చిత్రపరిశ్రమలోని నటీనటులతో పాటు వారి కుటుంబసభ్యులను టార్గెట్ చేస్తూ వ్యక్తిగతంగా ట్రోల్స్ చేస్తున్నవారిపై ఇప్పటికే కేసులు నమోదయ్యాయి. ఈ విషయంలో మా అధ్యక్షులు మంచు విష్ణు పలు సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. ఈ క్రమంలో తాజాగా నటుడు, 'మా' కోశాధికారి శివ బాలాజీ పోలీసులను ఆశ్రయించారు.
సినీ నటీనటులను టార్గెట్ చేస్తూ నిత్యం నెగెటివ్ ట్రోల్స్ చేస్తున్న యూట్యూబర్ విజయ్ చంద్రహాసన్ అనే వ్యక్తిపై హైదరాబాద్ సైబర్ క్రైమ్‌లో శివ బాలాజీ ఫిర్యాదు చేశారు. చంద్రహాసన్ గత కొంత కాలంగా నటీనటులతో పాటు మంచు విష్ణు, ఆయన నిర్మాణ సంస్థ గురించి తప్పుగా చూపుతూ.. ట్రోల్స్ చేస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు.
చిత్రపరిశ్రమలో భాగమైన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషషన్‌కు ఉన్న గౌరవాన్ని దెబ్బతీసేలా పలు వీడియోలు క్రియేట్ చేశాడని శివ బాలాజీ పేర్కొన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు యూట్యూబర్‌కు నోటీసులు పంపారు. కొద్దిరోజుల క్రితం సుమారు 18కి పైగా యూట్యూబ్ ఛానళ్లను రద్దు చేస్తున్నట్లు మంచు విష్ణు ప్రకటించిన విషయం తెలిసిందే. యూట్యూబర్స్‌లో మార్పు రాకుంటే వారిపై మరింత కఠనమైన నిర్ణయాలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment