రామ్‌చరణ్‌ పెద్ది? | Ram Charan Upcoming Telugu Movie With Buchi Babu, Title Revealed - Sakshi
Sakshi News home page

రామ్‌చరణ్‌ పెద్ది?

Published Sat, Mar 16 2024 12:31 AM | Last Updated on Sat, Mar 16 2024 1:09 PM

RC16 Peddi Titled For Ram Charan Upcoming Telugu Movie - Sakshi

రామ్‌చరణ్‌ హీరోగా బుచ్చిబాబు సన దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. రూరల్‌ స్పోర్ట్స్‌ డ్రామాగా రూపొందనున్న ఈ సినిమాలో జాన్వీకపూర్‌ హీరోయిన్‌గా నటిస్తారు. కాగా ఈ నెల 20న హైదరాబాద్‌లో ఈ చిత్రం ప్రారంభోత్సవం జరగనుందని తెలిసింది.

ఈ సినిమాకు ‘పెద్ది’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారని, ఈ నెల 27న రామ్‌చరణ్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్‌పై స్పష్టత వచ్చే చాన్స్‌ ఉందని భోగట్టా. అలాగే ఈ సినిమాలో కన్నడ స్టార్‌ శివరాజ్‌కుమార్‌ ఓ కీలక పాత్రలో కనిపిస్తారనే టాక్‌ వినిపిస్తోంది. కాగా ప్రస్తుతం వైజాగ్‌లో జరుగుతున్న ‘గేమ్‌చేంజర్‌’ చిత్రం షూటింగ్‌తో బిజీగా ఉన్నారు రామ్‌చరణ్‌. శంకర్‌ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని‘దిల్‌’ రాజు, శిరీష్‌ నిర్మిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement