Jio cinema
-
రెండేళ్ల క్రితమే షూటింగ్.. ఇప్పుడు ఓటీటీకి వస్తోన్న స్పోర్ట్స్ డ్రామా!
ఇటీవల థియేటర్లలో రిలీజైన తర్వాత ఓటీటీ రావడం సహజం. ఎక్కువశాతం సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆడిన తర్వాత నెల రోజుల తర్వాతే ఓటీటీకి వచ్చేస్తుంటాయి. అయితే షూటింగ్ పూర్తయిన దాదాపు రెండేళ్ల తర్వాత ఓటీటీకి రావడం చాలా అరుదు. కానీ హిందీలో తెరకెక్కించిన స్పోర్ట్స్ డ్రామా ది మిరిండా బ్రదర్స్ రెండేళ్ల అనంతరం డైరెక్ట్‌గా ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది.తాజాగా ఈ విషయాన్ని ప్రముఖ ఓటీటీ సంస్థ జియో సినిమా వెల్లడించింది. థియేటర్లలో రిలీజ్ కాకుండా నేరుగా ఓటీటీకి వస్తోన్న ఈ మూవీలో హర్షవర్దన్ రాణే, మీజాన్ జాఫెరీ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాకు సంజయ్ గుప్తా దర్శకత్వం వహించారు. ది మిరిండా బ్రదర్స్ సినిమా అక్టోబర్ 25వ తేదీ నుంచి స్ట్రీమింగ్కు రానుంది.ఆతిష్, కాబిల్, షూటౌట్ అట్ లోఖంద్వాలా, కాంటే లాంటి బాలీవుడ్ సినిమాలతో పాపులర్ అయిన సంజయ్ గుప్తా.. ది మిరండా బ్రదర్స్ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇద్దరు సోదరులు రెండు వేర్వేరు ఫుట్‌బాల్ జట్లకు ఆడుతూ పోటీపడడం చుట్టూ తిరిగే కథే ఈ మూవీ. ఈ సినిమా షూటింగ్ రెండేళ్ల క్రితమే జరిగింది. 2022లో గోవాలోనే ఈ మూవీ ఎక్కువ భాగం షూటింగ్ నిర్వహించారు. చిత్రీకరణ పూర్తయినప్పటికీ సినిమా విడుదల ఆలస్యమైంది. దీంతో ఇప్పుడు నేరుగా ఓటీటీలోనే రిలీజ్ చేస్తున్నారు.Football in their hearts… vengeance in their souls.#TheMirandaBrothers, streaming 25 October onwards, only on JioCinema Premium.@MeezaanLifeLine #HarshvardhanRane @_SanjayGupta #AnuradhaLekhiGupta #WhiteFeatherFilms @TSeries#TheMirandaBrothersOnJioCinema #JioCinemaPremium pic.twitter.com/tVWHoEWCi4— JioCinema (@JioCinema) October 15, 2024 -
మరో ఓటీటీకి వచ్చేసిన మంగళవారం.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం మంగళవారం. ఈ మిస్టరీ థ్రిల్లర్ మూవీకి ఆర్ఎక్స్100 ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వం వహించారు. గతేడాది సెప్టెంబర్‌లో విడుదలై బాక్సాఫీస్ వద్ సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ మూవీ గతేడాది డిసెంబర్లోనే ఐదు భాషల్లో ఓటీటీ స్ట్రీమింగ్కు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మరో భాషలో మరో ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చేసింది.తాజాగా జియో సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్కు వచ్చింది. దాదాపు 11 నెలల తర్వాత హిందీ వర్షన్ అందుబాటులోకి వచ్చింది. దీంతో బాలీవుడ్ ప్రేక్షకులకు సైతం మంగళవారం మూవీ చూసే ఛాన్స్ దక్కింది. తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన మంగళవారం మూవీ హిందీ ఆడియన్స్‌ను ఏ మేరకు మెప్పిస్తుందో చూడాల్సిందే. కాగా.. ఈ చిత్రంలో పాయల్ రాజ్‌పుత్‌తో పాటు అజ్మల్ అమీర్, నందిత శ్వేత, రవీంద్ర విజయ్, దివ్య పిళ్లై, అజయ్ ఘోష్, కృష్ణ చైతన్య కీలకపాత్రలు పోషించారు. పాయల్ ఈ మూవీలో బోల్డ్ క్యారెక్టర్ చేశారు. ఆమె నటనకు ప్రశంసలు దక్కించుకుంది. ‘మంగళవారం’కథేంటంటే..ఈ సినిమా కథ 1986-96 మధ్య కాలంలో సాగుతుంది. మహాలక్ష్మిపురం గ్రామంలో వరుసగా ఇద్దరేసి చొప్పుగా చనిపోతుంటారు. అది కూడా ఆ గ్రామ దేవత మాలచ్చమ్మకి ఇష్టమైన మంగళవారం రోజున. ఆ ఊర్లో వివాహేతర సంబంధాలు పెట్టుకున్న ఓ ఆడ, మగ వ్యక్తుల పేర్లు ఎవరో గుర్తు తెలియని వ్యక్తుల గోడపై రాయడం.. అది చూసే వాళ్లు ఆత్మహత్య చేసుకున్నట్లు గ్రామస్తులంతా నమ్ముతారు. కానీ ఆ ఊరికి కొత్తగా వచ్చిన ఎస్సై మీనా(నందితా శ్వేత)మాత్రం అవి ఆత్మహత్యలు కావు హత్యలని అనుమానిస్తోంది. మృతదేహాలను పోస్ట్‌మార్టం చేయించాలని ప్రయత్నిస్తే.. ఆ ఊరి జమిందారు ప్రకాశం బాబు(చైతన్య కృష్ణ) ఒప్పుకోరు.మరో మంగళవారం కూడా ఊర్లో మరో ఇద్దరు అనుమానస్పదంగా చనిపోతారు. దీంతో ఎస్సై మీనా ఊర్లో వాళ్లను ఒప్పించి ఆ మృతదేహాలను పోస్ట్‌మార్టంకు తరలిస్తారు. ఊరి ప్రజలు మాత్రం గోడలపై రాతలు రాస్తున్న అజ్ఞాత వ్యక్తిని పట్టుకునేందుకు అర్థరాత్రులు గస్తీ నిర్వహిస్తారు. అసలు గోడపై రాస్తున్న అజ్ఞాత వ్యక్తి ఎవరు? అతని లక్ష్యమేంటి? ఊర్లో జరిగినవి హత్యలా? ఆత్మహత్యలా? వీటికి ఆ ఊరి నుంచి వేలివేయబడ్డ శైలజా అలియాస్ శైలు(పాయల్ర రాజ్‌పుత్)కు ఉన్న సంబంధం ఏంటి? శైలు నేపథ్యం ఏంటి? ఆమెను ఊరి నుంచి ఎందుకు వెలివేశారు? ఊర్లో జరిగే చావులకు ఫోటోగ్రాఫర్ వాసు (శ్రవణ్ రెడ్డి), డాక్టర్ (రవీంద్ర విజయ్), జమీందారు భార్య (దివ్యా పిళ్ళై), శైలు చిన్ననాటి స్నేహితుడు రవిలకు ఉన్న సంబంధం ఏంటి? చివరకు ఏం జరిగింది? అనేది థియేటర్స్‌లో మంగళవారం సినిమా చూసి తీరాల్సిందే. -
ఓటీటీకి వచ్చేస్తోన్న జగపతిబాబు మూవీ.. ఎక్కడ చూడాలంటే?
జగపతి బాబు, ఆయుష్ శర్మ, సుశ్రీ మిశ్రా కీలక పాత్రల్లో నటించిన చిత్రం రుస్లాన్. ఈ సినిమాకు కరణ్ దర్శకత్వం వహించారు. ఫుల్ యాక్షన్ చిత్రంగా రూపొందించిన ఈ చిత్రం ఏప్రిల్‌లో బాక్సాఫీస్ వద్ద సందడి చేసింది. అయితే ఆశించిన స్థాయిలో ప్రేక్షుకలను మెప్పించలేకపోయింది. దాదాపు రూ.25 కోట్ల బడ్జెట్‌తో తెరెకెక్కించిన ఈ చిత్రం అభిమానులను తీవ్రంగా నిరాశపర్చింది. కేవలం రూ.2.70 కోట్ల వసూళ్లు మాత్రమే రాబట్టింది.తాజాగా ఈ చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్కు సిద్ధమైంది. థియేటర్లలో విడుదలైన ఐదు నెలల తర్వాత ఓటీటీలో సందడి చేసేందుకు వస్తోంది. ఈ విషయాన్ని కలర్స్ సినీప్లెక్స్, జియో సినిమా వెల్లడించాయి. ఈ మేరకు స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశాయి. సెప్టెంబర్ 21వ తేదీ నుంచి రెండు ఓటీటీల్లోనూ స్ట్రీమింగ్ కానుంది. కాగా.. ఈ చిత్రంలో టాలీవుడ్ నటుడు జగపతి బాబు పోలీసుపాత్రలో కనిపించారు. Cinemalloki vachi undakapothe, kachitanga Super Cop ayyevadni… Ipudunna Super Coplu lagaa law & order ni gadagadaladinchevadni… em antaaru?#Ruslaan on April 26th 2024. pic.twitter.com/MORfsfu3D2— Jaggu Bhai (@IamJagguBhai) March 17, 2024 Witness the LION in his hunting mode! 🦁 21st September raat 8 baje dekhiye #Ruslaan ka World Premiere, sirf Colors Cineplex aur @JioCinema Par.#RuslaanOnColorsCineplex #RuslaanOnJioCinema #WorldPremiere #ColorsCineplex #JioCinema pic.twitter.com/OxsBZzIv66— Colors Cineplex (@Colors_Cineplex) September 17, 2024 -
ఏడాది తర్వాత ఓటీటీకి వచ్చేసిన కామెడీ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
సీనియర్ నటి ఊర్వశి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'జలధార పంప్‌సెట్ సిన్స్ 1962'. గతేడాది ఆగస్టులో థియేటర్లలో రిలీజైన ఈ చిత్రాన్ని సెటైరికల్ కామెడీగా తెరకెక్కించారు. ఈ మూవీకి ఆశిష్ చిన్నప్ప దర్శకత్వం వహించారు. బాక్సాఫీస్ వద్ద మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్రం ఓటీటీలోకి అడుగుపెట్టింది.ఈ సినిమా సెప్టెంబర్ 15 నుంచే జియోసినిమా ఓటీటీలో అందుబాటులోకి వచ్చేసింది. థియేటర్లలో రిలీజైన దాదాపు 13 నెలల తర్వాత ఓటీటీకి వచ్చేసింది. అయితే ప్రస్తుతం ఈ చిత్రం కేవలం మలయాళంలోనే స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రంలో ఊర్వశితో పాటు ఇంద్రన్స్, సనుషా, సాగర్ రాజన్, జానీ ఆంటోనీ, టీజీ రవి, విజయరాఘవన్, నిషా సారంగ్, జయన్ చేర్తలా కీలకపాత్రలు పోషించారు. ఓ చిన్న కేసు కూడా కోర్టుల్లో ఎన్నేళ్లు కొనసాగుతుందో సెటైరికల్‌గా ఈ చిత్రంలో చూపించారు. The court is now in session! Witness Mrinalini’s long fight for justice. #JaladharaPumpsetSince1962, now streaming, exclusively on #JioCinema #Urvashi #SagarRajan #Indrans #SanushaSanu #TGRavi #JohnyanTony #AlthafSalim #WonderframesFilmland#JaladharaPumpsetSince1962… pic.twitter.com/iM8I7MGAuQ— JioCinema (@JioCinema) September 15, 2024 -
ఆ ఓటీటీకి సరిపోదా శనివారం.. భారీ ధరకు రైట్స్!
నేచురల్ స్టార్ నాని, ప్రియాంక మోహన్ జంటగా నటించిన తాజా చిత్రం 'సరిపోదా శనివారం'. వివేక్ ఆత్రేయ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం ఆగస్టు 29న థియేటర్లలో రిలీజైంది. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందించిన ఈ సినిమాకు తొలిరోజు పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. దసరా, హాయ్ నాన్న చిత్రాలతో హిట్స్ కొట్టిన నాని తన ఖాతాలో మరో సూపర్‌హిట్ ఖాయమని ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.భారీ ధరకు ఓటీటీ రైట్స్?అయితే ఈ మూవీకి హిట్ టాక్ రావడంతో ఓటీటీ రైట్స్ గురించి చర్చ మొదలైంది. ఓటీటీకి ఎప్పుడు వస్తుంది? ఏ ఓటీటీలో వస్తుందని సినీప్రియులు తెగ ఆరా తీస్తున్నారు. అయితే సరిపోదా శనివారం మూవీ హక్కులను ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్ భారీ ధరకు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే సౌత్ రైట్స్‌ను మాత్రమే దక్కించుకున్నట్లు సమాచారం. మరోవైపు హిందీ ఓటీటీ హక్కులను జియో సినిమా కొనుగోలు చేసినట్లు టాక్ వినిపిస్తోంది.ఓటీటీకి అప్పుడేనా??ఈ మూవీ రిలీజైన నెలరోజుల్లోపే ఓటీటీకి రానుందని క్రేజీ టాక్ నడుస్తోంది. సెప్టెంబర్ 26 నుంచే స్ట్రీమింగ్కు వచ్చే అవకాశముందని సమాచారం. అదే రోజు రెండు ఓటీటీల్లో రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే సరిపోదా శనివారం నెల రోజుల్లోపే ఓటీటీలో చూసే అవకాశం ఉంటుంది. కాగా.. ఈ చిత్రంలో తమిళ స్టార్ ఎస్జే సూర్య విలన్ పాత్రలో మెప్పించారు. -
జియో సినిమాలో పారాలింపిక్స్ ప్రత్యక్ష ప్రసారం
ప్యారిస్ ఒలింపిక్స్-2024 క్రీడలను విజయవంతంగా ప్రసారం చేసిన వయాకామ్.. పారాలింపిక్స్-2024 లైవ్ కవరేజ్ కూడా ఇవ్వన్నుట్లు ప్రకటించింది. ప్యారిస్ వేదికగా ఆగష్టు 28- సెప్టెంబరు 8 వరకు జరుగనున్న దివ్యాంగుల విశ్వ క్రీడలను డిజిటల్ మాధ్యమంలో జియో సినిమా యాప్ వేదికగా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు వెల్లడించింది. ఇక టీవీ ప్రేక్షకులు స్పోర్ట్స్18 నెట్‌వర్క్‌లో పారాలింపిక్స్‌ను వీక్షించవచ్చని తెలిపింది.ఈ విషయం గురించి వయాకామ్ స్పోర్ట్స్ మార్కెటింగ్ హెడ్ దమయంత్ సింగ్ మాట్లాడుతూ.. ‘‘మన పారా అథ్లెట్లు గతంలో పతకాలు సాధించి ఈ క్రీడలపై ఆసక్తిని మరింతగా పెంచారు. పారాలింపిక్స్‌ను సెలబ్రేట్ చేసుకునే క్రమంలో గొప్ప అనుభూతి కలిగేలా మేము ఈ క్రీడలను చూపించబోతున్నాం. ప్రపంచంలోని అత్యుత్తమ పారా అథ్లెట్ల ఆదర్శప్రాయమైన కథలను మీ ముందుకు తీసుకురాబోతున్నందుకు సంతోషిస్తున్నాం’’ అని పేర్కొన్నారు.పతకధారులుగా వారేకాగా ప్యారిస్ పారాలింపిక్స్‌లో మొత్తం 4,400 మంది క్రీడాకారులు పాల్గొననున్నారు. భారత్ నుంచి 84 మంది బరిలోకి దిగనుండగా.. జావెలిన్ త్రోయర్ సుమిత్ అంటిల్, షాట్‌పుటర్ భాగ్యశ్రీ జాధవ్ త్రివర్ణ పతాకధారులుగా వ్యవహరించనున్నారు. మొత్తంగా 12 క్రీడాంశాల్లో మన పారా అథ్లెట్లు భాగం కానున్నారు. ఇక గత టోక్యో పారాలింపిక్స్‌లో భారత్ 5 స్వర్ణాలు సహా 19 పతకాలు గెలిచింది. పతకాల పట్టికలో 24వ స్థానంలో నిలిచింది. ఈసారి ప్యారిస్‌లో పదికి పైగా స్వర్ణాలతో పాటు 25 పతకాలు సాధించాలని లక్ష్యం నిర్దేశించుకుంది. ఇక ఇటీవల ముగిసిన ప్యారిస్ ఒలింపిక్స్‌లో భారత్ ఒక రజతం, ఐదు కాంస్యాలు కైవసం చేసుకుంది. -
జియో సినిమాలోకి యూట్యూబ్ ఇండియా ఎండీ..?
గూగుల్ ఆధ్వర్యంలోని యూట్యూబ్ ఇండియాకు మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్న ఇషాన్ ఛటర్జీ తన పదవికి రాజీనామా చేశారు. వయాకామ్ 18 యాజమాన్యంలోని జియో సినిమా చీఫ్ రెవెన్యూ ఆఫీసర్ (సీఆర్ఓ)గా చేరబోతున్నట్లు మీడియా కథనాల ద్వారా తెలిసింది.యూట్యూబ్ ఇండియాలో నాలుగేళ్ల నుంచి సేవలందిస్తున్న ఛటర్జీ గూగుల్‌లో దాదాపు 13 ఏళ్లు పనిచేశారు. ఆ సమయంలో యూరప్, ఆసియా అంతటా అనేక హోదాల్లో సేవలందించారు. యూట్యూబ్ ఎండీగా బాధ్యతలు తీసుకోవడానికి ముందు యూట్యూబ్ ఏపీఏసీ, ప్రోడక్ట్ పార్టనర్షిప్ ఎండీగా వ్యవహరించారు. ఛటర్జీ రాజీనామాపై వయోకామ్18, యూట్యూబ్ రెండు సంస్థలు వివరాలు ఇవ్వడానికి నిరాకరించినట్లు తెలిసింది.ఇదీ చదవండి: కాల్ హోల్డ్‌లో పెట్టారా..? రూ.4.6 లక్షల కోట్లు నష్టం!ఇదిలాఉండగా, అమెజాన్ ప్రైమ్ వీడియో కంట్రీ డైరెక్టర్ సుశాంత్ శ్రీరామ్‌ను వయోకామ్ 18 చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ (సీఎంఓ)గా ఇటీవల నియమించింది. తాజాగా వస్తున్న కథనాల ప్రకారం ఛటర్జీని సీఆర్ఓగా చేర్చుకుంటే వయోకామ్లో జరిగే రెండో అతిపెద్ద నియామకమవుతుంది. వీరిద్దరు వయోకామ్ 18 డిజిటల్ వెంచర్స్ సీఈఓ కిరణ్ మణికి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్, బోధి ట్రీ ఆధ్వర్యంలోని ఈ సంస్థ ఇప్పటికే వాల్ట్ డిస్నీలో వాటాలు పెంచుకుంది. -
వీడియో స్ట్రీమింగ్ రంగంలో 2.8 లక్షల మందికి ఉపాధి
భారత్‌లో ఆన్లైన్ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ మార్కెట్ 2028 నాటికి దాదాపు రూ.1.08 లక్షల కోట్ల ఆదాయాన్ని సమకూరుస్తుందని ‘మీడియా పార్టనర్స్ ఏషియా’ నివేదిక తెలిపింది. రానున్న నాలుగేళ్లలో ఈ పరిశ్రమలో 2.8 లక్షల ఉద్యోగాలు వస్తాయని పేర్కొంది.నివేదికలోని వివరాల ప్రకారం..ప్రపంచవ్యాప్తంగా భారత్‌లో వీడియో మార్కెట్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ రంగంలో సేవలందిస్తున్న కంపెనీలు అమలు చేస్తున్న ప్రీమియం వల్ల వీడియో ఎంటర్టైన్మెంట్ ఎకానమీ 2028 నాటికి 8 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేస్తుందని అంచనా. 2018లో ఈ ఇండస్ట్రీ మార్కెట్ విలువ రూ.27 వేలకోట్లుగా ఉంది. 2023లో ఇది రూ.48 వేలకోట్లకు పెరిగింది. 2028 నాటికి వీడియో స్ట్రీమింగ్ మార్కెట్ విలువ రూ.1.08 లక్షల కోట్లుకు చేరుకుంటుందని అంచనా. దానివల్ల దాదాపు 2.8 లక్షల మందికి ఉపాధి లభిస్తుంది.ఇదీ చదవండి: బడ్జెట్ 2024-25.. రియల్టీ ఇన్వెస్టర్లకు చుక్కెదురు..?ఈ సందర్భంగా మీడియా పార్టనర్స్ ఏషియా మేనేజింగ్ డైరెక్టర్ వివేక్ కూటో మాట్లాడుతూ..‘నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ కంపెనీలు భారత్‌లో స్థానిక కంటెంట్‌ను కొనుగోలు చేయడానికి ఏటా సుమారు రూ.4 వేలకోట్లు వెచ్చిస్తున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీకి చెందిన జియో సినిమా క్రీడలను ప్రసారం చేయడానికి ఏటా సుమారు రూ.8,300 కోట్లు ఖర్చు చేస్తోంది’ అన్నారు. -
మరో రెండు ఓటీటీల్లోకి తెలుగు యాక్షన్ మూవీ.. ఎక్కడంటే?
టాలీవుడ్ హీరో సుధీర్ బాబు ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ 'హరోం హర'. జూన్ 14న రిలీజైన ఈ సినిమాకు టాక్ బాగున్నప్పటికీ పెద్దగా కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. దీంతో సరిగ్గా నెల రోజులకు డిజిటల్ ప్లాట్ఫామ్లో రిలీజ్ చేశారు.తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో అందుబాటులోకి తీసుకొచ్చారు. తాజాగా ఈ మూవీ మరో ఓటీటీలో రిలీజైంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రత్యక్షమైంది. అలాగే జియో సినిమాలో హిందీ వర్షన్ విడుదలైంది. జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మాళవిక శర్మ హీరోయిన్గా మెప్పించింది. చైతన్ భరద్వాజ్ సంగీతం అందించగా సుమంత్ జి నాయుడు నిర్మించాడు.కథ విషయానికి వస్తే..1989లో కుప్పం ప్రాంతాన్ని తమ్మిరెడ్డి(లక్కి లక్ష్మణ్), అతని కుమారుడు శరత్(అర్జున్ గౌడ)తమ గుప్పింట్లో ఉంచుకుంటారు. పొలాల్ని కబ్జా చేస్తూ అడ్డొచ్చినవారిని అంతం చేస్తుంటారు. ఆ ప్రాంతంలోని పాలిటెక్నిక్ కాలేజీలోకి సుబ్రమణ్యం(సుధీర్ బాబు) ల్యాబ్ అసిస్టెంట్‌గా వస్తాడు. అదే కాలేజీలో పనిచేసే లెక్చరర్(మాళవిక శర్మ)ను ప్రేమిస్తాడు. ఓ రోజు అనుకోకుండా తమ్మిరెడ్డి మనుషులతో గొడవపడతాడు. దీని ఎఫెక్ట్ సుబ్రహ్మణ్యం ఉద్యోగం పోతుంది. మరోవైపు మూడునెలల్లో తన తండ్రి చేసిన అప్పులు తీర్చాల్సి ఉంటుంది. మరి ఆ సమయంలో హీరో ఏం చేశాడు? అప్పులు తీర్చాడా? తనపై కక్ష సాధించిన విలన్‌పై ప్రతీకారం తీర్చుకున్నాడా? లేదా? అనేది తెలియాలంటే ఓటీటీలో మూవీ చూడాల్సిందే! -
జీయో నుంచి మరో అదిరిపోయే ఆఫర్..
-
ఓటీటీ లవర్స్‌కు జియో సినిమా బంపరాఫర్
ప్రముఖ ఓటీటీ స్ట్రీమింగ్ సంస్థ జియో సినిమా యూజర్లకు శుభవార్త చెప్పింది. జియో సినిమా 12 నెలల ప్రీమియం యాడ్ ఫ్రీ ప్లాన్‌ను రూ. 599కే అందుబాటులోకి తెచ్చింది. దీని ప్రారంభం ధర 50 శాతం డిస్కౌంట్‌తో రూ.299 లకే అందిస్తుంది. సంవత్సరం తర్వాత మళ్లీ రీఛార్జ్ చేసుకోవాలంటే రూ.599 చెల్లించాలి. జియో సినిమా గతంలో రూ.999 వార్షిక ప్లాన్ అందించింది. ఇప్పుడు దాన్ని రూ.599కి తగ్గించి.. ప్రారంభం ఆఫర్ కింద భారీ డిస్కౌంట్ ఇస్తోంది.నెలవారీ ప్లాన్ మాదిరిగానే, వార్షిక సబ్స్క్రిప్షన్ హెచ్‌బీఓ, పీకాక్, పారామౌంట్ ప్లస్ వంటి ఎంటర్టైన్మెంట్ కంటెంట్‌ను సైతం జియో సినిమాలో వీక్షించవచ్చు. దీంతో పాటు ఐపీఎల్ ఇతర ప్రాంతీయ కంటెంట్‌ను ఫ్రీగా చూడొచ్చని ఆ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. -
ఓటీటీలోకి వచ్చేస్తున్న 12th ఫెయిల్ హీరో థ్రిల్లర్ మూవీ.. ఎక్కడంటే?
విక్రాంత్ మాస్సే.. బాలీవుడ్లో ఎంతోకాలంగా హీరోగా రాణిస్తున్నాడు. అయితే 12th ఫెయిల్ మూవీతో మాత్రం ఒక్కసారిగా ట్రెండయ్యాడు. ఐపీఎస్ అధికారి మనోజ్ కుమార్ శర్మ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం జనాల్ని పట్టి కుదిపేసింది. ఈ ఒక్క చిత్రంతో సౌత్‌లోనూ గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం విక్రాంత్ చేతిలో బోలెడన్ని చిత్రాలున్నాయి. అందులో ఒకటి నేరుగా ఓటీటీలో విడుదల కానుంది.విక్రాంత్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం బ్లాక్ అవుట్. మౌనీ రాయ్ హీరోయిన్గా నటించింది. సునీల్ గ్రోవర్, కరణ్ సోనావానే కీలక పాత్రల్లో అలరించారు. థ్రిల్లర్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రానికి దేవంగ్ భవసార్ దర్శకత్వం వహించాడు. 2021లో ఈ ప్రాజెక్ట్ ప్రకటించగా ఇన్నాళ్లకు రిలీజ్‌కు నోచుకోవడం గమనార్హం. ఈ చిత్రం జియో సినిమాలో జూన్ 7 నుంచి ప్రసారం కానుంది. ఈ విషయాన్ని జియో సినిమా అధికారికంగా వెల్లడించింది. Iss kahani ke sabhi patra ki life ke 🤫 lag chuke hai…!#StayTuned for more details about their life 🧐Subscribe to JioCinema Premium at Rs.29 per month.Exclusive content. Ad-free. Any device. Up to 4K.@VikrantMassey @Roymouni @WhoSunilGrover @focusedindian #JyotiDeshpande… pic.twitter.com/zCy7Uuqz1c— JioCinema (@JioCinema) May 16, 2024చదవండి: అలా జరిగుంటే నా పవిత్ర బతికేది, మా రిలేషన్‌ను చెప్దామనుకున్నాం.. ఏడ్చేసిన నటుడు -
ఏడాది తర్వాత ఓటీటీలోకి వస్తున్న రొమాంటిక్ హిట్ సినిమా
ఓ సినిమా థియేటర్లలో రిలీజైన రెండు మూడు వారాలకే ఓటీటీలోకి వస్తున్న రోజులివి. అలాంటిది ఈ మూవీ మాత్రం ఏకంగా ఏడాది తర్వాత ఇప్పుడు అందుబాటులోకి రానుంది. అప్పుడు ఇప్పుడు అని కొన్నాళ్ల ముందు హడావుడి చేశారు. కానీ ఇన్నాళ్లకు స్ట్రీమింగ్ డేట్ ప్రకటించారు. ఇంతకీ ఈ సినిమా సంగతేంటి? ఎందులో రిలీజ్ కానుంది?(ఇదీ చదవండి: తెలుగు సీరియల్ నటి కన్నుమూత.. నటుడు ఎమోషనల్ పోస్ట్)విక్కీ కౌశల్, సారా అలీ ఖాన్ జంటగా నటించిన సినిమా 'జర హట్కే జర బచ్కే'. రొమాంటిక్ కామెడీ బ్యాక్‌డ్రాప్‌తో తీసిన ఈ చిత్రం.. గతేడాది జూన్ లో థియేటర్లలో రిలీజైంది. ఇందులో 'తేరే వాస్తులే' అనే పాట అప్పట్లో తెగ పాపులర్ అయింది. రీల్స్ తెగ చేశారు. ఇక ఈ మూవీ డిజిటల్ హక్కుల్ని జియో సినిమా దక్కించుకోగా... స్ట్రీమింగ్ మాత్రం ఇప్పుడు ఏడాది తర్వాత చేస్తోంది. మే 17 నుంచి అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది.ఈ సినిమా కథ విషయానికొస్తే.. కపిల్ (విక్కీ కౌశల్), సౌమ్య (సారా) పెళ్లయిన కొత్త జంట. మిడిల్ క్లాస్ కుటుంబం కావడంతో వీళ్లకు బెడ్ రూమ్ ఇచ్చి, హాల్లో తల్లిదండ్రులు పడుకుంటూ ఉంటారు. అయితే భర్తతో సరదాగా గడుపుదామంటే అత్తమామ ఇంట్లోనే ఉన్నారని, కొత్తిల్లు తీసుకుందామని సౌమ్య అనుకుంటుంది. ఆవాస్ యోజన పథకం కోసం అప్లికేషన్ పెట్టడానికి వెళ్లి, అక్కడి అధికారితో కపిల్ గొడవపడతాడు. ఈ క్రమంలోనే విడాకులు ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? చివరకు ఏమైందనేదే స్టోరీ.(ఇదీ చదవండి: భయంకరమైన వ్యాధి.. అందరూ నన్ను దూరం పెట్టారు: హీరోయిన్)Sah-parivaar shaadi ki thi, ab sah-parivaar divorce bhi hoga! Toh aap sab #DivorceMeinZaroorAana 💔#ZaraHatkeZaraBachke streaming May 17 onwards, exclusively on JioCinema Premium. #ZHZBOnJioCinema #JioCinemaPremium@vickykaushal09 @SaraAliKhan pic.twitter.com/Vy4K5tLJDy— JioCinema (@JioCinema) May 12, 2024 -
ఓటీటీకి వచ్చేస్తోన్న మర్డర్ మిస్టరీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
అసలే వేసవికాలం.. బయటచూస్తే మండుటెండలు భయపెట్టేస్తున్నాయి. స్కూళ్లకు సైతం సెలవులు రావడంతో పిల్లలు సైతం ఇంట్లోనే ఉంటున్నారు. దీంతో ఫ్యామిలీ అంతా కలిసి సినిమాలు చూసేందుకు ఓటీటీలపై ఎక్కువగా ఆధారపడుతున్నారు. అలాంటి సినీ ప్రియుల కోసం ఓటీటీలు సైతం సరికొత్త కంటెంట్‌ను అందిస్తున్నాయి.తాజాగా మరో క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ఓటీటీలో సందడి చేసేందుకు వస్తోంది. ఈ జానర్‌కు ఆడియన్స్ నుంచి విపరీతమైన క్రేజ్ వస్తోంది. ఈ క్రమంలోనే మర్డర్ ఇన్ మహిమ్ అనే పేరుతో మరో సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ అలరించేందుకు సిద్ధమైంది. విజయ్ రాజ్, అషుతోశ్ రాణా, శివానీ రఘువంశీ ఈ వెబ్ సిరీస్‌లో ప్రధాన పాత్రలు పోషించారు. తాజాగా ఈ సిరీస్ స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది.ఈనెల 10 నుంచి జియో సినిమాలో స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారిక ప్రకటన వచ్చేసింది. ఇటీవలే టీజర్ రిలీజ్ కాగా.. అభిమానుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. ఈ సిరీస్ ఏకంగా ఆరు భాషల్లో అందుబాటులోకి రానుంది. హిందీతో పాటు తెలుగు, కన్నడ, తమిళం, బెంగాలీ, మరాఠీ భాషల్లో స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ వెల్లడించారు. అయితే ఇది కేవలం జియో సినిమా ప్రీమియమ్ సబ్స్క్రిప్షన్ ఉన్న వారికి మాత్రమే అందుబాటులోకి రానుంది. Bas teen din mein milenge saare sawalon ke jawab🔪Murder In Mahim streaming 10th May onwards, exclusively on JioCinema Premium.Subscribe to JioCinema Premium at Rs. 29 per month. Exclusive content. Ad-free. Any device. Up to 4K. pic.twitter.com/kL5cnFp8Uy— JioCinema (@JioCinema) May 7, 2024 -
Barbie OTT Release: తెలుగులో స్ట్రీమింగ్కు వచ్చేసిన హాలీవుడ్ హిట్ సినిమా
హాలీవుడ్ సినిమా 'బార్బీ' గతేడాది జూలై 21న రిలీజై భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ ఏడాది అత్యధిక కలెక్షన్లు వసూళ్లు చేసిన సినిమాల జాబితాలో చేరిపోయిన బార్బీ క్రియేట్ చేసింది. ఈ క్రమంలో బార్బీ , ప్రపంచవ్యాప్తంగా రూ. 11వేల కోట్లకు పైగా వసూలు చేసింది. ఇండియాలో బార్బీ మూవీకి దాదాపు 150 కోట్ల వరకు కలెక్షన్స్ వచ్చాయి. తాజాగా ఈ సినిమా ఓటీటీలోకి తెలుగు వర్షన్ వచ్చేసింది.హాలీవుడ్ స్టార్స్ మార్గోట్ రాబీ, ర్యాన్ గోస్లింగ్, కేట్ మెక్ కిన్నన్, విల్ ఫెర్రెల్, అమెరికా ఫెరెరా, ఇస్సా రే, సిము లియులు బార్బీలో నటించారు. 96వ ఆస్కార్ అవార్డుల్లో ఎనిమిది నామినేషన్స్‌లలో చోటు దక్కించుకుని రికార్డ్ క్రియేట్ చేసింది. అయితే, బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో మాత్రమే ఆస్కార్ అవార్డును దక్కించుకుంది. ఇప్పుడు జియో సినిమా ఓటీటీలో తెలుగు వెర్షన్ స్ట్రీమింగ్ అవుతోంది. అమెజాన్ ప్రైమ్‌లో అయితే రెంటల్ విధానంలో రూ. 149 రూపాయలు చెల్లించి చూడవచ్చు. -
ఓటీటీలోకి 20 సినిమాలు.. హిట్ మూవీస్‌తో పాటు సిరీస్ కూడా!
బాక్సాఫీస్ దగ్గర కొన్నిసార్లు సీన్ డిఫరెంట్‌గా ఉంటుంది. టాక్ బాగున్నా పెద్దగా కలెక్షన్స్ ఉండవు. బాలీవుడ్లో మైదాన్ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది కానీ కలెక్షన్స్ మాత్రం దారుణంగా ఉన్నాయి. వందల కోట్లు పెట్టి తీసిన అక్షయ్ కుమార్ - టైగర్ ష్రాఫ్‌ల బడే మియా చోటే మియా అట్టర్ ఫ్లాప్ దిశగా అడుగులేస్తోంది. భీమా, ఫ్యామిలీ స్టార్.. రెండూ బాక్సాఫీస్ దగ్గర యావరేజ్ కంటే దిగువనే ఉన్నాయి.ఓటీటీ విషయానికి వస్తే టిల్లు స్క్వేర్, భీమా వంటి పలు చిత్రాలు వెబ్ వీక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. మరి ఈ గురు, శుక్రవారాల్లో ఇంకా ఏయే సినిమాలు, సిరీస్‌లు ఓటీటీలో సందడి చేయనున్నాయో చూసేద్దాం..నెట్ఫ్లిక్స్శిక్షనేరక (ఇండోనేషియన్ చిత్రం)- ఏప్రిల్ 25ఫేస్ టు ఫేస్ (ఈజిప్షియన్ చిత్రం) - ఏప్రిల్ 25సిటీ హంటర్ (జపనీస్ చిత్రం) - ఏప్రిల్ 25డెడ్ బాయ్ డిటెక్టివ్స్ (ఇంగ్లీష్ సిరీస్) - ఏప్రిల్ 25టిల్లు స్క్వేర్ (తెలుగు మూవీ) - ఏప్రిల్ 26గుడ్‌బై ఎర్త్ (కొరియన్ సిరీస్) - ఏప్రిల్ 26ద అసుంత కేస్ (స్పానిష్ సిరీస్) - ఏప్రిల్ 26అమెజాన్ ప్రైమ్దిల్ దోస్తీ డైలమా (హిందీ సిరీస్) - ఏప్రిల్ 25ఫ్యామిలీ స్టార్ - ఏప్రిల్ 26హాట్స్టార్భీమా (తెలుగు సినిమా) - ఏప్రిల్ 25థాంక్యూ, గుడ్ నైట్: ద బాన్ జోవి స్టోరీ (ఇంగ్లీష్ డాక్యు సిరీస్) - ఏప్రిల్ 26క్రాక్: జీతేగా తో జియేగా (హిందీ మూవీ) - ఏప్రిల్ 26 జియో సినిమాయారియాన్ 2 (హిందీ మూవీ) - ఏప్రిల్ 25రాన్నీతి: బాలకోట్ అండ్ బియాండ్ (హిందీ సిరీస్) - ఏప్రిల్ 25ధక్ ధక్ - ఏప్రిల్ 25ఓ మై గాడ్ 2 (తెలుగు వర్షన్) - ఏప్రిల్ 25వుయ్ ఆర్ హియర్ సీజన్ 4 (ఇంగ్లీష్ సిరీస్) - ఏప్రిల్ 27బుక్ మై షోకుంగ్ ఫూ పాండా 4 (ఇంగ్లీష్ సినిమా) - ఏప్రిల్ 26లయన్స్ గేట్ ప్లేద బీ కీపర్ (ఇంగ్లీష్ మూవీ) - ఏప్రిల్ 26అమెజాన్ మినీ టీవీచాచా విధాయక్ హై మారే (సిరీస్, మూడో సీజన్) - ఏప్రిల్ 25చదవండి: నా పిల్లలు చూస్తే నా పరువేం కావాలి.. నటుడు ఎమోషనల్ -
ఓటీటీ అభిమానులకు శుభవార్త.. సబ్స్క్రిప్షన్ ప్లాన్ల ధరలు తగ్గింపు
ఓటీటీల చుట్టూ సినిమా ప్రపంచం తిరుగుతుంది. ఒక చిత్రం విడుదలైన 30 రోజుల్లోనే ఓటీటీలోకి అందుబాటులో రానున్నడంతో వాటిపై ప్రేక్షకులు కూడా ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో అమెజాన్ ప్రైమ్,నెట్‌ఫ్లిక్స్, హాట్ స్టార్, జీ5 వంటి ప్రముఖ సంస్థలు ఈ రంగంలో రాణిస్తున్నాయి. వీటికి పోటీగా జియో సినిమా రంగంలోకి దిగింది. కానీ సబ్స్క్రిప్షన్ ప్లాన్ల ధర కాస్త ఎక్కువగా ఉందనే టాక్ రావడంతో రేట్లు తగ్గిస్తూ కొత్త ప్లాన్లను లాంచ్ చేసింది. తాజాగా రెండు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్లను అందుబాటులోకి తెచ్చింది.ప్రస్తుతం ఐపీఎల్ సీజన్‌ను ఉచితంగా అందిస్తున్న జియో సినిమా తన వినియోగదారులను మరింత పెంచుకునేందుకు ప్లాన్ వేసింది. దీంతో తాజాగా అందరికీ అందుబాటు ధరలో రూ. 29, రూ. 89లకు రెండు కొత్త ప్రీమియం సబ్స్క్రిప్షన్ ప్లాన్లను లాంచ్ చేసింది. అంతేకాకుండా డివైజ్‌ల సంఖ్య పరిమితులను కూడా జియో సినిమా పెంచింది.రూ.29 ప్లాన్ వివరాలు జియో సినిమాలో ప్రీమియం కంటెంట్ చూడాలంటే గతంలో రూ. 59 చెల్లించాల్సి వచ్చేది. ఈ ప్లాన్‌ను తాజాగా మార్చేసిన జియో కేవలం రూ. 29కే అందుబాటులోకి తీసుకొచ్చింది. కానీ ఒక డివైజ్‌లోనే అందుబాటులో ఉంది. ఎలాంటి యాడ్స్ లేకుండా కూడా చూడొచ్చు. ఇందులో డౌన్లోడ్ సదుపాయం కూడా ఉంది. స్మార్ట్ టీవీ డివైజ్‌లోనైనా యాక్సస్ ఉంటుంది.రూ. 89కే ఫ్యామిలీ ప్లాన్ ఒక కుటుంబంలో ఎక్కువ మందికి యాక్సస్ కావాలంటే ఈ ప్లాన్ బాగుంటుంది. గతంలో రూ. 149 ఉన్న ఈ ప్లాన్.. తాజాగా రూ. 89కు అందుబాటులో ఉంది. అయితే, ఓకేసారి నాలుగు డివైజ్‌లలో కంటెంట్‌ను చూడొచ్చు. ఇందులో కూడా ఎలాంటి యాడ్స్ రావు. స్పోర్ట్స్ వంటి వాటిలో మాత్రం యాడ్స్ వస్తాయి. ఎక్కువగా జియో సినిమాలో 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' వెబ్ సిరీస్‌ను ప్రేక్షకులు చూస్తున్నారు. హెచ్‌బీఓ, వార్నర్ బ్రదర్స్, డిస్కవరీ నిర్మించిన చిత్రాలు ఇందులో ప్రధాన ఆకర్షణగా ఉన్నాయి. -
ఓటీటీలోకి 'ఓపెన్‌హైమర్' తెలుగు వర్షన్ వచ్చేసింది
హాలీవుడ్ బ్లాక్‌బస్టర్ ‘ఓపెన్‌హైమర్’ తెలుగు అభిమానులకు గుడ్‌న్యూస్. ఈ హిట్ సినిమా తాజాగా ఓటీటీలో తెలుగు వర్షన్ అందుబాటులోకి వచ్చేసింది. క్రిస్టఫర్ నోలన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సిలియన్ మర్ఫీ ప్రధాన పాత్రలో నటించారు. శాస్త్రవేత్త జె.రాబర్ట్ ఓపెన్‌హైమర్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఘన విజయాన్ని అందుకుంది. అణు బాంబును కనుగొన్న శాస్త్రవేత్త జె.రాబర్ట్ ఓపెన్‌హైమర్ జీవితం ఆధారంగా చేసుకుని ‘ఓపెన్ హైమర్’ను రూపొందించారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా ఇంగ్లీష్,హిందీ వర్షన్లో రూ. 119 రెంట్ విధానంలో ఇప్పటికే అందుబాటులో ఉన్న ఓపెన్‌హైమర్.. మార్చి 21 నుంచి జియో సినిమాలో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగుతో పాటుగా ఇంగ్లీష్,తమిళం, కన్నడ, మరాఠీ, బెంగాలీ, హిందీ భాషల్లో అందుబాటులో ఉంది. జియో సినిమా వినియోగదారులు అయితే ఎలాంటి రెంట్ లేకుండా ఈ చిత్రాన్ని చూడొచ్చు. 96వ ఆస్కార్ వేడుకల్లో ‘ఓపెన్‌హైమర్’ సత్తా చాటింది. ఉత్తమ చిత్రం సహా ఏడు విభాగాల్లో అవార్డును దక్కించుకుంది. ఈ చిత్రానికే ఉత్తమ దర్శకుడిగా క్రిస్టఫర్ నోలన్, ఉత్తమ నటుడిగా సిలియన్ మర్ఫీలు పురస్కారాలు అందుకున్నారు. ఉత్తమ సహాయ నటుడు, ఉత్తమ సినిమాటోగ్రఫి, ఉత్తమ ఎడిటింగ్, ఉత్తమ నేపథ్య సంగీతం విభాగాల్లోనూ ఈ సినిమా అవార్డులు గెలుచుకుంది. రూ. 835 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.7,600 కోట్లకు పైగానే కలెక్షన్స్ సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది. -
ఓటీటీకి ఆస్కార్ అవార్డులు కొల్లగొట్టిన మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఇటీవల ప్రకటించిన 96వ ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుల్లో ఈసారి 'ఓపెన్ హైమర్' సత్తా చాటింది. ఉత్తమ నటుడు, దర్శకుడు, చిత్రం, సహాయ నటుడు, ఒరిజినల్ స్కోర్, ఫిల్మ్ ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ ప్రధాన విభాగాల్లో పురస్కారాలు కైవసం చేసుకుంది. హాలీవుడ్ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఇప్పటివరకు క్లాసిక్స్ తీసిన ఇతడు.. తొలిసారి 'ఓపెన్ హైమర్' అనే బయోపిక్ తీశాడు. దాదాపు మూడేళ్ల పాటు ఈ సినిమా కోసం కష్టపడ్డాడు. ఇప్పుడు ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కింది. దాదాపు ఎనిమిది సార్లు నామినేషన్స్‌లో ఉన్న ఆయన.. తొలిసారి ఉత్తమ దర్శకుడిగా ఆస్కార్ అందుకున్నాడు. తాజాగా ఈ సూపర్ హిట్ మూవీ ఓటీటీకి స్ట్రీమింగ్కు సిద్ధమైంది. ఈ నెల 21 నుంచి జియో సినిమాలో స్ట్రీమింగ్ కానుంది. ఆస్కార్‌లో అవార్డులు కొల్లగొట్టిన ఓపెన్ హైమర్ ఇప్పటికే అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది. కానీ రెంటల్ విధానంలో మాత్రమే స్ట్రీమింగ్ అవుతోంది. ఇక నుంచి జియో సినిమాలో ఉచితంగానే చూసేయొచ్చు. ప్రస్తుతం హిందీ, ఇంగ్లీష్ భాషల్లో మాత్రమే స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దక్షిణాది భాషల్లోనూ అందుబాటులోకి వచ్చే అవకాశముంది. Keep the awards season spirit alive by binge-watching these cult movies! 🏆✨ Get ready to witness the cinematic phenomenon of Oppenheimer, streaming on #JioCinema March 21 onwards. pic.twitter.com/PUBSIFn94m — JioCinema (@JioCinema) March 18, 2024 -
ఓటీటీకి వంద కోట్ల సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
యామీ గౌతమ్, ప్రియమణి ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన చిత్రం ఆర్టికల్ 370. జమ్మూకశ్మీర్‌లో కేంద్రం రద్దు చేసిన ఆర్టికల్ 370 ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. వాస్తవ సంఘటనల ఆధారంగా ఆదిత్య సుహాస్ జంభలే తెరకెక్కించారు. ఫిబ్రవరి 23న థియేటర్లలో వచ్చిన ఈ చిత్రం భారీ వసూళ్లు సాధించింది. బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. కొత్త ఏడాదిలో వందకోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన జాబితాలో నాలుగోస్థానంలో నిలిచింది. థియేటర్లలో సూపర్ హిట్‌గా నిలిచిన ఈ చిత్రం ఓటీటీకి సంబంధించి క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమా ఏప్రిల్ 19 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఆర్టికల్ 370 ఓటీటీ రైట్స్‌ను జియో సినిమా దక్కించుకున్న సంగతి తెలిసిందే. థియేటర్లలో మిస్సయినవారు ఎంచక్కా ఓటీటీలో చూసేయండి. ఈ చిత్రానికి ఆదిత్య సుహాస్ జంభలే దర్శకత్వం వహించగా.. బీ62 స్టూడియోస్, జియో స్టూడియోస్‌పై లోకేష్ ధర్, ఆదిత్య ధర్,జ్యోతి దేశ్‌పాండే నిర్మించారు. -
రెండు ఓటీటీల్లోకి వచ్చేసిన హనుమాన్.. ఎక్కడంటే?
ఒకప్పుడు థియేటర్లో కొత్త సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా? అని ఎదురుచూసేవారు. ఇప్పుడు థియేటర్‌తో పాటు అటు ఓటీటీలో ఎప్పుడు రిలీజ్ అవుతుందా? ఏ ఓటీటీలోకి వస్తుందా? అని ఉత్సుకత ప్రదర్శిస్తున్నారు. గత కొన్నాళ్లుగా హనుమాన్ ఓటీటీ రిలీజ్ కోసం వెబ్ వీక్షకులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. వారి నిరీక్షణకు తెర దించుతూ జియో సినిమాలో హనుమాన్ హిందీ వర్షన్ రిలీజ్ చేశారు. జియోలో స్ట్రీమింగ్ నిన్న (మార్చి 16) రాత్రి 8 గంటల నుంచే జియో సినిమా ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ అవుతోంది. దీంతో నార్త్ ఇండియన్స్ వీకెండ్లో సినిమా చూస్తూ తమ సంతోషాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. ఈ సీన్ అదుర్స్, ఆ సీన్ సూపర్బ్ అంటూ కొన్ని సన్నివేశాల క్లిప్పింగ్స్ నెట్టింట షేర్ చేస్తున్నారు. అయితే సడన్‌గా మరో ఓటీటీలోనూ హనుమాన్ను తీసుకొచ్చేశారు. జీ5లో హనుమాన్ మూవీని అందుబాటులోకి తెచ్చారు. ఈ మేరకు ఓ ప్రోమో కూడా వదిలారు. జీ5లోకి వచ్చేసిన హనుమాన్ అంతా ఓకే కానీ చివర్లో దీన్ని ఫ్రీగా ఇవ్వట్లేదని కొనుక్కోమని చెప్పారు. ఇది చూసిన అభిమానుల ఫ్యూజులెగిరిపోయాయి. సబ్‌స్క్రైబర్స్‌కు ఫ్రీగా ఇవ్వాలి కానీ మళ్లీ ఇలా ప్రత్యేకంగా డబ్బులు పెట్టి కొనుక్కోమని తిరకాసులేంటో అని తిట్టిపోశారు. కానీ కాసేపటికే రెంట్ పద్ధతి తీసేసి ఫ్రీగా చూడొచ్చని చెప్పారు. దీంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన హనుమాన్‌లో తేజ సజ్జ హీరోగా నటించాడు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.350 కోట్ల మేర రాబట్టింది. HanuMan is now streaming on @ZEE5Telugu 😊@tejasajja123 @Niran_Reddy @Actor_Amritha @varusarath5 @VinayRai1809 @Chaitanyaniran @AsrinReddy @Primeshowtweets @tipsofficial @tipsmusicsouth @ThePVCU @RKDStudios #HanuMan #HanuManOnZEE5 pic.twitter.com/PLf0lF3Lfw — Prasanth Varma (@PrasanthVarma) March 17, 2024 చదవండి: త్వరలో ఎలక్షన్స్.. మన్సూర్‌కు కోలుకోలేని దెబ్బ.. అధ్యక్ష పదవి ఊస్ట్ -
మరికొన్ని గంటల్లో ఓటీటీకి హనుమాన్.. ప్రశాంత్ వర్మ స్పెషల్ పోస్ట్!
ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన హనుమాన్ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. పెద్ద సినిమాలతో పోటీపడి రికార్డ్ స్థాయి వసూళ్లతో అదరగొట్టింది. ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ కోసం టాలీవుడ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటివరకు ఓటీటీ స్ట్రీమింగ్ తేదీని అధికారికంగా ప్రకటనైతే రాలేదు. దీంతో కొందరు ఫ్యాన్స్ సైతం ఉన్న ఇంట్రస్ట్ కాస్తా పోయిందని కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇప్పటికే హనుమాన్ హిందీ వర్షన్ ఓటీటీ హక్కులను జియో సినిమా దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ రోజు రాత్రి ఎనిమిది గంటల నుంచే స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా ఈ వారంలో ఫుల్ బజ్ ఉన్న సినిమాల్లో హనుమాన్ నంబర్‌వన్ ప్లేస్‌లో ఉంది. ఆ తర్వాత యానిమల్, డంకీ చిత్రాలు ఉన్నాయి. ఈ విషయాన్ని ప్రశాంత్ వర్మ ట్వీట్ చేశారు. ప్రముఖ ఆర్మాక్స్ మీడియా ఈ విషయాన్ని వెల్లడించింది. దీనికి సంబంధించిన ఫోటోను ప్రశాంత్ వర్మ అభిమానులతో పంచుకున్నారు. కాగా.. అయితే తెలుగుతో పాటు దక్షిణాది భాషల్లో ఓటీటీ హక్కులను జీ5 దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఇటీవలే హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఓటీటీ రిలీజ్ డేట్‌పై హింట్ ఇచ్చాడు. త్వరలోనే ఓటీటీ స్ట్రీమింగ్ తేదీని ప్రకటించనున్నట్లు ట్వీట్ చేశారు. హనుమాన్ ఓటీటీ స్ట్రీమింగ్ ప్రకటన రానుందని పోస్ట్ చేశారు. 😊 https://t.co/BFBLAnWM5p — Prasanth Varma (@PrasanthVarma) March 16, 2024 -
అనంతపద్మనాభ ఆలయం గురించి డాక్యుమెంటరీ.. ఆ ఓటీటీలో ఉచితం
శ్రీ మహావిష్ణువు 108 దివ్యదేశాల్లో అత్యంత ముఖ్యమైన క్షేత్రం తిరువనంతపురంలోని శ్రీ అనంతపద్మనాభ స్వామి ఆలయం. కేరళలో ఉన్న ఈ క్షేత్రం గురించి చాలామందికి కొంత అవగాహన ఉంది. తాజాగా అనంతపద్మనాభ స్వామి ఆలయం గురించి 'ఒనవిల్లు: ది డివైన్ బో' పేరుతో ఒక ఆసక్తికరమైన డాక్యుమెంటరీని రూపొందించారు. ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన జియో సినిమాలో ఉచితంగా చూడవచ్చు. తిరువనంతపురంలోని చలనచిత్ర నిర్మాతలు ఆనంద్ బనారస్, శరత్ చంద్ర మోహన్‌లు ఈ డాక్యుమెంటరీకి దర్శకత్వం వహించారు. మార్చి 8 నుంచి మలయాళ భాషలో మాత్రమే స్ట్రీమింగ్ అవుతుంది. ఇంగ్లీష్‌లో సబ్‌టైటిల్స్ పడుతుండటం వల్ల ఈ డాక్యుమెంటరీని ఇతర భాష వారు కూడా చూస్తున్నారు. ఓనవిల్లు అంటే శ్రీ పద్మనాభస్వామి ఆలయ స్వామికి 'ఓనవిల్లు' అంటే ఉత్సవ విల్లును సమర్పిస్తారు. త్రివేండ్రంలోని విళైల్ వీడు కరమణ సంప్రదాయ కళాకారులు ఈ విల్లును తయారు చేస్తారు. వీరిని "ఒన్వవిల్లు కుటుంబం" అంటారు. ఈ విల్లును తయారు చేసే కుటుంబ సభ్యులు పనిని ప్రారంభించే ముందు 41 రోజుల తపస్సును పాటిస్తారు. ఆ వంశీయులు ఏడు తరాలుగా ఏటా ఓనవిల్లును తయారు చేస్తున్నారు. తరతరాలుగా కొనసాగుతున్న ఈ విశిష్టమైన సంప్రదాయ ఆచారం గురించి వచ్చిన ఈ డాక్యుమెంటరీలో ప్రముఖ మలయాళ నటుడు మమ్ముట్టి, యువ నటుడు ఉన్ని ముకుందన్లు వాయిస్‌ని అందించడం విశేషం. సంపదకు రక్షణగా ట్రావెన్కోర్ కొంతకాలం క్రితం అనంతపద్మనాభ ఆలయంలోని నేలమాళిగల్లో లభించిన అనంతమైన సంపదకు ట్రావెన్కోర్ పాలకులు సంరక్షకులుగా ఉంటున్నారు. వెల కట్టలేని నిధుల రాశిని స్వామివారికి అర్పించి తరతరాలుగా వాటిని సంరక్షిస్తున్నారు. ఇప్పటికీ ఒక గదిని ఇంకా తెరవలేదు. నాగబంధనం వేసివుండటంతో తెరవడం సాధ్యం కాదని పండితులు పేర్కొంటున్నారు. ఈ గదిలో ఎంత సంపద ఉంటుందో ఎవరికీ తెలియని రహస్యం.