
తెలుగులో ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తుంటాయి. కాకపోతే థియేటర్లలోకి వచ్చిన కొన్ని ఓటీటీలోకి చాన్నాళ్ల తర్వాత వచ్చిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా ఓ తెలుగు మూవీ దాదాపు ఏడాది తర్వాత స్ట్రీమింగ్ లోకి వచ్చింది.
(ఇదీ చదవండి: సడన్ గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా)
సాయికుమార్, ఆమని ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'లక్ష‍్మీ కటాక్షం'. గతేడాది మే 10న థియేటర్లలో రిలీజైంది. కానీ వచ్చి వెళ్లిన విషయం కూడా ఎవరికీ గుర్తులేదు. ఇప్పుడు 11 నెలల తర్వాత దీన్ని ఆహా ఓటీటీలోకి తీసుకొచ్చేశారు. ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతోంది.
'లక్ష్మీ కటాక్షం' విషయానికి వస్తే.. రూ.100 కోట్ల ఖర్చు చేసి ఎమ్మెల్యే కావాలన్న రాజకీయ నేత (సాయికుమార్) ఒకరు. అలానే ఎన్నికల్లో రూపాయి ఖర్చు పెట్టనివ్వకుండా అడ్డుపడేందుకు ప్రయత్నిస్తున్న పోలీస్ అధికారి (వినయ్) ఒకరు. వీళ్లిద్దరి మధ్య సంఘర్షణే ఈ సినిమా కథ.
(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 18 మూవీస్)