3 వారాల్లోనే ఓటీటీలోకి 'మట్కా'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే? | Matka Movie OTT Release Date Details Official | Sakshi
Sakshi News home page

Matka OTT: మెగా హీరో కొత్త సినిమా.. ఓటీటీలోకి ఇంత త్వరగానా?

Nov 30 2024 12:49 PM | Updated on Nov 30 2024 1:23 PM

Matka Movie OTT Release Date Details Official

మెగా హీరోల్లో కాస్త డిఫరెంట్ సినిమాలు చేసే వరుణ్ తేజ్ రీసెంట్ 'మట్కా'లో నటించాడు. భారీ బడ్జెట్‌తో దీన్ని తీశారు. చాన్నాళ్ల పాటు షూటింగ్ చేసుకుని నవంబర్ 14న థియేటర్లలో రిలీజ్ చేశారు. ఓ మాదిరితో అంచనాలతో వచ్చింది గానీ ఘోరమైన డిజాస్టర్‌గా నిలిచింది. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది.

(ఇదీ చదవండి: సాయం చేస్తానంటూ రాఘవ లారెన్స్‌ పేరుతో మోసం)

వరుణ్ తేజ్, మీనాక్షి చౌదరి హీరోహీరోయిన్లుగా నటించిన 'మట్కా'ని యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించారు. అయితే ఎమోషన్స్ సరైన రీతిలో వర్కౌట్  అయ్యే సీన్స్ పడలేదు. దీంతో ఒకటి రెండు రోజుల్లోనే థియేటర్ల నుంచి కనుమరుగైపోయింది. భారీ నష్టాలు కూడా వచ్చాయని టాక్. ఇప్పుడు ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లోకి రాబోతుంది.

థియేటర్లలో రిలీజైన మూడు వారాల్లోనే అంటే డిసెంబరు 5 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఒకవేళ గ్యాంబ్లింగ్ కాన్సెప్ట తరహా మూవీస్ చూద్దామనుకుంటే దీన్ని ట్రై చేయొచ్చు. అదే రోజున థియేటర్లలో 'పుష్ప 2' రిలీజ్ కానుంది.

(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 28 సినిమాలు)

Advertisement
 
Advertisement
Advertisement