
చాన్నాళ్ల తర్వాత బ్రహ్మానందం కీలక పాత్రలో నటించిన సినిమా 'బ్రహ్మానందం'. ఇందులో బ్రహ్మీతో పాటు ఆయన తనయుడు రాజా గౌతమ్, వెన్నెల తదితరలు నటించారు. గత నెలల థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం.. ఇప్పుడు పెద్దగా హడావుడి లేకుండానే ఓటీటీలోకి వచ్చేసింది.
(ఇదీ చదవండి: 'కన్నప్ప'కే టెండర్ వేసిన మంచు మనోజ్?)
బ్రహ్మానందం సినిమాని తాత-మనవడు మధ్య జరిగే ఎమోషనల్ కంటెంట్ తో తీశారు. కథ పరంగా బాగానే అనుకున్నారు కానీ సినిమాగా రిలీజ్ చేసిన తర్వాత ఎందుకో జనానికి సరిగా కనెక్ట్ కాలేదు. ఇలాంటివి ఓటీటీలో క్లిక్ అయ్యే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం ఆహా ఓటీటీలో గోల్డ్ యూజర్స్ కోసం స్ట్రీమింగ్ అవుతోంది. రేపటి (మార్చి 20) నుంచి యూజర్స్ అందరికీ అందుబాటులోకి వస్తుంది.
'బ్రహ్మానందం' విషయానికొస్తే.. నటుడు కావాలనుకునే బ్రహ్మా (రాజా గౌతమ్).. ఢిల్లీలో నాటకం వేయాలని అనుకుంటాడు. కానీ దీనికి డబ్బులివ్వాల్సి ఉంటుంది. దీంతో తాత ఆనంద్ రామ్మూర్తి (బ్రహ్మానందం) పేరిట ఉన్న భూమి అమ్మాలని అడుగుతాడు. దీనికి తాత ఒప్పుకొంటాడు కానీ కొన్ని షరతులు పెడతాడు. ఇంతకీ అవేంటి? చివరకు ఏమైందనేదే స్టోరీ.
(ఇదీ చదవండి: నటనకు గుడ్ బై.. హేమ ఇప్పుడేం చేస్తుంది?)
Comments
Please login to add a commentAdd a comment