maa
-
జేసీ ప్రభాకర్‌రెడ్డిపై నటి మాధవీలత ఫిర్యాదు
టీడీపీ మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మున్సి పల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డిపై( J. C. Prabhakar Reddy) ఫిల్మ్ ఛాంబర్లో నటి మాధవీలత(Madhavi Latha) ఫిర్యాదు చేశారు. మా ట్రెజరర్ శివ బాలాజికి(Siva Balaji) పిర్యాదు పత్రాన్ని ఆమె అందజేశారు. న్యాయం కోసం పోరాటం చేస్తానని తన సోషల్‌మీడియాలో ఆమె పేర్కొన్నారు.లేఖలో మాధవీలత పేర్కొన్న అంశాలు'జేసీ ప్రభాకర్‌రెడ్డిపై ఫిల్మ్ ఛాంబర్‌తో పాటు మానవ హక్కుల సంఘానికి, పోలీసులకు ఫిర్యాదు చేశాను. జేసీ ప్రభాకర్ రెడ్డి నా మీద చాలా దారుణంగా మాట్లాడారు. నా మీద వచ్చిన వ్యాఖ్యలపై ఇండస్ట్రీ కూడా ఖండించలేదు. అందుకే 'మా'కు ఫిర్యాదు చేశాను. మా ట్రెజరర్ శివబాలాజీకి కాల్ చేస్తే వెంటనే స్పందించారు. నా ఫిర్యాదును మా అధ్యక్షులు మంచు విష్ణు దృష్టికి కూడా తీసుకెళ్లారు. నేను ఎంత కఠినంగా మాట్లాడిన నిజాలు మాట్లాడుతాను. సినిమా వాళ్లను అందరూ అవమానిస్తారు. కానీ, రాజకీయాల్లోకి వెళ్లి సినిమా వాళ్ల సత్తా చాటుతున్నాం. వ్యక్తిత్వ హననం చేస్తూ సినిమా వాళ్లపై ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు.' అని ఆమె అన్నారు.మేము సినిమాల్లో నటిస్తే.. వాళ్లు సమాజంలో నటిస్తున్నారు: శివ బాలాజీ లేఖపై శివ బాలాజీ ఇలా స్పందించారు. 'మాధవీలత చాలా బాధతో ఉన్నారని అర్థమైంది. ఒక మహిళను బాధపెట్టడం ఎవరికీ మంచిది కాదు. ఒక పోస్టర్ చూసి అపార్థం చేసుకుని ఆమెపై తప్పుడు వ్యాఖ్యలు చేయడం మంచిది కాదు. రాజకీయ నాయకులు ప్రజా సమస్యలపై మాట్లాడడం మానేసి ఇతరుల వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడుతున్నారు. ఎంతో మంది నటీనటులు పొలిటిషియన్స్ అయ్యారు. కానీ ఏ పొలిటిషియన్ కూడా పేరున్న యాక్టర్ కాలేదు. మేము కెమెరా ముందే నటిస్తాం. రాజకీయ నాయకులు సమాజంలో కూడా నటిస్తారు. ఇండస్ట్రీ జోలికి రాజకీయ నాయకులు రావొద్దు. మాధవిలత ఫిర్యాదుపై కమిటీలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం'. అని ఆయన అన్నారు.(ఇదీ చదవండి: చాలా సిగ్గుపడుతున్నా.. సైఫ్‌కు క్షమాపణలు చెప్పిన ఊర్వశి రౌటేలా)సినీ నటి, బీజేపీ నేత మాధవీలతపై జేసీ ప్రభాకర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ఆమె పెద్ద వ్యభి చారి అని, ఇలాంటి వ్యక్తులతోనా తమకు నీతులు చెప్పించేది అంటూ ఆయన ఒక సందర్భంలో ఫైర్ అయ్యారు. ఆయన మాట్లాడిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.మాధవిపై జేసీ వ్యాఖ్యలు ఎందుకు చేశారు..?నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకుని డిసెంబర్ 31న తాడిపత్రిలోని జేసీ పార్కులో ‘మహిళలకు మాత్రమే’ అంటూ జేసీ ప్రభాకర్‌రెడ్డి ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారు. దీనిపై మాధవీలత స్పందిస్తూ.. ఇలాంటి వేడుకలకు వెళ్లకూడదని, తిరుగు ప్రయాణంలో అర్థరాత్రి వేళ ఏదైనా జరిగితే ఎవరు కాపాడతారని, జేసీ పార్కులో వేడుకలకు వెళ్లొద్దని సూచించారు. దీంతో జేసీ ఒక్కసారిగా భగ్గుమన్నారు.బెదిరేది లేదని ఘాటుగానే మాధవి రియాక్షన్అయితే, జేసీ పరుష వ్యాఖ్యల నేపథ్యంలో సినీనటి మాధవీలత కూడా సోషల్‌మీడియాలో ఘాటుగానే స్పందించారు. మహిళల మాన, ప్రాణ రక్షణ గురించి మాట్లాడటం తప్పయితే తనపై వెయ్యి కేసులు పెట్టినా భయపడబోనన్నారు. తెరమీద కనిపించే వాళ్లందరూ వ్యభిచారులేనని అనడం ఆయన కుసంస్కారానికి నిదర్శనమన్నారు. తండ్రి అలా మాట్లాడినా యువ ఎమ్మెల్యేగా ఉన్న అస్మిత్‌రెడ్డి ఖండించలేని స్థితిలో ఉన్నారని ఆమె గుర్తుచేశారు. జేసీ ప్రభాకర్‌రెడ్డిని ప్రేమించే సైకోలెవరికీ తాను భయపడబోనన్నారు. తనను కిడ్నాప్ చేయాలనుకున్నా, మర్డర్ చేయాలనుకున్నా తాను బెదిరేది లేదన్నారు. ఈ వయసులో ఇలా మాట్లాడ్డానికి ఆయన సిగ్గుపడాలని, ఈ భాషను భరిస్తున్న ఆయన భార్యాపిల్లలకు ధన్యవాదాలన్నారు.మాధవికి క్షమాపణలు చెప్పిన జేసీతన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు రావడంతో జేసీ ప్రభాకర్ రెడ్డి వెనక్కి తగ్గారు. సినీ నటి మాధవీలతకు బహిరంగ క్షమాపణలు చెప్పారు. 'ఆవేశంలో నోరు జారాను,టంగ్ స్లిప్ అయింది..సారీ'అని జేసీ అన్నారు. క్షమాపణలు చెప్పిన తర్వాత కూడా మాధవి కన్నీళ్లు పెట్టుకుని ఒక వీడియో పంచుకుంది. 'మహిళల మాన, ప్రాణ రక్షణ గురించి మాట్లాడినందుకు తనను అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని వాపోయింది. మామూలుగా ఉందామని చాలా ప్రయత్నించా.. కానీ నావల్ల కావడం లేదంటూ..' కన్నీళ్లు పెట్టుకుంది. -
ప్రభుత్వాల మద్దతుతోనే చిత్ర పరిశ్రమ ఎదిగింది: మంచు విష్ణు
కొద్దిరోజులుగా తెలుగు చిత్రపరిశ్రమలో అనేక సంఘటనలు జరగుతున్నాయి. సంధ్య థియేటర్ ఘటనతో అల్లు అర్జున్ చిక్కుల్లో పడితే... కుటుంబంలో విభేదాలు రావడంతో మంచు ఫ్యామిలీలో కేసుల వరకు గొడవలు వెళ్లాయి. దీంతో పలువురు చిత్ర పరిశ్రమ నుంచి తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. అయితే, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (MAA) అధ్యక్షునిగా మంచు విష్ణు అధికారిక ప్రకటన చేశారు.'మన కళాకారులు ఎల్లప్పుడూ అన్ని ప్రభుత్వాల ప్రజాప్రతినిధులతో అనుబంధం,సాన్నిహిత్య సంబంధాలతో కలిగి ఉంటారు. సహకారం, సృజనాత్మకత పై ఆధారపడి మన చిత్ర పరిశ్రమ నడుస్తుంది. గతంలో వివిధ ప్రభుత్వాల మద్దతు వల్ల మన ఇండస్ట్రీ ఎంతో ఉన్నత స్థాయికి చేరుకుంది. ప్రత్యేకంగా, తెలుగు చలనచిత్ర పరిశ్రమ హైదరాబాదులో స్థిరపడటానికి, అప్పటి ముఖ్యమంత్రి చెన్నా రెడ్డి గారి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అందించిన ప్రోత్సాహం అత్యంత ముఖ్యమైనది. ఈ విధంగా, ప్రతి ప్రభుత్వంతో మన పరిశ్రమకు ఎల్లప్పుడూ సత్సంబంధాలు కొనసాగుతూనే వస్తున్నాయి.ఇటీవల జరిగిన పరిణామాలను దృష్టిలో ఉంచుకొని, సభ్యులందరూ సున్నితమైన విషయాలపై వ్యక్తిగత అభిప్రాయాలను బహిరంగంగా ప్రకటించడం గానీ, వివాదాస్పద అంశాలపై నిర్ణయాలు తీసుకోవడం గానీ నివారించండి.కొన్ని సమస్యలు వ్యక్తిగతమైనవి, మరికొన్ని విషాదకరమైనవి, వాటిపై చట్టం తన దారిలో తను న్యాయం చేస్తుంది. అలాంటి అంశాలపై మాట్లాడటం వల్ల అది సమస్యలను పరిష్కరించడానికి బదులుగా, సంబంధిత పక్షాలకు మరింత నష్టం చేస్తుంది. ఈ సమయంలో మనకి సహనం, సానుభూతి, సంఘ ఐక్యత అవసరం. తెలుగు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఓ పెద్ద కుటుంబం అని సంగతి గుర్తించుకుందాం. ఏ సమస్యలు వచ్చినా, మనమంతా కలిసి అవన్నీ ఎదుర్కొంటామని తెలియజేస్తున్నాను.' అని విష్ణు ఒక ప్రకటన చేశారు. -
దయచేసి 'మా' వ్యక్తిగత జీవితాలతో ఆడుకోవద్దు: మంచు విష్ణు లేఖ
మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు స్పందించారు. సినిమా వాళ్లపై ఇలాంటి కామెంట్స్ చేయడం దురదృష్టకరమన్నారు. సినీ పరిశ్రమ పరస్పర గౌరవం, నమ్మకంతో నడుస్తుందని తెలిపారు. రాజకీయ లాభాల కోసం వ్యక్తిగత జీవితాలను టార్గెట్ చేయడం నిరాశ కలిగించిందన్నారు. మేము నటులుగా ప్రజల దృష్టిలో ఎప్పుడూ ఉంటామని.. కానీ మా కుటుంబాలు వ్యక్తిగతమని మా తరఫున మంచు విష్ణు నోట్ విడుదల చేశారు.'సమాజంలో ఇటీవలి కాలంలో జరిగిన దురదృష్టకరమైన వ్యాఖ్యల నేపథ్యంలో.. వాటివల్ల కుటుంబాలకు కలిగిన బాధను ప్రస్తావించడం చాలా అవసరమని భావిస్తున్నా. మన పరిశ్రమ కూడా ఇతర రంగాల్లాగే పరస్పర గౌరవం, నమ్మకంతో నడుస్తుంది. నిజం కాని కథనాలను రాజకీయ లబ్ధి కోసం వాడటం చాలా నిరాశను కలిగించింది. మేము నటులుగా ప్రజల దృష్టిలో ఎప్పుడూ ఉంటాం.. కానీ మా కుటుంబాలు మాత్రం వ్యక్తిగతం. మిగిలిన అందరి కుటుంబాల్లాగే మాకు కూడా గౌరవం, రక్షణ అవసరం. ఎవరూ తమ కుటుంబ సభ్యులు టార్గెట్ అవ్వడం.. వారి వ్యక్తిగత జీవితాలపై అబద్ధపు ఆరోపణలు రావాలని ఇష్టపడరు. అదే విధంగా మేము కూడా మా కుటుంబాలకు గౌరవం ఇవ్వాలని కోరుకుంటున్నాం.'నోట్లో ప్రస్తావించారు.(ఇది చదవండి: నేను షాకయ్యా.. కొండా సురేఖ వ్యాఖ్యలపై ఆర్జీవీ రియాక్షన్)'రాజకీయ నాయకులు, ప్రభావవంతమైన వ్యక్తులకు నేను వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నా. దయచేసి రాజకీయాల కోసం, ప్రజల దృష్టి ఆకర్షించడానికి మా సినిమాకు చెందిన వారి పేర్లు, కుటుంబాల పేర్లు వాడకండి. చిత్రపరిశ్రమలో పనిచేసేవారు వినోదం ఇవ్వడానికి ఎంతో కష్టపడుతున్నారు. మా వ్యక్తిగత జీవితాలను ప్రజాక్షేత్రంలోకి లాగొద్దని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మనమందరం ఒకరినొకరు గౌరవించుకోవాలి. కేవలం వృత్తి పరంగానే కాకుండా.. మనుషులుగా కూడా మన కుటుంబాలపై వచ్చే అబద్ధపు కథనాల వల్ల కలిగే బాధ చాలా తీవ్రమైంది. ఇలాంటి సంఘటనల బాధని మాత్రమే కలిగిస్తాయని మనమందరం అంగీకరిద్దాం. సినీ ఇండస్ట్రీ తరపున మా కుటుంబాలకు అనవసరమైన, హానికరమైన పరిస్థితుల నుంచి దూరంగా ఉంచమని వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నా. నా చిత్రపరిశ్రమను ఎవరు బాధపెట్టాలని చూస్తే నేను మౌనంగా ఉండను. మేము ఇలాంటి దాడులను తట్టుకోం. అవసరమైతే మేమంతా ఏకమై నిలబడతాం' అంటూ లేఖ విడుదల చేశారు. Official Statement from Movie Artists Association (MAA) pic.twitter.com/vc4SWsnCj6— Vishnu Manchu (@iVishnuManchu) October 3, 2024 -
ఆ యూట్యూబర్‌పై శివ బాలాజీ ఫిర్యాదు
చిత్రపరిశ్రమలోని నటీనటులతో పాటు వారి కుటుంబసభ్యులను టార్గెట్ చేస్తూ వ్యక్తిగతంగా ట్రోల్స్ చేస్తున్నవారిపై ఇప్పటికే కేసులు నమోదయ్యాయి. ఈ విషయంలో మా అధ్యక్షులు మంచు విష్ణు పలు సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. ఈ క్రమంలో తాజాగా నటుడు, 'మా' కోశాధికారి శివ బాలాజీ పోలీసులను ఆశ్రయించారు.సినీ నటీనటులను టార్గెట్ చేస్తూ నిత్యం నెగెటివ్ ట్రోల్స్ చేస్తున్న యూట్యూబర్ విజయ్ చంద్రహాసన్ అనే వ్యక్తిపై హైదరాబాద్ సైబర్ క్రైమ్‌లో శివ బాలాజీ ఫిర్యాదు చేశారు. చంద్రహాసన్ గత కొంత కాలంగా నటీనటులతో పాటు మంచు విష్ణు, ఆయన నిర్మాణ సంస్థ గురించి తప్పుగా చూపుతూ.. ట్రోల్స్ చేస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. చిత్రపరిశ్రమలో భాగమైన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషషన్కు ఉన్న గౌరవాన్ని దెబ్బతీసేలా పలు వీడియోలు క్రియేట్ చేశాడని శివ బాలాజీ పేర్కొన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు యూట్యూబర్‌కు నోటీసులు పంపారు. కొద్దిరోజుల క్రితం సుమారు 18కి పైగా యూట్యూబ్ ఛానళ్లను రద్దు చేస్తున్నట్లు మంచు విష్ణు ప్రకటించిన విషయం తెలిసిందే. యూట్యూబర్స్లో మార్పు రాకుంటే వారిపై మరింత కఠనమైన నిర్ణయాలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. -
సినీ నటి హేమపై 'మా' సస్పెన్షన్ ఎత్తివేత
సినీ నటి హేమకు ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ (మా) శుభవార్త చెప్పింది. ఆమెపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేసినట్లు మా ప్రకటించింది. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో హేమ అరెస్టు అయిన సంగతి తెలిసిందే. అనంతరం ఆమెకు బెయిల్ కూడా రావడం జరిగింది. ఈ వివాదంలో చిక్కుకున్న హైమపై నైతికంగా ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు చర్యలు తీసుకున్నారు. మా నుంచి ఆమె ప్రాథమిక సభ్యత్వాన్ని వారు ఆ సమయంలో తొలగించారు. అయితే, హేమకు నిర్వహించిన రక్త పరీక్షలలో నెగటివ్ వచ్చిందని అందుకు సంబంధించిన రిపోర్టులను కూడా ఆమె సోషల్‌మీడియాలో పోస్ట్ చేసింది. ఆపై కోర్టు కూడా ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. దీంతో హేమపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేస్తున్నట్లు తాజాగా ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ (మా) ప్రకటించింది. అయితే, మీడియాతో సెన్సిటివ్ విషయాల గురించి మాట్లాడవద్దని హేమకు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సూచించింది. -
‘మా’కు మంచు విష్ణు రూ. 10 లక్షల విరాళం!
మంచు విష్ణు మరోసారి మంచి గొప్ప మనసు చాటుకున్నాడు. తన కూతురు ఐరా విద్యా బర్త్‌డే సందర్భంగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా)కి పది లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చారు. అసోసియేషన్‌లో ఆర్థికంగా వెనుకబడిన కళాకారుల సంక్షేమం కోసం పది లక్షలు విరాళంగా అందించారు. కళాకారులకు సహాయం చేయడం, వారికి అవసరమైన సపోర్ట్, సంరక్షణ అందేలా చేయడం కోసం ఈ మొత్తాన్ని వెచ్చించనున్నారు.గత మూడేళ్లుగా మంచు విష్ణు మా అధ్యక్షుడిగా కొనసాగుతూ.. అసోసియేషన్ మెంబర్లకు అండగా నిలుస్తున్నాడు. సినీ ఆర్టిస్టుల మీద సోషల్ మీడియాలో వచ్చే అసత్యపు కథనాలు, ట్రోలింగ్‌ను కట్టడి చేసేందుకు నడుంబిగించారు.నటులు, వారి కుటుంబాలను లక్ష్యంగా చేసుకుని కొంతమంది యూట్యూబర్లు పోస్ట్ చేసిన అసభ్యకరమైన, అవమానకరమైన కంటెంట్‌ను తీసి వేయించడంలో ప్రముఖ పాత్ర పోషించారు. విష్ణు చేపట్టిన ఈ చర్యలను ఇతర ఇండస్ట్రీలకు చెందిన ఆర్టిస్టులు కూడా ప్రశంసించారు.విష్ణు మంచు ప్రస్తుతం ‘కన్నప్ప’ చిత్రం ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. ఈ మూవీ డిసెంబర్ 2024లో విడుదల కానుంది. -
భవిష్యత్తులోనూ 'మా' పోరాటం కొనసాగిస్తాం: మంచు విష్ణు
టాలీవుడ్ నటీనటులపై సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారాలపై మా కఠిన చర్యలు చేపట్టింది. ఇప్పటికే పలు యూట్యూబ్ ఛానెళ్లను రద్దు చేసింది. ఇచ్చిన గడువులోగా అలాంటి వీడియోలు తొలగించకపోతే చర్యలు తప్పవని మా అధ్యక్షుడు మంచు విష్ణు హెచ్చరించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగానే దాదాపు 20కి పైగా యూట్యూబ్ ఛానెళ్లను బ్లాక్ చేయించారు.తాజాగా ఈ అంశంపై మా అధ్యక్షుడు మంచు విష్ణు అసోసియేషన్ సభ్యులతో సమావేశం నిర్వహించారు. సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్, అసత్య సమాచారాన్ని నియంత్రించేందుకు రాబోయే రోజుల్లో ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై సభ్యుల సూచనలు తీసుకున్నట్లు వివరించారు. ఈ విషయాన్ని మంచు విష్ణు తన ట్విటర్ ద్వారా పంచుకున్నారు. సోషల్ మీడియాలో నటీనటులపై అసత్యాలు, అగౌరవ పరిచేలా ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. భవిష్యత్తులోనూ ఇండస్ట్రీలో సమస్యలపై పోరాడేందుకు సభ్యుల నిబద్ధత చూస్తుంటే గర్వంగా ఉందన్నారు. On behalf of the MAA, we are honored to support our actors. #MAA President @iVishnuManchu has addressed key issues, particularly addressing disinformation & disrespect from some content creators. We are proud of our dedicated team and their innovative ideas for the future. pic.twitter.com/xohPmWT5WD— MAA Telugu (@itsmaatelugu) July 30, 2024 -
డీజీపీని కలిసిన 'మా' ప్రతినిధులు.. ట్రోలర్స్‌కు చుక్కలే!
సాక్షి, హైదరాబాద్: విమర్శ మంచిదే కానీ అది హద్దు దాటకూడదు. ఈ మధ్య కాలంలో పలువురు నెటిజన్లు, యూట్యూబర్స్.. సెలబ్రిటీలను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. వారు చేసే పని గురించే కాకుండా వ్యక్తిగత విషయాలను సైతం చర్చిస్తూ దారుణంగా కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో మా(మూవీ ఆర్టిస్టుల అసోసియేషన్) నటీనటుల గురించి అసభ్యంగా మాట్లాడిన ఐదు యూట్యూబ్ ఛానల్స్‌ను తొలగించింది.స్పెషల్ సెల్గురువారం నాడు మా బృందం డీజీపీ జితేందర్‌ను కలిసింది. సెలబ్రిటీలను టార్గెట్ చేసుకుని వీడియోలు వదులుతున్న 200 యూట్యూబ్ ఛానల్స్ లిస్టును డీజీపికి సమర్పిస్తూ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ ఫిర్యాదుపై సానుకూలంగా స్పందించిన ఆయన.. సైబర్ సెక్యూరిటీ వింగ్‌లోని ఓ స్పెషల్ సెల్ ఇకపై దీనిపైనే ఫోకస్ చేస్తుందని హామీ ఇచ్చారు. ట్రోలర్స్‌పై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.ఫ్యామిలీని కూడా వదలట్లేదుఅనంతరం రాజీవ్ కనకాల మాట్లాడుతూ.. ట్రోల్స్ నవ్వుకునేలా ఉండాలి కానీ ఏడిపించేలా ఉండొద్దు. కుటుంబ సభ్యుల మీద కూడా ట్రోల్ చేయడం దారుణం. ఇకమీదట నటీనటులను ట్రోల్స్ చేస్తే సహించేది లేదు అని వార్నింగ్ ఇచ్చారు. శివ బాలాజీ మాట్లాడుతూ.. దారుణమైన ట్రోల్స్‌కు పాల్పడేవారిని టెర్రరిస్టులుగా పరిగణిస్తాం. సుమారు 200 యూట్యూబ్ ఛానల్స్ లిస్టును డీజీపీకి సమర్పించాం. ఆయన సానుకూలంగా స్పందించారు అని తెలిపారు.మహిళా ఆర్టిస్టులే టార్గెట్నటుడు శివకృష్ణ మాట్లాడుతూ.. మహిళా ఆర్టిస్టుల క్యారెక్టర్‌ను దారుణంగా చిత్రీకరిస్తున్నారు. కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ డబ్బు కోసం ఇలా చేస్తున్నాయి. కానీ దీనివల్ల లేడీ ఆర్టిస్టులు ఎక్కువ ఇబ్బందిపడుతున్నారు అని చెప్పుకొచ్చారు.చదవండి: మరో రెండు ఓటీటీల్లోకి తెలుగు యాక్షన్ మూవీ.. ఎక్కడంటే? -
రాజ్ తరుణ్- లావణ్య ఎపిసోడ్.. మంచు విష్ణుపై పెరుగుతున్న ఒత్తిడి!
ప్రస్తుతం రాజ్ తరుణ్-లావణ్య ఎపిసోడ్ టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పరస్పర ఆరోపణలు, ట్విస్టులతో మరిన్ని మలుపులు తిరుగుతోంది. ఈ వివాదంపై కేసులు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.అయితే ఈ అంశంలో రాజ్ తరుణ్‌పై మా అసోసియేషన్ చర్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది. ఈ వివాదంపై షోకాజ్ నోటీసులు ఇచ్చే ఆలోచనలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే మా సభ్యులతో మంచు విష్ణు చర్చించినట్లు టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. అతన్ని మా నుంచి సస్పెండ్ చేయాలని కొంత మంది సభ్యులు కోరుతున్నట్లు తెలుస్తోంది.హేమ, ప్రణీత్ హనుమంతు విషయంలో వేగంగా స్పందించిన మంచు విష్ణు.. రాజ్ తరుణ్ విషయంలో త్వరగా నిర్ణయం తీసుకోవాలి కొంత మంది మా సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. కాగా.. ఈడో రకం.. ఆడో రకం సినిమాలో మంచు విష్ణు, రాజ్ తరుణ్ కలిసి నటించారు. -
ఆవేదనతో మంచు విష్ణుకు నటి హేమ లేఖ
బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ దగ్గర్లో ఉన్న జీఆర్ ఫాంహౌస్‌లో మే 19న రాత్రి జరిగిన ఒక రేవ్ పార్టీలో నటి హేమ పాల్గొన్నారు. అక్కడ హేమ డ్రగ్స్ తీసుకున్నట్లు ఆధారాలు ఉన్నాయిని పరప్పన అగ్రహార జైలుకు ఆమెను తరలించడం ఆపై బెయిల్ ద్వారా విడుదల కావడం జరిగింది. కానీ, తాను ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదని ఆమె పలుమార్లు క్లారిటీ ఇచ్చింది. ఈ వివాదం వల్ల ఆమెను మా సభ్యత్వం నుంచి తొలగిస్తున్నట్లు మంచు విష్ణు ప్రకటించారు. తాజాగా హేమ ఒక సుదీర్ఘమైన లేఖను రాసి మంచు విష్ణుతో పాటు మా వ్యవస్థాపకులు మెగాస్టార్ చిరంజీవికి పంపారు.'సుమారు పదేళ్ల పాటు నేను మా సభ్యురాలిగా ఉన్నాను. చిత్రపరిశ్రమలో 'మా' ఒక అమ్మలా నన్ను రక్షిస్తుందని కోరుకుంటున్నాను. దాదాపు నెల రోజుల క్రితం ఒక రేవ్ పార్టీలో పాల్గొన్నాను. అందులో నేను ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదు. మీడియా దుష్ప్రచారం చేయడం వల్ల ఇదంతా జరిగింది. దీంతో నా కుటుంబసభ్యులకు తీవ్రమైన వేదన మిగిలింది. అనంతరం నన్ను మా సభ్యత్వం నుంచి తొలగించారు. ఈ నిర్ణయం నాలో అంతులేని ఆవేదనను కలిగించింది. 'మా' బైలాస్ ప్రకారం నాకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలి. నా నుంచి వివరణ తీసుకోవాలి. నేను ఇచ్చిన వివరణలో లోపాలు ఉంటే నాపై చర్యలు తీసుకోవాలి. నాపై ఆరోపణలు మాత్రమే ఉన్నాయి. కోర్టు కూడా నేను తప్పు చేసినట్లు ప్రకటించలేదు. మీడియా మాత్రమే నన్ను దోషిగా చూపించేందుకు ప్రయత్నం చేసింది. ఈ పరిణామాలు నా వ్యక్తిత్వాన్ని వ్యక్తిగత జీవితాన్ని హాననం చేసింది.నాకు సంబంధం లేని విషయాలను నాకు అంటగట్టి నన్ను విలన్‌గా చిత్రీకరించే ప్రయత్నం చేసారు. మీడియా ఒత్తిడికి లోబడి నన్ను సస్పెండ్ చేయడం నా ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడమే. తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్న ఈ సమయంలో నాకు మా అండగా ఉండాలి. నా సస్పెన్షన్ ను వెంటనే ఎత్తి వేస్తారు అని ఆశిస్తున్నాను.' అని హేమ ఒక లేఖ రాశారు. తనకు సంబంధించిన మెడికల్ రిపోర్ట్స్‌ను కూడా ఆమె జతచేశారు. ఈ లేఖ విషయంలో మా అధ్యక్షడు మంచు విష్ణు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియాల్సి ఉంది. -
Bangalore Rave Party: ‘మా’ నుంచి హేమ సస్పెండ్
బెంగళూరు రేవ్ పార్టీ కేసులో అరెస్టయిన టాలీవుడ్ నటి హేమపై మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ (మా) సస్పెషన్ వేటు వేసింది. హేమను ‘మా’ నుంచి సస్పెండ్ చేయడానికి సభ్యుల అభిప్రాయాలు కోరుతూ ప్రెసిడెంట్ మంచు విష్ణు బుధవారం మా అసోసియేషన్ గ్రూప్ లో మెసేజ్ పెట్టారు. అయితే సభ్యులంతా హేమను సస్పెండ్ చేయాల్సిందే అంటూ రిప్లయ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో హేమను సస్పెండ్ చేయాలని మంచు విష్ణు నిర్ణయం తీసుకున్నారు. హేమకు క్లీన్ చిట్ వచ్చేవరకు ఈ సస్పెన్షన్ కొనసాగుతుందని ప్రకటించారు. కాగా.. బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో హేమ దొరికిపోయారు. వైద్య పరీక్షల్లోనూ ఆమెకు పాజిటివ్‌గా తేలింది. ఇటీవలే ఆమెను అరెస్ట్ చేసిన బెంగళూరు పోలీసులు రిమాండ్‌కు తరలించారు. -
విచ్చలవిడిగా సైబర్ క్రైమ్స్
సైబర్ నేరాలకు, మోసాలకు అడ్డుఆపు లేకుండా పోతోంది. ప్రతిరోజూ కొత్త కొత్త రూపాలలో ఈ నేరాలు వెలుగుచూస్తున్నాయి. పోలీస్ డ్రెస్ వేసుకొని, పోలీస్టేషన్ ఆఫీస్ బ్యాంక్ గ్రౌండ్లో కూర్చొని పోలీసులమని చెబుతూ నేరగాళ్ళు అమాయకులతో ఆడుకుంటున్నారు. మీమీద చాలా కంప్లైంట్స్ ఉన్నాయని, మీ పేరుతో మొబైల్ నెంబర్ తీసుకున్నట్లు సమాచారం వుందని, ఆ నెంబర్ నుంచి నేరమయమైన కమ్యూనికేషన్ ఉందని, మీ ఆధార్ కార్డుతో బ్యాంక్ అకౌంట్ ఉందని, అందులో కోట్లాదిరూపాయల లావాదేవీలు జరిగాయని, మనీ ల్యాండరింగ్ కేసు బుక్ అయిందని, విదేశాల లావాదేవీలు కూడా జరిగాయని, మీరు వెంటనే ముంబయి పోలీస్ స్టేషన్‌కు రావాలని, మిమ్మల్ని అరెస్టు చేయాలని, మీరు మాకు సహకరిస్తే, మిమ్మల్ని ఈ మోసం నుంచి కాపాడుతామని చెబుతూ, అమాయకుల నుంచి బ్యాంక్ వివరాలు, ఆధార్ కార్డు వివరాలు తీసుకోవడం మొదలైన చర్యలు ఈ నేరగాళ్ళు చేస్తున్నారు.పోలీసులు వేషాలతో, పోలీసులు కార్యాలయం నుంచి మాట్లాడుతున్నట్లుగా వాట్సాప్‌లో వీడియో కాల్లో మాట్లాడుతూ అమాయకులతో ఆడుకుంటున్నారు. పోలీస్ వేషంలో ఉండడంతో, నిజమైన పోలీసులే ఆనుకొని, తమ నిజాయితీని నిరూపించుకొనే దిశగా అమాయకంగా సమాచారం ఇస్తూ సామాన్యులు చాలా ఇబ్బందులు పడుతున్నారు.ఉద్యోగాలు ఇప్పిస్తామని, లాటరీ అని, ఇలా ఎన్నో రకాలుగా సైబర్ నేరగాళ్ళు చెలరేగిపోతున్నారు. ఇటువంటి ఫేక్ కాల్స్ ఎదుర్కొంటున్నవాళ్ళలో మేధావులు, చదువుకున్నవాళ్ళు కూడా ఉండడం గమనించదగిన అంశం. జర్నలిస్టులు, డాక్టర్లు, ప్రొఫెసర్లు, ఇంజనీర్లు, సాఫ్ట్ వేర్ ఉన్నత ఉద్యోగులు కూడా ఉన్నారని తెలుస్తోంది. ప్రజల్లో అవగాహన కలిపించే దిశగా పోలీసులు, సైబర్ సాంకేతిక నిపుణులు, సంబంధిత వర్గాలు, మేధావులు, సామాజిక బాధ్యత కలిగిన పౌరులు కృషి చేస్తూనే వున్నారు.కమ్యూనికేషన్ రంగం విస్తృతంగా ప్రజలకు చేరుతోంది. దానికి తగ్గట్టుగా విజ్ఞానం, మెలుకువలు పెరగడం లేదన్నది వాస్తవం. దేశంలోనూ,ప్రపంచ వ్యాప్తంగా ప్రతి రోజూ కొన్ని లక్షల మంది సైబర్ మోసాలకు బలవుతున్నారు. మోసపోతున్నవారిలో నిరక్షరాస్యులే కాదు అక్షరాస్యులు కూడా ఉంటున్నారు. ఆ మధ్య మహారాష్ట్రలో జరిగిన సంఘటన ఈ తీరుకు అద్దం పట్టింది. న్యాయస్థానంలో సూపరింటెండెంటుగా పనిచేసి రిటైరయిన ఓ మహిళ ఏకంగా కోటి రూపాయలకు పైగా పోగొట్టుకుంది.కేవలం సోషల్ మీడియాలో పరిచయాలు, తదనంతర పరిణామాలు ఈ మోసానికి ఆసరాగా నిలిచాయి. బంగారం బహుమతులుగా అందుకోండని యూకే నుంచి వచ్చిన ఫోన్ కు ఆమె చిక్కుకున్నారు. కస్టమ్స్ పన్ను చెల్లించాలని చెప్పగానే వెంటనే 1.12 కోట్లు ఆమె ట్రాన్స్ఫర్ చేశారు. ఆ తర్వాత ఆ వ్యక్తి నుంచి ఎటువంటి స్పందన లేకపోగా, ఫోన్ కు కూడా అందకుండా ఉన్న పరిస్థితి ఎదురైంది. మోసపోయానని గ్రహించిన తర్వాత ఆ మహిళ పోలీసులను ఆశ్రయించింది. బహుమతులు వచ్చాయి, పన్ను కట్టాలని ఫోన్ వచ్చినప్పుడే పోలీసులను సంప్రదించి వుంటే? ఆమె నష్టపోయేది కాదు.చేతిలో ఫోన్ ఉంది కదా! అని ముక్కుముఖం తెలియనివారితో స్నేహం చేయడమే మొదటి తప్పు. మనకు సంబంధించిన సమాచారం అందరితో పంచుకోవడం రెండో తప్పు. బహుమతులకు ఆశపడడం ఇంకో తప్పు. ఇటువంటి ఫోన్స్, మెసేజెస్ వచ్చినప్పుడు ముందుగానే పోలీసుల దృష్టికి తీసుకెళ్ళక పోవడం అంతకు మించిన తప్పు.జరగాల్సిన నష్టం జరిగిన తర్వాత ఎవరినన్నా ఏమీ ప్రయోజనం లేదు. ఇలా ఎన్నో మోసాలు ప్రతిరోజూ జరుగుతూనే ఉన్నాయి. బ్యాంకులు కూడా ఈమెయిల్స్, మెసేజెస్ రూపంలో ప్రతిరోజూ ఖాతాదారులను అప్రమత్తం చేస్తూనే ఉన్నాయి. ఇక లోన్ యాప్ ల దారుణాలు అన్నీ ఇన్నీ కావు. మెసేజెస్ రావడమే ఆలస్యం వెంటనే క్లిక్ చేసి కొంతమంది దొరికిపోతున్నారు.లక్ష పెట్టుబడితో కేవలం 8 నెలల్లోనే 4 కోట్లు సొంతం చేసుకోండని కనిపించిన యాప్‌ను చూసి వెంటనే డబ్బులు కట్టేసి ఎంతోమంది మోసపోయిన వార్త ఆ మధ్య బయటకు వచ్చింది. ఆన్ లైన్ ట్రేడింగ్‌లో ఆ భారీ మోసం జరిగింది. ఈ మోసం విలువ 100కోట్ల పైనేనని ప్రాథమిక విచారణలో పోలీసులు గుర్తించారు. పూర్తిగా దర్యాప్తు జరిగితే మోసాల చిట్టా మరింత బయటపడుతుంది. ఇలాంటి సంస్థలు దేశ వ్యాప్తంగా పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి.మోసపోయాక లక్షలాది మంది రోడ్డు మీదకు వస్తున్నారు. సాధారణంగా ఆన్ లైన్ ట్రేడింగ్‌కు సెబీ గుర్తించిన సాంకేతికతను వినియోగించాలి. ప్రజలవ్వేమీ చూసుకోవడం లేదు. మొదటిది అవగాహన లేకపోవడం, రెండోది అత్యాశ. ఫోన్స్ హ్యాక్ చేస్తూ కోట్లాది రూపాయలు కొట్టేసిన ఉదంతాలు కూడా మనం వింటూనే ఉన్నాం. నకిలీ యాప్స్ తో పాటు నకిలీ పేర్లతో సోషల్ మీడియా వేదికలు కూడా నిర్మించి మోసాలకు తెరతీస్తున్నారు. నకిలీ మెయిల్స్ కూడా సృష్టిస్తున్నారు.వాట్సాప్ స్టేటస్లు చూసి కొందరు మోసపోతున్నారు. ముఖ్యంగా ప్రజల ఆధార్ కార్డు అనేక విభాగాలతో అనుసంధానమై ఉండడం వల్ల కూడా ఇటువంటి నేరాలకు అవకాశం ఇస్తోందనే విమర్శలు కూడా వస్తున్నాయి. ఆధార్ కార్డును కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేయడంపై విమర్శలు పెరుగుతున్నాయి. మొత్తంగా చూస్తే సామాన్యుల రక్షణ ప్రశ్నార్ధకమవుతోంది. బ్యాంకుల్లో డబ్బులు ఉంచుకోవాలా? లేదా అనే సందేహాలు కూడా ప్రజల్లో వస్తున్నాయి.ఈ సైబర్ మోసాలు ఇన్నిన్ని కాదయా! అని చెప్పవచ్చు. అన్ని వేళలా అప్రమత్తంగా ఉండడం, అత్యాశకు పోకుండా ఉండడం, అందరినీ నమ్మకుండా ఉండడం, ముందుగానే పోలీసులను, సంబంధిత అధికారులను సంప్రదించడం తప్ప వేరు మార్గాలు లేవు. కోట్లాదిగా పెరిగిపోతున్న నకిలీ సైబర్ వ్యవస్థలను పూర్తిగా నియంత్రించే శక్తి ఏ ప్రభుత్వాలకు ఉండదు. స్వయం నియంత్రణ కూడా అవసరం.-మాశర్మ -
మరోసారి మా అధ్యక్షునిగా మంచు విష్ణు!
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) అధ్యక్షునిగా మంచు విష్ణునే కొనసాగించాలని కమిటీ సభ్యులు నిర్ణయించారు. ఎన్నికలకు వెళ్లకుండా విష్ణు పేరును కమిటీ ఖరారు చేసింది. ఇప్పటికే విష్ణు మా అధ్యక్షునిగా ఉన్నారు. మా అధ్యక్ష భవన నిర్మాణం పూర్తయ్యే వరకు ఆయననే కొనసాగించాలని 26 మంది సభ్యుల కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయించింది. -
ముందు ఉట్టి కొడదాం!
'ఉట్టి కొట్టలేనమ్మ.. స్వర్గానికి నిచ్చెనలు వేసింది' అన్న చందంగా, భూమిపై బతకడం చేతకాని మనిషి అంతరిక్షంలో కాలనీలు కట్టి కాపరం చేస్తానంటున్నాడు. ఆ దిశగా ఆధునిక మానవుడు పరిశోధనలు ముమ్మరం చేస్తున్నాడు. కానీ, అది అంత తేలిక కాదు, పైగా మనిషిని మనిషే చంపుకొని తినే దారుణమైన పరిస్థితులు వస్తాయని కొందరు శాస్త్రవేత్తలు భయపడుతున్నారు. కరోనా వంటి ఊహాతీతమైన వ్యాధులు వచ్చి, మనిషిని పట్టి పీడిస్తున్నాయి. భవిష్యత్తులో ఇంకా ఎటువంటి వ్యాధులను ఎదుర్కోవాల్సి వస్తుందోనని మనిషి భయపడుతూనే ఉన్నాడు. కొత్త కొత్త వైరస్లు పుట్టుకొస్తూ వుంటే శాస్త్రవేత్తలు సైతం కంగారుపడిపోతున్నారు. సామాన్య మానవులు బెంబేలెత్తి పోతున్నారు. ఇది ఇలా ఉంటుండగానే, భూమి నుంచి దూరంగా వెళ్ళి, వేరే స్పేస్ లో జీవించవచ్చు అనే విశ్వాసాన్నీ పెంచుకుంటున్నాడు. ఇది కొత్తగా పుట్టిన కోరిక కాదు. ఎప్పటి నుంచో మనిషి ఆలోచిస్తున్నాడు. కరోనా కాలానికి ముందే కొందరు శాస్త్రవేత్తలు అంతరిక్ష జీవనాన్ని ప్రచారంలోకి తెచ్చారు. సాధ్యాసాధ్యాలపై ఇంకా విస్తృతంగా అధ్యాయనాలు జరుగుతూనే ఉన్నాయి. కొత్త ప్రపంచంలోకి అడుగు పెడదాం, కొత్త లోకాల్లో విహరిద్దాం అని మనిషి ఎప్పటి నుంచో కలలు కంటున్నాడు. భూమిపై ఏదైనా విపత్తు వచ్చినా, పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా వసతులు, వనరులు సరిపోకపోయినా.. పైకెళ్లి జీవించాలనే ఆలోచనలకు శాస్త్రవేత్తలు మరింత పదునుపెడుతున్నారు. అంగారక గ్రహం లేదా చంద్రమండలంపై కాలనీలు నిర్మంచి జీవించవచ్చు అని శాస్త్రవేత్తలు ఇప్పటికే గుర్తించారు కూడా! భూమి నుంచి ఆహారాన్ని పంపించే పరిస్థితులపైనా దృష్టి సారిస్తున్నారు. ఇవ్వన్నీ సాధించడానికి సుదీర్ఘకాలం వేచి చూడాల్సిందేనని అర్థం చేసుకోవాలి. ఆ మధ్య ఎడిన్ బర్గ్ యూనివర్సిటీకి చెందిన చార్లెస్ కొకెల్ కొత్త సిద్ధాంతాన్ని తెరపైకి తెచ్చారు. పాత విషయాలను కొన్నింటిని గుర్తు చేశారు. నిజంగా భూమి నివాసయోగ్యం కానప్పుడు అంతరిక్షం వైపు చూడవచ్చు. కానీ, దానిని సాధించాలంటే ఇంకా ఎన్నో పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుందని ఆయన చెబుతున్నారు. 19వ శతాబ్దంలో నార్త్ వెస్ట్ పాసేజ్‌ను వెతకాడానికి కెప్టెన్ సర్ జాన్ ఫ్రాంక్లిన్ బయలుదేరారు. సాంకేతిక సమస్య తలెత్తడంతో దారి తప్పారు. అత్యుత్తమ సాంకేతికత అందుబాటులో ఉన్నా, వారంతా ఒకరినొకరు చంపుకుతినే దారుణమైన దుస్థితి వచ్చిందని ప్రొఫెసర్ చార్లెస్ కొకెల్ గుర్తుచేస్తున్నాడు. అంతరిక్షంలో కూడా అటువంటి పరిస్థితులు వస్తాయని హెచ్చరిస్తున్నాడు. వనరులు, వసతులతో పాటు ఆహారకొరత ప్రధాన సమస్యగా నిలుస్తుందని ఆయన భావిస్తున్నాడు. డాక్టర్ కామెరన్ స్మిత్ కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాడు. అంతరిక్షంలో మానవ మనుగడ వేళ్లూనుకోవాలంటే? వ్యవసాయ వ్యవస్థను అభివృద్ధి చేయాలని ఎడిన్ బర్గ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు గట్టిగా చెబుతున్నారు. గ్రహాంతర వాసులకోసం వెతుకులాట కూడా ఇప్పటికే మొదలైంది. అంతరిక్షంలోకి వెళ్లబోయే ముందు, ఈ భూమిని పవిత్రంగా, పచ్చగా కాపాడుకోవడం ముఖ్యం. స్వార్థం శృతి మించి, కోరికలు, విలాసాలు ఆకాశాన్ని అంటిన ఆధునిక మానవుడు సహజ వనరులను ధ్వంసం చేసుకుంటూ వెళ్తున్నాడు. తత్ఫలితంగా అడువులు అంతరించి పోతున్నాయి, జీవనదులు ఇంకిపోతున్నాయి. భూమి క్రుంగిపోతోంది, సముద్ర మట్టాలు పెరిగి పోతున్నాయి. అగ్ని గోళాలు బద్ధలై పోతున్నాయి. ఒక్కటేమిటి? విశ్వరూపమే మారిపోతోంది. ప్రకృతిని అందినకాడికి అంతం చేసుకుంటూ వెళ్తున్న క్రమంలో రుతువుల గమనం మారిపోయింది. భూమి వేడెక్కిపోతోంది. అతివృష్టి అనావృష్టి, ప్రకృతి వైపరీత్యాలు ప్రబలి పోయాయి. ఆణువణువూ కాలుష్య కాసారంగా మారింది. పీల్చే గాలి, త్రాగే నీరు, తినే ఆహారం అంతా కలుషితమై పోయింది. ఇంటాబయటా అంతా కాలుష్యమే. దీనికి ముందుగా మనిషి మనసే అత్యంత కలుషితమై పోయింది. అందుకే, కొంగ్రొత్త వింత వ్యాధులు పుట్టుకొస్తున్నాయి. మంచినీరే కాదు, మంచిగాలి కూడా కొనడానికి కూడా దొరకని దుస్థితి వచ్చేసింది. పల్లెల ముఖచిత్రం మారిపోయింది. చేతివృత్తులు ఎగిరిపోయాయి. వ్యవసాయ విధానమే మారిపోయింది. ఆహారరక్షణపై శాస్త్రవేత్తలు హెచ్చరిస్తూనే ఉన్నారు. అంతరిక్షానికి ఆహార సరఫరా సంగతి తర్వాత చూద్దాం. ముందుగా, భూమిపై పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా ఆహార ఉత్పత్తి జరగడమే ప్రమాదంలో పడింది. ఆధునిక మానవుడు ఎక్కడ కాలు పెడితే అక్కడ భస్మమై పోతోంది. భూమిని పాడుచెయ్యడమే కాక, గ్రహాలను సైతం పాడు చెయ్యడానికి మనిషి తయారవుతున్నాడని కొందరు శాస్త్రవేత్తలు, మేధావులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ తరుణంలో, కరోనా వంటి ప్రాణాంతకమైన వ్యాధులు ప్రబలకుండా చూడడం శాస్త్రవేత్తల ప్రథమ కర్తవ్యం. ప్రకృతిని, భూభాగాన్ని రక్షించుకోవడం మానవాళి ప్రాథమిక అవసరం. సహజ వనరులను నిలబెట్టు కోవడం అత్యంత ముఖ్యమైన అంశం. వీటన్నిటిపై దృష్టి సారించడమే అందరి తక్షణ కర్తవ్యం. సమాంతరంగా అంతరిక్ష పరిశోధనలు కొనసాగించుకోవచ్చు. అన్నింటి కంటే ముందుగా, మంచి వైపు మనిషి మారితే? అంతా మంచే జరుగుతుందని విశ్వసిద్దాం. - మాశర్మ -
మా సస్పెన్షన్.. కరాటే కల్యాణ్ రియాక్షన్ ఇదే!
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ నుంచి సస్పెండ్ చేయడంపై నటి కరాటే కల్యాణి రియాక్ట్ అయ్యారు. సినీ పరిశ్రమ కోసం తాను పడిన కష్టానికి బాగా బుద్ధి చెప్పారని అన్నారు. మా సస్పెండ్ చేయడంతో చాలా బాధపడ్డానని తెలిపారు. మాపై ఎవరు ఎన్ని కుయుక్తులు పన్నినా తన పోరాటం ఆగదని స్పష్టం చేశారు. తన నిజాయితీకి ఇచ్చే బహుమతి ఇదేనా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. (ఇది చదవండి: శ్రీలీలను కొట్టిన బాలకృష్ణ! అసలేం జరిగిందంటే?) కాగా.. ఖమ్మంలోని లకారం ట్యాంక్‌బండ్‌పై సీనియర్ ఎన్టీఆర్ విగ్రహా ఏర్పాటుపై ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో మా చర్యలు చేపట్టింది. ఎన్టీఆర్‌పై చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాల్సిందిగా ‘మా’ షోకాజ్ నోటీసులు కూడా ఇచ్చింది. (ఇది చదవండి: తిరుమలకు నిహారిక భర్త.. మళ్లీ మొదలైన చర్చ!) కరాటే కల్యాణి మాట్లాడుతూ..' 23 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నా. ఎవరు, ఎప్పుడు, ఏం మాట్లాడినా నేనే అడ్డుపడినా. పూసుకుని, రాసుకుని నా ఇండస్ట్రీ, నా ఇండస్ట్రీ అనుకుని వెళ్లా. అలా వెళ్లినందుకు నా నిజాయతీకి తగిన బగుమతి దక్కింది. నేను ఎన్టీఆర్ విగ్రహాన్ని పెట్టమనే అడిగాను. వ్యతిరేకించట్లేదు. కృష్ణుడి రూపంలో వద్దని చెప్పా. దీనికి నా మీద ఎందుకు కక్ష కడుతున్నారు. నా ఆరోగ్యం బాగోలేక సమాధానం ఇవ్వలేకపోయా. మూడు రోజులు మాత్రమే గడువిచ్చారు. కనీసం వారం రోజులు కావాలని నోటీసు కూడా ఇచ్చా. అందుకే నన్ను సస్పెండ్ చేశారు. నాకు ఎవరిపైనా వ్యక్తిగత ద్వేషం లేదు. మా అసోసియేషన్‌ను కించపరచలేదు. నేను ఏ తప్పూ చేయలేదు. బహుశా ఎవరి ఒత్తిడితోనైనా ఆ నిర్ణయం తీసుకున్నారేమో తెలియదు.' అని చెప్పుకొచ్చారు. -
కరాటే కల్యాణికి బిగ్ షాక్.. మా సభ్యత్వం రద్దు!
సినీనటి కరాటే కళ్యాణికి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ షాకిచ్చింది. ఆమెను మా నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు కల్యాణి సభ్యత్వాన్ని రద్దు చేస్తూ మా జనరల్ సెక్రటరీ రఘుబాబు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయాన్ని ఆమెకు వివరిస్తూ లేఖ రాశారు. శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుపై ఇటీవల ఆమె చేసిన వ్యాఖ్యలపై నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఆమె వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన మా అధ్యక్షుడు మంచు విష్ణు షోకాజ్ నోటీసు జారీ చేసి వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. (ఇది చదవండి: కరాటే కల్యాణికి 'మా' షోకాజ్ నోటీసులు.. ఎందుకంటే?) అయితే మా నోటీసులపై స్పందించిన కరాటే కళ్యాణ్ ఈ నెల 16న తన వివరణ ఇచ్చింది. అయినప్పటికీ ఆమె సమాధానం పట్ల మా అసోసియేషన్ అసంతృప్తి వ్యక్తి చేసింది. ఈ నెల 23న జరిగిన కార్యవర్గ సమావేశంలో నిబంధనల ప్రకారం కరాటే కల్యాణిని సస్పెండ్ చేస్తున్నట్లు రఘుబాబు ప్రకటించారు. మరి ఈ విషయమై కరాటే కళ్యాణి ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. (ఇది చదవండి: ఆయన సినిమాలు చూస్తూ పెరిగా: మంచు విష్ణు ఎమోషనల్) అసలేం జరిగిందంటే.. సీనియర్ ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని ఖమ్మంలో 54 అడుగుల ఈ విగ్రహావిష్కరణ మే 28న జరగనుంది. అయితే కృష్ణుడు రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయటానికి వీల్లేదంటూ కరాటే కల్యాణి వ్యాఖ్యానించారు. ఎందుకు దేవుడు రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నారు? అంటూ ప్రశ్నించింది. దీంతో ఎన్టీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆమెపై మా అసోసియేషన్ చర్యలు తీసుకుంది. -
కరాటే కల్యాణికి 'మా' షోకాజ్ నోటీసులు.. ఎందుకంటే?
సినీ నటి కరాటే కల్యాణికి మా అసోసియేషన్ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. సీనియర్ నటుడు ఎన్టీఆర్‌పై చేసిన కామెంట్స్‌పై వివరణ ఇవ్వాలని నోటిసులిచ్చింది. లేనిపక్షంలో తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. కల్యాణి చేసిన వ్యాఖ్యలను దృష్టిలో ఉంచుకుని క్రమశిక్షణ ఉల్లంఘన కింద ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు ఆమెకు నోటీసులు జారీ చేశారు. ఆమె చేసిన వ్యాఖ్యల పట్ల మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని పేర్కొన్నారు. (ఇది చదవండి: 'బంగారం' సినిమాలో చిన్నారి.. ఇంతలా మారిపోయిందేంటీ?) ఖమ్మంలో కృష్ణుడు రూపంలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుపై కరాటే కల్యాణి అభ్యంతరం వ్యక్తం చేసింది. ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ నేపథ్యంలో ఆమె వ్యాఖ్యలను పలువురు నెటిజన్లు తప్పుబడుతున్నారు. ఆమె అలా మాట్లాడటం సరి కాదని అంటున్నారు. (ఇది చదవండి: నరేశ్- పవిత్రా లోకేశ్ 'మళ్లీ పెళ్లి'.. రొమాంటిక్ సాంగ్ రిలీజ్) -
మాట నిలబెట్టుకున్న మంచు విష్ణు.. మా సభ్యులకు ఫ్రీ హెల్త్ చెకప్
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులకు ఉచితంగా హెల్త్ చెకప్ నిర్వహించారు. కాంటినెంటల్ హాస్పిటల్స్ (Continental Hospitals) సహాయంతో మా సభ్యులందరికి పూర్తి మాస్టర్ చెకప్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో మా ప్రిసిడెంట్ మంచు విష్ణు మాట్లాడుతూ.. కాంటినెంటల్ హాస్పిటల్ చైర్మెన్ గురునాథ్ రెడ్డి, రఘునాథ్ రెడ్డి, డాక్టర్ మేఘనాథ్ రెడ్డిలకి ధన్యవాదాలు తెలిపాడు. 'జనరల్ గా మాస్టర్ హెల్త్ చెకప్ కి పదివేలు అవుతుంది, కానీ కాంటినెంటల్ హాస్పిటల్స్ మాకు ఉచితంగా సర్వీస్ చేస్తున్నందుకు చాలా సంతోషం' అని విష్ణు పేర్కొన్నారు. మా వైస్ ప్రెసిడెంట్ మాదాల రవి మాట్లాడుతూ ''మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ చేస్తున్న మూడవ హెల్త్ చెకప్ ఇది. మా సభ్యులందరికి 3 లక్షల విలువ చేసే హెల్త్ భీమాని ఉచితంగా అందిస్తున్నాం" అని తెలిపారు. View this post on Instagram A post shared by Vishnu Manchu (@vishnumanchu) -
ఈ అభిజాత్యం సబబేనా?
‘మా’ సంస్థను బహుళార్థసాధక, సాంస్కృతిక సంస్థగా రూపొందించే ఉద్దేశంతో... ప్రత్యామ్నాయ ఎజెండాతో ముందుకు వచ్చినంత మాత్రాన తోటి కళాకారుడిగా ప్రకాష్ రాజ్‌ని న్యూనపరిచే సంస్కృతి ‘మా’ లోని ‘పొట్టిబావల’కు ఉండకూడదు! ఉభయ వర్గాల మధ్య జరిగిన శషభిషల మధ్య నలిగిపోయి, ఆంధ్ర– కన్నడల ఉమ్మడి చారిత్రక బంధాలకే చేటుకూడినంత పనయింది! కనీసం ‘తెలుగదేలయన్న దేశంబు తెలుగు’ అని గుర్తుచేసిన కృష్ణదేవరాయలు కూడా ‘మా’ సభ్యులకు గుర్తు రాకపోవడం ఆశ్చర్యం. ప్రకాష్‌రాజ్ నోట... చివరికి నేను తెలుగువాడిని కాదన్న మాట ఇప్పుడు తెలిసివచ్చిందన్న ప్రకటనలోని బాధను, మనోవేదనను ఇప్పటికైనా ‘మా’ తెలుసుకోవాలి. ‘అంటరానితనంబునట్టి భారతజాతి ప్రపంచ సభ్యతనే కోల్పోయింద’ ని భావిం చిన మహాకవి జాషువా. అలా తామె పుట్టరాని చోట పుట్టామన్న అనంతమైన బాధను ఎందుకు గుండె బరువుతో మరింత కొంత ముందుకు సాగి ఇలా వ్యక్తం చేయవలసి వచ్చిందో గమనించండి. ‘ఎంత కోయిలపాట వృ«థయయ్యెనో కదా/ చిక్కు చీకటి వన సీమలందు / ఎన్ని వెన్నెల వాగులింకిపోయెనో కదా/ కటిక కొండల మీద మిటకరించి/ ఎన్ని కస్తూరి జింక లీడేరెనో కదా/ మురికి తిన్నెల మీద పరిమళించి/ ఎన్ని ముత్తెపురాలు ఖిన్నమయ్యెనో కదా/ పండిన వెదురు జొంపములలోన / ఎంత గంధవహన మెంత తంగెటి జున్ను / యెంత రత్నకాంతి యెంత శాంతి/ ప్రకృతి గర్భమందు! భగ్నమై పోయెనో / – పుట్టరాని చోట పుట్టుకతన’’! ఎందుకంతగా జాషువా భగ్నహృదయుడు కావలసి వచ్చింది? మనుషులు ఎదిగారు గానీ మనసులు ఎదగలేదని ‘పొట్టిబావ’ లాంటి ఒక బొటనవేలంత ఎత్తుకు మించని ఒకానొక ‘మా’ సంస్థ తన స్థాయిని మించి యావదాంధ్ర ప్రేక్షక లోకాన్ని కల్లోల పరచడానికి ఎందుకు ప్రయత్నించింది! ఈ కల్లోలంలో భాగంగానే సుప్రసిద్ధ కళాకారుడు, కన్నడ అభ్యుదయ కథా రచయిత, ప్రగతిశీల ఉద్యమా లకు వెన్నుదన్నుగా ఉన్న ప్రకాష్‌రాజ్ ‘ఓహో నేను తెలుగువాణ్ణి కాను, ఇప్పుడు గుర్తించాల్సి వచ్చింద’న్న బరువైన ప్రకటన ఎందుకు విడుదల చేయవలసివచ్చింది? ‘మా’ సంస్థను బహుళార్థసాధక, సాంస్కృతిక సంస్థగా రూపొందించే ఉద్దేశంతో ప్రత్యామ్నాయ ఎజెండాతో ముందుకు వచ్చినంత మాత్రాన తోటి కళాకారుడిగా ఆయనను న్యూనపరిచే సంస్కృతి ‘మా’ లోని ‘పొట్టిబావల’కు, మిగతా ‘మా’ సభ్యులకు ఉండకూడదు! పరస్పరం ఉభయ వర్గాల మధ్య జరిగిన శషభిషల మధ్య నలిగిపోయి మరుగున పడిన ఆంధ్ర– కన్నడల ఉమ్మడి చారిత్రక బంధాలకే చేటుకూడినంత పనయింది! యావత్తు దక్షిణాపధాన్నే తెలుగు (16వ శతాబ్దం దాకా) ఏలుతూ వచ్చిన కాలం మరుగున పడిపోయింది. ప్రాంతాలకు, కులాలకు, మతాలకు, వర్గ, వర్ణ వివక్ష రంగులు పులిమి ఏలుతున్న కాలంలో ఆ వివక్షలకు దూరంగా ఉండి కన్నడ ప్రపంచంలో కళా, సాంస్కృతిక రంగాలలో, భావ విప్లవంలో భాగంగా అత్యంత అభినవ భావాలతో సంస్కృతీ పరులకు, ఉద్యమకారులకు ప్రకటనలలోనే కాదు, ఆచరణలో స్ఫూర్తిగా నిలబడుతున్న వ్యక్తి ప్రకాష్ రాజ్. ఎప్పుడైతే ‘పొట్టిబావల’ సంస్థగా మారిన ‘మా’లో ఫలానావారు స్థానికులు, మిగతావారు బయటివారనీ, కళాకారుల మధ్య వివక్షకు తావిచ్చారో, ఆ క్షణంలోనే ప్రకాష్‌రాజ్‌కు తాను ‘కన్నడవాడినే కానీ, తెలుగువాడిని కాను కాబోలు’ నని అంతవరకూ లేని భావన, బాధ కలుగజొచ్చాయి. ఈ పరిణామమే ప్రకాష్‌రాజ్ ‘మా’ నుంచి తప్పు కోవడానికి కారణమై ఉండాలి! గత వైభవ చరిత్రతో సంబంధాలు తెగిపోయిన దరిమిలా కనీసం ‘‘తెలుగదేలయన్న దేశంబు తెలుగు’’ అని గుర్తుచేసిన కృష్ణదేవరాయలు కూడా ‘మా’ సభ్యులకు గుర్తు రాకపోవడం ఆశ్చర్యం. రాయల తెలుగుదేశమే ప్రకాష్రాజ్దీ. ఆంధ్ర– కన్నడల మధ్య అభేదాన్ని గుర్తు చేస్తూ రెండూ ఒకేదేశం, అదే తెలుగు సువిశాల దేశం అని ప్రకటించాడు రాయలు! 16వ శతాబ్దంలో రాయల యుగం ముగిసేదాకా ఆంధ్ర– కర్ణాటకలు ఒక తల్లి బిడ్డలే. ఏక రక్త సంబంధీకులు. ఆనాటి రాయలకు అమరావతి (కర్ణాటక) నగరంతోపాటు, రాయలసీమలోని పెనుగొండ కూడా రాజధాని, రెండవ రాజధానిగా ఉండేవని మరచిపోరాదు! అందుకే సుప్రసిద్ధ సాహితీవేత్త రాళ్ళపల్లి అనంత కృష్ణశర్మ ఆర్ద్రతతో... ఆంధ్ర– కన్నడ రాజ్యలక్ష్ముల అరతి నీలపుదండ పెనుగొండ కొండ’’ అని చాటవలసి వచ్చింది! పెనుగొండ రెండవ రాజధానిగా ఏలిన రాయలు రాయలసీమ నలుమూలలా అనేక చెరువులు తవ్వించి కరువుసీమను పంటసీమగా రూపొందించినవాడు. ఈ విషయంలో కూడా కాకతీయులు నిర్మించుకున్న చెరువులను రాయలు రాయల సీమకు ఆదర్శంగా తీసుకున్నాడని మరువరాదు. అంతేకాదు, ఆంధ్ర –కన్నడ ప్రాంతాలు ఉమ్మడిగా ఒక గొడుగు నీడనే ఎదిగినంత కాలం రాయలయుగ పరివ్యాప్తి ఉత్తరాన గజపతుల దిశవరకూ వ్యాప్తి చెందింది. బహమనీ సుల్తానుల చెరనుంచి తెలంగాణలోని వరం గల్ను విముక్తి గావించిన చారిత్రక సత్యాన్నీ మరువరాదు! ఇంతటి సంయుక్త ఉమ్మడి వైభవోజ్వల చరిత్రను మరిచినప్పుడు మాత్రమే ఈనాటివారిలో పిదప బుద్ధులు పుట్టుకొస్తున్నాయి. ప్రాంతీయ తగాదాలు ముదిరిపోతున్నాయి. దారీతెన్నులేక ఎక్కడి కక్కడ ప్రాంతాలు, మతాలు, కులాలు, వర్గాలుగా ఏర్పడి మానవతా వైఖరికి చెల్లుచీటి ఇచ్చుకుంటున్నారు. బహుశా అందుకే ఒక సంద ర్భంగా ప్రకాష్‌రాజ్ ఈ ప్రపంచంలో బతకలేని మనుషులు చాలా మంది ఉన్నారు. కొంచెం ఆలస్యమైనా, మోసపోయినా ఆ లిస్టులో నేనూ, మీరూ, ఎవరైనా చేరుకోవచ్చునని ప్రకటించాల్సి వచ్చింది. అంతేకాదు, ద్రోహం అనేది ఇతరులకు చేయనక్కర్లేదు, మనకు మనమే చేసుకోవచ్చునని కూడా ప్రకటించాడు! ఇలా అనేక సామాజిక అంశాలపైన పరిణామాలపైన ప్రకాష్ రాజ్ ఒక చేయి తిరిగిన ప్రసిద్ధ రచయితగా అనంతమైన అభ్యుదయ కోణాల్ని ఆవిష్కరించాడు. రైతాంగ సమస్యలు, మహిళా సమస్యలు, పెట్టుబడిదారీ, ఫ్యూడల్ వ్యవస్థను, దోపిడీ సమాజంలోని పెక్కు పరి ణామాల పట్ల, పౌరహక్కుల ఉద్యమాలు, ప్రజాస్వామ్య హక్కులు, వాటిపై ఎక్కుపెట్టిన ప్రజాతంత్ర శక్తుల పోరాటాలపైన, ఆ హక్కుల సాధనలో ప్రాణాలు కోల్పోయిన ఉద్యమకారులపైన పరోక్షంగానే కాదు ప్రత్యక్షంగానే ధైర్యసాహసాలతో ఒక ప్రజాకళాకారునిగా బాహా టంగా నిరసన తెలుపుతూ వచ్చినవాడు ప్రకాష్‌రాజ్. కర్ణాటక ఉద్యమకారిణి, ప్రసిద్ధ పత్రికా సంపాదకురాలైన గౌరి లంకేష్ హత్యను, ప్రొఫెసర్ కల్బుర్గి, తదితర పౌరహక్కుల నాయకుల హత్యల్ని, రాజ్యహింసను, బాహటంగా నిరసించి, ఉద్యమించిన కళానిధి ప్రకాష్‌రాజ్ అని గుర్తుకు తెచ్చుకుంటే ఒకనాడు శ్రీశ్రీ... కాంగ్రెస్ ఉనికిని ప్రశ్నిస్తూ ‘పొట్టిబావ కాంగిరేసు మేజరయ్యేదె ప్పుడు’ అని వేసిన ప్రశ్నే ‘మా’లోని పొట్టిబావ’లకూ ఎదురయింది. అందుకే ప్రకాష్‌రాజ్ ‘భాష అనేది ఒక అభివ్యాప్తి రూపం. సుఖ దుఃఖాల్ని వ్యక్తపరచుకునే ఒక మాధ్యమం. బసవన్న 12వ శతాబ్దపు గొప్ప వచనకారుడు, దార్శనికుడు. బింద్రే, కువెంపు, తేజస్వి, లంకేష్, కె.ఎస్.ఎన్ వంటి ప్రముఖ కన్నడ కవులూ, రచయితలూ ఇలాంటి ఆలోచనా సరళికి, జీవితాన్ని ధారపోసిన రచయితల్ని తెలుసు కోకుండానే, కేవలం వ్యాపార లావాదేవీలకు మాత్రమే భాషను నేర్చుకొనే మనఃస్థితి ఉన్నందువల్ల, మన అస్తిత్వాన్నే పోగొట్టుకుని అనామకులుగా నిలబడిపోయాం’ అన్నాడు. అంతేకాదు ‘జీవితంలో కొన్నింటిని ఏ కారణం వల్లనూ మార్చలేం. నేను పుట్టిన కులానికీ, నాకూ ఏ సంబంధం లేదు. అది నామీద వృ«థాగా మోపబడింది అని దాన్ని మార్చవచ్చు. నా మతం నాకు నచ్చలేదని మరో మతాన్ని ఎంచుకోవచ్చు. కానీ ఎవరికీ తన మాతృభాషను మార్చు కోవడానికి కుదరదు’ అన్నది ప్రకాష్‌రాజ్ భావన! అలాగే ప్రకృతి ఎంత కిలాడిదో వివరిస్తూ మనిషిలోని దురాశను ప్రకృతిపరంగా అందంగా చెప్పిన కళాకారుడు ప్రకాష్‌రాజ్. పూవు కాయగా మారటం, కాయ పండుగా మారే విధానం ఉందే... దీన్ని మనకు అర్థం చేయించేది ప్రకృతి. ప్రకృతి మీకు ఎంత కావాలో అంతే ఇస్తుంది. మీ ఆశకు మరికొంచెం ఇస్తుంది. కానీ దురాశను మాత్రం ఇవ్వదు. దీన్ని మనం తెలుసుకొని ఉండాల్సింది. నేర్చుకొని ఉండా ల్సింది అన్నాడు. ఇన్ని గుణపాఠాలు, స్వీయానుభవం నుంచి చెప్పిన ప్రకాష్‌రాజ్ నోట చివరికి నేను తెలుగువాడిని కాదన్న మాట ఇప్పుడు తెలిసివచ్చిందన్న ప్రకటనలోని బాధను, మనోవేదనను ఇప్పటికైనా ‘మా’లోని ‘పొట్టి బావ’లు తెలుసుకోవడం అందరికీ శ్రేయస్కరం. ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
కృష్ణగారు అలా అనగానే కన్నీళ్లొచ్చాయి!
‘‘డాక్టర్ కావాలనుకుని యాక్టర్ అయ్యాను. నేను గొప్ప నటుడు కావాలనేది మా అమ్మ (దివంగత నటి–దర్శకురాలు విజయ నిర్మల) కోరిక. నేను ఇండస్ట్రీకి వచ్చి 50 ఏళ్లు (బాలనటుడిగానూ చేశారు) అవుతున్నా ఇప్పటికీ బిజీగా ఉండటం నా అదృష్టం. ‘శ్రీదేవి సోడా సెంటర్’లో నేను చేసిన పాత్ర గొప్పది.. ఇప్పుడు మా అమ్మ ఆత్మ సంతోషంగా ఉంటుందనుకుంటున్నాను’’ అన్నారు వీకే నరేశ్. సుధీర్ బాబు, ఆనంది జంటగా కరుణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘శ్రీదేవి సోడా సెంటర్’. విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 27న విడుదలైంది. ఈ చిత్రంలో హీరోయిన్ తండ్రి పాత్రలో నటించిన వీకే నరేశ్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ– ‘‘ఇప్పటి వరకూ నేను 200 సినిమాల్లో నటించాను. అయితే ‘శ్రీదేవి సోడా సెంటర్’లోని పాత్ర నా గత చిత్రాలను మించిపోయింది. విలన్ పాత్రలకు కూడా నరేశ్‌ని తీసుకోవచ్చనే ఆలోచన ఇండస్ట్రీ వర్గాల్లో రేకెత్తించింది. సినిమా చూసిన కృష్ణ (సూపర్ స్టార్ కృష్ణ)గారు.. ‘నువ్వు, సుధీర్ ఈ సినిమాకు ప్రాణం పోశారు.. నీ పాత్ర నాకు కన్నీరు తెప్పించింది’ అనడంతో నాకు కన్నీళ్లొచ్చాయి. కరుణ కుమార్ పెద్ద దర్శకుడు అవుతాడు. రామానాయుడుగారిలా మంచి అభిరుచి, ప్యాషన్ ఉన్న నిర్మాతలు విజయ్ చిల్లా, శశి దేవిరెడి’’ అన్నారు. మా ఎన్నికల్లో కృష్ణుడి పాత్ర! రానున్న ‘మా’ (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) ఎన్నికల్లో నేను కృష్ణుడి పాత్ర పోషిస్తా. ఎన్నికలు ప్రకటించిన తర్వాత రథం ఎక్కుతా.. అది ఎవరి రథం అన్నది తర్వాత చెబుతా. నేను ఒక్కసారి మాత్రమే అధ్యక్షునిగా పని చేస్తానని గతంలో చెప్పా.. రానున్న ఎన్నికల్లో మరోసారి పోటీ చేయను.. నా విజన్‌ని ముందుకు తీసుకెళ్లగలిగే వారసుణ్ణి మాత్రం ‘మా’ కు అందిస్తా. -
'మా' ప్రతిష్ట దెబ్బతీస్తున్న ఎవరీని ఉపేక్షించొద్దు: చిరంజీవి
MAA Elections 2021: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) ఎన్నికలు ప్రస్తుతం టాలీవుడ్లో హాట్‌టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. ప్రతిసారీ ఇద్దరు మాత్రమే పోటీ పడే ఎన్నికలలో ఈసారి ఐదుగురు అభ్యర్థులు పోటీ పడుతుండటంతో మా ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఆరోపణలు, ప్రత్యారోపణలతో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. రోజుకో ట్విస్ట్ బయటకు వస్తూ.. సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి. ఇటీవలె మా ప్రస్తుత అధ్యక్షుడు నరేశ్‌పై నటి హేమ..ఫండ్ రైజ్ చేసిన డబ్బులన్నీ ఖర్చు పెడుతున్నారంటూ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత నరేష్ మాట్లాడుతూ ఆమెకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. గతంలో ఎన్నడూ లేనంతగా మా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న సభ్యులు ఒకరిపై ఒకరు సంచలన ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి రంగంలోకి దిగారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) ఎన్నికలపై చిరంజీవి తొలిసారిగా స్పందించారు. ఎన్నికలు వెంటనే జరపాలని, ఆలస్యమైతే సంక్షేమ కార్యక్రమాలు నిలిచిపోతాయని పేర్కొన్నారు. అంతేకాకుండా 'మా' ప్రతిష్ట దెబ్బతీస్తున్న ఎవరినీ ఉపేక్షించవద్దంటూ 'మా' క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు కృష్ణం రాజుకు చిరంజీవి లేఖ రాశారు. సభ్యుల బహిరంగ ప్రకటనలతో 'మా' ప్రతిష్ట మసకబారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. -
MAA: సెప్టెంబర్‌లో మా ఎన్నికలు?
సాక్షి, హైదరాబాద్: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు ఇప్పుడు హాట్ టాపిక్. ఈసారి అధ్యక్ష పదవికి సీనియర్ నటుడు ప్రకాశ్ రాజ్, యువ కథానాయకుడు మంచు విష్ణు పోటీ పడనున్న విషయం తెలిసిందే. అలాగే జీవితా రాజశేఖర్, హేమ, సీవీఎల్ నర్సింహారావు కూడా పోటీ పడనున్నట్లు ప్రకటించారు. కాగా, ప్రస్తుత కార్యవర్గం పదవీ కాలం మార్చిలోనే ముగియడంతో ప్రస్తుత కమిటీలో ఉన్న కొందరు తక్షణమే ఎన్నికలు జరిపాలంటూ క్రమశిక్షణా సంఘం కమిటీ అధ్యక్షుడు కృష్ణంరాజుకి లేఖలు రాశారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం ‘వర్చ్యువల్’ మీటింగ్ జరిగిందని సమాచారం. ఈ మీటింగ్‌లో క్రమశిక్షణా సంఘం సభ్యులు గిరిబాబు, మోహన్‌బాబు, మురళీమోహన్, శివకృష్ణ పాల్గొన్నారని భోగట్టా. తక్షణమే ఎన్నికలు జరపాలనే అంశంపై చర్చ జరిగిందని, కరోనా థర్డ్ వేవ్ నేపథ్యంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలంటే కష్టమేనని చర్చించుకున్నారని, సెప్టెంబర్‌లో జరిపేలా నిర్ణయానికి వచ్చారని సమాచారం. సెప్టెంబర్ 12న ఎన్నికలు జరిగే అవకాశం ఉందని తెలిసింది. అలాగే ప్రస్తుత కార్యవర్గం పదవీ కాలం ముగిసిన నేపథ్యంలో ఎన్నికలు జరిపేవరకూ వారికి అధికారం ఉంటుందా? అనే విషయం కూడా చర్చకు వచ్చిందని సమాచారం. ఎన్నికలు జరిగే వరకూ ప్రస్తుత కార్యవర్గానికి అధికారం ఉంటుందని పేర్కొన్నట్లు తెలిసింది. వచ్చే నెల 22న సర్వసభ్య సమావేశం జరుగుతుందని, ఆ మీటింగ్‌లో ఎన్నికల తేదీని వెల్లడించే అవకాశం ఉందని భోగట్టా. -
MAA Elections 2021: ‘మా’ఎన్నికల్లో మరో ట్విస్ట్
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) ఎన్నికలు ప్రస్తుతం టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారాయి. ప్రతిసారీ ఇద్దరు మాత్రమే పోటీ పడే ఎన్నికలలో ఈసారి ఐదుగురు అభ్యర్థులు పోటీ పడుతుండటంతో మా ఎన్నికలు రసవత్తరంగా మారాయి. రోజుకో ట్విస్ట్ బయటకు వస్తూ.. సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి. ‘మా’ కార్యవర్గం పదవీ కాలం చెల్లింది కనుక వెంటనే ఎన్నికలు నిర్వహించాలంటూ ఎగ్జిక్యూటివ్ కమిటీలోని 15 మంది సభ్యులు, మా క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు అయిన కృష్ణం రాజుకు లేఖలు రాశారు. 2019 లో ఎన్నిక అయిన 15 మంది సభ్యులు తమ పదవి కాలం ముగిసి పోయింది కనుక వెంటనే ఎన్నికల నిర్వహణ బాధ్యత తీసుకుని నిర్వహించాలని కృష్ణంరాజును కోరారు. గతంలో రాసిన లేఖకు ఇప్పటి వరకు జవాబు లేకపోవడంతో మరోసారి లేఖ రాశామని ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు తెలిపారు. గురువారం మా ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు వర్చువల్‌గా సమావేశమై ఎన్నికల నిర్వహణపై చర్చించనున్నారు. సెప్టెంబర్ లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ‘మా’ అధ్యక్ష ఎన్నికల బరిలో ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు, జీవితారాజశేఖర్, హేమతో పాటు సీవీఎల్ నర్సింహరావు కూడా ఉన్నారు. అయితే వీరిలో ప్రకాష్ రాజ్, మంచు విష్ణు మధ్య ప్రధానంగా పోటీ ఉండే అవకాశాలున్నాయి. జీవిత, హేమ, నర్సింహరావు పోటీ నుంచి తప్పుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు ఏకగ్రీవం అంశం కూడా తెరపైకి వచ్చింది. రేపు జరగబోయే సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. -
‘మా’లో మళ్లీ లొల్లి.. నరేష్‌పై..
సాక్షి, హైదరాబాద్ : ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా)’ లో మళ్లీ లుకలుకలు మొదలయ్యాయి. ‘మా’ అధ్యక్షుడు నరేష్‌పై ఎగ్జిక్యూటీవ్ మెంబర్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నరేష్ ప్రవర్తనను దుయ్యబట్టిన ఈసీ సభ్యులు.. ఆయనపై చర్యలు తీసుకోవాలని క్రమశిక్షణ కమిటీకి లేఖ రాశారు. శివాజీరాజా హయం నుంచి ఇప్పటివరకు జరిగిన పరిణామాలను ఆ లేఖలో ప్రస్తావించారు. ‘మా’ అభివృద్ధికి నరేశ్ అడ్డంకి మారారని, నిధులు దుర్వినియోగం చేయడంతో పాటు ఈసీ సభ్యులను అవమానపరుస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన నరేశ్‌పై చర్యలు తీసుకోవాలని 9 పేజీల లేఖను క్రమశిక్షణ కమిటీకి పంపారు. ఈ లేఖలో జీవిత రాజశేఖర్, జయలక్ష్మి, మహ్మద్ అలీ, ఎంవీ బెనర్జీ, రాజారవీంద్ర, ఉత్తేజ్‌లతో పాటు మరో పదిమంది సభ్యులు సంతకాలు చేశారు. కాగా, ఇటీవల జరిగిన ‘మా’ డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో రాజశేఖర్ కొందరు సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. చిరంజీవి, మోహన్ బాబు వారించినా లెక్క చేయకుండా తను చెప్పాలనుకున్నది చెప్పేసిన రాజశేఖర్... తర్వాత తన పదవికి రాజీనామా చేశారు. ఇప్పుడు జీవిత లేఖతో ‘మా’ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. నరేష్‌పై చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్న జీవిత.. ఈసీ మెంబర్లతో సుధీర్ఘ సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడకుండానే వెనుదిరిగారు. -
‘మా’ 2020 డైరీ ఆవిష్కరణ