ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు- రామ్ చరణ్ కాంబో.. గ్రాండ్‌గా పూజా కార్యక్రమం! | Ram Charan And Buchi Babu Sana Combo Movie Pooja Ceremony Stills | Sakshi
Sakshi News home page

Ram charan RC16: బుచ్చి బాబు- రామ్ చరణ్ కాంబో.. పూజలో సినీ ప్రముఖులు!

Published Wed, Mar 20 2024 2:18 PM | Last Updated on Wed, Mar 20 2024 2:51 PM

Ram charan and Buchi Babu Sana combo Movie Pooja Ceremony stills - Sakshi

గ్లోబల్‌ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమాతో బిజీగా ఉన్నారు. ఇటీవలే ఈ సినిమా వైజాగ్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్నారు. దీనికి సంబంధించిన రామ్ చరణ్ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరలయ్యాయి. అయితే ఈ సినిమా తర్వాత చెర్రీ ఉప్పెన ఫేమ్‌ బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్‌ ఓకే చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమం హైదరాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించారు. 

ఈవెంట్‌కు ప్రముఖ దర్శకుడు శంకర్‌, సుకుమార్‌, చిరంజీవి, అల్లు అరవింద్‌, బోనీకపూర్‌,సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్‌తో పాటు పలువురు ఇండస్ట్రీ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిత్రబృందానికి అభినందనలు తెలిపారు. పూజా కార్యక్రమం అనంతరం రామ్‌చరణ్‌ మాట్లాడారు. బుచ్చిబాబు రాసిన కథ తనకెంతో నచ్చిందన్నారు. ప్రేక్షకులు తప్పకుండా ఎంటర్‌టైన్‌ అవుతారని చెర్రీ అన్నారు.

కాగా.. ఉప్పెన తర్వాత బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తోన్న చిత్రమిదే. స్పోర్ట్స్‌ డ్రామాగా గ్రామీణ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో రామ్‌చరణ్‌ పాత్ర పవర్‌ఫుల్‌గా ఉండనుంది. ఈ మూవీలో రామ్ చరణ్ సరసన జాన్వీకపూర్‌ హీరోయిన్‌గా కనిపించనుంది. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతమందించనుండగా... మైత్రీ మూవీ మేకర్స్‌, వృద్ధి సినిమాస్‌, సుకుమార్‌ రైటింగ్స్‌ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం ఈ సినిమాను వర్కింగ్ టైటిల్ ఆర్సీ16తో రూపొందించనున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement