ఒకప్పుడు థియేటర్‌లో కొత్త సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా? అని ఎదురుచూసేవారు. ఇప్పుడు థియేటర్‌తో పాటు అటు ఓటీటీలో ఎప్పుడు రిలీజ్ అవుతుందా? ఏ ఓటీటీలోకి వస్తుందా? అని ఉత్సుకత ప్రదర్శిస్తున్నారు. గత కొన్నాళ్లుగా హనుమాన్ ఓటీటీ రిలీజ్ కోసం వెబ్ వీక్షకులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. వారి నిరీక్షణకు తెర దించుతూ జియో సినిమాలో హనుమాన్ హిందీ వర్షన్ రిలీజ్ చేశారు.
జియోలో స్ట్రీమింగ్
నిన్న (మార్చి 16) రాత్రి 8 గంటల నుంచే జియో సినిమా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. దీంతో నార్త్ ఇండియన్స్ వీకెండ్‌లో సినిమా చూస్తూ తమ సంతోషాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. ఈ సీన్ అదుర్స్, ఆ సీన్ సూపర్బ్ అంటూ కొన్ని సన్నివేశాల క్లిప్పింగ్స్ నెట్టింట షేర్ చేస్తున్నారు. అయితే సడన్‌గా మరో ఓటీటీలోనూ హనుమాన్‌ను తీసుకొచ్చేశారు. జీ5లో హనుమాన్ మూవీని అందుబాటులోకి తెచ్చారు. ఈ మేరకు ఓ ప్రోమో కూడా వదిలారు.
జీ5లోకి వచ్చేసిన హనుమాన్
అంతా ఓకే కానీ చివర్లో దీన్ని ఫ్రీగా ఇవ్వట్లేదని కొనుక్కోమని చెప్పారు. ఇది చూసిన అభిమానుల ఫ్యూజులెగిరిపోయాయి. సబ్‌స్క్రైబర్స్‌కు ఫ్రీగా ఇవ్వాలి కానీ మళ్లీ ఇలా ప్రత్యేకంగా డబ్బులు పెట్టి కొనుక్కోమని తిరకాసులేంటో అని తిట్టిపోశారు. కానీ కాసేపటికే రెంట్ పద్ధతి తీసేసి ఫ్రీగా చూడొచ్చని చెప్పారు. దీంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన హనుమాన్‌లో తేజ సజ్జ హీరోగా నటించాడు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.350 కోట్ల మేర రాబట్టింది.
HanuMan is now streaming on @ZEE5Telugu 😊@tejasajja123 @Niran_Reddy @Actor_Amritha @varusarath5 @VinayRai1809 @Chaitanyaniran @AsrinReddy @Primeshowtweets @tipsofficial @tipsmusicsouth @ThePVCU @RKDStudios #HanuMan #HanuManOnZEE5 pic.twitter.com/PLf0lF3Lfw
— Prasanth Varma (@PrasanthVarma) March 17, 2024
చదవండి: త్వరలో ఎలక్షన్స్.. మన్సూర్‌కు కోలుకోలేని దెబ్బ.. అధ్యక్ష పదవి ఊస్ట్
Comments
Please login to add a commentAdd a comment