
ఇండస్ట్రీలో ఏ హీరోకి అయినా హిట్ ఫ్లాప్స్ సాధారణం. కానీ గత కొన్నేళ్లుగా వరస సినిమాలతో విజయాల్ని అందుకుంటున్న హీరోల్లో నాని ఒకడు. ఓవైపు హీరోగా హిట్స్ కొడుతూనే మరోవైపు నిర్మాతగానూ సూపర్ సక్సెస్ అందుకుంటున్నాడు. రీసెంట్ హిట్ 'కోర్ట్'.. నాని ప్రొడక్షన్ నుంచి వచ్చిందే.
(ఇదీ చదవండి: హీరోయిన్ అమలాపాల్ కి ఖరీదైన కారు గిఫ్ట్.. రేటు ఎంతో తెలుసా?)
ప్రస్తుతం తెలుగులో చాలా సినిమాలకు ఓటీటీ డీల్స్ జరగట్లేదు. దీంతో ఫైనల్ కాపీ సిద్ధమైన విడుదలకు నోచుకోవట్లేదు. అదే టైంలో నాని సినిమాలకు మాత్రం రిలీజ్ కి చాలారోజుల ముందే ఓటీటీ డీల్స్ క్లోజ్ అయిపోతున్నాయి. 'కోర్ట్'ని ఏకంగా రూ.8 కోట్లకు నెట్ ఫ్లిక్స్ తీసుకుందని టాక్.
రీసెంట్ గా నాని హీరోగా 'ద ప్యారడైజ్' మూవీని ప్రకటించారు. దీని షూటింగ్ అసలు మొదలు కాలేదు కానీ ఓటీటీ డీల్ మాత్రం రూ.65 కోట్లకు జరిగిపోయిందట. నాని ఇప్పటికే పూర్తి చేసిన 'హిట్ 3' చిత్ర ఓటీటీ హక్కుల్ని ఇదివరకే నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుందని ప్రకటించారు. ఇకపోతే ఈ డీల్ రూ.54 కోట్ల జరిగిందని తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదంతా చూస్తుంటే ప్రస్తుతం ఇండస్ట్రీలో నాని టైమ్ నడుస్తోంది. పట్టిందల్లా బంగారమవుతుందనిపిస్తోంది.
(ఇదీ చదవండి: హీరో విశ్వక్సేన్ సోదరి ఇంట్లో భారీ చోరీ)
Comments
Please login to add a commentAdd a comment