ఓటీటీకి వచ్చేస్తోన్న జగపతిబాబు మూవీ.. ఎక్కడ చూడాలంటే? | Bollywood Action Movie Streaming On This Ott Form This Date | Sakshi
Sakshi News home page

Ruslaan Ott Release: ఓటీటీకి జగపతిబాబు యాక్షన్‌ థ్రిల్లర్‌.. ఎక్కడ చూడాలంటే?

Published Thu, Sep 19 2024 10:23 AM | Last Updated on Thu, Sep 19 2024 11:11 AM

Bollywood Action Movie Streaming On This Ott Form This Date

జగపతి బాబు, ఆయుష్‌ శర్మ, సుశ్రీ మిశ్రా కీలక పాత్రల్లో నటించిన చిత్రం రుస్లాన్‌.  ఈ సినిమాకు కరణ్‌ దర్శకత్వం వహించారు. ఫుల్ యాక్షన్‌ చిత్రంగా రూపొందించిన ఈ చిత్రం ఏప్రిల్‌లో బాక్సాఫీస్ వద్ద సందడి చేసింది.  అయితే ఆశించిన స్థాయిలో ప్రేక్షుకలను మెప్పించలేకపోయింది. దాదాపు రూ.25 కోట్ల బడ్జెట్‌తో తెరెకెక్కించిన ఈ చిత్రం అభిమానులను తీవ్రంగా నిరాశపర్చింది. కేవలం రూ.2.70 కోట్ల వసూళ్లు మాత్రమే రాబట్టింది.

తాజాగా ఈ చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. థియేటర్లలో విడుదలైన ఐదు నెలల తర్వాత ఓటీటీలో సందడి చేసేందుకు వస్తోంది. ఈ విషయాన్ని కలర్స్‌ సినీప్లెక్స్‌, జియో సినిమా వెల్లడించాయి. ఈ మేరకు స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశాయి. సెప్టెంబర్‌ 21వ తేదీ నుంచి రెండు ఓటీటీల్లోనూ స్ట్రీమింగ్ కానుంది. కాగా.. ఈ చిత్రంలో టాలీవుడ్ నటుడు జగపతి బాబు పోలీసుపాత్రలో కనిపించారు. 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement