సాక్షి, హైదరాబాద్: విమర్శ మంచిదే కానీ అది హద్దు దాటకూడదు. ఈ మధ్య కాలంలో పలువురు నెటిజన్లు, యూట్యూబర్స్.. సెలబ్రిటీలను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. వారు చేసే పని గురించే కాకుండా వ్యక్తిగత విషయాలను సైతం చర్చిస్తూ దారుణంగా కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో మా(మూవీ ఆర్టిస్టుల అసోసియేషన్) నటీనటుల గురించి అసభ్యంగా మాట్లాడిన ఐదు యూట్యూబ్ ఛానల్స్‌ను తొలగించింది.
స్పెషల్ సెల్
గురువారం నాడు మా బృందం డీజీపీ జితేందర్‌ను కలిసింది. సెలబ్రిటీలను టార్గెట్ చేసుకుని వీడియోలు వదులుతున్న 200 యూట్యూబ్ ఛానల్స్ లిస్టును డీజీపికి సమర్పిస్తూ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ ఫిర్యాదుపై సానుకూలంగా స్పందించిన ఆయన.. సైబర్ సెక్యూరిటీ వింగ్‌లోని ఓ స్పెషల్ సెల్ ఇకపై దీనిపైనే ఫోకస్ చేస్తుందని హామీ ఇచ్చారు. ట్రోలర్స్‌పై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
ఫ్యామిలీని కూడా వదలట్లేదు
అనంతరం రాజీవ్ కనకాల మాట్లాడుతూ.. ట్రోల్స్ నవ్వుకునేలా ఉండాలి కానీ ఏడిపించేలా ఉండొద్దు. కుటుంబ సభ్యుల మీద కూడా ట్రోల్ చేయడం దారుణం. ఇకమీదట నటీనటులను ట్రోల్స్ చేస్తే సహించేది లేదు అని వార్నింగ్ ఇచ్చారు. శివ బాలాజీ మాట్లాడుతూ.. దారుణమైన ట్రోల్స్‌కు పాల్పడేవారిని టెర్రరిస్టులుగా పరిగణిస్తాం. సుమారు 200 యూట్యూబ్ ఛానల్స్ లిస్టును డీజీపీకి సమర్పించాం. ఆయన సానుకూలంగా స్పందించారు అని తెలిపారు.
మహిళా ఆర్టిస్టులే టార్గెట్
నటుడు శివకృష్ణ మాట్లాడుతూ.. మహిళా ఆర్టిస్టుల క్యారెక్టర్‌ను దారుణంగా చిత్రీకరిస్తున్నారు. కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ డబ్బు కోసం ఇలా చేస్తున్నాయి. కానీ దీనివల్ల లేడీ ఆర్టిస్టులు ఎక్కువ ఇబ్బందిపడుతున్నారు అని చెప్పుకొచ్చారు.
చదవండి: మరో రెండు ఓటీటీల్లోకి తెలుగు యాక్షన్ మూవీ.. ఎక్కడంటే?
Comments
Please login to add a commentAdd a comment