
ప్రముఖ ఓటీటీ స్ట్రీమింగ్ సంస్థ జియో సినిమా యూజర్లకు శుభవార్త చెప్పింది. జియో సినిమా 12 నెలల ప్రీమియం యాడ్ ఫ్రీ ప్లాన్‌ను రూ. 599కే అందుబాటులోకి తెచ్చింది. దీని ప్రారంభం ధర 50 శాతం డిస్కౌంట్‌తో రూ.299 లకే అందిస్తుంది.
సంవత్సరం తర్వాత మళ్లీ రీఛార్జ్ చేసుకోవాలంటే రూ.599 చెల్లించాలి. జియో సినిమా గతంలో రూ.999 వార్షిక ప్లాన్ అందించింది. ఇప్పుడు దాన్ని రూ.599కి తగ్గించి.. ప్రారంభం ఆఫర్ కింద భారీ డిస్కౌంట్ ఇస్తోంది.
నెలవారీ ప్లాన్ మాదిరిగానే, వార్షిక సబ్‌స్క్రిప్షన్ హెచ్‌బీఓ, పీకాక్, పారామౌంట్ ప్లస్ వంటి ఎంటర్‌టైన్మెంట్ కంటెంట్‌ను సైతం జియో సినిమాలో వీక్షించవచ్చు. దీంతో పాటు ఐపీఎల్ ఇతర ప్రాంతీయ కంటెంట్‌ను ఫ్రీగా చూడొచ్చని ఆ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment