నేచురల్ స్టార్ నాని, ప్రియాంక మోహన్ జంటగా నటించిన తాజా చిత్రం 'సరిపోదా శనివారం'. వివేక్ ఆత్రేయ డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం ఆగస్టు 29న థియేటర్లలో రిలీజైంది. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందించిన ఈ సినిమాకు తొలిరోజు పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. దసరా, హాయ్ నాన్న చిత్రాలతో హిట్స్ కొట్టిన నాని తన ఖాతాలో మరో సూపర్‌హిట్ ఖాయమని ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
భారీ ధరకు ఓటీటీ రైట్స్?
అయితే ఈ మూవీకి హిట్ టాక్ రావడంతో ఓటీటీ రైట్స్ గురించి చర్చ మొదలైంది. ఓటీటీకి ఎప్పుడు వస్తుంది? ఏ ఓటీటీలో వస్తుందని సినీప్రియులు తెగ ఆరా తీస్తున్నారు. అయితే సరిపోదా శనివారం మూవీ హక్కులను ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్ భారీ ధరకు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే సౌత్ రైట్స్‌ను మాత్రమే దక్కించుకున్నట్లు సమాచారం. మరోవైపు హిందీ ఓటీటీ హక్కులను జియో సినిమా కొనుగోలు చేసినట్లు టాక్ వినిపిస్తోంది.
ఓటీటీకి అప్పుడేనా??
ఈ మూవీ రిలీజైన నెలరోజుల్లోపే ఓటీటీకి రానుందని క్రేజీ టాక్ నడుస్తోంది. సెప్టెంబర్ 26 నుంచే స్ట్రీమింగ్‌కు వచ్చే అవకాశముందని సమాచారం. అదే రోజు రెండు ఓటీటీల్లో రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే సరిపోదా శనివారం నెల రోజుల్లోపే ఓటీటీలో చూసే అవకాశం ఉంటుంది. కాగా.. ఈ చిత్రంలో తమిళ స్టార్ ఎస్‌జే సూర్య విలన్ పాత్రలో మెప్పించారు.
Comments
Please login to add a commentAdd a comment