టాలీవుడ్ హీరో సుధీర్ బాబు ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ 'హరోం హర'. జూన్ 14న రిలీజైన ఈ సినిమాకు టాక్ బాగున్నప్పటికీ పెద్దగా కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. దీంతో సరిగ్గా నెల రోజులకు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో రిలీజ్ చేశారు.
తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో అందుబాటులోకి తీసుకొచ్చారు. తాజాగా ఈ మూవీ మరో ఓటీటీలో రిలీజైంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రత్యక్షమైంది. అలాగే జియో సినిమాలో హిందీ వర్షన్ విడుదలైంది. జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మాళవిక శర్మ హీరోయిన్‌గా మెప్పించింది. చైతన్ భరద్వాజ్ సంగీతం అందించగా సుమంత్ జి నాయుడు నిర్మించాడు.
కథ విషయానికి వస్తే..
1989లో కుప్పం ప్రాంతాన్ని తమ్మిరెడ్డి(లక్కి లక్ష్మణ్), అతని కుమారుడు శరత్(అర్జున్ గౌడ)తమ గుప్పింట్లో ఉంచుకుంటారు. పొలాల్ని కబ్జా చేస్తూ అడ్డొచ్చినవారిని అంతం చేస్తుంటారు. ఆ ప్రాంతంలోని పాలిటెక్నిక్ కాలేజీలోకి సుబ్రమణ్యం(సుధీర్ బాబు) ల్యాబ్ అసిస్టెంట్‌గా వస్తాడు. అదే కాలేజీలో పనిచేసే లెక్చరర్(మాళవిక శర్మ)ను ప్రేమిస్తాడు.
ఓ రోజు అనుకోకుండా తమ్మిరెడ్డి మనుషులతో గొడవపడతాడు. దీని ఎఫెక్ట్ సుబ్రహ్మణ్యం ఉద్యోగం పోతుంది. మరోవైపు మూడునెలల్లో తన తండ్రి చేసిన అప్పులు తీర్చాల్సి ఉంటుంది. మరి ఆ సమయంలో హీరో ఏం చేశాడు? అప్పులు తీర్చాడా? తనపై కక్ష సాధించిన విలన్‌పై ప్రతీకారం తీర్చుకున్నాడా? లేదా? అనేది తెలియాలంటే ఓటీటీలో మూవీ చూడాల్సిందే!
Comments
Please login to add a commentAdd a comment