Mirzapur
-
లేడీ లవ్‌తో నిఖా : నటుడి పెళ్లి సందడి (ఫోటోలు)
-
అఫీషియల్: చరణ్ సినిమాలో 'మీర్జాపుర్' మున్నా భయ్యా
ఓటీటీలో 'మీర్జాపుర్' వెబ్ సిరీస్ ఎంత ఫేమస్సో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందులో ఉన్నవి బూతులే కానీ ఆడియెన్స్ వాటిని ఎంజాయ్ చేశారు. మరీ ముఖ్యంగా మున్నా భయ్యా అనే క్యారెక్టర్‌కి బోలెడంత మంది ఫ్యాన్స్ కూడా ఉన్నారు. ఇప్పుడు ఆ నటుడు తెలుగు సినిమాలో నటించేస్తున్నాడు.(ఇదీ చదవండి: 3 వారాల్లోనే ఓటీటీలోకి 'మట్కా'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?)'గేమ్ ఛేంజర్' మూవీని రెడీ చేసిన రామ్ చరణ్.. ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో నటిస్తున్నాడు. 'RC16' పేరుతో తీస్తున్న ఈ ప్రాజెక్ట్ షూటింగ్ కొన్నిరోజుల క్రితమే మైసూరులో మొదలైంది. ఇందులో కన్నడ స్టార్ హీరో శివన్న, జగపతిబాబు తదితరులు నటిస్తున్నారు. ఇప్పుడు తనకెంతో ఇష్టమైన పాత్ర అని చెప్పిన డైరెక్టర్ బుచ్చిబాబు.. మున్నా భయ్యా చరణ్ మూవీలో నటిస్తున్నట్లు ప్రకటించాడు.స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో చరణ్-బుచ్చిబాబు మూవీ ఉండబోతుందని తెలుస్తోంది. జాన్వీ కపూర్ హీరోయిన్. ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకుడు. బహుశా వచ్చే ఏడాది చివర్లో లేదంటే 2026 ప్రారంభంలో మూవీ థియేటర్లలోకి వచ్చే అవకాశముంది.(ఇదీ చదవండి: చైతూ-శోభిత పెళ్లి సందడి.. హల్దీ ఫొటోలు వైరల్)Our favourite 'Munna Bhayya' will light up the big screens in a spectacular role tailor made for him ❤️🔥Team #RC16 welcomes the incredibly talented and the compelling performer @divyenndu on board ✨#RamCharanRevoltsGlobal Star @AlwaysRamCharan @NimmaShivanna #JanhviKapoor… pic.twitter.com/Q4I8w9Vqhh— Vriddhi Cinemas (@vriddhicinemas) November 30, 2024 -
మున్నా భయ్య ఈజ్ బ్యాక్.. సినిమాగా 'మీర్జాపుర్' సిరీస్
మన దేశంలో ఓటీటీల్లోనే ద బెస్ట్ వెబ్ సిరీస్‌ల లిస్ట్ తీస్తే అందులో కచ్చితంగా ఉండే పేరు 'మీర్జాపుర్'. తొలుత హిందీలో మాత్రమే తీశారు. కానీ ఊహించని రెస్పాన్స్ వచ్చేసరికి తెలుగు లాంటి ప్రాంతీయ భాషల్లో డబ్ చేశారు. దీంతో మరింత మంది ప్రేక్షకులకు చేరువైంది. ఇప్పటికే మూడు సీజన్లు రాగా.. నాలుగో సీజన్ కూడా ఉంటుందని అన్నారు. ఇంతలోనే మూవీగా దీన్ని తీసుకొస్తున్నట్లు ప్రకటించారు.(ఇదీ చదవండి: Bigg Boss 8: అవినాష్ ఎలిమినేట్ కాలేదు.. భార్యపై ఒట్టేసి అబద్ధాలు)'మీర్జాపుర్' వెబ్ సిరీస్‌లో హీరో కంటే మున్నాభయ్య అనే విలన్ పాత్రకే బీభత్సమైన క్రేజ్ వచ్చింది. తొలి రెండు సీజన్లలో ఈ పాత్ర ఉండటంతో ఎంటర్టైనింగ్గా అనిపించింది. మూడో సీజన్లో మున్నాభయ్యా లేకపోయేసరికి చాలామందికి సిరీస్ నచ్చలేదు. ఇక నాలుగో సీజన్ అంటే సాహసమనే చెప్పాలి.సరే ఇదంతా పక్కనబెడితే 'మీర్జాపుర్' సిరీస్‌లో మితిమీరిన హింసాత్మక సన్నివేశాలు, బూతులపై విమర్శలు వచ్చినప్పటికీ.. జనాలు వాటినే తెగ చూశారు. ఇప్పుడు 2026లో 'మీర్జాపుర్'ని సినిమాగా తీసుకొస్తామని ప్రకటించారు. ఇక్కడివరకు బాగానే ఉంది. కానీ కొత్త కథ ఏం చూపిస్తారు? బూతులు, వయలెంట్ సీన్స్ లాంటివి లేకుండా ఇంటెన్సెటినీ ఎలా చూపిస్తారనేది పెద్ద క్వశ్చన్. అయితే ఇదంతా సిరీస్‌కి ఉన్న క్రేజ్‌ని క్యాష్ చేసుకోవాలనే ఆలోచనలానే అనిపిస్తుంది!(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 15 సినిమాలు రిలీజ్.. అవి ఏంటంటే?) -
ఓటీటీలోకి మీర్జాపూర్ 3... సీజన్ 1, 2లో ఏం జరిగింది?
‘మీర్జాపూర్’.. ఓటీటీలో సంచలనం సృష్టించిన వెబ్ సిరిస్ ఇది. భాషతో సంబంధం లేకుండా ఓటీటీ ప్రేక్షకుల అంతా ఈ క్రైమ్ యాక్షన్ వెబ్ సిరీస్‌ని ఆదరించారు. ముఖ్యంగా యూత్‌కి ఈ సిరీస్ బాగా నచ్చింది. ఇప్పటి వరకు రెండు సీజన్లు రాగా.. రెండూ సూపర్ హిట్ అయ్యాయి. ఇక ఇప్పుడు మూడో సీజన్ రాబోతుంది. అలీ ఫజల్, విజయ్ వర్మ, శ్వేతా త్రిపాఠి, పంకజ్ త్రిపాఠి తదితరులు కీలక పాత్రల్లో నటించిన మీర్జాపూర్ సీజన్ 3 జులై 5 నుంచి ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో అసలు సీజన్ 1, 2లలో చెప్పారు? సీజన్ 3లో ఏం చూపించబోతున్నారు? తెలుసుకుందాం.గన్స్, డ్రగ్స్ మాఫియా చుట్టూ ఈ వెబ్ సిరీస్ కథ తిరుగుతుంది. మీర్జాపూర్ మొత్తం కాలీన్ భాయ్(పంకజ్ త్రిపాఠి) చేతిలో ఉంటుంది. అక్కడి మాఫియా సామ్రాజ్యానికి అతనే మహా రాజు. కాలీన్ భాయ్ కొడుకు మున్నా భాయ్(దివ్యేంద్) ఓ పెళ్లి కొడుకును గన్‌తో కాల్చి చంపేస్తాడు. ఈ కేసును లాయర్ రమాకాంత్ పండిత్(రాజేశ్ తైలాంగ్) వాధిస్తాడు. అతనికి ముగ్గురు పిల్లలు. పెద్ద కొడుకు పేరు గుడ్డు పండిత్(అలీ ఫజల్), చిన్న కొడుకు బబ్లూ పండిత్(విక్రాంత్ మస్సే), కూతురు డింపీ(హర్షిత). కొడుకును కాపాడుకునేందుకు కాలీన్ భాయ్ భారీ ప్లాన్ వేస్తాడు. ఈ క్రమంలో తన వ్యాపార పనులను గుడ్డు, బబ్లులకు అప్పగిస్తాడు. దీంతో మున్నా..తీవ్ర కోపంతో రగిపోతుంటాడు. గుడ్డు ప్రేయసి స్వీటీపై కన్నేస్తాడు. ఆమె దక్కించుకునేందుకు ప్రయత్నిస్తుంటాడు. ఓ పెళ్లి వేడుకకు హాజరైన గుడ్డు, స్వీటీ, బబ్లూ, డింపీలపై మున్నా తన గ్యాంగ్‌తో దాడి చేస్తాడు. ఈ దాడిలో గర్భిణి అయిన స్వీటీతో పాటు బబ్లు కూడా చనిపోతాడు. గోలు సహాయంతో గుడ్డు తప్పించుకుంటాడు. ఇంతటితో సీజన్ 1 ముగుస్తుంది.మున్నా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆరంభమయ్యే సన్నివేశాలతో సీజన్-2 మొదలవుతుంది. మరోవైపు డింపీ, గోలు కలిసి ఓ డాక్టర్ని కిడ్నాప్ చేసి గుడ్డుకు చికిత్స చేయిస్తారు. మున్నాను ఎలాగైన చంపేయాలనే పగతో రగిలిపోతుంటారు. మీర్జాపూర్లో కాలీన్ భాయ్‌కు అత్యంత నమ్మకస్తుడైన మక్బూల్.. ఒకప్పుడు తన కుటుంబ సభ్యుడి చావుకు కారణం అయ్యాడనే కోపంతో కాలీన్ తండ్రిని చంపేందుకు ప్లాన్ వేస్తాడు. కాలీన్ భార్య బీనా కూడా అతనితో చేతులు కలిపి మామను చంపేందుకు ప్రయత్నిస్తుంటుంది. మరోవైపు మీర్జాపూర్ డాన్ సింహాసనంపై ఆశపడి తండ్రినే చంపేందుకు ప్లాన్ వేస్తాడు మున్నా. అందుకోసం శరత్ శుక్లాతో చేతులు కలుపుతాడు. అయితే గుడ్డు, గోలులు మాత్రం పక్కా ప్లాన్‌తో మున్నాపై దాడికి దిగుతారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన కాలీన్ భాయ్‌ని శరత్ కాపాడగా.. మున్నాను మాత్రం ప్రాణాలు కోల్పోతాడు. అనంతరం గుడ్డు మీర్జాపూర్ సింహాసనాన్ని అధిరోహిస్తాడు. ఇంతటితో సీజన్ 2కి ఎండ్ కార్డు పడుతుంది.మీర్జాపూర్ 3లో ఏం చూపించబోతున్నారు?మీర్జాఫూర్ ప్రాంతాన్ని తన గుప్పిట్లోకి తెచ్చుకున్న గుడ్డు.. పూర్వాంచల్‌లో తన ఆదిపత్యాన్ని కొనసాగించాలనుకుంటాడు. మీర్జాపూర్లో కాలీన్ భాయ్ గుర్తులేవి లేకుండా చేస్తాడు. మరోవైపు భర్త మున్నాభాయ్ మరణంతో అతని భార్య, యూపీ సీఎం కూతురు మాధురి రాజకీయాల్లోకి అడుగుపెడుతుంది. కాలీన్ భాయ్‌పై సింపథీ క్రియేట్ చేసి ప్రజలకు చేరువయ్యేందుకు ప్రయత్నిస్తుంటుంది. అదే సమయంలో కాలీన్ భాయ్ తిరిగి వచ్చినట్లు ట్రైలర్లో చూపించారు. మీర్జాఫూర్ మాఫీయా సామ్రాజ్యాన్ని కాలీన్ భాయ్ తిరిగి పొందడా? డాన్‌గా ఎదిగిన తర్వాత గుడ్డు జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? మాధురి రాజకీయాల్లోకి ఎందుకు వచ్చింది? తదితర విషయాలన్నీ తెలియాలంటే సీజన్ 3 చూడాల్సిందే. -
'మీర్జాపుర్' బ్యూటీ.. ధగధగా మెరిసిపోతూ మరింత అందంగా (ఫొటోలు)
-
ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 24 మూవీస్.. ఆ నాలుగు స్పెషల్
గత శుక్రవారం థియేటర్లలో రిలీజైన 'కల్కి 2898 ఏడీ' రచ్చ లేపుతోంది. వీకెండ్ అయ్యేసరికి రూ.500 కోట్ల వసూళ్లు దాటేసింది. ఈ వారం పూర్తయ్యేసరికి రూ.1000 కోట్లు సాధించినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఈ మూవీ ఆడుతోంది కాబట్టి ఈ వారం వేరే మూవీస్ ఏం రిలీజ్ కావట్లేదు. దీంతో ఆటోమేటిక్‌గా అందరి దృష్టి ఓటీటీల్లో వచ్చే మూవీస్‌పై పడుతుంది. ఈ వారం ఏకంగా 24 సినిమాలు స్ట్రీమింగ్ కాబోతున్నాయి.(ఇదీ చదవండి: రామ్ చరణ్ ఇంట్లో సీక్రెట్‌గా ఉండేదాన్ని: మంచు లక్ష్మీ)ఈ వారం పలు ఓటీటీల్లో ఏకంగా 24 సినిమాలు-వెబ్ సిరీసులు రిలీజ్ కాబోతున్నాయి. వీటిలో ఓ నాలుగు మాత్రం ఆసక్తి రేపుతున్నాయి. 'మీర్జాపుర్' సిరీస్ మూడో సీజన్‌తోపాటు గరుడన్, మలయాళీ ఫ్రమ్ ఇండియా, ఫ్యూరిసోయా మ్యాడ్ మ్యాక్స్ చిత్రాలు ఉన్నంతలో చూడాలనే ఇంట్రెస్ట్ కలిగిస్తున్నాయి. ఇవి కాకుండా వీకెండ్లో ఏమైనా సడన్ ఎంట్రీస్ వచ్చినా రావొచ్చు. ఇంతకీ ఏ ఓటీటీలో ఏ మూవీ వస్తుందంటే?ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ జాబితా (జూలై 01 నుంచి 07 వరకు)నెట్ఫ్లిక్స్అల్విన్ సీజన్ 5 (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 01స్టార్ ట్రెక్ ప్రొడిగీ: సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 01స్ప్రింట్ (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 02బేవర్లీ హిల్స్ కాప్: అలెక్సా ఎఫ్ (ఇంగ్లీష్ సినిమా) - జూలై 02ద మ్యాన్ విత్ 1000 కిడ్స్ (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 03బార్బెక్యూ షో డౌన్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 04రైమ్ ప్లస్ ఫ్లో ఫ్రాన్స్ సీజన్ 3 (ఫ్రెంచ్ సిరీస్) - జూలై 04డెస్పరేట్ లైస్ (పోర్చుగీస్ సిరీస్) - జూలై 05గోయో (స్పానిష్ మూవీ) - జూలై 05హాట్స్టార్రెడ్ స్వాన్ (కొరియన్ సిరీస్) - జూలై 03ల్యాండ్ ఆఫ్ తనబతా (జపనీస్ సిరీస్) - జూలై 04అమెజాన్ ప్రైమ్బాబ్ మార్లీ: వన్ లవ్ (ఇంగ్లీష్ మూవీ) - జూలై 03గరుడన్ (తమిళ సినిమా) - జూలై 03స్పేస్ క్యాడెట్ (ఇంగ్లీష్ చిత్రం) - జూలై 04మీర్జాపుర్ సీజన్ 3 (తెలుగు డబ్బింగ్ సిరీస్) - జూలై 05 జియో సినిమాప్రైమ్ టైమ్ విత్ మూర్తీస్ (హిందీ సిరీస్) - జూలై 03హీ వెంట్ దట్ వే (ఇంగ్లీష్ మూవీ) - జూలై 05ఆహాహరా (తమిళ సినిమా) - జూలై 05బుక్ మై షోఇఫ్ (ఇంగ్లీష్ సినిమా) - జూలై 03ఫ్యూరోసియా: ఏ మ్యాడ్ మ్యాక్స్ సాగా (ఇంగ్లీష్ మూవీ) - జూలై 04ద సీడింగ్ (ఇంగ్లీష్ ఫిల్మ్) - జూలై 05విజన్స్ (ఫ్రెంచ్ సినిమా) - జూలై 05సోనీ లివ్మలయాళీ ఫ్రమ్ ఇండియా (మలయాళ మూవీ) - జూలై 05మనోరమ మ్యాక్స్మందాకిని (మలయాళ సినిమా) - జూలై 05(ఇదీ చదవండి: 'కల్కి' ఓటీటీ డీటైల్స్.. అప్పటివరకు వెయిటింగ్ తప్పదా?) -
విడుదలకు సిద్ధంమైన మిర్జాపూర్ సీజన్ 3
-
స్ట్రీమింగ్కు వచ్చేస్తోన్న ఆసక్తికర వెబ్ సిరీస్.. ట్రైలర్ వచ్చేసింది!
ఓటీటీ ప్రేక్షకుల్లో అద్భుతమైన క్రేజ్ దక్కించుకున్న వెబ్‌సిరీస్ మీర్జాపూర్. ఇప్పటికే రెండు సీజన్స్ సినీ ప్రియులను అలరించాయి. తాజాగా మూడో సీజన్‌ను ఆడియన్స్ ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సిరీస్ వచ్చే నెల 5 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ ఇప్పటికే వెల్లడించారు. తాజాగా మూడో సీజన్ సిరీస్ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ వెబ్ సిరీస్‌లో పంకజ్ త్రిపాఠి, అలీ ఫజల్ , శ్వేతా త్రిపాఠి శర్మ, విజయ్ వర్మ, ఇషా తల్వార్ కీలక పాత్రలు పోషించారు. ట్రైలర్ చూస్తే గత సీజన్లను మించి ఉంటుందని అర్థమవుతోంది. కొత్త సీజన్లో మరికొన్ని పాత్రలు పరిచయం చేయనున్నారు. -
మీర్జాపూర్-3 విడుదలపై అధికారిక ప్రకటన
ఓటీటీలో మోస్ట్ పాపులర్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్‌సిరీస్‌ల్లో 'మీర్జాపూర్' మొదటి లిస్ట్‌లో ఉంటుంది. ఈ వెబ్ సిరీస్ నుంచి ఇప్పటికే విడుదలైన దీని రెండు భాగాలు భారీ విజయాన్ని అందుకున్నాయి. దీంతో మూడో సీజన్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు మేకర్స్ శుభవార్త చెప్పారు. మీర్జాపూర్ విడదల తేదీని చెబుతూ ఒక పోస్టర్‌ను అమెజాన్ విడుదల చేసింది. జులై 5 నుంచి ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతున్నట్లు వారు ప్రకటించారు.గుర్మీత్‌సింగ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సిరీస్ ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్ నేపథ్యంలో కొనసాగుతుంది. పంకజ్ త్రిపాఠి, శ్రియ పిల్గోంగర్, శ్వేతా త్రిపాఠి,అలీ ఫజల్, దివ్యేందు శర్మ,హర్షిత గౌర్ తదితరులు మొదటి భాగంలో నటించారు. రెండో సీజన్లో విజయవర్మ కీలకపాత్రలో కనిపించారు. 2018 నవంబరు 16న ఈ సీరిస్ విడుదలైంది. దానికి సీక్వెల్‌గా 2020 అక్టోబరు 23న రెండో సీజన్ విడుదలైంది. ఇప్పుడు సుమారు నాలుగేళ్ల తర్వాత జులై 5న మీర్జాపూర్-3 ప్రేక్షకుల ముందుకు రానుంది. View this post on Instagram A post shared by prime video IN (@primevideoin) -
ఓటింగ్ పెంచేందుకు ఈసీ మీమ్స్
సార్వత్రిక ఎన్నికల సమరం చివరాఖరి దశకు చేరుకుంది. ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ఎన్నికల సంఘం ఎంత ప్రయత్నిస్తున్నా ఇప్పటిదాకా జరిగిన ఆరు విడతల్లో పెద్ద మార్పేమీ కనిపించలేదు. దాంతో చివరిదైన ఏడో విడతలోనైనా ఓటింగ్ శాతాన్ని వీలైనంత పెంచేందుకు ఈసీ పలు ప్రయత్నాలు చేస్తోంది. యువ ఓటర్లను పోలింగ్ బూత్‌లకు రప్పించేందుకు వారికి బాగా కనెక్టయ్యే మీమ్స్‌ను ఎంచుకుంది. మీర్జాపూర్ వెబ్ సిరీస్ ఎంత హిట్టయిందో, అందులోని మున్నా భయ్యా పాత్ర కూడా అంతే ఫేమస్ అయింది! ఈసీ రిలీజ్ చేసిన కొత్త మీమ్‌లో మున్నా భయ్యా డైలాగ్‌ను ఓటింగ్‌కు అన్వయించింది. మీర్జాపూర్ వెబ్ సిరీస్‌లో మున్నా భయ్యా క్లాస్ రూమ్‌లో చెప్పే ‘పడాయీ లిఖాయీ కరో, ఐఏఎస్ వయ్యేఎస్ బనో’ (చదువుసంధ్యలపై దృష్టి పెట్టు, కలెక్టరో మరోటో అవ్వు) అనే ఒరిజినల్ డైలాగ్ ఇప్పటికీ రీల్స్, షార్ట్ వీడియోల్లో చక్కర్లు కొడుతూనే ఉంటుంది. ఈసీ ఇప్పుడు దీనికి ఓటింగ్ ట్విస్ట్ ఇచి్చంది. ‘యే క్యా రీల్స్ మే టైమ్ బర్బాద్ కర్ రహే? జావో వోట్ దో, లోక్తంత్ర్ కో మజ్బూత్ కరో (రీల్స్ వెంటపడి ఎందుకు టైమ్ వేస్ట్ చేసుకుంటారు? వెళ్లి ఓటేయండి... ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయండి) అని ఓటర్లకు మున్నా భయ్యా చెబుతున్నట్లుగా మీమ్ రూపొందించింది. ‘యువతను మున్నా భయ్యా ఓటేయాలని కోరుతున్నాడు’ అంటూ క్యాప్షన్‌ను కూడా జోడించింది! ఏడు విడతల సుదీర్ఘ షెడ్యూల్లో ఇప్పటికి ఆరు విడతలు పూర్తయ్యాయి. 57 లోక్‌సభ స్థానాలకు జూన్ 1న చివరి విడతలో పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఫలితాలు వెల్లడవుతాయి. ఆఖరి దశలో చండీగఢ్ కేంద్రపాలిత ప్రాంతంతో సహా బిహార్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, పశి్చమబెంగాల్లో పోలింగ్ జరగనుంది. దాంతో అక్కడ ప్రచారం దుమ్మురేగిపోతోంది. చివరి దశలో ప్రధాని మోదీ సహా మొత్తం 904 మంది అభ్యర్థులు తలపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈసీ మున్నా భాయ్ మీమ్ ప్రయోగం యూత్‌ను ఏ మేరకు పోలింగ్ బూత్‌లకు రప్పిస్తుందో చూడాలి! – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఆ గట్టున తల్లి.. ఈ గట్టున కూతురు!
‘ఇండియా’ కూటమికి మిత్రపక్షమైన అప్నా దళ్ (కామెరవాడి) ఉత్తరప్రదేశ్‌లో రాబోయే లోక్‌సభ ఎన్నికలకు మూడు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఫుల్పూర్, మీర్జాపూర్, కౌశాంబి మూడు స్థానాల్లో పోటీ చేయాలని పార్టీ నిర్ణయించింది. “అప్నా దళ్ (కె) కేంద్ర కార్యవర్గ సమావేశం జాతీయ అధ్యక్షురాలు కృష్ణ పటేల్ ఆధ్వర్యంలో జరిగింది. ఇండియా కూటమిలో భాగంగా మూడు స్థానాల్లో పోటీ చేయాలని సమావేశంలో నిర్ణయించారు' అని కేంద్ర కార్యాలయ కార్యదర్శి రామ్ సనేహి పటేల్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్‌లు సీట్ల పంపకాన్ని నిర్ణయించుకున్నాయి, దాని ప్రకారం కాంగ్రెస్ 17 స్థానాల్లో పోటీ చేయగా, సమాజ్‌వాదీ పార్టీ 63 స్థానాల్లో తమ అభ్యర్థులను నిలబెట్టనుంది. సమాజ్‌వాదీ పార్టీ తృణమూల్ కాంగ్రెస్‌కి భదోహి సీటును ఇచ్చింది. అక్కడ లలితేష్ త్రిపాఠిని అభ్యర్థిగా నిలిపింది. అప్నాదళ్ (కె) సీట్లను ప్రకటించడంపై సమాజ్‌వాదీ పార్టీ నేతలను ప్రశ్నించగా.. దాని గురించి తమకు తెలియదన్నారు. 2019 లోక్‌సభ ఎన్నికలలో అప్నా దళ్ (సోనీలాల్) నాయకురాలు అనుప్రియ పటేల్ (Anupriya Patel) సమాజ్‌వాదీ పార్టీకి చెందిన రామ్ చరిత్ర నిషాద్పై పోటీ చేసి 2,32,008 ఓట్ల తేడాతో గెలిచారు. అప్నా దళ్ (సోనీలాల్) ఎన్డీఏ మిత్రపక్షంగా ఉంది. అనుప్రియా పటేల్ మోదీ ప్రభుత్వంలో వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అనుప్రియ అప్నా దళ్ (సోనేలాల్) పార్టీని స్థాపించిన సోనే లాల్ పటేల్ కుమార్తె. రాబోయే ఎన్నికల్లో మీర్జాపూర్లో అప్నా దళ్ (సోనేలాల్) వర్సెస్ అప్నా దళ్ (కామెరావాడి) మధ్య పోటీ జరుగుతుందని భావిస్తున్నారు. -
ఓటీటీలో టాప్ లేపిన వెబ్ సిరీస్.. మూడో సీజన్ రిలీజ్ డేట్ ఫిక్స్?
క్రేజీ వెబ్ సిరీస్ నుంచి కేక పుట్టించే అప్డేట్ వినిపిస్తుంది. ఓటీటీ ట్రెండ్ మొదలైన తర్వాత కొన్ని వెబ్ సిరీసులు.. జనాల్ని ఓ రేంజులో ఊపేశాయి. అలాంటి వాటిలో ఒకటి 'మీర్జాపూర్'. క్రైమ్ థ్రిల్లర్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీసిన ఈ నాటు సిరీస్.. మిగతా వాళ్లకేమో గానీ తెలుగు ప్రేక్షకులకు బాగా ఎక్కేసింది. ఇప్పుడు దీని మూడో సీజన్ నుంచి క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో గట్టిగా వినిపిస్తోంది. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 45 సినిమాలు) ఓటీటీలో రికార్డులు సృష్టించిన వెబ్ సిరీసుల లిస్టు తీస్తే అందులో కచ్చితంగా 'మీర్జాపూర్' ఉంటుంది. ఉత్తరప్రదేశ్‌లోని ఓ ప్రాంతమైన మీర్జాపూర్ నేపథ్యంగా కల్పిత పాత్రలతో ఈ సిరీస్ తీశారు. ఊరమాస్ క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో ఈ సిరీస్‌లో అద్భుతమైన డ్రామాతో పాటు బూతులు కూడా గట్టిగానే ఉంటాయి. అలా 2018 నవంబరు 16న రిలీజైన తొలి సీజన్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. 2020 అక్టోబరు 23న వచ్చిన రెండో సీజన్ అంతకు మించి హిట్‌గా నిలిచింది. ఇక మూడో సీజన్‌కి సంబంధించిన షూటింగ్ దాదాపు ఏడాది క్రితమే పూర్తయిపోయినప్పటికీ.. ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్, డబ్బింగ్ పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే మూడో సీజన్.. ఈ మార్చి చివరి వారంలో రిలీజ్ కానుందని టాక్ వినిపిస్తుంది. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం మున్నాభయ్యా ఫ్యాన్స్‌కి పండగే. ఇకపోతే తొలి సీజన్లో గుడ్డూ భయ్యా, అతడి కుటుంబాన్ని మున్నా ఇబ్బంది పెట్టడం చూపించారు. రెండో సీజన్లో గుడ్డు భయ్యా.. మున్నా భయ్యాపై ప్రతీకారం తీర్చుకోవడం చూపించారు. మూడో సీజన్లో ఏం చూపించబోతున్నారో? (ఇదీ చదవండి: 'సలార్' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యిందా? స్ట్రీమింగ్ అప్పుడేనా?) -
'మీర్జాపుర్ 3' అప్డేట్ ఇచ్చిన బీనా ఆంటీ!
Mirzapur Season 3: ఓటీటీల్లోని వెబ్ సిరీసులు అనగానే చాలామందికి ముందు గుర్తొచ్చేది 'మీర్జాపుర్'. బూతులు ఎక్కువని అంటారు గానీ తెలుగు రాష్ట్రాల్లోని చాలామంది ఈ సిరీస్‌కు ఫ్యాన్స్. మున్నా భయ్యా, గుడ్డూ భయ్యా పాత్రలు వాళ్లు చెప్పిన డైలాగ్స్ మీలో చాలామందికి బాగా తెలుసు. వాళ్లందరూ కూడా మూడో సీజన్ కోసం తెగ వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ల కోసమా అన్నట్లు బీనా అంటీ అప్డేట్ తో వచ్చేసింది. (ఇదీ చదవండి: ఆమెని మర్చిపోలేకపోతున్న చిన్నల్లుడు కల్యాణ్ దేవ్!) మూడేళ్లుగా వెయిటింగ్ 2018లో 'మీర్జాపుర్' తొలి సీజన్.. అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైంది. తొమ్మిది ఎపిసోడ్లలో ప్రతి ఒక్కటి ప్రేక్షకుల్ని విపరీతంగా అలరించాయి. 2020లో 10 ఎపిసోడ్లతో రెండో సీజన్ వచ్చింది. దీనికి కూడా మొదటి దానికి మించిన రెస్పాన్స్ వచ్చింది. దీంతో మూడో సీజన్ ఎప్పుడొస్తుందా అని అందరూ ఎదురుచూస్తున్నారు. చాలారోజుల క్రితమే షూటింగ్ పూర్తయినప్పటికీ రిలీజ్ ఇంకా ఫిక్స్ చేయలేదు. బీనా ఆంటీ డబ్బింగ్ ఈ సిరీస్ లో మున్నా భయ్యా, గుడ్డు భయ్యా, ఖాలీన్ భయ్యా పాత్రల తర్వాత ఆ స్థాయి క్రేజ్ తెచ్చుకున్న రోల్ అంటే బీనా అంటీదే. ఈమెది ఖాలీన్ భయ్యాకు రెండో భార్య పాత్ర. ఒకటి, రెండు సీజన్లలో ఈమె పాత్రకు స్కోప్ తక్కువే. కానీ మూడో సీజన్ లో మాత్రం ఎక్కువే ఉండబోతుందని హింట్ ఇచ్చారు. ఇప్పుడు డబ్బింగ్ చెబుతున్న ఫొటోని పోస్ట్ చేసి.. త్వరలోనే సీజన్ 3 రిలీజ్ అవుతుందనే హింట్ ఇచ్చేసింది. దీంతో 'మీర్జాపుర్' ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు. View this post on Instagram A post shared by Rasika (@rasikadugal) (ఇదీ చదవండి: 'బలగం' హీరోయిన్‌కి అవమానం!) -
పోస్టుమార్టం కోసం సిద్ధం చేసిన శరీరం నుంచి గుండెచప్పుడు.. యూపీలో సంచలనం!
ఉత్తరప్రదేశ్‌లోని మిర్జాపూర్‌లో సంచలన ఉదంతం చోటుచేసుకుంది. ఈ ప్రాంతంలో ఒక యువతి చెరువులో తేలుతూ పోలీసులకు కనిపించింది. దీంతో పోలీసులు ఆ యవతి దేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే ఇంతలో ఆ యువతి కుటుంబ సభ్యులు తమ కుమార్తెను ఒకసారి వైద్యులకు చూపించాలని కోరారు. వెంటనే పోలీసులు వారి కోరిక మేరకు ఆ యువతిని వైద్యుల దగ్గరకు తీసుకువెళ్లారు. పోలీసుల వైద్య పరీక్షల్లో ఆ యువతి గుండె కొట్టుకుంటున్నట్లు గమనించారు. ఈ ఘటన మిర్జాపూర్ పరిధిలోని సంత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని రాహ్ కలాం హవూదవా గ్రామంలో చోటుచేసుకుంది. ఆదివారం సాయంత్రం సిర్సీకి చెందిన ఒక యువతి చెరువులో తేలుతూ కనిపించింది.స్థానికులు ఈ విషయాన్ని పంచాయతీ సభ్యులకు తెలియజేశారు. వారు ఈ సమాచారాన్ని పోలీసులకు అందించారు. పోస్టుమార్టం కోసం సిద్ధమైన పోలీసులు.. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ యువతి దేహాన్ని బయటకు తీశారు. ఆమె ఎవరనేది గుర్తించి, కుటుంబ సభ్యులకు తెలియజేశారు. ఆ యువతి మృతిచెందిందని భావించిన పోలీసులు పోస్టుమార్టంనకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. యువతి ఇంటిలో ఆనందోత్సాహాలు అయితే ఆ యువతి కుటుంబ సభ్యులు తమ కుమార్తెను ఒకసారి వైద్యుల దగ్గరకు తీసుకువెళ్లాలని కోరారు. దీంతో పోలీసులు ఆ యువతిని పటెహరా ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు ఆమెను పరిశీలించి, గుండె కొట్టుకుంటున్న విషయాన్ని గమనించారు. వెంటనే వైద్యులు ఆమెకు చికిత్స ప్రారంభించారు. తమ కుమార్తె బతికేవుందని తెలియడంతో ఆమె కుటుంబ సభ్యుల ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. యువతి తల్లి ఏమన్నదంటే.. ఆ యువతి తల్లి రత్నాదేవి మీడియాతో మాట్లాడుతూ తమ కుమార్తె మానసిక పరిస్థితి సవ్యంగా లేదన్నారు.అప్పుడప్పుడు ఇంటి నుంచి బయటకు ఎక్కడికో వెళ్లిపోతుందని తెలిపారు. ఈ సందర్భంగా ఆ యువతికి చికిత్సనందించిన వైద్యులు డాక్టర్ గణేశ్ శంకర్ త్రిపాఠి మాట్లాడుతూ పోలీసులు ఆ యువతిని చెకప్ కోసం తీసుకువచ్చారని, వైద్య పరీక్షలు చేసి, చికిత్సనందించామని, ప్రస్తుతం ఆ యువతి పూర్తి ఆరోగ్యంగానే ఉన్నదని తెలిపారు. ఇది కూడా చదవండి: రైలు రిజర్వేషన్లో సరిదిద్దలేని పొరపాట్లివే.. -
భారత తొలి ముస్లిం ఫైటర్ పైలట్‌గా సానియా మీర్జా
ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్ చెందిన ఓ టీవీ మెకానిక్ కుమార్తె సానియా మీర్జా నేషనల్ ఢిఫెన్స్ అకాడమీ(ఎన్డీఏ) పరీక్షలో ఉత్తీర్ణత సాధించి వార్తల్లో నిలిచింది. దీంతో ఆమె భారత్‌లోనే తొలి ముస్లిం మహిళా ఫైటర్ పైలట్‌గా కానున్నట్లు భారత వైమానిక దళం(ఐఏఎఫ్) పేర్కొంది. ఆమె ఫైటర్ పైలట్‌గా ఎంపికవ్వడానికి ముందుగా నాలుగేళ్ల శిక్షణను విజయవంతంగా పూర్తి చేయాల్సి ఉందని ఐఏఎఫ్ తెలిపింది. ఈ మేరకు ఆమె ఎన్డీఏలో చేరి అకాడమీ కోర్సుగా ఫైటర్ పైలట్ స్ట్రీమ్‌ను ఎంచుకున్నట్లు తెలుస్తుంది. ఈక్రమంలో వైమానిక దళం ఆమె కల నిజమవ్వాలంటూ.. సానియాకు శుభాకాంక్షలు తెలిపింది. ఆమె ఎన్డీఏ ఎగ్జామ్‌లో 149వ ర్యాంకును సాధించింది. హిందీ మీడియంలో చదివినా విజయం సాధించవచ్చని నిరూపించింది సానియా. తాను తొలి మహిళా పైలట్ అవనీ చతుర్వేదిని చూసి ప్రేరణ పొంది రెండో ప్రయత్నంలో ఎన్డీఏలో విజయం సాధించినట్లు సానియా పేర్కొంది. (చదవండి: సోనియా వ్యాఖ్యలకు స్పందించకపోతే.. బాధ్యత పరంగా విఫలమైనట్లే: ధన్ఖర్) -
తీవ్ర విషాదం.. మీర్జాపూర్ నటుడు మృతి
సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ బాలీవుడ్ నటుడు జితేంద్ర శాస్త్రి మృతి చెందారు. ఆయన మరణించినట్లు ప్రముఖ నటుడు సంజయ్ మిశ్రా సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ సందర్భంగా జితేంద్ర శాస్త్రితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని ఆయన భావోద్వేగానికి గురయ్యారు. అయితే ఆయన మృతికి గల కారణాలను ఆయన వెల్లడించలేదు. వృద్ధాప్య సమస్యలతో ఆయన మరణించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు సంజయ్ మిశ్రా ట్వీట్ చేస్తూ.. ‘‘జీతూ భాయ్ మీరు నాతో ఓ మాట చెప్పారు. ‘సంజయ్ ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఫోన్ వ్యక్తి పేరు ఉంటుంది. చదవండి: సొంతవాళ్లే మోసం చేశారు, నటి వల్ల రూ. 6 కోట్లు నష్టపోయా: గీతా సింగ్ కానీ, ఆ మనిషి నెట్వర్క్ పరిధిలో ఉండడు’ అన్నారు. చెప్పినట్టుగానే మీరు ఈ ప్రపంచాన్ని(నెట్వర్క్) వీడారు. కానీ మా మనసుల్లో, ఆలోచనలో ఎప్పుడు ఉంటారు. ఓం శాంతి’’ అంటూ ఆయనతో ఉన్న ఫొటోను షేర్ చేశారు. ఇక ఆయన మరణావార్తమ తెలిసి బాలీవుడ్ సినీ, టీవీ నటులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలంటూ సంతాపం ప్రకటిస్తున్నారు. కాగా జితేంద్ర శాస్త్రి బ్లాక్ ఫ్రైడే, ఇండియాస్ మోస్ట్ వాంటెడ్, రాజ్మా చావ్లా వంటి చిత్రాల్లో నటించి గుర్తింపు పొందారు. అలాగే ఓటీటీలో అంత్యంత ఆదరణ పొందిన మీర్జాపూర్ వెబ్ సిరీస్‌లో కూడా ఆయన నటించారు. ఇందులో ఆయన ఉస్మాన్ అనే ప్రధాన పాత్ర పోషించారు. View this post on Instagram A post shared by Sanjay Mishra (@imsanjaimishra) -
ఆర్తిసింగ్ ఐపీఎస్..ఎంటరైతే చాలు..కాకలు తీరిన క్రిమినల్స్ గజగజ వణకాల్సిందే
దేశంలో దాదాపు అన్ని పోలీస్ కమిషనరేట్లలో దాదాపు అందరూ మగ అధికారులే కమిషనర్లు. సినిమాల్లో కూడా హీరోయే పోలీస్ కమిషనర్. కాని ఆర్తి సింగ్ ఈ సన్నివేశాన్ని మార్చింది. మహారాష్ట్రలోని అమరావతికి కమిషనర్‌గా చార్జ్ తీసుకుంది. ప్రస్తుతం దేశంలో ఈమె ఒక్కతే మహిళా పోలీస్ కమిషనర్. రావడంతోటే స్ట్రీట్ క్రైమ్‌ను రూపుమాపాలనుకుంది. ఎస్.. నేను చేయగలను అంటున్న ఆర్తి సింగ్ పరిచయం. 2009. దేశానికి ఎలక్షన్లు. కీలకమైన సమయం. మరోవైపు మావోయిస్టులు తమ కదలికలను పెంచారు. మహారాష్ట్రలోని ‘రెడ్ కారిడార్’ అయిన గడ్చిరోలి ప్రాంతంలో జరిగిన దాడిలో 17 మంది పోలీసులు చనిపోయారు. ఆ సమయంలో అక్కడ గట్టి పోలీస్ ఆఫీసర్ అవసరం. మావోయిస్టుల దాడులను నిరోధించేందుకే కాదు ఎలక్షన్లు సజావుగా జరిగేందుకు కూడా చర్యలు తీసుకోవాలి. కాని చార్జ్ తీసుకోవడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఆ సమయంలో పై అధికారులకు తట్టిన ఒకే ఒక్క పేరు ఆర్తి సింగ్. ఆమె 2006 బ్యాచ్ ఐపిఎస్ ఆఫీసర్. పెద్దగా అనుభవం లేదు. పైగా మహిళా ఆఫీసర్. ‘ఆమె ఏమి చేయగలదు’ అని గడ్చిరోలి ప్రాంతంలోని సబార్డినేట్ పోలీస్ ఆఫీసర్లు అనుకున్నారు. కాని ఆమె చార్జ్ తీసుకున్నాక వారంతా అవాక్కయ్యారు. ఎందుకంటే ఆ సమయంలో ఆమె మావోయిస్టుల కదలికలను నివారించడమే కాదు... ఎలక్షన్లను బహిష్కరించండి అన్న వారి పిలుపును గెలవనీకుండా గ్రామీణ ప్రాంతాలలో ఓటింగ్ జరిగేలా చూసింది. అందుకే ఆమె పోలీసుల్లో ఫైర్ బ్రాండ్‌గా పేరు పొందింది. అందరూ మూడు నుంచి ఆరు నెలల కాలం చేసి ట్రాన్స్ఫర్ పెట్టుకుని వెళ్లిపోయే చోట ఆమె మూడు సంవత్సరాలు పని చేసింది. ‘నేను చేయగలను అనుకున్నాను. చేశాను’ అంటుంది ఆర్తి సింగ్. ఆమె ఆ కాలంలో చాలా ఆయుధాల డంప్‌ను స్వాధీనం చేసుకుంది. అందుకే ఆమె ట్రాన్స్ఫర్ అయి వెళుతుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సన్మానం చేసి అవార్డులు ఇచ్చి పంపాయి. అదీ ఆర్తి సింగ్ ఘనత. ఆడపిల్ల పుడితే ఏంటి? ఆర్తి సింగ్‌ది ఉత్తరప్రదేశ్‌లోని మిర్జాపూర్. ఆ ప్రాంతంలో ఆడపిల్లల్ని కనడం గురించి స్త్రీలు వివక్ష ఎదుర్కొంటున్నా ఆర్తి కుటుంబంలో అలాంటి వివక్ష ఏదీ ఉండేది కాదు. ఆర్తి ఎంత చదవాలన్నా చదువుకోనిచ్చారు. ‘మా నాన్న సపోర్ట్ చాలా ఉంది’ అంటుంది ఆర్తి. ఆమె బెనారస్ హిందూ యూనివర్సిటీలో మెడిసిన్ చేసి డ్యూటీ డాక్టర్‌గా పని చేస్తున్నప్పుడు గైనకాలజీ వార్డ్‌లో ఆమెకు తల్లులు అందరి నుంచి ఎదురయ్యే ఒకే ఒక ప్రశ్న ‘ఆడిపిల్లా? మగపిల్లాడా?’– ఆడపిల్ల పుడితే వాళ్ల ముఖాలు మాడిపోయేవి. ‘ఆ పరిస్థితి చాలా విషాదం. తల్లిదండ్రులు ఆడపిల్లలను కాకుండా మగపిల్లలను ఎందుకు కోరుకుంటారంటే వారిని రక్షించలేమేమోనన్న ఆందోళనే. అందుకు వారు ఎన్నుకునే ఉపాయం. పెళ్లి. పెళ్లి చేసేస్తే ఆడపిల్ల సేఫ్ అనుకుంటారు. దాంతో బాల్య వివాహాలు, అపరిపక్వ వివాహాలు జరిగిపోతాయి. నేను ఈ పరిస్థితిని మార్చాలంటే డాక్టర్‌గా ఉంటే కుదరదనిపించింది. ఐఏఎస్ కాని ఐపిఎస్ కాని చేయాలనుకున్నాను. నేను పెద్ద ఆఫీసరయ్యి ఆడపిల్లల తల్లిదండ్రులకు సందేశం ఇవ్వాలనుకున్నాను’ అంటుంది ఆర్తి. అయితే బంగారంలాంటి డాక్టర్ చదువు చదివి ఉద్యోగం చేస్తూ కూడా యు.పి.ఎస్.సి పరీక్షలకు హాజరవ్వాలనుకోవడం రిస్క్. ‘కాని నేను చేయగలను అనుకున్నాను’ అంటుంది ఆర్తి సింగ్. ఆమెకు మొదటిసారి అవకాశం రాలేదు. రెండోసారి పంతంగా రాసి ఐ.పి.ఎస్ సాధించింది. కోవిడ్ వారియర్ మహారాష్ట్రలో మాలేగావ్ సెన్సిటివ్ ఏరియా. ఏడున్నర లక్షల మంది ఉండే ఈ టెక్స్టైల్ టౌన్లో మత కలహాలు ఏ పచ్చగడ్డీ వేయకనే భగ్గుమంటాయి. దానికి తోడు అక్కడే గత సంవత్సరం కరోనా కేసులు ఇబ్బడి ముబ్బడిగా పెరిగాయి. ఆ సమయంలో అధికారులకు మళ్లీ గుర్తొచ్చిన పేరు ఆర్తి సింగ్. అక్కడ చార్జ్ తీసుకోవడం అంటే ఏ క్షణమైనా కరోనా బారిన పడటమే. కాని ఆర్తి సింగ్ ధైర్యంగా చార్జ్ తీసుకుంది. అంతేకాదు రెండు నెలల కాలంలో కరోనాను అదుపు చేసింది. ‘నేను డాక్టర్ని కనుక ఇల్లు కదలకుండా ఉండటం ఎంత అవసరమో ప్రజలకు సమర్థంగా చెప్పాను. మరోవైపు మా సిబ్బంది ఒక్కొక్కరు కరోనా బారిన పడుతుంటే ధైర్యంగా ఉండటం కష్టమయ్యేది. అయినా సరే పోరాడాను. అలాగే కలహాలకు కారణమయ్యే టిక్‌టాక్‌లు, వాట్సాప్ మెసేజ్‌లు కట్టడి చేశాను’ అంటుంది ఆర్తి సింగ్. మహిళా కమిషనర్‌గా దేశంలోని కమిషనరేట్లలో అందరూ మగ ఆఫీసర్లు ఉంటే మహారాష్ట్ర ప్రభుత్వం ఆర్తి సామర్థ్యాలను గుర్తించి విదర్భ ప్రాంతంలోని అమరావతి నగరానికి కమిషనర్‌గా వేసింది. ఆ నగరంలో స్ట్రీట్ క్రైం ఎక్కువ. రౌడీలు తిరగడం, చైన్ స్నాచింగ్‌లు, తన్నులాటలు, ఈవ్ టీజింగ్‌లు.. మోతాదు మించి ఉండేవి. ఆర్తి చార్జ్ తీసుకున్నదన్న వార్తకే అవి సగం కంట్రోల్ అయ్యాయి. మరి కొన్నాళ్లకు మిగిలిన సగం కూడా. ఒత్తిళ్లకు తలొగ్గకుండా పని చేయడం ఆర్తి తీరు. ఇద్దరు పిల్లల తల్లి అయిన ఆర్తి ‘నేను చేయగలను’ అనుకోగలిగితే స్త్రీలను చేయలేనిది ఏదీ లేదు అని నిరూపిస్తోంది. -
ప్రముఖ బాలీవుడ్ నటుడికి దిమ్మతిరిగిపోయే షాకిచ్చిన కేన్ మామ..!
Kane Williamson With Manoj Bajpayee: ప్రముఖ బాలీవుడ్ నటుడు, ఫ్యామిలీ మ్యాన్ ఫేమ్ మనోజ్ బాజ్‌పేయికి.. న్యూజిలాండ్ క్రికెట్ జట్టు కెప్టెన్ కేన్ విలియమ్సన్ అదిరిపోయే రేంజ్లో షాకిచ్చాడు. కేన్ మామ ఎంటి.. మనోజ్ బాజ్‌పేయికి షాకివ్వడమేంటి అనుకుంటున్నారు. అయితే ఈ స్టోరీ చదవండి. అమెజాన్ ప్రైమ్ వేదికగా బాలీవుడ్ సూపర్ స్టార్ మనోజ్ బాజ్‌పేయి, కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్తో ముచ్చటించాడు. ఈ ఇద్దరి మధ్య క్రికెట్, సినిమా, వెబ్ సిరీస్ వంటి పలు అంశాలపై సరదా సంభాషణ జరిగింది. ఈ సందర్భంగా ఫ్యామిలీ మ్యాన్.. కేన్ మామకు పలు ప్రశ్నలు వేశాడు. దీనికి కివీస్ కెప్టెన్ కూడా ఫన్నీగా రిప్లై ఇచ్చాడు. సంభాషణలో భాగంగా అమెజాన్ ప్రైమ్‌లో నీకు నచ్చిన వెబ్ సిరీస్ ఏంటని మనోజ్ బాజ్‌పేయి.. కేన్‌ను అడిగాడు. ఇందుకు బదులుగా కేన్ తన "ఫ్యామిలీ మ్యాన్" పేరు చెప్తాడేమోనని బాజ్‌పేయి ఆసక్తిగా చూశాడు. కానీ కేన్.. ఫ్యామిలీ మ్యాన్‌కు షాకిస్తూ.. ‘మీర్జాపూర్’ అని చెప్పాడు. మీర్జాపూర్ రెండు సీజన్లను చూసానని.. మూడో పార్ట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని బదులిచ్చాడు. కేన్ సమాధానంతో బాజ్‌పేయి అవాక్కయ్యాడు. అతని ముఖం మాడిపోయింది. 'బై కేన్' అంటూ సంభాషణను ముగించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను అమెజాన్ ప్రైమ్ యూట్యూబ్‌లో విడుదల చేయగా.. ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది. కాగా, పంకజ్ త్రిపాఠి, దివ్యేందు శర్మ, అలీ ఫజల్ నటించిన మీర్జాపూర్ వెబ్ సిరీస్.. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై ప్రకంపనలు సృష్టించింది. అభిమానులు మూడో సీజన్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చదవండి: ICC Rankings: రూట్‌ను వెనక్కునెట్టి టాప్కు చేరిన ఆసీస్ బ్యాటర్ -
మీర్జాపూర్ వెబ్ సిరీస్ వివాదం.. హైకోర్టు కీలక నిర్ణయం
అలహాబాద్: మీర్జాపూర్ వెబ్ సిరీస్ రూపకర్తలకు ఊరట లభించింది. నిర్మాతలు ఫర్హాన్ అఖర్, రితేష్ సిధ్వానీలపై దాఖలైన ఎఫ్ఐఆర్ను అలహాబాద్ హైకోర్టు శుక్రవారం రద్దు చేసింది. జస్టిస్ ఎంసీ త్రిపాఠి, జస్టిస్ సుభాష్ విద్యార్థిలతో కూడిన బెంచ్ ఈ మేరకు ఉత్తర్వులిచ్చింది. దర్శక-రచయితలు కరణ్ అన్షుమాన్, గుర్మీత్ సింగ్, పునీత్ కృష్ణ, వినీత్ కృష్ణలపై నమోదైన ఎఫ్ఐఆర్ను కూడా హైకోర్టు రద్దు చేసింది. ఉత్తరప్రదేశ్ ప్రతిష్టకు భంగం కలిగేలా వెబ్ సిరీస్ రూపొందించారని ఆరోపిస్తూ కొత్వాలి దేహత్ పోలీస్ స్టేషన్ (మీర్జాపూర్)లో స్థానిక జర్నలిస్ట్ అరవింద్ చతుర్వేది జనవరి, 17న ఫిర్యాదు చేశారు. దీంతో ఐపీసీ సెక్షన్ 295-ఏ, 504, 505, 34, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని సెక్షన్ 67-ఏ కింద పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వెబ్ సిరీస్‌లో మీర్జాపూర్ పట్టణాన్ని చెడుగా చిత్రీకరించి మత, సామాజిక, ప్రాంతీయ మనోభావాలను దెబ్బతీశారని పిటిషనర్ ఆరోపించారు. తమపై నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని కోరుతూ ముందుగా నిర్మాతలు కోర్టు ఆశ్రయించారు. తర్వాత దర్శక-రచయితలు కూడా న్యాయస్థానం తలుపు తట్టారు. జనవరి, ఫిబ్రవరిలో వీరిని అరెస్ట్ చేయకుండా కోర్టు ఆదేశిలిచ్చింది. మీర్జాపూర్ వెబ్ సిరీస్ పూర్తిగా కల్పితమని, అన్ని మతాలను తాము గౌరవిస్తామని అంతకుముందు ఉన్నత న్యాయస్థానానికి వీరు విన్నవించుకున్నారు. వీరి వాదనలను పరిగణనలోకి తీసుకుని ఎఫ్ఐఆర్లను కోర్టు రద్దు చేసింది. (చదవండి: సినిమా చూసేందుకు ఆటోలో వచ్చిన స్టార్ హీరోయిన్) అమెజాన్ ప్రైమ్ వీడియోస్‌లో విడుదలైన మీర్జాపూర్ వెబ్ సిరీస్‌కు వీక్షకుల నుంచి ఆదరణ లభించింది. ఇప్పటికే రెండు సిరీస్‌లు విడుదలయ్యాయి. పంకజ్ త్రిపాఠి, అలీ ఫజాల్, దివ్యేందు శర్మ, కుల్‌భూషణ్ ఖర్బందా, రసికా దుగల్, శ్వేతా త్రిపాఠి, ప్రమోద్ పాఠక్, హర్షిత గౌర్, షాజీ చౌదరి తదితరులు నటించారు. ఇదిలావుంటే మూడో మీర్జాపూర్ వెబ్ సిరీస్ మూడో సీజన్ కోసం వీక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. (చదవండి: మీ మగబుద్ధే వంకరబుద్ధి అంటున్న సమంత!) -
గదిలో శవమై కనిపించిన బాలీవుడ్ నటుడు
Bramha Mishra Demise: బాలీవుడ్లో విషాదం చోటు చేసుకుంది. హిందీ నటుడు బ్రహ్మ మిశ్రా అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ముంబైలో తను నివసిస్తున్న వెర్సోవాలోని ఫ్లాట్‌లో శవమై కనిపించాడు. కుళ్లిపోతున్న స్థితిలో ఉన్న ఆయన శరీరాన్ని పోలీసులు శవపరీక్ష చేయడం కోసం డా.కూపర్ ఆస్పత్రికి తరలించారు. ఆయనది హత్యా? ఆత్మహత్యా? ఆకస్మిక మరణమా? అన్న వివరాలు తెలియాల్సి ఉంది. కాగా మీర్జాపూర్ సిరీస్‌లో మున్నా త్రిపాఠి స్నేహితుడు లలిత్ పాత్రతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు మిశ్రా. 'మీర్జాపూర్' 1, 2 సిరీస్‌లతో పాటు 'మంజి: ద మౌంటెన్ మ్యాన్', 'కేసరి' సహా పలు చిత్రాల్లో నటించాడు. మిశ్రా మరణంపై మీర్జాపూర్ కోస్టార్ దివ్యేందు సోషల్ మీడియా వేదికగా విచారం వ్యక్తం చేశాడు. View this post on Instagram A post shared by Divyenndu 💫 (@divyenndu) -
మున్నా అంటే అర్థం అదా ? షేర్ చేసిన మున్నా భయ్యా
Mirzapur Actor Divyenndu Aka Munna Bhaiya Funniest Act: బాలీవుడ్ నటుడు దివ్యేందు శర్మ అంటే పెద్దగా ఎవరికీ తెలీదు. కానీ 'మున్నా భయ్యా' అంటే మాత్రం అందరికీ తెలుసు. తన నటనతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు దివ్యేందు. అన్నిటికిమించి 'మీర్జాపూర్ సిరీస్'ల్లోని 'మున్నా త్రిపాఠి' పాత్ర అంటే అది వేరే లెవెల్. అతనికి ఈ పాత్రతో ఫ్యాన్స్ కూడా హైలెవెల్గానే పెరిగిపోయారు. అంతలా యూత్‌కి కిక్ ఇచ్చింది అతడి నటన. తాజాగా దివ్వేందు సోషల్ మీడియాలో వస్తున్న అర్బన్ డిక్షనరీ ట్రెండ్‌పై సరదాగా స్పందించాడు. అర్బన్ డిక్షనరీలో తన అసలు పేరుకు బదులు 'మున్నా' అనే పేరుకు అర్థం వెతికాడు. దానికి అర్బన్ డిక్షనరీ వెబ్సైట్ ఇచ్చిన అర్థాన్ని స్క్రీన్‌షాట్ తీసి తన ఇన్‌స్టా గ్రామ్‌లో షేర్ చేశాడు. అలాగే మున్నా అనే పేరుకు వచ్చిన అర్థాన్ని 'అమెజాన్ ప్రైమ్' కూడా షేర్ చేయడాన్ని దివ్యేందు తన ఇన్‌స్టాలో పంచుకున్నాడు. 'మీర్జాపూర్‌కు రాజు కావాలని పరితపించే వ్యక్తి ఎప్పుడూ తన తండ్రి ఆమోదం కోసం ఎదురుచూస్తుంటాడు. జీవితం మున్నా భయ్యా లాంటిది.' అని అర్బన్ డిక్షనరీ 'మున్నా' పేరుకు అర్థం తెలిపింది. దివ్వేందును అతడి అభిమానులు మున్నా భయ్యా అనే పిలుస్తారు. భారతీయులు అత్యంత ఇష్టపడే పాత్రలలో ఒకటి మున్నా భయ్యా పాత్ర. ఈ పాత్రలో దివ్యేందు అద్భుత నటన ఎప్పటికీ గుర్తుండిపోతుంది. 'ప్యార్ కా పంచ్‌నామా'లో ఒక పక్కింటి కుర్రాడి పాత్ర నుంచి 'మీర్జాపూర్'లో గూండా వరకు తనదైనా నటనతో ఆకట్టుకున్నాడు దివ్యేందు. ప్రస్తుతం దివ్యేందు వివిధ ప్రాజెక్టులకు సంతకం చేసినట్లు ప్రచారం ఉంది. వాటిని త్వరలోనే ప్రకటిస్తారాని సమాచారం. -
పోర్నోగ్రఫీ కేసు: మనోజ్ బాజ్‌పాయ్ నీచుడు, సభ్యత లేనివాడు
Sunil Pal: నీలి చిత్రాల కేసులో బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రాను అరెస్ట్ చేయడంపై కమెడియన్ సునీల్ పాల్ స్పందించాడు. పోర్నోగ్రఫీ రాకెట్ గుట్టు రట్టు చేయడమే కాక అతడిని అరెస్ట్ చేసినందుకు పోలీసులను అభినందించాడు. అయితే ఈ పోర్న్ అనేది రకరకాల రూపాల్లో విస్తరిస్తోందని చెప్పుకొచ్చాడు. ఈ మేరకు ఆయన తాజాగా మీడియాతో మాట్లాడాడు. 'రాజ్‌కుంద్రాను అరెస్ట్ చేయడం సబబైనదే. ఇదిప్పుడు అవసరం కూడా! ఎందుకంటే పలుచోట్ల సెన్సార్ లేకపోవడంతో కొందరు పెద్ద తలకాయలు అడ్డగోలు వెబ్‌సిరీస్‌లు తీస్తున్నారు. అవి ఇంట్లోవాళ్లతో కలిసి చూడలేనంత ఘోరంగా ఉంటున్నాయి. ఉదాహరణకు మనోజ్ బాజ్‌పాయ్‌ను తీసుకుందాం. అతడు పెద్ద నటుడే కావచ్చు. కానీ అతడిలాంటి సభ్యత లేని వ్యక్తిని, నీచుడిని నేనింతవరకు చూడలేదు. రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న అతడు ఫ్యామిలీ ఆడియన్స్ కోసం ఏం చేస్తున్నాడు? అతడు నటించిన ఫ్యామిలీ మ్యాన్ సిరీస్‌లో.. భార్యకు వివాహేతర సంబంధం, భర్తకు మరో మహిళతో ఎఫైర్, మైనర్ బాలికకు బాయ్‌ఫ్రెండ్, చిన్న పిల్లాడు తన వయసుకు మించి ప్రవర్తించడం.. ఓ కుటుంబం అంటే ఇలాగే ఉంటుందా? ఇవా మీరు చూపించేది? ఇక పంకజ్ త్రిపాఠి నటించిన మీర్జాపూర్ పనికిరాని వెబ్‌సిరీస్. అందులో చేసినవాళ్లంటేనే నాకు అసహ్యం. పోర్న్‌పై నిషేధం విధించినట్లుగానే ఈ పనికిరాని వెబ్‌సిరీస్‌లను కూడా బ్యాన్ చేయాలి. కేవలం కళ్లకు కనిపించేదే కాదు, ఆలోచనల్ని చెడగొట్టేది కూడా పోర్న్ కిందకే వస్తుంది' అని చెప్పుకొచ్చాడు. కాగా సునీల్ పాల్ 2005లో ఇండియన్ లాఫ్టర్ చాలెంజ్‌లో విజేతగా నిలిచాడు. 2010లో 'భవ్నావో కో సమజో' అనే కామెడీ సినిమాకు దర్శకత్వం వహించాడు. -
బ్యాంక్ ఉద్యోగం వదిలి సినిమాల్లోకి..
ప్రతిభావంతులైన కళాకారులెందరికో వేదికనిస్తోంది ఓటీటీ. అలా పరిచయం అయిన నటే ప్రియాషా భరద్వాజ్. పాత్ర స్వభావాన్ని ప్రదర్శించడం ఆమె ప్రత్యేకత. ప్రముఖ రచయిత, దర్శకుడు, నటుడు సత్యప్రసాద్ బారువా కుటుంబానికి చెందిన ప్రియాషా సొంతూరు గువాహటి. చిన్నప్పటినుంచి డాన్స్ అంటే ఇష్టం. కొంతకాలం భరతనాట్యం, వెస్టర్న్ డాన్స్‌లో శిక్షణ తీసుకుంది. ఢిల్లీ యూనివర్సిటీలో సైకాలజీ చదివింది. సిటీ బ్యాంక్‌లో ఉద్యోగం సంపాదించింది. అయితే ఆ వృత్తి.. తన ప్రవృత్తికి మ్యాచ్ అవక చేస్తున్న కొలువును వదిలిపెట్టి కొరియోగ్రాఫర్‌గా కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత యాంకరింగ్, వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్, ఈవెంట్ మేనేజర్, మోడల్, అసిస్టెంట్ డైరెక్టర్ దాకా సాగింది ఆ ప్రయాణం. దీపికా పడుకోణ్‌తో కలిసి బ్రిటానియా గుడ్ డే యాడ్ చేస్తున్నప్పుడే నటనపై ఆసక్తి పెరిగింది. కొంతకాలం ముంబైలోని ‘బేర్ ఫుట్ థియేటర్’, ‘ది బ్లైండ్ అండ్ ది ఎలిఫెంట్ థియేటర్’లలో ఆర్టిస్ట్‌గా కూడా పనిచేసింది. 2019లో ‘మేడిన్ హెవెన్’తో వెబ్‌సిరీస్ చాన్స్ వచ్చింది. టాలెంట్‌ను చాటుకుంది. ఆ గుర్తింపుతోనే ‘కాఫిర్’, ‘ఆర్యా’ వంటి సిరీస్‌లూ ఆమెకు ప్రధాన భూమికలనిచ్చాయి. అమెజాన్‌లో స్ట్రీమ్ అవుతోన్న ‘మిర్జాపూర్ –2’లో జమున పాత్రలో ఒదిగిపోయి వెబ్ వీక్షకుల అభిమానాన్ని, విమర్శకుల ప్రశంసలనూ పొందుతోంది. ఇండస్ట్రీలో గాడ్‌ఫాదర్ లేనివారికి ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ ఓ వరం.. మన టాలెంట్‌కు చక్కని అవకాశం. అందుకే సినిమాలకంటే వెబ్సిరీస్లే నాకు బాగా నచ్చుతాయి. – ప్రియాషా భరద్వాజ్ చదవండి: Monal Gajjar: హైదరాబాదీని అయిపోయా.. మోనాల్ ఆసక్తికర పోస్ట్ -
విషాదం: ఇంటి పైకప్పు కూలి.. ఐదుగురు మృతి
మీర్జాపూర్/ఉత్తరప్రదేశ్: మూడు తరాల పాతదైన ఓ ఇల్లు కూలి 5 మంది మరణించిన ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని మీర్జాపూర్లో చోటు చేసుకుంది. బుధవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఇంటి పైకప్పు కూలడంతో ఇంట్లో ఉన్న 5 మంది నిద్రలోనే కన్ను మూశారు. మరణించిన వారిని మోటార్ మెకానిక్ ఉమాశంకర్ (50), ఆయన భార్య గుడియా (48), కుమారులు శుభమ్ (22), సౌరభ్ (18), కూతురు సంధ్య (20)లుగా గుర్తించారు. కాగా, మరొక కుమర్తె వారణాసిలో చదువుతోంది. ప్రమాద సమయంలో ఆమె ఇంట్లో లేకపోవడంతో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఈ ఏడాది నవంబర్‌లో ఆమె పెళ్లి చేయాలని కుటుంబం నిర్ణయించుకున్న నేపథ్యంలో ఈ ఘటన జరగడం గమనార్హం. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ విషయంపై విచారం వ్యక్తం చేశారు. మరణించిన ఒక్కొక్కరి తరఫున రూ. 2లక్షల నష్టపరిహారం అందించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. చదవండి: అమానవీయం: సైకిల్‌పై భార్య మృతదేహం తరలింపు -
ఆ టెక్నిక్‌తో ఆఫీసుల్లోకి ఈజీగా వెళ్లేవాడిని : పంకజ్ త్రిపాఠి
పంకజ్ త్రిపాఠి అంటే అందరికీ ‘గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్’ గుర్తుకు వస్తుంది. ఆ తర్వాత అతను ‘మసాన్’, ‘స్త్రీ’, ‘న్యూటన్’ తదితర సినిమాల్లో అద్భుతంగా నటించాడు. ప్రస్తుతం హాట్‌స్టార్‌లో అతను నటించిన వెబ్‌సిరీస్ ‘క్రిమినల్ జస్టిస్’ మంచి ప్రశంసలు పొందుతోంది. ఇప్పుడు క్షణం తీరిక లేని ఆర్టిస్టే అయినా ఒకప్పుడు అంటే 2000 సంవత్సరంలో అవకాశాల కోసం ఎక్కే గడప దిగే గడపగా అతను జీవించాడు. భార్యను స్కూల్ టీచర్‌గా చేర్చి ఆ వచ్చే జీతంతో బతుకుతూ అవకాశాల కోసం ఆఫీసుల చుట్టూ తిరిగేవాడు. అయితే ఆఫీసుల్లోకి అంత సులభంగా ఎవర్నీ రానివ్వరు. దానికి త్రిపాఠి ఒక టెక్నిక్ పాటించేవాడు. సినిమా తీయబోతున్న ప్రతి ఆఫీసుకు తన ఫోటోలతో వెళ్లి ‘ఈశ్వర్ గారు పంపారండీ నన్ను’ అని రిసెప్షన్లో చెప్పేవాడు. ‘ఈశ్వర్ గారు పంపారట’ అనేసరికి ఆ ఈశ్వర్ ఎవరో ప్రముఖుడనుకొని లోపలికి రానిచ్చేవారు. ఫొటోలు తీసుకుని మాట్లాడి ఆఖరున ‘ఇంతకీ ఏ ఈశ్వర్ గారండీ’ అని అడిగేవారు. అప్పుడు పంకజ్ ఆకాశం వైపు చూపించి ’ఆ ఈశ్వర్ అండీ. ఆయనే కదా భూమ్మీదకు మనందరినీ పంపింది’ అనంటే అందరూ నవ్వేసేవారట. ఆ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండటం వల్లే ఆయన అంత మంచి నటుడయ్యాడు.