rachana Smith
-
మహిళలు తలచుకుంటే...
ఆర్.కె. ఫిలిమ్స్ బ్యానర్‌పై ప్రతాని రామకృష్ణ గౌడ్ స్వీయ దర్శకత్వంలో రచనా స్మిత్, కావ్యారెడ్డి ముఖ్యపాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘మహిళా కబడ్డీ’. శనివారం రామకృష్ణగౌడ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ‘మహిళా కబడ్డీ’ పోస్టర్‌ను తెలంగాణ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ చైర్మన్ బాలమల్లు విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘గౌడ్ నాకు చాలా కాలం నుంచి మిత్రుడు. ఆయన తీస్తున్న ‘మహిళా కబడ్డీ’ చిత్రంలోని పాటలను విన్నాను. ఎంతో బావున్నాయి. మహిళలు తలుచుకుంటే ఏదైనా సాధించగలరు అని చాటి చెప్పే సినిమా ఇది’’ అన్నారు. రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ– ‘‘పాటల రికార్డింగ్ పూర్తయింది. గీతా మాధురి, మంగ్లీ, మధుప్రియ లాంటి ప్రముఖ గాయనీ మణులు పాడిన ఆరు పాటలను రికార్డ్ చేసాం. దాంతోపాటు ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలన్నీ పూర్తయ్యాయి. జూన్‌లో రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడతాం. ఓ సాధారణ పల్లెటూరి అమ్మాయి కబడ్డీలో జాతీయ స్థాయిలో ఎలా నిలిచింది? ఆమె జర్నీలో ఉన్న సమస్యలు, మలుపులు ఏమిటి అన్న ఆసక్తికర అంశాలతో ఈ సినిమా ఉంటుంది’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: రాజ్ కిరణ్. -
ఉగాది ముందే వచ్చినట్లుంది – శివాజీరాజా
రచన స్మిత్ ప్రధాన పాత్రలో ఆర్కే ఫిలింస్ పతాకంపై ప్రతాని రామకృష్ణగౌడ్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న సినిమా ‘మహిళ కబడ్డి’. రీసెంట్గా మూడో షెడ్యూల్ కంప్లీటైంది. ఈ చిత్రం కోసం ఉగాది పండగపై పాటను సంగీత దర్శకుడు బోలే షావళి çస్వరపరిచారు. ఈ పాటను ఉగాది పండగ సందర్భంగా ఆవిష్కరించారు. ‘‘ఆర్కే ఫిలింస్ నా సొంత బ్యానర్ లాంటింది. నా కెరీర్ ప్రారంభ దశలో ఈ బ్యానర్లోనే నటించాను. ఉగాది పండగపై చేసిన పాటను లాంచ్ చేయడం ఆనందంగా ఉంది. బోలే షావళి అద్భుతంగా కంపోజ్ చేయగా, సింగర్ వరం బాగా పాడారు. ఈ పాటతో ఉగాది ముందే వచ్చినట్లు అనిపిస్తోంది’’ అన్నారు శివాజీరాజా. ‘‘మహిళలు ఎందులోనూ తక్కవ కాదనే కాన్సెప్ట్‌తో రూపొందిస్తున్న చిత్రమిది. ఒక పల్లెటూరి అమ్మాయి భారతదేశం గర్వపడే స్థాయికి ఎలా ఎదిగింది? అన్నదే కథ’ అన్నారు ప్రతాని రామకృష్ణగౌడ్. ముత్యాల రాందాస్, ఏడిద శ్రీరామ్, సింగర్ వరం, బోలే షావళి పాల్గొన్నారు. -
డిఫరెంట్ దెయ్యం కథ!
మాగంటి శ్రీనాథ్‌ను హీరోగా పరిచయం చేస్తూ, వి. రవివర్మ దర్శకత్వంలో ఎస్. సరిత నిర్మించిన ‘ఇదేం దెయ్యం’ శుక్రవారం రిలీజ్ కానుంది. ‘‘సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులు కూడా ‘ఇదేం దెయ్యంరా బాబు’ అనేంత డిఫరెంట్ కథతో తీశాం. హారర్ సీన్లు థ్రిల్‌కి గురి చేస్తాయి’’ అన్నారు దర్శక– నిర్మాతలు. సాక్షి కక్కర్, రచనా స్మిత్, రుచీ పాండే నాయికలుగా నటించిన ఈ సినిమాకు సహ–నిర్మాతలు: ఎమ్. రత్నశేఖర్రావు, ఎమ్. మధుసూధన్‌రెడ్డి, వి. రామ్కిశోర్రెడ్డి, ఎమ్. సౌజన్య.