికీ కూడా అదే చెప్పాను. నేనిచ్చిన బిల్డప్‌కి అందరూ నేను నిజంగానే మంచి మార్కులతో పాసైపోతాను అనుకున్నారు. కానీ అలా జరగలేదు. నేను ఫెయిలయ్యాను. రిజల్ట్ చూసుకోగానే గుండె గుభేల్మంది. అందరూ కలిసి ఉతికేస్తారేమోనని భయమేసింది. దాంతో అప్పటికప్పుడు ఓ ప్లాన్ వేశాను. మా ఇంటి ముందున్న మామిడి చెట్టెక్కి కూచున్నాను. గంటో రెండు గంటలో కాదు. రాత్రంతా చెట్టు మీదే ఉన్నాను. మన సంగతి బాగా తెలుసు కాబట్టి... మావాళ్లు ఎక్కడెక్కడో వెతికి, వాడే వస్తాడ్లే అని వదిలేశారు. దాంతో నాకు ఆ రాతిరంతా జాతరే. తెల్లారే వరకూ చెట్టుమీదే జపం చేశాను. తర్వాత ఇక తప్పదని దిగి ఇంటికెళ్లా. పాపం పిల్లాడు రాత్రంతా నిద్ర లేకుండా అవస్థ పడ్డాడే అని మావాళ్లేమీ జాలి పడలేదు నా మీద. ఇవ్వాల్సిన కోటింగ్ ఇచ్చి, వాళ్ల ఎమోషన్ చల్లార్చుకున్నాకే వదిలారు. ఆ సంఘటన, ఆ రాత్రి చెట్టుమీద నేను పడిన పాట్లు గుర్తొస్తే ఇప్పటికీ నవ్వొస్తుంది నాకు. కెరీర్లో ఎదిగే క్రమంలో ఎవరికైనా పోరాటం ఉంటుంది. దాని కారణంగా కొన్ని నిద్ర లేని రాత్రులూ ఉంటాయి. కానీ వాటిలో బాధ ఉండదు. సంతోషమే ఉంటుంది. అవన్నీ మన బతుకు పుస్తకంలో మంచి జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. అయితే నాకు ఆ సమయంలో గడిపిన రాత్రుల కంటే కృష్ణవంశీతో పని చేసినప్పుడు గడిపిన నిద్రలేని రాత్రులే ఎక్కువ గుర్తు. కృష్ణవంశీతో పని చేయడమంటే మాటలు కాదు. ఆయన సృష్టించే క్యారెక్టర్స్‌ని పండించడం అంత తేలికైన విషయం కాదు. ఆ క్యారెక్టరయి జేషన్ మామూలుగా ఉండదు. వాటిలో లీనమై చేసేసరికి ఒళ్లు హూనమైపోతుంది. ‘సముద్రం’ సినిమాలో నేను చేసింది చాలా క్లిష్టమైన పాత్ర. చాలా డిఫరెంట్ పాత్ర కూడా. అది చేసేటప్పుడు నేను పడిన కష్టం నాకు మాత్రమే తెలుసు. నిద్రపట్టేది కాదు. ఇరవై నాలుగ్గంటలూ ఆ పాత్ర మీదే ధ్యాస. ఎలా చేయాలి, ఎంత బాగా పండించాలి అన్నదే ఆలోచన. షూటింగ్ పూర్తయ్యాక మాత్రం ఆదమరిచి నిద్రపోయాను. అలసిపోయినందుకు కాదు. అంత గొప్ప పాత్ర చేశానే అన్న తృప్తితో. కృష్ణవంశీతో ఎప్పుడు పని చేసినా ఇలాగే ఉంటుంది పరిస్థితి. ఇక వ్యక్తిగత జీవితంలో అయితే... నేను స్వతహాగా అనవసర విషయాల జోలికి వెళ్లను. నా పనేంటో నేను చేసుకు పోతాను తప్ప, ఏవీ పట్టించుకోను. కానీ మొదటిసారి పట్టించుకున్నాను. అవే మొన్న జరిగిన ‘మా’ ఎలక్షన్స్. ఎంత పెద్ద విషయానికైనా చలించని నన్ను ఈ ఎన్నికలు చాలా కలవరపెట్టాయి. చాలా డిస్టర్బ్ చేశాయి. ఎందుకు ఇలాంటి మనుషుల మధ్యకి వచ్చానా, ఎందుకు ఇలాంటి వాళ్లతో పోటీకి నిలబడ్డానా అని నాలో నేను ఎంత బాధపడ్డానో నాకే తెలుసు. ఎప్పుడూ నన్ను ఏ విషయంలోనూ ఏమీ అనని, అడ్డుకోని మా ఇంట్లో వాళ్లు కూడా... ‘మీకు అవసరమా ఇవన్నీ’ అన్నారంటే నేనెంతగా మథనపడ్డానో అర్థం చేసుకోవచ్చు. ఎన్నో ఎలక్షన్లు చూశాను కానీ ఎప్పుడూ ఇలా జరగలేదు. అయితే పోటీ బాధపెట్టినా, ఫలితాలు సంతోషాన్నే మిగిల్చాయి. ఇక మిగతా సమస్యలంటారా? అవి ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. ముఖ్యంగా పక్కవాళ్ల సమస్యల్ని మన సమస్యల్లా ఫీలైపోయి, వాటిని మీద వేసుకుని, ఎలా పరిష్కరించాలా అని మల్లగుల్లాలు పడిపోయే నాలాంటి వాళ్లకు నిద్రలేని రాత్రులు లేకుండా ఉంటాయా! ఆలోచనలతో కొన్ని... ఆవేదనతో కొన్ని... ఎదురు దెబ్బలు తిన్న బాధతో కొన్ని... ఇలా కొన్ని కొన్ని కలిసి ఎన్నో ఉంటాయి. కానీ వాటి గురించి ఎప్పుడూ బాధపడను. ఎందుకంటే మరొకరి బాధను పంచుకోవడంలో ఆనందం ఉంటుంది. ఆ సంతోషం ముందు నాకు మరేదీ ఎక్కువ కాదనిపిస్తుంది. అందుకే ఒకరి కోసం నిద్ర లేకుండా గడిపిన ఏ రాత్రీ నన్ను బాధపెట్టదు. బాధను మిగల్చదు. - సమీర నేలపూడి -
హేమ కంట్రోల్లో ఉంటే మంచిది: శివాజీ రాజా
హైదరాబాద్: నటి హేమ తనపై చేసిన వ్యాఖ్యలు తన విజ్ఞతకే వదిలేస్తున్నానని నటుడు శివాజీ రాజా అన్నారు. ఆమె కంట్రోల్లో ఉంటే బావుంటుందని చెప్పారు. మా ఎన్నికల్లో రాజేంద్ర ప్రసాద్ ప్యానెల్ తరుపున పోటి చేస్తున్న ఆయన ఎన్నికల సందర్భంగా మాట్లాడుతూ వ్యక్తిగత విషయాల జోలికి వెళ్లి మాట్లాడాల్సిన అవసరం హేమకు ఏముందని ప్రశ్నించారు. వీలుంటే మంచి చేయాలని హితవు పలికారు. వారు ఓడిపోతారనే భయంతోనే తనపై ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. హేమ మీపై ఎన్నికల అనంతరం చర్యలు తీసుకుంటారని అంటున్నారుగా అని ప్రశ్నించగా వారు ఏ చర్యలైనా తీసుకోవచ్చని, తాను తాటాకు చప్పుళ్లకు భయపడనని అన్నారు. తాను గొప్ప పోరాటయోధుడినని తెలిపారు. రాజేంద్ర ప్రసాద్‌ను ఒంటరి చేయడం ఇష్టం లేకే ఓడిపోయినా సరే ఎన్నికలకు వచ్చానని అన్నారు. అనవసరమైన ఆరోపణలు చేయొద్దని.. ఏదైనా ఉంటే కెమెరా ముందు నటించాలేగానీ, కెమెరా వెనుక వద్దని చెప్పారు. ఎన్నికల ప్రభావం సినిమాలో నటించడంపై పడబోదని స్పష్టం చేశారు.