అఫీషియల్: చరణ్ సినిమాలో 'మీర్జాపుర్' మున్నా భయ్యా | Mirzapur Series Fame Divyendu In Ram Charan-Buchi Babu Movie | Sakshi
Sakshi News home page

Munna Bhayya RC16: ఓటీటీ స్టార్.. ఇప్పుడు తెలుగు సినిమాలో

Published Sat, Nov 30 2024 1:46 PM | Last Updated on Sat, Nov 30 2024 2:51 PM

Mirzapur Series Fame Divyendu In Ram Charan-Buchi Babu Movie

ఓటీటీలో 'మీర్జాపుర్' వెబ్ సిరీస్ ఎంత ఫేమస్సో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందులో ఉన్నవి బూతులే కానీ ఆడియెన్స్ వాటిని ఎంజాయ్ చేశారు. మరీ ముఖ్యంగా మున్నా భయ్యా అనే క్యారెక్టర్‌కి బోలెడంత మంది ఫ్యాన్స్ కూడా ఉన్నారు. ఇప్పుడు ఆ నటుడు తెలుగు సినిమాలో నటించేస్తున్నాడు.

(ఇదీ చదవండి: 3 వారాల్లోనే ఓటీటీలోకి 'మట్కా'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?)

'గేమ్ ఛేంజర్' మూవీని రెడీ చేసిన రామ్ చరణ్.. ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో నటిస్తున్నాడు. 'RC16' పేరుతో తీస్తున్న ఈ ప్రాజెక్ట్‌ షూటింగ్ కొన్నిరోజుల క్రితమే మైసూరులో మొదలైంది. ఇందులో కన్నడ స్టార్ హీరో శివన్న, జగపతిబాబు తదితరులు నటిస్తున్నారు. ఇప్పుడు తనకెంతో ఇష్టమైన పాత్ర అని చెప్పిన డైరెక్టర్ బుచ్చిబాబు.. మున్నా భయ్యా చరణ్ మూవీలో నటిస్తున్నట్లు ప్రకటించాడు.

స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో చరణ్-బుచ్చిబాబు మూవీ ఉండబోతుందని తెలుస్తోంది. జాన్వీ కపూర్ హీరోయిన్. ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకుడు. బహుశా వచ్చే ఏడాది చివర్లో లేదంటే 2026 ప్రారంభంలో మూవీ థియేటర్లలోకి వచ్చే అవకాశముంది.

(ఇదీ చదవండి: చైతూ-శోభిత పెళ్లి సందడి.. హల్దీ ఫొటోలు వైరల్)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement