
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) అధ్యక్షునిగా మంచు విష్ణునే కొనసాగించాలని కమిటీ సభ్యులు నిర్ణయించారు. ఎన్నికలకు వెళ్లకుండా విష్ణు పేరును కమిటీ ఖరారు చేసింది. ఇప్పటికే విష్ణు మా అధ్యక్షునిగా ఉన్నారు. మా అధ్యక్ష భవన నిర్మాణం పూర్తయ్యే వరకు ఆయననే కొనసాగించాలని 26 మంది సభ్యుల కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయించింది.