ఉగాది ముందే వచ్చినట్లుంది – శివాజీరాజా | Mahila Kabaddi First Song Launch By MAA President Sivaji Raja | Sakshi
Sakshi News home page

ఉగాది ముందే వచ్చినట్లుంది – శివాజీరాజా

Published Sat, Mar 17 2018 12:34 AM | Last Updated on Sat, Mar 17 2018 12:34 AM

Mahila Kabaddi First Song Launch By MAA President Sivaji Raja - Sakshi

శివాజీరాజా, ప్రతాని రామకృష్ణగౌడ్‌

రచన స్మిత్‌ ప్రధాన పాత్రలో ఆర్‌కే ఫిలింస్‌ పతాకంపై ప్రతాని రామకృష్ణగౌడ్‌ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న సినిమా ‘మహిళ కబడ్డి’. రీసెంట్‌గా మూడో షెడ్యూల్‌ కంప్లీటైంది. ఈ చిత్రం కోసం ఉగాది పండగపై పాటను సంగీత దర్శకుడు బోలే షావళి çస్వరపరిచారు. ఈ పాటను ఉగాది పండగ సందర్భంగా ఆవిష్కరించారు. ‘‘ఆర్‌కే ఫిలింస్‌ నా సొంత బ్యానర్‌ లాంటింది. నా కెరీర్‌ ప్రారంభ దశలో ఈ బ్యానర్‌లోనే నటించాను.

ఉగాది పండగపై చేసిన పాటను లాంచ్‌ చేయడం ఆనందంగా ఉంది. బోలే షావళి అద్భుతంగా కంపోజ్‌ చేయగా, సింగర్‌ వరం బాగా పాడారు. ఈ పాటతో ఉగాది ముందే వచ్చినట్లు అనిపిస్తోంది’’ అన్నారు శివాజీరాజా. ‘‘మహిళలు ఎందులోనూ తక్కవ కాదనే కాన్సెప్ట్‌తో రూపొందిస్తున్న చిత్రమిది. ఒక పల్లెటూరి అమ్మాయి భారతదేశం గర్వపడే స్థాయికి ఎలా ఎదిగింది? అన్నదే కథ’ అన్నారు ప్రతాని రామకృష్ణగౌడ్‌. ముత్యాల రాందాస్, ఏడిద శ్రీరామ్, సింగర్‌ వరం, బోలే షావళి పాల్గొన్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement