ప్రతిభావంతులైన కళాకారులెందరికో వేదికనిస్తోంది ఓటీటీ. అలా పరిచయం అయిన నటే ప్రియాషా భరద్వాజ్. పాత్ర స్వభావాన్ని ప్రదర్శించడం ఆమె ప్రత్యేకత. ప్రముఖ రచయిత, దర్శకుడు, నటుడు సత్యప్రసాద్ బారువా కుటుంబానికి చెందిన ప్రియాషా సొంతూరు గువాహటి. చిన్నప్పటినుంచి డాన్స్ అంటే ఇష్టం. కొంతకాలం భరతనాట్యం, వెస్టర్న్ డాన్స్‌లో శిక్షణ తీసుకుంది.
ఢిల్లీ యూనివర్సిటీలో సైకాలజీ చదివింది. సిటీ బ్యాంక్‌లో ఉద్యోగం సంపాదించింది. అయితే ఆ వృత్తి.. తన ప్రవృత్తికి మ్యాచ్ అవక చేస్తున్న కొలువును వదిలిపెట్టి కొరియోగ్రాఫర్‌గా కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత యాంకరింగ్, వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్, ఈవెంట్ మేనేజర్, మోడల్, అసిస్టెంట్ డైరెక్టర్ దాకా సాగింది ఆ ప్రయాణం. దీపికా పడుకోణ్‌తో కలిసి బ్రిటానియా గుడ్ డే యాడ్ చేస్తున్నప్పుడే నటనపై ఆసక్తి పెరిగింది.
కొంతకాలం ముంబైలోని ‘బేర్ ఫుట్ థియేటర్’, ‘ది బ్లైండ్ అండ్ ది ఎలిఫెంట్ థియేటర్’లలో ఆర్టిస్ట్‌గా కూడా పనిచేసింది. 2019లో ‘మేడిన్ హెవెన్’తో వెబ్‌సిరీస్ చాన్స్ వచ్చింది. టాలెంట్‌ను చాటుకుంది. ఆ గుర్తింపుతోనే ‘కాఫిర్’, ‘ఆర్యా’ వంటి సిరీస్‌లూ ఆమెకు ప్రధాన భూమికలనిచ్చాయి. అమెజాన్‌లో స్ట్రీమ్ అవుతోన్న ‘మిర్జాపూర్ –2’లో జమున పాత్రలో ఒదిగిపోయి వెబ్ వీక్షకుల అభిమానాన్ని, విమర్శకుల ప్రశంసలనూ పొందుతోంది.
ఇండస్ట్రీలో గాడ్‌ఫాదర్ లేనివారికి ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ ఓ వరం.. మన టాలెంట్‌కు చక్కని అవకాశం. అందుకే సినిమాలకంటే వెబ్‌సిరీస్‌లే నాకు బాగా నచ్చుతాయి.
– ప్రియాషా భరద్వాజ్
చదవండి: Monal Gajjar: హైదరాబాదీని అయిపోయా.. మోనాల్ ఆసక్తికర పోస్ట్
Comments
Please login to add a commentAdd a comment