
'గేమ్ ఛేంజర్' రిజల్ట్ ఏంటో అందరికీ తెలుసు. వెంటనే దాన్నుంచి బయటకొచ్చిన మెగా ఫ్యాన్స్.. చరణ్ (Ram Charan) కొత్త మూవీ కోసం చాలా ఎదురుచూస్తున్నారు. అందుకు తగ్గట్లే సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఓ రూమర్ వినిపిస్తూనే ఉంటుంది. తాజాగా RC16 కథ ఇదేనా అని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు.
'ఉప్పెన' తర్వాత దర్శకుడు బుచ్చిబాబు చేస్తున్న సినిమా ఇది. 'పెద్ది' అనే వర్కింగ్ టైటిల్ అనుకుంటున్నారని టాక్. ఇందులో జాన్వీ కపూర్ (Janhvi Kapoor) హీరోయిన్. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్రలో నటిస్తున్నారు. స్పోర్ట్స్ డ్రామాగా దీన్ని తీస్తున్నారు. ఇప్పటికే వేగంగా షూటింగ్ చేస్తున్నారు.
(ఇదీ చదవండి: మళ్లీ హాస్పిటల్ బెడ్ పై సమంత)
స్పోర్ట్స్ డ్రామా స్టోరీ అని ఇదివరకే లీకైంది. ఇప్పుడు ఈ మూవీలో చరణ్.. అద్దె ఆటగాడిగా కనిపించబోతున్నాడని అంటున్నారు. అంటే క్రికెట్, కబడ్డీ, వాలీబాల్.. ఇలా ఏ గేమ్ అయినా సరే ఎంతో కొంత డబ్బులిస్తే, వాళ్ల టీమ్ తరఫున ఆడతాడు. మరి నిజమా కాదా అనేది చూడాలి.
కొన్నాళ్ల క్రితం మైసూరులో షూటింగ్ ప్రారంభం కాగా.. ఎక్కువగా రాత్రుళ్లు జరిగే సీన్స్ తీస్తున్నారు. రీసెంట్ గా క్రికెట్ సీన్స్ తెరకెక్కించారట. పెద్దగా గ్రాఫిక్స్ లాంటివి లేవని, దీంత వీలైనంత త్వరగా పనిపూర్తి చేసుకుని ఈ ఏడాది థియేటర్లలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట.
(ఇదీ చదవండి: 'బిగ్ బాస్'కి వెళ్లకుండా ఉండాల్సింది.. ఏడేళ్లుగా బాధ: శిల్పా చక్రవర్తి)
Comments
Please login to add a commentAdd a comment