ఐయామ్‌ విత్‌ ‘మా’ | Movie Artistes Association Silver Jubilee Function Pressmeet | Sakshi
Sakshi News home page

ఐయామ్‌ విత్‌ ‘మా’

Published Mon, Dec 4 2017 1:48 AM | Last Updated on Mon, Dec 4 2017 1:48 AM

Movie Artistes Association Silver Jubilee Function Pressmeet - Sakshi

మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ (మా) 25వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా సిల్వర్‌ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ‘మా’ నూతన కార్యవర్గం ప్లాన్‌ చేసింది. ఈ విశేషాలను మీడియాతో పంచుకున్నారు. ‘మా’ అధ్యక్షుడు శివాజీ రాజా మాట్లాడుతూ–‘‘24 ఏళ్ల కిందట చిరంజీవిగారు స్థాపించిన ‘మా’  25 సంవత్సరంలోకి అడుగుపెట్టడం చాలా సంతోషంగా ఉంది.

ఈ సందర్భంగా ‘ఐయామ్‌ విత్‌ మా’ నినాదంతో సిల్వర్‌ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నాం. ఈ వేడుకలకు శుభ సూచికంగా ‘ఓల్డేజ్‌ హోమ్‌’ ఏర్పాటు చేయబోతున్నాం’’ అన్నారు. ‘‘ఓల్డేజ్‌ హోం, ‘మా’కు సొంత భవనం ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నాం’’ అన్నారు ‘మా’ జనరల్‌ సెక్రటరీ నరేశ్‌. ఈ వేదికపై సీనియర్‌ నటుడు రాళ్లపల్లి, సీనియర్‌ పాత్రికేయలు గుడిపూడి శ్రీహరి, నటుడు శివ బాలాజీలను ‘మా’ తరఫున సన్మానించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement