Mirzapur 3 Is Coming Soon: Beena Bhabhi Aka Rasika Dugal Drops Major Hint - Sakshi
Sakshi News home page

Mirzapur Season 3: బీనా అంటీ హింట్.. త్వరలో సీజన్ 3!

Published Wed, Jul 12 2023 6:42 PM | Last Updated on Wed, Jul 12 2023 7:09 PM

Mirzapur Season 3 Release Date Beena Aunty Dubbing - Sakshi

Mirzapur Season 3: ఓటీటీల్లోని వెబ్ సిరీసులు అనగానే చాలామందికి ముందు గుర్తొచ్చేది 'మీర్జాపుర్'. బూతులు ఎక్కువని అంటారు గానీ తెలుగు రాష్ట్రాల్లోని చాలామంది ఈ సిరీస్‌కు ఫ్యాన్స్. మున్నా భయ్యా, గుడ్డూ భయ్యా పాత్రలు వాళ్లు చెప్పిన డైలాగ్స్ మీలో చాలామందికి బాగా తెలుసు. వాళ్లందరూ కూడా మూడో సీజన్ కోసం తెగ వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ల కోసమా అన్నట్లు బీనా అంటీ అప్డేట్ తో వచ్చేసింది.

(ఇదీ చదవండి: ఆమెని మర్చిపోలేకపోతున్న చిన్నల్లుడు కల్యాణ్ దేవ్!)

మూడేళ్లుగా వెయిటింగ్
2018లో 'మీర్జాపుర్' తొలి సీజన్.. అమెజాన్ ప్రైమ్‪‌లో విడుదలైంది. తొమ్మిది ఎపిసోడ్లలో ప్రతి ఒక్కటి ప్రేక్షకుల్ని విపరీతంగా అలరించాయి. 2020లో 10 ఎపిసోడ్లతో రెండో సీజన్ వచ్చింది. దీనికి కూడా మొదటి దానికి మించిన రెస్పాన్స్ వచ్చింది. దీంతో మూడో సీజన్ ఎప్పుడొస్తుందా అని అందరూ ఎదురుచూస్తున్నారు. చాలారోజుల క్రితమే షూటింగ్ పూర్తయినప్పటికీ రిలీజ్ ఇంకా ఫిక్స్ చేయలేదు.

బీనా ఆంటీ డబ్బింగ్
ఈ సిరీస్ లో మున్నా భయ్యా, గుడ్డు భయ్యా, ఖాలీన్ భయ్యా పాత‍్రల తర్వాత ఆ స్థాయి క్రేజ్ తెచ్చుకున్న రోల్ అంటే బీనా అంటీదే. ఈమెది ఖాలీన్ భయ్యాకు రెండో భార్య పాత్ర. ఒకటి, రెండు సీజన్లలో ఈమె పాత్రకు స్కోప్ తక్కువే. కానీ మూడో సీజన్ లో మాత్రం ఎక్కువే ఉండబోతుందని హింట్ ఇచ్చారు. ఇప్పుడు డబ్బింగ్ చెబుతున్న ఫొటోని పోస్ట్ చేసి.. త్వరలోనే సీజన్ 3 రిలీజ్ అవుతుందనే హింట్ ఇచ్చేసింది. దీంతో 'మీర్జాపుర్' ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు.

(ఇదీ చదవండి: 'బలగం' హీరోయిన్‌కి అవమానం!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement