sai kumar
-
ట్రంప్ అధికారంలోకి వచ్చాక భారతీయ విద్యార్ధులకు కష్టాలు
-
సాయికుమార్ గోల్డెన్ జూబ్లీ
‘‘కనిపించే ఈ మూడు సింహాలు న్యాయానికి, నీతికి, ధర్మానికి ప్రతిరూపాలైతే, కనిపించని ఆ నాలుగో సింహమేరా..పోలీస్...’ అనే డైలాగ్ వింటే... వెంటనే సాయికుమార్ అని ఆడియన్స్ చెప్పేస్తారు. అంటూ ‘పోలీస్ స్టోరీ’లో ఆయన తనదైన శైలిలో పవర్‌ఫుల్‌గా చెప్పి, ఆకట్టుకున్నారు. నటుడిగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న సాయికుమార్ ఇండస్ట్రీలోకి వచ్చి యాభై సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సాయికుమార్ గురించి కొన్ని విశేషాలు...1972 అక్టోబరు 20న ‘మయసభ’ అనే నాటకంలో దుర్యోధనుడిపాత్ర కోసం తొలిసారి మేకప్ వేసుకున్నారు సాయికుమార్. ఆయన వెండితెర ప్రయాణం ‘దేవుడు చేసిన పెళ్లి’ చిత్రంతో జరిగింది. బాపు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సాయికుమార్ బాలనటుడిగా చేశారు. ఈ మూవీ 1975 జనవరి 9న రిలీజైంది. గురువారంతో (జనవరి 9) వెండితెరపై సాయికుమార్ యాభైఏళ్ల నట ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నారు.ముందు డబ్బింగ్ ఆర్టిస్టుగానే కెరీర్ మొదలుపెట్టారు సాయికుమార్. ఆ తర్వాత ‘ఛాలెంజ్, కలికాలం, మేజర్ చంద్రకాంత్’ వంటి తెలుగు సినిమాల్లో నటిస్తూనే, ‘తయ్యల్క్కారన్, కావల్ గీతమ్’ వంటి తమిళ సినిమాల్లోనూ నటించారు. 1996లో సాయికుమార్ హీరోగా వచ్చిన కన్నడ చిత్రం ‘పోలీసు స్టోరీ’ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాలోని సాయి కుమార్ నటనకు ఆడియన్స్ ఫిదా అయ్యారు. ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో అనువాదమై, విజయం సాధించింది. ‘పోలీసు స్టోరీ’ తర్వాత ఆయనపాతిక చిత్రాల్లోపోలీస్ ఆఫీసర్‌గా నటించారు. ఇక తెలుగులో ‘అమ్మ రాజీనామా, కర్తవ్యం, అంతఃపురం, ఈశ్వర్ అల్లా, జగద్గురు ఆది శంకర, ఎవడు, పటాస్, పండుగ చేస్కో, భలే మంచి రోజు, సరైనోడు, జనతా గారేజ్, ఓం నమో వెంకటేశాయ, జై లవ కుశ, రాజా ది గ్రేట్, నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా, మహర్షి, ఎస్ఆర్ కల్యాణమండపం, దసరా, సార్...’ ఇలా ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో సాయికుమార్ నటించారు.50 ఏళ్ల కెరీర్లో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా మెప్పించిన సాయికుమార్ విలన్‌గానూ నిరూపించుకున్నారు. ‘సామాన్యుడు, ప్రస్థానం, ఎవడు..’ వంటి చిత్రాల్లో విలన్‌గా చేశారు. కేవలం వెండితెరకు మాత్రమే పరిమితం కాకుండా, బుల్లితెరపై రాణిస్తున్నారు సాయికుమార్. ఇక ఆయన తమ్ముళ్లు అయ్యప్ప పి.శర్మ, పి. రవిశంకర్ డబ్బింగ్ ఆర్టిస్టులుగా, నటులుగా సినిమా రంగంలోనే రాణిస్తున్నారు. ఆయన కొడుకు ఆది సాయికుమార్ హీరోగా చేస్తున్నారు. -
‘ప్రణయ గోదారి’ మూవీ రివ్యూ
టైటిల్: ప్రణయ గోదారినటీనటులు: సదన్, ప్రియాంక ప్రసాద్, సాయి కుమార్, పృథ్వి, సునిల్, జబర్థస్త్ రాజమౌళి తదితరులునిర్మాణ సంస్థ: పీఎల్వీ క్రియేషన్స్నిర్మాత: పారమళ్ల లింగయ్యదర్శకత్వం: పీఎల్ విఘ్నేష్సంగీతం: మార్కండేయఎడిటర్: కొడగంటి వీక్షిత వేణువిడుదల తేది: డిసెంబర్ 13, 2024కథేంటంటే..గోదారికి చెందిన పెదకాపు(సాయి కుమార్) వెయ్యి ఎకరాల ఆసామి. చుట్టూ ఉన్న 40 గ్రామాలకు ఆయనే పెద్ద. ఆయన చెప్పిందే న్యాయం. ప్రేమ వివాహం చేసుకున్న పెదకాపు చెల్లి..భర్త చనిపోవడంతో కొడుకు శ్రీను(సదన్ హాసన్)తో కలిసి అన్నయ్య దగ్గరకు వస్తుంది. తన కూతురు లలిత(ఉష శ్రీ)ని మేనల్లుడు శ్రీనుకి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు పెదకాపు. కానీ శ్రీను ఆ ఊరి జాలరి అమ్మాయి గొయ్య లక్ష్మి ప్రసన్న అలియాస్ గొయ్యని(ప్రియాంక ప్రసాద్)ఇష్టపడతాడు. గోచిగాడు(సునిల్)తో కలిసి రోజు గోదారి ఒడ్డుకు వెళ్లి గొయ్యని కలుస్తుంటాడు. వీరిద్దరి ప్రేమ విషయం పెదకాపుకు తెలుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? పరువు కోసం ప్రాణాలు ఇచ్చే పెదకాపు మేనల్లుడి ప్రేమను అంగీకరించాడా లేదా? గొయ్య, శ్రీనులను కలిపేందుకు గోచి తీసుకున్న సంచలన నిర్ణయం ఏంటి? చివరకు గొయ్య, శ్రీనులు కలిశారా లేదా? అనేదే మిగతా కథ.ఎలా ఉందంటే.. పరువు హత్యల నేపథ్యంలో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. ప్రణయ గోదారి కూడా ఆ కోవకు చెందిన చిత్రమే. ' పునర్జన్మ నేపథ్యంతో హృద్యమైన ప్రేమకథగా ఈ చిత్రాన్ని దర్శకుడు పీఎల్ విఘ్నేష్. దర్శకుడు ఎంచుకున్న పాయింట్ బాగున్నప్పటికీ..దాన్ని తెరపై చూపించడంలో కొంతవరకు మాత్రమే సఫలం అయ్యాడు. సినిమా ప్రారంభం రొటీన్‌గా ఉంటుంది. ప్లాష్‌బ్యాక్ స్టోరీ స్టార్ట్ అయిన తర్వాత కథపై ఆసక్తి పెరుగుతుంది. . గొయ్యతో శ్రీను ప్రేమలో పడడం.. తన ప్రేమ విషయాన్ని చెప్పడం శ్రీను చేసే ప్రయత్నాలు ఆకట్టుకుంటాయి. మధ్య మధ్య గోచి పాత్ర చేసే కామెడీ సీన్లు నవ్వులు పూయిస్తాయి. ఫస్టాఫ్ మొత్తం గొయ్య, శ్రీనుల ప్రేమ చుట్టునే కథనం సాగుతుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ ఆకట్టుకుంటుంది. ఇక సెకండాఫ్‌లో కథనం కాస్త ఎమోషనల్‌గా సాగుతుంది. ప్రేమ విషయం పెద కాపుకు తెలియడం.. మరోవైపు గొయ్యకి వేరే వ్యక్తితో పెళ్లికి చేసేందుకు రెడీ అవ్వడంతో ఏం జరుగుతుందనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో కలుగుతుంది. గోచి పాత్ర ఇచ్చే ట్విస్ట్ ఆకట్టుకుంటుంది. ఇక క్లైమాక్స్‌లో సాయి కుమార్ చెప్పే డైలాగ్స్ ఆలోచింపజేస్తాయి. స్క్రీన్‌ప్లేని ఇంకాస్త బలంగా రాసుకొని, తెలిసిన నటీనటులను పెట్టుకొని ఉంటే సినిమా ఫలితం మరోలా ఉండేవి. ఎవరెలా చేశారంటే..సదన్, ప్రియాంక ప్రసాద్ కొత్తవాళ్లే అయినా.. చక్కగా నటించారు. సిటీ యువకుడు, పల్లెటూరి అబ్బాయిగా రెండు విభిన్నమైన పాత్రలు పోషించిన సదన్.. ప్రతి పాత్రలోనూ వేరియేషన్ చూపించి ఆకట్టుకున్నాడు. ఇక గొయ్యగా ప్రియాంత తెరపై అందంగా కనిపించింది. ఈమె పాత్ర సినిమా మొత్తం ఉంటుంది. వీరిద్దరి తర్వాత ఈ సినిమాలో బాగా పండిన పాత్ర సాయి కుమార్‌ది. పెదకాపు పాత్రలో ఆయన జీవించేశాడు. ఆయన పాత్ర సినిమాకు స్పెషల్ అట్రాక్షన్. సినిమా చూసిన వారు గోచి పాత్రను మరచిపోరు. ఆ పాత్రలో సునిల్ ఒదిగిపోయాడు. సినిమా మొత్తం నవ్విస్తూ.. చివరిలో ఎమోషనల్‌కు గురి చేస్తాడు. జబర్థస్త్ రాజమౌళి తనదైన కామెడీతో నవ్వించాడు. పృథ్వి తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. మార్కండేయ అందించిన పాటలు సినిమాకు ప్రధాన బలం. అన్ని పాటలు వినసొంపుగా ఉన్నాయి. నేపథ్య సంగీతం పర్వాలేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. గోదావరి అందాలను తెరపై చక్కగా చూపించాడు. ప్రతి ఫ్రేమ్‌ని చాలా రిచ్‌గా చూపించే ప్రయత్నం చేశాడు. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. రేటింగ్: 2.5/5 -
సినిమా అంటే సినిమా అంతే: ఎమ్మెల్సీ మల్లన్న
‘‘చిన్న సినిమా? పెద్ద సినిమా? అనే తేడా ఎక్కడ పుట్టిందో నాకు తెలీదు. సినిమా అంటే సినిమా అంతే. ‘ప్రణయ గోదారి’ టైటిల్ చాలా బాగుంది. ట్రైలర్, సాంగ్స్ కూడా బాగా నచ్చాయి. ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలి’’ అని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కోరారు. సదన్, ప్రియాంక ప్రసాద్ జంటగా, సాయి కుమార్ ముఖ్య పాత్రలో నటించిన చిత్రం ‘ప్రణయ గోదారి’. పీఎల్ విఘ్నేష్ దర్శకత్వంలో పీఎల్వీ క్రియేషన్స్‌పై పారమళ్ల లింగయ్య నిర్మించారు. ఈ నెల 13న రిలీజ్ కానున్న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ఎమ్మెల్సీ మల్లన్న, నిర్మాత రాజ్ కందుకూరి, హీరో సోహెల్ అతిథులుగా హాజరయ్యారు. పీఎల్ విఘ్నేశ్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా కోసం నా ఆస్తులు అమ్మడంతో పాటు అప్పులు తెచ్చాను. సినిమా తీయడం, రిలీజ్ చేయడం సులభం కాదనే విషయం అర్థమైంది’’ అన్నారు. ‘ఓ చిన్న చిత్రం బయటకు రావాలంటే ఎంత కష్టపడాల్సి ఉంటుందో నాకు తెలుసు. డబ్బులు సంపాదించడానికి ఇండస్ట్రీకి రారు. పేరు కోసం ఇక్కడకు వస్తారు. లక్ వస్తే.. డబ్బులు కూడా వస్తాయి. ప్రణయ గోదారి టీంలో అందరూ కొత్త వాళ్లే. వారి కష్టాన్ని గుర్తించి థియేటర్‌కు వెళ్లి సినిమాను చూడండి’అని సోహైల్ అన్నారు. -
రికార్డ్ స్థాయిలో 'కమిటీ కుర్రోళ్ళు' కలెక్షన్స్
నిహారిక కొణిదెల సమర్పణలో ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. యదు వంశీ దర్శకత్వంలో పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాక నిర్మించిన ఈ చిత్రం ఆగష్టు 9న విడుదలైంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని వంశీ నందిపాటి రిలీజ్ చేశారు. డిఫరెంట్ కంటెంట్‌తో ఇటు ఫ్యామిలీ ఆడియెన్స్, అటు యూత్‌ను ఆకట్టుకున్న ఈ చిత్రం సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. అలాగే బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లను రాబట్టుకుంటోంది. మూడు రోజుల్లోనే ఈ మూవీ రూ. 6.04 కోట్లు వసూళ్లతో సందడి చేస్తోంది. రోజు రోజుకీ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తుండటంతో. కలెక్షన్స్ విషయంలో ఇకపై ఇదే జోరుని కొనసాగిస్తుందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. మంచి పల్లెటూరి వాతావరణంలో స్నేహం, ప్రేమ, కుటుంబంలోని భావోద్వేగాలను ‘కమిటీ కుర్రోళ్ళు’ చిత్రంలో సీనియర్ నటీనటులతో పాటు 11 మంది హీరోలు, నలుగురు హీరోయిన్స్‌ను తెలుగు సినిమాకు పరిచయం చేస్తూ మేకర్స్ చేసిన ఈ ప్రయత్నాన్ని అభినందిస్తూ ప్రేక్షకులు సినిమాను ఆదరించారని ట్రేడ్ వర్గాలంటున్నాయి. సినీ ప్రేక్షకులతో పాటు సెలబ్రిటీలు సైతం కమిటీ కుర్రోళ్ళు చిత్రాన్ని ప్రశంసిస్తున్నారు.‘కమిటీ కుర్రోళ్ళు’ కథేంటంటే..గోదావరి జిలాల్లోని పురుషోత్తంపల్లె అనే గ్రామంలో జరిగే కథ ఇది. ఆ గ్రామంలో 12 ఏళ్లకు ఒక్కసారి భరింకాళమ్మతల్లి జాతర జరుగుతుంది. అయితే ఈ సారి ఊరి సర్పంచ్ ఎన్నికలకు పది రోజుల ముందు ఈ జాతర జరగాల్సి ఉంటుంది. ఈసారి ఎన్నికల్లో ఆ ఊరికి చెందిన యువకుడు శివ(సందీప్ సరోజ్).. ప్రస్తుత సర్పంచ్ పోలిశెట్టి బుజ్జి (సాయి కుమార్)పై పోటీకి నిలడేందుకు ముందుకు వస్తాడు.గత జాతర సమయంలో ‘కమిటీ కుర్రోళ్లు’(11 మంది) కారణంగా ఊర్లో జరిగిన గొడవలను దృష్టిలో పెట్టుకొని, ఈ సారి జాతర జరిగేంతవరకు ఎన్నికల ప్రచారం చేయ్యొద్దని ఊరి పెద్దలు నిర్ణయం తీసుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగింది?. 12 ఏళ్ల క్రితం ఊర్లో జరిగిన గొడవ ఏంటి? కమిటీ కుర్రోళ్లలో ఒకడైన ఆత్రం అలియాస్ నరసింహా ఎలా చనిపోయాడు? ఈ సారి జాతర ఎలా జరిగింది? విడిపోయిన కమిటీ కుర్రోళ్లు మళ్లి ఎలా కలిశారు? చివరకు ఎన్నికల్లో ఎవరు గెలిచారు? అనేదే మిగతా కథ. -
‘కమిటీ కుర్రోళ్లు’ మూవీ రివ్యూ
టైటిల్: కమిటీ కుర్రోళ్లునటీనటులు: సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, ఈశ్వర్ రాచిరాజు,త్రినాద్ వర్మ, ప్రసాద్ బెహరా, మణికంఠ పరసు, లోకేష్ కుమార్ పరిమి, శ్యామ్ కళ్యాణ్, సాయి కుమార్, గోపరాజు రమణ, బలగం జయరాం తదితరులునిర్మాణ సంస్థలు: పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్నిర్మాత:నిహారిక కొణిదెలదర్శకత్వం: యదు వంశీసంగీతం: అనుదీప్ దేవ్సినిమాటోగ్రఫీ: రాజు ఎడురోలువిడుదల తేది: ఆగస్ట్ 9, 2024మెగా డాటర్ నిహారికగా నిర్మించిన తొలి సినిమా ‘కమిటీ కుర్రోళ్లు’. ట్రైలర్ రిలీజ్ వరకు ఈ సినిమాపై పెద్దగా అంచనాలు లేవు. కానీ ట్రైలర్ వచ్చిన తర్వాత సినిమాపై బజ్ ఏర్పడింది. దానికి తోడు చిరంజీవితో సహా మెగా హీరోలంతా ప్రమోట్ చేయడంతో ‘కమిటీ కుర్రోళ్లు’పై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు(ఆగస్ట్ 09) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే..గోదావరి జిలాల్లోని పురుషోత్తంపల్లె అనే గ్రామంలో జరిగే కథ ఇది. ఆ గ్రామంలో 12 ఏళ్లకు ఒక్కసారి భరింకాళమ్మతల్లి జాతర జరుగుతుంది. అయితే ఈ సారి ఊరి సర్పంచ్ ఎన్నికలకు పది రోజుల ముందు ఈ జాతర జరగాల్సి ఉంటుంది. ఈసారి ఎన్నికల్లో ఆ ఊరికి చెందిన యువకుడు శివ(సందీప్ సరోజ్).. ప్రస్తుత సర్పంచ్ పోలిశెట్టి బుజ్జి (సాయి కుమార్)పై పోటీకి నిలడేందుకు ముందుకు వస్తాడు. గత జాతర సమయంలో ‘కమిటీ కుర్రోళ్లు’(11 మంది) కారణంగా ఊర్లో జరిగిన గొడవలను దృష్టిలో పెట్టుకొని, ఈ సారి జాతర జరిగేంతవరకు ఎన్నికల ప్రచారం చేయ్యొద్దని ఊరి పెద్దలు నిర్ణయం తీసుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగింది?. 12 ఏళ్ల క్రితం ఊర్లో జరిగిన గొడవ ఏంటి? కమిటీ కుర్రోళ్లలో ఒకడైన ఆత్రం అలియాస్ నరసింహా ఎలా చనిపోయాడు? ఈ సారి జాతర ఎలా జరిగింది? విడిపోయిన కమిటీ కుర్రోళ్లు మళ్లి ఎలా కలిశారు? చివరకు ఎన్నికల్లో ఎవరు గెలిచారు? అనేదే మిగతా కథ.ఎలా ఉందంటే.. బాల్యం.. ప్రతి ఒక్కరికి ఓ మధుర జ్ఞాపకం. మనం ఎంత ఎదిగినా.. ఎంత దూరంలో ఉన్నా మన మనసుకి హత్తుకుని ఉండే గురుతులన్నీ బాల్యంతోనే ముడిపడి ఉంటాయి. కమిటీ కుర్రోళ్లు సినిమా చూస్తున్నంత సేపు 90ల తరానికి చెందిన వారంతా తమ బాల్యంలోకి తొంగి చూస్తారు. ఆ రోజులు వస్తే బాగుండని ఆశ పడతారు. మనల్నీ బాల్యంలోకి తీసుకెళ్లడంతో డైరెక్టర్ యదు వంశీ సక్సెస్ అయ్యారు. కానీ కథనాన్ని ఆసక్తికరంగా నడపడంతో తడబడ్డాడు. సినిమా ప్రారంభం బాగుంటుంది. అప్పట్లో గ్రామల్లోని పిల్లల మధ్య స్నేహం ఎలా ఉండేది.. కులం, మతం అనే తేడా లేకుండా ఎలా కలిసిమెలిసి ఉండేవాళ్లు.. అప్పటి ఆటలు.. చిలిపి చేష్టలు అవన్నీ తెరపై చూస్తుంటే నైంటీస్ కిడ్స్ అంతా ఆయా పాత్రల్లో తమను తాము ఊహించుకుంటారు. ఇంటర్వెల్ వరకు కథనం చాలా వినోదాత్మకంగా సాగుతూ.. రియాల్టీకి దగ్గరగా ఉంటుంది. ఇక ఇంటర్వెల్ సీన్ హృదయాలను బరువెక్కిస్తుంది. అయితే ఆ ఎమోషన్ని అదే స్థాయిలో ద్వితియార్థంలో కొనసాగించలేకపోయాడు. ఫస్టాఫ్‌లో టచ్ చేసిన రిజర్వేన్ల అంశానికి సరైన ముగింపు ఇవ్వలేదు. దాన్ని పక్కన పెట్టేసి ఆత్రం చావు సీన్‌ని ఎమోషనల్‌గా మలిచి కన్నీళ్లను తెప్పించాడు. ఆ తర్వాత కథనం సాగదీతగా అనిపిస్తుంది. జాతర సీన్‌ని ఆసక్తికరంగా మలచలేకపోయాడు. ఎన్నికల ఎపిసోడ్‌తో పాటు క్లైమాక్స్ సింపుల్‌గా ఉంటుంది. సెకండాఫ్‌ని ఇంకాస్త ఆసక్తికరంగా మలిచి ఉంటే ఫలితం మరోలా ఉండేది. ఎవరెలా చేశారంటే..ఈ సినిమాలో నటించిన 11 మంది హీరోలతో పాటు చాలా ప్రధాన పాత్రల్లో నటించిన వారంతా కొత్తవాళ్లే. అయినా కూడా చాలా నేచురల్‌గా నటించారు. శివగా సందీప్ సరోజ్ , సూర్యగా యశ్వంత్ పెండ్యాలా, విలియంగా ఈశ్వర్ రచిరాజు,ఇలా ప్రతి ఒక్కరు తమతమ పాత్రల్లో జీవించేశారు. పెద్దోడిగా నటించిన ప్రసాద్ బెహరా.. ఎంత నవ్విస్తాడో..కొన్ని చోట్ల అంతే ఏడిపిస్తాడు. ఇక సీనియర్ నటులైన సాయి కుమార్, గోపరాజు రమణ రోటీన్ పాత్రల్లో మెరిశారు. సత్తయ్యగా నటించిన కంచెరాపాలెం కిశోర్..కొన్ని చోట్ల తనదైన నటనతో ఎమోషనల్‌కు గురి చేస్తాడు. సాంకేతికంగా ఈ సినిమా బాగుంది. అనుదీప్ దేవ్ సంగీతం ఈ సినిమాకు ప్రధాన బలం. పాటలు కథలో భాగంగా సాగుతూ.. వినసొంపుగా ఉంటాయి. తనదైన బీజీఎంతో కొన్ని సీన్లకు ప్రాణం పోశాడు. సినిమాటోగ్రఫీ బాగుంది. గోదావరి అందాలను తెరపై చక్కగా చూపించాడు. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -రేటింగ్: 2.75/5-అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
వన్ అండ్ ఓన్లీ డైలాగ్ కింగ్.. సాయికుమార్ బర్త్ డే స్పెషల్ (ఫొటోలు)
-
'ప్రణయ గోదారి' పవర్ఫుల్ గ్లింప్స్ విడుదల
టాలీవుడ్లో రొటీన్ కథలకు భిన్నంగా.. కొత్తగా రూపొందే చిత్రాల పట్ల ప్రేక్షకులు ఆదరణ చూపిస్తున్నారు. అలాంటి కథలనే నేటి తరం దర్శక, నిర్మాతలు కూడా సినిమాలుగా తీసుకరావడానికి మొగ్గుచూపుతున్నారు. ఆ కోవలోనే న్యూ కంటెంట్‌తో రిఫ్రెషింగ్ ఫీల్‌తో రూపొందుతున్న చిత్రం 'ప్రణయగోదారి'. పి.ఎల్.విఘ్నేష్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని పారమళ్ళ లింగయ్య నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేశారు.ప్రముఖ హాస్య నటుడు అలీ కుటుంబానికి చెందిన నటుడు సదన్ హీరోగా నటిస్తున్నాడు, ప్రియాంక ప్రసాద్ హీరోయిన్గా నటిస్తుంది. సునిల్ రావినూతల ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. ఇందులో డైలాగ్ కింగ్ సాయికుమార్ కీలక పాత్రలో నటిస్తున్నారు. పెదకాపు అనే పాత్రలో ఆయన కనిపించనున్నారు. సాయికుమార్ ఫస్ట్ లుక్‌ను తెలంగాణ శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రం ప్రమోషన్స్ లో భాగంగా ఈ చిత్రం పవర్ఫుల్ గ్లింప్స్‌ను ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి చేతుల మీదుగా విడుదల చేశారు.ఈ సందర్భంగా రాజ్ కందుకూరి మాట్లాడుతూ.. `ప్రణయగోదారి ` గ్లింప్స్ చాలా బాగుంది. కంటెంట్ చూస్తుంటే తప్పనిసరిగా అందరికి నచ్చుతుందనే నమ్మకం కలుగుతుంది. ఈ చిత్రంలో సాయికుమార్ డైలగ్స్ అన్నీ చాలా ఆసక్తిగా ఉండటమే కాకుండా పవర్‌ఫుల్‌గా వున్నాయి. చిత్రం ప్రేక్షకుల ఆదరణతో చాలా మంచి సక్సెస్ అవ్వాలి. ఈ సినిమా యూనిట్‌కు నా అభినందనలు' అన్నారు.ప్రణయగోదారి సినిమా గ్లింప్ల్ చూస్తుంటే.. సన్నివేశాలు.. సంభాషణలు పవర్‌ఫుల్‌గా కనిపిస్తున్నాయి. సాయికుమార్ ఈ సినిమాలో పెదకాపు పాత్రలో ఊరి పెద్దలాగా కనిపిస్తున్నారు. ఆయన చెప్పిన డైలాగులు భారీగా పేలుతున్నాయి. 'తప్పు ఎవరు చేసినా తీర్పు ఒక్కటే'...'ఆకాశానికి హద్దుండదు ఈ పెదకాపు మాటకు తిరుగుండదు'. 'నే పుట్టిన ఈ గోదారి తల్లి మీద ఒట్టు' అని సాయికుమార్ తన పవరఫుల్ డైలాగులతో మెస్మరైజ్ చేశాడు. 'ప్రాణం పోయినా సహిస్తాను.. భరిస్తాను ..నా సహనాన్ని.. మంచితనాన్ని పరీక్షించొద్దు' అనే డైలాగుతో చాలా రౌద్రంగా కనిపిస్తున్నారు. గ్లింప్స్‌లో ఆయన పాత్రలోని గంభీరత్వం కూడా కనిపిస్తుంది. గ్లింప్స్‌ను చూస్తే సినిమా మొత్తానికి సాయికుమార్ పాత్ర చాలా ముఖ్యమైనదిగా తెలుస్తుంది. గోదారి నది ఒడ్డున హీరో హీరోయిన్ల ఆటలు, వారి ప్రేమాయణం సన్నివేశాలు చూస్తుంటే ఈ చిత్రంలో యువతను అలరించే అంశాలు కూడా వున్నట్లు తెలుస్తుంది. -
అనసూయ సినిమాపై అభిషేక్ కన్ను.. ఎందుకో తెలుసా..?
-
'ప్రణయ గోదారి' మూవీ.. సాయి కుమార్ ఫస్ట్ లుక్ రిలీజ్
తెలుగులోని భిన్నమైన నటుల్లో సాయి కుమార్ ఒకరు. ఇప్పటికే ఎన్నో డిఫరెంట్ రోల్స్ చేశారు. ఇప్పుడు మరో వైవిధ్యమైన పాత్రలో నటించారు. ఈయన లేటెస్ట్ మూవీ 'ప్రణయ గోదారి'. ఇందులో పెదకాపు అనే పవర్ఫుల్ పాత్ర పోషించారు. తాజాగా సాయికుమార్ ఫస్ట్ లుక్‌ని తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: రష్మిక 'కుబేర' వీడియో.. ఆ సూట్ కేసులో ఏముంది?)ఈ సినిమాకు పీఎల్ విఘ్నేష్ దర్శకత్వం వహించారు. ఇకపోతే ఈ మూవీతో అలీ కుటుంబానికి చెందిన సదన్ హీరోగా పరిచయమవుతున్నాడు. ప్రియాంక ప్రసాద్ హీరోయిన్. 'చూడగానే గంభీరంగా కనిపించే లుక్, మీసకట్టు, తెల్లని పంచె, లాల్చీతో, మెడలో రుద్రాక్షమాల, చేయికి కంకణం, చేతిలో సిగార్‌తో చాలా డిఫరెంట్‌గా సాయికుమార్ కనిపించారు.(ఇదీ చదవండి: ప్రభాస్ 'రాజాసాబ్'... ఆ వార్తలు నమ్మొద్దని టీమ్ ప్రకటన) -
టాలీవుడ్లో తొలిసారి అలాంటి కాన్సెప్ట్... బాక్సాఫీస్ షేక్ చేస్తారా!
సాయికుమార్, అనసూయ భరద్వాజ్, శుభలేఖ సుధాకర్, ఆమని, వైవా హర్ష ప్రధాన పాత్రల్లో తెరకెక్కిస్తోన్న చిత్రం అరి. ఈ మూవీని పూర్తి డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రూపొందిస్తున్నారు. పేపర్ బాయ్ ఫేం జయశంకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు మంచి ఆదరణ లభించింది.అయితే ఇటీవల టాలీవుడ్ మైథలాజికల్ చిత్రాలపై ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. ఇటీవల రిలీజైన కల్కి 2898 ఏడీ సైతం అదే కాన్సెప్ట్‌తో వచ్చింది. ప్రస్తుతం ఈ మూవీ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. కార్తికేయ-2, కాంతార, హనుమాన్, ఓ మై గాడ్, కల్కి సినిమాలు ఇదే తరహా కాన్సెప్ట్‌తో తెరెకెక్కించారు. ఇలాంటి కాన్సెప్ట్‌తో వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద అత్యధి కలెక్షన్లు రాబట్టాయి. అరి కూడా ఈ బ్లాక్ బస్టర్ చిత్రాల సరసన నిలుస్తుందేమో వేచి చూడాల్సిందే.అరిషడ్వర్గాస్ కాన్సెప్ట్..అరి మూవీలో అరిషడ్వర్గాలు అనే కాన్సెప్ట్‌ను ప్రేక్షకులను పరిచయం చేయనున్నారు. మనిషి అంతర్గత శత్రువులుగా భావించే అరిషడ్వర్గాలైన కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యాలని శ్రీకృష్ణుడు ఎలా నియంత్రించాడు? వాటితో ఆయనకున్న సంబంధం ఎలాంటిదనే విషయాల్ని వర్తమాన అంశాలతో ముడిపెడుతూ సినిమాని తెరకెక్కించారు. ఇలాంటి కాన్సెప్ట్‌తో రూపొందిస్తున్న తొలి చిత్రంగా అరి నిలవనుంది.అయితే బాలీవుడ్లో అభిషేక్ బచ్చన్ కీలక పాత్రలో ఈ మూవీ రీమేక్ చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. దీని గురించి ఇప్పటికే దర్శకుడితో మాట్లాడినట్లు సమాచారం. -
పాన్ ఇండియా సినిమాలోకి ఎంట్రీ ఇచ్చిన శివాజీ
టాలీవుడ్లో తెరకెక్కుతున్న మరో భారీ సోషియో ఫాంటసీ మూవీ 'కూర్మనాయకి'. ఈ చిత్రాన్ని ఎంఎం క్రియేషన్స్, కాలభైరవ ప్రొడక్షన్స్‌తో కలిసి రోషన్ ప్రొడక్షన్స్ బ్యానర్లో కె విజితా రావ్ నిర్మిస్తున్నారు. స్నిగ్ధ మణికాంత్ రెడ్డి, పూజ సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇండియన్ స్క్రీన్ మీద ఇప్పటిదాకా రానటువంటి కథా కథనాలతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు దర్శకుడు హర్షవర్థన్ కడియాల.వరలక్ష్మీ శరత్ కుమార్, సాయి కుమార్, అతిరారాజ్, వీటీవీ గణేష్ కీ రోల్స్ లో నటిస్తున్న ఈ చిత్రంలో ప్రముఖ యాక్టర్ శివాజీ ఓ ప్రధాన పాత్రను పోషించనున్నారు. ఈ రోజు శివాజీ బర్త్ డే సందర్భంగా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చిత్ర యూనిట్ తెలిపింది. ఈ భారీ ప్రాజెక్ట్‌లోకి వెల్కమ్ చేస్తూ స్పెషల్ వీడియోను కూర్మనాయకి టీమ్ రిలీజ్ చేసింది. శివాజీ ఈ చిత్రంలో పవర్ ఫుల్ రోల్ చేస్తున్నట్లు ఈ వీడియో ద్వారా తెలుస్తోంది.మహావిష్ణు అవతారాల్లోని కూర్మావతారం నేపథ్యంలో పాన్ ఇండియా మూవీగా 'కూర్మనాయకి' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు దర్శకుడు హర్షవర్థన్ కడియాల. అత్యున్నత సాంకేతిక విలువలతో పాటు హై క్వాలిటీ వీఎఫ్ఎక్స్ షాట్స్ ఈ సినిమాకు ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం రెండు షెడ్యూల్స్ చిత్రీకరణ పూర్తి చేసుకున్నారు. థర్డ్ షెడ్యూల్ లో శివాజీ జాయిన్ అయ్యారు. కూర్మనాయకి సినిమాలో ఓ స్టార్ హీరో నటించనున్నారు. ఆయన ఎవరనేది త్వరలో వెల్లడించనున్నారు. -
నిషేధిత డ్రగ్ తయారీ ముఠా గుట్టురట్టు
జిన్నారం (పటాన్చెరు): టీఎస్ న్యాబ్, జిల్లా పోలీసులు సంయుక్తంగా దాడులు చేసి నిషేధిత డ్రగ్‌ను తయారు చేస్తున్న ముఠా గుట్టును రట్టు చేశారు. సంగారెడ్డి జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేశ్ మంగళవారం వివరాలు వెల్లడించారు. గుమ్మడిదలకు చెందిన గోసుకొండ అంజిరెడ్డి, కొత్తపల్లికి చెందిన ప్రభాకర్‌గౌడ్, అనంతారానికి చెందిన సాయికుమార్‌గౌడ్, వికారాబాద్ జిల్లా పంచలింగాలకు చెందిన క్యాసారం రాకేశ్‌లు నిషేధిత అ్రల్పాజోలం తయారు చేయాలని నిర్ణయించుకున్నారు. నలుగురూ కలిసి కొత్తపల్లి గ్రామ శివారులో ఓ కోళ్ల ఫారాన్ని లీజుకు తీసుకున్నారు. అక్కడ ఓ ప్రత్యేక గదిలో డ్రగ్‌ను తయారు చేసేందుకు రియాక్టర్‌తో సహా అన్ని రకాల వసతులను ఏర్పాటు చేసుకున్నారు. అంజిరెడ్డి బాలానగర్‌లో అ్రల్పాజోలం తయారీకి కావాల్సిన ముడి పదార్థాలు తీసుసురాగా రాకేశ్ డ్రగ్‌ను ప్రాసెస్‌ను చేసేవాడు. ఆరు నెలలుగా వీరి డ్రగ్ వ్యాపారం బాగానే నడిచింది.అయితే గ్రామ శివారులో వ్యర్థాల ఘాటు వాసనలు వెలువడటంతో ఈ విషయాన్ని స్థానికులు పోలీసులకు తెలిపారు. దీంతో టీఎస్ న్యాబ్, పోలీసులు సంయుక్తంగా డ్రగ్ కేంద్రంపై దాడులు జరిపి, రూ.40 లక్షల విలువైన 2.6 కిలోల అ్రల్పాజోలం, మరో రూ.60 లక్షల విలువైన ముడి పదార్థాలు, యంత్రాలను అధికారులు సీజ్ చేశారు. రాకేశ్, అంజిరెడ్డిలను పోలీసులు అదుపులోకి తీసుకోగా, సాయికుమార్‌గౌడ్ ప్రస్తుతం చర్లపల్లి జైల్లో ఉన్నాడు. ప్రభాకర్‌గౌడ్ పరారీలో ఉన్నాడని ఎస్పీ రూపేశ్ తెలిపారు. సమావేశంలో న్యాబ్ డీఎస్పీ శ్రీధర్, ఇన్స్పెక్టర్ సంతోష్, పటాన్చెరు డీఎస్పీ రవీందర్‌రెడ్డి, జిన్నారం సీఐ సు«దీర్ కుమార్, ఎస్ఐలు మహేశ్వర్‌రెడ్డి, విజయారావు తదితరులు పాల్గొన్నారు. -
బాల్యాన్ని గుర్తు చేసేలా ‘కమిటీ కుర్రాళ్లు’ టీజర్
నటి, నిర్మాత నిహారిక కొణిదెల సమర్పణలో తెరకెక్కిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. యదు వంశీ దర్శకత్వం వహించిన ఈ మూవీలో సాయికుమార్, సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, ఈశ్వర్ రాచిరాజు, ప్రసాద్ బెహరా, రాధ్య, తేజస్వి రావు, టీనా శ్రావ్య, విషిక లీడ్ రోల్స్‌లో నటించారు. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్ఎల్పీ, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాక నిర్మించారు. ఈ మూవీ టీజర్‌ని హీరో నితిన్ సోషల్ మీడియా వేదికగా విడుదల చేసి, యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘యువత అయినా, పెద్దవాళ్లైనా ఏదో ఒక సందర్భంలో చిన్నతనమే బాగుందని అనుకుంటుంటారు. ఎలాంటి పొరపొచ్ఛాలు, అడ్డుగోడలు, బాధలు లేకుండా స్నేహితులతో కలిసి సరదాగా గడిపే బాల్యమే ఎంతో గొప్పది. ఈ పాయింట్ ఆధారంగా చేసుకుని నిర్మించిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. ప్రస్తుతం మా సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే మూవీ విడుదల చేస్తాం’’ అని చిత్రబృందం పేర్కొంది. -
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సాయి కుమార్ ఫ్యామిలీ (ఫొటోలు)
-
'లక్ష్మీ కటాక్షం' సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్
ఇప్పటి వరుకు తెలుగులో చాలా తక్కువ సెటైరికల్ కాన్సెప్ట్ మూవీస్ వచ్చాయి. అందులోను పొలిటికల్ సెటైరికల్ కామెడీ మాత్రం ఇంకా తక్కువ వచ్చాయి. ఇప్పుడు అదే తరహాలో ప్రేక్షకులని నవ్వించడానికి 'లక్ష్మీ కటాక్షం' అనే చిత్రం నుంచి డైలాగ్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ డైలాగ్ పోస్టర్ లో ఓటరే తన రేటును తాను నిర్ణయించుకుంటాడు అనేలా చూపించారు. (ఇదీ చదవండి: 'రేసుగుర్రం' విలన్ సీక్రెట్ ఫ్యామిలీ.. ఎన్నికల టైంలో ఇరికించేశారు!) మహతి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై వస్తున్న ఈ 'లక్ష్మీకటాక్షం' సినిమాకు సూర్య దర్శకుడు. శ్రీనివాసులరెడ్డి నిర్మించగా, అభిషేక్ రుఫుస్ సంగీతం అందించారు. ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలకి చాలా ఆప్ట్ గా ఉన్నట్లు కనిపిస్తోంది. సాయి కుమార్ ముఖ్య పాత్రలో నటించగా.. వినయ్, అరుణ్, దీప్తి వర్మ తదితరులు కీలక పాత్రలు పోషించారు. త్వరలోనే సరదాగా ఉండే టీజర్ ట్రైలర్ తో ప్రేక్షకుల ముందుకు వస్తామని చిత్రబృందం వెల్లడించింది. (ఇదీ చదవండి: రహస్యంగా పెళ్లి చేసుకున్న 'టెంపర్' నటి) -
మెర్సీ కిల్లింగ్ మూవీ రివ్యూ
టైటిల్: మెర్సీ కిల్లింగ్ నటీనటులు: సాయి కుమార్, పార్వతీశం, ఐశ్వర్య, బేబీ హారిక, రామరాజు, సూర్య, ఆనంద్ చక్రపాణి, ఘర్షణ శ్రీనివాస్, షేకింగ్ శేషు, ఎఫ్.ఎం.బాబాయ్, రంగస్థలం లక్ష్మీ, ల్యాబ్ శరత్, హేమ సుందర్, వీరభద్రం, ప్రమీల రాణి తదితరులు. నిర్మాణ సంస్థ: సాయి సిద్ధార్ద్ మూవీ మేకర్స్ నిర్మాతలు: సిద్ధార్థ్ హరియల, మాధవి తాలబత్తుల దర్శకత్వం: వెంకటరమణ ఎస్ సినిమాటోగ్రఫీ: అమర్.జి సంగీతం: ఎం.ఎల్.రాజ ఎడిటర్: కపిల్ బల్ల విడుదల తేది: ఏప్రిల్ 12, 2024 కథేంటంటే.. స్వేచ్ఛ (హారిక) ఓ అనాథ అమ్మాయి. తన తల్లిదండ్రులు ఎవరనేది తెలియక.. చిన్నప్పటి నుంచి ఎన్నో అవమానాలను ఎదుర్కొంటుంది. పెద్దయ్యాక.. తన పెరెంట్స్ ఎవరనేది కనుక్కునేందుకు ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో ఆమె మహేశ్(పార్వతీశం) భారతి (ఐశ్వర్య)లను కలుసుకుంటుంది. వాళ్లు స్వేచ్ఛకు ఎలాంటి సహాయం అదించారు? పెరెంట్స్ కోసం వెతుకున్న స్వేచ్ఛకు రామకృష్ణమ్ రాజు(సాయి కుమార్) ఎలా పరిచయం అయ్యాడు? ఆయన నేపథ్యం ఏంటి? రామకృష్ణమ్ రాజు, స్వేచ్ఛకు మధ్య ఉన్న సంబంధం ఏంటి? చివరకు స్వేచ్ఛ తన పేరెంట్స్‌ని కలిసిందా లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎవరెలా చేశారంటే.. పలు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన హారిక ఈ సినిమాలో స్వేచ్ఛ పాత్రలో ఒడిగిపోయింది. అలాగే ఐశ్వర్య కొన్ని ఎపిసోడ్స్ లో స్టన్నింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. సాయి కుమార్ కు ఈ సినిమా మరో ప్రస్థానం అని చెప్పవచ్చు. తన పాత్రలో అద్భుతంగా నటించాడు. బసవరాజు పాత్రలో రామరాజు బాగా నటించాడు, అలాగే జడ్జి పాత్రలో సూర్య తన పాత్ర పరిధి మేరకు నటించి మెప్పించాడు. ఎలా ఉందంటే.. సమాజంలో జరిగే కొన్ని సంఘటనల ఆధారంగా తీసుకొని ఈ కథను తెరకెక్కించాడు దర్శకుడు వెంకటరమణ ఎస్. ఇలాంటి సబ్జెక్ట్స్‌ని డీల్ చేయడం కొందరికే సాధ్యం. ఆ విషయంలో దర్శకుడు వెంకటరమరణ కొంతమేర సఫలం అయ్యాడు. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో ఆసక్తికరంగా కథనాన్ని నడిపించాడు. ఫస్టాఫ్ కొంతమేర సాగదీతగా అనిపించినా.. ఇంటర్వెల్ సీన్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. ద్వితియార్థంలో కథనం వేగంగా సాగుతుంది. క్లైమాక్స్ ఎమోషనల్‌గా ఉంటుంది. జి.అమర్ సినిమాటోగ్రఫీ బాగుంది. లొకేషన్స్, సాంగ్స్, కాకినాడ లోని ఉప్పడా బీచ్, ఫిషింగ్ హార్బర్ ఇలా అన్ని లొకేషన్స్ ను తెరమీద అద్భుతంగా సహజంగా చూపించారు. ఎం.ఎల్.రాజా సంగీతం బాగుంది. సిద్ధార్థ్ హరియల, మాధవి తాలబత్తుల నిర్మాతలు ఖర్చుకు ఎక్కడా రాజీ పడకుండా మెర్సీ కిల్లింగ్ సినిమాను నిర్మించారు. -
వేడుకలో...
నాని హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘సరిపోదా శనివారం’. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ప్రియాంకా మోహన్ కథానాయిక. సాయికుమార్, ఎస్జే సూర్య కీలక పాత్రల్లో నటిస్తున్నారు. డీవీవీ దానయ్య, కల్యాణ్ దాసరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నుంచి నాని, సాయికుమార్ ఉన్న కొత్త పోస్టర్ని రిలీజ్ చేశారు. సూర్యగా నాని, శంకరంగా సాయికుమార్ సంప్రదాయ దుస్తుల్లో చిరునవ్వులు చిందిస్తూ కనిపించారు. సినిమాలో ఏదైనా వేడుకకు సంబంధించిన ఫొటో అన్నట్లుగా ఈ పోస్టర్ ఉంది. ‘‘హై బడ్జెట్‌తో రూపొందిస్తోన్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఆగస్ట్ 29న రిలీజ్ చేస్తాం’’ అన్నారు మేకర్స్. ఈ చిత్రానికి సంగీతం: జేక్స్ బిజోయ్, కెమెరా: మురళి జి. -
ప్రతి మహిళ చూడాల్సిన చిత్రం మెర్సి కిల్లింగ్ : సాయి కుమార్
సాయి కుమార్, పార్వతీశం, ఐశ్వర్య, హారిక ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం మెర్సి కిల్లింగ్ . సాయి సిద్ధార్ద్ మూవీ మేకర్స్ బ్యానర్ పై సిద్ధార్ద్ హరియల, మాధవి తాలబత్తుల నిర్మిస్తున్న ఈ సినిమాకు శ్రీమతి వేదుల బాల కామేశ్వరి సమర్పిస్తున్నారు. ఏప్రిల్ 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సాయి కుమార్, కోనా వెంకట్, పూరి ఆకాష్, యాంకర్ రవి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నటుడు సాయి కుమార్ మాట్లాడుతూ...మెర్సీ కిల్లింగ్ అనే సినిమా స్వేచ్ఛ అనే అమ్మాయి చుట్టూ తిరుగుతుంది. స్వేచ్ఛ పాత్రలో హారిక బాగా నటించింది. దర్శకుడు సూరపల్లి వెంకటరమణ చక్కటి కథతో ఈ సినిమాను తెరకెక్కించారు. పార్వతీశం, ఐశ్వర్య పోటీ పడి నటించారు. నేను ఈ సినిమాలో మరో మంచి రోల్ లో ప్రేక్షకుల ముందుకు రావడం సంతోషంగా ఉంది. ప్రతి మహిళ చూడవలసింది సినిమా మెర్సి కిల్లింగ్ అని సమాజంలో ఆడవారిపై జరుగుతున్న అకృత్యాలు ఈ సినిమాలో కళ్ళకు కట్టినట్లు చూపించారని తెలిపారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ఆధారంగా తెరకెక్కిన చిత్రం మెర్సీ కిల్లింగ్ . స్వేచ్ఛ అనే అనాధ బాలిక తనకు న్యాయం జరగాలంటూ ఈ కథ ప్రారంభం అవుతుందని, అందరికి ఈ సినిమా కనెక్ట్ అవుతుందని అందరూ ఆర్టిస్టులు టెక్నీషియన్స్ కష్టపడి పనిచేశారని సినిమా బాగుందని ప్రివ్యూ చూసిన అందరూ అంటుంటే సంతోషంగా ఉందని దర్శకుడు వెంకటరమణ ఎస్ తెలిపారు. -
కట్టేసి, కారం చల్లి..
కరీంనగర్ క్రైం: కుటుంబ కలహాలతో భర్తను అతికిరాతకంగా కడతేర్చిందో భార్య. తాళ్లతో కట్టేసి, కారంపొడి చల్లి, వేడినీళ్లు పోస్తూ.. రోకలిబండతో విచక్షణారహితంగా దాడి చేయడంతో తీవ్ర గాయాలపాలై ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఆదర్శనగర్‌లో చోటుచేసుకుంది. పోలీసులు, మృతుడి కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. ఆదర్శనగర్‌కు చెందిన తోట హేమంత్(39)కు 2012లో రోహితితో వివాహమైంది. వారికి ఇద్దరు కొడుకులు, కుమార్తె ఉన్నారు. హేమంత్ పెట్రోల్‌బంక్‌లో పనిచేసి మానేశాడు. రోహితి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో కాంట్రాక్టు పద్ధతిలో పేషెంట్ కేర్‌గా పనిచేస్తోంది. దంపతుల మధ్య కొన్నాళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. మంగళవారం గొడవ తీవ్రమైంది. దీంతో రోహితి హేమంత్‌ను ఎలాగైనా చంపాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం ఆస్పత్రిలో పనిచేసే నవీన్, సాయికుమార్ సాయం కోరింది. బుధవారం రాత్రి వారిని ఇంటికి పిలిచింది. వారు ఇంటికి వచ్చి గేటు, ఇంటి తలుపులు మూసేశారు. ముగ్గురూ కలిసి హేమంత్‌ను తాళ్లతో కట్టేశారు. కళ్లలో కారం కొట్టారు. అనంతరం నవీన్, సాయికుమార్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ తరువాత రోహితి హేమంత్ శరీరంపై వేడినీళ్లు పోస్తూ.. రోకలిబండతో విచక్షణరహితంగా దాడి చేసింది. తల, మర్మాంగాలపై దాడి చేయడంతో రక్తస్రావం జరిగి స్పృహ కోల్పోయాడు. దీంతో రోహితి అంబులెన్స్‌కు ఫోన్ చేసింది. అర్ధరాత్రి దాటిన తరువాత ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో చనిపోయాడు. హేమంత్ తల్లి విమల ఫిర్యాదు మేరకు త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ముగ్గురు నిందితులనూ అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. కన్నతల్లి కళ్లెదుటే..: తన కళ్లెదుటే హేమంత్‌ను కొట్టారని, కొట్టొద్దని బ్రతిమిలాడినా వినలేదని విమల రోదించింది. వేడినీళ్లు, కారంపొడి పోస్తూ దాడి చేశారని, ముగ్గురు పిల్లలున్నారు వద్దన్నా వినకుండా చంపేశారని భోరుమంది. పథకం ప్రకారమే హేమంత్‌ను నిందితులు చంపారని బంధువులు ఆరోపించారు. బుధవారం ఉదయం నుంచి నవీన్, సాయికుమార్ పలుమార్లు ఫోన్ చేశారని హేమంత్ తమకు చెప్పాడన్నారు. ఈ క్రమంలోనే రాత్రి ఇంటికి వచ్చి పథకం ప్రకారం దాడిచేసి చంపారని ఆరోపించారు. -
సినిమా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను: సాయి కుమార్
-
మా సినిమా చేనేత కార్మికులకు అంకితం : సాయి కుమార్
‘‘జోరుగా హుషారుగా’లో చేనేత కార్మికుడిగా నటించడం నా అదృష్టం. పోచంపల్లి చేనేత కార్మికుల గురించి చక్కగా చూపించాడు అను ప్రసాద్. ఈ చిత్రాన్ని చేనేత కార్మికులకు అంకితం ఇస్తున్నాం’’ అన్నారు సాయి కుమార్. విరాజ్ అశ్విన్, పూజితా పొన్నాడ జంటగా అను ప్రసాద్ దర్శకత్వం వహించిన చిత్రం ‘జోరుగా హుషారుగా’. నిరీష్ తిరువీధుల నిర్మించిన ఈ సినిమా ఈ నెల 15న విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకకి అతిథిగా హాజరైన దర్శకుడు మల్లిడి వశిష్ట మాట్లాడుతూ– ‘‘బెక్కం వేణుగోపాల్‌గారు కొత్త దర్శకులను, కొత్త కథలను, చిన్న సినిమాలను బాగా ప్రోత్సహిస్తారు. ‘జోరుగా హుషారుగా’ సక్సెస్ అవ్వాలి’’ అన్నారు. ‘‘ఈ మూవీలో తండ్రీ కొడుకుల మధ్య వచ్చే సీన్స్ ఆకట్టుకుంటాయి’’ అన్నారు నిర్మాత బెక్కం వేణుగో΄ాల్. ‘‘ఇదొక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్’’ అన్నారు విరాజ్ అశ్విన్. ‘‘ఇది నా మొదటి చిత్రం’’ అన్నారు అను ప్రసాద్. ‘‘సినిమా రిలీజ్‌కి బెక్కం వేణుగో΄ాల్గారు అందించిన స΄ోర్ట్ మర్చి΄ోలేను’’ అన్నారు నిరీష్ తిరువీధుల. -
తళుకుమను తార...
‘బాహుబలి’ ప్రభాకర్ లీడ్ రోల్లో పాలిక్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రౌద్ర రూపాయ నమః’. రావుల రమేష్ నిర్మించిన ఈ సినిమా పోస్ట్‌ప్రోడక్షన్ జరుపుకుంటోంది. జాన్ భూషణ్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘తళుకు తళుకుమను తార.. కులుకులొలుకు సితార...’ అంటూ సాగే సెకండ్ లిరికల్ వీడియో సాంగ్‌ని నటుడు సాయి కుమార్ రిలీజ్ చేశారు. ఈ పాటను సురేష్ గంగుల రచించారు. ‘‘రౌద్ర రూపాయ నమః’’ చాలా పవర్ఫుల్ టైటిల్. ఈ సినిమా విజయం సాధించి, యూనిట్‌కి మంచి పేరు రావాలి’’ అన్నారు సాయికుమార్ అన్నారు. ‘‘మా సినిమాని ప్రేక్షకులు హిట్ చేయాలని కోరుకుంటున్నాను’’ అన్నారు రావుల రమేష్. ‘‘ప్రభాకర్‌గారి నటన మా చిత్రానికి ఆయువుపట్టు’’ అన్నారు పాలిక్. ఈ కార్యక్రమంలో నటుడు రఘు, రచయిత తోటపల్లి సాయినాథ్ తదితరులు పాల్గొన్నారు. ఈ మూవీకి కెమెరా: గిరి–వెంకట్. -
ఇంత పెద్ద ఫ్యామిలీ అంటూ ఏడిపించేవారు నను..!
-
నేను ఆటో నడిపి డబ్బులు సంపాదించే వాడిని
-
ఆమె ఫోటో నా జేబులో ఎప్పటికీ ఉంటుంది అంటున్న హీరో
-
రాకేష్ మరిన్ని సినిమాలు చేయాలి
‘జబర్దస్త్’ ఫేమ్ రాకింగ్ రాకేష్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ప్రారంభోత్సవం మంగళవారం హైదరాబాద్‌లో జరిగింది. తొలి సన్నివేశానికి ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి రోజా సెల్వమణి కెమెరా స్విచ్చాన్ చేయగా, తెలంగాణ ఎంపీ (రాజ్యసభ) సంతోష్ కుమార్ క్లాప్ ఇచ్చారు. నటుడు తనికెళ్ల భరణి గౌరవ దర్శకత్వం వహించగా, నటుడు సాయికుమార్ మేకర్స్‌కి స్క్రిప్ట్ అందజేశారు. గ్రీన్ ట్రీ ప్రోడక్షన్స్ పతాకంపై జయలక్ష్మీ సాయి కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ అంజి దర్శకత్వం వహిస్తుండగా, అనన్యా నాగళ్ల హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ సినిమాప్రా రంభోత్సవంలో రోజా మాట్లాడుతూ– ‘‘రాకేష్‌కి ఎప్పట్నుంచో లీడ్ రోల్ చేయాలని ఉంది. ఈ సినిమాతో అది నెరవేరడం హ్యాపీగా ఉంది. ఈ సినిమా విజయం సాధించి, భవిష్యత్‌లో రాకేష్ మరిన్ని సినిమాలు చేసి, ప్రజలకు వినో దాన్ని పంచాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.‘‘నటుడిగా, నిర్మాతగా రాకేష్ మరెన్నో సినిమాలు చేసి, మంచి పేరు తెచ్చుకోవాలి’’ అన్నారు ఎంపీ సంతోష్ కుమార్. ‘‘చిన్న సినిమాలు పెద్దగా అవుతున్నాయి. ఈ సినిమా కూడా పెద్ద విజయం సాధించి, రాకేష్ మరో పది సినిమాలు చేసే స్థాయికి రావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు తనికెళ్ల భరణి. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఫౌండర్ రాఘవ తదితరులు పాల్గొన్నారు. ఈ సినిమాకు సంగీతం: చరణ్ అర్జున్. -
డైరెక్టర్‌గా జబర్దస్త్ కమెడియన్.. 'ప్రతి సీన్ మనసును కదిలిస్తుంది'!
సాయికుమార్, ఆదిత్యా ఓం, ఐశ్వర్య, రాజీవ్ కనకాల, శ్రీనివాస్ సాయి, దీపాలి రాజ్‌పుత్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘నాతో నేను’. శాంతి కుమార్ తూర్లపాటి (జబర్దస్ట్ ఫేం) దర్శకత్వంలో ప్రశాంత్ టంగుటూరి నిర్మించారు. ఈ నెల 21న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు మేకర్స్. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీనియర్ నటుడు సాయి కుమార్ హాజరయ్యారు. (ఇది చదవండి: స్టార్ డైరెక్టర్ కొత్త వెబ్ సిరీస్.. ఈసారి ఇంకెన్ని వివాదాలో?) సాయికుమార్ మాట్లాడుతూ.. 'నాన్న అమ్మ ఇచ్చిన స్వరం, సంస్కారంతో నేను ఈ స్థాయిలో ఉన్నా. చక్కని కథలతో వైవిధ్యమైన పాత్రలతో నటుడిగా నిలబడ్డా. మనసును కదిలించే కథతో సినిమా రూపొందించారు. ఈ చిత్రంలో ప్రతి సీన్ మనసును కదిలిస్తుంది.' అని అన్నారు. శ్రీనివాస్ సాయి మాట్లాడుతూ..' చక్కని కథాంశంతో ఎమోషన్స్, కామెడీ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రమిది. టీమ్ అంతా కష్టపడ్డాం. చిన్న సినిమానే కావచ్చు కానీ మంచి ప్రయత్నం.' అని అన్నారు. శాంతికుమార్ మాట్లాడుతూ.. 'జబర్దస్త్ కమెడియన్‌గా ప్రేక్షకుల ఆదరణ పొందా. నేను దర్శకత్వం వహించే వరకూ వచ్చానంటే నిర్మాతలే కారణం. కథ అన్ని ఓకే అయ్యాక సీనియర్ ఆర్టిస్ట్ సాయికుమార్ సరే అనగానే నేను సక్సెస్ అయ్యాననిపించింది. అన్ని రకాలుగా సహకరించిన నిర్మాతకు కృతజ్ఞతలు.' అని అన్నారు. కరోనా వల్ల కాస్త ఆలస్యమైనా మంచి సమయంలో విడుదల చేస్తున్నామని ఈ చిత్ర నిర్మాత అన్నారు. ఈ చిత్రంలో సమీర్, సీవీఎల్ నరసింహారావు, గౌతమ్ రాజు, ఎమ్మెస్ చౌదరి, భద్రం, సుమన్ శెట్టి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. (ఇది చదవండి: బిగ్‌బాస్‌లోకి ఇండియన్ స్టార్ క్రికెటర్ .. స్టార్ మా ప్లాన్ ఇదేనా?) -
తెలుగు గీతానికి ఆస్కార్.. మన దేశానికి పురస్కార్: సాయి కుమార్
-
అమెరికాలో జరిగిన యదార్థ ఘటన ఆధారంగా 'మూడో కన్ను'
సెవెన్ స్టార్ క్రియేషన్స్, ఆడియన్స్ పల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ ద్వారా సునీత రాజేందర్, ప్లాన్ బి డైరెక్టర్ కె.వి రాజమహి నిర్మిస్తున్న చిత్రం మూడో కన్ను. అమెరికాలో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా నిర్మిస్తున్న ఈ ఆంథాలజీ చిత్రంతో సూరత్ రాంబాబు, కె బ్రహ్మయ్య ఆచార్య, కృష్ణమోహన్, మావిటి సాయి సురేంద్రబాబు దర్శకులుగా పరిచయం కానున్నారు. ఈ కథలో ప్రధాన పాత్ర పోషించిన సాయికుమార్ మాట్లాడుతూ.. కొత్త కథతో వస్తున్న కొత్త వాళ్లను ఎంకరేజ్ చేయడానికి ఈ సినిమా చేస్తున్నానని, ఈ సినిమా చేయడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు. తెలుగు ఫిలిం దర్శకుల సంఘం అధ్యక్షుల కాశీ విశ్వనాథ్ మాట్లాడుతూ.. 'ఫస్ట్ టైం తెలుగు ఫిలిం చరిత్రలో మా యూనియన్‌లో మెంబర్ షిప్ ఉన్న నలుగురు కొత్త దర్శకులను పరిచయం చేస్తున్న మా మెంబర్ దర్శకుడు కె.వి రాజమహికి ధన్యవాదాలు. ఈ చిత్రంలో నేను కూడా భాగమైనందుకు ఆనందంగా ఉంది' అని చెప్పారు. ఈ చిత్రంలో సూర్య, మహేష్ వడ్డి, నిరోష, కౌశిక్ రెడ్డి, ప్రదీప్ రుద్ర, దయానంద రెడ్డి, శశిధర్ కౌసరి, దేవి ప్రసాద్, మాధవి లత, చిత్రం శ్రీను, సత్య శ్రీ, మధు, దివ్య, వీర శంకర్, రూప తదితరులు పలు పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి కథ, కథనం, మాటలు కె.వి రాజమహి అందించగా కె.వి రాజమహి, సునీత రాజేందర్ నిర్మించారు. -
పన్నెండేళ్లు పూర్తి చేసుకున్న ఆది సాయికుమార్
డైలాగ్ కింగ్ సాయికుమార్ వారసుడిగా సినిమాల్లోకి వచ్చిన హీరో ఆది సాయికుమార్. ప్రేమకావాలి సినిమాతో హీరోగా వెండితెరకు పరిచయం అయ్యి నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. ఆది ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి నేటితో పన్నెండేళ్లు పూర్తయ్యింది. ఈ పుష్కరకాలంలో ఆయన ఎన్నెన్నో ప్రయోగాలు చేశారు. ఫలితంతో సంబంధం లేకుండా అభిమానుల్ని అలరించడానికి డిఫరెంట్ జానర్స్‌ను ప్రయత్నిస్తూనే వచ్చాడు. ఆయన కెరీర్లో ప్రేమ కావాలి, లవ్లీ, సుకుమారుడు, శమంతకమణి, ఆపరేషన్ గోల్డ్ ఫిష్, బుర్రకథ, శశి ఇలా అనేక రకాల కాన్సెప్టులతో సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించారు.గత ఏడాది ఏకంగా ఐదు సినిమాలతో ముందుకు వచ్చాడు. కానీ కరోనా వల్ల ఆది నటించిన సినిమాలు కాస్త ఆలస్యం అయ్యాయి. దీంతో గత ఏడాది తీస్ మార్ ఖాన్, క్రేజీ ఫెల్లో,బ్లాక్ అతిథి దేవో భవ, టాప్ గేర్ అంటూ ఇలా వరుసగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. చివరగా వచ్చిన టాప్ గేర్ సినిమాకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.ఇప్పుడు ఆది సాయి కుమార్ ఓటీటీలోనూ ఎంట్రీ ఇచ్చారు. పులి మేక అనే వెబ్ సిరీస్‌లో ఆది సాయి కుమార్ నటించారు. ప్రస్తుతం ఈ పులి మేక వెబ్ సిరీస్ జీ5లో ట్రెండ్ అవుతోంది. ఫోరెన్సిక్ టీమ్ హెడ్ ప్రభాకర్ శర్మ పాత్రలో ఆది కనిపించిన తీరు, నటించిన సీన్ల గురించి అంతా చర్చించుకుంటున్నారు. ఓ వైపు సినిమాలతో బిజీగా ఉన్నా కూడా ఇలా ఓటీటీలోనూ నటించి ఇప్పుడు ట్రెండింగ్‌లోకి వచ్చారు.త్వరలోనే ఆది నుంచి రాబోతున్న కొత్త ప్రాజెక్టుల వివరాలు అధికారికంగా ప్రకటించనున్నారు. -
మత్స్యకారులకు హెల్త్‌కార్డులు ఇవ్వాలి
సాక్షి, హైదరాబాద్: తమకు రూ.10 లక్షల కవరేజీతో హెల్త్‌కార్డులు ఇవ్వాలని మత్స్యకారులు చేపట్టిన ఆందోళన అసెంబ్లీ సమీపంలో ఉద్రిక్తతకు దారి తీసింది. మత్స్యకారులను ఆదుకోవాలంటూ టీపీసీసీ ఫిషర్మెన్ సెల్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ ఆధ్వర్యంలో శనివారం జరిగిన ఈ కార్యక్రమాన్ని పోలీసులు ముందుగా అంచనా వేయలేకపోయారని చెపుతున్నారు. అనూహ్యంగా ఆటోలో అసెంబ్లీ ముందుకు వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలు, మత్స్యకారులు ప్రభుత్వానికి వ్యతి రేకంగా నినాదాలు చేశారు. వెంటనే పోలీసులు అప్రమత్తమై వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా మెట్టు సాయి కుమార్ మాట్లాడుతూ మత్స్యకారులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని, రూ.10 లక్షల కవరేజీతో హెల్త్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. -
అది అందరికీ అర్థం కాని పెద్ద పజిల్: ఆది సాయికుమార్
‘‘ప్రస్తుతం ప్రేక్షకులు ఎలాంటి కంటెంట్‌ను ఇష్టపడుతున్నారన్న విషయం అంచనాలకు అందడంలేదన్న మాటలను నేనూ వింటున్నాను. ఓ సినిమా సెంట్రల్ ఐడియా కొత్తగా ఉందంటే సగం పాసైయినట్లే అని నమ్ముతాను’’ అని హీరో ఆది సాయికుమార్ అన్నారు. ఆది సాయికుమార్, రియా సుమన్ జంటగా కె. శశికాంత్ దర్శకత్వంలో కేవీ శ్రీధర్ రెడ్డి నిర్మించిన ‘టాప్‌గేర్’ ఈ నెల 30న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఆది సాయికుమార్ చెప్పిన విశేషాలు. ► ఒక్కరోజులో జరిగే కథతో రూపొందిన చిత్రం ‘టాప్ గేర్’. ఏ మాత్రం తనకు సంబంధం లేని ఓ సమస్యలో ఇరుక్కునే ఓ క్యాబ్ డ్రైవర్ అందులో నుంచి ఎలా బయటపడతాడు? అనేది ఈ సినిమా కథనం. మేజర్ షూటింగ్ అంతా కారులోనే చేశాం. స్క్రీన్‌ప్లే రేసీగా సాగుతుంది. నా గత చిత్రాల మాదిరిగానే ‘టాప్ గేర్’ కూడా టెక్నికల్‌గా చాలా స్ట్రాంగ్ ఫిల్మ్. నా ప్రతి సినిమాకు నేను వంద శాతం కష్టపడుతూనే ఉన్నాను. నా సినిమా లను గమనిస్తే అందులోని ప్రధానాంశం కచ్చితంగా కొత్తగా ఉంటుంది. ‘టాప్‌గేర్’ కూడా అలాంటి కథాంశమే. ► ప్రస్తుతం మాస్ యాక్షన్ ఫిల్మ్ నిర్వచనం మారింది. ఇప్పుడు ఎక్కువగా ‘కేజీఎఫ్’లాంటి స్టయిలిష్ యాక్షన్ ఫిలింస్‌ని చూస్తున్నారు. భవిష్యత్‌లో నేనూ ఓ స్టైలిష్ యాక్షన్ ఫిలిం చేస్తాను. ► థియేటర్స్‌లో ఓ హిట్ సాధించడం అనేది అందరికీ ఓ సవాలుగా మారింది. రీసెంట్గా విడుదలైన నా ‘క్రేజీ ఫెలో’ చిత్రం మంచి బజ్‌ను క్రియేట్ చేసుకుంది. కానీ మా సినిమా విడుదలైన మర్నాడే కన్నడ ‘కాంతార’ తెలుగులో విడుదలైంది. ఆ సినిమా ఫ్లోలో మా సినిమాకు ప్రేక్షకుల ఆదరణ దక్కలేదు. బహుశా.. రాంగ్ రిలీజ్ డేట్ కావొచ్చు. ఇలాంటి ఎంటర్టైనింగ్ సినిమాలను ఆడియన్స్ ఓటీటీలోనే చూడాలని ఫిక్స్ అయ్యారో లేదా థియేట్రికల్ మూవీ అంటే ఏదో ఎక్స్ట్రార్డినరీ కంటెంట్ ఉండాలని ఫిక్స్ అయ్యారా? అన్నది ఇప్పుడు అందరికీ అర్థం కాని పెద్ద పజిల్. ► ప్రస్తుతానికి నెగటివ్ రోల్స్ చేయాలనుకోవడం లేదు. ఏదైనా అద్భుతమైన స్క్రిప్ట్ వస్తే అప్పుడు ఆలోచిస్తాను. ప్రస్తుతం లక్కీ మీడియాలో ఓ సినిమా చేస్తున్నాను. ‘పులిమేక’ వెబ్ సిరీస్ చేశాను. త్వరలో జీ5లో స్ట్రీమింగ్ కానుంది. ► నాన్నగారు చేసిన ‘అసలేం గుర్తుకురాదు..’ (‘అంతఃపురం’) సినిమా పాటను రీమిక్స్ చేయా లని ఉంది. అయితే నా సినిమాలో ఆ పాటకు తగ్గ సందర్భం కుదరాలి. ఒకవేళ రీమిక్స్ చేస్తే దర్శకుడు కృష్ణవంశీగారే తీయాలి. -
కృష్ణ మృతి పట్ల నటుడు సాయి కుమార్ సంతాపం
-
మాటలకు అందని విషాదం ఇది: కృష్ణ మృతిపై చిరంజీవి దిగ్భ్రాంతి
సూపర్ స్టార్ కృష్ణ మృతితో సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. కొంతకాలంగా శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం (నవంబర్ 15) తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు.ఆయన మరణారవార్తతో సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. ఆయన మృతికి సినీ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, డైరెక్టర్ గొపిచంద్ మలినేని, హీరో నాని, నటుడు పవన్ కల్యాణ్ ఇతర నటీనటులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. (చదవండి: ఎన్నో ప్రయోగాలు.. మరెన్నో రికార్డులు..కృష్ణని ఎవరూ బీట్ చేయలేరేమో!) ఈ మేరకు చిరంజీవి ట్వీట్ చేస్తూ.. ‘మాటలకు అందని విషాదం ఇది. సూపర్ స్టార్ కృష్ణ గారు మనల్ని వదిలి వెళ్లిపోవడం నమ్మశక్యం కావడం లేదు. ఆయన మంచి మనసు గలిగిన హిమాలయ పర్వతం. సాహసానికి ఊపిరి, ధైర్యానికి పర్యాయపదం. ధైర్యం, సాహసం, పట్టుదల, మానవత్వం, మంచితనం.. వీటి కలబోత కృష్ణ గారు. అటువంటి మహా మనిషి తెలుగు సినీ పరిశ్రమలోనే కాదు, భారత సినీపరిశ్రమలోనే అరుదు. తెలుగు సినీ పరిశ్రమ సగర్వంగా తలెత్తుకోగల అనేక సాహసాలు చేసిన కృష్ణ గారికి అశ్రు నివాళి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకొంటూ నా సోదరుడు మహేష్ బాబుకు, ఆయన కుటుంబ సభ్యులందరికీ,అసంఖ్యాకమైన ఆయన అభిమానులకి నా ప్రగాఢ సంతాపం, సానుభూతి తెలియ చేసుకొంటున్నాను.. అంటూ మెగాస్టార్ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు. pic.twitter.com/B0FI5lAEYf — Chiranjeevi Konidela (@KChiruTweets) November 15, 2022 ఆయన కోలుకుని వస్తారనుకున్నా: పవన్ కల్యాణ్ కృష్ణ మృతిపై నటుడు పవన్ కల్యాణ్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలంటూ నివాళులు అర్పించారు. ‘చిత్రసీమలో సూపర్ స్టార్ బిరుదుకి సార్థకత చేకూర్చిన నటులు కృష్ణ గారు. ఆయన మరణించారనే విషయం ఎంతో ఆవేదన కలిగించింది. కృష్ణ గారు అస్వస్థతతో ఆసుపత్రిలో చేరారని తెలిశాక కోలుకొంటారని ఆశించాను. ఇప్పుడు ఈ విషాద వార్త వినాల్సి వచ్చింది. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను’ అని అన్నారు. ఆయన మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది: బాలకృష్ణ అలాగే నందమూరి హీరో బాలకృష్ణ కూడా కృష్ణ మృతిపై స్పందించారు. ఘట్టమనేని కృష్ణ గారి మరణం తీవ్ర దిగ్బ్రాంతిని కలిగించిందంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ‘కృష్ణ గారు తన నటనతో చిత్రసీమలో సరికొత్త ఒరవళ్ళు సృష్టించి ఎనలేని ఖ్యాతి సంపాదించి ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకున్నారు. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా స్టూడియో అధినేతగా చిత్ర పరిశ్రమకు ఆయన అందించిన సేవలు మరువలేనివి. కృష్ణగారితో మా కుటుంబానికి ఎంతో అనుబంధం ఉంది. నాన్నగారు, కృష్ణ గారు కలసి అనేక చిత్రాలకు పని చేశారు. ఆయనతో కలిసి నేను నటించడం మర్చిపోలేని అనుభూతి. కృష్ణ గారు లేనిలోటు సినీ పరిశ్రమకూ, అభిమానులకు ఎప్పటికీ తీరనిది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నాను. ఇటివలే సోదరుడు రమేష్ బాబుని, మాతృమూర్తి ఇందిరాదేవిని కోల్పోయి దుఃఖంలో ఉన్న నా సోదరుడు మహేష్ బాబుకు ఈ కష్టం కాలంలో దేవుడు మనో ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటూ.. ఆయన కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను’ అంటూ ప్రకటన విడుదల చేశారు. A Fearless man who attempted every genre!! The original cowboy of Telugu films!! I could sit with him for hours which were filled with his positivity😊 the man the legend the superstar!!#RIPSuperStarKrishnaGaru we will miss you🙏🙏🙏 pic.twitter.com/ccJlBP1CZd — Nagarjuna Akkineni (@iamnagarjuna) November 15, 2022 సూపర్ స్టార్ కృష్ణ మృతి సీనియర్ హీరో, నటుడు సాయి కుమార్ విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఓ విడుదల చేస్తూ కృష్ణ మృతికి సంతాపం ప్రకటించారు. ‘ఆయన ఒక పరంపర, ఒక సంచలనం, రికార్డుల గని, నిర్మాతల హీరో, చక్కని రూపశీలి, ఎన్నో ప్రయోగాలు చేసిన సాహసి, జనం మనిషి, అందరు నచ్చే మేచ్చే మహా మనిషి, ఆయనే మన డేరింగ్ అండ్ డాషింగ్ హీరో సూపర్ స్టార్ శ్రీ ఘట్టమనేని కృష్ణగారు. కృష్ణగారి కథ ఒక చరిత్ర.. ఆ కథ ఈ రోజుతో ఆగింది. కానీ.. చరిత్ర మాత్రం ఎప్పటికీ సువర్ణాక్షరాలతో ఎప్పుడు వెండితెరపై నిలిచే ఉంటుంది. మన గుండెలో ఉంటుంది. వారి కుటుంబానికి ప్రగాఢ సానూభూతి తెలియజేస్తూ.. ఆయన ఆత్మకు శాంతి కలగాలని.. ఆయన కుటుంబానికి, అభిమానులకు భగవంతుడు ఆత్మస్థైరాన్ని ఇవ్వాలని కోరుకుంటూ జై సూపర్ స్టార్’ అని సాయి కుమార్ నివాళులు అర్పించారు. Heart broken by the demise of Krishna garu. His contribution to the Telugu cinema industry cannot be described in words . A true Superstar by all means . My deepest condolences to his family , well wishers & fans. May his beautiful soul rest in peace. #SuperStarKrishna garu pic.twitter.com/eFhvkTa6Rm — Allu Arjun (@alluarjun) November 15, 2022 Deeply pained to hear about Krishna garu's passing. A Superstar in every right, he stood tall and commanded attention on screen like no other. We will sorely miss him. Rest in peace, Sir. Sending love, light and strength to Mahesh and the family in this time of grief. pic.twitter.com/o3492JJEQX — Venkatesh Daggubati (@VenkyMama) November 15, 2022 Our prayers and respects to Krishna garu, sending lots of love and strength to @urstrulymahesh and family. It’s been a tough year for you brother.. We are with you! — Suriya Sivakumar (@Suriya_offl) November 15, 2022 SUPER STAR KRISHNA ⭐️ End of an era. My deepest condolences to @urstrulyMahesh sir,family and Krishna Gaaru’s extended family which includes you,me and every telugu cinema fan. 💔 — Nani (@NameisNani) November 15, 2022 Devastated on hearing the news of our Super Star Krishna Garu's Demise.. May his soul rest in peace. 🙏 Telugu Cinema lost a LEGEND 💔 My Deepest condolences to @urstrulyMahesh garu, family, fans and loved ones. pic.twitter.com/W6KKdtoQfH — Gopichandh Malineni (@megopichand) November 15, 2022 కృష్ణ గారు అంటే సాహసానికి మరో పేరు. ఎన్నో ప్రయోగాత్మక చిత్రాలు, విలక్షణమైన పాత్రలే కాకుండా, సాంకేతికంగా కూడా తెలుగు సినిమాకు ఎన్నో విధానాలు పరిచయం చేసిన మీ ఘనత ఎప్పటికి చిరస్మరణీయం. My thoughts are with Mahesh Anna and the family. Om Shanthi. Superstar forever. — Jr NTR (@tarak9999) November 15, 2022 Extremely saddened at the loss of #Superstarkrishna garu. can't imagine how tough this could be. Wishing all the strength to @urstrulymahesh anna and the family. May your soul RIP & you'll always be alive in our hearts sir. om shanti 🙏 pic.twitter.com/QoaBdFrSSI — Sai Dharam Tej (@IamSaiDharamTej) November 15, 2022 Deeply saddened on the passing of #KrishnaGaru a man who made a great mark as a #SuperStarKrishna . May his soul #RIPKrishnaGaru . My condolences to @urstrulyMahesh and family in these trying times🙏🙏🙏 pic.twitter.com/SZKWLoaHYF — Radikaa Sarathkumar (@realradikaa) November 15, 2022 This is Heart Breaking. Our SUPERSTAR KRISHNA Garu is no more. Legend 🙏🏽 Icon and Inspiration for Generations …. We will all Miss You sir . Praying for strength to the family @ManjulaOfficial , @urstrulyMahesh sir. May god be with you in this Testing time. pic.twitter.com/gm9OlQQYsL — Nikhil Siddhartha (@actor_Nikhil) November 15, 2022 సూపర్ స్టార్ కృష్ణ గారి ఆత్మకు శాంతి చేకూరాలి. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. Super Star Forever. — Kalyanram Nandamuri (@NANDAMURIKALYAN) November 15, 2022 Such a devastating loss to the entire film industry, What a Legend he was. I had the pleasure of working with him and a total privilege to know him personally. Rest in peace #SuperStarKrishna garu! Heartfelt condolences to Mahesh & family in this hour of grief. OM SHANTI 🙏 — Ravi Teja (@RaviTeja_offl) November 15, 2022 తెలుగు సినిమా చరిత్రలో మరో గొప్ప అధ్యాయం ముగిసింది... సూపర్ స్టార్ శ్రీ కృష్ణ గారి ఆత్మకు సద్గతి కలగాలని ప్రార్ధిస్తూ... వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢమైన సానుభూతి తెలియజేస్తున్నాను 🙏 — RamajogaiahSastry (@ramjowrites) November 15, 2022 Rest of peace dear ‘THE SUPERSTAR’ Krishna garu. Deep condolences to the entire family, All the Fans. It’s a huge loss. Love you Krishna garu. You will be greatly missed. pic.twitter.com/wp3RkPJNsu — Sunil (@Mee_Sunil) November 15, 2022 Shocking & Heartbreaking to hear abt d news of Super Star Sri.Krishna Garu🙏🏻 1 of d Biggest LEGENDS & PILLARS of our Cinema🙏🏻 The Most Humble Human Being.. May his soul rest in peace.. May God give Strength to dear @urstrulyMahesh sir & his Family🙏 pic.twitter.com/WVwvuUWKpS — DEVI SRI PRASAD (@ThisIsDSP) November 15, 2022 The demise of Krishna garu is a great loss to the Telugu film industry … working with him in 3 films are memories i will always cherish. My heartfelt condolences to his family …may his soul rest in peace @urstrulyMahesh — Rajinikanth (@rajinikanth) November 15, 2022 Deeply in grief on hearing that our only super star #Krishna garu is no more... yet he is with us. — Jaggu Bhai (@IamJagguBhai) November 15, 2022 కల చెదిరింది.. కధ మారింది.. కన్నీరే ఇక మిగిలింది... నా అభిమాన హీరో ఇక లేరు .. Rest in peace Super Star 🙏 pic.twitter.com/qWprJp3Pfi — KONA VENKAT (@konavenkat99) November 15, 2022 Saddened and shocked to know about the sudden demise of Daring and Dashing hero Legendry actor #SuperStarKrishna garu May his soul rest in peace. my deepest condolences and strength to @urstrulyMahesh garu & the entire family pic.twitter.com/uWLZUku8vf — Director Maruthi (@DirectorMaruthi) November 15, 2022 My heartfelt condolences to @urstrulyMahesh garu and the whole family. #RIPSuperStarKrishnaGaru 🙏 You will live forever in our memories pic.twitter.com/GG71Da2bae — Samantha (@Samanthaprabhu2) November 15, 2022 It's shocking to hear about the demise of #SuperStarKrishna garu 😞 God is being too ruthless with #MaheshBabu garu this year. Brother, mother & now the legend 🙏🏼 Deepest condolences to entire family. #RestInPeaceKrishnaGaru pic.twitter.com/jbBKfM52bH — Jani Master (@AlwaysJani) November 15, 2022 Deeply saddened to hear legendary actor Superstar #Krishna Garu is no more 💔 Prayers & strengths to @urstrulymahesh garu and family.#RIPKrishnaGaru #RIPSuperstarKrishna pic.twitter.com/ngJ3tDSw2B — Simran (@SimranbaggaOffc) November 15, 2022 Deepest condolences @urstrulyMahesh family, friends and fans #RIPKrishnaGaru https://t.co/5n8C0kDgJE — venkat prabhu (@vp_offl) November 15, 2022 What a tragic year it’s been. My deepest condolences to @urstrulyMahesh garu & family. TFI wouldn’t have been what it is today if not for your contribution SUPERSTAR.Thank you! Om Shanthi 🙏#RAPO pic.twitter.com/C2bjrQoceD — RAm POthineni (@ramsayz) November 15, 2022 #SuperStarKrishna garu one of the legendary actors of the telugu film industry is no more. Deeply saddened to hear about the demise. My heartfelt condolences to @urstrulyMahesh and the entire family. Superstar Krishna lives on. OM Shanthi🙏 pic.twitter.com/kcV9wwqubM — Manchu Lakshmi Prasanna (@LakshmiManchu) November 15, 2022 Dear @urstrulyMahesh, Krishna Garu entertained audiences worldwide for so many years & he will stay in our hearts forever. He was a super star who lived a complete life. Pls stay strong brother. It has been a very difficult year. My prayers and thoughts with you.#RIPKrishnaGaru — Karthi (@Karthi_Offl) November 15, 2022 An icon of Telugu cinema Krishna gaaru is no more, an era ends with his demise. I wish to share the grief of brother @urstrulyMahesh who has to bear this third emotional trauma of losing a mother, brother and now his father. My deepest condolence dear Mahesh gaaru. — Kamal Haasan (@ikamalhaasan) November 15, 2022 Deeply saddened to hear the demise of Legendary Superstar Krishna garu 💔 His contribution to Indian cinema will be remembered forever 🙏 My deepest condolences to @urstrulyMahesh garu , family and fans 🙏 Om Shanti 😢💐 pic.twitter.com/HmpPmV3dmc — Anushka Shetty (@MsAnushkaShetty) November 15, 2022 -
‘అమెజాన్’ లో ఆకట్టుకుంటున్న గంధర్వ
ఈ మధ్య రిలీజ్ అయిన చిన్న సినిమాల్లో తనదంటూ ఓ ప్రత్యేకత సంతరించుకున్న చిత్రం గంధర్వ . ఫన్ని ఫాక్స్ ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై దర్శకుడు అప్సర్ ని పరిచయం చేస్తూ సందీప్ మాధవ్ , గాయత్రీ ఆర్ సురేష్ జంటగా నటించిన చిత్రం గంధర్వ. ఈ చిత్రంలో సాయి కుమార్ , సురేష్ బాబు , బాబు మోహన్ , పోసాని , సమ్మెట గాంధీ , టెంపర్ వంశీ , సూర్య , పాల్ , జయరాం తదితరులు నటించారు. యాంటి ఏజింగ్ కాన్సెప్ట్ పై చేసిన కొత్త ప్రయోగం విమర్శకులను సైతం మెప్పించింది . ఒక సంఘటనలో ఆక్సిజన్ చాంబర్ లో ఇరుక్కు పోయిన కథా నాయకుడికి కళ్ళు తెరిచే సరికి యాభై ఏళ్ళు గడిచి పోతాయి . కాని అతని వయసు మాత్రం మారాదు . తిరిగి ఇంటికి చేరుకున్న హీరో కి తన భార్య డెబ్భై ఏళ్ల ముసలావిడ గా కొడుకు యాభై ఏళ్ల వ్యక్తిగా కలుస్తారు. అసలు అతనికి జరిగిన సంఘటన ఏంటీ , ఆక్సిజన్ చాంబర్ కథ ఎలా సాగింది, పాతికేళ్ళ తండ్రికి యాభై ఏళ్ల కొడుకుకి మధ్య జరిగిన యుద్ధం ఏమిటీ , అసలు ప్రపంచం ఎలా నమ్మింది అనే కథాంశంతో దర్శకుడు అప్సర్ తన తొలి ప్రయత్నం లోనే భారి స్పాన్ ఉన్న కథ ఎంచుకున్నాడు. జూలై 8 న థియేటర్లలో రిలీజ్ అయిన గంధర్వ మంచి మార్కులే కొట్టేసింది . అయితే తాజాగా ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ లో సైతం తన హవా కొనసాగిస్తుంది . అది చూసిన నిర్మాణ సంస్థ వెంటనే ఈ చిత్రాన్ని అటు తమిళ్ , మలయాళం మరియు కన్నడ భాషల్లో కూడా ఈ నెల ఆఖరున రిలీజ్ చేసే పనుల్లో పడ్డారు. ఏది ఏమైనా కొత్త కథ తో అందర్నీ ఆకట్టుకున్న దర్శకుడు అప్సర్ , ప్రస్తుతం ఒక పెద్ద నిర్మాణ సంస్థ కోసం కథ రెడి చేస్తున్నట్టు సమాచారం. -
జెలసీ చూపిస్తున్న అనసూయ
అనసూయ భరద్వాజ్, సాయి కుమార్, సుమన్, ఆమని, శ్రీకాంత్ అయ్యంగార్, వైవా హర్ష, శ్రీనివాస రెడ్డి, చమ్మక్ చంద్ర ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం "అరి". మై నేమ్ ఈజ్ నో బడీ అనేది ఉప శీర్షిక. ఈ సినిమాకు పెట్టుకున్న బ్యాడ్ ఈజ్ న్యూ గుడ్ అనే క్యాప్షన్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసేలా ఉంది. ఆర్వీ రెడ్డి సమర్పణలో అర్వీ సినిమాస్ పతాకంపై శ్రీనివాస్ రామిరెడ్డి, శేషు మారంరెడ్డి నిర్మిస్తున్నారు. పేపర్ బాయ్ ఫేమ్ జయశంకర్ రూపొందిస్తున్నారు. తాజాగా ఈ సినిమాలోని పాత్రలనును రివీల్ చేశారు. జెలసీ పాత్రలో అనసూయ, ప్రైడ్‌గా సాయి కుమార్, ఆంగర్ క్యారెక్టర్లో శ్రీకాంత్ అయ్యంగార్, లస్ట్‌గా వైవా హర్ష, గ్రీడీ పాత్రలో శుభలేఖ సుధాకర్, అటాచ్ మెంట్ క్యారెక్టర్లో సురభి ప్రభావతి నటిస్తున్నారు. వీరి క్యారెక్టర్ ఫస్ట్ లుక్స్ కొత్తగా ఉన్నాయి. మనిషి ఎలా బతకకూడదు అనే విషయాన్ని ఈ సినిమా ద్వారా ఆసక్తికరంగా చూపిస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న అరి విడుదల తేదీని త్వరలో ప్రకటించనున్నారు. చదవండి: అతడు నాకేమీ కాడు, ఆయన్ని బతకనీయండి: రాఖీ దగా.. మోసం.. భర్తను కాదని అతడికి మెరీనా సపోర్ట్ -
బిగ్‌బాస్ బ్యూటీ నందిని బర్త్‌డే సెలబ్రేషన్స్, టాలీవుడ్ తారల సందడి
బిగ్‌బాస్ ఫేం, హీరోయిన్ నందిని రాయ్ బర్త్‌డే సెలెబ్రేషన్స్ ఘనంగా జరిగాయి. నిన్న(సెప్టెంబర్ 18) ఆమె పుట్టిన రోజు. ఈ సందర్భంగా టాలీవుడ్ సినీ సెలబ్రెటీలు, బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్స్ మధ్య ఆమె బర్త్‌డే వేడుక జరిగింది. ఆదివారం సాయంత్రం జరిగిన ఈ బర్త్‌డే సెలబ్రెషన్స్‌లో నటుడు సాయి కుమార్, వరుణ్ సందేశ్, రాజ్ తరుణ్, తనిష్, బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్ సోహెల్, రాహుల్ సిప్లిగంజ్, లహరి శారి, యాంకర్, నటి భాను శ్రీ, వైవా హర్ష, పూజిత, చాందినీ చౌదరి, దర్శకులు సతీష్, కృష్ణ, రఘులు హాజరయ్యారు. ఇక వారందరి సమక్షంలో కేక్ కట్ చేసి తన కోసం వచ్చిన వారందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సంతోషం వ్యక్తం చేసింది ఆమె. ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి కాగా నందిని రాయ్.. అతి చిన్న వయసులోనే మోడల్‌గా కెరీర్ ప్రారంభించింది. ఈ క్రమంలో పలు అందాల పోటీల్లో పాల్గొన్న ఆమె తక్కువ సమయంలోనే మోడల్‌గా మంచి గుర్తింపు పొందింది. 2011లో వచ్చిన 040 అనే చిత్రంలో సినీరంగ ప్రవేశం చేసిన ఆమె ఆ తర్వాతా మాయ, ఖుషి ఖుషిగా, మోసగాళ్లకు మోసగాడు, సిల్లీ ఫెలోస్, శివరంజని వంటి హిట్ చిత్రాల్లో నటించింది.ఈ క్రమంలో బిగ్‌బాస్ 2 సీజన్లో పాల్గొని ఆడియన్స్‌కు మరింత దగ్గరైంది. బిగ్‌బాస్ అనంతరం వరుస ఆఫర్లు కొట్టేసి బిజీగా మారింది నందిని. ఇటీవల ఆమె సాయికుమార్, సీనియర్ నటి రాధిక శరత్ కుమార్‌లు ప్రధాన పాత్రలో వచ్చిన గాలివాన వెబ్ సిరీస్‌లో నటించి తన నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. -
ఆకట్టుకుంటున్న ‘నా మాటే వినవా’ టీజర్
కమెడియన్ గౌతమ్ రాజు తనయుడు కృష్ణ హీరోగా శివానీ ఆర్ట్స్, పీఎస్ మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం నా మాటే వినవా. శ్రీనివాస్ యాదవ్, పి వినయ్ కుమార్ కలిసి నిర్మించిన ఈ చిత్రానికి నంది అవార్డు గ్రహీత వేముగంటి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో కృష్ణ సరసన కిరణ్ చేత్వాణి హీరోయిన్గా నటించారు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలను మేకర్లు మొదలుపెట్టారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన టీజర్‌ను విడుదల చేశారు. ‘పెళ్లి తరువాత బేదాభిప్రాయాలతో విడిపోవడం కన్నా.. పెళ్లికి ముందు మనం ఒక అండర్‌స్టాండింగ్‌కు రావడం మంచిదని నా ఆలోచన’ అంటూ హీరోయిన్ చెప్పే డైలాగ్‌తో టీజర్ మొదలవుతుంది. మనిద్దరం ఒకే రూంలో ఉంటున్నామని హీరోయిన్ అనడం..కానీ మనం వయసులో ఉన్నాం.. కొంచెం కష్టమంటూ హీరో కొంటెగా చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటుంది. ఇక చివర్లో సాయి కుమార్ చెప్పిన ‘ఆధునికత మంచిదే కానీ నాగరికతను మరిచిపోకూడదు.. వాయిస్ నాది చాయిస్ మీది’ డైలాగ్స్ సినిమాలోని ఎమోషన్‌ను తెలియజేస్తోంది. రొమాన్స్, యాక్షన్, యూత్ అండ్ ఫ్యామిలీ ఆడియెన్స్ ఇలా అన్ని వర్గాలను అలరించేలా మా చిత్రం ఉటుందని మేకర్స్ తెలిపారు. మహవీర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. -
నేనేం స్టార్ కిడ్‌ను కాదు, మూడేళ్ల తర్వాత..: పాయల్ రాజ్‌పుత్
మూడు విభిన్న పాత్రలో ఆది సాయి కుమార్, పాయల్ రాజ్‌పుత్ జోడిగా నటించిన తాజా చిత్రం తీస్ మార్ ఖాన్. 'నాటకం' వంటి సినిమాను తెరకెక్కించిన కల్యాణ్ జి గోగణ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ మూవీ ఆగస్ట్ 19న విడుదల కానున్న సందర్బంగా చిత్ర యూనిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా సాయి కుమార్ మాట్లాడుతూ.. ''అడగ్గానే వచ్చిన మా మేజర్ (అడివి శేష్)కు సెల్యూట్. మా డీజే (సిద్దు జొన్నలగడ్డ) ఇలా రావడం ఆనందంగా ఉంది. నేను, సుధీర్ బాబు కలిసి మళ్లీ తండ్రీ కొడుకుల్లా నటించబోతోన్నాం. మా అబ్బాయి నటించిన ప్రేమ కావాలి అంటూ వచ్చాడు. ఇప్పుడు తీస్ మార్ ఖాన్ అంటూ ముందుకు రాబోతోన్నాడు. ఈ టీం అందరికీ థాంక్స్. ఇంత మంది మంచి మనుషులు కలిసి ఈ సినిమాను తీశారు. ఈ ఏడాదితో నాకు నటుడిగా 50 ఏళ్లు వస్తాయి. అందరూ బాగుండాలి.. అందులో మనముండాలి.. అన్ని సినిమాలు బాగుండాలి.. అందులో మన సినిమా కూడా ఉండాలి. మీ ఆశీర్వాదంతో తీస్ మార్ ఖాన్ సినిమా కూడా విజయం సాధించాలి'' అని తెలిపారు. ఆది సాయి కుమార్ మాట్లాడుతూ.. ‘పిలవగానే ఈవెంట్‌కు వచ్చిన అడివి శేష్, సుధీర్ బాబు, సిద్దులకు థాంక్స్. సినిమాలో మంచి ఎమోషన్ ఉంటుంది. మంచి స్క్రిప్ట్. మీకు నచ్చితే ఓ పది మందికి చెప్పండి. పాయల్ మంచి సహనటి. సునీల్ అన్న చేసిన చక్రి అనే పాత్ర అద్భుతంగా ఉంటుంది. అందరూ అద్భుతంగా నటించారు. నన్ను కొత్తగా ప్రజెంట్ చేసిన కల్యాణ్‌కు థాంక్స్. ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా మా సినిమాను నిర్మించిన నాగం తిరుపతి రెడ్డి గారికి థాంక్స్. సాయి కార్తిక్ మంచి బీజీఎం ఇచ్చారు. మా కెమెరామెన్ బాలిరెడ్డి, ఫైట్ మాస్టర్ ఇలా పని చేసిన అందరికీ థాంక్స్. సినిమాను చూసి మమ్మల్ని ఆశీర్వదించండి’ అని పేర్కొన్నాడు. చదవండి: హైదరాబాద్ పోలీస్ అకాడమీలో నాజర్‌కు గాయాలు ! ''నన్ను ఇక్కడకు పిలిచిన సాయి కుమార్ గారికి థాంక్స్. ఇది వరకు ఆది చేసిన సినిమాలు అన్నింట్లో కెల్లా ఈ చిత్రంలో కొత్తగా అనిపిస్తున్నాడు. కారెక్టరైజేషన్ కొత్తగా అనిపిస్తుంది. డైరెక్టర్ కల్యాణ్ గారికి ఆ క్రెడిట్ ఇవ్వాలి. స్క్రీన్ మీద ఎంతో ఫ్రెష్‌గా కనిపిస్తుంది'' అని సిద్ధు జొన్నల గడ్డ తెలిపాడు. అడివి శేష్ మాట్లాడుతూ.. ‘తీస్ మార్ ఖాన్ సినిమా కుమ్మేయాలని కోరుకుంటున్నాను. సాయి కుమార్ గారు ఫోన్ చేసి రమ్మన్నారు. మా అమ్మ బర్త్ డే ఆగస్ట్ 19. ఈ చిత్రం సక్సెస్‌తో మా అమ్మకు గిఫ్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. సినిమా కోసం పని చేసిన అందరికీ ఆల్ ది బెస్ట్. ట్రైలర్లో ఆది కుమ్మేశాడు. సినిమాలోనూ కుమ్మేస్తాడు. పాయల్‌ను ఇలా కలవడం ఆనందంగా ఉంది. ఈ సినిమాను అందరూ థియేటర్లో చూడండి’ అని అన్నారు. చదవండి: సుమారు నాలుగేళ్ల తర్వాత అలా శ్రావణ భార్గవి! సుధీర్ బాబు మాట్లాడుతూ.. ''తీస్ మార్ ఖాన్ సినిమా ట్రైలర్, సాంగ్స్ అన్నీ కూడా బాగున్నాయి. పర్ఫెక్ట్ కమర్షియల్ టైటిల్. నేను ఆది కలిసి శమంతకమణి సినిమాను చేశాం. ఆయన అద్భుతమైన నటుడు. ఈ చిత్రం ఆదికి పర్ఫెక్ట్ సినిమా అనిపిస్తోంది. సాయి కుమార్ గారితో నేను భలే మంచిరోజు చిత్రాన్ని చేశాను. నాకు ఆయన ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్‌లో తండ్రిలాంటి వారు'' అని తెలిపాడు. ‘నేను ఈ రోజు చాలా సంతోషంగా ఉన్నాను. నా సినిమా రిలీజ్ అయ్యే టైంలో కాస్త నెర్వస్‌గా ఉంటాను. అది అందరికీ సహజంగానే ఉంటుంది. మా సినిమా టీజర్, ట్రైలర్, పాటలు అన్నింటికి విశేషమైన స్పందన వచ్చింది. మా సినిమాకు మీ ప్రేమ దక్కినందుకు మాకు సంతోషంగా ఉంది. నేనేం స్టార్ కిడ్‌ను కాదు. నేను ఏం చేసినా నా సొంతంగానే చేశాను. అది మీ ప్రేమ, అభిమానం వల్లే చేయగలిగాను. ఈ సినిమా నాకెంతో స్పెషల్. మూడేళ్ల తరువాత నా సినిమా థియేటర్లోకి వస్తోంది. ఈ చిత్రంలో ట్విస్ట్‌లు అద్భుతంగా ఉంటాయి’ అని హాట్ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ పేర్కొంది. -
72 ఏళ్ల వయసులో NTR పైనుంచి దూకారు: సాయి కుమార్
Sai Kumar About Gandharva Movie: సందీప్ మాధవ్, గాయ్రతి ఆర్. సురేష్ జంటగా నటించిన చిత్రం `గంధర్వ`. ఫన్నీ ఫాక్స్ ఎంటర్టైన్మెంట్ బేనర్ పై యఎస్.కె. ఫిలిమ్స్ సురేష్ కొండేటి సహకారంతో యాక్షన్ గ్రూప్ సమర్పిస్తున్న చిత్రమిది. అప్సర్ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ సుబాని నిర్మించారు. సెన్సార్ పూర్తయి జూలై 8న విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా గంధర్వలో కీలక పాత్ర పోషించిన డైలాగ్ కింగ్ సాయికుమార్ పాత్రికేయుల సమావేశంలో పలు విషయాలు తెలియజేశారు. గంధర్వ కథ చెప్పగానే మీరెలా ఫీలయ్యారు? దర్శకుడు అప్సర్ ఆర్మీ మనిషి. ఏదో కొత్తదనం ఆయనలో కనిపించింది. నాకు దర్శకుడు వీరశంకర్ ఫోన్ చేశాడు. అప్సర్ అనే కొత్త దర్శకుడు కథ చెబుతాడు వినమన్నారు. నేను ఈ మధ్య కన్నడలో `రంగీ తరంగా` చేశాను. ఆస్కార్ దాకా వెళ్లింది. నేను ఆ సినిమా చేశాక కొత్తవాడితో ఎలా చేశావ్! అని నన్ను చాలామంది అడిగారు. కథను నమ్మాను అన్నాను. అలాగే ఎస్.ఆర్. కళ్యాణమండపం కూడా అలానే జరిగింది. ఇప్పుడు గంధర్వ కథ కూడా అంతే. చాలా కొత్తగా కథ వుంది. మనసావాచా కర్మనా మన పని మనం చేసుకుంటూ పోతే తప్పకుండా హిట్ వస్తుంది. గంధర్వలోనూ అంతా కొత్తవారైనా కథలోని ఎమోషన్స్, ఫీలింగ్స్ చాలా అద్భుతంగా వున్నాయి. కలికాలంలో ఓ సీన్ వుంటుంది. నాన్న చనిపోయాడు అనుకుంటాం. తిరిగి వస్తే ఎలా వుంటుందనే ఆసక్తికరంగా అనిపిస్తుంది. గంధర్వలో అలానే వుంటుంది. ఈ పాయింట్‌ను దర్శకుడు అద్భుతంగా ప్రెజెంట్ చేశాడు. చాలా పాత్రలు పోషించిన మీకు గంధర్వ ఎంత మేరకు కొత్తగా అనిపించింది? నేను పోలీస్ స్టోరీ చేసి 25 ఏళ్లయింది. ఈరోజుకీ ఇంకా అదే ప్రేక్షకులు గుర్తుపెట్టుకుని పలుకరిస్తున్నారు. ఇప్పుడు సీక్వెల్ చేయడానికి కమల్ హాసన్ 'విక్రమ్' సినిమా కిక్ ఇచ్చింది. అండర్ ప్లే, డ్రామా.. ఇలా ప్రతీదీ నేను చేశాను. అలాంటి కొత్త ప్రయత్నమే గంధర్వ సినిమాలోని నా పాత్ర వుంటుంది. గంధర్వలో 1971-2021 అని వుంది. దానికి మీ పాత్రకు సంబంధం వుందా? నేను ఇంతకుముందు ఇప్పుడు చేయబోయే సినిమాలోని పాత్రలు కూడా భిన్నంగా చేస్తున్నవే. ధనుష్ చిత్రం `సర్`లో నెగెటివ్ పాత్ర చేస్తున్నా. అలాగే దసరాలో ఊహించని ట్విస్ట్ నా పాత్రలో వుంటుంది. ఇప్పుడు గంధర్వలో కూడా ఎవరూ ఊహించని ట్విస్ట్ నా పాత్రలో వుంది. నేను పొలిటీషియన్. సీఎం అవ్వాలనుకుంటాను. సరిగ్గా ఆ టైంలో నా తండ్రి అంటూ సందీప్ మాధవ్ నా జీవితంలోకి వస్తాడు. తను యంగ్‌గా వుంటాడు. మా అమ్మకు, ఈయనకు వున్న రిలేషన్ ఏమిటని. మీడియా హైలైట్ చేస్తుంది. కథలో ట్విస్ట్ అదే. 1971-2021 టైం ట్రావెల్లో జరిగే కథ కాబట్టి అలా పెట్టారు. గంధర్వ చూశారు కదా ఎలా అనిపించింది? ఇప్పటి జనరేషన్ ప్రతీదీ పరిశీలిస్తున్నారు. మేథావుల్లా ఆలోచిస్తున్నారు. కంటెన్యూటీకూడా వేలెత్తి చూపిస్తున్నారు. అందుకే కథను ముగింపులో చాలా జాగ్రత్తగా చెప్పాలని దర్శకుడితో అన్నాను. ఎక్కడా లాజిక్ మిస్ కాకుండా సినిమాటిక్‌గా ఒప్పించగలగాలి. క్లైమాక్స్‌లో సైంటిఫిక్‌గా వుంటూనే అందరినీ మెప్పించేలా చేశాడని నేను సురేష్ కొండేటి ద్వారా విన్నాను. ఆయన సినిమా చూసి సూపర్‌డూపర్ హిట్ అవుతుందన్నారు. ఇదే అభిప్రాయాన్ని డబ్బింగ్ చెప్పినవాళ్లు, సందీప్ మాధవ్, జయసింహ కూడా చెప్పారు. ఇంటర్వెల్లో మంచి ట్విస్ట్ వుంటుంది. ఇందులో అన్ని ఎమోషన్స్ వుంటాయి. ఓ పజిల్ కూడా వుంటుంది. సేమ్ మా నాన్నలా వుండే సందీప్‌ను చూసి మనిషిని పోలిన మనుషులు ఏడుగురు వుంటారనుకుంటాం. అనేది లాజిక్‌గా దర్శకుడు ముడివిప్పిన విధానం చాలా బాగుంది. ఈ జనరేషన్ హీరోలతో నటించడం ఎలా అనిపిస్తుంది? సందీప్ చేసిన గత సినిమాలు చూశాను. చాలా టాలెంటెడ్. కొత్త జనరేషన్ అయిన సత్యదేవ్, ప్రియదర్శితో నేను చేస్తున్నా. వారి నటనకు అనుగుణంగా నేను మార్చుకుని చేస్తున్నా. అలాగే గంధర్వలో సందీప్‌తో చేశా. టైటిల్‌కు తగ్గట్టు కొత్త కాన్సెప్ట్ ఫిలిం. ఇన్నేళ్ల కెరీర్లో చేయని పాత్రలేదు. ఇంకా కొరత వుందా? నేను నాటకాలు వేసే నాటినుంచి మేకప్ వేసుకుని ఇప్పటికి 50 ఏళ్లయింది. నటుడిగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా యాభై ఏళ్ల ప్రస్థానం నాది. కొన్ని సినిమాలు చూసినప్పుడు ఇంకా ఏదో చేయాలని నటుడిగా అనిపిస్తుంది. నటుడికి సంతృప్తి వుండదు. మేజర్ చంద్రకాంత్ షూట్లో ఎన్టీఆర్‌కు 72 ఏళ్లు. ఆ వయస్సులో ఆయన ఓ సీన్లో పైనుంచి దూకాలి. డూప్‌లేకుండా దూకేస్తానని చేసేశాడు. నటుడిగా అంత డెడికేషన్ వుండాలి. నేను నేర్చుకుంది అదే. కన్నడలో కామెడీ చేశాను. ఇటీవలే పౌరాణికంలో దుర్యోధనుడిగా నటించాను. ఇంకా పలు భిన్నమైన పాత్రలు చేయాలనుంది. కొత్త చిత్రాలు? తమిళంలో `డీజిల్` సినిమా చేస్తున్నా. అందులో డీజిల్ మాఫియా లీడర్‌గా నటిస్తున్నా. ఇందులో మూడు గెటప్లుంటాయి. ఇంకా ఓ వెబ్ సీరీస్ చేయబోతున్నా. -
గంధర్వ: సునీత పాడిన ఏమైందో ఏమో.. లిరికల్ సాంగ్ విన్నారా?
సందీప్ మాధవ్, గాయ్రతి ఆర్.సురేష్ జంటగా నటిస్తున్న చిత్రం `గంధర్వ`. ఫన్నీ ఫాక్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై ఎస్.కె. ఫిలిమ్స్ సహకారంతో యాక్షన్ గ్రూప్ సమర్పిస్తున్న చిత్రమిది. ఆదివారంనాడు బాబూ మోహన్ గంధర్వ చిత్ర పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మూవీని జూలై 1న విడుదల చేస్తున్నట్లు హీరో సందీప్ మాధవ్ ప్రకటించగా ఏమైందో ఏమో.. లిరికల్ సాంగ్ వీడియోను హీరో సాయికుమార్ విడుదల చేశారు. ఈ పాటను సింగర్ సునీత ఆలపించింది. అనంతరం బాబూ మోహన్ మాట్లాడుతూ, మాకు కోడిరామకృష్ణ గురువు. ఆ తర్వాత మా సోదరుడు వీరశంకర్. ఎందుకనో ఆయనకు నామీద కోపం. నాకు ఏ సినిమా ఇవ్వలేదు. అయితే ఈ సినిమా పూజరోజు వీరశంకర్ సినిమా చేస్తున్నాడనిపించింది. కానీ ఆ తర్వాత చెప్పారు కొత్త దర్శకుడు అప్సర్ చేస్తున్నాడని. చిత్ర కథలోని పాయింట్ కొత్తది. చెప్పడం వేరు, తీయడం వేరు. సెట్లో ఎక్కడా టెన్షన్ పడలేదు. అనున్నది అనుకున్నట్లు తీశాడు అని తెలిపారు. సాయికుమార్ మాట్లాడుతూ, ఈ మధ్య దేశభక్తి చిత్రాలు సూపర్ హిట్ అవుతున్నాయి. వాటిలో ఎమోషన్స్ బాగా పండుతుంది. మొన్న విడుదలైన మేజర్, విక్రమ్ అందుకు ఉదాహరణలు. ఇక దర్శకుడు వీరశంకర్గారు గంధర్వ కథను నా దగ్గరకు తీసుకువచ్చారు. సందీప్‌తో చేయడం గాప్పగా ఫీలవుతున్నాను. గంధర్వ టైటిల్లో చూపించినట్లుగా 1971-2021 కథ. అయితే నా సినీ కెరీర్కూడా 1972 నుంచి ఇంకా కొనసాగుతుంది. నా ఫిలిం కెరీర్ యాభై ఏళ్ళ జర్నీలో గంధర్వ విడుదల కావడం ఆనందంగా వుంది. ఇందులో ప్రధానమైన పాత్ర పోషించాను. కథే చాలా కొత్త పాయింట్. ఇండియన్ తెరపై ఇప్పటివరకు రాని పాయింట్. ఇలాంటివి చెప్పడం ఈజీ. తీయడం కష్టం. దర్శకుడు అప్సర్ బాగా తీశాడు. దర్శకుడు మిలట్రీ మనిషి కాబట్టి నాతో కూడా యాక్షన్ చేయించాడు. అన్ని సినిమాలు బాగుండాలి. అందులో మా సినిమా వుండాలి అన్నారు. -
‘వన్ బై టు’మూవీ రివ్యూ
టైటిల్: వన్ బై టు నటీనటులు: సాయి కుమార్, ఆనంద్, శ్రీ పల్లవి , కాశీ విశ్వనాథ్, దేవీ ప్రసాద్ తదితరులు నిర్మాణ సంస్థ : చెర్రీ క్రియేటివ్ వర్క్స్ నిర్మాత: శ్రీనివాసరావు దర్శకుడు: శివ ఏటూరి సంగీతం: లియాండర్ లీమార్టీ & ఆదేశ్ రవి బ్యాక్ గ్రౌండ్ స్కోర్: సందీప్ కుమార్ కానుగల ఎడిటర్: జేపీ విడుదల తేది: ఏప్రిల్ 22,2022 గత రెండు నెలలుగా టాలీవుడ్లో పెద్ద సినిమాల హవే నడుస్తోంది. రాధేశ్యామ్ మొదలుకొని ఆర్ఆర్ఆర్, కేజీయఫ్2.. ఇలా వరుస పాన్ ఇండియా చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రావడంతో చిన్న చిత్రాలు కాస్త వెనకడుగు వేశాయి. పాన్ ఇండియా ఫీవర్ ఇప్పుడు కాస్త తగ్గడంతో ఈ శుక్రవారం(ఏప్రిల్ 22) చిన్న సినిమాలు థియేటర్స్‌లో సందడి చేయడానికి వచ్చేశాయి. ఈ వారం టాలీవుడ్లో నాలుగైదు చిన్న సినిమాలు విడుదలయ్యాయి. వాటిలో ఒకటి ‘వన్ బై టు’. డైలాగ్ కింగ్ సాయి కుమార్ కీలక పాత్ర పోషించడం, టైటిల్ కూడా కాస్త డిఫరెంట్‌గా ఉండడంతో ‘వన్ బై టు’పై ఆసక్తి పెరిగింది. నేడు థియేటర్స్‌లో విడుదలైన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఏ మేరకు ఆదరించారు? రివ్యూలో చూద్దాం. కథేంటంటే..? హైదరాబాద్‌కు చెందిన పాండు(ఆనంద్) ఓ మధ్యతరగతికి చెందిన యువకుడు. జులాయిగా తిరుగుతూ.. తన కాలనీలోని అమ్మాయిలందరికి సైట్ కొడుతుంటాడు. అదే కాలనీకి తండ్రితో కలిసి వస్తుంది జెన్నీ(శ్రీపల్లవి). ఇంకేముంది.. ఆవారాగా తిరిగే పాండు.. జెన్నీ చూసి ప్రేమలో పడిపోతాడు. అందరి అమ్మాయిలను టైంపాస్‌గా లవ్ చేసే పాండు.. జెన్నీని మాత్రం సీరియస్‌గా ప్రేమిస్తాడు. కానీ జెన్నీ మాత్రం మొదట్లో పట్టించుకోకపోయినా... చివరకు పాండు ప్రేమను అంగీకరిస్తుంది. అదే సమయంలో తనకు సంబంధించిన ఓ నిజాన్ని చెబుతుంది. అది విన్నాక పాండు జెన్నీని వదిలించుకునేందుకు ప్రయత్నిస్తాడు. అసలు జెన్నీ చెప్పిన నిజం ఏంటి? ప్రేమించిన అమ్మాయిని పాండు ఎందుకు వదులుకోవాలనుకున్నాడు? అసలు ఈ కథకు ‘వన్ బై టు’అనే టైటిల్ ఎందుకు పెట్టారో తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. ఇది ఒక వైలెంట్ లవ్ స్టొరీ అని చెప్పొచ్చు. దర్శకుడు శివ ఏటూరి ఓ ఢిఫెరెంట్ పాయింట్‌ని ఎంచుకొని ఆసక్తికరంగా సినిమాను తెరకెక్కించే ప్రయత్నం చేశాడు. అందులో కొంతవరకు సఫలీకృతుడయ్యాడనే చెప్పాలి. హిజ్రాలను బాధలను తెరపై చక్కగా చూపించాడు. తమిళ సినిమాల మాదిరి పాత్రలన్నీ చాలా నేచురల్‌గా కనిపిస్తాయి. ఫస్టాఫ్ అంతా సాదాసీదాగా సాగుతుంది. సెకండాఫ్‌లో కథనం ఆసక్తికరంగా సాగుతుంది. సెకండాఫ్ స్టార్టింగ్‌లోనే ప్రేక్షకులకు ఓ భారీ ట్విస్ట్ ఇచ్చి షాకిచ్చాడు దర్శకుడు. ఆ తర్వాత హీరో పరిస్థితి ఏంటి? ఇప్పుడేం చేస్తాడు? అనే క్యూరియాసిటీ సినిమా చూస్తున్న ప్రేక్షకుడికి కలుగుతుంది. అయితే మధ్యలో వచ్చే కొన్ని సీన్స్ కథకి అడ్డంకిగా అనిపిస్తాయి. బస్‌లో హిజ్రాని ఏడిపించే సీన్ చాలా సినిమాటిక్‌గా అనిపిస్తుంది. ఆకతాయిలను హీరో కొట్టకముందే.. హిజ్రా అతన్ని మెచ్చుకోవడం..హీరోయిన్ సెల్ఫీకి రెడీ అవడం అంతా సినిమాటిక్‌గా అనిపిస్తుంది. అయితే ఫస్టాఫ్‌లోని కొన్ని సిల్లీ సీన్స్‌ని.. సెకండాఫ్‌తో ముడిపెట్టిన విధానం బాగుంది. హీరోయిన్ దుస్తులు ఆరేయడం నుంచి.. షాపులో షేవింగ్ కిట్ కొనే వరకు ప్రతి సీన్‌కి సెండాఫ్లో కారణం చూపించాడు. విజయ భారతి రాసిన ‘నొప్పి తెలియకుండా మనిషిని సక్కగా చేయటానికి నేను డాక్టర్ ని కాదు, రోజుకొకలా హింసించే యమధర్మరాజుని’లాంటి డైగాల్ బాగా పేలింది. సాయికుమార్, దేవీప్రసాద్, కాశీ విశ్వనాథ్ లాంటి సీనియర్ నటులను మరింత వాడుకోని, ఫస్టాఫ్‌పై ఇంకాస్త ఫోకస్ పెడితే సినిమా ఫలితం వేరేలా ఉండేది. ఎవరెలా చేశారంటే.. ఆవారాగా తిరిగే మధ్య తరగతికి చెందిన యువకుడు పాండు పాత్రకు ఆనంద్ న్యాయం చేశాడు. అతని యాక్టింగ్ చాలా నేచురల్‌గా అనిపిస్తుంది. తనదైన కామెడీతో నవ్వించాడు కూడా. ఇక హీరోయిన్ శ్రీపల్లవి అయితే జెన్నీ పాత్రకు పూర్తి న్యాయం చేసింది.ఎవరైనా మహిళలపై అనుచితంగా ప్రవర్తిస్తే వాళ్ళను శిక్షించే పాత్రలో సాయికుమార్ ఒదిగిపోయారు. హీరోయిన్ తండ్రి గా కాశీ విశ్వనాథ్ ముఖ్యమైన పాత్ర పోషించారు. కొడుకు ప్రేమను అర్థం చేసుకునే మధ్యతరగతి తండ్రిగా దేవీప్రసాద్ మరోసారి తన అనుభవాన్ని తెరపై చూపించాడు. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకెతిక విషయానికొస్తే.. లియాండర్ లీమార్టీ & ఆదేశ్ రవి సంగీతం ఫర్వాలేదు.సందీప్ కుమార్ కానుగల నేపథ్య సంగీతం బాగుంది. ఎడిటర్ జేపీ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. -
ఢిఫరెంట్ కాన్సెప్ట్‌తో అనసూయ కొత్త చిత్రం.. టైటిల్ ఇదేనా!
‘పేపర్ బాయ్’ఫేమ్ జయశంకర్ దర్శకత్వంలో అనసూయ భరద్వాజ్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సాయి కుమార్ కీలక పాత్రలో నటిస్తున్నారు. డిఫరెంట్ కాన్సెఫ్ట్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఆర్వీ సినిమాస్ బ్యానర్‌పై ఆర్వీ రెడ్డి, శేషు మారంరెడ్డి నిర్మిస్తున్నారు.అనుప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న చిత్ర యూనిట్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ పనుల్లో బిజీగా ఉంది.ఇంతవరకు ఎవరూ టచ్ చేయని పాయింట్‌ని తెలుగు తెరపై చూపించబోతున్నారట జయ శంకర్. ‘నిర్మాతల ప్రొత్సాహంతో షూటింగ్ దిగ్విజయంగా ముగించాం. జౌట్పుట్ చాలా బాగొచ్చింది. కామెడీ వేలో ఓ సరికొత్త అంశాన్ని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నాం. ఈ మూవీ కచ్చితంగా నాకు పెద్ద విజయాన్ని అందిస్తుంది. టైటిల్‌తో పాటు విడుదల తేదిని కూడా త్వరలోనే వెల్లడిస్తాం’అని దర్శకుడు జయశంకర్ అన్నారు. కాగా, ఈ చిత్రానికి ‘అరి’అని టైటిల్ ఖరారు చేసినట్లు సమాచారం. -
సాయి కుమార్ ‘వన్ బై టు’ రిలీజ్ డేట్ ఫిక్స్
డైలాగ్ కింగ్ సాయి కుమార్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘వన్ బై టు’.ఆనంద్, శ్రీ పల్లవి హీరో హీరోయిన్ లుగా నటించారు. చెర్రీ క్రియేటివ్ వర్క్స్ మరియు వీ ఐ పీ క్రియేషన్స్ బ్యానర్ ల పై కరణం శ్రీనివాసరావు నిర్మించిన ఈ చిత్రానికి శివ ఏటూరి దర్శకత్వం వహించారు. ప్రేక్షకులను ఆకట్టుకునే కంటెంట్ తో రూపొందిన ఈ సినిమా ఏప్రిల్ 22 వ తేదీన విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. లియాండర్ లీ మార్టీ, ఆదేశ్ రవి సాంగ్స్ సంగీతం సమకూర్చగా సందీప్ కుమార్ బ్యాగ్రౌండ్ స్కోర్ సమకూర్చారు. శంకర్ కేసరి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా కపిల్ మాస్టర్ కొరియోగ్రాఫర్ గా, శంకర్ యాక్షన్ కొరియోగ్రాఫర్ గా తమ బాధ్యతలు నిర్వర్తించారు. -
సండే సిరీస్..: ఏది నేరం? ఏది పాపం?
పాపం చేస్తే అంతర్లోకం కల్లోలం అవుతుంది. నేరం చేస్తే చట్టం వెంటబడి జీవితం బందీ అవుతుంది. అన్నీ బాగుంటే నేరం ఎందుకు చేస్తారు? అన్నీ బాగున్నా పాపం ఎందుకు చేస్తారు? మనిషి వీలైనంత వరకు నేరం, పాపం చేయకుండా ఉండటానికే ప్రయత్నిస్తాడు. కాని నేరమో, పాపమో చేసే పరిస్థితులు వస్తే? జీ ఫైవ్‌లో తాజాగా విడుదలైన 7 ఎపిసోడ్ల ‘గాలివాన’ జీవితంలో ఎదురయ్యే అనూహ్య ప్రహేళికలను ఆసక్తికరంగా చూపిస్తుంది. నేరం చేస్తే చట్టం శిక్షిస్తుంది. పాపం చేస్తే అంతరాత్మ శిక్షిస్తుంది. కాని పాపాన్ని ఆపబోయి నేరం చేస్తే? ‘గాలివాన’ కథ ఇదే. జీవితంలో కొన్ని ఎప్పటికీ జరక్కూడదు. కాని జరిగినప్పుడు వాటిని ఆచితూచి ఎదుర్కొనాలి. ఆ నష్టాన్ని నివారించాలి తప్ప ఆ నష్టానికి విరుగుడుగా మరిన్ని నష్టాలు తెచ్చే పని చేయకూడదు. ఉద్వేగాలు చాలా ప్రమాదకరమైనవి. అందుకే ఏ నిర్ణయమైనా స్థిమితంగా, ఆలోచనతో, వాస్తవిక అవగాహనతో చేయాలి. లేకుంటే చాలా ప్రమాదం. అవును... చాలా ప్రమాదం. జీ 5లో ప్లే అవుతున్న వెబ్ సిరీస్ ‘గాలివాన’ కథ ఏమిటి? ఒక గాలివాన రోజు. రాకపోకలకు వీలు లేని రాజోలు దగ్గర ఉన్న ఒక లంక దీవి. రెండు పెద్ద పెద్ద ఇళ్లు. ఆ ఇళ్లలోని ఒక ఇంటి అమ్మాయి, మరో ఇంటి అబ్బాయికి కొత్తగా పెళ్లయ్యింది. తర్వాత వాళ్లు హనీమూన్‌కు వైజాగ్ వెళ్లారు. వాన కురుస్తున్న రోజు అది. వైజాగ్‌లో అమ్మాయి, అబ్బాయి ఆ రాత్రికి హనీమూన్ జరుపుకోవాలి. ఇక్కడ అబ్బాయి ఇంటి వాళ్లు, అమ్మాయి ఇంటి వాళ్లు రొటీన్ పనుల్లో మునిగి ఉంటారు. కాని హటాత్తుగా వైజాగ్‌లో ఉన్న కొత్త జంటను ఒక దుండగుడు దారుణంగా హత్య చేస్తాడు. వధువు ఒంటి మీదున్న నగలను దొంగిలిస్తాడు. వాటిని అమ్మి దారిన పోయే కారును దొంగిలించి ఆ వానలో అదే లంక దీవి వైపు వస్తూ యాక్సిడెంట్ అయ్యి అబ్బాయి ఇంటి ముందు కారుతో సహా బోర్లా పడతాడు. అప్పటికే దుర్వార్త ఆ రెండు ఇళ్లకు చేరింది. వధూవరులు హత్యకు గురయ్యారు. వాళ్లను చంపిన హంతకుణ్ణి టీవీలో చూపిస్తున్నారు. ఆ శోకంలో ఉన్న అబ్బాయి కుటుంబం వారు తమ ఇంటి బయట యాక్సిడెంట్‌కు గురైన కారు దగ్గరకు వస్తారు. తమ వాళ్లను హత్య చేసింది ఆ కారు నడుపుతున్నవాడే అని తెలియక ఇంట్లోకి తెచ్చి వైద్యం చేస్తారు. అమ్మాయి ఇంటి వారు కూడా హెల్ప్ చేయడానికి వస్తారు. అప్పుడే ఆ ఆగంతకుడే హంతకుడు అని తెలుస్తుంది. అంటే తమ ఇంటి ముక్కుపచ్చలారని జంటను చంపింది ఇతడేనన్న మాట. వీణ్ణి కాపాడాలా? చంపేయాలా? అందరి భావోద్వేగాలు అదుపు తప్పుతాయి. ఏం చేయాలన్న నిర్ణయాన్ని పోస్ట్‌పోన్ చేసి హంతకుణ్ణి గొడ్ల చావిడిలో పెడతారు. రాత్రి సమయం అది. గాలివాన. కాని తెల్లారే సరికి హంతకుడు చచ్చిపడి ఉంటాడు. ఎవరో అతణ్ణి చంపేసి ఉంటారు. ఆ చంపింది ఎవరు? అమ్మాయి తరఫు కుటుంబ సభ్యుల్లోని ఒకరా? అబ్బాయి తరపు కుటుంబ సభ్యుల్లోని ఒకరా? ఎవరు చంపారు? కాని అసలు ప్రశ్న తర్వాత వస్తుంది. అది– ఎందుకు చంపారు? బిబిసి వారు 2016లో తీయగా విపరీతమైన జనాదరణ పొందిన వెబ్ సిరీస్ ‘ఒన్ ఆఫ్ అజ్’కు తెలుగు రూపాంతరం ఈ సిరీస్. స్కాట్లాండ్లోని పర్వత ప్రాంతంలో జరిగినట్టుగా ఉండే ఒరిజినల్ కథను మన లంక దీవికి మార్చి తీశారు. హత్యకు గురైన వరుడి తల్లిగా రాధిక, వధువు తండ్రిగా సాయి కుమార్ కీలకమైన పాత్రలు. మిగిలిన పాత్రల్లో చాందినీ, చైతన్య కృష్ణ, నందిని రాయ్, తాగుబోతు రమేష్ తదితరులు నటించారు. బిబిసి, జీ 5 కలిసి ఈ నిర్మాణం చేశాయి. రచన చంద్ర పెమ్మరాజు. దర్శకుడు శరణ్ కొప్పిశెట్టి. 7 ఎపిసోడ్ల ‘గాలివాన’ దాదాపు మూడున్నర గంటల నిడివి ఉంది. మర్డర్ మిస్టరీ కనుక ఆసక్తి సహజం. అందులో ఉప కథలు కూడా ఉండటంతో వేదికలు మారుతూ కథ ముందుకు కదులుతుంది. హంతకుణ్ణి చంపాక తమలో ఎవరో ఒకరు చంపారు అని అందరికీ తెలుసు. కాని అందరూ అందరినీ కాపాడుకోవాలనే చూస్తారు. కాని వ్యక్తులు నిస్సహాయ స్థితిలో ఉన్న సమయంలో కూడా వారిని పీక్కు తిని లబ్ధి పొందాలని చూసే వారుంటారు. బ్లాక్మెయిల్ చేసి ఇంకా టెన్షన్ ఇస్తారు. అలా టెన్షన్ పెట్టే పాత్రలు కూడా ఉన్నాయి. అంటే పరిస్థితులను బట్టి మనిషి నీచుడా, గొప్పవాడా అనేది తేలుతుంది. అదే సమయంలో నేరం, పాపం అనే చర్యల చర్చ కూడా ఉంటుంది. మన కుటుంబ సభ్యులను చంపినవాడిని చంపడం నేరం ఎలా అవుతుంది? అని అందరూ అనుకుంటారు. కాని అలా చంపడం పాపం కదా. అలాగే తల్లిదండ్రులు చేసే తప్పులు, పాపాలు పిల్లలను ఎలా వెంటాడుతాయో ఈ కథలో ఉంటుంది. పెళ్లికి ముందు ప్రేమలు, పెళ్లి తర్వాత విడాకులు అవి ఎక్కడికీ పోవు. తర్వాతి తరాలకు శాపాలుగా మారే అవకాశం ఉంటుందని చూపుతారు. అసలు కథేమిటంటే వీరిలో ఒకరు ఆ హంతకుణ్ణి చంపారు. నిజానికి వీరిలో ఒకరు ఆ కొత్త వధువరులను చంపడానికి కూడా కారకులయ్యారు. ఆ ఒకరు ఎవరు అనేదే కథ. ఖర్చుకు వెనుకాడకుండా రాధిక, సాయికుమార్ వంటి సీనియర్లను పెట్టి తీయడం వల్ల సిరీస్ నిలబడింది. కొడుకును కోల్పోయిన దుఃఖం, ఉన్నవారిని కాపాడుకోవాలనే తపన రాధికలో అలవోకగా పలికింది. సాయికుమార్ తన గొంతుతోనే సగం ఎఫెక్ట్ తీసుకు వచ్చాడు. సిరీస్‌కు మరో కీలకపాత్ర అయిన చాందిని తన శక్తికి మించి రక్తి కట్టించింది. నందిని రాయ్‌కు మంచి పాత్ర. కాని చివరి ఎపిసోడ్లు మరింత బాగుండాల్సింది. నేరం జరిగినా, పాపం జరిగినా అందుకు బదులుగా చేసే పని ఏదైనా కావచ్చుగాని ప్రాణం తీసేది మాత్రం కాకూడదు. మనిషి ప్రాణం తీస్తే అది ఏక కాలంలో నేరం, పాపం. రోజూ పేపర్లలో ఎన్నో క్షణికావేశాల చర్యలు కనిపిస్తాయి. వాటి నుంచి బయటపడి జీవితాలను కాపాడుకోవాలని ఈ సిరీస్ చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఏప్రిల్ 14న విడుదలైంది. జీ5లో చూడండి. -
కొడుకును చంపినవాడే ఇంటికొస్తే.. 'గాలివాన' వెబ్ సిరీస్ రివ్యూ
టైటిల్: గాలివాన జానర్: క్రైమ్ అండ్ మిస్టరీ, థ్రిల్లర్ నటీనటులు: సాయి కుమార్, రాధికా శరత్ కుమార్, చాందిని చౌదరి, నందిని రాయ్, చైతన్య కృష్ణ, శరణ్య, తాగుబోతు రమేష్ తదితరులు దర్శకత్వం: శరణ్ కొప్పిశెట్టి నిర్మాత: శరత్ మరార్ సంగీతం: హరి గౌర సినిమాటోగ్రఫీ: సుజాత సిద్ధార్థ ఓటీటీ: జీ5 విడుదల తేది: ఏప్రిల్ 14, 2022 ప్రస్తుతం ఓటీటీల హవా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రముఖ ఓటీటీ సంస్థ 'జీ5' తనదైన ముద్ర వేస్తూ వెబ్ సిరీస్‌లు, సినిమాలతో ముందుకు సాగుతూ ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ క్రమంలోనే బీబీసీతో కలిసి జీ5, నార్త్‌స్టార్ ఎంటర్టైన్మెంట్స్ 'గాలివాన' వెబ్ సిరీస్‌ను నిర్మించాయి. ఈ వెబ్ సిరీస్‌తో సీనియర్ నటుడు సాయి కుమార్, రాధికా శరత్ కుమార్‌లు తొలిసారిగా డిజిటల్ తెరకు పరిచయమయ్యారు. కిర్రాక్ పార్టీ, తిమ్మరుసు చిత్రాల దర్శకుడు శరణ్ కొప్పిశెట్టి ఈ వెబ్‌సిరీస్‌ను డెరెక్ట్ చేశాడు. సాయి కుమార్, రాధికా శరత్ కుమార్‌తోపాటు చాందిని చౌదరి, నందిని రాయ్, చైతన్య కృష్ణ, అశ్రిత, శరణ్య ప్రదీప్, తాగుబోతు రమేష్ తదితరులు నటించిన ఈ వెబ్ సిరీస్ ఏప్రిల్ 14న జీ5లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొత్తం 7 ఎపిసోడ్లు ఉన్న 'గాలివాన' వెబ్ సిరీస్ ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం. కథ: కొమర్రాజు (సాయి కుమార్) కూతురు గీత, సరస్వతి (రాధికా శరత్ కుమార్) కుమారుడు అజయ్ వర్మ చిన్నప్పటి నుంచి ఒకరినొకరు ప్రేమించుకుంటారు. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంటారు. హనీమూన్‌కు వెళ్లిన ఈ జంటను శ్రీను అనే యువకుడు దారుణంగా హత్య చేస్తాడు. తర్వాత కారులో పారిపోతూ గాలివాన కారణంగా సరస్వతి ఇంటి ముందు యాక్సిడెంట్‌కు గురవుతాడు. తీవ్ర గాయాలపాలైన శ్రీనును సరస్వతి కుటుంబ సభ్యులు కాపాడి చికిత్స అందించడానికి సిద్ధమవుతారు. ఇంతలో వారి కూతురు అల్లుడిని చంపింది శ్రీనునే అని తెలుస్తుంది. ఆ మరసటి రోజు శ్రీను హత్యకు గురవుతాడు. శ్రీను చంపింది ఎవరు ? తమ వాళ్లను చంపిన వ్యక్తి తమ ఇంట్లోకి వస్తే ఆ కుటుంబ సభ్యులు ఏం చేశారు ? అసలు గీత, అజయ్ వర్మలను శ్రీను ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది ? అనేది 'గాలివాన' వెబ్ సిరీస్ కథ. విశ్లేషణ: బీబీసీ మినీ సిరీస్‌గా వచ్చిన 'వన్ ఆఫ్ అజ్'కు అఫిషియల్ రీమేక్‌గా తెరకెక్కిందే 'గాలివాన' వెబ్ సిరీస్. కిర్రాక్ పార్టీ, తిమ్మరుసు వంటి రీమేక్ సినిమాలను డైరెక్టర్ చేసిన శరణ్ కొప్పిశెట్టి ఈ వెబ్ సిరీస్‌కు దర్శకత్వం వహించారు. ఇదివరకూ శరణ్ కొప్పిశెట్టి డైరెక్ట్ చేసినవి రీమేక్ చిత్రాలే కావడంతో ఈ బీబీసీ మినీ సిరీస్‌ను కూడా తెలుగు నేటివిటీకి తగినట్లే చిత్రీకరించాడు. పల్లెటూరులో జరిగే ఈ కథకు అనువుగా పాత్రల ఎంపిక బాగుంది. ఆయుర్వేద వైద్యుడిగా సాయి కుమార్, ముగ్గురు పిల్లల ఒంటరి తల్లిగా రాధికా శరత్ కుమార్. సరస్వతి పిల్లలుగా చాందిని చౌదరి, చైతన్య కృష్ణ, తదితరులు వారి పాత్రలకు చక్కగా సరిపోయారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటను హత్య చేయడంతో ప్రారంభమైన 'గాలివాన' ఆసక్తిగా ఉంటుంది. తర్వాత మర్డర్ చేసిన వ్యక్తి దంపతుల ఇంటి ముందు యాక్సిడెంట్‌కు గురికావడం, అతనే కిల్లర్ అని ఆ కుటుంబ సభ్యులకు తెలవడం, ఇంతలో అతను కూడా చంపబడటం థ్రిల్లింగ్‌గా ఫస్ట్ ఎపిసోడ్ సాగుతోంది. ఇక తర్వాత ఎపిసోడ్లు సాదాసీదాగా ఉంటాయి. కొంచెం సీరియల్ అనుభూతిని కలిగిస్తాయి. అయితే తమ పిల్లల హత్యతో రెండు కుటుంబాలు ఎలాంటి వేదనకు గురయ్యాయి అనేది చాలా చక్కగా చూపించారు. పాత్రల పరిచయం, వారి స్వభావం చూపించే ప్రయత్నంలో కొంతవరకు బోరింగ్‌గా అనిపిస్తుంది. తర్వాత జంటను చంపిన కిల్లర్ పట్టుకునేందుకు వచ్చిన పోలీస్ ఆఫిసర్‌గా నందిని రాయ్ ఎంట్రీతో కథలో ఆసక్తి మొదలవుతుంది. ఒక పక్క నందిని రాయ్ కిల్లర్‌ను పట్టుకునే ప్రయత్నం చేయగా మరోవైపు కిల్లర్ శవాన్ని మాయం చేసే పనిలో రెండు కుటుంబాలు ఉండటం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అలాగే ఈ సీన్లు కొద్దివరకు 'దృశ్యం' మూవీని తలపిస్తాయి. అలాగే కిల్లర్ శ్రీనును హత్య చేసింది తమలోని వారే అని ఒకరిపై ఒకరు అనుమానపడటం మనుషులను పరిస్థితులను ఎలా మారుస్తాయే తెలిసేలా అద్దం పడుతాయి. సరస్వతి భర్త ఎపిసోడ్ నిడివి పెంచినట్లే ఉంది గానీ అంతగా ఆకట్టుకోలేదు. ఒక ట్విస్ట్ తర్వాత ఒక ట్విస్ట్‌తో చివరి రెండు ఎపిసోడ్స్ ఉత్కంఠభరితంగా సాగాయి. 7 ఎపిసోడ్లు కాకుండా కొన్ని ఎపిసోడ్లు తీసేస్తే ఈ వెబ్ సిరీస్ మరింతబాగా ఆకట్టుకునేది. ఎవరెలా చేశారంటే ? ఆయుర్వేద వైద్యుడిగా, గ్రామానికి పెద్ద దిక్కుగా సాయి కుమార్ నటన బాగుంది. ఆయన పాత్రకు తన నటనతో న్యాయం చేశారనే చెప్పవచ్చు. ఇక రాధిక శరత్ కుమార్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముగ్గురు పిల్లల ఒంటరి తల్లిగా, భర్త వదిలేసిన భార్యగా, అనవసరపు ఆలోచనలతో భయపడిపోయే గృహిణిగా ఆమె సరస్వతి పాత్రలో ఒదిగిపోయారు. చైతన్య కృష్ణ, చాందిని చౌదరి, అశ్రిని వేముగంటి, శరణ్య ప్రదీప్ వారి పరిధి మేర బాగానే నటించారు. నందిని రాయ్ తన నటనతో ఆకట్టుకున్న ఆ పాత్ర అంతగా ప్రభావం చూపించలేకపోయింది. నందినిరాయ్కు అసిస్టెంట్‌గా అంజి పాత్రలో తాగుబోతు రమేష్ నటన బాగుంది. సీనియర్ లేడీ కమెడియన్ శ్రీ లక్ష్మీ రెండు, మూడు సన్నివేశాల్లో కనిపించి పర్లేదనిపించారు. టెక్నికల్ టీం వర్క్ బాగుంది. హరి గౌర బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంటుంది. అయితే థ్రిల్లర్ సినిమాలు ఫాస్ట్ స్క్రీన్ ప్లేతో ముందుకు సాగితే.. వెబ్ సిరీస్‌లు మాత్రం కాస్త నెమ్మదిగానే నారేట్ చేయబడుతాయి. ఎండింగ్లో వచ్చే ట్విస్ట్‌లు, కారణాలు బాగుంటే ఆ వెబ్ సిరీస్ ఆకట్టుకున్నట్టే. మొత్తంగా ఈ 'గాలివాన' వెబ్ సిరీస్ థ్రిల్లింగ్ కంటే మిస్టీరియస్‌గా బాగానే ఆకట్టుకుంటుంది. -
ఈ అర్థరాత్రి నుంచి స్ట్రీమింగ్ కానున్న క్రైం థ్రిల్లర్ ‘గాలివాన’, ఎక్కడంటే
సీనియర్ నటుడు సాయి కుమార్, రాధిక శరత్ కుమార్‌లు నటించిన వెబ్ సిరీస్ గాలివాన. ఈ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 స్ట్రీమింగ్ కాబోతోంది. ప్రస్తుతం ఓటీటీల హావా సాగుతున్న నేపథ్యంలో జీ5 సంస్థ తనదైన ముద్రను వేస్తూ ముందుకు కొనసాగుతోంది. ఇప్పటికే ఎన్నో సినిమాలు, వెబ్ సిరీస్‌లను ప్రేక్షకులకు అందిస్తోంది. ఈక్రమంలో తాజాగా 'గాలివాన' వెబ్ సిరీస్‌ను ఈ రోజు అర్థరాత్రి (ఏప్రిల్ 14) నుంచి స్ట్రీమింగ్ చేయబోతోంది. చదవండి: అందుకే మీకు చరణ్ డామినేషన్ ఎక్కువ ఉందనిపిస్తుంది ఈ వెబ్ సిరీస్ లో రాధిక, సాయికుమార్‌లతో పాటు చాందిని చౌదరి, చైతన్య కృష్ణ, అశ్రిత, శరణ్య ప్రదీప్, తాగుబోతు రమేశ్ తదితరులు నటించారు. కుటుంబ అనుబంధాలకు సంబంధించిన ఎమోషన్స్ తో ఈ వెబ్ సిరీస్ ను తెరకెక్కించారు. క్వాలిటీ పరంగా ఈ వెబ్ సిరీస్ భారీగా కనిపిస్తోంది. మదర్ సెంటిమెంట్, క్రైమ్ థిల్లర్ అంశాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయని ఈ సందర్భంగా మేకర్స్ తెలిపారు. ఈ సిరీస్‌ను బీబీసీ స్టూడియోస్, నార్త్ స్టార్ ఎంటర్టైన్ మెంట్ సంయుక్తంగా నిర్మించారు. #Gaalivaana storm arriving tomorrow exclusively on #ZEE5.#StormComingSoon 🌪🌪 #GaalivaanaOnZEE5 #PremieresTomorrow #AZEE5Original @realradikaa #SaiKumar @iChandiniC @99_chaitu @ImNandiniRai #ThagubothRamesh #SharanyaPradeep @nseplofficial @bbcstudiosindia @sharandirects pic.twitter.com/qO5v67qmAM — ZEE5 Telugu (@ZEE5Telugu) April 13, 2022 -
డైలాంగ్ కింగ్ సాయి కుమార్ ‘వన్ బై టూ’ ట్రైలర్ విడుదల
డైలాగ్ కింగ్ సాయికుమార్ ప్రధాన పాత్రలో ఆనంద్, శ్రీ పల్లవి జంటగా నటిస్తున్న చిత్రం వన్ బై టు. శివ ఏటూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నుండి విడుదలైన టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపద్యంలో తాజాగా ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ట్రైలర్ విషయానికి వస్తే.. హీరోయిన్ శ్రీపల్లవి లుక్‌తో ట్రైలర్ ప్రారంభమైంది. ఇక ట్రైలర్ చివరిలో తన పెర్ఫార్మెన్స్తో ఆకట్టుకుంది. ఇందులో సాయికుమార్‌ను చాలా పవర్ ఫుల్‌గా చూపించారు. ఎవరైనా మహిళల పై అనుచితంగా ప్రవర్తిస్తే వాళ్ళను శిక్షించే పాత్రలో సాయికుమార్ ఒదిగిపోయారు. హీరోయిన్ తండ్రిగా కాశీ విశ్వనాథ్ ముఖ్యమైన పాత్ర పోషించారు, కొడుకు ప్రేమను అర్థం చేసుకునే మధ్యతరగతి తండ్రిగా దేవీ ప్రసాద్ కనిపించారు. విజయ భారతి రాసిన ‘నొప్పి తెలియకుండా మనిషిని సక్కగా చేయటానికి నేను డాక్టర్ ని కాదు, రోజుకొకలా హింసించే యమధర్మరాజుని’సాలీడ్ డైలాగ్స్ చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. కాగా ఈ మూవీని చెర్రీ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై కరణం శ్రీనివాసరావు నిర్మించారు. ఇప్పటికే సెన్సార్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీని ఏప్రిల్ 22వ తేదీన విడుదల చేయబోతున్నారు. -
బెంజ్ కారు కొన్న యంగ్ హీరో.. ఫోటోలు వైరల్
Aadi Sai Kumar Buys Benz Car, Pics Goes viral: ఆది సాయికుమార్ లేటెస్ట్ మూవీ 'అతిథి దేవోభవ' ప్రస్తుతం థియేటర్స్‌లో సందడి చేస్తుంది. లవ్, యాక్షన్ ఓరియెంటెండ్గా తెరకెక్కిన ఈ చిత్రం ఈనెల 7న థియేటర్స్‌లో విడుదలైన సంగతి తెలిసిందే. పొలిమేర నాగేశ్వర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. కాగా ఈ ఏడాది కొత్త సినిమాతో పలకరించిన ఆది సాయికుమార్ ఇప్పుడు తన ఇంట్లోకి కూడా కొత్త కారును ఆహ్వానించాడు. ఖరీదైన బెంజ్ కారును కొనుగోలు చేసి దానికి సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఈ సందర్భంగా భార్య, కూతురితో పాటు తండ్రి సాయికుమార్‌తో దిగిన ఫోటోలను షేర్ చేశాడు. ప్రస్తుతం ఆది సాయికుమార్ చేతిలో ఆర డజనుకు పైగా సినిమాలున్నాయి. View this post on Instagram A post shared by ActorAadi (@aadipudipeddi) -
కులమేంటని అడిగి.. సార్ అని పిలవాలని హుకుం, గదిలో బంధించి దారుణం
సూర్యాపేట క్రైం: కాలేజీల్లో ర్యాగింగ్ భూతం అంతమైపోయిందన్న సమయంలో మళ్లీ అలాంటి సంఘటన ఒకటి వెలుగు చూసింది. సూర్యాపేట మెడికల్ కళాశాలకు సంబంధించిన హాస్టల్లో ఓ జూనియర్ విద్యార్థిని రెండో సంవత్సరం విద్యార్థులు నాలుగు గంటలు గదిలో బంధించి హింసించారు. మోకాళ్లపై కూర్చోబెట్టి సెల్యూట్ చేయించుకోవడమే కాకుండా పిడిగుద్దులు గుద్దారు. కన్నీరుపెట్టి వేడుకున్నా వదలకుండా ట్రిమ్మర్‌తో గుండు గీసేందుకు ప్రయత్నించారు. టాయిలెట్ వస్తుందని అక్కడి నుంచి బయటపడ్డ ఆ విద్యార్థి ఫోన్ చేసి విషయం తల్లి దండ్రులకు చెప్పాడు. తమ రూమ్‌కు రమ్మని కబురు పంపి.. హైదరాబాద్‌లోని మైలార్‌దేవులపల్లికి చెందిన విస్కనూరి సురేష్ కుమారుడు సాయికుమార్ సూర్యాపేట మెడికల్ కళాశాలలో ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. గత నెల 15 నుంచి జనవరి 2 వరకు సెలవులు ప్రకటించడంతో ఇంటికి వెళ్లాడు. సెమిస్టర్స్ ఉండటంతో ప్రిపేర్ అయ్యేందుకు ఈ నెల 1న రాత్రి 8 గంటలకు మెడికల్ కళాశాలకు సంబంధించిన రెడ్డి హాస్టల్‌కు చేరుకున్నాడు. రాత్రి భోజనం చేసి హాస్టల్లోని రెండో ఫ్లోర్‌లోని తన రూమ్‌కు వెళ్లాడు. రాత్రి 8.40కు సాయికుమార్‌ను ఫస్ట్ ఫ్లోర్‌కు రమ్మని హరీశ్‌తో పాటు మరికొందరు రెండో సంవత్సరం విద్యార్థులు.. నితీశ్‌తో కబురు పంపారు. దీంతో ఫస్ట్ ఫ్లోర్‌కు వచ్చిన సాయిని ఫార్మల్ డ్రెస్, షూ వేసుకురమ్మనగా అతను అలాగే వేసుకొని వచ్చాడు. సీనియర్స్ హరీశ్, రంజిత్, శ్రవణ్, శశాంక్, మహేందర్, చాణక్య, సుజిత్ తదితర 25–30 మంది సాయితో సెల్యూట్ చేయించుకున్నారు. ‘కులమేంటని అడిగారు. సార్ అని పిలవాలని, తల్లిదండ్రులు, అక్కాచెల్లి వివరాలు చెప్పాలని వేధించారు. ఇందంతా వీడియో తీశారు. వాయిస్ రికార్డింగ్ చేస్తావా అంటూ మోకాళ్లపై కూర్చోబెట్టి పిడి గుద్దులు గుద్దారు. ట్రిమ్మర్‌తో గుండు గీయాలని చూశారు’ అని సాయి కన్నీరుమున్నీరయ్యాడు. టాయిలెట్ వస్తుందని చెప్పి.. టాయిలెట్ వస్తుందని చెప్పి ఫస్ట్ ఫ్లోర్‌లోని బాత్రూమ్కు సాయి వెళ్లాడు. అక్కడ నుంచి తన రూమ్‌కు వెళ్లి మరో జూనియర్ విద్యార్థి వద్ద ఫోన్ తీసుకుని తల్లిదండ్రులకు ఏడుస్తూ విషయాన్ని వివరించాడు. వెంటనే తండ్రి సురేశ్ హైదరాబాద్ నుంచే 100కు కాల్ చేసి ఫిర్యాదు చేశారు. అరగంట తర్వాత సూర్యాపేట పట్టణ పోలీసులు రెడ్డి హాస్టల్‌కు చేరుకుని సాయిని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తల్లిదండ్రులు తెలిపారు. అయితే, జరిగిన ఘటనపై తమకెలాంటి ఫిర్యాదు అందలేదని, లిఖితపూర్వకంగా ఫిర్యాదు అందితే చర్యలు తీసుకుంటామని సూర్యాపేట పట్టణ సీఐ ఆంజనేయులు చెప్పడం గమనార్హం. రాజీ కుదిర్చాం.. వెళ్లిపోండంటూ.. సాయి తల్లిదండ్రులు జరిగిన విషయాన్ని కాలేజీ సూపరింటెండెంట్‌కు చెప్పగా.. ‘రాజీ కుదిర్చాం. పోలీసులతో మాట్లాడాం. కాలేజీ పేరు బజారున పడకుండా ఉండాలంటే ఇక్కడి నుంచి వెళ్లిపోవాలి. కళాశాల అన్నాక ఇలాంటివి సర్వసాధారణమే’నని చెప్పి పంపించినట్లు విద్యార్థి తండ్రి తెలిపాడు. విషయాన్ని బయటకు చెప్పొద్దని హుకూం జారీ చేశారని కన్నీరుమున్నీరయ్యారు. గతంలో మరొకరిని ర్యాగింగ్ చేసినా ఎందుకు పట్టించుకోలేదని నిలదీయగా ‘మేం చూసుకుంటాం. మీరు వెళ్లిపోండి’ అని సూపరింటెండెంట్ ఘాటుగా చెప్పారని వాపోయారు. దీనిపై సూపరింటెండెట్ మురళీధర్‌రెడ్డి, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సీవీ శారదను వివరణ కోరేందుకు యత్నించగా ఫోన్ తీయలేదు. సూసైడ్ చేసుకోవాలనుకున్నా శనివారం రాత్రి సీనియర్స్ నన్ను 4 గంటలు గదిలో బంధించి మద్యం, పొగ తాగుతూ పిడిగుద్దులు గుద్దారు. వీడియోలు తీసి ట్రిమ్మర్‌తో గుండు గీసేందుకు ప్రయత్నించారు. తల్లిదండ్రులు, సిస్టర్స్ బయోడేటా వందసార్లు చెప్పించారు. దీంతో శనివారం అర్ధరాత్రి సూసైడ్ చేసుకోవాలనిపించింది. నెల రోజులుగా హాస్టల్లో ర్యాగింగ్ చేస్తున్నారు. యాజమాన్యానికి చెప్పినా పట్టించుకోలేదు. పోలీసులకు ఫిర్యాదు చేసి రెండ్రోజులైనా న్యాయం జరగలేదు. – సాయికుమార్, ప్రథమ సంవత్సరం విద్యార్థి, సూర్యాపేట మెడికల్ కళాశాల -
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు
-
కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్న సాయి కుమార్
నటుడు సాయికుమార్, అలాగే డైరెక్టర్ అనిల్ రావిపూడిలు కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం వీఐపీ దర్శనం ద్వారా స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు వారిని స్వామివారి వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా సాయికుమార్ మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఏడాది తనకు చాలా ముఖ్యమైనదని చెప్పారు. తాను సినీ ఇండస్ట్రీకి వచ్చి 50 ఏళ్లు పూర్తవుతుందన్నారు. ఇక రెండేళ్లు క్లిష్ట పరిస్థితులను చుశామని, ఒమిక్రాన్ పట్ల అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రభుదేవా, ధనుష్, నానిలతో సినిమాలు చేస్తున్న నిర్మాతలు కన్ఫ్యూజన్లో ఉన్నారని, చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు అనే కన్ఫ్యూజన్లో నిర్మాతలు ఉన్నారని పేర్కొన్నారు. ఐక్యంగా అందరూ ముందుకు సాగాల్సిన అవసంర ఉందని, ప్రభుత్వం నియమించిన కమిటీతో సమస్యలు పరిష్కారమవుతాయన్న నమ్మకం ఉందని సాయి కుమార్ వ్యాఖ్యానించారు. కాగా వీరితో పాటు వీరితో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖుల సైతం నేడు(జవనరి 1) కొత్త సంవత్సరం సందర్భంగా శ్రీవారిని దర్శించుకున్నారు. వారిలో బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఎమ్మెల్యే పెద్దారెడ్డి, డీవై సీఎం నారాయణ స్వామి, జమ్మూకశ్మీర్ లేఫ్టనెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, టీఎన్ మంత్రి గాంధీ భట్, గుజరాత్ మినిస్టర్ జితేందర్ చౌదరి భట్టి విక్రమార్క, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలు శ్రీవారిని దర్శించుకున్నారు. -
నెహ్రూ జూలాజికల్ పార్కు: సింహాల వద్ద వజ్రాలు, బంగారం ఉంటాయని...
బహదూర్‌పురా: నెహ్రూ జూలాజికల్ పార్కులో ఓ యువకుడు హల్చల్ చేశాడు. నేరుగా సింహం ఎన్‌క్లోజర్‌లోకి దిగే ప్రయత్నం చేశాడు. దీనిని గమనించిన సందర్శకుడు అరవడంతో అప్రమత్తమైన జూ సిబ్బంది చాకచాక్యంగా ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకొని బహదూర్‌పురా పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన మంగళవారం మధ్యాహ్నం 3.30గంటలకు జరిగింది. జూ అధికారులు, బహదూర్‌పురా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సాయి కుమార్ (31) జూపార్కును సందర్శించడానికి టికెట్టు తీసుకొని జూలోకి వెళ్లాడు. తోటి సందర్శకులు, జూ సిబ్బంది కళ్లు కప్పి సింహం ఎన్‌క్లోజర్ కొండచరియల గోడపైకి ఎక్కాడు. దీంతో అప్రమత్తమైన జూ యానిమల్ కీపర్, సిబ్బంది అతడిని పట్టుకున్నారు. సాయి కుమార్ తిరుమలగిరి ప్రాంతంలో గత కొన్నేళ్లుగా రోడ్లపై నివాసముంటున్నట్లు బహదూర్‌పురా ఇన్స్పెక్టర్ దుర్గా ప్రసాద్ పేర్కొన్నారు. సింహాల వద్ద వజ్రాలు, బంగారం ఉంటాయని... వాటి కోసమే సింహం దగ్గరకు వెళ్లానని చెప్పాడని, అతని మానసిక స్థితి సరిగ్గా లేదని పోలీసులు పేర్కొన్నారు. సాయి కుమార్‌ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. దాడికి సన్నద్ధమైన సింహం... ఆసియా సింహాల ఎన్‌క్లోజర్ గోడ మీదికి ఎక్కిన యువకున్ని ఎన్‌క్లోజర్‌లో ఉన్న సింహం (మనోహర్–7) చూసింది. యువకుడు ఏ మాత్రం కిందికి దిగినా... అదును చూసుకుని దాడి చేసేందుకు సింహం సన్నద్ధమైంది. యువకుడినే గమనిస్తూ తన డెన్ ముందు అటూ ఇటూ తిరుగుతూ కనిపించింది. జూ సిబ్బంది చాకచాక్యంగా వ్యవహరించకపోతే ఆ సింహం చేతిలో యువకుడు సాయి కుమార్ మృత్యువాత పడాల్సి వచ్చేది. యువకుడు సురక్షితంగా బయటపడటంతో జూ సిబ్బంది, అధికారులు, సందర్శకులు ఊపిరి పీల్చుకున్నారు. గతంలోనూ... నగరంలోని మెట్రో రైలు పనుల్లో కార్మికుడిగా పని చేస్తున్న ఓ యువకుడు 2016లో తాగిన మత్తులో సింహం ఎన్‌క్లోజర్‌లోకి దిగాడు. ఎన్‌క్లోజర్ చుట్టు ఉండే నీటిలో ఈత కొట్టుకుంటూ సింహం దగ్గరకు వెళ్లేందుకు ప్రయత్నించాడు. దీంతో అప్రమత్తమైన జూ సిబ్బంది, అధికారులు గంట పాటు శ్రమించి అతన్ని బయటికి తీసుకొచ్చారు. రాజస్తాన్‌కు చెందిన అతనిపై బహదూర్‌పురా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఆ యువకుడు నాలుగు నెలల వరకు జైలు పాలయ్యాడు. -
దొరక్కూడదని ధ్వంసం చేశాడు
సాక్షి, హైదరాబాద్: చెన్నై కేంద్రంగా 2009లో చోటుచేసుకున్న నార్తర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ (ఎన్సీఎల్)తో మొదలుపెట్టి నగరంలో జరిగిన తెలుగు అకాడమీ ఫిక్స్డ్ డిపాజిట్ల వరకు దాదాపు పది కుంభకోణాల్లో నిందితుడిగా సాయి కుమార్‌కు పోలీసుల దర్యాప్తు తీరుతెన్నులపై మంచి పట్టుంది. సీబీఐ విచారణ, దర్యాప్తులనూ చూసి ఉండటంతో మరింత రాటుతేలాడు. ఈ నేపథ్యంలోనే తాము పట్టుబడినా నేరానికి సంబంధించిన ఆధారాలు సాధ్యమైనంత వరకు పోలీసులకు దొరక్కుండా పథకం వేశాడు. ఈ నెల 6న ఇతడు అరెస్టు కావడానికి పది రోజుల ముందు తనతోపాటు తన అనుచరుల ఫోన్లనూ ధ్వంసం చేశాడు. కేసు దర్యాప్తు, నిందితుల విచారణలో ఈ విషయం గుర్తించిన హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) పోలీసులు తెలుగు అకాడమీ కేసులో మరో సెక్షన్ జోడించాలని నిర్ణయించారు. సాయితోపాటు అతడి ముఠా గత డిసెంబర్ నుంచి ఈ ఏడాది సెప్టెంబర్ వరకు పథకం ప్రకారం అకాడమీకి చెందిన రూ.64.5 కోట్లు కాజేసింది. ఈ సమయంలో తన అనుచరులైన వెంకట రమణ, సోమశేఖర్ సహా ఇతరులతో సంప్రదింపులు జరపడానికి కొత్త ఫోన్, సిమ్ తీసుకున్నాడు. అయినప్పటికీ సమాచారమార్పిడి, సంప్రదింపులకు వివిధ సోషల్‌మీడియా కమ్యూనికేషన్ యాప్స్‌నే వాడాడు. తెలుగు అకాడమీ స్కామ్ వెలుగులోకి వచ్చి సీసీఎస్‌లో కేసులు నమోదైన తర్వాత తన గ్యాంగ్‌లోని ముఖ్య అనుచరులైన ముగ్గురితో కొండాపూర్‌లోని సైబర్ రిచ్ అపార్ట్మెంట్స్లోని ఫ్లాట్‌లో మీటింగ్ ఏర్పాటు చేశాడు. అక్కడే అందరి ఫోన్లు తీసుకున్న సాయి తన దాంతోపాటు వాటినీ ధ్వంసం చేశాడు. అవి వాళ్ల దగ్గరే ఉంటే మరో సిమ్ వేసుకుని వాడతారని, అలా చేస్తే పోలీసులు కనిపెట్టడంతోపాటు ఆధారాలు సేకరిస్తారని ఇలా చేశాడు. పోలీసులు వీరిని అరెస్టు చేస్తే ఫోన్లలో తనకు సంబంధించి ఎలాంటి ఆధారాలు చిక్కకుండా ఈ పని చేశాడని అధికారులు చెప్తున్నారు. అప్పటి నుంచి సాయి కొన్ని రోజులు ఫోన్ లేకుండానే గడిపాడు. అరెస్టుకు ఒకరోజు ముందు సాయి తాను అరెస్టు కావడానికి ఒకరోజు ముందు సహ నిందితుడు భూపతిరావుతో (ఆ తర్వాత ఇతడు అరెస్టు అయ్యాడు) సంప్రదింపులు జరిపాడు. దీనికోసం గచ్చిబౌలిలోని ఓ ఆసుపత్రి వద్దకు వెళ్లిన సాయి అందులో తన బంధువు చికిత్స కోసం వచ్చిన వ్యక్తిని కలిశాడు. తన ఫోన్ స్విచ్ఛాఫ్ అయిందని, తమ పేషెంట్ విషయంపై కుటుంబీకులతో మాట్లాడాలని అతడి ఫోన్‌ను తీసుకున్నాడు. అందులో భూపతి నంబర్ సేవ్ చేసి వాట్సాప్ కాల్ ద్వారా అతడితో మాట్లాడాడు. ఆపై తాను సేవ్ చేసిన ఫోన్ నంబర్ డిలీట్ చేసి ఫోన్ తిరిగి ఇచ్చాడు. ఇదంతా కొన్ని నిమిషాల్లోనే పూర్తి చేశాడు. తాను నేరుగా ఫోన్ చేస్తే పోలీసులకు చిక్కుతాననే సాయి ఇలా చేశాడని అధికారులు చెప్తున్నారు. ఇంత వ్యూహాత్మకంగా వ్యవహరించినప్పటికీ సీసీఎస్ అధికారులు చాకచక్యంగా సాయిని పట్టుకున్నారు. ఫోన్ల ధ్వంసం విషయాన్ని విచారణలో గుర్తించిన పోలీసులు తెలుగు అకాడమీ కేసులో సాయిపై ఆధారాలను ధ్వంసం చేయడానికి సంబంధించి ఐపీసీ సెక్షన్ 204 కింద ఆరోపణలు జోడించాలని నిర్ణయించారు. ఈ మేరకు త్వరలో న్యాయస్థానానికి సమాచారం ఇవ్వనున్నారు. -
ఫోర్జరీ ఖరీదు రూ.30 లక్షలు!
సాక్షి, హైదరాబాద్: తెలుగు అకాడమీకి సంబంధించిన రూ.64.5 కోట్లు కాజేయడానికి పథకం వేసిన సూత్రధారి సాయికుమార్ అందుకు నకిలీ లేఖలు, ఫిక్స్డ్ డిపాజిట్ (ఎఫ్డీ) బాండ్లు వినియోగించాడు. వీటిని తమిళనాడుకు చెందిన పద్మనాభన్ తయారు చేయగా.. అకాడమీ, బ్యాంకు అధికారుల సంతకాలను ఫోర్జరీ చేసింది మాత్రం మదన్ అని తేలింది. దీని నిమిత్తం ఇతడికి కుంభకోణం సొమ్ము నుంచి రూ.30 లక్షలు ముట్టింది. సాయి అనుచరుడు వెంకట రమణకు స్నేహితుడైన ఇతడిని కేసు దర్యాప్తు అధికారి కె.మనోజ్‌కుమార్ నేతృత్వంలోని బృందం గురువారం షిర్డీలో అరెస్టు చేసి శుక్రవారం నగరానికి తరలించింది. దీంతో ఈ కేసులో ఇప్పటి వరకు అరెస్టు అయిన నిందితుల సంఖ్య 17కు చేరింది. ఏపీ పోలీసులు అరెస్టు చేసిన యోహాన్ రాజును పీటీ వారెంట్‌పై తీసుకురావాల్సి ఉంది. టెన్త్ చదివిన మదన్ ఫోర్జరీలో దిట్ట మహారాష్ట్రలోని షిర్డీకి చెందిన మదన్ పదో తరగతి వరకు చదివాడు. ఆపై అక్కడే వ్యవసాయం చేసేవాడు. 2019లో వెంకటరమణ షిర్డీ వెళ్లినప్పుడు ఇతడితో పరిచయం ఏర్పడింది. అప్పటినుంచి రాకపోకలు, సంప్రదింపులు కొనసాగాయి. సంతకాలను ఫోర్జరీ చేయడంలో మదన్‌కు పట్టుండటంతో వెంకటరమణ అతన్ని సాయికి పరిచయం చేశాడు. తెలుగు అకాడమీ డబ్బు వివిధ బ్యాంకుల్లో ఎఫ్డీ చేయడానికి సాయి తన అనుచరులైన సోమశేఖర్ తదితరులను దళారుల అవతారం ఎత్తించాడు. డబ్బు కాజేయాలని ముందే పథకం వేసిన సాయి.. అకాడమీ నుంచి తన అనుచరుల ద్వారా ఆ మొత్తాలకు సంబంధించిన చెక్కులు, కవరింగ్ లెటర్లను తీసుకున్నాడు. తొలుత లేఖల్లో ఎఫ్డీ కాలాన్ని మారుస్తూ నకిలీవి సృష్టించాడు. వీటిని అకాడమీ ఇచ్చిన చెక్కులతో జత చేసి బ్యాంకుల కు పంపించాడు. ఈ లేఖల్లో సదరు మొత్తాన్ని 5 రోజుల నుంచి వారానికే ఎఫ్డీ చేయాలని కోరేవాడు. బ్యాంకులు ఈ కాలానికి ఎఫ్డీ చేస్తూ దానికి సంబంధించిన బాండ్లు అందించేవి. వీటిని తీసుకుని సాయి అనుచరులు కొండాపూర్‌లోని అడ్డాకు చేర్చేవాళ్లు. ఎఫ్‌డీల ఆధారంగా పద్మనాభన్ కంప్యూటర్ సాయంతో నకిలీవి తయారు చేసి ప్రింట్ తీసేవాడు. నకిలీ కవరింగ్ లెటర్లపై అకాడమీ అధికారుల సంతకాలు, నకిలీ ఎఫ్డీలపై బ్యాంకు అధికారుల సంతకాలను మదన్ ఫోర్జరీ చేసేవాడు. నకిలీ ఎఫ్డీలను అకాడమీకి ఇచ్చి 5 రోజులో, వారం రోజులో గడువు ముగిసిన తర్వాత తమ వద్ద ఉన్న ఒరిజనల్ ఎఫ్డీలు రద్దు చేసేవారు. కేవలం తెలుగు అకాడమీ కుంభకోణంలోనే కాకుండా ఏపీలో చోటు చేసుకున్న రెండు స్కాముల్లోనూ సాయి తదితరులతో పాటు మదన్ నిందితులుగా ఉన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలైన ఏపీ ఆయిల్ ఫెడ్, ఏపీ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ల నుంచీ సాయి గ్యాంగ్ రూ.14.6 కోట్లు కాజేశారు. అక్కడా నకిలీ లేఖలు, బాండ్లను పద్మనాభన్ తయారు చేయగా... బ్యాంకు, అధికారుల సంతకాలను మదన్ ఫోర్జరీ చేశాడని తేలింది. ఇతడిని సీసీఎస్ పోలీసులు న్యాయస్థానంలో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. -
‘ఎఫ్డీ స్కామ్’.. చెన్నై జైల్లో నేర్చుకున్నాడు!
సాక్షి, హైదరాబాద్: తెలుగు అకాడమీకి చెందిన రూ.64.5 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్స్ (ఎఫ్డీ) స్కామ్‌లో రోజుకో కొత్త విషయం వెలుగుచూస్తోంది. తాజాగా సూత్రధారి చుండూరి వెంకట కోటి సాయికుమార్ విచారణలో సీసీఎస్ పోలీసులు పలు కీలకాంశాలు గుర్తించారు. ఎఫ్డీ స్కామ్‌కు సంబంధించి విషయాలను చెన్నై జైల్లో నేర్చుకున్నట్లు వెల్లడైంది. నార్తర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ (ఎన్సీఎల్) కేసులో జైలుకు వెళ్లినప్పుడు సహనిందితులే వీటిని నేర్పించారని సాయి బయటపెట్టాడు. హైదరాబాద్‌లోని అంబర్‌పేట ప్రాంతానికి చెందిన సాయికుమార్ మొదట స్వాల్ కంప్యూటర్స్ పేరుతో సాఫ్ట్వేర్ కంపెనీ ఏర్పాటు చేశాడు. దీనికి హైటెక్ సిటీతోపాటు తమిళనాడులోని చెన్నైలోనూ కార్యాలయాలు ఏర్పాటు చేశాడు. అమెరికాకు చెందిన ప్రాజెక్టులు కైవశం చేసుకోవడానికి ఎంతగా ప్రయత్నించినా సాధ్యం కాకపోవడంతో సాయికి ఈ రంగంలో నష్టాలే మిగిలాయి. ఈ క్రమంలో అతనికి తమిళనాడు ముఠాతో పరిచయమైంది. అప్పటికే ఈ గ్యాంగ్ ఎన్‌సీఎల్‌కు చెందిన ఎఫ్డీలపై కన్నేసింది. చెన్నైలోని పలు బ్యాంకుల్లో ఉన్న రూ.25 కోట్లు కాజేయడానికి పథకం సిద్ధం చేసింది. ఈ క్రమంలో సాయితో ఒప్పందం చేసుకుంది. ఎన్సీఎల్ ఎఫ్డీలను లిక్విడేట్ చేయగా వచ్చిన రూ. 6 కోట్లను స్వాల్ సంస్థ పేరిట ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెన్నై శాఖలోని కరెంట్ ఖాతాలోకి మళ్లించింది. ఆ మొత్తం డ్రా చేసి ఇచ్చినందుకు రూ.కోటి కమీషన్‌గా సాయికి అందించింది. ఇప్పటికీ మూడు ఎఫ్‌డీల స్కామ్ ఎన్సీఎల్ స్కామ్ వెలుగులోకి రావడంతో చెన్నైకు చెందిన సీబీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. సూత్రధారులు సహా మొత్తం 15 మందిని అరెస్టు చేయగా, వీరిలో సాయి కూడా ఉన్నాడు. ఈ కేసులో చెన్నై జైలు కు వెళ్లిన సాయికుమార్ అక్కడే ఎఫ్‌డీల స్కామ్ ఎలా చేయాలనే అంశాలను వీరి ద్వారా తెలు సుకున్నాడు. జైలు నుంచి బయటకు వచ్చిన సాయి రియల్టర్ అవతారం ఎత్తాడు. ఈ క్రమంలోనే పశ్చిమ గోదావరి జిల్లా తణుకు ప్రాంతానికి చెందిన నండూరి వెంకట రమణతో పరిచయం ఏర్పడింది. తన స్వస్థలంలో ప్రింటింగ్‌ప్రెస్ నిర్వహించే వెంకటరమణకు ఓ కేంద్ర ప్రభుత్వసంస్థతో ఒప్పందం ఉంది. ఆ సంస్థకు కావాల్సిన బిల్ బుక్స్సహా అన్ని రికార్డులనూ ముద్రించి అందిస్తుంటాడు. అయితే తన పిల్లల చదువు నిమిత్తం హైదరాబాద్‌కు వలస వచ్చిన వెంకటరమణ సైనిక్‌పురి ప్రాంతంలో స్థిరపడ్డాడు. ఇతడు కూడా రియల్టర్‌గా మారాడు. ఈ క్రమంలోనే సాయితో పరిచయం ఏర్పడింది. వీరిద్దరూ మరికొందరితో కలసి 2012లో ఏపీ మైనార్టీ వెల్ఫేర్ సొసైటీ ఎఫ్డీలు, 2015లో ఏపీ హౌసింగ్ బోర్డ్ ఎఫ్డీలు, తాజాగా తెలుగు అకాడమీ ఎఫ్‌డీల సొమ్ము కాజేశారు. ఏపీలోనూ కుంభకోణాలు తెలుగు అకాడమీ ఫిక్స్డ్ డిపాజిట్ల కుంభకోణం నిందితులు 11 ఏండ్లుగా ఈ స్కామ్‌లు చేస్తున్నట్లు సీసీఎస్ పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ ముఠా ఏపీలోని ఏపీ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ నుంచి రూ. 10 కోట్లు, ఏపీ అయిల్ అండ్ సీడ్స్ కార్పొరేషన్‌కు చెందిన రూ. 5 కోట్లను కొట్టేసి, ఆ డబ్బును ఏపీ మర్కంటైల్ బ్యాంకులోకి మళ్లించినట్లు నిందితులు వెల్లడించారు. తెలుగు అకాడమీ కేసులో ఇప్పటి వరకు 14 మందిని సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. 2009 నుంచి సాయికుమార్ ఫిక్స్డ్ డిపాజిట్ల కుంభకోణం చేశారని, ఇతడిపై వివిధ ప్రాంతాల్లో 8 కేసులు ఉన్నట్లు తెలిసిందని సీసీఎస్ అధికారులు పేర్కొంటున్నారు. 9 మంది కస్టడీ మంగళవారం ముగియడంతో వారిని కోర్టులో హాజరుపరిచిన అనంతరం చంచల్‌గూడ జైలుకు తరలించారు, మరో పక్క కెనరా బ్యాంకు చందానగర్ మాజీ మేనేజర్ సాధనను కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నారు, ఆమెకు రూ. 1.99 కోట్లు సాయికుమార్ అందించినట్లు వెల్లడించాడు. సాయికుమార్‌తో పాటు అతని అనుచరులను మరోసారి కస్టడీలోకి తీసుకోవడానికి పిటిషన్ దాఖలు చేశారు, దీనిపై ఈ నెల 16వ తేదీన కోర్టులో విచారణ జరిగే అవకాశాలున్నాయి. -
రికవరీ 5 శాతం లోపే!
సాక్షి, హైదరాబాద్: వివిధ బ్యాంకుల్లో తెలుగు అకాడమీకి చెందిన ఫిక్సిడ్ డిపాజిట్లను (ఎఫ్డీ) కొల్లగొట్టడానికి సాయికుమార్ నేతృత్వంలో రంగంలోకి దిగిన ముఠా పక్కా ప్లాన్ ప్రకారం వ్యవహరించింది. ఈ కేసులో తాము అరెస్టు అయినా... నగదు మాత్రం రికవరీ ఇవ్వకూడదనేలా వ్యవహరించింది. ఫలితంగా పోలీసులు ఈ కేసులో ఇప్పటికి 5% లోపు సొమ్మే స్వాధీనం చేసుకోగలిగారు. ఈ స్కామ్‌లో నిందితులు అకాడమీకి చెందిన మొత్తం రూ.64.5 కోట్లను స్వాహా చేశారు. ఇప్పటివరకు సూత్రధారులతో పాటు మొత్తం 14 మందిని సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. నలుగురు సహాయకులు మాత్రమే చిక్కాల్సి ఉంది. అయితే నిందితుల నుంచి పోలీసులు స్వాధీనం చేసుకుంది రూ.3 కోట్లు మాత్రమే. స్కామ్ సొమ్ముతో ఖరీదు చేసిన స్థిరాస్తులు పెద్దగా బయటకు రాలేదు. ఓ నిందితుడు పెద్ద అంబర్‌పేటలో రూ.5 కోట్లు వెచ్చ ంచి భూమి, మరొకరు ఓ ఫ్లాట్ ఖరీదు చేసినట్లు మాత్రమే తేలింది. మిగిలిన సొమ్ము ఏమైందనే దానిపై స్పష్టత రాలేదు. అరెస్టయిన నిందితుల్లో 9 మంది పోలీస్ కస్టడీలో ఉండగా, వీరి విచారణ గడువు మంగళవారంతో ముగియనుంది. వీరిని జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించనున్న సీసీఎస్ పోలీసులు.. కెనరా బ్యాంకు మాజీ మేనేజర్ సాధనను కస్టడీలోకి తీసుకోనున్నారు. ఈ మేరకు న్యాయస్థానం అనుమతి మంజూరు చేసింది. మరో నలుగురిని కూడా కస్టడీలోకి ఇవ్వాలని పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. నిందితుల నుంచి పూర్తి సమాచారాన్ని రాబట్టేందుకు మళ్లీ కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకోవాలని పోలీసులు భావిస్తున్నారు. ఈ స్కామ్‌పై సీసీఎస్‌లో మూడు కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఒక కేసులోనే అరెస్టులు, కస్టడీలు సాగుతున్నాయి. ఇది ముగిసిన తర్వాత మరో రెండింటిలోనూ విచారణ కొనసాగనుంది. -
స్కామ్ సొమ్ముతో భూముల కొనుగోలు
సాక్షి, హైదరాబాద్: తెలుగు అకాడమీలో చోటు చేసుకున్న రూ.64.5 కోట్ల కుంభకోణంపై దర్యాప్తులో కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ డబ్బుల్లో అధిక మొత్తం కాజేసినట్లు ఆరోపణలున్న ప్రధాన సూత్రధారి సాయికుమార్ వివాదాస్పద భూములు ఖరీదు చేసినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. మార్కెట్ రేటు కంటే చాలా తక్కువ ధరకు లభిస్తాయనే ఈ పని చేసినట్లు భావిస్తున్నారు. కాగా, ఇప్పటి వరకు అరెస్టు అయిన 14 మందిలో 9 మందిని సీసీఎస్ పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. పరారీలో ఉన్న మరో నలుగురి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. తెలుగు అకాడమీ అకౌంట్స్ అధికారి రమేశ్, ఎఫ్‌డీల విత్‌డ్రాలో దళారులుగా వ్యవహరించిన సాయికుమార్, నందూరి వెంకట రమణ, వెంకటేశ్వర్రావు, సోమశేఖర్లతో పాటు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్వాన్ బ్రాంచ్ మాజీ మేనేజర్ మస్తాన్‌వలీ, ఏపీ మర్కంటైల్ బ్యాంక్ చైర్మన్ సత్యనారాయణ, మేనేజర్లు పద్మజ, మెహినుద్దీన్లను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఏసీపీ మనోజ్‌కుమార్ నేతృత్వంలోని అధికారులు ఈ నిందితులను వేర్వేరుగా విచారిస్తున్నారు. కొన్ని అనుమానాస్పద అంశాలపై మాత్రం నిందితులను కలిపి విచారిస్తూ వాస్తవాలను నిర్ధారించుకుంటున్నారు. 34 ఎకరాలు, 3 ప్లాట్లు.. ప్రధాన నిందితుడు సాయికుమార్ స్కామ్‌లో తన వాటాగా రూ. 20 కోట్లకుపైగా తీసుకున్నాడని ఇప్పటివరకు గుర్తించారు. ఇతను రూ.5 కోట్లతో పెద్ద అంబర్‌పేట్‌లో 34 ఎకరాల వివాదాస్పద భూము లు కొనుగోలు చేశాడని, ఆ భూముల పత్రాలను కొందరి వద్ద తాకట్టు పెట్టి నగదు తీసుకున్నాడని తెలిసింది. ఇవి తక్కువ ధరకు రావడంతో పాటు భవిష్యత్తులో తాను అరెస్టు అయినప్పటికీ ఈ భూములను పోలీసులు స్వాధీనం చేసుకోలేరనే ఇలా చేసి ఉంటాడని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. ఈ కేసులో మరో నిందితుడైన వెంకటరమణ కొండాపూర్, ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా తణుకు, విశాఖపట్నంలో సుమారు రూ.6.5 కోట్లు వెచ్చించి మూడు ప్లాట్లను కొనుగోలు చేసినట్లు గుర్తించారు. ఈ ఆస్తులకు సంబంధించిన పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ వివరాలను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులకు అందించనున్నట్లు సమాచారం.ఈ కుంభకోణంలో మరికొందరు నిందితుల ప్రమే యం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా, జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న చందానగర్ కెనరా బ్యాంకు మాజీ మేనేజర్ సాధన పోలీసు కస్టడీ పిటిషన్‌పై కోర్టు సోమవారం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. వేగంగా ఈడీ విచారణ తెలుగు అకాడమీలో కుంభకోణంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు విచారణను వేగవంతం చేశారు. హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్లను శుక్రవారమే కోర్టు అనుమతితో తీసుకున్న ఈడీ, శనివారం చంచల్‌గూడ జైల్లో అకాడమీ ఇన్చార్జి అకౌంటెంట్ రమేశ్‌ను ప్రశ్నించింది. బ్యాంక్ ఎఫ్‌డీల నుంచి డ్రా చేసిన డబ్బును ఎవరెవరు, ఎంతెంత తీసుకున్నారు.. తమ వాటాగా తీసుకున్న డబ్బులను ఏం చేశారన్న అంశాలపై కూపీ లాగినట్టు తెలిసింది. కాగా, ఈడీ దర్యాప్తు బృందం సోమవారం బ్యాంక్ మేనేజర్లను ప్రశ్నించేందుకు సిద్ధమవుతోంది. కెనరా బ్యాంక్‌తో పాటు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్లను ప్రశ్నించి ఎఫ్డీ సొమ్మును ఎక్కడికి తరలించారన్న సంగతిని రాబట్టాలని భావిస్తోంది. అలాగే ఈ కుంభకోణంలో ప్రధాన సూత్రధారిగా ఉన్న సాయికుమార్ తన వాటాగా వచ్చిన డబ్బును ఎక్కడికి తరలించాడు, ఎక్కడ పెట్టుబడులు పెట్టాడన్న అంశాలను గుర్తించి వాటిని జప్తు చేయాలని ఈడీ ప్రయత్నిస్తోంది. మరో పక్క ఇద్దరు బ్యాంక్ మేనేజర్లు వారి వాటాగా వచ్చిన డబ్బును కుటుంబ సభ్యుల ద్వారా మళ్లించినట్టు సీసీఎస్ తన దర్యాప్తులో స్పష్టంచేసింది. ఆ డబ్బులను హవాలామార్గాల్లో తరలించినట్లు ఈడీ అనుమానిస్తోంది. ఈ నేపథ్యంలో ఇద్దరు మేనేజర్లతోపాటు మిగతా నిందితులను ప్రశ్నించేందుకు ఈడీ సిద్ధమవుతోంది. -
భూదాన్ పోచంపల్లిలో సాయి కుమార్ మూవీ షూటింగ్
విలక్షణ నటుడు సాయికుమార్ ప్రధాన పాత్రలో విరాజ్ అశ్విన్, పూజిత పొన్నాడ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సినిమా షూటింగ్ మంగళవారం మున్సిపాలిటీ పరిధిలోని పోచంపల్లి, రేవనపల్లి, ముక్తాపూర్ గ్రామాల్లో జరిగింది. అక్కడ సాయికుమార్‌పై పలు కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. సాయికుమార్ మగ్గం నేసే, రచ్చబండ వద్ద గ్రామస్తులతో మాట్లాడే సీన్స్‌తోపాటు ఆయన బైక్‌పై వెళ్తున్న పలు సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ సందర్భంగా దర్శకుడు అనుప్రసాద్ మాట్లాడుతూ.. మగ్గం నేసే తండ్రి కుమారుడిని అమెరికాకు పంపించడానికి చేసిన అప్పులు, ఆ కుటుంబం పడే బాధలు కథాంశంతో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలిపారు. -
నా సెకండ్ ఇన్నింగ్స్‌కి గుర్తింపు తెచ్చే సినిమా ఇది : సాయికుమార్
‘‘నా సినీ జీవితాన్ని మలుపు తిప్పిన సినిమాల్లో ‘పోలీస్ స్టోరీ, ప్రస్థానం’ ఉన్నాయి. నా యాభై ఏళ్ల సినీ జీవితంలో ఇప్పటి వరకు పోషించిన పాత్రలు నా ఫస్ట్ ఇన్నింగ్స్‌కి వైభవాన్ని తీసుకొచ్చాయి. నా సెకండ్ ఇన్నింగ్స్‌కి అద్భుతమైన గుర్తింపును తీసుకొచ్చే సినిమాగా ‘ఎస్ఆర్ కళ్యాణ మండంపం’ ఉంటుంది’’ అని నటుడు సాయికుమార్ అన్నారు. కిరణ్ అబ్బవరం, ప్రియాంకా జవాల్కర్ జంటగా శ్రీధర్ గాదె దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఎస్ఆర్ కళ్యాణ మండపం’. ప్రమోద్, రాజు నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 6న విడుదల కానుంది. కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ– ‘‘కుటంబ సమేతంగా చూడదగ్గ సినిమా ఇది. సాయికుమార్ వంటి గొప్ప నటుడితో నేను పనిచేయడం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. మా సినిమాని రిలీజ్ చేస్తున్న శంకర్ పిక్చర్స్ వారికి ధన్యవాదాలు’’ అన్నారు. -
ఆడవాళ్ళ జోలికొస్తే తగలెట్టేస్తానంటున్న సాయి కుమార్
డైలాగ్ కింగ్ సాయికుమార్ ప్రధాన పాత్రలో ఆనంద్, శ్రీ పల్లవి జంటగా నటిస్తున్న సినిమా ‘వన్ బై టు’.శివ ఏటూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని చెర్రీ క్రియేటివ్ వర్క్స్, బ్యానర్ పై కరణం శ్రీనివాసరావు నిర్మిస్తున్నారు. దారం ప్రభుదాస్ సమర్పకులు. తాజాగా ఈ సినిమా టీజర్ ను చిత్ర యూనిట్ విడుదల చేశారు. ఎవరైనా మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తే వాళ్ళను శిక్షించే పాత్రలో సాయికుమార్ నటిస్తున్నట్లు టీజర్ చూస్తే అర్థమవుతుంది. ఇందులో సాయికుమార్ని చాలా పవర్‌ఫుల్‌గా చూపించారు. అమ్మాయిలపై యాసిడ్ దాడులు, పసిపిల్లల పై అత్యాచారం వంటి సంఘటనలకి ఇందులో చూపించిన పరిష్కారం చాలా వైల్డ్ గా ఉంది. ‘ఆడవాళ్ళ జోలికొస్తే తగలెట్టేస్తా, నేను ఎంటరైతే విశ్వరూపమే’లాంటి సాలీడ్ డైలాగ్స్ చాలా ఆకట్టుకుంటున్నాయి. మహిళల రక్షణ గురించి రూపొందించిన ఓ పవర్ ఫుల్ మూవీ ‘వన్‌బై టు’అని టీజర్ తో అర్థమవుతోంది. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు కన్నడ, హిందీలో కూడా డబ్బింగ్ చేసి థియేటర్ లలో విడుదల చేయబోతున్నారు. త్వరలో చిత్ర బృందం విడుదల తేదీని ప్రకటించనున్నారు. -
ఆ ‘అగ్ని’ రాజేసిన ఆవేశం ఇప్పటికీ చల్లారలేదు
‘‘ఒక్కసారి పురాణాలు దాటి వచ్చి చూడు, అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలే తప్ప, హీరోలు, విలన్లు లేరీ నాటకంలో’’.. తెలుగు సినీ చరిత్రలో కలకలం గుర్తుండిపోయే డైలాగ్ ఇది. ‘ప్రస్థానం’ ద్వారా ఈ ఆణిముత్యం లాంటి డైలాగ్‌ను అందించిన క్రెడిట్ సగం దర్శకుడు దేవకట్టాది అయితే.. తన నటనతో, కంఠంతో పవర్‌ఫుల్‌గా ఆ డైలాగ్‌ను ప్రజెంట్ చేసి మిగిలిన సగభాగం క్రెడిట్‌ను ఖాతాలో వేసుకున్నాడు నటుడు సాయి కుమార్. డైలాగ్ కింగ్‌గా, అంతకు మించి విలక్షణ నటుడిగా తెలుగు, కన్నడ ప్రేక్షకుల అభిమానాన్ని చురగొంటూ వస్తున్నాడాయన. ఇవాళ ఆయన 61వ పుట్టినరోజు.. పుడిపెద్ది సాయి కుమార్..1960 జులై 27న జన్మించాడు. తండ్రి డబ్బింగ్ ఆర్టిస్ట్ కమ్ నటుడు పీజే శర్మ సొంతూరు విజయనగరం, తల్లి నటి జ్యోతి బెంగళూరువాసి. చెన్నైలో ఎంఫిల్ విద్య పూర్తి చేసుకున్నాక.. సినీ నేపథ్యం ఉన్న కుటుంబం కావడంతో ఆవైపు ఆకర్షితుడయ్యాడు సాయి కుమార్. చైల్డ్ ఆర్టిస్ట్‌గా డబ్బింగ్ సినిమాలకు పని చేసిన ఆయన.. పెద్దయ్యాక కూడా తండ్రి బాటలోనే పయనిస్తూ డబ్బింగ్ ఆర్టిస్ట్‌గానే కొనసాగాడు. 1977లో ‘స్నేహం’ ద్వారా నటనలోకి అడుగుపెట్టాడు. స్పష్టమైన తెలుగు ఉచ్ఛారణ.. పవర్ఫుల్ టోన్ కావడంతో బిజీ డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా ఆయనకు గుర్తింపు దక్కింది. మధ్య మధ్యలో చిన్నాచితకా పాత్రలు చేసినప్పటికీ..పూర్తిస్థాయి నటుడి గుర్తింపుదక్కలేదు. అలాంటి టైంలో.. అగ్ని.. ఆ... ఏం జరిగిందో ఏమోగానీ.. డబ్బింగ్ కోసం కొందరు హీరోలు వేరే వాళ్ల వాయిస్ అరువు తెచ్చుకోవడం, మరో వైపు హీరో-ఆర్టిస్ట్‌గా అవకాశాలు పల్చబడడంతో సాయి కుమార్ ఢీలా పడిపోయాడు. సరిగ్గా ఆ టైంలో థ్రిల్లర్ మంజు డైరెక్షన్లో వచ్చిన ‘పోలీస్ స్టోరీ’ సాయి కుమార్ సినీ ‘జీవితాన్ని’ నిలబెట్టింది. కన్నడ నటుడు కుమార్ గోవింద్ చేయాల్సిన ఆ సినిమా అనుకోకుండా సాయి కుమార్ దగ్గరికి వెళ్లడం.. ఆయన సినీ కెరీర్‌ను మలుపు తిప్పింది. 1996లో కన్నడనాట ‘పోలీస్ స్టోరీ’ బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలవడంతో పాటు తమిళ, తెలుగు భాషల్లోనూ సినిమా సంచలన విజయాన్ని సాధించింది. ఆవేశం ఉన్న పోలీసాఫీసర్ అగ్ని పాత్రలో కలకాలం గుర్తుండిపోయే అమోఘమైన నటన అందించాడాయన. ‘సత్యా.. ధర్మా.. అమ్మా..’ అంటూ ఎమోషనల్‌గా చెప్పే డైలాగులు, విలన్లను ఉద్దేశించి ‘ ఏయ్ లబ్బే’ అంటూ ఊగిపోతూ చెప్పే పవర్ఫుల్ పంచ్ డైలాగులు ఇప్పటికీ జనాల చెవులో మారుమోగుతుంటాయి. ఆ సినిమాతో కన్నడనాట స్టార్ హీరోగా ఆయనకంటూ ఓ గుర్తింపు దక్కింది. నటనా ప్రస్థానం కన్నడలో హీరోగా ఫేడవుట్ అయ్యాక.. తిరిగి టాలీవుడ్లో, మధ్య మధ్యలో కన్నడ, తమిళంలోనూ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా బిజీ అయ్యాడు సాయి కుమార్. 2002 తర్వాత సుమారు నాలుగేళ్ల గ్యాప్ తర్వాత ‘సామాన్యుడు’ రూపంలో ఆయన కెరీర్ మలుపు తిరిగింది. ఆ సినిమాకుగానూ బెస్ట్ విలన్‌గా టాలీవుడ్లో తొలి నంది అవార్డును అందుకున్నారు ఆయన. ఆ తర్వాత ‘ప్రస్థానం’ లోక్‌నాథ్ నాయుడు రోల్ రూపంలో మరిచిపోలేని గుర్తింపు తెచ్చిపెట్టింది. అంతేకాదు బెస్ట్ సపోర్టింగ్ నటుడిగా రెండో నందిని అందించింది. ఆపై ‘అయ్యారే, ఎవడు, పటాస్, సరైనోడు, సుప్రీం, జనతా గ్యారేజ్, జై లవ కుశ, రాజా ది గ్రేట్, మహర్షి.. ఇలా కమర్షియల్ డ్రామాలతో కెరీర్‌ను కొనసాగిస్తున్నారు. ఈ మధ్యలో కన్నడనాట ‘రంగితరంగ’ ఇంటర్నేషనల్ ఫేమ్ తెచ్చిపెట్టింది. వెండితెరపైనే కాదు.. ‘కట్ చేస్తే’ బుల్లితెరపై కూడా హోస్టింగ్‌తో మెప్పిస్తూ వస్తున్నారాయన. వాయిస్‌తో మ్యాజిక్ సుమన్, రాజశేఖర్ల కెరీర్‌కు సాయి కుమార్ అందించిన గొంతుక ఒక ‘పుష్అప్’ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భాషా, పెదరాయుడు ద్వారా రజినీకాంత్‌ను తెలుగు ప్రేక్షకులకు చేరువ చేసింది కూడా ఈయన గొంతే. ఇక బాలీవుడ్ మెగాస్టర్ అమితాబ్ బచ్చన్‌కు ‘ఖుధా గవా’(1992) ‘కొండవీటి సింహం’ పేరుతో తెలుగులోకి డబ్ కాగా.. అందులో బిగ్‌బీకి వాయిస్ఓవర్ అందించాడు సాయి కుమార్. మోహన్‌లాల్, మమ్మూటీ, మనోజ్ జయన్, అర్జున్ సార్జా, విష్ణువర్ధన్ పోలీస్ రోల్స్‌కిగానూ సురేష్ గోపీ, విజయ్‌కాంత్ లాంటి వాళ్లకు తన పవర్ఫుల్ వాయిస్ అందించి.. ఆయా నటులను తెలుగు ఆడియొన్స్‌కు దగ్గరయ్యేలా చేశాడు డైలాగ్ కింగ్ సాయి కుమార్. -సాక్షి, వెబ్‌డెస్క్ -
వైరల్ : ఘనంగా సాయికుమార్ షష్టిపూర్తి వేడుకలు
Sai Kumar Shashti Poorthi : ప్రముఖ నటుడు సాయికుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకప్పుడు పోలీస్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న సాయికుమార్ ఆ తర్వాత పలు సపోర్టింగ్ క్యారెక్టర్లతో మెప్పించారు. నటుడిగానే కాకుండా డబ్బింగ్‌తోనూ ప్రత్యక గుర్తింపు సంపాదించుకున్నారు. తాజాగా 60 ఏళ్లలోకి అడుగుపెడుతున్న సాయికుమార్ భార్య సురేఖతో కలిసి షష్టిపూర్తి వేడుకలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేశ్, జీవిత రాజశేఖర్‌లతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చాలా గ్రాండ్‌గా జరిగిన ఈ వేడుకకు పలువురు సినీ ప్రముఖులు హాజరై సాయికుమార్ దంపతులకు అభినందనలు తెలియజేశారు. బాలనటుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సాయికుమార్ హీరోగా పలు సినిమాల్లో నటించారు. అయితే పోలీస్ స్టోరీలో ఆయన పోషించిన పాత్రకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ప్రస్తుతం బుల్లితెరపై వ్యాఖ్యాతగా సత్తా చాటుతున్న సాయికుమార్ సినిమాల్లోనూ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా ఆది సాయికుమార్
ఆది సాయి కుమార్ కెరీర్లోనే భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న చిత్రం ‘అమరన్ ఇన్ ది సిటీ-చాప్టర్ 1’. ఎస్.బలవీర్ దర్శకుడిగా పరిచయం చేస్తూ ఎస్వీఆర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆది పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న ఈ చిత్రంలో అవికా గోర్ నాయికగా నటిస్తోంది. సిల్వర్ స్క్రీన్ పై ఇప్పటి వరకు రాని కొత్త కథా నేపథ్యంతో 'అమరన్’రూపొందుతుంది. ఈ మూవీ షూటింగ్ ఇటీవల హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ ఫస్ట్ షెడ్యూల్లో భారీ బడ్జెట్‌తో నిర్మించిన పోలీస్ స్టేషన్ సెట్లో షూటింగ్ చేస్తున్నారు. దీంతో పాటు నగర పరిసర ప్రాంతాల్లో కీలక సన్నివేశాల చిత్రీకరణ జరపనున్నారు. ఆది సాయి కుమార్ సరికొత్త లుక్ లో కనిపించనున్న ఈ చిత్రంలో గ్రాఫిక్స్ కు ప్రాధాన్యత ఉండబోతోంది. సాయి కుమార్, ఆదిత్య ఓం, కృష్ణుడు, మనోజ్ నందన్, వీర శంకర్, అయన్, శృతి, రోషన్, మధు మణి తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి కృష్ణ చైతన్య సంగీతం అందిస్తున్నారు. -
A ఫ్యామిలీ వాయిస్
-
ఫాదర్స్ డే స్పెషల్: సాయికుమార్ ఫ్యామిలీ వాయిస్!
‘‘కనిపించే మూడు సింహాలు నీతికీ న్యాయానికీ ధర్మానికీ ప్రతిరూపాలైతే... కనిపించని నాలుగో సింహమేరా పోలీస్’’... సాయికుమార్ కెరీర్‌కి తొలి బ్రేక్ అయిన ‘పోలీస్ స్టోరీ’ చిత్రంలోని డైలాగ్ ఇది. సాయికుమార్ ఇంటి నాలుగు స్తంభాల్లో ముగ్గురు మన కళ్ల ముందు ఉన్నారు. కనిపించని నాలుగో స్తంభం పీజే శర్మ. ఈ మూడు స్తంభాల బలం ఆ నాలుగో స్తంభం. ఆ బలంతో సాయికుమార్ కుటుంబ వారసత్వం కొనసాగుతోంది. నేడు ‘ఫాదర్స్ డే’ సందర్భంగా సాయికుమార్ తన కుమారుడు ఆది, కుమార్తె జ్యోతిర్మయితో కలిసి ‘సాక్షి’తో చెప్పిన విశేషాల్లో కొన్ని... స్వరం నాన్నది.. సంస్కారం అమ్మది – సాయికుమార్ ► నా స్వరం నాన్న (ప్రముఖ నటుడు పీజే శర్మ) గారిది. సంస్కారం అమ్మ (కృష్ణజ్యోతి) ఇచ్చింది. ఆశీర్వాదం ఆ భగవంతుడిది. అభిమానం ప్రేక్షకులందరిదీ. మా నాన్నగారు చాలా స్ట్రిక్ట్. ఈ విషయంలో ఆది, జ్యోతిర్మయి చాలా లక్కీ (నవ్వుతూ). నాన్నగారి నుంచి నాకు, నా నుంచి నా పిల్లలు ఆది, జ్యోతిర్మయికి క్రమశిక్షణ అలవడింది. ► మా నాన్నగారు హీరో అవ్వాలనుకున్నారు. అమ్మకి హీరోయిన్ అవ్వాలని ఉండేది. కానీ అప్పట్లో ఉన్న పోటీ, వారి వ్యక్తిగత పరిస్థితుల వల్ల వారు ఊహించిన స్థాయిలో కుదర్లేదు. కుటుంబం కోసం అమ్మ త్యాగం చేయాల్సి వచ్చింది. పీజే శర్మ ఎంత కాలం ఇండస్ట్రీలో ఉంటారు.. మళ్లీ తిరిగి అగ్రహారం వచ్చి పౌరోహిత్యం చేయరా? అనుకున్నవాళ్లూ ఉన్నారు. అమ్మ మాకు ఒక స్ఫూర్తిగా, నాన్న ఓ శక్తిగా నిలబడ్డారు. అమ్మ ప్రోద్బలంతో, నాన్న ప్రోత్సాహంతో కెరీర్లో ముందుకు వెళ్లాను. నాన్న ఏది సాధించాలనుకున్నారో అన్నీ కలగలిపిన హీరోగా ఆది తయారయ్యాడు. నేను డాక్టర్ అవ్వాలనుకున్నాను.. ‘నేను అవుతాను’ అంటూ మా అమ్మాయి అయింది. ► ‘పోలీస్‌స్టోరీ’ సినిమా మంచి విజయం సాధించినందుకు నాన్నగారు చాలా హ్యాపీ ఫీలయ్యారు. తాను సాధించలేకపోయింది నేను సాధించానని సంతోషపడ్డారు. ఆ సినిమా 100డేస్ ఫంక్షన్లో వేదికపై చాలా మంది పెద్దలు ఉన్నా నేను అమ్మ, నాన్న చేతుల మీదుగా షీల్డ్ తీసుకున్నాను. మేం చెన్నైలో ఉన్నప్పుడు ప్రివ్యూస్ చూడటానికి వెళ్లినప్పుడు ఎవరైనా పెద్దవారు వస్తే మమ్మల్ని మేం కూర్చున్న సీట్ల నుంచి లేపి వేరే చోట కూర్చోమనేవారు. కానీ నాన్నగారు రిక్వెస్ట్ చేసి నన్ను, తమ్ముళ్లను అక్కడే కూర్చొనేలా చేసి తాను మరోచోట సినిమా చూసేవారు. ► సినిమా ఇండస్ట్రీలో ఆర్టిస్టులకు, హీరోలకు అర్థం చేసుకునే భార్య దొరకాలి. నా అదృష్టం సురేఖ దొరికింది. అలాగే ఆదికి అరుణ. జ్యోతికి కృష్ణ ఫల్గుణ మంచి సపోర్టివ్. ఇద్దరు మనవరాళ్ళు, ఒక మనవడితో నేను ఫుల్ హ్యాపీగా ఉన్నాను. అలాగే ఈ ఏడాది నా 60వ పుట్టినరోజు రానుంది. నా మనవరాలు ఆద్యశ్రీకి యాక్టింగ్ అంటే ఆసక్తి. మనవడు ఇవాన్‌కు కార్ రేసింగ్ అంటే ఇష్టం. అలాగే ఆది కూతురు అయానా కూడా ఇంటెలిజెంట్ అమ్మాయి. యాక్ట్రస్ అవుతుందేమో చూడాలి. కానీ అయానాకు స్పోర్ట్స్‌లో ఇంట్రెస్ట్ అని ఆది చెబుతుంటాడు. ► నాన్నగారికి ఉన్న చిన్న చిన్న కోరికల్లో కొన్నింటిని తీర్చగలిగాం. మరికొన్నింటిని తీర్చలేకపోయాం. అప్పట్లో స్థోమత లేదు. ఇప్పుడు ఉన్నా ఆయన మాకు దూరమైపోయారు. ఇక అమ్మ పాస్‌పోర్ట్ చూసి ఇప్పటికీ బాధపడుతుంటాను. ఆమెను ఎక్కడికీ తీసుకుని వెళ్లలేకపోయాను. 1993లో నేను అమెరికా వెళ్లాను. తనే అమెరికా వెళ్లినంత హ్యాపీ ఫీలయ్యారు నాన్నగారు. అప్పుడు నేను సురేఖకు రాసిన ఉత్తరం ఇంకా ఉంది. ‘‘నాతో పాటు అమ్మ, నాన్న, మన పిల్లలు, నువ్వు కూడా వస్తే బాగుండేది. భవిష్యత్తులో అందరం వద్దాం. ఎంజాయ్ చేద్దాం’’ అని ఉంది ఆ ఉత్తరంలో. ఆ తర్వాత అమ్మగారు చనిపోయారు. నాన్నగారు అప్పట్లో వచ్చే స్థితిలో లేరు. కానీ ‘శంకర్‌దాదా’ చిత్రం కోసం ఆయన ఆస్ట్రేలియా వెళ్లినప్పుడు చాలా హ్యాపీ ఫీలయ్యారు. ఇకపై ఆది, జ్యోతిర్మయి నేను చూడని ప్లేసెస్‌ను చూపించాలి మరి (నవ్వుతూ). నాన్నకి వందకి వంద – ఆది సాయికుమార్ ► తాతగారిలా నాన్నగారు కూడా స్ట్రిక్టే. కానీ మరీ అంత స్ట్రిక్ట్ కాదు. ఫ్రెండ్లీగా ఉంటారు. నాకు క్రికెట్ అంటే ఇష్టం. నాన్నగారు బాగా ప్రోత్సహించారు... స్వేచ్ఛనిచ్చారు. నాన్నగారు ఫ్రెండ్లీగా ఉన్నా క్రికెట్, టెన్నిస్ టీమ్‌ల గురించి మాత్రం పోట్లాడుకుంటుంటాం (నవ్వుతూ). క్రికెట్‌ను చాలా మిస్ అవుతున్నాను. 2009లో వదిలేశాను.. ఆ తర్వాత సినిమాలవైపు వచ్చాను. కరోనా ఫస్ట్ వేవ్ లాక్డౌన్లో మళ్లీ స్టార్ట్ చేశాను. నేను, ప్రజ్ఞా ఓఝా, అంబటి రాయుడు అండర్ 19 ఆడాం. క్రికెట్లో నేను ఆల్‌రౌండర్. క్రికెట్లో అప్పుడైతే ఇండియాకి ఆడాలి.. లేదంటే రంజీ, రైల్వేస్. ఇప్పుడు ఐపీఎల్ లాంటివి చాలా ప్లాట్‌ఫామ్స్ వచ్చాయి.. ఇప్పుడు అనిపిస్తుంటుంది.. అయ్యో అనవసరంగా వదిలేశానే అని. ► నా తొలి చిత్రం ‘ప్రేమకావాలి’ వంద రోజుల ఫంక్షన్లో నాన్న పక్కన నేనుంటాను.. తాతగారు నాకు ముద్దు పెడుతుంటారు. ఆ ఫొటో చూసినప్పుడల్లా హ్యాపీగా ఉంటుంది. నేను నటన, డ్యాన్స్‌లో శిక్షణ తీసుకుంటున్న సమయంలో నాన్నగారు ఫుల్ బిజీగా ఉండేవారు. ఆ సమయంలో నాకు, తాతగారికి మధ్య మంచి ర్యాపో ఉండేది. నాన్నకి నేను వందకి వంద మార్కులు వేస్తాను. మా నాన్న నుంచి నేను కుటుంబాన్ని ప్రేమించడం నేర్చుకున్నాను. నా పిల్లలకి నేర్పాలి. నా కూతురికి నాన్నగారి పోలికలు వచ్చాయేమో. అందరూ కావాలనుకుంటుంది. ఎక్కువమంది ఉంటే సంతోషపడుతుంది. నాన్నకి వందకి నూటపది – డాక్టర జ్యోతిర్మయి ► నేను డాక్టర్ అవ్వాలనే టాపిక్ ఇంట్లో నడుస్తుండేది. కానీ అసలు విషయం ఏంటంటే.. మా పెద్దవాళ్లు ఆశించడానికన్నా ముందే నేను డాక్టర్ (జ్యోతిర్మయి పీడియాట్రీషియన్)ని కావాలనుకున్నాను. నిజానికి చిన్నప్పుడు నేను ఐదారేళ్లు సినిమాలకు డబ్బింగ్ చెప్పాను. ‘బొంబాయి’ సినిమాలో ఇద్దరు పిల్లలు ఉంటారు. వాళ్లకి డబ్బింగ్ చెప్పడానికి ఆడిషన్‌కి వెళ్లాను. అందులోని ‘కాఫీ కావాలా, టీ కావాలా? అని అమ్మ అడగమంది’ అనే డైలాగు ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేసినా చెప్పలేదు. దీంతో ఎంపిక కాలేదు. మా బాబాయ్ ‘ఈశ్వర్’ సినిమాని ‘ఆయుధ’ పేరుతో తెలుగులో డబ్బింగ్ చేశాం. ఆ సినిమాలో నటించాల్సి ఉంది. అయితే ఎత్తు ఎక్కువ అని తీసుకోలేదు. పాప పాత్రకు తెలుగు డబ్బింగ్ చెప్పాను. నా తొలి సినిమా అదే. ఆ సినిమాకి రూ.5000 పారితోషికం ఇచ్చారు. అంత చిన్న వయస్సులో అంత పెద్దగా సంపాదించానని చాలా కాలం చెప్పుకున్నాను. ► నాన్నగారు నాకంటే మా ఆయనతో ఎక్కువ క్లోజ్‌గా ఉంటారు. మామ, అల్లుడిలా కాకుండా ఇద్దరూ మంచి స్నేహితుల్లా ఉంటారు. ఇక క్రికెట్ అంటే చాలు.. మా నాన్న సపోర్ట్ చేసిన టీమ్‌కి వ్యతిరేకంగా ఆది సపోర్ట్ చేస్తాడు. మా బాబాయిలు కూడా! వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ అప్పుడు ఇంట్లో ఎన్ని సామాన్లు పగిలిపోతాయో చెప్పలేం. నాన్నకి క్రికెట్ అంటే ఎంత ఇష్టం అంటే.. కృష్ణ ఫల్గుణతో నా పెళ్లి చూపులు జరుగుతున్నప్పుడే క్రికెట్ మ్యాచ్ చూశారు. అంత ఇష్టం నాన్నకి! నాన్నకి నేను వందకి 110 మార్కులు వేస్తాను. మా నాన్నగారి నుంచి పాజిటివిటీ నేర్చుకున్నాను. నా పిల్లలకీ నేర్పించాలనుకుంటున్నాను. సాయికుమార్ తల్లితండ్రులు పీజే శర్మ, కృష్ణజ్యోతి ఆది, అరుణ, సురేఖ, సాయికుమార్, జ్యోతిర్మయి, కృష్ణ ఫల్గుణ -
‘అర్థ శతాబ్దం’మూవీ రివ్యూ
టైటిల్ : అర్థ శతాబ్దం నటీనటులు : కార్తీక్ రత్నం, కృష్ణ ప్రియ, నవీన్ చంద్ర, సాయికుమార్, శుభలేఖ సుధాకర్ ఆమని తదితరులు నిర్మాణ సంస్థ : రిషితా శ్రీ క్రియేషన్స్ ఎల్ఎల్పీ, 24 ఫ్రేమ్స్ సెల్యూలాయిడ్ నిర్మాతలు: చిట్టి కిరణ్ రామోజు, తేలు రాధాకృష్ణ దర్శకత్వం : రవీంద్ర పుల్లె సంగీతం : నోఫెల్ రాజా సినిమాటోగ్రఫీ : అస్కర్, వెంకట్, ఈజే వేణు ఎడిటింగ్ : జె.ప్రతాప్ కుమార్ విడుదల తేది : జూన్ 11, 2021(ఆహా) సీరియస్ కథాంశాలతో తెరకెక్కె చిత్రాలు ఇటీవల టాలీవుడ్లో ఎక్కువయ్యాయి. నూతన దర్శకులు కొత్త కొత్త ప్రయోగాలతో వెండి తెరకు ఎంట్రీ ఇస్తున్నారు. వినూత్న కథాంశంతో సినిమాలు తెరకెక్కిస్తున్నారు. ప్రేక్షకులు కూడా ఇలాంటి కథలను ఇష్టపడుతున్నారు. ఇలాంటి ఒక సీరియస్ కథాంశంతోనే తెరకెక్కిన చిత్రం ‘అర్థ శతాబ్దం’. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై ఆసక్తి పెంచింది. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా థియేటర్లో విడుదల కావాల్సి ఉంది. కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఓటీటీ బాటపట్టింది. ఎన్నో అంచనాల మధ్య శుక్రవారం(జూన్ 11)ప్రముఖ ఓటీటీ ఆహా విడుదలైన ‘అర్థ శతాబ్దం’ ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో రివ్యూలో చూద్దాం. కథ సిరిసిల్ల గ్రామానికి చెందిన కృష్ణ (కార్తీక్ రత్నం) చదువు పూర్తి చేసి, ఊళ్లో ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తుంటాడు. ఎప్పటికైనా దుబాయ్ వెళ్లి బాగా సంపాదించి, తల్లిని, చెల్లిని బాగా చూసుకోవాలని అతని కోరిక. ఆయనకు అదే గ్రామానికి చెందిన మాజీ నక్సలైట్ రామన్న(సాయికుమార్) కూతురు పుష్ప(కృష్ణ ప్రియ)అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం. అయితే తన ప్రేమను ఆమెతో పంచుకోలేకపోతాడు. అతని వయసుతో పాటు పుష్పపై ప్రేమ కూడా పెరుగుతూ వస్తుంది. తన మనసులోని మాటను పుష్పతో చెప్పాలని చాలా రకాలుగా ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో కృష్ణ చేసిన ఓ పని ఊర్లో గొడవలకు దారి తీస్తుంది. అసలు కృష్ణ చేసిన పని ఏంటి? దాని వల్ల ఆ ఊళ్లో ఎలాంటి దారుణ పరిస్థితులు ఎదురయ్యాయి? వీరి ప్రేమకి కులాల మధ్య కుమ్ములాటకి సంబంధం ఏంటి? చివరకు పుష్ప ప్రేమని కృష్ణ పొందాడా లేదా? అనేదే మిగతా కథ. నటీనటులు ‘కేరాఫ్ కంచరపాలెం’లో జోసెఫ్‌గా నటించి ఆకట్టుకున్న కార్తీక్ రత్నం ఇందులోనూ తనదైన నటనతో మెప్పించాడు. మధ్యతరగతి కుటుంబానికి చెందిన యువకుడు కృష్ణ పాత్రలో ఒదిగిపోయాడు. ఒక హీరోగా కాకుండా, విలేజ్‌కి చెందిన అబ్బాయిగా చాలా సహజంగా తన పాత్ర సాగుతోంది. లవర్ బాయ్‌గా జోష్‌గా కనిపిస్తూ.. బావోధ్వేగ నటనను ప్రదర్శించాడు. ఇక పల్లెటూరికి చెందిన పుష్ప పాత్రకు పూర్తి న్యాయం చేసింది కృష్ణప్రియ. సంప్రదాయ దుస్తుల్లో తెరపై అందంగా కనిపించింది. మాజీ నక్సటైట్ రామన్నగా సాయికుమార్ తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. వ్యవస్థపై చిరాకు పడే ఎస్సై రంజిత్‌గా నవీన్ చంద్ర పర్వాలేదనిపించాడు. ఆమని, శుభలేఖ సుధాకర్ తదితరులు తమ పాత్రల పరిధిమేరకు నటించారు. విశ్లేషణ విప్లవం, కులాల మధ్య గొడవలు, వర్గ పోరు, శ్రమదోపిడి లాంటి నేపథ్యంతో వెండితెరపై ఎన్నో సినిమాలు వచ్చాయి. వాటికి ప్రేమ, కమర్షియల్ హంగులు జోడించి విజయం అందుకున్న చిత్రాలు చాలానే ఉనాయి. అయితే ఇలాంటి కథలను డీల్ చేయడం కత్తిమీద సాము లాంటిదే. కొంచెం తేడా వచ్చిన మొదటికే మోసం వస్తుంది. ఏ విషయాన్ని చెప్పాలనుకుంటున్నామో.. దానిని బలంగా తెరపై చూపించాలి. ఆయా సన్నివేశాలు ప్రేక్షకుడి భావోద్వేగాల్ని తట్టిలేపాలి. అప్పుడే సినిమా సక్సెస్ అవుతుంది. ఈ విషయంలో అర్ధశతాబ్దం దర్శకుడు రవీంద్ర పుల్లె కాస్త తడబడ్డాడు. కుల వ్యవస్థ, వర్గ పోరాటం, రాజ్యాంగం.. అంటూ బలమైన విషయాల్నే ఎంచుకొని, దాన్ని తెరపై చూపించడంలో విఫలమయ్యాడు. మనిషి పుట్టుక మొదలు.. ప్రేమ, కులం, రాజకీయం, రాజ్యాంగం వరకు చాలా విషయాలకు తెరపై చూపించాలనుకొని, దేనికి పూర్తి న్యాయం చేయలేదేమో అనిపిస్తుంది. ఫస్టాఫ్ అంతా కృష్ణ ప్రేమ చుట్టే తిరుగుతుంది. పుష్పపై ఉన్న ప్రేమను వ్యక్తం చేయడానికి కృష్ణ పడే ఆరాటం, రోటీన్ సన్నివేశాలతో నెమ్మదిగా సా..గుతోంది. ఇక సెకండాఫ్‌లో అయినా కథ సీరియస్ టర్న్ తీసుకొని ఏవైనా ఇంట్రస్టింగ్ ఎలిమెంట్స్ ఉంటాయా అని ఆశపడే ప్రేక్షకుడి నిరాశే మిగులుంది. ఎవరు ఎవరిని చంపుతున్నారో ఎవరికీ అర్థం కాదు. ఒక గ్రామంలో ఇంత జరుగుతున్నా.. మంత్రి(శుభలేఖ సుధాకర్), డీఎస్పీ(అజయ్) ఇద్దరు టీ తాగుతూ పిట్టకథలు చెప్పుకోవడం అంత కన్విసింగ్‌గా అనిపించదు. సినిమా మూలాన్ని కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య సంభాషణలతో ముంగించారు. సాయికుమార్, శుభలేఖ సుధాకర్, నవీన్ చంద్ర అజయ్, ఆమని, పవిత్ర వంటి అగ్ర నటులు ఉన్నా వారిని సరిగా వాడుకోలేకపోయాడు. ఇక సహజత్వం కోసం అసభ్య పదజాలాన్ని యదేచ్ఛగా వాడేశారు. రక్తపాతం, హింస మరీ ఎక్కువైంది. క్లైమాక్స్ లో..‘గతించిన క్షణాలన్నీ, గ్రంధాలుగా లిఖించబడినరోజున…కలవని అడుగులన్నీ కలయికగా కలబడే రోజు.. గెలువని ప్రేమలు అన్ని స్మృతులుగా పిలవబడే రోజున.. రాయని అక్షరాలని రాజ్యాంగంగా రాయబడిన రోజున.. మనిషిలో జనించిన ప్రేమ, మనిషిని జయించిన కులాన్ని చిల్చిన రోజున పుడతాను పువ్వునై మరలా ఈ పుడమిలోనే’అనే భారీ ఎమోషనల్ డైలాగ్ సగం అర్థమై, అర్థం కానట్లుగానే ఈ సినిమా సాగుతుంది. ఈ సినిమాకు ప్రధాన బలం నోఫెల్ రాజా సంగీతం బాగుంది. ‘ఏ కన్నులు చూడని’పాట సినిమాకి హైలెట్ అని చెప్పొచ్చు. నేపథ్య సంగీతం బాగుంది. అస్కర్, వెంకట్, ఈజే వేణుల సినిమాటోగ్రఫీ బాగుంది. పల్లె అందాలను, ప్రేమ సన్నివేశాలను చక్కగా చూపించారు. ప్రతాప్ కుమార్ ఎడిటింగ్‌కు ఇంకాస్త పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ కార్తీక్ రత్నం, కృష్ణ ప్రియ నటన దర్శకుడు ఎంచుకున్న పాయింట్ నేపథ్య సంగీతం, పాటలు మైనస్ పాయింట్స్ ఫస్టాప్ అగ్రనటీనటులను సరిగా ఉపయోగించుకోలేకపోవడం మోతాదు మించిన రక్తపాతం, హింస బలమైన సన్నీవేశాలు లేకపోవడం -అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
ఆది సాయికుమార్-అవికా గౌర్ కొత్త సినిమా ప్రారంభం
వైవిధ్యమైన కథా చిత్రాలు, విలక్షణమైన పాత్రలతో హీరోగా తనకంటూ ఓ గుర్తింపును దక్కించుకున్న యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో ఆది సాయికుమార్ కథానాయకుడిగా ఎన్నో సక్సెస్ఫుల్ చిత్రాలను అందించిన ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ జెమినీ సమర్పణలో ఎస్.వీ.ఆర్ ప్రొడక్షన్ పై.లి. పతాకంపై రూపొందుతున్న చిత్రం 'అమరన్ ఇన్ ది సిటీ-చాప్టర్-1’. ఇందులో అవికా గోర్ హీరోయిన్గా నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ శనివారం హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమైంది. ఎస్.బలవీర్ దర్శకుడిగా పరిచయం చేస్తూ ఎస్వీఆర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇవాళ హైదరాబాద్‌లో హీరో హీరోయిన్లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి సాయికుమార్ క్లాప్ కొట్టగా, జెమినీ మూర్తి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. వీరభద్రం చౌదరి గౌరవ దర్శకత్వం వహించారు. ఇప్పటి వరకు ఎవరూ టచ్ చేయని ఇన్నోవేటివ్, యూనిక్ పాయింట్‌తో ఈ చిత్రం రూపొందుతుంది. గత చిత్రాల కంటే ఆది సాయికుమార్ సరికొత్త లుక్‌తో కనిపించనున్నారు. ఈ పాత్రలో కామిక్ టచ్ కూడా ఉంటుంది. విజువల్ ఎఫెక్ట్స్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ భారీ బడ్జెట్‌తో సినిమాను రూపొందిస్తున్నారు నిర్మాతలు. అన్కాంప్రమైజ్డ్గా చేయబోతున్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్‌పై మేకర్స్ రెండేళ్లు పాటు శ్రమించారు. ప్రేక్షకకులను ఎంగేజ్ చేసే కథాంశంతో థ్రిల్లర్, ఫాంటసీ ఎలిమెంట్స్‌తో సినిమాను రూపొందిస్తున్నారు. ఆదిత్య ఓం, కృష్ణుడు, మనోజ్ నందన్, వీర్ శంకర్, పవిత్రా లోకేశ్, మధుమణి తదితరులు ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. కృష్ణ చైతన్య సంగీత సారథ్యం వహిస్తుండగా శాటి.ఎం సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. -
ఆహాలో రిలీజవుతోన్న 'అర్ధ శతాబ్దం'
కార్తీక్ రత్నం, నవీన్ చంద్ర, సాయి కుమార్, కృష్ణ ప్రియ, సుహాస్, పవిత్రా లోకేష్ ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘అర్ధ శతాబ్దం’. రవీంద్ర పుల్లే దర్శకత్వం వహించారు. చిట్టి కిరణ్ రామోజు, తేలు రాధాకృష్ణ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 26 నుంచి ‘ఆహా’లో స్ట్రీమ్ కానుంది. రవీంద్ర పుల్లే మాట్లాడుతూ– జాతి, మత, వర్ణ వివక్షకు వ్యతిరేకంగా ఈ చిత్రం ఉంటుంది. ప్రేమ కోసం జరిగే పోరాటంతో పాటు రాజకీయాలు, కులాల మధ్య జరిగిన వివాదాల నేపథ్యంలో 2003లో జరిగిన కథే ‘అర్ధ శతాబ్దం’. 1950 నుండి 2003 వరకు ఈ కథ జరుగుతుంది’’ అన్నారు. ‘‘మా ‘అర్ధ శతాబ్దం’’ చిత్రాన్ని ఆదరించి సపోర్ట్‌గా నిలిస్తే మరిన్ని చిత్రాలు నిర్మిస్తాం’’ అన్నారు చిట్టి కిరణ్. రాధాకృష్ణ మాట్లాడుతూ– ‘‘22ఏళ్లుగా నటుడిగా ఉన్నాను. ‘అర్ధ శతాబ్దం’ కథ నచ్చడంతో రవీంద్ర, కిరణ్‌లతో భాగస్వామ్యం అయ్యాను. ‘ఆహా’ ద్వారా ఈ చిత్రాన్ని జనాల్లోకి తీసుకెళితో ఆ తర్వాత మరిన్ని చిత్రాలు నిర్మించవచ్చని భావించి ‘ఆహా’లో విడుదల చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: వెంకట్ ఆర్. శాఖమూరి, అష్కర్, ఇ.జె వేణు, సంగీతం: నోఫెల్ రాజ. చదవండి: ‘జాతిరత్నాల’మధ్య చిచ్చు... నవీన్, దర్శిలకు రాహుల్ వార్నింగ్ -
మనదే మొదటి స్థానం
‘‘ప్రేమలో పడ్డ ఓ మధ్యతరగతి కుర్రాడి ఇబ్బంది ఎలా ఉంటుంది? ప్రేమ తర్వాత కుటుంబంతో, స్నేహితులతో అతనికి రిలేషన్స్ ఎలా మారతాయి? అనే అంశాలు ‘శశి’ సినిమాలో ఆసక్తికరంగా ఉంటాయి. ఈ చిత్రంలో ప్రేక్షకులకు కావాల్సినంత డ్రామా ఉంది. సన్నివేశాలు సహజత్వానికి దగ్గరగా ఉంటాయి’’ అని ఆదీ సాయికుమార్ అన్నారు. శ్రీనివాస్ నాయుడు నడికట్ల దర్శకత్వంలో ఆది హీరోగా నటించిన చిత్రం ‘శశి’. ఆర్.పి. వర్మ, సి. రామాంజనేయులు, చింతలపూడి శ్రీనివాసరావు నిర్మించిన ఈ సినిమా రేపు విడుదలవుతోంది. ఆది మాట్లాడుతూ– ‘‘నా ‘లవ్లీ’ సినిమాను వైజాగ్‌లో పంపిణీ చేసిన వర్మగారు ఈ చిత్రకథ వినమన్నారు. శ్రీనివాస్ ‘శశి’ కథ చెప్పినప్పుడు వర్కౌట్ అవుతుందన్న నమ్మకంతో ఓకే చెప్పాను. ఇందులో రెండు షేడ్స్ ఉన్న రాజ్‌కుమార్ పాత్రలో కనిపిస్తాను. నా రగ్డ్ లుక్ కోసం రెండు నెలలు కష్టపడ్డాను. ఈ సినిమాలో లవ్‌స్టోరీ ఉంటూనే ఫ్యామిలీ డ్రామా ఉంటుంది. గతంలో నేను చేసిన కొన్ని సినిమాలు పలు కారణాల వల్ల సరైన విజయం సాధించలేదు. నా కథలను నాన్నగారు (సాయికుమార్) వింటారు కానీ తుది నిర్ణయం నాదే. పెళ్లికి ముందు ఏ పాత్ర అయినా చేసే స్వతంత్రం ఉంటుంది. ఇప్పుడు అలా లేదు (నవ్వుతూ).. బోల్డ్ తరహా క్యారెక్టర్స్ చేయను. గడచిన 2020 అందరికీ బ్యాడ్.. యువ హీరోలంతా ఓ గ్రూప్ పెట్టుకుని సినిమాల గురించి మాట్లాడుకుంటుంటాం. హీరోల మధ్య సఖ్యత విషయంలో తెలుగు చిత్ర పరిశ్రమ తర్వాతే ఏదైనా! ఈ విషయంలో టాలీవుడ్‌దే మొదటి స్థానం’’ అన్నారు. -
సాయి కుమార్ ఆన్లైన్ క్లాసులు చెప్పేవారు: రానా
‘‘ఇప్పుడు అందరికీ ఆన్లైన్ క్లాసులు తెలుస్తున్నాయి. కానీ, నాకు నా మొదటి చిత్రం నుంచి సాయికుమార్‌గారు ఆన్లైన్ క్లాసులు చెప్పేవారు. అందుకే, ఆయన పిలిస్తే నేను వచ్చేస్తా. ఆదికి ‘శశి’ సినిమా పెద్ద హిట్ ఇవ్వాలి’’ అని రానా అన్నారు. ఆది, సురభి జంటగా శ్రీనివాస్ నాయుడు నడికట్ల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘శశి’. ఆర్.పి. వర్మ, సి. రామాంజనేయులు, చింతలపూడి శ్రీనివాసరావు నిర్మించిన ఈ సినిమా 19న విడుదలవుతోంది. ప్రీ రిలీజ్ వేడుకలో హీరోలు రానా దగ్గుబాటి, సందీప్ కిషన్, నాగశౌర్య, విశ్వక్ సేన్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. హీరో ఆది మాట్లాడుతూ –‘‘శ్రీనివాస్ ‘శశి’ కథ చెప్పినప్పుడు ఎంతో ఎగ్జయిట్ అయ్యాను’’ అన్నారు. దర్శకుడు శ్రీనివాస్ నాయుడు మాట్లాడుతూ– ‘‘సినిమాలు ఆడొచ్చు ఆడకపోవచ్చు. కానీ చెడ్డపేరు రాకుండా సినిమా తీయాలని నిర్మాతలు చెప్పిన మాట మరచిపోలేను. ఇప్పటివరకు మీరు ఆదిని చూశారు. ‘శశి’లో బొమ్మ వేరేలా ఉంటుంది’’ అన్నారు. సభలో సాయికుమార్ కూడా పాల్గొన్నారు. చదవండి: సోషల్ హల్చల్: చీరలో పరువాలు పరుస్తోన్న శ్రద్ధా దాస్ -
ఆహాలో వరల్డ్ ప్రీమియర్‌గా ‘అర్థ శతాబ్దం’
ఆహాలో వరల్డ్ ప్రీమియర్‌గా మార్చి 26న ‘అర్ధ శతాబ్దం’ మూవీ విడుదల కానుంది. ఈ మూవీని జాతీ, మత, వర్ణ వివక్షకు వ్యతిరేకంగా రాజకీయాలు, కులాల మధ్య జరిగిన వివాదాల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ప్రేమ కోసం జరిగే పోరాటంగా 2003లో జరిగిన నిజ జీవితం కథ ఆధారంగా ‘అర్ధ శతాబ్దం’ మూవీని దర్శకుడు రూపొందించాడు. రవీంద్ర పుల్లే దర్శకత్వంలో రిషిత శ్రీ క్రియేషన్స్, 24 ఫ్రెమ్స్ సెల్యూలాయిడ్స్ బ్యానర్లపై వీర్ ధర్మిక్ సమర్పణలో చిట్టి కిరణ్ రామోజు, తేలు రాధాకృష్ణలు సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం మార్చి 26 నుంచి ఆహా వరల్డ్ ప్రీమియర్‌గా స్ట్రీమ్ కానున్న సందర్భంగా చిత్ర యూనిట్ హైదరాబాద్‌లో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు రవీంద్ర పుల్లే మాట్లాడుతూ.. ‘పెద్ద డైరెక్టర్ అయిన క్రిష్‌కు కథ నచ్చడంతో ఆయన మా సినిమా కాన్సెప్ట్ పోస్టర్‌ను విడుదల చేయడంతో సినిమాకు హైప్ క్రియేట్ అయ్యింది. కార్తీక్‌కు హీరో రానా బర్త్ డే విషెస్ తెలపడం. ప్రముఖ దర్శకుడు సుకుమార్ పుష్ప షూటింగ్లో బిజీగా ఉన్నప్పటికి మా టీంతో టైం స్పెండ్ చేసి మా చిత్రం గురించి తెలుసుకుని టీజర్‌ను లాంచ్ చేశారు. హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఒక సాంగ్ లాంచ్ చేశారు. ఇలా ఇండస్ట్రీ లో ఉన్న అందరూ మా సినిమాకు సపోర్ట్‌గా నిలిచారు. వారందరికీ పేరు పేరున మా కృతజ్ఞతలు. ఈ ‘అర్ధశతాబ్దం’ సినిమా 1950 నుంచి 2003 వరకు జరుగుతుంది. ఇండియన్ డెమాక్రసీ మాములు పబ్లిక్పై ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది దాన్ని ఎలా అర్థం చేసుకుని యుటిలైజ్ చేసుకుంటున్నాం. అలాగే దాని ఎలా మిస్ యూజ్ చేసుకొంటున్నాం అనే కథాంశంతో అద్భుతమైన లవ్ స్టొరీని జోడించి సినిమాను తెరకెక్కించడం జరిగింది. నిర్మాతల సపోర్టుతో చిత్రాన్ని పూర్తి చేసి చిత్ర టీజర్‌ను విడుదల చేశాము. ఆహా వారికి మా టీజర్ నచ్చడంతో ఈ సినిమాను ఆహాలో విడుదల చేయమని ఆఫర్ రావడంతో సినిమాను మార్చి 26 నుంచి వరల్డ్ ప్రీమియర్‌గా తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫాం ద్వారా విడుదల చేస్తున్నాం’ అని ఆయన చెప్పారు. అలాగే నిర్మాత చిట్టి కిరణ్ మాట్లాడుతూ.. రవీంద్ర పుల్లే దర్శకత్వంలో ఈ నెల 26వ తేదీన వస్తున్న ‘అర్ధ శతాబ్దం’ మూవీని ఆదరించి మాకు సపోర్ట్‌గా నిలిస్తే మరిన్ని చిత్రాలు నిర్మిస్తామని అన్నారు. ఇక నిర్మాత రాధాకృష్ణ మాట్లాడుతూ... 22 సంవత్సరాల నుంచి ఆర్టిస్ట్‌గా మీ అందరికీ పరిచయస్తున్నే. అయితే రవి, కిరణ్‌లు షూటింగ్ మొదలు పెట్టిన తరువాత నాకు ఈ కథ చెప్పడం జరిగింది. ఈ కథ నచ్చడంతో నిర్మాతగా వారితో కలసి నిర్మించడం జరిగింది. సినిమా పూర్తి అయిన తరువాత థియేటర్లలో విడుదల చేయడానికి ప్లాన్ చేశాము. అయితే కరోనా టైంలో థియేటర్స్ మూతపడటంతో మూవీని ఎలా విడుదల చేయాలని అర్థంకాని పరిస్థితుల్లో ఉన్నామన్నారు. ఈ క్రమంలోఆహా నుండి తమకు కాల్ వచ్చిదని, ఈ ఆఫర్‌ను మిస్ చేసుకోకుండా ప్రస్తుతం జనాల్లోకి వెళ్లేలా ఆహాలో విడుదల చేస్తే మరిన్ని చిత్రాలు నిర్మించవచ్చని ఈ నెల 26 న ఆహా లో విడుదల చేస్తున్నామన్నారు. అందరు అర్థ శతాబ్ధం మూవీ చూసి తమని ఆశీర్వదించాలని కోరుకుంటున్నామన్నారు. ఇందులో ప్రముఖ నటీనటులు కార్తీక్ రత్నం, నవీన్ చంద్ర, సాయి కుమార్, కృష్ణ ప్రియ, సుహాస్, పవిత్ర లోకేష్, అజయ్, శుభలేఖ సుధాకర్, రాజా రవీంద్ర, రామ రాజు, దిల్ రమేష్, టీఎన్ఆర్, శరణ్య, నవీన్ రెడ్డి, ఆమనిలు నటిస్తున్నారు. -
'శశి' ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫోటోలు
-
నన్ను కుక్కలా చూసుకో: హీరో
‘రాజావారు రాణిగారు’ ఫేమ్ కిరణ్ అబ్బవరం నటిస్తున్న తాజా చిత్రం ‘ఎస్.ఆర్.కళ్యాణ మండపం. ‘టాక్సీవాలా’ ఫేమ్ ప్రియాంక జవాల్కర్ హీరోయిన్గా నటిస్తోంది. శ్రీధర్ గాదే దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ప్రమోద్, రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఆ మధ్య రిలీజైన చూశాలే కళ్లారా... పాట సూపర్ హిట్టైన విషయం తెలిసిందే. తాజాగా గురువారం నాడు ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. రెండున్నర నిమిషాల నిడివి ఉన్న ఈ టీజర్లో దాదాపు ముఖ్యమైన పాత్రలన్నింటినీ చూపించారు. డైలాగ్ కింగ్ సాయి కుమార్ ఈసారి సీరియస్ లుక్‌లో కాకుండా కామెడీకి స్కోప్ ఉన్న పాత్రలో నటించి అందరికీ కితకితలు పెట్టనున్నట్లు తెలుస్తోంది. (చదవండి: టాలీవుడ్లోకి జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ఎంట్రీ ఫిక్స్) ఇక హీరో ఇంట్రడక్షన్లోనే మందు తాగుతూ కనిపించాడు. ప్రతి ఒక్కడికీ తన గర్ల్‌ఫ్రెండ్ నడుము మీదనే పంచాయితీ అని తెగ విసుక్కుంటున్నాడు. కానీ తన మీద అంత ప్రేమ చూపిస్తున్న హీరోను కుక్కతో పోల్చుతోంది హీరోయిన్. 'నేను నీకెప్పటికీ పడను. నా దృష్టిలో నువ్వు కుక్కవు' అని చీదరించుకుంటోంది. అయినా సరే, వెనకడుగు వేయని హీరో నన్ను కుక్కలా చూసుకుంటూ నీ దగ్గరే పెట్టేసుకో అంటూ ఆమెను ప్రేమలోకి దింపేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నాడు. (చదవండి: ఫ్యాన్స్‌కు శింబు బర్త్‌డే గిఫ్ట్) బ్యాక్ బెంచ్ స్టూడెంట్ అయిన కిరణ్.. జీవితంలో బాగుపడుదాం అని ఎస్ఆర్ కల్యాణ మండపం పెడతాడు కానీ, అందులో పెళ్లిళ్లు చేసేందుకు నానా తంటాలు పడుతున్నాడు. మరోవైపు చిన్నప్పటి నుంచి కిరణ్ ఒక్కరినీ కొట్టడం చూడటం లేదన్న తండ్రి ముందే హీరోయిజం చూపిస్తూ ఫైటింగ్ ఇరగ దీస్తున్నాడు. ఓవరాల్‌గా ఇంట్రస్టింగ్‌గా ఉన్న ఈ ట్రైలర్ లక్షల వ్యూస్‌తో యూట్యూబ్‌లో దూసుకుపోతోంది. రాయలసీమ నేపథ్యంలో సాగనున్న ఈ సినిమాను వేసవిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
తిరుపతి: బాధ్యత పెంచి.. స్ఫూర్తి నింపి
-
అట్టహాసంగా ముగిసిన పోలీస్ డ్యూటీ మీట్
ఆధ్యాత్మికపురి.. తిరునగరి 2020 డ్యూటీమీట్‌కు వేదికగా నిలిచింది. ఇందుకు రాష్ట్ర వ్యా ప్తంగా ఉన్న పోలీసు యంత్రాంగం మొత్తం తరలివచ్చింది. విభిన్న రంగాల్లో తమ నైపుణ్యాలను ప్రదర్శించింది.. ప్రతిభ చూపింది.. మీట్లో భాగంగా పలు విభాగాల్లో నిర్వహించిన పోటీల్లో విజేతలకు కీర్తి దక్కగా.. మిగిలిన పోలీసు సిబ్బందిలో స్ఫూర్తి నిండింది. సాక్షి, తిరుపతి ఎడ్యుకేషన్/తిరుపతి క్రైం : తిరుపతిలో నాలుగు రోజులుగా నిర్వహించిన తొలి రాష్ట్ర పోలీస్ డ్యూటీ మీట్ గురువారం అట్టహాసంగా ముగిసింది. ఇగ్నైట్ 2020 పేరుతో నిర్వహించిన ఈ డ్యూటీ మీట్ పోలీసుల్లో స్ఫూర్తి నింపింది. రాష్ట్ర విభజనానంతరం తిరుపతి వేదికగా తొలిసారి నిర్వహించిన పోలీస్ డ్యూటీ మీట్‌కు 13 జిల్లాల నుంచి పోలీస్ శాఖలోని అన్ని విభాగాల నుంచి పెద్ద ఎత్తున పోలీస్ అధికారులు, సిబ్బంది తరలివచ్చారు. పోలీసుల్లోని సామర్థ్యాలు, ప్రతిభను వెలికి తీసేలా వివిధ హోదాల్లో పనిచేస్తున్న పోలీసులకు రాత పరీక్షలు నిర్వహించి, బంగారు, వెండి, కాంస్య పతకాలతో సత్కరించారు. అదరహో.. పోలీస్ డ్యూటీ మీట్లో భాగంగా పోలీస్ శాఖలోని ఆక్టోపస్, గ్రేహౌండ్స్, ఎస్డీఆర్ఎస్, ఇంటలిజెన్స్ విభాగాలు ప్రదర్శించిన ప్రత్యేక విన్యాసాలు సందర్శకులను కట్టి పడేశాయి. అలాగే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అదరహో అనిపించాయి. టీటీడీ సహకారం భేష్ పెద్ద ఎత్తున తిరుపతిలో తొలిసారిగా నిర్వహించిన పోలీస్ డ్యూటీ మీట్ విజయవంతం కావడానికి టీటీడీ అందించిన సహకారం మరువలేదని తిరుపతి అర్బన్ ఎస్పీ ఆవుల రమేష్‌రెడ్డి తెలిపారు. వివిధ జిల్లాల నుంచి పోలీస్ డ్యూటీ మీట్‌కు 1,560 మంది పోలీస్ అధికారులు, సిబ్బంది వచ్చినట్లు పేర్కొన్నారు. వీరి వసతి కోసం టీటీడీ 138 గదులను కేటాయించడం అభినందనీయమన్నారు. 21 ఈవెంట్లలో పోటీలు డ్యూటీ మీట్లో భాగంగా పోలీస్ అధికారులు, సిబ్బంది కి 21 ఈవెంట్లలో పోటీలు నిర్వహించారు. ఇందులో 6 ఈవెంట్లు పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో, మిగిలిన 15 ఈవెంట్లను పీటీసీలో నిర్వహించారు. ఈ పోటీలకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి 320 మంది పాల్గొన్నారు. పోలీస్ డ్యూటీమీట్‌లో మెరిసిన చిత్తూరు చిత్తూరు అర్బన్: తిరుపతిలో జరిగిన రాష్ట్రస్థాయి పోలీస్ డ్యూటీమీట్‌లో చిత్తూరుకు చెందిన పోలీసులు ప్రతిభ కనబరచారు. చిత్తూరు ఆర్ముడు రిజర్వు (ఏఆర్)లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ఎస్ఎం జహీర్‌బాషా యాక్సెట్ కంట్రోల్ విభాగంలో బంగారు పతకం సాధించారు. అలాగే ఏఆర్ విభాగంలోని మరో కానిస్టేబుల్ కార్తీక్ వాహనాల తనిఖీ విభాగంలో వెండి పతకం సాధించారు. వీరిద్దరూ కూడా రాష్ట్ర హోంమంత్రి సుచరిత, డీఐజీ క్రాంతిరాణాటాటా, ఎస్పీ సెంథిల్‌కుమార్ చేతుల మీదుగా పతకాలు అందుకున్నారు. దిశ.. ఆమెకు రక్ష ► పోలీసు స్టోరీతోనే హీరో అయ్యా.. ► ఇగ్నైట్‌లో పాల్గొనడం నా అదృష్టం ► ‘సాక్షి’ ఇంటర్వ్యూలో సినీహీరో సాయికుమార్ తిరుపతి అన్నమయ్య సర్కిల్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు అడ్డుకట్ట వేసేందుకు తీసుకొచ్చిన ‘దిశ’ చట్టం వారి పాలిట రక్షణ కవచమేనని సినీ హీరో సాయికుమార్ హర్షం వ్యక్తం చేశారు. తిరుపతి వేదికగా జరుగుతున్న ఏపీ స్టేట్ పోలీస్ డ్యూటీ మీట్ ‘ఇగ్నైట్’ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితుడిగా హాజరైన సందర్భంగా రాష్ట్ర పోలీసు వ్యవస్థపై, పాలనాపరమైన అంశాలపై తన మనోభావాలను ఆయన ‘సాక్షి’తో పంచుకున్నారు. కరోనా కాలం ఎలా గడిచింది ? సాయికుమార్: ఇదొక విపత్కర పరిస్థితి. సామాన్యుడి నుంచి ధనికుల వరకు ప్రతి వ్యక్తినీ కరోనా వైరస్ కష్టపెట్టింది. కళామతల్లి బిడ్డలు చాలామంది దీని బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. చాలా బాధాకరం. ఇలాంటి పరిస్థితిలో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోలీసు వ్యవస్థ, పంచాయతీ కార్మికులు, హెల్త్ డిపార్ట్మెంట్ చేసిన సేవలు ప్రజలు మరువరు. ప్రస్తుతం సినిమాల్లో నటిస్తున్నారా? సాయి: శ్రీవారి ఆశీస్సులతో 1972 నుంచి బాల నటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా అంచెలంచెలుగా ఎదిగాను. పోలీస్ స్టోరీ సినిమాతో హీరోగా ప్రజలు ఆశీర్వదించారు. అప్పటి నుంచి ఇప్పటివరకూ భగవంతుని దయతో ఏటా సినిమాలు, టీవీ ప్రోగ్రాంలతో జీవితం బీజీగా గడుస్తోంది. ప్రస్తుతం మళయాల సినిమా ‘చేక్తల్లీఖాన్ ఐపీఎస్’లో నటిస్తున్నాను. దిశ చట్టంపై మీ అభిప్రాయం? సాయి: సమాజంలో కొంత మంది చట్టాలను చుట్టాలుగా చేసుకుని మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతుండడంతో వారి జీవితాలు సర్వ నాశనమవుతున్నాయి. అటువంటి సంఘటనలు జరగకుండా, ఒక వేళ జరిగినా వెంటనే నిందితులకు కఠిన శిక్షలు పడేలా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దిశ చట్టాన్ని తీసుకురావడం సంతోషదాయకం. అసెంబ్లీలో చట్టం ఆమోదించడం చారిత్రాత్మకం. దిశ చట్టం అతివలకు రక్షణ కవచంగా నిలుస్తుంది. డ్యూటీ మీట్లో మీ అనుభూతి ఏమిటి? సాయి: పోలీసుల్లో కొత్త ఉత్సాహం నింపేందుకు ఏర్పాటు చేసిన ఇగ్నైట్ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. తిరుపతి అర్బన్ ఎస్పీ ఆవుల రమేష్‌రెడ్డి ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమానికి వచ్చాను. పోలీసు డ్యూటీ మీట్లో ఎంతోమంది అధికారులు, సిబ్బంది, సాంకేతిక పరిజ్ఞానాన్ని పుణికి పుచ్చుకుని ప్రదర్శనలను ఇచ్చారు. ప్రతి పోలీసు అధికారికీ ఈసందర్భంగా సెల్యూట్ చేస్తున్నాను. ఏపీ పోలీసు వ్యవస్థపై మీ అభిప్రాయం? సాయి: దేశంలోనే ఆంధ్రప్రదేశ్ పోలీసు నంబర్ వన్‌గా నిలవడం గర్వకారణం. దేశంలో ఏపీ పోలీసు 108 పతకాలు సాధించి ఆంధ్రప్రదేశ్ గౌరవాన్ని ఇనుమడింపజేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలపై మీ స్పందన ? సాయి: మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీని నెరవేర్చడం ప్రభుత్వ బాధ్యత. సంక్షేమ ఫలాలు చిట్టచివరి లబ్ధిదారుని వరకు అవినీతి రహితంగా చేరినప్పుడే ఆ ప్రభుత్వం మనుగడ సాగిస్తుంది. సీఎం జగన్‌కి మరోసారి ప్రజలు బ్రహ్మరథం పడతారు. -
బిగ్‌బాస్: చతికిలపడ్డ కంటెస్టెంట్లు వీళ్లే
అంగరంగ వైభవంగా ప్రారంభమైన బిగ్‌బాస్ నాల్గో సీజన్లో 19 మంది కంటెస్టెంట్లు పాల్గొన్నారు. 16 మందితో మొదలైన షోలో మరో మూడు వైల్డ్ కార్డ్ ఎంట్రీలు వచ్చి చేరాయి. కానీ ఏ వైల్డ్ కార్డ్ కంటెస్టెంటు కూడా ఫినాలేకు చేరుకోలేకపోయింది. కొందరు మెరుపు తీగల్లా వచ్చి వెళ్లిపోగా, భారీ అంచనాల మధ్య వచ్చిన మరికొందరు మాత్రం ఉనికిని కూడా చాటుకోలేక అభిమానులను నిరుత్సాహానికి గురి చేశారు. అలాంటి కంటెస్టెంట్లు ఎవరెవరే చూద్దాం... సూర్యకిరణ్ తన కోపమే తన శత్రువు అన్న వాక్యం దర్శకుడు సూర్య కిరణ్ విషయంలో అక్షరాలా నిజమైంది. ఎదుటి వాళ్లు చెప్పేది వినకుండా, ప్రతిదానికి చిర్రుబుర్రులాడేవాడు. అందుకే షోలో అడుగు పెట్టిన మొదటి వారమే షో నుంచి నిష్క్రమించాడు. కానీ తను హౌస్‌లో ఉండాల్సిన వ్యక్తి అని, ఇలా ఎలిమినేట్ అయిపోతాననుకోలేదని చెప్పుకొచ్చాడు. కానీ రెమ్యూనరేషన్ మాత్రం ఊహించినదానికన్నా పది రెట్లు ఎక్కువే ఇచ్చారని చెప్పాడు. (చదవండి: వారం రోజులకు లక్షల్లో ఇచ్చారు) కరాటే కల్యాణి అప్పుడే కోప్పడుతూ అప్పుడే ఏడుస్తూ కల్యాణి ఎవరికీ ఓ పట్టాన అర్థం కాలేదు. చిన్నచిన్న విషయాలకు కూడా పెద్ద రాద్ధాంతం చేసేది. అలా ఆమె పెద్దపెద్దగా కేకలేస్తూ అందరి మీద నోరు పారేసుకోవడంతో సోషల్ మీడియాలో ఆమెను ట్రోల్ చేశారు. చాలామందితో కయ్యం పెట్టుకుని చివరికి రెండో వారంలో హౌస్ నుంచి ఎలిమినేట్ అయింది. కానీ ఆమె అమ్మ రాజశేఖర్‌తో కలిసి అందరినీ తెగ ఎంటర్టైన్ చేసేది. (చదవండి: అభిజిత్ బిగ్‌బాస్‌కే గర్వకారణం) స్వాతి దీక్షిత్ ఇంట్లో మూడో వైల్డ్ కార్డ్‌గా ఎంట్రీ ఇచ్చిన బొద్దు గుమ్మ స్వాతి దీక్షిత్. ఆమె ఎంట్రీ, ఎలిమినేషన్ రెండూ అందరినీ సర్ప్రైజ్ చేశాయి. ఇంట్లోకి వెళ్లగానే ఆమెను ఇంప్రెస్ చేసేందుకు అబ్బాయిలు పోటీపడ్డారు. చివరికి ఆమె అభిజిత్‌తో కనెక్ట్ కావడం, అభిజిత్-హారిక మధ్య గ్యాప్ రావడం, ఇంతలో ఆమె ఎలిమినేట్ కావడం చకచకా జరిగిపోయాయి. (చదవండి: స్వాతిలో అది నాకు నచ్చలేదు: లాస్య) యాంకర్ లాస్య లాస్య అనగానే గుర్తొచ్చేది చీమ-ఏనుగు జోకులు. ఆమె వేసే జోకులకు ఎవరూ నవ్వకపోయినా ఆమె మాత్రం పడీపడీ నవ్వేది. కానీ ఈ నవ్వే ఆమెకు నానాపేర్లు తెచ్చిపెట్టింది. ఫేక్ స్మైల్, కవరింగ్ స్మైల్ అంటూ మిగతావాళ్లు లాస్య గురించి ఎన్నో అన్నారు. ఇది పక్కన పెడితే ఈ యాంకర్ నుంచి ఆమె అభిమానులు ఎంతగానో ఆశించారు. కానీ ఆ ఎక్స్పెక్టేషన్స్కు మ్యాచ్ అవకుండా ఆమె కిచెన్లోనే ఉండిపోయి వంటలక్కగా మారిపోయింది. టాస్కుల్లోనూ వెనకబడిపోయింది. (చదవండి: టాప్ 2: లాస్య జోస్యం నిజమయ్యేనా?) జోర్దార్ సుజాత తెలంగాణ యాసలో మాట్లాడే ఈ యాంకర్ కిలకిలా నవ్వుతూనే ఉండేది. ఎప్పుడు చూసినా లాస్యతో కలిసి ఇంట్లో జరిగే విషయాల గురించి గుసగుసలు పెట్టేది. అలా ఆమెకు గాసిప్ క్వీన్ అన్న ముద్ర పడిపోయింది. అయితే వ్యాఖ్యాత నాగార్జునను పట్టుకుని ఆమె బిట్టూ అని పిలవడం చాలామందికి నచ్చలేదు. దీంతో ఐదోవారంలోనే ముల్లెమూట సర్దుకుని ఇంటిబాట పట్టింది. బయటకు వచ్చాక సుజాత మాట్లాడుతూ తనను బిట్టూ అని బిగ్‌బాస్ యూనిటే పిలవమని చెప్పిందంటూ తనపై జరుగుతున్న ట్రోలింగ్‌కు గట్టి సమాధానం ఇచ్చింది. (చదవండి: బిట్టూ అని వాళ్లే పిలవమన్నారు: సుజాత) కుమార్ సాయి బిగ్‌బాస్ హౌస్‌లో అడుగు పెట్టిన మొట్ట మొదటి వైల్డ్ కార్డ్ కంటెస్టెంటు. ఎవరితోనూ కలవలేక, క్లారిటీ లేని సమాధానాలతో కన్ఫ్యూజన్ మాస్టర్‌గా నిలిచాడు. కొన్ని టాస్కుల్లో బాగా ఆడి కెప్టెన్ అయినప్పటికీ హౌస్‌లో ఉన్నానా? లేనా? అన్నట్టుగా ఉండటంతో అతడిని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. హౌస్‌లో కూడా ఇంటిసభ్యులు కుమార్‌ను తమలో ఒకరుగా ఫీల్ అవలేదు. దీంతో అతడు ఏకాకిగా మారిపోయాడు. చివరికి ఏడో వారంలో హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యాడు. కానీ నాగార్జున స్క్రిప్ట్ చెప్పాలన్న కోరికకు నాగ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సంతోషంగా వీడ్కోలు తీసుకున్నాడు. -
బిగ్‌బాస్: కుమార్ సాయి రీఎంట్రీ?
కుమార్ సాయి.. ఈ కంటెస్టెంటు మీ అందరికీ గుర్తుండే ఉంటాడు. బిగ్‌బాస్ నాల్గో సీజన్ నుంచి సూర్య కిరణ్ బయటకు అడుగు పెట్టగానే తొలి వైల్డ్ కార్డ్ ఎంట్రీగా కుమార్ సాయి లోనికి వెళ్లాడు. మంచివాడే కానీ కన్ఫ్యూజన్ ఎక్కువ. ఈ ఒక్క కారణంతోనే పదేపదే నామినేషన్లోకి వచ్చి చివరికి ఆరో వారంలో ఎలిమినేట్ అయ్యాడు. అయితే అనధికార పోల్స్‌లో కుమార్ కన్నా మోనాల్ స్వల్ప ఓట్లతో చివరి స్థానంలో ఉంది. అయినా సరే, మోనాల్‌ను కాదని అతడిని ఎలిమినేట్ చేయడంతో చాలామంది ప్రేక్షకులు బిగ్‌బాస్‌ను తిట్టిపోశారు. ఎలిమినేషన్ మీద ఎన్నో ప్రశ్నలను లేవనెత్తారు. ఎలిమినేషన్ ప్రేక్షకుల చేతిలో లేదని అంతా బిగ్‌బాస్ ప్లాన్ ప్రకారమే జరుగుతుందని విమర్శించారు. ఈ నేపథ్యంలో అతడు మళ్లీ హౌస్‌లోకి రీఎంట్రీ ఇస్తున్నట్లు ఓ వార్త నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. అదే కనక నిజమైతే ఎవరి వల్ల అతడు బిగ్‌బాస్‌ను వీడి వచ్చాడో ఆమె డేంజర్ జోన్లో పడే అవకాశముంది. అంటే పొరపాటున మోనాల్ నామినేషన్లోకి వస్తే ఆమె ఎలిమినేట్ అయ్యే ఛాన్సులు పుష్కలంగా ఉన్నాయి. (చదవండి: అఖిల్ అవుట్: ఆలస్యంగా తెలుసుకున్న బిగ్‌బాస్!) ఎందుకంటే అక్కడున్న వారితో పోలిస్తే మోనాల్ అందరికన్నా వీక్ కంటెస్టెంటుగా కనిపిస్తోంది. కానీ ఎప్పటి నుంచో ఆమెను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్న బిగ్‌బాస్ మోనాల్‌ను వదులుకుంటాడా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇక కుమార్ రీ ఎంట్రీ గురించి సోషల్ మీడియాలో నెటిజన్లు పలురకాలుగా మాట్లాడుకుంటున్నారు. అతడు రావడం వల్ల హౌస్‌లో పరిస్థితులు మారిపోయే అవకాశం ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు. మరికొందరు మాత్రం అతడిని తీసుకురావడం వెనక కుట్ర ఉందని మరో కోణాన్ని ఎత్తి చూపుతున్నారు. అతడు వస్తే కచ్చితంగా వచ్చేవారం మళ్లీ అతడే ఎలిమినేట్ అవుతాడని, తద్వారా లాస్య, మోనాల్‌ను సేవ్ చేయాలనుకుంటున్నారని కామెంట్లు చేస్తున్నారు. మరి అసలు కుమార్ సాయి రీఎంట్రీ ఉంటుందా? లేదా? అన్నది అధికారికంగా తెలియాలంటే నేటి ఎపిసోడ్ వచ్చేంతవరకు వేచి చూడాల్సిందే. (చదవండి: జోకర్ ఎలిమినేటెడ్, కానీ ఆ కోరిక నెరవేరనుంది) -
బిగ్‌బాస్‌లో ఆ ఒక్కటి చాలా కష్టం: కుమార్ సాయి
టాస్కులు బాగా ఆడితే పంపించేస్తారనే విషయం బయటకు వస్తే కానీ తెలీలేదంటున్నాడు కుమార్ సాయి. బిగ్‌బాస్ షో ప్రారంభమైన మొదటి వారంలోనే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన అతడు అందరికీ చేరువ కాలేకపోయాడు. అప్పటికే బంధాలు, స్నేహాలు ఏర్పరుచుకున్న మిగతా ఇంటి సభ్యులు కుమార్‌ను ప్రత్యేకంగా చూశారు తప్ప తమలో ఒకరిగా కలుపుకుపోలేదు. పైగా అతడే ఎవరితో కలవట్లేదని చెప్తూ వీలైనన్ని సార్లు నామినేట్ చేశారు. చివరాఖరికి ఏకాకిగా షో నుంచి బయటకు వచ్చేశాడు. తాజాగా కుమార్ సాయి బిగ్‌బాస్ షో గురించి, ఇతర కంటెస్టెంట్ల గురించి, ఎలిమినేషన్ గురించి మనసులోని మాటను బయటపెట్టాడు. ఆయన ఏమన్నాడో అతని మాటల్లోనే.. బయటకు వచ్చాక మొదలైంది అసలు బాధ బిగ్‌బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయినందుకు బాధగానే ఉంది. కానీ బయట పరిస్థితులు ఏంటో నాకు తెలీదు, కాబట్టి పెద్దగా బాధపడలేదు. ఆట వరకు మనం ఆడతాం. ఫలితం ప్రేక్షకుల చేతిలో ఉంటుంది, సంతోషంగానే బయటకు వచ్చాను, కానీ ఆ తర్వాత అసలు బాధ మొదలైంది. మేమంతా ఓట్లు వేశాం నువ్వు ఎలా ఎలిమినేట్ అయ్యావ్ అంటుంటే బాధేస్తోంది. (చదవండి: టూ మచ్ బిగ్‌బాస్.. ఓట్లు ఎందుకు మరి?) అఖిల్ కష్టపడుతున్నాడు, కానీ.. ఎందుకూ పనికి రానిది కరివేపాకు అని నాగార్జున చెప్పారు. కానీ అఖిల్‌ను అంత మాట అనాలనిపించలేదు. కరివేపాకు అనేది కూరలో వేసినప్పుడు ఫ్లేవర్ రావడం లేదని చెప్పాను. టాస్కుల్లో చాలా కష్టపడుతున్నాడు కానీ ఫెయిల్ అవుతున్నాడు. అఖిల్ టాస్కుకు వెళ్తున్నాడు అంటే ఓడిపోతాడు అని కొందరు వెనక మాట్లాడుకుంటున్నారు. అది చెప్పడానికి చాలా ట్రై చేశాను. చెప్పాను, కానీ అతడు పెద్దగా పట్టించుకోలేదు. నీ ఎఫర్ట్‌ను తీసిపారేయకుండా కరివేపాకులా నమిలి తినేయాలి, ఆస్వాదించాలి అనే ఉద్దేశంతో చెప్పాను. కానీ నెగెటివ్‌గా తీసుకున్నాడు. నువ్ సరిగా ఆడినా అక్కడ ఉన్నావు, నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పాడు. పెద్దగా ఫీల్ అవలేదు. ఎందుకంటే నేనిక కంటెస్టెంటు కాదు కాబట్టి ఏం మాట్లాడలేదు. (చదవండి: అభిజిత్ సారీ చెప్పాలి, లేదంటే..: కుమార్) నామినేషన్స్‌లో ఒరిజినాలిటీ బయటపడుతుంది ఫైనల్‌గా ఎలాంటి రిలేషన్స్ పెట్టుకున్నా ఒంటరిగానే ఆడాలి. అలాంటప్పుడు ఇవన్నీ ఎందుకులే, అని నేను సింగిల్‌గా ఆడాను. వైల్డ్ కార్డ్ ద్వారా వెళ్లడం నాకు మైనస్ అయింది. అక్కడికి వెళ్లేసరికే వాళ్ల వాళ్ల ఫ్రెండ్స్‌తో సెట్ అయిపోయారు. నన్ను కలుపుకోలేదు. మనుషులు అయితే అలా చేయరు. కొన్ని జంతువులు అలా చేస్తాయి. వీళ్లు అలా చేశారు అనడం లేదు కానీ నన్ను అయితే దూరంగా ఉంచారు. బిగ్‌బాస్ హౌస్‌లో చాలా కష్టమైన పని నామినేట్ చేయడం . అప్పటివరకు క్లోజ్‌గా ఉన్న వ్యక్తిని నామినేట్ చేయాల్సి వస్తుంది. అప్పుడే మన ఒరిజినాలిటీ బయటకు వస్తుంది. అయితే హౌస్మేట్స్ వాళ్ల వాళ్ల ఫ్రెండ్స్‌ను నామినేట్ చేయకుండా నన్ను చేశారు. వ్యక్తిత్వానికి కప్పు రావాలని వెళ్లాను డాన్స్ చేయాలి, నటించాలి.. అంటే టాస్క్ వరకు చేస్తాను. కానీ 24 గంటలు నటిస్తూనే ఉండాలి, నవ్విస్తూనే ఉండాలి అంటే నాకు నచ్చలేదు. నేను కమెడియన్ అని లోపలికి వెళ్లి జోకులు వేస్తే నాకంటూ వ్యక్తిత్వం ఉండదు. నా వ్యక్తిత్వానికి కప్పు రావాలని బిగ్‌బాస్‌కు వెళ్లాను తప్ప నా పర్ఫామెన్స్‌కు రావాలని కాదు. నేను షో నుంచి ఎలిమినేట్ అయినా ఆ స్టేజ్ ద్వారా నాగార్జున గారు నా కథ వినడానికి ఓకే చెప్పడం సంతోషంగా ఉంది. త్వరలోనే ఆయనకు కథ వినిపిస్తా అని కుమార్ సాయి చెప్పుకొచ్చాడు. (చదవండి: బిట్టూ అని వాళ్లే పిలవమన్నారు: సుజాత) -
శ్రీవారి సేవలో సాయి కుమార్
సాక్షి, తిరుపతి: కనిపించే మూడు సింహాలు.. పోలీసులు, వైద్యులు, పారిశుద్ధ్య కార్మికులే అన్నారు సినీ నటడు సాయి కుమార్. మంగళవారం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం సాయి కుమార్ మాట్లాడుతూ.. ‘కరోనాతో ప్రపంచ వ్యాప్తంగా ప్రజలంతా భయపడుతున్నా.. స్వామి వారి దయతో అందరూ ధైర్యంగా ఉన్నారు. సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడే షూటింగులు మొదలయ్యాయి. కరోనా పట్ల ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలి’ అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా వారికి సెల్యూట్ చేశారు. ‘పోలీసులు నిజమైన హీరోలు.. వారి గెటప్ వేస్తే.. మాలో ఒక పౌరుషం కనిపస్తుంది. నిజమైన పోలీసులకి ఇంకా ఎంత షౌరుషంగా ఉంటుందో. ‘పోలీస్ స్టోరి’ చేసి 25 సంవత్సరాలు పూర్తి అయింది. త్వరలోనే ‘నాలుగో సింహం’ అని మరో పోలీస్ స్టోరీలో నటించబోతున్నాను’ అన్నారు సాయి కుమార్. (చదవండి: 13 ఏళ్లకు మళ్లీ...) తిరుపతి ఎస్పీ రమేష్ రెడ్డిపై సాయి కుమార్ ప్రశంసలు కురిపించారు. పోలీసు అధికారి పోలంలోకి దిగడం అంటేనే, ఆయన మనుషుల్లో ఎలా కలిసి పోయారో అర్థం చేసుకోవచ్చు అన్నారు. రమేష్ రెడ్డి లాంటి అధికారి ఉన్న చోట మంచి హ్యూమానిటీ కూడా ఉంటుందని తెలిపారు సాయి కుమార్. -
టూ మచ్ బిగ్‌బాస్.. ఓట్లు ఎందుకు మరి?
బిగ్‌బాస్ రియాల్టీ షోలో ఎలిమినేషన్ అనేది ప్రేక్షకులు ఇచ్చే ఓటింగ్ ప్రకారం జరుతుంది. కానీ బిగ్‌బాస్ సీజన్ 4లో ఆరోవారం ఎలిమినేషన్ చూస్తే మాత్రం నిజంగా ఓటింగ్ ప్రకారమే ఎలిమినేట్ చేస్తారా లేదా రేటింగ్‌ని దృష్టిలో ఉంచుకొని నచ్చని కంటెస్టెంట్స్‌ని పంపిస్తారా అనే సందేహాలు ప్రేక్షకుల్లో కలుగుతున్నాయి. ఆదివారం నాటి ఎపిసోడ్లో ప్రేక్షకుల ఓటింగ్‌కు విరుద్దంగా మోనాల్‌ని సేవ్ చేసి కుమార్ సాయిని ఎలిమినేట్ చేశారని సోషల్ మీడియా కోడై కూస్తోంది. మోనాల్ కంటే కుమార్ సాయికి ఎక్కువ ఓట్లు వచ్చినా కావాలనే ఎలిమినేట్ చేశారని నెటిజన్లు మండిపడుతున్నారు. (చదవండి : నేను బైటకచ్చినంక అందరు ఏడిసిర్రట..) వాస్తవానికి కుమార్ మొదట్లో కాస్త సైలెంట్‌గా ఉన్నా..తర్వాత వేగంగా పుంజుకున్నాడు. బిగ్‌బాస్ ఇచ్చిన ప్రతి టాస్క్‌ని 100 శాతం ఎఫర్ట్స్ పెట్టి ఆడాడు. మరీ ముఖ్యంగా గత వారం మాత్రం ఫిజికల్ టాస్క్‌లో కుమార్ సాయి ఒక్కడే హైలెట్‌గా నిలిచాడు. సోదరా అంటూ హౌస్‌మేట్స్‌తో కూడా కలిసేందుకు ప్రయత్నించాడు. ఏ విషయమైనా కుండబద్దలు కొట్టినట్లు చెప్పేవాడు. ఇక మోనాల్ మాత్రం హౌస్‌లోకి వచ్చిన దగ్గరనుంచి ఆట మీద ఫోకస్ లేకుండా ముందు అభి పక్కన ఆ తరువాత అఖిల్ పక్కన చేరి ముచ్చట్లు పెడుతూ వచ్చింది. ఆ తర్వాత మరికొంత ముందు కెళ్లి అఖిల్‌కి హగ్గులు, పొట్టి దుస్తులు ధరిస్తూ గ్లామర్‌తో స్క్రీన్ స్పేస్‌ని పెంచుకుంది. అయితే మోనాల్ ప్రవర్తన ప్రేక్షకులకు ఏమాత్రం గిట్టడం లేదు. బిగ్‌బాస్ హౌస్‌కి ఆడటానికి వచ్చారా రొమాన్స్ చేయడానికి వచ్చారా అని బుల్లితెర ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. దీంతో గతవారం వారికి ఉన్న ఓటు ఆయుధంతో మోనాల్‌ని బయటకు పంపాలని భావించారు. అనుకున్నట్లే మోనాల్‌కి తక్కువ ఓట్లు వచ్చాయి కూడా. దీంతో ఆదివారం నాటి ఎపిసోడ్లో ఆమె బిగ్‌బాస్ హౌస్ నుంచి ఉద్వాసన పలుకుతుందని అంతా అనుకున్నారు. కానీ ఆట మీద ఫోకస్ చేస్తూ తన పనేదో తాను చేసుకుంటున్న కుమార్ సాయి ఎలిమినేట్ చేశారు బిగ్‌బాస్. హౌస్‌లో ఇతర కంటెస్టెంట్స్ సపోర్ట్ అంతగా లేకున్నా ఒంటరిగా గేమ్ ఆడుతూ అలరించిన కుమార్ సాయి ఎలిమినేషన్‌ని ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోతున్నారు. మీ ఇష్టం వచ్చినట్లు చేసుకుంటూ మమ్మల్ని ఓట్లేయమని అడగడం ఎందుకు అని బిగ్‌బాస్ నిర్వాహకులపై మండిపడుతున్నారు. టీఆర్పీ రేటింగ్ కోసం నిజాయితీగా ఆట ఆడేవాళ్లను ఎలిమినేట్ చేస్తారా? ఇక బిగ్ బాస్ షో చూడం.. హాట్ స్టార్ యాప్‌తో పాటు స్టార్ మా ఛానల్‌ను అన్ లైక్ చేస్తాం. అలాగే యూట్యూబ్‌లో బిగ్ బాస్ ప్రోమోకి డిస్ లైక్‌లు కొట్టి మా సత్తా చూపిస్తాం.. అంటూ వార్నింగ్ ఇస్తున్నారు. ఎలిమినేషన్ ప్రక్రియ ఓటింగ్ ప్రకారం జరగట్లేదు.. రేటింగ్ ప్రకారమే జరుగుతోంది సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. అయితే ఇలాంటి ట్రోలింగ్ బిగ్‌బాస్-4 కి కొత్తేమి కాదు. గత వారాల్లో కూడా దేవి నాగవల్లి, స్వాతి దీక్షిత్ ఎలిమినేట్ అయినప్పుడు కూడా ఇలాంటి ఆరోపణలే వచ్చాయి. -
జోకర్ ఎలిమినేటెడ్, కానీ ఆ కోరిక నెరవేరనుంది
లీకువీరులు చెప్పిందే నిజమైంది. టాస్కులు బాగా ఆడే కుమార్ సాయి బిగ్‌బాస్ షో నుంచి ఎలిమినేట్ అయ్యాడు. కానీ అతడికి ఘనమైన, ఆత్మీయ వీడ్కోలు మాత్రం దక్కకపోవడం బాధాకరం. ఇక కుమార్ షోకు వచ్చీరాగానే వెల్లడించిన మూడు కోరికల్లో ఒక కోరికను నాగార్జున నెరవేరుస్తానని హామీ ఇచ్చారు. దీంతో తాను అనుకుంది సాధించానని అతడు స్టేజీపైనే గంతులేశాడు. అలాగే స్టార్ మా దేశంలోనే నెంబర్ 1 ఎంటర్టైన్మెంట్ ఛానెల్ అని నాగ్ సగర్వంగా వెల్లడించారు. అభిని ఓడించిన దివి బిగ్‌బాస్ నాల్గో సీజన్లో నాగార్జున అమ్మాయిలను కాదని తొలిసారి అబ్బాయిలను మెచ్చుకున్నారు. ఈ రోజు అందరికీ చీవాట్లు వడ్డించకుండా ఆటలు ఆడించారు. అందులో భాగంగా ఇంటిసభ్యులను రెండు టీమ్‌లుగా విడగొట్టారు. అఖిల్, సోహైల్, కుమార్ సాయి, అమ్మ రాజశేఖర్, దివి, హారిక ఏ టీమ్‌గా ఏర్పడగా మిగతా వారందరూ బీ టీమ్‌లో ఉన్నారు. నోయల్ సంచాకుడిగా వ్యవహరించాడు. బెలూన్లు పగలగొట్టే డాట్స్ గేమ్‌లో దివి గెలవగా అభిజిత్ ఓడిపోయాడు. (చదవండి: తండ్రి గురించి పచ్చి అబద్ధం చెప్పిన నోయల్!) టగ్ ఆఫ్ 'వార్ వన్ సైడ్' చేతులతో తలపడే ఆటలో హారిక మోనాల్‌ను ఓడించి తన సత్తా చూపించింది. పిగ్గీ బ్యాగ్ రేసింగ్‌లో సోహైల్ హారికను ఎక్కించుకోగా, మెహబూబ్ అరియానాను ఎత్తుకుని పరిగెత్తాడు. ఈ ఆటలో మెహబూబ్ రేసుగుర్రంలా పరుగెత్తి విజేతగా నిలిచాడు. బంతిని ఎక్కువసార్లు చేతితో కొట్టే ఆటలో అవినాష్ ఓడిపోగా కుమార్ విజయం సాధించాడు. బాస్కెట్ బాల్లో అఖిల్ కన్నా ఎక్కువ బంతులు వేసి లాస్య గెలిచింది. తర్వాత రెండు టీమ్‌లు టగ్ ఆఫ్ వార్ ఆడగా.. బీ టీమ్‌ను చిత్తుచిత్తుగా ఓడించిన ఏ టీమ్ విన్నర్‌గా నిలిచింది. అనంతరం నోయల్ ర్యాప్ సాంగ్ ద్వారా అఖిల్, దివి సేఫ్ అయినట్లు ప్రకటించారు. (చదవండి: బిగ్‌బాస్: కుమార్ సాయిని గెంటేశారు!) జోకర్ డ్యాన్స్ ఇరగదీసిన కుమార్ గొడుగు పట్టుకుని డ్యాన్స్ చేయడంలో హారిక గెలవగా అభి ఓడిపోయాడు. జోకర్లా నోయల్ కన్నా కుమార్ అద్భుతంగా డ్యాన్స్ చేశాడు. పాపాయి బొమ్మను ఎత్తుకుని డ్యాన్స్ చేయడంలో అఖిల్ లాస్యను అధిగమించలేకపోయాడు. కళ్లకు గంతలు కొట్టుకుని అవినాష్, అరియానా పోటాపోటీగా డ్యాన్స్ చేసి సమాన స్థాయిలో నిలిచారు. స్కర్ట్ వేసుకుని సోహైల్, మోనాల్ బెల్లీ డ్యాన్స్ చేశారు. సింగరేణి ముద్దుబిడ్డ కాలుతున్న బొగ్గు మీద చేసినట్లు ఉందని నాగ్ సోహైల్‌ను మెచ్చుకున్నారు. కుర్చీలనుపయోగించి డ్యాన్స్ చేయడంలో దివిని వెనక్కునెట్టి మెహబూబ్ అదుర్స్ అనిపించాడు. (చదవండి: పెళ్లి విషయం ఏడేళ్లు దాచా: లాస్య) ఛాన్స్ ఇస్తే కుమార్‌ను సేఫ్ చేస్తా: అరియానా తర్వాత అరియానా సేఫ్ అయినట్లు తెలిపారు. నీకు ఛాన్స్ వస్తే ఎవరిని సేవ్ చేస్తావని అడిగితే ఆమె కుమార్ పేరును చెప్పింది. కానీ నాగ్ మాత్రం ఇద్దరిని బ్యాగులు సర్దుకుని కన్ఫెషన్ రూమ్‌లోకి రమ్మన్నారు. దీంతో ఏం జరుగుతుందో అర్థం కాక ఇంటిసభ్యులు ఓ క్షణం అవాక్కయ్యారు. అఖిల్ మాత్రం మోనాల్ వెళ్లిపోతుందేమోనని ఏడ్చేశాడు. కానీ ఆమె మాత్రం తనకు కూడా ఇక్కడ ఉండటం ఇష్టం లేదని, ఎవరితో మాట్లాడాలని లేదని కన్నీళ్లు పెట్టుకుంది. కానీ ఇంటిసభ్యులు మాత్రం మోనాల్ వెళ్లడం లేదని బలంగా నమ్ముతూనే కుమార్‌ను సరిగా పట్టించుకోనేలేదు. నాకు నచ్చనిది వంకాయ, హారిక: కుమార్ ఇక కన్ఫెషన్ రూమ్‌లోకి వెళ్లిన ఆ ఇద్దరిలో కుమార్ ఎలిమినేట్ అయినట్లు నాగ్ ప్రకటించారు. అయితే తాను అనుకున్న మూడింటిలో ఒకదాన్ని సాధించి బయటకు వెళ్లిపోతున్నాడు. నాగార్జునకు కథ చెప్పాలన్న కోరికకు ఆయన అనుమతించారు. తర్వాత ఇంటి సభ్యులందరినీ ఒక్కో కూరగాయతో పోల్చాడు. అరియానాను ఉల్లిపాయ, అవినాష్‌ను ఆటలో అరటిపండును, అఖిల్‌ను కరివేపాకు, మాస్టర్‌ను కాకరకాయ, అభిజిత్ కూల్ కీరదోసగా, లాస్యను మొక్కజొన్న(ముసుగులో నవ్వే వ్యక్తి)గా, నోయల్ మెల్లిమెల్లిగా తరెచుకునే వ్యక్తి క్యాబేజీగా, సోహైల్ టైమ్‌పాస్ వేరుశెనగకాయగా అభివర్ణించాడు.(చదవండి: బిగ్‌బాస్: నొప్పితో విలవిల్లాడిన కుమార్) మాస్టర్‌పై బిగ్‌బాంబ్ దివి పైనాపిల్(లోపల బాగానే ఉన్నా పైనకు కోపంగా కనిపించే వ్యక్తి)గా, హారికను తనకు నచ్చని వంకాయగా, మెహబూబ్‌ను ఉడకబెట్టిన గుడ్డుతో పోల్చాడు. ఉన్నదున్నట్టుగా చెప్పిన కుమార్ మాటలను కొందరు కంటెస్టెంట్లు తీసుకోలేకపోవడం గమనార్హం. తర్వాత అందరి కోరిక మేరకు కుమార్ డ్యాన్స్ చేశాడు. అదే సమయంలో మోనాల్ కన్ఫెషన్ రూమ్‌లో నుంచి బయటకు రావడంతో అందరికన్నా ఎక్కువ అఖిల్ తెగ సంతోషించాడు. వారం రోజులపాటు వాష్‌రూమ్స్ శుభ్రం చేయాలన్న బిగ్‌బాంబ్‌ను కుమార్ మాస్టర్‌పై వేశాడు. -
బిగ్‌బాస్ ట్విస్ట్: ఆ ఇద్దరూ బ్యాగు సర్దేశారు!
బిగ్‌బాస్ నాల్గో సీజన్లో ఇప్పటివరకు ఐదుగురు కంటెస్టెంట్లు సూర్యకిరణ్, కల్యాణి, దేవి, స్వాతి, సుజాత ఎలిమినేట్ అయ్యారు. గంగవ్వ స్వచ్ఛందంగా బయటకు వచ్చేసింది. ఇప్పుడు ఏడో కంటెస్టెంటు బిగ్‌బాస్ షోకు వీడ్కోలు పలకాల్సిన సమయం ఆసన్నమైంది. తక్కువ ఓట్లు వచ్చిన మోనాల్ ఎలిమినేట్ అవుతుందని అందరూ ఊహించారు. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ కుమార్ సాయి వెళ్లిపోనున్నాడని సోసల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో బిగ్‌బాస్ ఓ ట్విస్టు ఉండబోతుందంటూ తాజాగా ప్రోమోను వదిలాడు. ఈ రోజు రెగ్యులర్ ఎలిమినేషన్స్ జరగట్లేదు అని నాగ్ బాంబ్ పేల్చారు. అలా అని ఎలిమినేషన్ లేదని అనుకునేరు. కానే కాదు ఇది డిఫరెంట్ ఎలిమినేషన్ అంటూ ఇద్దరు కంటెస్టెంట్లను బ్యాగు సర్దుకోమన్నాడు. ఆ ఇద్దరు మోనాల్, కుమార్ అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. (చదవండి: బిగ్‌బాస్: కుమార్ సాయి ఎలిమినేట్?) ఇక ఈ ప్రోమోతో డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుందా అన్న అనుమానాన్ని ప్రేక్షకుల మనసులో నాటే ప్రయత్నం చేశారు. కానీ నామినేషన్లో ఉన్న కంటెస్టెంట్లను చూస్తుంటే డబుల్ ఎలిమినేషన్ చేయాల్సిన అవసరం ఇప్పుడేమీ లేనట్లు కనిపిస్తోంది. అయితే చాలామంది ఎలాగో కుమార్‌ను పంపిచేస్తున్నారని, డబుల్ ఎలిమినేషన్ పెట్టి మోనాల్‌ను కూడా వెళ్లగొట్టండని సూచిస్తున్నారు. మరికొందరు మాత్రం ఇది డబుల్ ఎలిమినేషన్ కాదు, బిగ్‌బాస్ ఆడుతున్న డబుల్ గేమ్ అని మండిపడుతున్నారు. కానీ అది బిగ్‌బాస్ హౌస్.. అక్కడేమైనా జరగొచ్చు. కాబట్టి నేడు హౌస్‌ను వీడేది ఒక్కరా? ఇద్దరా అన్న విషయం తేలాలంటే నేటి ఎపిసోడ్ వచ్చేంతవరకు సస్పెన్స్ భరిస్తూ ఎదురు చూడాల్సిందే! (చదవండి: మారని మాస్టర్, సోహైల్‌పై వ్యక్తిగత దూషణ) -
బిగ్‌బాస్: కుమార్ సాయిని గెంటేశారు!
బిగ్‌బాస్ రియాలిటీ షోలో ఈ వారం తొమ్మిదిమంది నామినేట్ అయ్యారు. వీరిలో లాస్య, హారిక, నోయల్ సేఫ్ అయినట్లు నాగ్ శనివారమే ప్రకటించేశారు. ఇంకా అరియానా, అభిజిత్, అఖిల్, దివి, మోనాల్, కుమార్ సాయి నామినేషన్లో ఉన్నారు. నేడు ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంటు పేరును వెల్లడించాల్సి ఉంది. అయితే ఎప్పటిలాగే ఈ వారం ఎవరు హౌస్‌లో నుంచి అడుగు బయట పెట్టనున్నారన్న విషయం ముందుగానే లీకైంది. కానీ ఇది ప్రేక్షకుల అభిప్రాయానికి కాస్త విరుద్ధంగా ఉండటం గమనార్హం. కుమార్ సాయి బిగ్‌బాస్ షో నుంచి ఎలిమినేట్ అయ్యాడన్న వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. (చదవండి: బిగ్‌బాస్: ఆమెపై ఎలిమినేషన్ కత్తి) అన్ని పోల్స్‌లో మోనాల్‌దే ఆఖరి స్థానం అన్ని పోల్స్‌లో మోనాల్ చివరి స్థానం, తర్వాత అరియానా, ఆ తర్వాతే కుమార్ సాయి ఉన్నాడు. దీంతో మోనాల్ బ్యాగు సర్దుకోవడం ఖాయమని అందరూ భావిస్తున్న తరుణంలో అనూహ్యంగా కుమార్ ఎలిమినేట్ అన్న వార్త విని అందరూ షాకవుతున్నారు. బిగ్‌బాస్ నిర్వాహకులు కావాలనే మోనాల్‌ను ఎలిమినేషన్ గండం నుంచి గట్టెక్కించారని చెవులు కొరుక్కుంటున్నారు. నిజానికి తొలి వైల్డ్ కార్డ్ ఎంట్రీ కంటెస్టెంటు కుమార్ సాయి వెళ్లీ వెళ్లగానే నామినేషన్ ప్రక్రియలో అందరూ చెప్పారని పడవ దిగి అప్రతిష్ట మూటగట్టుకున్నాడు. అతను చేసిన ఒక్క తప్పుతో ఇతర కంటెస్టెంట్లకు చులకన అయిపోయాడు. దీంతో నామినేషన్ వచ్చిందనగానే మరో ఆలోచనే లేకుండా చాలామంది అతడినే వేలెత్తి చూపేవారు. (చదవండి: అభి, దివికి అహంకారం, మెహబూబ్ వాడుకుంటున్నాడు) అన్యాయంగా బలైన కుమార్ సాయి ఈ వారం ప్రారంభంలో హారిక కూడా కుమార్ అతి మంచితనం నచ్చలేదని నామినేట్ చేయడం అందుకు పెద్ద సాక్ష్యం. నిద్రపోతాడన్నమాటే కానీ ఫిజికల్ టాస్కులో కుమార్ విజృంభిస్తాడు. టాస్కుకు ఆమడదూరంగా ఉండే చాలామందికన్నా అతడు వేయి రెట్లు బెటర్. అయినా సరే మసాలా కంటెంట్‌ను ఇచ్చే అమ్మాయిని కాపాడేందకు ప్రేక్షకులు ఓట్లు వేసి కాపాడుకున్న కుమార్‌ను అర్ధాంతంరగా గెంటేయడం బాధాకరం. మరి నేటి ఎపిసోడ్లో నిజంగా కుమార్‌నే పంపిస్తారా? లేక ఏదైనా ట్విస్టు ఉంటుందా? చూద్దాం.. -
బిగ్‌బాస్: ఆమెపై ఎలిమినేషన్ కత్తి
బిగ్‌బాస్ నాల్గో సీజన్లో నలభై రోజులు గడిచిపోయాయి. ఇప్పటికే నలుగురు కంటెస్టెంట్లు ఎలిమినేట్ అవగా గంగవ్వ స్వచ్ఛందంగా హౌస్‌లో నుంచి బయటకు వచ్చేసింది. ఇప్పుడు మరో కంటెస్టెంటు ఇంటిని వీడే సమయం ఆసన్నమైంది. ఈ వారం నామినేషన్లో అరియానా, అభిజిత్, మోనాల్, కుమార్ సాయి, అఖిల్, నోయల్, లాస్య, హారిక, దివి ఉన్నారు. వీరిలో ఎవరు ఎలిమినేషన్‌కు దగ్గరగా ఉన్నారో చూసేద్దాం.. ఓవర్ యాక్షనే ఆమెకు మైనస్ అభిజిత్, అఖిల్ దుమ్ము రేపే ఓట్లతో తొలి రెండు స్థానాల్లో హవా చూపిస్తున్నారు. ఇక లాస్య, కుమార్ సాయి, దివి, హారిక, నోయల్‌కు కూడా బాగానే ఓట్లు పడుతున్నాయి. కానీ వారికి మధ్య ఓట్ల తేడా స్వల్పంగా ఉంది. ఇక చివరి రెండు స్థానాల్లో అరియానా గ్లోరీ, మోనాల్ ఉన్నారు. వీరి బలాబలాలు చూసుకున్నట్లైతే అరియానాకు పెద్దగా ఫ్యాన్ ఫాలోయింగ్ లేనప్పటికీ ఆమె ఆడే తీరు ప్రశంసలు అందుకుంటోంది. ఫేక్‌గా ఉండకుండా తనకు ఏది అనిపించిందో అదే మొహంపై చెప్పేస్తుంది. టాస్కులోనూ తనకు చేతైననంత వరకు కష్టపడుతుంది. కానీ ఓవర్ ఎగ్జైట్మెంట్ మాత్రం జనాలకు విసుగు తెప్పిస్తుంది. ప్రతీదానికి అతిగా రియాక్ట్ అవడమే ఆమె దగ్గర ఉన్న ఏకైక మైనస్. ఇక గ్లామర్‌గా ఉంటూ అందరినీ తనవైపు తిప్పుకోడానికి ప్రయత్నిస్తోంది. కానీ మోనాల్‌ను మాత్రం బీట్ చేయలేకపోతోంది. (చదవండి: ఏడేళ్లు అతడు నా భర్త అని చెప్పలేదు: లాస్య) ఫ్యామిలీ ఆడియన్స్‌కు మోనాల్ దూరం ఇక మోనాల్ విషయానికొస్తే వీకెండ్స్‌లో ఆమె ధరించే బట్టల వల్ల ఫ్యామిలీ ఆడియన్స్ ఆగ్రహానికి గురవుతోంది. అలాగే అటు అభిజిత్, ఇటు అఖిల్ ఇద్దరితో లవ్ ట్రాక్ నడిపించేందుకు ప్రయత్నిస్తూ రెండు పడవల ప్రయాణం చేస్తోంది. పైగా మోనాల్ వాళ్ల ఎమోషన్స్‌తో ఆడుకుంటోందంటూ ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్సే ఆమె గురించి నిజాలు బయటపెట్టారు. దీంతో ఆమె వ్యవహారం ఆడియన్స్‌కు అంతగా మింగుడు పడటం లేదు. దానితోపాటు ఇప్పటికీ తెలుగులో మాట్లాకుండా హిందీ, ఇంగ్లీషులోనే ముచ్చట్లు పెట్టడంతో ఆమె ఏం మాట్లాడుతుందనేది కూడా చాలామందికి అర్థం కాని పరిస్థితి నెలకొంది. (చదవండి: నేను కడుపులో ఉన్నప్పుడు అమ్మానాన్న విడిపోయారు) అమ్మాయిలను వదిలేస్తే కుమార్‌కు డేంజర్ ఈ కారణం వల్ల తెలుగు ప్రేక్షకులకు ఆమె అంతగా చేరువ కాలేకపోయింది. దీంతో ఆమెకు అత్యంత స్వల్పంగా ఓట్లు వచ్చాయి. అయితే హౌస్‌లో మసాలా కంటెంట్ కావాలన్నా, ట్రయాంగిల్ స్టోరీని ముందుకు తీసుకువెళ్లాలని బిగ్‌బాస్ నిర్వాహకులు ఓట్లతో సంబంధం లేకుండా ఆమెను సేవ్ చేసే అవకాశం ఉంది. దీంతో అరియానా, ఆ తర్వాత కుమార్ సాయిపై ఎలిమినేషన్ కత్తి వేలాడే అవకాశం ఉంది. ఈరోజు అర్ధరాత్రి వరకు కూడా ఓటింగ్ అవకాశం ఉండటంతో ఓట్ల సంఖ్య తారుమారయ్యే అవకాశమూ లేకపోలేదు. కాబట్టి ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనేది అత్యంత ఆసక్తిగా మారింది. (చదవండి: అవునా.. అరియానాకు బిగ్‌బాస్ అంత ఇస్తున్నాడా?) -
సాయంత్రం మల్లెపూలు తేనా..: అరియానా
బిగ్‌బాస్ షోలో నేడు పార్టీ జరగబోతోంది. కానీ ఇది అమ్మాయిలకే స్పెషల్ పార్టీ అని తెలుస్తోంది. అబ్బాయిలను కూడా పార్టీలో జాయిన్ చేసుకోవాలంటే అమ్మాయిలు కండీషన్స్ పెడుతున్నారు. దొరికిందే ఛాన్సని వారిని ఆటాడేసుకుంటున్నారు. అయినా సరే మాస్టర్ వద్దంటున్నా ఆడవాళ్ల పార్టీలో దూరిపోయాడు సోహైల్. పోనీ అమ్మాయిలు చెప్పినట్లు నడుచుకున్నాడా అంటే అదీ లేదు.. వారికే కౌంటర్లు వేస్తూ పోయాడు. దీంతో సారీ చెప్పమని హారిక డిమాండ్ చేసింది. మాస్ ఇక్కడ క్షమాపణలు చెప్పేదే లేదన్నట్లుగా సోహైల్ ప్రవర్తించడంతో అందరూ కలిసి అతడిని ఓ ఆటాడుకున్నారు. హారిక అతడి లుంగీ పట్టుకుని లాగగా దొరికిన వస్తువు అందుకుని చితకబాదారు. (డబుల్ ఎలిమినేషన్; కళ్యాణి అవుట్!) అఖిల్ పార్టీ రూమ్‌లోకి రాగా సాయంత్రం మల్లెపూలు తేనా అని అరియానా ఓరకంటతో అడగ్గా అతడు సిగ్గులమొగ్గయ్యాడు. ఇక ఈ పార్టీ మొదలు కావడానికి ముందు కంటెస్టెంట్లు అందరూ పుషప్స్ చేశారు. అయితే కుమార్ సాయి కంటిన్యూగా పుషప్స్ చేయలేదని నోయల్ అన్నాడు. ఒక్కరోజైనా నిజాయితీగా ఉండు అని సూచించడంతో అది తప్పు స్టేట్మెంట్ అని కుమార్ ఖండించాడు. ఈ ప్రోమో చూసిన నెటిజన్లు మాత్రం నోయల్ మాటలను తప్పు పడుతున్నారు. కుమార్ వ్యక్తిత్వాన్ని చులకన చేసి మాట్లాడటం సమంజసం కాదని మండిపడుతున్నారు. (బిగ్‌బాస్: ఒకరు సేఫ్, మరొకరు నామినేట్) మరికొందరైతే నోయల్ ఇప్పటికీ ఫేక్‌గానే ఉంటున్నాడని అతడిని దుమ్మెత్తి పోస్తున్నారు. ఒక్క ఆట కూడా ఆడని నోయల్ టాస్కుల్లో ప్రాణం పెట్టి ఆడే కుమార్‌ని నిందించడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మోనాల్ మూడు రోజులవుతున్నా ఇంకా జ్యూట్ డ్రెస్ ధరించడంపై నెటిజన్లు ఛలోక్తులు విసురుతున్నారు. రేపు నాగార్జున ఎదుట ఈ అవతారంలో కనిపించే వరకు ఆ డ్రెస్‌ను వదిలేలా లేదని సెటైర్లు వేస్తున్నారు. బిగ్‌బాస్ డీల్స్ ముగిసినా మోనాల్‌కు మాత్రం ఆ డ్రెస్ నుంచి విముక్తి కల్పించడం లేదని మరికొందరు ఆమెను వెనకేసుకొస్తున్నారు. -
నేను లేకపోతే ఏమైపోతావో: అవినాష్
బిగ్‌బాస్ నేడు ఇంటిసభ్యులకు ఆసక్తికరమైన టాస్కులు ఇచ్చాడు. అందులో భాగంగా కంటెస్టెంట్లు కష్టమైనా నష్టమైనా సరే, టాస్కు గెలిచి తీరాల్సిందేనని హోరాహోరీగా పోరాడుతున్నారు. అయితే దూరంగా ఉందామని డిసైడ్ అయిన అభిజిత్, మోనాల్ ఒక టీమ్‌లో వచ్చి పడ్డారు. దీంతో వాళ్లిద్దరూ మాట్లాడుకోకుండా ఉండలేకపోయారు. అవినాష్ దివికి ఓ లెటర్ ఇచ్చాడు. అయితే అది లవ్ లెటర్ కాకుండా ఫ్రెండ్షిప్ లెటర్ కావడం గమనార్హం. కానీ అరియానాకు మాత్రం దగ్గరుండి మేకప్ వేశాడు. చంద్రముఖిలా ఉండే నువ్వు ఇప్పుడు ఎలా అయ్యావో చూడు అంటూ ఆమెపై ప్రత్యేక శ్రద్ధ చూపించాడు. నేటి బిగ్‌బాస్ ఎపిసోడ్లో ఇంకా ఏమేం జరిగాయో చదివేసేయండి.. కిచెన్‌గా మారిన సోహైల్‌ను చితక్కొట్టారు బిగ్‌బాస్ ఇచ్చిన మార్నింగ్ మస్తీలో సోహైల్ కిచెన్‌గా మారిపోయాడు. దీంతో దొరికిందే ఛాన్సని అందరూ అతడిని చపాతీలా రుబ్బుతూ, బోళ్లు తోముతున్నట్లూ సాకులు చెప్తూ చితక్కొట్టేశారు. అవినాష్ బెడ్‌లా మారిపోగా అమ్మ రాజశేఖర్ అతడిపై విశ్రాంతి తీసుకుంటూ పడుకున్నాడు. అఖిల్ వాష్రూమ్గా మారిపోగా మాస్టర్ అందులోనే స్నానం, నిద్ర అన్నీ చేస్తూ ఛీ అనిపిస్తూనే నవ్వు తెప్పించారు. మోనాల్ తలుపుగా మారిపోగా అందరూ మరోసారి రోబో టాస్కును గుర్తు చేస్తూ డోర్ విరగ్గొట్టేలా విరుచుకుపడ్డారు. దివి కాసేపు డస్ట్‌బిన్‌లా చేసింది. (చదవండి: బిగ్‌బాస్ : కెప్టెన్ పవర్‌తో ఫ్రెండ్‌ని సేవ్ చేసిన సోహైల్) దివికి లెటర్ రాసిన అవినాష్ అనంతరం అవినాష్ ఓ లేఖ రాసి దివికి ఇమ్మని మాస్టర్‌కు ఇచ్చాడు. అందులో ఉన్నది చదివిన మాస్టర్.. నువ్వే ఇచ్చుకో పో అని ఆ లేఖను ముఖాన కొట్టాడు. దీంతో అతడే నేరుగా దివి బెడ్ దగ్గరకు వెళ్లి ఆమె చేతికి కూడా ఇవ్వకుండా బెడ్‌పై పెట్టేసి వెనుదిరిగాడు. అదేమిటా అని ఆమె తెరిచి చూసింది. అందులో దివి, అవి ఫ్రెండ్స్ అని రాసి ఉండటంతో ఓ స్మైల్ ఇచ్చింది, ఆ వెంటనే ఫ్రెండ్షిప్ గురించి ఓ సాంగ్ కూడా పాడింది. తర్వాత అవినాష్ అరియానా దగ్గర తేలాడు. ఆమెకు దగ్గరుండి కళ్లకు కాటుక పెడుతూ మేకప్ వేశాడు. నేను లేకపోతే ఏమైపోతావో అంటూ కబుర్లు చెప్పుకొచ్చాడు. మరోవైపు అభిజిత్ సోహైల్‌కు అందరూ ఇచ్చే సలహానే మళ్లీ గుర్తు చేశాడు. నువ్వు కోపం తగ్గించుకుంటే ఇంత మంచోడివా అనిపిస్తది, కాబట్టి కోపాన్ని కంట్రోల్లో ఉంచుకో అని సలహా ఇచ్చాడు. (చదవండి: గంగవ్వను బయటకు పంపిన బిగ్‌బాస్!) ఆరోవారం అమీతుమీ కెప్టెన్సీ టాస్క్ బిగ్‌బాస్ అమీ తుమీ అనే కెప్టెన్సీ టాస్క్ ఇచ్చాడు. అందులో భాగంగా ఇంటి సభ్యులను రెండు టీమ్‌లుగా విడగొట్టాడు. అరియానా 'రెడ్' టీమ్‌లో అభిజిత్, మెహబూబ్, లాస్య, అవినాష్, మోనాల్ ఉండగా అఖిల్ 'బ్లూ' టీమ్‌లో మిగిలిన ఇంటి సభ్యులు ఉంటారు. సోహైల్ సంచాలకుడిగా వ్యవహరిస్తాడు. ఇక ఈ టాస్క్‌లో భాగంగా బిగ్‌బాస్ రెండు టీమ్స్‌కు సమంగా బంగారు నాణాలు ఇస్తారు. టాస్క్ ముగిసే సమయానికి బిగ్‌బాస్‌తో ఎక్కువ డీల్స్ కుదుర్చుకుని ఏ టీమ్ ఎక్కువ నాణాలు ఖర్చుపెడుతుందో వారే గెలుపును సాధించినట్లు లెక్క. గెలిచిన టీమ్ సభ్యులే కెప్టెన్సీకి పోటీ పడతారు. (చదవండి: ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా: అవినాష్) ► మొదటి డీల్: మగ సభ్యుడు ఒంటి మీదున్న బట్టలను కత్తిరించేయాలి. ఇందుకు 10 బంగారు నాణాలు ఇవ్వాలి. మొదట అఖిల్ బెల్ కొట్టడంతో అతని టీమ్‌లో కుమార్ సాయి షర్టును ముక్కలు ముక్కలుగా కత్తిరించేశాడు. కానీ ఆ షర్టు సోహైల్‌ది కావడంతో ఆయన ఎక్కువగా బాధపడ్డాడు. ► రెండో డీల్: ఇంటి సభ్యుల్లో ఒకరు వారికి సంబంధించిన దుస్తులను, వస్తువులన్నింటినీ బయటకు పంపించేయాలి. చెల్లించాల్సిన నాణాలు: 20. అరియానా మొదట బెల్ కొట్టగా ఆమె టీమ్‌లోని అభిజిత్ ఒంటి మీదున్న బట్టలు మినహా తనకు చెందినవి అన్నింటినీ త్యాగం చేశాడు. ► మూడో డీల్: అమ్మాయి తన జుట్టును మెడపై వరకు కత్తిరించుకుని రెడ్ కలర్ వేసుకోవాలి. చెల్లించాల్సిన నాణాలు: 25 అఖిల్,గంట కొట్టడంతో హారిక హెయిర్ కట్ చేయించుకునేందుకు రెడీ అయింది. అయితే ఈ షోకు వచ్చేముందే ఇలా హెయిర్ కట్ చేయించుకోవద్దని అన్నయ్య మరీమరీ చెప్పాడని ఏడ్చేసింది. నోయల్ జుట్టు కత్తిరించేస్తుంటే అన్నను గుర్తు చేసుకుంటూ సారీ చెప్తూ కన్నీళ్లు కార్చింది. అయితే వెళ్లిపోయేలోపు తన జుట్టు పెరిగేలా మసాజ్ చేసే బాధ్యత ఇంటి సభ్యులదేనని వారిపై భారం వేసింది. ► నాలుగో డీల్: ఇసుక మూటను ఒక్క చేత్తో మార్కు కిందకు వెళ్లకుండా చూడాలి. బిగ్‌బాస్ తదుపరి ఆదేశాల వరకు అదే స్థానంలో కదలకుండా ఉండాలి. చెల్లించాల్సిన నాణాలు: 20 అఖిల్ టీమ్‌లో కుమార్ సాయి ఈ ఛాలెంజ్ స్వీకరించాడు. చాలాసేపు ఒకేచోట ఉండటంతో అతనికి నోయల్ నీళ్లు తాగిపించాడు. కానీ సమయం ఎక్కువయ్యేకొద్దీ అతడు నొప్పి భరించలేక కేకలు పెట్టాడు. ఏడ్చినంత పని చేశాడు. కానీ ఎట్టకేలకు ఛాలెంజ్ విజయవంతంగా పూర్తి చేశాడు. ► ఐదో డీల్: స్టోర్ రూమ్ ద్వారా పంపించే వస్తువులతో డ్రింక్ తయారు చేసి రెండు గ్లాసులు తాగాల్సి ఉంటుంది. చెల్లించాల్సిన నాణాలు: 20 అరియానా గంట కొట్టడంతో లాస్య ఛాలెంజ్ స్వీకరించింది. ముక్కు మూసుకుని రెండు గ్లాసులను గటగటా తాగేసింది. మా జున్ను కోసం చేశానని చెప్పుకొచ్చింది. లాస్య కోసం అఖిల్ సాంగ్ పాడి ఆమెను నవ్వించాడు. ► ఆరో డీల్: ఒక ఇంటి సభ్యుడు బిగ్‌బాస్ తదుపరి ఆదేశం వరకు జ్యూట్‌తో అల్లిన బట్టలను ధరించాలి. చెల్లించాల్సిన నాణాలు: 20 అఖిల్ కన్నా ముందు గంట కొట్టినందుకు అరియానా టాస్క్ గెలిచినంత ఆనందపడి గెంతులేసింది. ఇక ఆమె టీమ్‌లోని మోనాల్ జనపనారతో అల్లిన దుస్తులు ధరించింది. దీంతో మాస్టర్ ఆమెతో కోయ డ్యాన్స్ వేయించాడు. -
బిగ్‌బాస్: నొప్పితో విలవిల్లాడిన కుమార్
బిగ్‌బాస్ నేడు ఇంటిసభ్యులకు ఇస్తున్న టాస్క్ మూడో సీజన్‌ను గుర్తు చేస్తోంది. కాకపోతే కొన్ని మార్పులు చేర్పులు చేశారంతే. బిగ్‌బాస్ ఇంటిసభ్యులను బ్లూ, రెడ్ టీమ్స్‌గా విడగొట్టారు. ఒకదాన్ని మించి మరొకటిగా వీరికి కష్టతరమైన టాస్కులు ఇస్తున్నాడు. అందులో భాగంగా హారిక తనకు ఏమాత్రం ఇష్టం లేకపోయినా సరే, ఏడుస్తూనే జుట్టు కత్తిరించుకునేందుకు సిద్ధపడిపోయింది. అయితే రెండో సీజన్లో దీప్తి సునయన, మూడో సీజన్లో శివజ్యోతి కూడా జుట్టు కత్తిరించుకున్న విషయం తెలిసిందే. కాకపోతే వీళ్లిద్దరూ నామినేషన్లో ఉన్న ఒకరిని సేవ్ చేసేందుకు ఆ పని చేశారు. ఇక కుమార్ సాయి తను వేసుకున్న డ్రెస్సును కత్తిరించుకోవడంతో పాటు మరో కఠినతరమైన టాస్క్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. (చదవండి: అన్నయ్య లవర్‌ను అక్కా అనేవాడిని: అవినాష్ తమ్ముడు) తాజాగా రిలీజ్ చేసిన ప్రోమో ప్రకారం కుమార్ ఓ తాడుకు కట్టి ఉన్న బస్తాను కింద ఆనించకుండా పట్టుకోవాలి. ఈ టాస్క్ కూడా గత సీజన్లలో చూసిందే. అయితే ఎక్కువగా జిమ్ముల్లో చెమటలు చిందించడం అలవాటు లేని అతడికి ఇది చాలా కష్టమైన టాస్కే. అతను ఆ బస్తాను ఒంటి చేత్తో మోయలేక అరుపులు, కేకలు పెడుతూ ఏడ్చినంత పని చేశాడు. అతని అవస్థను చూసి ఇంటి సభ్యులు సైతం తెగ కంగారు పడిపోయారు. మరోవైపు స్టోర్ రూమ్‌లో ఉన్న పదార్థాలతో జ్యూసు తయారు చేసి దాన్ని రెండు గ్లాసులు తాగాల్సి ఉంటుందని బిగ్‌బాస్ ఆదేశించాడు. ఈ ఛాలెంజ్ పూర్తి చేసేందుకు లాస్య ధైర్యంగా ఓ అడుగు ముందుకేసింది. కానీ చిత్రవిచిత్రమైన ఆ జ్యూసును తాగడం ఆమెకు అత్యంత కష్టంగా ఉన్నప్పటికీ కళ్లు మూసుకుని గ్లాసులు ఖాళీ చేసేందుకు ప్రయత్నిస్తోంది. నేటి ఎపిసోడ్లో మిగతా వారికి సైతం ఇలాంటి కఠినమైన టాస్కులే ఇచ్చినట్లు కనిపిస్తోంది. వాటిని ఇంటి సభ్యులు ఎలా పూర్తి చేస్తారనేది ఇప్పుడు అత్యంత ఆసక్తికరంగా మారింది. (చదవండి: బిగ్‌బాస్ : కెప్టెన్ పవర్‌తో ఫ్రెండ్‌ని సేవ్ చేసిన సోహైల్) -
ఒంటి మీద బట్టలు చింపుకున్న కుమార్ సాయి
-
సారీ అన్నయ్యా: ఏడ్చేసిన హారిక
బిగ్‌బాస్ నాల్గవ సీజన్లో ఐదు వారాలు గడిచిపోయాయి. ఆట ఇప్పుడిప్పుడే రసవత్తరంగా మారుతోంది. మొదట్లో గేమ్‌పై పెద్దగా ఫోకస్ పెట్టని వారు కూడా బరిలోకి దిగుతూ ఇతర కంటెస్టెంట్లకు టఫ్ ఫైట్ ఇస్తున్నారు. ఈ క్రమంలో వారితో మరిన్ని కఠినతరమైన టాస్కులు ఆడించేందుకు బిగ్‌బాస్ రెడీ అయ్యాడు. అందులో భాగంగా బిగ్‌బాస్ కంటెస్టెంట్లకు కొన్ని ఆసక్తికరమైన డీల్స్ ఇస్తున్నాడు. వాటిని చేసేందుకు కొందరు తెగ ఇబ్బంది పడుతుండగా మరికొందరు మాత్రం సునాయాసంగా ఒప్పేసుకుంటున్నారు. బిగ్‌బాస్ ఇచ్చిన డీల్‌లో భాగంగా కుమార్ సాయి ఒంటి మీదున్న దుస్తులను ముక్కలు ముక్కలుగా కత్తిరించేశాడు. (చదవండి: నాగార్జున ఒక్కసారి కూడా మెచ్చుకోలేదు) అభిజిత్ తన దుస్తులన్నింటినీ త్యాగం చేసేందుకు రెడీ అయినట్లు కనిపిస్తోంది. మరో డీల్‌లో ఒకమ్మాయి మెడ వరకు జుట్టును చిన్నగా కత్తిరించుకోవాలని ఆదేశించాడు. "దీనికి నేను అంగీకరించను, ఈ విషయం గురించి ఇక్కడికి వచ్చే ముందే మా అన్న నాకు వార్నింగ్ ఇచ్చి పంపించాడు" అని హారిక వెనకడుగు వేసింది. పైగా దీనివల్ల తన జుట్టు పెరగదు అని ఏడుస్తూనే హెయిర్ కత్తిరించుకునేందుకు అంగీకరించింది. అయితే ఇచ్చిన మాట తప్పుతున్నందుకుగానూ తన అన్నయ్యకు సారీ చెప్పింది. మరి బిగ్‌బాస్ ఇంకా ఏమేం డీల్స్ ఇచ్చాడో, వాటిని ఇంటి సభ్యులు పూర్తి చేశారో లేదో తెలియాలంటే నేటి ఎపిసోడ్ వచ్చేంతవరకు వేచి చూడాల్సిందే! (చదవండి: ఎలిమినేట్ అవుతా అనుకోలే: సుజాత) -
బిగ్‌బాస్: మాస్టర్ కాళ్లు పట్టుకున్న సోహైల్
గత మూడు సీజన్లుగా బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్న బిగ్‌బాస్ నాలుగో సీజన్లో మరో మెట్టు ఎక్కువ వినోదాన్ని పంచేందుకు ప్రయత్నిస్తోంది. విభిన్న టాస్క్‌లతో కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ ఇస్తోంది. ఇప్పటికే 24 ఎపిసోడ్లను పూర్తి చేసుకొని 25వ రోజులోకి అడుగుపెట్టింది. గురువారం కూడా కాయిన్ల టాస్క్ కొనసాగింది. మాస్టర్‌పై అరిచినందుకు సోహైల్ తన దగ్గరకు వచ్చి మాస్టర్ కాళ్లు పట్టుకున్నారు. స్విచ్ కాయిన్ ద్వారా సుజాతకు ఊహించని వరం లభించింది. సోహైల్‌పై మాస్టర్ విరుచుకుపడగా ఎవరూ ఊహించని వ్యక్తి ఇంటి కెప్టెన్ అయ్యాడు. ఇంకా ఈ రోజు ఏం జరిగిందంటే.. అరియానాపై సుజాత ఫైర్ లాస్య, అమ్మ రాజశేఖర్ మాస్టర్ మాట్లాడుతుండగా.. సోహైల్ వచ్చి మాస్టర్ కాళ్లు పట్టుకొని క్షమాపణలు కోరాడు. మాస్టర్ నుంచి కాయిన్లు దొంగిలించిన కారణంగా తను ఇలా క్షమాపణలు కోరాడు. .. తన పక్కన కూర్చొబెట్టి బుజ్జగించాడు. తన మీద కోపం లేదని, ఏదో కోపంలో అలా చేశానని సంజాయిషీ చెప్పుకున్నాడు. నువ్వే నన్ను అర్థం చేసుకోకుండా నా దగ్గర కాయిన్లు తీసుకున్నావ్ అని మాస్టర్ సోహైల్‌కు హితబోధన చేశాడు. అందరూ రిలాక్స్ అయిపోవడంతో బిగ్‌బాస్ ఇంటి సభ్యులను హెచ్చరించాడు.. ఆటను కొనసాగించాలని ఆదేశించాడు. తిరిగి ఆటను కొనసాగించారు. కిల్లర్ కాయిన్స్ రెండో భాగంలో దివి, అరియానా, సోహైల్, నోయల్, మాస్టర్ అవుట్ అవ్వడంతో తప్పుకున్నాడు. ఎక్కువ పాయింట్లు ఉన్న వారిని టార్గెట్ చేయాలని అరియానా చెప్పడంతో ఆమెపై సుజాత ఫైర్ అయ్యింది. నువ్వు రన్నింగ్ కామెంట్ ఇవ్వొద్దు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. రెండో లెవల్ పూర్తయింది. ఓవైపు అరియానా, సుజాత గొడవ పడుతుండగా.. మరోవైపు అఖిల్, మాస్టర్ మధ్య వాదన మొదలైంది. అమ్మాయిల మాదరి ఇంట్లోకి వెళ్లి దాక్కున్నాడని మాస్టర్ మండిపడ్డారు. చదవండి : బిగ్‌బాస్: అందరి కన్ను సోహైల్ పైనే అనంతరం మూడో లెవల్ ప్రారంభమైంది. ఇదే అఖరిది కూడా. ఆ లెవల్లో ఆఖరు బజర్ మోగేలోపు ఇంటి సభ్యులు అందరూ సామా, భేద,దాన, దండోపాయాలు ఉపయోగించి తమ దగ్గర ఉన్న కాయిన్ల విలువను పెంచుకునేందుకు ప్రయత్నించాలి. అవినాష్‌కు కాయిన్లు పట్టకునేందుకు అరియానా సాయం చేసింది. లాస్చ, మాస్టర్‌కు కాయిన్లు ఇచ్చేసింది. అవినాష్వి కూడా మాస్టర్‌కు ఇచ్చేసింది. సోహైల్, మెహబూబ్‌కు ఇచ్చేశాడు. తన దగ్గర తీసుకున్న కాయిన్లనను తనకు ఇచ్చేయమని మాస్టర్, సోహైల్‌ను అడిగాడు. లేకుండే తన మనసు కుదుటపడదని వాపోయాడు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ మాస్టర్‌కు కాయిన్లు ఇవ్వకంటూ మెహబూబ్ సోహైల్‌కు నూరిపోశాడు. (బిగ్‌బాస్: కాసుల వేటలో గెలుపెవరిది!) తర్వాత ఇంటి సభ్యులంతా తమ దగ్గర ఉన్న కాయిన్లను లెక్కించి బిగ్‌బాస్‌కు చెప్పారు. అఖిల్, మోనాల్, సోహైల్ తమ పాయింట్లను మెహబూబ్‌కు ఇచ్చేశారు. ఇప్పడు సుజాత దగ్గర ఉన్న స్విచ్ కాయిన్‌ను ఉపయోగించి.. వేరే వాళ్ల కాయిన్లతో స్విచ్ చేసుకోవచ్చు. ఈ అవకాశాన్ని వాడుకొని సుజాత, మెహబూబ్ పాయింట్లను లాగేసుకుంది. చివరకు ఎక్కు పాయింట్లు ఉన్న కారణంగా సుజాత, అమ్మ రాజశేఖర్ మాస్టర్, కుమార్ సాయి, అలేఖ్య హారిక నలుగరు కెప్టెన్ పోటీదారులుగా ఎన్నికయ్యారు. తన పాయింట్లు పోవడంతో మెహబూబ్ కన్నిటీ పర్యంతమయ్యాడు. కష్టపడి ఆడిన తనకు అన్యాయ జరిగిందని ఆవేదన చెందాడు. అక్కడితో ఆ టాస్క్ ముగియడంతో హారిక, అభి, దివి జరిగిన దాని గురించి చర్చించుకున్నారు. (బిగ్‌బాస్: టాస్క్‌లో పడిపోయిన అవినాష్) మాస్టర్‌తో మాట్లాడాలని సోహైల్ కోరితే అందుకే మాస్టర్ ససేమిరా అన్నాడు. తన కాయిన్లు ఇచ్చేందుకు అవకాశం ఇచ్చిన సోహైల్ ఉపయోగించుకోలేదని రాజశేఖర్ మాస్టర్ అనగా.. గేమ్‌ను గేమ్ లానే ఆడానని, అస్సలు క్షమాపణలు చెప్పనని సోహైల్ తెగేసి చెప్పాడు. దీంతో తనతో జీవితంలో మాట్లాడనని మాస్టర్ శపథం చేశాడు. అనంతరం నలుగురు కెప్టెన్సీ పోటీదారులకు కాసుల వేట టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. ఇందులో భాగంగా గార్డెనింగ్ ఏరియాలో మట్టితో బురద గొయ్యి ఏర్పాటు చేసి అందులో కొన్ని కాయిన్లు పెట్టి ఉంచారు. బురదలోని కాయిన్లనుంచి టాస్క్ ముగిసే సమయానికి ఎవరి బాస్కెట్లో ఎక్కవ కాయిన్లు ఉంటే వారు ఇంటి కెప్టెన్ అవ్వనున్నారు. ఈ టాస్క్ సంచాలకులుగా సోహైల్ ఉన్నాడు. ఈ టాస్క్‌లో నలుగురు పోటీపడి మరి పోరాడారు. ఈ టాస్స్‌లో ఎవరూ ఊహించని విధంగా 100 పాయింట్ల అధిక్యతతో కుమార్ నాలుగో కెప్టెన్‌గా ఎన్నికయ్యాడు. అనంతరం కెప్టెన్ బ్యాండ్‌ను ధరించాడు. గార్డెన్లో కూర్చొని ఉల్లాసంగా గడిపారు. అరియానుకు పిచ్చి పట్టింది. కానీ తనకు ఇప్పడే తెలిసిందని మాస్టర్ చెప్పాడు. ఇక స్వాతి, అఖిల్ మాట్లాడుకుంటుండగా.. అవినాష్ వారి సంభాషణలకు దూరం నుంచి ఫన్నీగా వాయిస్ ఇచ్చాడు. అలాగే గంగవ్వ అమ్మ వారు సోకితే ఎలా మాట్లాడతారో నటించి చూపిస్తూ ఇంటి సభ్యులకు వినోదాన్ని అందించింది. దీనంగా చూస్తున్న హారికను అభి ఆకస్మాత్తుగా వచ్చి భయపెట్టాడు. తర్వాత తనను వెనకనుంచి వచ్చి పట్టుకొని కూల్ చేశాడు. (కథ వేరే ఉంటది: మాస్టర్‌కు సోహైల్ వార్నింగ్) -
బిగ్‌బాస్: ఈ వారం నామినేషన్లో ఏడుగురు
రోజులు గడుస్తున్న కొద్ది బిగ్‌బాస్ సీజన్ 4 మెల్లగా పుంజుకుంటుంది. బిగ్‌బాస్ ఒక్కోరోజు ఒక్కో రకంగా టాస్కులు ఇస్తున్నాడు. ముఖ్యంగా షో మూడో వారంలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత మరింత ఆసక్తికరంగా మారిపోయింది. పైగా ఇంట్లో కూడా ఒకరి మధ్య ఒకరు బాగానే పుల్లలు పెట్టుకుంటున్నారు. దాంతో ఒకరంటే ఒకరు మండిపడుతున్నారు. ఓ రకంలో అందరి నిజస్వరూపాలను టాస్క్‌లు బయటపడేలా చేస్తున్నాయి. ఈ వారం నామినేషన్స్‌లో భాగంగా కూడా ఒకరిపై ఒకరు చాలా సెటైర్లు వేసుకున్నారు. స్వాతి దీక్షిత్ మార్నింగ్ మస్తీతో ఇంటి సభ్యులను అలరించగా.. బిగ్‌బాస్‌లో ఈరోజు ఇంకేం జరిగిందంటే...(సై అంటే సై: లాస్య, నోయల్ మధ్య మాటల యుద్ధం) ఉదయం కాగానే మాస్ మహారాజ్ రవితేజ ‘గొంగూరు తోట కాడా కాపు కాసా’ మాస్ పాటకు ఇంట్లోని సభ్యులంతా ఎనర్జిటిక్‌గా డాన్స్ చేశారు. ఆ తర్వాత మార్నింగ్ మస్తిలో స్వాతి ఇంటి సభ్యులకు నవరసాలను నేర్పించాల్సి ఉంటుంది. అయితే స్వాతి తన పార్ట్నర్గా అభిజిత్‌ను ఎంపిక చేసుకుంది. శృంగార రసంలో భాగంగా అభిజిత్‌ను లవ్ చేస్తున్నట్లు చెప్పింది. ఇక ఏడుపులో స్వాతి కంటే ముందే మోనాల్ ఏడ్చేసింది. కోపం టాస్క్‌లో భాగంగా లాస్య, నోయల్ మధ్య గొడవ పడుతున్నట్లు నటించారు. నా గురించి వేరే వాళ్ల వద్ద ఎందుకు మాట్లాడినవ్ అని అనగా.. నాకు వెనకాల చెప్పే అవసరం లేదంటూ లాస్య గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. బీభత్సంలో అవినాష్‌పై గంగవ్వ అరిచింది. (బిగ్‌బాస్: ఈ వారం ఎవరు మర్డర్ కానున్నారు?) అక్కా , తమ్ముడిలా ఉన్నారు అనంతరం అభిని సులభంగా నామినేట్ చేయోచ్చు అంటూ దివి, మోహబూబ్ చర్చించుకున్నారు. అలాగే అరియానా, అవినాష్ మధ్య చర్చ జరిగింది. అందరితో ఉన్నట్లు నాతో ఉండటం లేదని అరియానా అవినాష్‌పై అలిగింది. ఇంతకు ముందు వేరేలా ఉండేవాడివని, నాపై నీకు వేరే అభిప్రాయం ఉండేదని అవినాష్‌ను ఆటపట్టించింది. అవినాష్ వచ్చి మోనాల్‌కు దగ్గరయ్యేందుకు అమ్మ గుర్తొస్తుందని సరదాగా అంటుండగా మధ్యలో అఖిల్ కల్పించుకొని సేమ అక్కా , తమ్ముడిలా ఉన్నారంటూ పంచ్ వేశాడు. దీంతో అవినాష్ మరింత ఏడుస్తున్నట్లు నటించాడు. అక్కడ ఒక ఫన్నీ క్రియోట్ చేశాడు అవినాష్. దివి, అభి మాట్లాడుకుంటూ కొన్ని కొన్ని సందర్భాలలో వేరేలా ప్రవర్తిస్తుంటావని అభి ముఖంపైనే దివి చెప్పేసింది. నేనైతే నిన్నే నామినేట్ చేస్తాను. అని తేల్చి చెప్పింది. అనంతరం అఖిల్, సోహైల్‌ను స్టోర్ రూమ్‌లో ఉన్న దుస్తులు ధరించాలని బిగ్‌బాస్ ఆదేశించాడు. ఆ దుస్తుల్ని ధరించి ఏదో హీరోల్లాగా ఫీల్ అయిపోయారు. ఇక సోమవారం నామినేషన్ ప్రారంభమైంది. ఇంట్లో ఇద్దరు హిట్ మెన్లు(అఖిల్, సోహైల్) ఉంటారు. మిగిలిన ఇంటి సభ్యులంతా లివింగ్ ఏరియాలో ఉండాలి. ప్రతి ఒక్కరికి బిగ్‌బాస్ 10 వేల రూపాయలు ఇస్తాడు. అలాగే ఇద్దరు హిట్మెన్లకు ఒక్కొక్కరికి 5 వేలు ఇస్తాడు. సమయానుసారం ఇంట్లో 5 బజర్లు మోగుతాయి. ప్రతి బజర్ మోగినప్పుడు లాంజ్‌లోకి ఎవరు మొదటగా వస్తే వారే హిట్మెన్లతో మర్డర్ డీల్ చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఎవరినైతే చంపాలి అనుకుంటున్నారో వారి పేరు చెప్పి, అంందుకు గల కారణాలను వివరించాలి. చనిపోయిన వ్యక్తి నాయినేట్ అయినట్లు. ఈ వారం ఇంటి కెప్టెన్ అయిన కారణంగా గంగవ్వ, అరియానాను దేవి సేఫ్ చేసినందున తనను కూడా ఇంటి సభ్యులెవరు నామినేట్ చేయరాదు. ఈ టాస్క్‌లో ముందు బజర్‌కు అమ్మ రాజశేఖర్ మాస్టర్ వచ్చారు. వచ్చి రాగానే తను స్వాతిని చంపాలి అనుకుంటున్నట్లు వెల్లడించారు. స్వాతి ఇటీవల వచ్చినట్లు తనకు ఎవరితో ఎక్కువ కాంటాక్ట్ అవ్వడం లేదని చెప్పారు. అలాగే స్వాతి కొంచెం హౌజ్‌లో నటిస్తుందని తెలిపాడు. వెంటనే గన్ తీసుకొని స్వాతిని అఖిల్ మర్డర్ చేశాడు. అయితే తనను నామినేట్ చేసినందుకు స్వాతి కొంచెం ఫీల్ అయ్యింది. అనంతరం మాస్టర్‌తో కొంచెం సీరియస్ అయ్యింది. రెండోసారి మొహబూబ్ ఇంట్లోకి మొదట వచ్చాడు. అభిని చంపేందుకు ప్లాన్ ఇచ్చుకున్నాడు. రోబో టాస్క్‌లో భాగంగా గల్లీ బాయ్స్అని అభి ఎగతాళి చేసినట్లు కారణంగా చెప్పుకొచ్చాడు. రెండోసారి కూడా అఖిల్ గన్ అందుకొని అభిని షూట్ చూసి నామినేట్ అయినట్లు ప్రకటించాడు. మోహబూబ్ చాలా ముక్కోపి మూడో బజర్‌కు అరియానా ముందుగా రూమ్‌లో వచ్చి లాస్యను చంపేందుకు ప్లాన్ ఇచ్చింది. అరియానా వల్ల ఇంటి సభ్యులంతా ఇరిటేడ్ అవుతున్నారని లాస్య చెప్పిందని, దాని వల్ల తనపై బయట తప్పుగా చూపిస్తుందని తెలిపింది. అది పక్కా అబద్దం అని తెలిపింది. మళ్లీ తనను నామినేట్ చేయటానికి అన్ని దెబ్బలు తగిలించుకొని వెళ్లలా అని లాస్య వెటకారంగా మాట్లాడింది. అయితే మధ్యలో ప్రతి సారి అఖిల్‌కు మర్డర్ డీల్ వస్తుందని అసూయతో సోహైల్ అఖిల్ డబ్బులను తన సూట్‌కేస్‌లోకి మార్చుకున్నాడు. నాలుగో బజర్‌కు వచ్చిన అలేఖ్య హారిక తన ఫ్రెంఢ్ మెహబూబ్‌ను అంతం చేసేందుకు డీల్ మాట్లాడుకుంది. టాస్క్‌లో భాగంగా మోహబూబ్ చాలా ముక్కోపిగా వ్యవహరించాడని, ఓవర్ కన్ఫిడెన్స్ కనిపించిందని తెలిపింది. ఈ సారి సోహైల్‌కు గన్ దొరికి మోహబూబ్‌ను చంపేశాడు. అయిదో బజర్‌కు తెలివిగా నటించినట్లు చేస్తూ నోయల్ ఇంటి నుంచి కాకుండా గార్డెన్ ఏరియా నుంచి రూమ్‌లోకి వచ్చాడు. కానీ నిబంధనల ప్రకారం ఇంట్లో నుంచి రావాలి కాబట్టి నోయల్ ను ఆపేసి తన తర్వాత వచ్చిన సుజాత రూమ్‌లోకి వెళ్లింది. వెంటనే కుమార్ సాయిని నామినేట్ చేసింది. ఎంత ప్రయత్నించినా కుమార్ కలవడం లేదని, టాస్క్‌లో లీనం అవ్వడం లేదనే కారణంతో మర్డర్ డీల్ కుదుర్చుకున్నాడు. అఖిల్ వచ్చి కుమార్‌ను మర్డర్ చేశాడు. అయిదు బజర్లు అయిపోయాకా కూడా సోహైల్ అఖిల్ సూట్‌కేస్ లాక్కునేందుకు ప్రయత్నించాడు. చివరకు ఎవరి సూట్‌కేస్‌లో ఎంత డబ్బు ఉంటే వాళ్లు సేఫ్ అయినట్లు కావడంతో అఖిల్ వద్ద ఎక్కువ ఉండటంతో అఖిల్ సేఫ్ అయ్యాడు. దీంతో అఖిల్ ఒక్కరిని నామినేట్ చేయాల్సి ఉండగా, హారికను నామినేట్ చేశాడు. అఖరుగా ఈ వారం ఇంటినుంచి బయటకు వెళ్లేందుకు స్వాతి, అభిజిత్, మెహబూబ్, లాస్య, హారిక, కుమార్‌సాయి, సోహైల్ నామినేట్ అయ్యారు. మరి ఎవరూ ఉంటారో, ఎవరూ ఎలిమినేట్ అవుతారో తెలియాలంటే ఆదివారం వరకు వేచి చూడాలి. -
అభిజిత్ సారీ చెప్పాలి, లేదంటే..: కుమార్
ఈ వారం జరిగిన 'ఉక్కు హృదయం' టాస్క్ గురించి కింగ్ నాగార్జున ఏ రేంజ్లో క్లాసులు పీకుతాడో అని ప్రేక్షకులు గత కొద్ది రోజుల నుంచి తెగ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ నాగ్ ఫైర్ అవడం పక్కనపెడితే ఇంటి సభ్యులే ఒకరి మీద మరొకరు అరుచుకునేలా కనిపిస్తున్నారు. తాజాగా రిలీజైన ప్రోమోలో నాగ్ గంగవ్వ ఆటాడిన విధానాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. కిడ్నాప్ ప్లాన్ పారేందుకు కారణమైన అవ్వను 'దొంగా.. బాగా ఆడుతున్నారు' అని ప్రశంసించారు. మాస్టర్‌కే తెలీకుండా అతని దగ్గర అవినాష్ చార్జింగ్ కొట్టేయడాన్ని కూడా నాగ్ ప్రస్తావించారు. మీరు అమ్మ రాజశేఖర్ కాదు, అమాయక రాజశేఖర్ అని సంభోదించారు. (చదవండి: అభిజిత్‌లో ధోనీని చూశా: యాంకర్ రవి) అఖిల్‌కు అభి క్షమాపణలు చెప్పాల్సిందే 'అభిజిత్ నీకే ఎందుకు చార్జింగ్ ఇచ్చాడు' అని హారికను ప్రశ్నించడంతో ఆమె ఏం సమాధానం చెప్పాలో తెలియక దిక్కులు చూసింది. ఇక టాస్క్‌లో కనీసం తనకు మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వని అభిజిత్‌పై కుమార్ సాయి ప్రతీకారం తీర్చుకున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే భిన్న ధృవాలైన అభి, అఖిల్‌కు మధ్య అగ్గి రాజేసినట్లు కనిపిస్తోంది. 'నాకు ముప్పై ఏళ్లు, పెద్ద చదువులు చదివాను.. నన్ను అఖిల్ ఒరేయ్ అంటాడా?' అని అభిజిత్ అనడం నచ్చలేదని, అతడు సారీ చెప్పాలని కుమార్ పట్టుపట్టాడు. లేదంటే తాను ఎలిమినేట్ అయ్యేంతవరకు అభినే నామినేట్ చేస్తానని చెప్పుకొచ్చాడు. నిజానికి తనకంటే చిన్నవాడైన అఖిల్ తనను 'రా, అరేయ్' అని పిలవడం నచ్చలేదని అభి గతంలోనూ ఇంటిసభ్యులతో చెప్పుకొచ్చాడు. అనవసరంగా జోక్యం చేసుకున్న కుమార్! కానీ విద్యార్హత గురించి మాట్లాడాడా? లేడా అన్న విషయంపై మాత్రం స్పష్టత లేదు. మరి కుమార్ ఆరోపణలను అంగీకరిస్తూ అభిజిత్ క్షమాపణకు సిద్ధమవుతాడా? లేదా తను అలాంటి వ్యాఖ్యలు చేయలేదని ఖండిస్తాడా? అనేది మరికొద్ది గంటల్లో తేలనుంది. అయితే వారిద్దరి మధ్యలోకి మూడో వ్యక్తి కుమార్ సాయి ఎందుకు వెళ్లాడని కొందరు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో కుమార్ పెద్ద తప్పు చేశాడని అభిప్రాయపడుతున్నారు. (చదవండి: నాతో జీవితంలో మాట్లాడకు: అమ్మ రాజశేఖర్) -
బిగ్‌బాస్: జైలుకు వెళ్లనున్న నోయల్!
సేఫ్ గేమ్ ఆడుతున్న ఇంటి సభ్యుల ఆట కట్టించేందుకు నామినేషన్ ప్రక్రియతో వారి మధ్య అగ్గి రాజేశాడు బిగ్‌బాస్. దీంతో అప్పటివరకు డల్‌గా సాగిన ఆట కాస్త రసవత్తరంగా మారింది. ఇక తర్వాతది.. ఫిజికల్ టాస్క్.. అసలే వేడి మీదున్న కంటెస్టెంట్లకు వారేంటో చూపించుకునేందుకు దొరికిన సరైన అవకాశమిది. దీన్ని చేజార్చుకోనివ్వకుండా ఉండేందుకు పక్కోడిని పడగొట్టైనా సరే గెలవాలనుకుంటున్నారు. బిగ్‌బాస్ కూడా పక్కా ప్లాన్‌తోనే కంటెస్టెంట్లను మనుషులు, రోబోల టీమ్‌లుగా విడగొట్టారు. అయితే మనుషులు టీమ్‌లో బలమైన కంటెస్టెంట్లు ఉన్నారని, వీరిని ఆపడం మన తరం కాదంటూ రోబోల టీమ్‌లోని అభి ముందే చేతులెత్తేశాడు. దీంతో సోషల్ మీడియాలో అభిపై విమర్శలు వెల్లువెత్తాయి. (చదవండి: డబుల్ ఎలిమినేషన్; కళ్యాణి అవుట్!) okarini minchi okadu iragdeesthunnaru ferformances 🤣🤣🤣🤣promo lo#Mehboob :dhammunte nannu teeskellandra ammayini teeskelladam kadu#ammarajasekhar :meeku game imp ha manishi imp ha#Sohel : siggundala meeku..thu..#Sujatha : intha chandalanga game adthara#BiggBossTelugu4 — Vamc Krishna (@vamccrishnaa) September 23, 2020 అభి ప్లాన్‌తో గెలుపు దిశగా రోబోలు 'అతనికి ఎలాగో ఆడటం చేతకాదు, కనీసం పక్కనవాళ్లని కూడా ఆడనివ్వడు' అని సెటైర్లు విసిరారు. కానీ అనూహ్యంగా నేడు రిలీజ్ చేసిన ప్రోమోలో అభి మైండ్‌గేమ్ ఆడాడు. దివిని పక్కా ప్లాన్‌తో కిడ్నాప్ చేశారు. ఇది తట్టుకోలేకపోయిన మనుషుల టీమ్ ఆవేశంతో ఊగిపోయారు. అయితే దెబ్బకు దెబ్బ కొట్టేందుకు మనుషుల టీమ్ సిద్ధమైంది. రోబోల దూకుడుకు బ్రేక్ వేయనుంది. వీరు ఎలా ప్రతీకారం తీర్చుకుంటారనేది నేటి ఎపిసోడ్లో చూడాలి. మరోవైపు ఈ టాస్క్‌పై సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడుస్తోంది. నిన్న సోమరిపోతుగా ఆటాడకుండా ప్రవర్తించిన అభిని తిట్టినవారే నేడు అతడి ప్లాన్‌ను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. (చదవండి: అతి త్వరలోనే మరో వైల్డ్ కార్డ్ ఎంట్రీ) కుమార్ సాయిని గడ్డిపోచలా తీసేస్తున్నారు అతడి ప్లాన్‌పై మనుషుల టీమ్ ఎందుకంత మండిపడుతుందని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అటు మెహబూబ్, సోహైల్ విపరీత ప్రవర్తనను కడిగి పారేస్తున్నారు. కుమార్ సాయిని గడ్డిపోచలా చూస్తున్నారని అతడిపై జాలి చూపిస్తున్నారు. సుజాత ఏడుపు పైనా వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. చివరికి రోబోల టీమ్ గెలుస్తుందని, నోయల్ జైలుకు వెళ్తాడని మరికొందరు అంచనా వేస్తున్నారు. ఇవన్నీ ఎంతవరకు నిజమనేది నేటి ఎపిసోడ్లో తేలనుంది. (చదవండి: బిగ్‌బాస్: గెలవడం కోసం ఆమె ఏమైనా చేస్తుంది!) Door open avagane kompateesi Noel team "idi fun idi fun" ani rap paadatara enti.. promo lo maatrame e elevations.. episode Noel rap laga untundi #BiggBossTelugu4 pic.twitter.com/EKbIL8HjLs — #̷7̷ ̷F̷o̷r̷e̷v̷e̷r̷ (@M_a_h_iiii) September 23, 2020 #Abijeet as professor 🤓#BiggBossTelugu4 https://t.co/FYBmxa9QUS — Believer! Living on a PALE BLUE DOT🌏 (@Human9368) September 23, 2020 Abhi kidnap cheddam annappudu... ariyanaa ila react ayithey bhale undedi “So adi nee character. Bayata kidnaps chesthu bathukutaav nuvvu” want to see his reaction. Atleast nagarjuna anna ila adigite baagundu weekend lo.. #BiggBossTelugu4 — Arjun (@nj_politics2020) September 23, 2020 Door open chesina ventane Divi - akada em kaleeeee 😂#BiggBossTelugu4 https://t.co/0UfIckOWlf pic.twitter.com/HEB4gQepTt — ʌınɐʎ (@VintageVinnu) September 23, 2020 Sujatha Ferformance 😂😂#BiggBossTelugu4 pic.twitter.com/yN7fJEcleS — Canford Cliffs (@Canford_Cliff) September 23, 2020 ROBOTS ARE BEHAVING LIKE HUMANS BUTTTT HUMANS ARE BEHAVING LIKE WILD ANIMALS 🙏 HENCE PROVED ROBOTS ARE FAR BETTER THAN HUMANS 🤣😂#BiggBossTelugu4 — BIGG BOSS ADDICTS (@BiggBossAddicts) September 23, 2020 -
బిగ్‌బాస్: ఎలిమినేట్ అయ్యేది ఎవరు?
బిగ్‌బాస్ నాల్గవ సీజన్ రెండో వారం ముగింపుకు వచ్చింది. ఇప్పుడు మరో కంటెస్టెంటును ఇంటికి సాగనంపే సమయం ఆసన్నమైంది. ఇప్పటికే సూర్యకిరణ్ హౌస్‌కు గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే. అయితే అతడి ఎలిమినేషన్‌ను అందరూ ముందుగానే ఊహిస్తూ వచ్చారు. కానీ రెండో వారానికి వచ్చేసరికి మాత్రం ఎవరు వెళ్లిపోతారనేది ఉత్కంఠగా మారింది. పైగా ఈ వారం డబుల్ ఎలిమినేషన్ కూడా ఉండొచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని పక్కనపెడితే ఈ వారానికి గానూ అభిజిత్, గంగవ్వ, నోయల్, హారిక, అమ్మ రాజశేఖర్, సోహైల్, కళ్యాణి, కుమార్ సాయి, మోనాల్ ఇలా తొమ్మిది మంది ఇంటి సభ్యులు నామినేట్ అయ్యారు. మంచిగనే ఉన్న: గంగవ్వ వీరిలో గంగవ్వకు అందరికన్నా ఎక్కువ అభిమానులు ఉండటంతో ఆమె బయటకు వెళ్లే పరిస్థితి కనిపించడం లేదు. కానీ ఈ మధ్య ఆమె ఆరోగ్యం బాగోలేకపోవడంతో బిగ్‌బాస్ బయటకు పంపిస్తాడని వార్తలు వినిపించాయి. అయితే ఇప్పుడప్పుడే అలాంటి నిర్ణయం తీసుకునేటట్లు కనిపించడం లేదు. మరోవైపు ఆమె ఆరోగ్యంపై స్పందించిన గంగవ్వ టీం ఆమె మంచిగనే ఉందని, టెన్షన్ పడకుర్రి అని చెప్పుకొచ్చింది. దీంతో ఈ వారం గంగవ్వ బయటకు రాదని తేలిపోయింది. (చదవండి: బిగ్‌బాస్: అనారోగ్యంతో ఏడ్చేసిన గంగవ్వ) నోయల్ సేఫ్ అనవసరమైన వాటి కోసం అతిగా స్పందించడం, ఇతరుల అభిప్రాయాలను ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తూ నోయల్ కొంత చెడ్డ పేరు మూటగట్టుకున్నాడు. కానీ ఈ మధ్య అలాంటి విషయాల్లో తలదూర్చడం తగ్గించేసుకున్నాడు. తన పనేదో తాను చేసుకుంటూ ఉన్న అభిమానులను కాపాడుకుంటున్నాడు. దీంతో నోయల్ కూడా సేఫ్ జోన్లో ఉన్నాడు. అభిజిత్, సోహైల్, మోనాల్, హారిక కూడా ఈ వారం గండం గట్టెక్కినట్లు తెలుస్తోంది. వీరి తర్వాత స్థానంలో తక్కువ ఓట్లు సంపాదించుకున్న అమ్మ రాజశేఖర్ ఉన్నాడు. (చదవండి: బిగ్‌బాస్ నాకు సారీ చెప్పాలి: నోయల్) డేంజర్ జోన్లో కళ్యాణి ఇక మొదట్లో పెద్ద గొంతేసుకుని, కయ్యానికి కాలు దువ్విన కళ్యాణి తర్వాత సైలెంట్ అయిపోయింది. అయినప్పటికీ ఆమె డేంజర్ జోన్లో ఉంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన కుమార్ సాయి హౌస్‌లో ఉన్నాడా? లేడా? అన్నట్టుగా ఉంది. అతడికి కూడా తక్కువ ఓట్లే పడ్డట్టు తెలుస్తోంది. మొత్తానికి కళ్యాణి, అమ్మ రాజశేఖర్, కుమార్ సాయి డేంజర్ జోన్లో ఉన్నారు. అయితే కళ్యాణి, అమ్మ రాజశేఖర్లో ఎవరు వెళ్లిపోయినా ఎంటర్టైన్మెంట్కు గండి పడుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి. దీంతో మాస్టర్‌కు హౌస్‌లో కొనసాగేందుకు ఛాన్సిచ్చే అవకాశం కనిపిస్తోంది. కళ్యాణిని బయటక పంపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. (చదవండి: గత సీజన్లను వెనక్కునెట్టిన బిగ్‌బాస్) -
నాగ్‌కు స్క్రిప్ట్ చెప్తా: కుమార్ సాయి
పేరు: కుమార్ సాయి పంపన వృత్తి: నటుడు, కమెడియన్, దర్శకుడు స్వస్థలం: కొట్టారక్కర, కేరళ విద్య: గ్రాడ్యుయేషన్ పుట్టిన తేదీ: 18 ఫిబ్రవరి 1990 మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన సాయికుమార్ పంపనకు నటుడు అవ్వాలనేది చిన్ననాటి కోరిక. పెద్దయ్యాక ఆ కల నెరవేరింది. లక్కీ(2012) సినిమాతో వెండితెరపై ప్రవేశించినప్పటికీ, "ఈ రోజుల్లో" చిత్రంతో గుర్తింపు సాధించుకున్నాడు. బస్టాప్, లవ్ టచ్, నా సామిరంగ, ఆడు మగాడ్రా బుజ్జి, ప్రెజెంట్ లవ్ వంటి పలు చిత్రాల్లో నటించాడు. కానీ, కెరీర్లో పెద్ద బ్రేక్ అయితే రాలేదు. దీంతో ఈ మధ్య సినిమాల్లో కనిపించకుండా పోయిన అతడు బిగ్‌బాస్ రియాలిటీ షోతో మళ్లీ ఫామ్‌లోకి రావాలనుకుంటున్నాడు. కానీ ఈ సారి నటుడిగా కాకుండా దర్శకుడిగా తన ప్రతిభను నిరూపించుకోవాలనుకుంటున్నాడు. అది కూడా తన అభిమాన హీరో నాగార్జునకు కథ చెప్పి ఒప్పించాలని పట్టుదలతో ఉన్నాడు. కాగా బిగ్‌బాస్ తొలి వారం ఎలిమినేషన్ పూర్తైన రోజే మొదటి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చాడు. అందర్ని నవ్విస్తూ ఎంటర్టైన్ చేస్తానని ధీమాగా చెప్పుకొస్తున్నాడు. మరి బిగ్‌బాస్ అతని కెరీర్‌కు ప్లస్ అవుతుందా? లేదా? అనేది చూడాలి. -
హారిక విష సర్పం, అఖిల్ దున్నపోతు..
సండేను ఫండే చేసేందుకు బిగ్‌బాస్ మంచి ప్లానే వేశాడు. అబ్బాయిలు, అమ్మాయిల మధ్య డ్యాన్స్ పోటీ పెట్టాడు. అమ్మ రాజశేఖర్, నాగ్ జడ్జిలుగా వ్యవహరించారు. జిగేల్ రాణి పాటకు మోనాల్, మెహబూబ్ నువ్వా నేనా అన్న రీతిలో స్టెప్పులేశారు. కానీ మెహబూబ్‌కే ఎక్కువ పాయింట్లు వచ్చాయి. పెద్దపులి పాటకు సోహైల్, కల్యాణి అదరగొట్టారు. ప్రేక్షకులు ఈలలు కొట్టేలా జోష్‌గా డ్యాన్స్ చేశారు. ఈ ఇద్దరిలో కల్యాణికి ఎక్కువ మార్కులు పడ్డాయి. నోయల్, హారిక మధ్య పోటీ రంజుగా సాగింది. హోరాహోరీగా తలపడ్డిన ఈ ఇద్దరికీ సమానంగా మార్కులు పడ్డాయి. దేవి నాగవల్లి, అభిజిత్ మధ్య డ్యాన్స్ ఆసక్తికరంగా సాగింది. హీరో అభి ఎలాగో తన స్టెప్పులతో ఊపేయగా దేవి ఎక్స్ప్రెషన్స్, స్టెప్పులు కలిపి వీర లెవల్లో డ్యాన్స్ చేసింది. దీంతో దేవికి ఎక్కువ మార్కులు పడ్డాయి. రెచ్చిపోయిన దివి, తడబడ్డ అఖిల్ మైండ్ బ్లాక్ పాటకు డ్యాన్స్ చేయడంలో అఖిల్ కాస్త తడబడ్డాడు. కానీ దివి మాత్రం చూపు తిప్పుకోనివ్వకుండా స్టెప్పులేయడంతో ఆమెకే ఎక్కువ మార్కులు పడ్డాయి. నాది నెక్కలేసు గొలుసు పాటకు సూర్యకిరణ్, లాస్య రెచ్చిపోయి మరీ చిందులేశారు. చొక్కా విప్పేసి మరీ డ్యాన్స్ చేసినందుకు సూర్యకిరణ్‌కు అధిక పాయింట్లు లభించాయి. ఆ తర్వాత మాస్టర్ గంగవ్వతో డ్యాన్స్ చేయించాడు. వయసు మర్చిపోయి మరీ అవ్వ రెట్టింపు జోష్‌తో గంతులేసింది. మొత్తంగా ఈ టాస్క్‌లో అమ్మాయిలకు 91 పాయింట్లు రాగా, అబ్బాయిలకు 88 పాయింట్లు వచ్చాయి. (చదవండి: బిగ్‌బాస్ : గంగవ్వ తోపు.. ‘బకరా’ అయిన లాస్య) సూర్యకిరణ్ అవుట్ ఆ తర్వాత అఖిల్ సేవ్ అయ్యాడని పాట రూపంలో తెలిపారు. ఆ తర్వాత బొమ్మ గీసి దాని ద్వారా అది ఏ పద్యమో కనుక్కోవాలని ఆటాడించారు. అయితే అందరూ పద్యాలు చెప్తే.. గంగవ్వ మాత్రం చెవులకింపైన జోల పాట పాడింది. అనంతరం మెహబూబ్ సేవ్ అయ్యాడని స్కెచ్ చూపించారు. ఇంకా ఇద్దరు డేంజర్ జోన్లో ఉన్నారని నాగ్ చెప్పగానే ఇంటి సభ్యులు ఎలిమినేషన్స్ వద్దంటూ ర్యాప్ సాంగ్‌తో వేడుకున్నారు. కానీ అలాంటి పప్పులు ఉడకవని నాగ్ తేల్చి చెప్పారు. మొదటి నుంచీ ఊహించినట్టుగానే సూర్య కిరణ్ ఎలిమినేట్ అయ్యాడని ప్రకటించారు. కాగా తను నీళ్లు ఇవ్వడం వల్లే సూర్య కిరణ్ వెళ్లిపోయాడని మోనాల్ కన్నీళ్లు పెట్టుకుంది. (చదవండి: నవ్వుకున్నోళ్లకు నవ్వుకున్నంత) దేవిని మొసలి, సోహైల్ ఎలుక అనంతరం సూర్యకిరణ్‌తో నాగ్ ఓ టాస్క్ ఆడించారు. ఇందులో జంతువుల ఫొటోలను కంటెస్టెంట్లతో పోల్చమన్నారు. అలా మోనాల్‌ను నెమలితో, గంగవ్వను చీమతో, దేవిని మొసలితో, సోహైల్‌ను ఎలుకతో, అభిజిత్‌ను పిల్లితో, దివిని తాబేలుతో, కళ్యాణిని కోతితో, మెహబూబ్‌ను గద్దతో, హారికను పాముతో పోల్చాడు. విశ్వాసమున్నందుకు సుజాతను కుక్కతో, అతిగా ఆలోచిస్తున్నందుకు నోయల్‌ను నక్కతో, కెప్టెన్‌గా ఇంటి భారాన్ని మోస్తున్నందుకు లాస్యను గాడిదతో, అరియానాను గుడ్లగూబతో, అఖిల్‌ను దున్నపోతుతో, అమ్మ రాజశేఖర్‌ను సింహంతో పోల్చాడు. (చదవండి: నోయల్ సింపతీ కార్డ్ ప్లే చేస్తున్నాడు, ఓవర్ యాక్షన్) దేవిపై బిగ్‌బాంబ్ ఆ తర్వాత దేవికి ఒకరోజు మొత్తం ఏ పని చేయనవసరం లేదని బిగ్‌బాంబ్ వేసి వీడ్కోలు తీసుకున్నాడు. అనంతరం వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ సాయి కుమార్‌ను స్టేజీపైకి పిలిచారు. కుమార్ మాట్లాడుతూ.. షో గెలవాలన్న ఆశయం, హౌస్ నుంచి బయటకు వచ్చేసరికి కోవిడ్ అంతమైపోయి తిరిగి సాధారణంగా పని చేసుకోవాలన్న నమ్మకం, నాగ్‌కు స్క్రిప్ట్ చెప్పాలన్న కోరిక.. ఈ మూడింట్లో ఒక్కటి జరిగినా చాలు అని మనసులోని మాటను బయట పెట్టాడు. మరి అతడు హౌస్‌లోకి వెళ్లి ఎంతలా ఎంటర్టైన్ చేస్తాడనేది రేపటి నుంచి చూడాల్సిందే! (చదవండి: గంగవ్వ 10 వారాల పైనే ఉంటుంది) -
బిగ్‌బాస్: నేడే వైల్డ్ కార్డ్ ఎంట్రీ
బిగ్‌బాస్ నాల్గవ సీజన్ మొదటి వారం ఎలిమినేషన్ స్టార్ట్ అయింది. ఎలిమినేషన్ జోన్లో ఉన్న ఏడుగురిలో కింగ్ నాగార్జున ఇప్పటికే గంగవ్వ, అభిజిత్, సుజాతను సేవ్ చేశారు. మెహబూబ్, అఖిల్, దివి ఇంకా డేంజర్ జోన్లోనే ఉన్నారు. అయితే ఇప్పటివరకు అందించిన సమాచారం ప్రకారం దర్శకుడు సూర్య కిరణ్ హౌస్ నుంచి బ్యాగు సర్దుకుని బయటకు వెళ్లనున్నాడని భోగట్టా. ఇదిలా వుంటే ఎలిమినేషన్ వద్దంటూ ఇంటి సభ్యులు ర్యాప్ సాంగ్‌తో నాగార్జునను అభ్యర్థించారు. కానీ బిగ్‌బాస్.. సీతయ్య, ఎవరిమాటా వినడని వారి వినతిని తిరస్కరించారు. దీంతో నామినేట్ అయిన కంటెస్టెంట్లు ఒక్కసారిగా డీలా పడిపోయారు. (చదవండి: బిగ్‌బాస్: వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లు వీరే!) నటుడి వైల్డ్ కార్డ్ ఎంట్రీ కాగా షో ప్రారంభమై వారం రోజులు కావస్తున్నా ఆ సందడి, హడావుడి లేదని, చప్పగా సాగుతుందని ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. దీంతో బిగ్‌బాస్ నిర్వాహకులు వైల్డ్ కార్డ్ అస్త్రాన్ని బయటకు తీశారు. ఈ మేరకు నేటి ఎపిసోడ్లో నాగ్ ఓ సర్ప్రైజ్ ఉండబోతోందని చెప్పారు. ఆ వెంటనే ఓ వైల్డ్ కార్డ్ కంటెస్టెంటును లోపలికి పంపిచారు. ఆ కంటెస్టెంటు నటుడు సాయి కుమార్ పంపన అని సమాచారం. "ఈ రోజుల్లో" చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న సాయి కుమార్ "బస్టాప్" వంటి పలు సినిమాల్లో నటించినప్పటికీ పెద్ద బ్రేక్ అయితే రాలేదు. దీంతో బిగ్‌బాస్ షో ద్వారా తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. మరి ఆయనకు బిగ్‌బాస్ ఎంతమేరకు కలిసివస్తుందో చూడాలి! (చదవండి: ఎన్నో వారాలు ఉండలేను: గంగవ్వ) Elimination day... Wait for the surprise!#BiggBossTelugu4 Today at 9 PM on @StarMaa pic.twitter.com/XnYgmekL4b — starmaa (@StarMaa) September 13, 2020 డ్యాన్సులతో అదరగొట్టిన దివి, దేవి మరోవైపు ఉదయం స్టార్ మా రిలీజ్ చేసిన ప్రోమోలో కంటెస్టెంట్లు అందరూ డ్యాన్సులతో రచ్చ రచ్చ చేసినట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా దివి, దేవి చేసిన స్టెప్పులు ప్రేక్షకులను ఈలలు వేయించేలా ఉన్నాయి. ఆఖరుకు గంగవ్వ కూడా హుషారుగా స్టెప్పులేయడం విశేషం. కల్యాణి పాట అందుకోవడంతో తప్పించుకునే ఛాన్స్ లేక ఇంటి సభ్యులందరూ బిక్కముఖం వేసుకున్నారు. (చదవండి: గంగవ్వ 10 వారాల పైనే ఉంటుంది) Sunday is a Fun'day...Get ready for loads of entertainment.#BiggBossTelugu4 Today at 9 PM on @StarMaa pic.twitter.com/HBX5EbNmZU — starmaa (@StarMaa) September 13, 2020 -
వైల్డ్ కార్డ్ ఎంట్రీ: ఇద్దరా? ముగ్గురా?
సెప్టెంబర్ ఆరున గ్రాండ్‌గా ప్రారంభమైన బిగ్‌బాస్ నాల్గవ సీజన్లో 16 మంది కంటెస్టెంట్లు ఉన్నారు. ఇందులో ముందుగా ఊహించిన ఓ కంటెస్టెంటు మాత్రం మిస్సయ్యాడు. అతడే జబర్దస్థ్ కమెడియన్ ముక్కు అవినాష్. సోషల్ మీడియాలో ఎప్పటినుంచో అవినాష్ బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంటరవుతున్నాడంటూ బోలెడన్ని వార్తలు వీరవిహారం చేశాయి. కానీ అనూహ్యంగా చివరి నిమిషంలో అతను ఎంట్రీ ఇవ్వకపోవడంతో అందరూ ఖంగు తిన్నారు. అలా అని అవినాష్ షో నుంచి తప్పుకున్నాడని చెప్పలేం. అతడు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తగిన సమయం చూసి బిగ్‌బాస్ ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీ బాణాన్ని వదలనున్నట్లు కనిపిస్తోంది. (చూడాలి: దేత్తడి హారిక: బెడిసి కొట్టిన పబ్లిసిటీ!) సాయికుమార్ బిగ్‌బాస్ హౌస్‌లోకి! అవినాష్‌తోపాటు ప్రజలకు పరిచయం ఉన్న మరో ముఖం కూడా త్వరలోనే బిగ్‌బాస్ హౌస్‌లో చూసే సూచనలు కన్పిస్తున్నాయి. 'ఈ రోజుల్లో' చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న సాయికుమార్ కూడా హౌస్‌లో భాగం కానున్నాడు. అసలే హౌస్‌లో సెలబ్రిటీలు పెద్దగా లేరు, ఉన్నవాళ్లు కూడా యాక్టివ్‌గా లేకపోవడంతో షో రక్తికట్టడం లేదు. దీంతో వైల్డ్ కార్డ్ ఎంట్రీల ద్వారానైనా బిగ్‌బాస్‌కు బిగ్ బ్రేక్ ఇద్దామని ప్లాన్ చేస్తున్నారు. పనిలో పనిగా వైల్డ్ కార్డ్ ఎంట్రీగా పంపించేందుకు ఓ అమ్మాయిని కూడా సెలక్ట్ చేసి పెట్టారు. 'జంప్ జిలానీ' హీరోయిన్ స్వాతి దీక్షిత్‌ను ఓ ఆప్షన్‌గా పెట్టుకున్నారు. ఈమె చిత్రాంగధ, లేడీస్ అండ్ జెంటిల్మెన్ చిత్రాల్లోనూ నటించింది (చూడాలి: రూ.50 లక్షలు వస్తే.. : గంగవ్వ) వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లను ప్రేక్షకులు ఆదరిస్తారా? వైల్డ్ కార్డ్ ఎంట్రీల వల్ల బిగ్‌బాస్ షో ఎంత రచ్చరచ్చగా మారిందో గత సీజన్లలోనే చూశాం. మూడో సీజన్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన తమన్నా కంటెస్టెంట్లతో ఆడుకుని వారిని ఏడిపించిన విషయం తెలిసిందే. ఆమె అరాచకాలను చూడలేక ప్రేక్షకులు రెండు మూడు వారాల్లోనే తమన్నాను బయటకు పంపించారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా శిల్పా శెట్టిని కూడా లోనికి పంపించినప్పటికీ అటు కంటెస్టెంట్లతో పాటు ఇటు ప్రేక్షకులు కూడా ఆమెకు కనెక్ట్ అవలేదు. దీంతో ఆమె కూడా వచ్చినదారినే తిరుగుముఖం పట్టింది. ఇప్పటివరకు ఏ వైల్డ్ కార్డ్ కంటెస్టెంటు కూడా టైటిల్ గెలుచుకున్న దాఖలాలు లేవు. మరి ఈసారి వచ్చే వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లైనా టైటిల్ కోసం పోరాడుతారా? వచ్చినదారినే వెళ్లిపోతారా? అసలు ప్రేక్షకులు వీరిని ఏమేరకు ఆదరిస్తారు అనేది చూడాల్సిందే. (చూడాలి: బిగ్‌బాస్ అనైతిక షో: నారాయణ) -
కలెక్టర్‌ను కలిసిన నటుడు సాయికుమార్
సాక్షి, కర్నూలు(అర్బన్): ప్రముఖ చలన చిత్ర నటుడు సాయికుమార్ మంగళవారం జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్‌ను స్నేహపూర్వకంగా కలిశారు. బెంగళూరులో షూటింగ్ నిమిత్తంహైదరాబాద్ నుంచి వెళ్తున్న సాయికుమార్ కలెక్టర్ జిల్లా పరిషత్‌లో ఉన్నారన్న సమాచారంతో అక్కడికి వచ్చి కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీరపాండియన్‌తో తనకు చాలా ఏళ్లుగా స్నేహ సంబంధాలు ఉన్నాయన్నారు. స్నేహ పూర్వకంగా కలిశానే తప్ప ఎలాంటి ప్రత్యేకతా లేదని స్పష్టం చేశారు. -
ఇన్‌స్టాగ్రామ్‌తో ఏడిపించాడు
సాక్షి, సిటీబ్యూరో: ఇన్స్టాగ్రామ్ ద్వారా అమ్మాయిలను వేధిస్తున్న వ్యక్తిని రాచకొండ సైబర్‌క్రైమ్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే...మూసాపేటకు చెందిన వొరిసా సాయికుమార్ ఏడో తరగతితో చదువుకు స్వస్థి చెప్పి కూలీగా పని చేస్తున్నాడు. సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండే అతను ఇన్‌స్ట్రాగామ్‌లో పలువురు అమ్మాయిల ఫొటోలు, వీడియోలు సేకరించాడు. అదే తరహాలో ఓ బాలిక ఇన్స్టాగ్రామ్ ఖాతాకు అప్లోడ్ చేసి ఉన్న ప్రొఫైల్ పిక్చర్‌ను డౌన్లోడ్ చేసుకున్న అతను ఆమె పేరును సరిపోలేలా నకిలీ ఖాతా క్రియేట్ చేసి ఆమె ప్రొఫైల్ పిక్చర్‌ను అప్లోడ్ చేశాడు. అనంతరం బాధితురాలి వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసేలా నగ్న వీడియోలు పోస్టు చేశాడు. ఆ తర్వాత ఆమె ఇన్స్టాగ్రామ్ స్నేహితుల ద్వారా ఆమె సెల్‌ఫోన్ నంబర్‌ను సేకరించి వ్యక్తిగత చిత్రాలు, వీడియోలు పంపాలంటూ బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. ఆతర్వాత బాధితురాలి తల్లి ఫొటోను ప్రొఫైల్ పిక్చర్‌గా పెట్టుకొని మరో ఇన్స్టాగ్రామ్ ఖాతా సృష్టించి ఫొటోలు, వీడియోలు పంపాలని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. దీంతో బాధితురాలు రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు మంగళవారం నిందితుడు సాయికుమార్‌ను అరెస్టు చేశారు. -
కరోనా విరాళం
పద్మావతి గల్లా – 10 లక్షలు (‘సీసీసీ మన కోసం’కు) పద్మావతి గల్లా ఫిల్మ్‌నగర్ కల్చరల్ సెంటర్ (ఎఫ్.ఎన్.సీ.సీ) – 25 లక్షలు ( తెలంగాణ ప్రభుత్వానికి ) సాయికుమార్ కుటుంబం – 7 లక్షల 12 రూపాయిలు (‘సీసీసీ’కు సాయి కుమార్, ఆయన తనయుడు ఆది సాయికుమార్ 5 లక్షల నాలుగు రూపాయిలు అందించారు. డబ్బింగ్ యూనియన్ అసోసియేషన్‌కి సాయి కుమార్ లక్షా ఎనిమిది రూపాయిలు, సాయి కుమార్ తమ్ముడు రవి శంకర్ లక్ష రూపాయిలు ప్రకటించారు) ఆది, సాయికుమార్ సాగర్ – 5 లక్షలు (తెలంగాణ ప్రభుత్వానికి ) కేటీఆర్‌కి చెక్ అందిస్తున్న సాగర్ -
నాలుగో సింహం ఎవరో తెలుసా?
-
‘నాలుగో సింహం ఎవరో చెప్పిన సాయి కుమార్’
‘అందరికీ నమస్కారం.. ఇది మన సంస్కారం. కనిపించే మూడు సింహాలు డాక్టర్లు, పోలీసులు, పారిశుద్ధ కార్మికులు అయితే కనిపించని నాలుగో సింహామే మీరు.. మీరు అంటే మనం.. మనం అంటే దేశం.. దేశం అంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్. దేశం మనకేం చేసిందాని కంటే దేశానికి మనం ఏం చేసామన్నదే ముఖ్యం. ఈ రోజు మనం గొప్ప సేవ చేయాల్సిన అక్కర్లేదు. మన ఇళ్లలో మనం కూర్చుంటే చాలు. ప్రభుత్వం ఇస్తున్న సూచనలను పాటిస్తూ.. స్వీయ నియంత్రణతో శుభ్రతతో క్రమశిక్షణతో మీ తల్లిదండ్రులతో మీ భార్యా పిల్లలతో మీ కుటుంబాలతో మీరు ఇంట్లో ప్రశాంతంగా ఉంటే చాలు. మీరు బతకండి మిగతావారిని బతకనివ్వండి. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మనమందరం కలిసికట్టుగా దేశం కోసం ప్రపంచం కోసం పోరాడుదాం. కరోనా అనే వైరస్‌ను తరిమికొడదాం. ఆ మహమ్మారి నుంచి ప్రపంచాన్ని కాపాడుదాం. సర్వేజనా సుఖినోభవంతు’అంటూ కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో నటుడు సాయికుమార్ ప్రజలను కోరాడు. ఈ మేరకు ఓ వీడియో రూపొందించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక కరోనాపై పోరాటంలో భాగంగా సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు ప్రభుత్వాలకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా ప్రజల్లో కరోనా వైరస్‌పై అవగాహ కల్పించడానికి అనేక కార్యక్రమాలను చేపడుతున్నారు. చదవండి: ‘ఇకనైనా అమెరికా కళ్లుతెరవాలి’ విపత్తులో కూడా పెన్షన్.. సీఎం జగన్‌పై ప్రశంసలు -
హారర్ కథా చిత్రం
రుషి లక్ష్మణ్, ఉమేశ్, సాయికుమార్, జాకీష్రాఫ్, షీనారాయ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘సినిమా కథా చిత్రం’. రామ్‌ఫిలిమ్స్ పతాకంపై మదన్ మోహన్ నాయుడు, జి.తిమ్మారెడ్డి గౌడ్ నిర్మించిన ఈ చిత్రానికి రామ్ మధుసూదన్ దర్శకుడు. తెలుగు, కన్నడ భాషల్లో తెరకెక్కిన ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా టి.రామసత్యనారాయణ, సాయివెంకట్, మోహన్ గౌడ్లు పాల్గొన్నారు. రామ్ మధుసూదన్ మాట్లాడుతూ– ‘‘గతంలో నేను తెరకెక్కించిన ‘వంశం’ చిత్రానికి 13 అవార్డులు వచ్చాయి. లేటెస్ట్గా రుషిని హీరోగా పరిచయం చేస్తూ ‘సినిమా కథా చిత్రం’ చేశాను. హారర్ కథతో ఈ చిత్రం తెరకెక్కింది. అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం’’ అన్నారు. -
తీవ్రవాదం నేపథ్యంలో...
‘వినాయకుడు, విలేజ్‌లో వినాయకుడు, కేరింత’ వంటి సెన్సిబుల్ హిట్ సినిమాలు తీసిన సాయికిరణ్ అడివి దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’ (ఒ.జి.యఫ్). ఆది సాయికుమార్ హీరోగా నటించారు. ప్రముఖ రచయిత అబ్బూరి రవి ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా నటించారు. ప్రతిభా అడివి, కట్టా ఆశిష్ రెడ్డి, కేశవ్ ఉమాస్వరూప్, పద్మనాభ రెడ్డి, గ్యారీ బీహెచ్, సతీష్ డేగల, పలువురు నటీనటులు, సాంకేతిక నిపుణులు నిర్మించిన ఈ సినిమా అక్టోబర్ 18న విడుదల కానుంది. సాయికిరణ్ అడివి మాట్లాడుతూ– ‘‘వాస్తవ ఘటనల ఆధారంగా కల్పిత కథాంశంతో రూపొందిన చిత్రమిది. తీవ్రవాదం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా సెన్సార్ పూర్తయింది. శ్రీచరణ్ పాకాల చక్కటి స్వరాలు, నేపథ్య సంగీతం అందించాడు. మా సినిమాలో దేశభక్తి గీతాన్ని పాడిన కీరవాణిగారికి థ్యాంక్స్’’ అన్నారు. ‘‘తొలిసారి ఎన్.ఎస్.జి కమాండోగా నటించాను. నా లుక్కు మంచి స్పందన వచ్చింది. సాయికిరణ్ అడివిగారు కథపై ఎంతో పరిశోధన చేసి ఈ సినిమా తీశారు. కశ్మీర్ పండిట్ల జీవితాలను, అక్కడి పరిస్థితులను కళ్లకు కట్టినట్టు చూపించారు’’ అన్నారు ఆది సాయికుమార్. ‘ఎయిర్ టెల్’ మోడల్ శషా చెట్రి, కార్తీక్ రాజు, పార్వతీశం, నిత్యా నరేశ్, కృష్ణుడు, అనీశ్ కురువిల్లా, రావు రమేశ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: జైపాల్ రెడ్డి నిమ్మల, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిరణ్ రెడ్డి తుమ్మ, సహ నిర్మాత: దామోదర్ యాదవ్ (వైజాగ్). -
నా శత్రువు నాతోనే ఉన్నాడు
‘రామాయణంలో రాముడి శత్రువు రావణాసురుడు.. కృష్ణుని శత్రువు కంసుడు... నా శత్రువు నాతోనే ఉన్నాడు’ అంటూ ఆది సాయికుమార్ డైలాగులతో ప్రారంభమయ్యే ‘బుర్రకథ’ ట్రైలర్ ఆసక్తిగా ఉంది. ఆది సాయికుమార్ హీరోగా, మిస్తీ చక్రవర్తి, నైరాశా హీరోయిన్లుగా నటించారు. రచయిత ‘డైమండ్’ రత్నబాబు ఈ సినిమాతో దర్శకునిగా పరిచయమవుతున్నారు. శ్రీకాంత్ దీపాల, కిషోర్, కిరణ్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా ట్రైలర్‌ని హీరో వెంకటేష్ విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్గా, ఎంటర్టైనింగ్గా ఉంది. మంచి స్టోరీ. ఆది బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. రత్నంబాబు తెరకెక్కించిన ఈ అందమైన కథని ప్రతి ఒక్కరూ చూడాలి’’ అన్నారు. ‘‘మా సినిమా టీజర్ చూసి వింటేజ్ క్రియేషన్స్ వారు ప్రపంచవ్యాప్తంగా విడుదల హక్కులు కొన్నారు. సినిమాపై చాలా నమ్మకంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం’’ అన్నారు శ్రీకాంత్ దీపాల. డైమండ్ రత్నబాబు మాట్లాడుతూ– ‘‘హీరో నమ్మకంతోనే ఒక డైరెక్టర్ వస్తాడు. ప్రతిభ ఉన్నవాళ్లు చాలా మంది ఉన్నారు. కానీ, వారందరినీ ప్రోత్సహించడానికి నిర్మాతలు చాలా అవసరం. రచయితగా ఉన్న నాకు దర్శకుడిగా ప్రోత్సాహం దొరికింది. ఈ చిత్రంలో తండ్రీ కొడుకుల మధ్య అనుబంధం చాలా బాగుండటంతో పాటు ఎంటర్టైనింగ్గా ఉంటుంది’’ అని తెలిపారు. ఆది సాయికుమార్ మాట్లాడుతూ – ‘‘నాని, సందీప్ కిషన్, సాయి తేజ్‌లతో సహా మిగతా హీరోలందరూ మా సినిమా గురుంచి పాజిటివ్ ట్వీట్స్ చేసినందుకు థ్యాంక్స్. నాకు హిట్ పడి చాలా కాలం అయింది.. ఈ సినిమాతో మళ్లీ హిట్ సాధిస్తాననే నమ్మకం ఉంది’’ అన్నారు ఆది సాయికుమార్. ‘‘బుర్రకథ’ నా 4వ సినిమా. మంచి హిట్ అవుతుందని భావిస్తున్నా’’ అన్నారు కిరణ్‌రెడ్డి. ఈ చిత్రానికి కెమెరా: సి.రాంప్రసాద్. -
పక్కనోడి జీవితానికి హాని జరగకూడదు
‘‘మనం చేసే తప్పుల వల్ల మన జీవితానికి ఏం జరిగినా పర్వాలేదు.. కానీ, పక్కనోడి జీవితానికి ఏ హానీ జరగకూడదు’ అంటూ నటుడు సాయికుమార్ డైలాగ్‌తో ‘గుణ 369’ చిత్రం టీజర్ ప్రారంభమవుతుంది. ‘మాలాంటి వాళ్లు మీలాంటి వాళ్లను చూసి భయపడేది, గొడవలంటే మూసుకుని కూర్చునేది మాకేదన్నా అవుతుందని కాదు.. మా అనుకున్న వాళ్లకు ఏదన్నా అవుతుందన్న చిన్న భయంతో’ అంటూ కార్తికేయ ఎమోషనల్‌గా చెప్పే డైలాగ్ కూడా ఆకట్టుకుంటోంది. కార్తికేయ, అనగ జంటగా అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘గుణ 369’. ప్రవీణ కడియాల సమర్పణలో అనిల్ కడియాల, తిరుమల్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్ సోమవారం విడుదలైంది. ఈ సందర్భంగా అర్జున్ జంధ్యాల మాట్లాడుతూ– ‘‘మా సినిమా టీజర్ విడుదలైన కొన్ని క్షణాల నుంచే చాలా బావుందంటూ ఫోన్లు చేసి ప్రశంసిస్తున్నారు. డైలాగులు, లొకేషన్లు, నటన, కెమెరా, కాస్ట్యూమ్స్... ఇలా ప్రతి విషయం గురించి మాట్లాడుతుంటే చాలా ఆనందంగా అనిపించింది. టీజర్ ఎంత బావుందో, సినిమా అంతకు వెయ్యి రెట్లు బావుంటుందని నమ్మకంగా చెప్పగలను’’ అన్నారు. ‘‘యువతకు కావాల్సిన అంశాలు, ఫ్యామిలీ ఆడియన్స్ కోరుకునే విషయాలు, మాస్ ప్రేక్షకులకు నచ్చే సన్నివేశాల సమాహారంగా టీజర్ ఉందని, ఫుల్ మీల్స్ లాంటి సినిమా అవుతుందనే ప్రశంసలు అందుతున్నాయి. మూడు రోజులు మినహా షూటింగ్ పూర్తయింది. ఇప్పటిదాకా వచ్చిన ఔట్పుట్ చూశాం. ప్రేక్షకులను ఆకట్టుకునే హిట్ సినిమా తీశామనే నమ్మకం వచ్చింది. ఇదే ఉత్సాహంతో ఈ నెలాఖరున పాటలను విడుదల చేస్తాం. కార్తికేయ, మా కెరీర్లో ‘గుణ 369’ చెప్పుకోదగ్గ గొప్ప సినిమా అవుతుందనే నమ్మకం ఉంది’’ అని అనిల్ కడియాల, తిరుమల్ రెడ్డి అన్నారు. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు: చైతన్య భరద్వాజ్, కెమెరా: ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ రామ్, ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: సత్య కిశోర్, శివ మల్లాల. -
సారీ.. నేను ఉగ్రవాదిని
‘‘ఇండియాకు వ్యతిరేకంగా నడుచుకునే ఉగ్రవాది పాత్ర చేసినందుకు సారీ. నటుడిగా అన్ని పాత్రలను ఒకేలా చూడాలని ఈ పాత్ర చేశాను’’ అన్నారు మనోజ్ నందం. సాయికిరణ్ అడవి దర్శకత్వంలో ఆది సాయికుమార్, అబ్బూరి రవి, కార్తీక్ రాజు, పార్వతీశం, నిత్యానరేశ్ ముఖ్యపాత్రల్లో రూపొందిన చిత్రం ‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’. సినిమాలో నటించిన ఆర్టిస్ట్‌లు, టెక్నీషియన్సే నిర్మాతలు. ‘అతడు, ఛత్రపతి’ సినిమాల్లో హీరో చిన్ననాటి పాత్రలు చేసిన మనోజ్ నందం ఈ సినిమాలో విలన్‌గా కనిపించనున్నారు. మనోజ్ లుక్‌ను విజయ్ దేవరకొండ రిలీజ్ చేసి, మాట్లాడుతూ – ‘‘కేరింత’ సినిమాకు ఆడిషన్ ఇచ్చాను. దురదృష్టవశాత్తు సెలెక్ట్ కాలేదు. మనోజ్, అబ్బూరి రవిగారి లుక్స్ నచ్చాయి’’ అన్నారు. ‘‘బిజీగా ఉన్నప్పటికీ లుక్ రిలీజ్ చేయడానికి అంగీకరించిన విజయ్‌కు థ్యాంక్స్’’ అన్నారు సాయికిరణ్ అడవి. ‘‘ఫస్ట్ టైమ్ బ్యాడ్‌బాయ్ పాత్రలో నటించాను. ఆడియన్స్ నన్ను విలన్‌గా యాక్సెప్ట్ చేస్తారని ఆశిస్తున్నాను’’ అన్నారు మనోజ్. -
ఆది సాయికుమార్ కొత్త చిత్రం ప్రారంభం
-
ప్యూర్ లవ్‌స్టోరీ మొదలు
ఆది కథానాయకుడిగా శ్రీనివాస్ నాయుడు నడికట్ల దర్శకత్వంలో రూపొందుతోన్న కొత్త సినిమా ప్రారంభోత్సవం ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది. డీఆర్పీ వర్మ సమర్పణలో శ్రీ హనుమాన్ మూవీ మేకర్స్ పతాకంపై చింతలపూడి శ్రీనివాస్, చావలి రామాంజనేయులు నిర్మిస్తున్నారు. తొలి సన్నివేశానికి దర్శకుడు వంశీపైడిపల్లి క్లాప్ ఇచ్చారు. హీరో ఆది మాట్లాడుతూ–‘‘కథ గురించి డైరెక్టర్ నాకు మూడు గంటల నరేషన్ ఇచ్చారు. ప్యూర్ లవ్‌స్టోరీ నేపథ్యంలో రూపొందనున్న ఈ సినిమాలో రెండు షెడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నాను. హీరోయిన్ పేరును త్వరలోనే ప్రకటిస్తాం’’ అన్నారు. ‘‘ఈ సినిమా చేయడానికి మాకు సహకరిస్తోన్న సాయికుమార్‌గారికి, హీరో ఆదిగారికి, నిర్మాతలకు ధన్యవాదాలు’’ అన్నారు దర్శకుడు. ‘‘సీమశాస్త్రి’ సినిమా తర్వాత మేము చేస్తోన్న చిత్రమిది. దర్శకుడు మంచి కథ చెప్పారు. సినిమా హిట్ సాధిస్తుందన్న నమ్మకం ఉంది’’ అన్నారు నిర్మాత చావలి రామాంజనేయులు. ఈ కార్యక్రమంలో సాయికుమార్, నాగశౌర్య, నిర్మాత భరత్ చౌదరి పాల్గొన్నారు. రాజీవ్ కనకాల, రాధికా, రావు రమేష్, అజయ్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్న ఈ సినిమాకు సంగీతం: అరుణ్ చిలువేరు. -
అమ్మమాట కోసమే బాగేపల్లి నుంచి పోటీ
-
ప్రకాశ్‌రాజ్ ఆవేశపరుడు.. అది నాకు నచ్చలేదు
సాక్షి, బెంగుళూరు : సిద్ధరామయ్య అసమర్థ ముఖ్యమంత్రి అని ఏ ఒక్క సమస్యను పరిష్కరించలేదని సినీనటుడు సాయికుమార్ విమర్శించారు. త్వరలో జరగనున్న కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయమని అన్నారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన పలు సంచలన వ్యాఖ్యాలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ నేతలు రాజకీయంగా సహనం కోల్పోయి మాట్లాడుతున్నారంటూ విమర్శించారు. అమరావతి శంకుస్థాపన సందర్భంగా పవిత్ర జలం.. పవిత్ర మట్టి అంటూ మోదీని కీర్తించిన తెలుగుదేశం పార్టీ నేతలు, విమర్శించడంలో అర్థం లేదన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా సాధనకు ప్రతిపక్షనేత వైఎస్ జగన్ రాజీలేని పోరాటం చేస్తున్నారని.. అది వాస్తవం అని, వైఎస్ జగన్‌ను ఫాలో అవడమే టీడీపీ విధానమా అంటూ సాయికుమార్ ప్రశ్నించారు. రాజకీయ పార్టీకి సొంత ఆలోచనలు, విధానాలు ఉండాలని టీడీపీ నేతలకు సూచించారు, తెలుగుదేశం పార్టీ, నేతలకు అవి ఏమాత్రం లేవంటూ దుయ్యబట్టారు. తన తోటి నటుడు ప్రకాశ్ రాజ్ ఆవేశపరుడంటూ వ్యాఖ్యానించారు. మోదీని టార్గెట్ చేయడం తనకు నచ్చలేదన్నారు. దేశంలో ఏది జరిగినా ప్రధాని మోదీనే కారణం అని అనడం ప్రతిపక్షాలకు అలవాటుగా మారిపోయిందని, అది వారి అవివేకం అంటూ మండిపడ్డారు. త్వరలో జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో సాయి కుమార్ బీజేపీ తరపున బాగేపల్లి నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. -
బాలయ్యకు సాయికుమార్ ఝలక్
సాక్షి, అనంతపురం: ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు సరైనవి కాదని సినీ నటుడు, ‘డైలాగ్ కింగ్’ సాయికుమార్ అన్నారు. వ్యక్తిగత విమర్శలు చేయడం మంచిది కాదని హితవు పలికారు. చంద్రబాబు ధర్మదీక్ష సందర్భంగా ప్రధాని మోదీపై బాలకృష్ణ చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఆయన ఈవిధంగా స్పందించారు. మంగళవారం సాయికుమార్ విలేకరులతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా కోసం ప్రధాని మోదీ కాళ్లు పట్టుకొని న్యాయం చేయమని అడుగుతానని చెప్పారు. కర్ణాటక శాసనసభా ఎన్నికల్లో చిక్‌బళ్లాపూర్ జిల్లా బాగేపల్లి నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా సాయికుమార్ పోటీ చేస్తున్నారు. అయితే ఎన్నికల ప్రచారానికి హీరో బాలకృష్ణను పిలవడం లేదని ఆయన తెలిపారు. కాగా, 2008 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసి సాయికుమార్ ఓటమిపాలయ్యారు. ఈసారి ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో ఎన్నికల ప్రచారం సాగిస్తున్నారు. -
బీజేపీ తరపున ఎన్నికల్లో పోటీ చేస్తున్న సాయి కుమార్
-
దసరాకి రాజా
కుమార్ రాజా, సాయికుమర్, ప్రియా చౌదరి, ప్రియాంకా శర్మ, ఆక్సాఖాన్, జీత్‌సింగ్ ముఖ్య తారలుగా తెరకెక్కుతోన్న చిత్రం ‘కుమార్ రాజా’. టెల్ మీ బాస్ పిక్చర్స్ పతాకంపై శ్రీచక్ర మల్లికార్జున స్వీయ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. హీరో శ్రీకాంత్, డైరెక్టర్ హరీష్ శంకర్, నిర్మాత రాజ్ కందుకూరి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. హీరో, హీరోయిన్లపై రాజ్ కందుకూరి క్లాప్ ఇచ్చారు. శ్రీచక్ర మల్లికార్జున మాట్లాడుతూ– ‘‘యాక్షన్, లవ్, కామెడీ, సెంటిమెంట్స్, ఎమోషన్.. ఇలా అన్ని అంశాలతో కథ చక్కగా కుదిరింది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే షూటింగ్ మొత్తం పూర్తి చేయాలనుకుంటున్నాం. దసరాకి సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. -
పరీక్షల్లో ఫెయిల్..నలుగురు ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య
-
నలుగురు విద్యార్థుల ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ అయ్యామని ముగ్గురు, మార్కులు తక్కువ వచ్చాయని ఒకరు వెరసి నలుగురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. శుక్రవారం ఇంటర్ ఫలితాలు వచ్చిన కొద్దిసేపటికే సిటీలో ఈ విషాద సంఘటనలు చోటుచేసుకున్నాయి. ♦ వనస్థలిపురం సుభద్రానగర్‌కు చెందిన ఎ.ఉదయ మాణిక్య వరప్రకాశ్ కుమార్తె వందన దిల్‌సుఖ్‌నగర్‌లోని శ్రీచైతన్య కళాశాలలో బైపీసీ మొదటి సంవత్సరం చదువుతోంది. ఫలితాల్లో 440కి 325 మార్కులే వచ్చాయని మనస్తాపానికి గురైన వందన బెడ్రూమ్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ప్రాణాలు తీసుకుంది. ♦ కూకట్పల్లి పరిధి ఖైత్లాపూర్‌లో ఉండే కాట్రాజ్ శేఖర్ కుమారుడు సాయికుమార్ (17) ఎంఎన్ఆర్ కళాశాలలో ఇంటర్ చదువుతున్నాడు. మొదటి సంవత్సరం ఫలితాల్లో ఇతడు ఫెయిలయ్యాడు. మనోవేదనకు గురైన సాయికుమార్‌ను తల్లిదండ్రులు ఓదార్చి మళ్లీ రాసి పాస్ కావచ్చని చెప్పి విధులకు వెళ్లారు. మధ్యాహ్నం సాయికుమార్ ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ♦ పిర్జాదిగూడ మల్లికార్జున్ నగర్లో నివసించే దూలం మధు కుమార్తె వర్ష (16) ఇంటర్ మొదటి ఏడాది పరీక్షలు రాసి, అన్ని సబ్జెక్ట్లూ తప్పింది. దీంతో మనస్తాపం చెందిన వర్ష ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ♦ గాజులరామారం ఉషోదయ కాలనీకి చెందిన మువ్వ రామకృష్ణ కుమార్తె శ్రీవిద్య (18) చింతల్‌లోని ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్ ఎంపీసీ మొదటి సంవత్సరం పరీక్షలు రాసింది. ఫలితాల్లో ఆమె నాలుగు సబ్జెక్టుల్లో ఫెయిలైన విషయం తెలిసి, వారు నివాసముండే అపార్ట్మెంట్లోని నాలుగో అంతస్తు నుంచి కిందికి దూకేసింది. అక్కడికక్కడే మృతి చెందింది. -
ఆ 45 నిమిషాలూ తల తిప్పుకోలేరు!
హాస్య నటుడిగా ప్రేక్షకులను నవ్వించిన, నవ్విస్తున్న సప్తగిరి హీరోగా మారిన విషయం తెలిసిందే. ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్’తో మంచి విజయం అందుకున్న ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సప్తగిరి ఎల్ఎల్బీ’. హిందీ హిట్ ‘జాలీ ఎల్ఎల్బీ’కి రీమేక్ ఇది. కాశిష్ వోహ్రా కథానాయిక. చరణ్ లక్కాకులను దర్శకునిగా పరిచయం చేస్తూ డా. రవికిరణ్ నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్‌ని హైదరాబాద్‌లో రిలీజ్ చేశారు. దర్శకుడు మాట్లాడుతూ– ‘‘ఎడిటర్ గౌతంరాజుగారి వద్ద నేను అసిస్టెంట్‌గా పనిచేశా. నేను దర ్శకత్వం చేస్తే ఆయన్నే ఎడిటర్‌గా పెట్టుకోవాలనుకున్నా. ఈ సినిమాతో నా కల నెరవేరింది. మా గురువులు పరుచూరి బ్రదర్స్ ఈ సినిమాకి మాటలు రాశారు. రామజోగయ్య శాస్త్రి చాలా మంచి పాటలిచ్చారు. ఆద్యంతం సినిమా నవ్వుకునేలా ఉంటుంది’’ అన్నారు. ‘‘సప్తగిరి ఈ సినిమా కోసం బాగా హార్డ్‌వర్క్, హోమ్‌వర్క్ చేశాడు. ఈ సినిమాలో ప్రతినాయకుడు ఎవరు అనే ఆలోచన రాగానే సాయికుమార్‌గారు గుర్తొచ్చారు. ఆయన తప్ప ఈ పాత్ర వేరే ఎవరూ చేయలేరు. ఈ సినిమాలో చెప్పాలంటే ఇద్దరు హీరోలు. ఒకరు సాయికుమార్, మరొకరు సప్తగిరి. పేదవాడికి కూడా న్యాయం దక్కాలన్నదే ఈ చిత్రకథ’’ అన్నారు రవికిరణ్. ‘‘శివప్రసాద్‌గారు, సాయికుమార్‌గారి సపోర్ట్ లేకుంటే ఈ సినిమా ఇంత బాగా వచ్చేది కాదు. చివరి 45 నిమిషాల్లో తల తిప్పుకోలేనంతగా సన్నివేశాలు ఉంటాయి. ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్’ ఎంత విజయం సాధించిందో అంతకుమించి ‘సప్తగిరి ఎల్ఎల్బీ’ హిట్ అవుతుందని ఆత్మవిశ్వాసంతో చెబుతున్నా’’ అన్నారు సప్తగిరి. చిత్రకథానాయిక కాశిష్ వోహ్రా, నిర్మాత ‘సింధూరపువ్వు’ కృష్ణారెడ్డి, దర్శకుడు అనిల్ రావిపూడి, నటలు సాయికుమార్, జయప్రకాశ్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి, ఎడిటర్ గౌతంరాజు పాల్గొన్నారు. -
ఏపీ అధికారికి కళ్లు చెదిరే ఆస్తులు!
ఆంధ్రప్రదేశ్ సచివాలయంలోని జీఏడీ విభాగం జాయింట్ సెక్రటరీ సాయికుమార్ ఆస్తుల చిట్టా కొండవీటి చాంతాడులా పెరుగుతూనే ఉంది. ఏసీబీ అధికారులు గత రెండు రోజులుగా ఆయనతో పాటు ఆయన బంధువుల ఇళ్లల్లో సోదాలు చేస్తున్నారు. ఇప్పటివరకు బయటపడిన ఆస్తుల వివరాలు చూసి అధికారులే విస్తుపోయారు. బెంగళూరులో రెండు ఫ్లాట్లు, హైదరాబాద్‌లో రెండు ఫ్లాట్లు, ఒక షాపింగ్ కాంప్లెక్సుతో పాటు కడప, బెంగళూరు నగరాల్లో ఏడు విలువైన స్థలాలను గుర్తించారు. అలాగే కిలో బంగారం, పది కిలోల వెండి, రూ. 20 లక్షల నగదు, 15 లక్షల డిపాజిట్లు, రూ. 20 లక్షల చిట్‌ఫండ్ రసీదులు స్వాధీనం చేసుకున్నారు. రెండు బ్యాంకు లాకర్లు తెరిచిన ఏసీబీ అధికారులు వాటిలో ఉన్న వజ్రాల ఉంగరాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇంకా తవ్వేకొద్దీ ఇంకెన్ని ఆస్తులు బయటపడతాయోనని చూస్తున్నారు. -
అలౌకికానందం
వేయి నామాల శ్రీనివాసుడి వైభోగం... నిత్య కళ్యాణం... పచ్చ తోరణం... కనులారా వీక్షించడం తప్ప వర్ణించతరమా? తిరుమలేశుడు కరుణిస్తే... అనుగ్రహిస్తే... వర్ణించ తరమే. అడుగడుగునా ఏడు కొండల్లో ప్రతిధ్వనించే వేంకటేశ్వరడి విశిష్టతలు వర్ణిస్తే.. సాక్షాత్తు స్వామివారు భక్తులకు నిజరూప దర్శనం ఇస్తే... ఎలా ఉంటుంది? ‘ఓం నమో వేంకటేశాయ’ చిత్రంలా ఉంటుంది. ‘అన్నమయ్య’లో శ్రీవారి భక్తుడి గురించి చెప్పిన దర్శకేంద్రులు రాఘవేంద్రరావు ‘ఓం నమో వేంకటేశాయ’లో హాథీరామ్ బావాజీ భక్తుడి చరిత్రతో పాటు కలియుగ వైకుంఠమైన తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రంలో నిత్యం జరిగే కైంకర్యాల వెనుక కథను చెప్పారు. కథేంటి?: దేవుణ్ణి చూడాలనే తపనతో చిన్నప్పుడే దైవాన్వేషణలో ఊరూరు తిరగడం మొదలుపెడతాడు రాజస్థాన్ వాసి రామ (నాగార్జున). అనుభవానంద స్వామి (సాయికుమార్) వద్దకు చేరుకుంటాడు. ఆ స్వామి అతడికి విద్యాబుద్ధులతో పాటు పాచికలు ఆడటం నేర్పిస్తారు. స్వామి దర్శనం కావాలంటే తపస్సు చేయాలని చెబుతారు. రామ తపస్సుకు మెచ్చిన శ్రీ వేంకటేశ్వరస్వామి బాలుడి రూపంలో రామ దగ్గరికి వస్తారు. స్వయంగా శ్రీవారే బాలుడి రూపంలో వచ్చారని గుర్తించని రాము, అతణ్ణి వెళ్లిపొమ్మని ఆగ్రహిస్తాడు. గురువు ద్వారా ఆ బాలుడే ఏడుకొండలవాడని తెలుసుకుని, తిరుమలకు చేరతాడు. అక్కడ స్వామి దర్శనం ఎలా అయింది? రామ నుంచి హథీరామ్ బాబాజీగా ఎలా మారారు? స్వామివారి నిత్య కైంకర్యాలను ఎలా జరిపించారు? స్వామి చేతుల మీదుగా సజీవ సమాధి ఎందుకయ్యారు? అనేది మిగతా చిత్రకథ. విశ్లేషణ: తెరపై సాక్షాత్తు శ్రీ వేంకటేశ్వరస్వామి కళ్లముందు ప్రత్యక్షమైన భావన కలుగుతుంది. ప్రతి ప్రేక్షకుడూ తెరపై కనిపిస్తున్న దృశ్యంలో మమేకమై చూసేలా స్వామివారికి బాలాజీ అనే పేరు ఎలా వచ్చింది? ఆయన ఏడు కొండలపై ఎందుకు వెలిశారు?... ఇలా స్థల పురాణంతో పాటు భక్తులకు తెలియని ఎన్నో విషయాలను కమర్షియల్ హంగులు జోడించి రాఘవేంద్రరావు ఈ సినిమా తీశారు. రచయిత జేకే భారవి, సంగీత దర్శకుడు కీరవాణి, నిర్మాత ఏ. మహేశ్‌రెడ్డి, విజువల్ ఎఫెక్ట్స్ బృందం.. ప్రతి ఒక్కరి నుంచి ఆయనకు పూర్తి మద్దతు లభించింది. తెర వెనుక బృందం పడిన కష్టం ఒకెత్తయితే... తెరపై నటీనటుల అభినయం మరో ఎత్తు. అనుష్క, ప్రగ్యా జైస్వాల్, విమలారామన్, అస్మిత, రావు రమేశ్.. అందరూ చక్కగా నటించారు. కానీ, ప్రేక్షకుల కళ్లన్నీ నాగార్జున, సౌరభ్ జైన్.. పైనే ఉంటాయి. స్వామివారు నిత్య యవ్వనుడు, అంద గాడు. సౌరభ్ జైన్‌ని ఆ పాత్రలో చూడగానే అచ్చంగా ఇలానే ఉంటారేమో అనిపిస్తుంది. హాథీరామ్ బాబాగా నాగార్జున అభినయం అద్భుతం. కొన్ని సీన్స్‌లో కంటతడి పెట్టించారు. అన్నమయ్య, శ్రీరామదాసు ఒక ఎల్తైతే హాథీరామ్ బాబా పాత్ర మరో ఎత్తు అనే విధంగా నటించారు. భగవంతు డికి, భక్తుడుకి మధ్య వచ్చే సన్నివేశాల్లో నాగార్జున, సౌరభ్ జైన్లు జీవించారు. థియేటర్లో ఓ సినిమా చూస్తున్నట్టు కాకుండా... తిరుమలేశుడి చరిత్ర తెలుసుకుంటున్న ఓ అలౌకిక ఆనందం కలుగుతుంది. -
సాయి కుమార్‌కు స్వర్ణం
సాక్షి, హైదరాబాద్: మూల అడవయ్య గౌడ్ స్మారక బాక్సింగ్ టోర్నమెంట్లో ఎల్. సాయి కుమార్ (జీహెచ్ఎంసీ, సికింద్రాబాద్) సత్తా చాటాడు. తెలంగాణ బాక్సింగ్ సంఘం ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియంలో జరిగిన ఈ టోర్నీలో లైట్ ఫ్లై వెరుుట్ విభాగంలో బంగారు పతకాన్ని దక్కించుకున్నాడు. పవన్ కుమార్ రజతాన్ని సొంతం చేసుకున్నాడు. ఫ్లై విభాగంలో డొమినిక్ మైకేల్, ఎగప్పన్ (తమిళనాడు)... బాటమ్ విభాగంలో ఎస్సాకి ముత్తు, మనోజ్... లైట్ విభాగంలో పరమ్‌జీత్, ప్రిన్స సిన్హా తొలి రెండు స్థానాల్లో నిలిచారు. పోటీల అనంతరం రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్సింహా రెడ్డి విజేతలకు పతకాలు, సర్టిఫికెట్స్ అందించారు. -
మీడియాతో ఢీ
‘‘సమాజంలో ఎవరైనా మా ముందు తలదించాల్సిందేననే ఓ మీడియా అధినేతతో మనలో ఒకడు, ఓ సామన్య అధ్యాపకుడు ఢీ అంటే ఢీ అంటూ తలపడితే.. ఏం జరిగిందనే కథతో తెరకెక్కిన చిత్రమిది’’ అన్నారు ఆర్పీ పట్నాయక్. ఆయన హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘మనలో ఒకడు’. జగన్మోహన్ నిర్మించిన ఈ చిత్రాన్ని నవంబర్ 4న విడుదల చేయాలను కుంటున్నారు. ‘‘కృష్ణమూర్తిగా ఆర్పీ, మీడియా అధినేతగా సాయికుమార్ అద్భుతంగా నటించారు. యథార్థ ఘటనల ఆధారంగా రూపొందిన చిత్రమిది’’ అని నిర్మాత అన్నారు. ‘నువ్వు నేను’ ఫేమ్ అనిత హీరోయిన్గా నటించిన ఈ చిత్రానికి పాటలు: చైతన్య ప్రసాద్, వనమాలి, పులగం చిన్నారాయణ, కెమేరా: ఎస్.జె.సిద్ధార్థ్, సహ నిర్మాతలు: ఉమేశ్ గౌడ, బాల సుబ్రమణ్యం. -
`వైశాఖం `మూవీ స్టిల్స్
-
వైశాఖం...హార్ట్ టచింగ్
‘‘నాకు కుటుంబమంటే ఇష్టం. స్నేహితులంటే చాలా ఇష్టం. అనుబంధాలకు చాలా విలువ ఇచ్చే వ్యక్తిని. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని జయగారు ఓ అద్భుతమైన కథ రాశారు. అందులో షార్ట్ అండ్ స్వీట్ రోల్లో నటించమనగానే అంగీకరించా. గుర్తుండే పాత్ర అవుతుంది’’ అని నటుడు సాయికుమార్ అన్నారు. హరీశ్, అవంతిక జంటగా బి.జయ దర్శకత్వంలో బీఏ రాజు నిర్మిస్తున్న సినిమా ‘వైశాఖం’. బి.జయ మాట్లాడుతూ - ‘‘ప్రతి సన్నివేశాన్ని పండగ వాతావరణంలో చిత్రీకరించాం. బాడీ గింబల్ టెక్నాలజీతో షూట్ చేశాం. ఇప్పుడు ‘2.0’కి శంకర్ ఈ టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు’’ అన్నారు. బీఏ రాజు మాట్లాడుతూ -‘‘జయ మనస్తత్వానికి దగ్గరగా ఉంటుందీ చిత్రం. తనకు గొప్ప పేరు తీసుకొస్తుంది. లవ్, కామెడీ, ఎమోషన్, చిన్న మెసేజ్ ఉన్న హార్ట్ టచింగ్ మూవీ. కన్నడలో 9, తెలుగులో 6 సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న సాయికుమార్‌గారు మాపై అభిమానంతో సినిమా చేసినందుకు థ్యాంక్స్’’ అన్నారు. హీరో హరీశ్, సంగీత దర్శకుడు డీజే వసంత్ పాల్గొన్నారు. -
'పక్కింటి అబ్బాయి'గా చుట్టాలబ్బాయి..
ఇటీవల 'చుట్టాలబ్బాయి'గా ప్రేక్షకులను పలకరించిన ఆది త్వరలో 'పక్కింటి అబ్బాయి'గా అలరించనున్నాడు. సోమవారం హైదరాబాద్‌లో జరిగిన 'చుట్టాలబ్బాయి' సినిమా ప్లాటినమ్ డిస్క్ ఫంక్షన్లో ఈ విషయాన్ని వెల్లడించారు. ఫ్యామిలీ ఎంటర్టెయినర్గా తెరకెక్కిన చుట్టాలబ్బాయి సినిమా ఆదికి చెప్పుకోదగ్గ హిట్ ఇచ్చింది. అదే ఉత్సాహంతో ఇప్పుడు 'పక్కింటి అబ్బాయి'ని తెరకెక్కించే ప్రయత్నంలో ఉన్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెల్లడించలేదు. 'పక్కింటి అబ్బాయి'ని స్వయంగా తానే నిర్మిస్తానని ఆది తండ్రి, ప్రముఖ నటుడు సాయికుమార్ తెలిపారు. ఇదివరకు ఆది హీరోగా వచ్చిన 'గరం' సినిమాకు సాయి కుమారే నిర్మాతగా వ్యవహరించారు. -
మా అబ్బాయితో పక్కింటబ్బాయి తీస్తా
- సాయికుమార్ ‘‘చాలా రోజులుగా నేను, ఆది కలిసి నటించాలనుకున్నాం. మా కోరికను వీరభద్రమ్ తీర్చాడు. ‘గరం’ చిత్రం సమయంలో ఆదితో ‘పక్కింటబ్బాయి’ పేరుతో సినిమా తీద్దామనుకున్నా. దర్శకుడు ‘చుట్టాలబ్బాయి’ చేస్తానని చెప్పడంతో సెలైంట్ అయిపోయా. కానీ తప్పకుండా ‘పక్కింటబ్బాయి’ చిత్రం తీస్తా. ఈ చిత్రాన్ని విజయవంతం చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు’’ అని సాయికుమార్ అన్నారు. ఆది, నమితాప్రమోద్ జంటగా వీరభద్రమ్ దర్శకత్వంలో వెంకట్ తలారి, రామ్ తాళ్లూరి నిర్మించిన ‘చుట్టాలబ్బాయి’ ఇటీవల విడుదలైంది. ఈ చిత్రం ప్లాటినమ్ డిస్క్ ఫంక్షన్‌ను హైదరాబాద్ లో నిర్వహించారు. దర్శకుడు మాట్లాడుతూ-‘‘ ‘అహ నా పెళ్లంట’, ‘పూలరంగడు’ చిత్రాలప్పుడు చాలా ఆనందం పొందాను. ‘చుట్టాలబ్బాయి’తో ఆ సంతోషం రెట్టింపు అయింది. ప్రేక్షకులు మా చిత్రాన్ని బాగా ఆదరిస్తున్నారు. విజయయాత్రలో భాగంగా తిరుపతిలో ప్రేక్షకుల రెస్పాన్స్ చూసినప్పుడు నాలోని కొద్దిపాటి టెన్షన్ కూడా పోయింది’’ అన్నారు. ‘‘విజయ యాత్రలో ప్రేక్షకులు చూపిస్తున్న ఆదరణ మరచిపోలేనిది. సినిమాను చక్కగా రిసీవ్ చేసుకున్నారు. ఈ విజయం నాలో మరింత ఉత్సాహం నింపింది’’ అని ఆది చెప్పారు. నిర్మాతలు రామ్ తాళ్లూరి, వెంకట్ తలారి, ప్రతాని రామకృష్ణ గౌడ్, బీఏ రాజు, నటులు భద్రం, చమ్మక్ చంద్ర, కెమేరామన్ అరుణ్ తదితరులు పాల్గొన్నారు. -
వైభవాల రాముడొచ్చేశాడే...
రియల్ లైఫ్‌లో తండ్రీ కొడుకులైన సాయి కుమార్, ఆది రీల్ లైఫ్‌లో తొలిసారి తండ్రీ కొడుకులుగా నటించిన చిత్రం ‘చుట్టాలబ్బాయి’. వీరభద్రమ్ దర్శకత్వంలో శ్రీ ఐశ్వర్య లక్ష్మి మూవీస్, ఎస్.ఆర్.టి మూవీ హౌస్ పతాకంపై వెంకట్ తలారి, రామ్ తాళ్లూరి నిర్మించారు. నమితా ప్రమోద్ కథానాయిక. ఎస్ఎస్ తమన్ స్వరపరచిన పాటలు ఇటీవల విడుదలయ్యాయి. సాయికుమార్ పుట్టినరోజును పురస్కరించుకుని హైదరాబాద్‌లో ఈ చిత్రం టీజర్‌ను విడుదల చేశారు. ‘రంగరంగ వైభవాల రాముడొచ్చేశాడే... రంగు రంగు సంబరాల కానుకిచ్చేశాడే...’’ అంటూ సాగే టీజర్లో సాయికుమార్, ఆది అలరించారు. ‘‘పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ చిత్రం తెరకెక్కింది. అన్నివర్గాల వారికి నచ్చుతుందనే నమ్మకం ఉంది. బ్యాంకాక్‌లో తీసిన ఆది ఇంట్రడక్షన్ సాంగ్ సినిమాకే హైలెట్. తమన్ మంచి పాటలిచ్చాడు. సినిమాను త్వరలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అని దర్శకుడు తెలిపారు. -
'మళ్లీ ఎన్నికల బరిలోకి దిగుతా'
తెలుగు, కన్నడ సినీ రంగంతో మంచి అనుబంధం 2018లో బాగేపల్లి నుంచి పోటీ చేస్తా 55వ జన్మదిన వేడుకల్లో డైలాగ్ కింగ్ సాయికుమార్ బెంగళూరు :కన్నడ,తెలుగు సినిమా ల్లో తనకంటు ఒక స్టార్ హోదాను సంపాదించుకున్న నటుడు, డైలాగ్ కింగ్ సాయికుమార్ బుధవారం 55వ వసంతంలోకి అడుగు పెట్టా రు. ఈ సందర్భంగా సాయిప్రకాశ్ దర్శకత్వంలో యదార్థగాథ ఆధారంగా రూపొందుతున్న కన్నడ సినిమా షూటింగ్లో పాల్గొన్న సాయికుమార్ అభిమానుల మధ్య జన్మదిన వేడుకలను నిర్వహించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.....40 సంవత్సరాలుగా తనకు తన కుటుంబానికి కన్నడ, తెలుగుసినిమా రంగాలతో మంచి అనుబంధం ఏర్పడిందని తెలిపారు. సంచలన విజంయ సాధించిన పోలీస్ స్టోరీ చిత్రం తనకు దక్షిణ సినీరగంలో తిరుగు లేని ఖ్యాతీని తెచ్చిందని తెలిపారు. 1972లో రంగస్థల నడుటుగా ప్రవేశించిన తనకు 1973లో దేవుడు చేసిన పెళ్లి సినిమా నటుడుగా గుర్తింపు వచ్చిందని అన్నారు. దివంగత నందమూరి తారకరామరావు నటించిన సంసారం సినిమాకు డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా చేయడం మరిచిపోలేని అనుభూతి అని అన్నారు. ఇప్పటి వరకు సుమారు వెయ్యి సినిమాలకు డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా పని చేశానన్నారు. గతంలో తాను బీజేపీ తరఫున కర్ణాటకలోని బాగేపల్లి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయానని, 2018లో జరిగే ఎన్నికల్లో మరోసారి బాగేపల్లి నుంచి బరిలో దిగనున్నట్లు సాయికుమార్ తెలిపారు. ప్రస్తుతం కన్నడలో మడమక్కి, కిస్మత్ చిత్రల్లో నటిస్తున్నానని, 2018లో ఎన్నికల్లో విజయం సాధిస్తే ప్రజాసేవకే అంకితమవుతానని తెలిపారు. తెలుగులో హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన తనయుడు ఆదిని తెలుగులో అపూర్వవిజయం సాధించిన కార్తికేయ రీమేక్ చిత్రంతో కన్నడ సిని రంగానికి పరిచయం చేస్తున్నట్లు సాయికుమార్ తెలిపారు. -
‘చుట్టాలబ్బాయి’ ఆడియో రిలీజ్
-
ఆదితో కలసి నటించడం కిక్ ఇచ్చింది
- సాయికుమార్ ‘‘ఇప్పటి తరంలో ప్రతిభ చాలా ఉంది. కానీ, వారికి ప్రోత్సాహం లభించడం లేదు. కొత్త తరాన్ని ప్రోత్సహించాల్సిన బాధ్యత దర్శక-నిర్మాతలపై ఉంది. పీజే శర్మ కుటుంబం ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చింది. మంచి హీరోకి కావాల్సిన లక్షణాలన్నీ ఆదిలో ఉన్నాయి’’ అని తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ అన్నారు. ఆది, నమితాప్రమోద్ జంటగా శ్రీ ఐశ్వర్య లక్ష్మి మూవీస్, ఎస్.ఆర్.టి మూవీ హౌస్ పతాకంపై వీరభద్రమ్ దర్శకత్వంలో వెంకట్ తలారి, రామ్ తాళ్లూరి నిర్మిస్తున్న చిత్రం ‘చుట్టాలబ్బాయి’. ఎస్ఎస్ తమన్ స్వరపరచిన ఈ చిత్రం పాటల సీడీని తలసాని విడుదల చేసి దర్శకుడు కొరటాల శివకు అందించారు. హీరో సుధీర్‌బాబు ట్రైలర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ - ‘‘తెలంగాణ ప్రభుత్వం చిన్న చిత్రాల కోసం ఐదో ఆటకు వెసులుబాటు కల్పిస్తోంది. డెరైక్టర్ కొరటాల శివ పెద్ద హీరోలతో పాటు చిన్న హీరోలను కూడా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ‘చుట్టాలబ్బాయి’ విజయవంతమై చిత్ర బృందానికి మంచి పేరు తీసుకురావాలి’’ అన్నారు. వీరభద్రమ్ మాట్లాడుతూ- ‘‘ఆది, సాయికుమార్‌గారు మొదటిసారి కలిసి నటించిన చిత్రమిది. ఈ చిత్రంతో మా నిర్మాతలకు ‘చుట్టాలబ్బాయి’ అనేది ఇంటి పేరుగా మారిపోతుంది. అంత బాగా నిర్మించారు’’ అన్నారు.‘‘మేం ఈ చిత్రం నిర్మించామంటే కారణం వీరభద్రమ్. తను పని రాక్షసుడు. ఈ సినిమా బాగా తీశాడు’’ అని నిర్మాతలు తెలిపారు. సాయికుమార్ మాట్లాడుతూ- ‘‘నేను, మా అబ్బాయి ఆది కలిసి ఓ చిత్రం చేయాలనుకుంటున్న సమయంలో ఈ చిత్రం కుదిరింది. ఆదితో కలిసి నటించడం నాకు కిక్ ఇచ్చింది. కుటుంబ సమేతంగా చూసేలా వీరభద్రమ్ ఈ చిత్రం తెరకెక్కించారు’’ అని పేర్కొన్నారు. ఈ వేడుకలో ఆది, నమితా ప్రమోద్, ఎస్ఎస్ తమన్, హీరోలు సందీప్ కిషన్, రాజ్ తరుణ్, నిర్మాతలు కేకే రాధామోహన్, మల్కాపురం శివకుమార్, శ్రీమతి జీవితా రాజశేఖర్, దర్శకుడు అనిల్ రావిపూడి, రచయితలు కోన వెంకట్, బీవీఎస్ రవి, పాటల రచయిత రామజోగయ్యశాస్త్రి తదితరులు పాల్గొన్నారు. -
కన్నడ కార్తికేయలో ఆది?
డైలాగ్ కింగ్ సాయికుమార్ వారసుడిగా టాలీవుడ్‌కు పరిచయం అయిన యంగ్ హీరో ఆది. తొలి సినిమాలతో మంచి క్రేజ్ సొంతం చేసుకున్న ఆది.. తరువాత మాస్ యాక్షన్ సినిమాల మీద దృష్టి పెట్టి ఇబ్బందుల్లో పడ్డాడు. ప్రస్తుతం వీరభద్రం దర్శకత్వంలో చుట్టాలబ్బాయి సినిమాలో నటిస్తున్నాడు. త్వరలో రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ సినిమా పై చాలా ఆశలు పెట్టుకున్నాడు ఆది. అదే సమయంలో కన్నడ ఇండస్ట్రీలో హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. సాయికుమార్‌కు టాలీవుడ్‌తో పాటు శాండల్‌వుడ్‌లో కూడా స్టార్ ఇమేజ్ ఉంది. సాయికుమార్ హీరోగా తెరకెక్కిన కన్నడ చిత్రాలు మంచి సక్సెస్‌లు సాధించాయి. దీంతో ఆదిని కూడా కన్నడలో హీరోగా పరిచయం చేసే ఆలోచనలో ఉన్నాడు సాయికుమార్. నిఖిల్ హీరోగా టాలీవుడ్లో మంచి సక్సెస్ సాధించిన కార్తీకేయ సినిమాను ఆది హీరోగా కన్నడలో రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నాడట. తెలుగులో చందూ మొండేటి డైరెక్ట్ చేసిన ఈ థ్రిల్లర్ హీరోగా.. నిఖిల్‌కు మంచి బ్రేక్ ఇచ్చింది. ఆది విషయంలో కూడా అదే వర్క్ అవుట్ అవుతుందన్న నమ్మకంతో ఉన్నాడు డైలాగ్ కింగ్. మరి తెలుగు నాట స్టార్ ఇమేజ్ కోసం కష్టపడుతున్న, ఆది శాండల్‌వుడ్ ప్రేక్షకులను ఎంత వరకు ఆకట్టుకుంటాడో చూడాలి. -
అసలేమైంది..
కాకినాడలో విద్యార్థి ఆత్మహత్య కాకినాడ సిటీ : ఆరునెలల సీపీటీ (కామన్ ప్రొఫిసియన్సీ టెస్ట్) కోర్సు చదువుతున్న విద్యార్థి రెడ్డి సాయికుమార్(20) హాస్టల్ రూమ్‌లో ప్యాన్‌కు ఉరి వేసుకుని సోమవారం ఆత్మహత్య చేసుకున్నాడు. టూటౌన్ పోలీసుల కథనం ప్రకారం.. విశాఖపట్నం కొత్త గాజువాకకు చెందిన రెడ్డి సాయికుమార్ ఈ ఏడాది జనవరిలో కాకినాడ భాస్కర్‌నగర్‌లోని ప్రిజమ్ అకాడమీలో సీపీటీ కోచింగ్‌కు చేరాడు. తండ్రి వెంకటరమణ కొత్త గాజువాకలో ఫాస్ట్‌పుడ్ వ్యాపారం చేస్తుంటాడు. గతనెలలో డిగ్రీ పరీక్షలు రాసేందుకు ఇంటికి వెళ్లి పదిరోజులక్రితం తిరిగి కాకినాడ వచ్చాడు. అప్పటి నుంచి అకాడమీ తరగతులకు వెళ్లకుండా రూమ్‌లోనే ముభావంగా ఉంటున్నాడు. సోమవారం ఉదయం హాస్టల్ రూమ్‌లోని తోటి విద్యార్థులు తరగతులకు వెళ్లగా.. సాయికుమార్ రూమ్‌లోనే ఉండిపోయాడు. తిరిగి మధ్యాహ్నం రూమ్‌కు వచ్చిన విద్యార్థులు తలుపులు మూసి ఉండడంతో వెనుక వైపునకు వెళ్లి చూడగా ప్యాన్‌కు వేలాడుతూ సాయికుమార్ కనిపించాడు. తలుపులు బద్దలు కొట్టి స్థానిక ప్రైవేటు హాస్పటల్‌కు తీసుకువెళ్లారు. అయితే అప్పటికే మృతిచెందినట్టు డాక్టర్లు చెప్పడంతో విద్యార్థులు తిరిగి రూమ్‌కు తీసుకువచ్చినట్టు పోలీసులు తెలిపారు. ప్రేమ విఫలమై.. డిగ్రీ పరీక్షలు సరిగా రాయక.. రూమ్‌లో ఉండే ఫ్రెండ్స్‌తో తాను ప్రేమించిన అమ్మాయి ప్రేమను తిరస్కరిస్తోందని, డిగ్రీ పరీక్షలు కూడా సరిగా రాయలేక పోయానని చెప్పినట్టు పోలీసులు తెలిపారు. అయితే సెల్‌ఫోన్ మెసేజ్‌ల ఆధారంగా ప్రేమ విఫలంతో మన స్తాపం చెంది ఆత్మహత్య చేసుకుని ఉంటాడని అనుమానిస్తున్నట్టు పోలీసులు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే సాయికుమార్ బంధువులు మాత్రం అకాడ మీ యాజమాన్యం సరైన సమాధానం చెప్పడం లేదని ఆరోపించారు. ప్రేమ విషయం తమకు తెలియదని, అటువంటి వాటికి ఆత్మహత్య చేసుకునే మనస్తత్వం తమ కుమారుడిది కాదని తండ్రి వెంకటరమణ పేర్కొన్నారు. కాకినాడ టూటౌన్ ఎస్సై వంశీధర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
శ్రీవారి సేవలో సినీనటుడు సాయికుమార్
కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రముఖ సినీ నటుడు సాయికుమార్ దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం వీఐపీ ప్రారంభదర్శన సమయంలో ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు. అనతరం ఆలయ సిబ్బంది ఆయనకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. -
'జనతా గ్యారేజ్'లో సీనియర్ నటుడు
హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న 'జనతా గ్యారేజ్'లో సీనియర్ నటుడు 'డైలాగ్ కింగ్' సాయికుమార్ నటిస్తున్నారు. ఎన్టీఆర్ తండ్రి పాత్రను ఆయన పోషించనున్నారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ సోమవారం ప్రారంభమైంది. సమంత, నిత్యా మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. మలయాళ నటులు మోహన్‌లాల్, ఉన్ని ముకుందన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎన్టీఆర్ కు పెదనాన్నగా మోహన్ లాల్ నటించనున్నారని సమాచారం. ఫ్యామిలీ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కనుందని తెలుస్తోంది. మార్చి 5 నుంచి ఎన్టీఆర్ షూటింగ్ లో పాల్గొంటారని చిత్ర యూనిట్ తెలిపింది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మితమవుతున్న 'జనతా గ్యారేజ్'ను ఆగస్టు 12న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్మాతలు భావిస్తున్నారు. -
క్షణక్షణం
హిమాయత్‌నగర్ టు మొయినాబాద్ డాక్టర్ల ఘటన పూర్వాపరాలు ఇవీ.. సిటీబ్యూరో: డాక్టర్ల త్రయం ఉదయ్ కుమార్, శశికుమార్, సాయికుమార్‌ల వ్యవహారం సోమవారం సాయంత్రం హిమాయత్ నగర్లో ఉదయ్ కుమార్‌పై హత్యా యత్నంతో ప్రారంభమైంది. అర్ధరాత్రి దాటిన తర్వాత మొయినాబాద్‌లోని నిష్ ఫామ్‌హౌస్‌లో శశికుమార్ ఆత్మహత్యతో ఆగింది. ఈ మధ్య కాలంలో ఏ క్షణం ఏం జరిగిందనేది పోలీసుల కథనం ప్రకారం... సోమవారం మధ్యాహ్నం 3.30 గంటలు మినర్వా కాఫీ షాప్ దగ్గర ఉదయ్, శశి, సాయి కలుసుకున్నారు. అక్కడ శశి దోశ తినగా... మిగిలిన ఇద్దరూ కాఫీ తాగారు. ► 4.30: ఈ ముగ్గురి మధ్యా వాగ్వాదం చోటు చేసుకోవడంతో కాఫీ షాప్ నుంచి బయటకు వచ్చి కారులో స్ట్రీట్ నెం.6లోకి వెళ్లారు. ►4.40: ఆవేశానికి లోనైన శశికుమార్ తన .32 లెసైన్స్డ్ రివాల్వర్‌తో ఉదయ్‌పై కాల్పులు జరిపాడు. ►5.15: చికిత్స కోసం ఉదయ్ కుమార్ తనంతట తానుగా హైదర్‌గూడలోని అపోలో ఆస్పత్రికి వెళ్లారు. పోలీసులకు సమాచారం అందింది. ►6.15: శశికుమార్ సోమాజిగూడలోని స్నేహితురాలు చంద్రకళ ఇంటికి వెళ్లారు. ►6.30: సోమాజిగూడ నుంచి చంద్రకళ, శశికుమార్‌లు మొయినాబాద్‌లోని ఫామ్‌హౌస్‌కు బయలుదేరారు. ► రాత్రి 7.45: దారిలో షాపింగ్ చేసుకుంటూ వీరిద్దరూ నక్కలపల్లిలో ఉన్న నిష్ గెస్ట్‌హౌస్‌కు చేరుకున్నారు. ►8.00: శశికుమార్‌ను అక్కడే వదిలిన చంద్రకళ తన కారులో ఇంటికి తిరుగు ప్రయాణమయ్యారు. ► 9.30: ఇంటికి చేరుకున్న చంద్రకళ రెండుసార్లు వాచ్మెన్ నెంబర్‌కు ఫోన్ చేసి శశికుమార్‌తో మాట్లాడారు. ►9.45: ఉదయ్ కుమార్‌పై కాల్పులు, శశికుమార్ వాంటెడ్ వివరాలను టీవీల్లో చూసిన చంద్రకళ షాక్‌కు గురయ్యారు. ►10.15: తనకు పరిచయస్తుడైన ఓ ఆర్మీ అధికారి సాయంతో పంజగుట్ట పోలీసు స్టేషన్‌కు వెళ్లి విషయం చెప్పారు. ►11.10: పంజగుట్ట పోలీసు స్టేషన్‌కు వచ్చిన నారాయణగూడ పోలీసులు చంద్రకళతో కలిసి ఫామ్‌హౌస్‌కు బయలుదేరారు. ►12.50: నిష్ ఫామ్‌హౌస్‌కు చేరుకున్న పోలీసు బృందం శశికుమార్ ఆత్మహత్య చేసుకున్న విషయం గుర్తించింది. ►మంగళవారం ఉదయం 10.30శశికుమార్ మృతదేహాన్ని మొయినాబాద్ పోలీసులు ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ►మధ్యాహ్నం 1.30: పోస్టుమార్టం పరీక్షలు పూర్తి చేసిన ఫోరెన్సిక్ వైద్యులు శశికుమార్ మృతదేహాన్ని ఆయన సోదరుడికి అప్పగించారు. -
కావాలనే నాపై ఆరోపణలు: డా.సాయికుమార్
హైదరాబాద్ : సంచలనం రేపిన వైద్యుల కాల్పుల ఘటనలో డాక్టర్ శశికుమార్ కావాలనే తనపై ఆరోపణలు చేశారని ప్రత్యక్ష సాక్షి డాక్టర్ సాయికుమార్ అన్నారు. శశికుమార్ సూసైడ్ నోట్లో తనపై ఆరోపణలు చేశారని, నిజానిజాలు విచారణలో వెల్లడి అవుతాయన్నారు. ఆయన మంగళవారమిక్కడ మాట్లాడుతూ ఉదయ్ కుమార్‌పై కాల్పులు జరిపింది శశికుమారే అని తెలిపారు. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగోలేదని, వారం క్రితం గుండెపోటు వచ్చినట్లు సాయికుమార్ పేర్కొన్నారు. కాగా ఈ కేసుకు సంబంధించి సాయికుమార్‌ను సుమారు ఏడు గంటల పాటు పోలీసులు విచారణ జరిపారు. ఈ మేరకు సాయికుమార్ స్టేట్మెంట్ను రికార్డు చేశారు. పోలీసుల విచారణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తనపై వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. త్వరలోనే మీడియాకు అన్ని వివరాలు అందిస్తానని ఆయన తెలిపారు. మరోవైపు ఈ కేసుకు సంబంధించి సెంట్రల్ జోన్ డీసీపీ కమలాసన్ రెడ్డి మాట్లాడుతూ ఐ విట్నెస్ సాయికుమార్ స్టేట్మెంట్ రికార్డు చేసినట్లు తెలిపారు. కాల్పుల ఘటనలో గాయపడ్డ డాక్టర్ ఉదయ్ ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు. కాగా హైదరాబాద్‌లోని కొండాపూర్‌కు చెందిన డాక్టర్ ఉదయ్‌కుమార్, చైతన్యపురి వాసి డాక్టర్ శశికుమార్, మాదాపూర్‌కు చెందిన డాక్టర్ సాయికుమార్ ముగ్గురూ స్నేహితులు. వీరు ఇటీవల దాదాపు రూ.15 కోట్లతో మాదాపూర్‌లో లారెల్ హాస్పిటల్స్ ప్రారంభించారు. సర్జన్‌గా తాను ఉన్నా కూడా వేరే సర్జన్‌ను పిలిపించి ఆపరేషన్లు చేయిస్తుండటంతో ఆగ్రహానికి గురైన శశికుమార్.. పెట్టుబడిలో తనవాటా రూ.75 లక్షలు తిరిగి ఇచ్చేయాలని కోరాడు. ఈ చర్చలలో వివాదం రేగడంతో.. తర్వాత తిరిగి కారులో వెళ్తుండగా డాక్టర్ ఉదయ్‌పై డాక్టర్ శశికుమార్ కాల్పులు జరిపారు. ఈ విషయం మీడియా ద్వారా మొత్తం ప్రపంచానికి తెలియడంతో.. శశికుమార్ కూడా తన రివాల్వర్‌తో కాల్చుకుని ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. -
కాల్పుల కేసులో చంద్రకళ స్టేట్మెంట్
హైదరాబాద్ : హిమాయత్ నగర్ కాల్పుల కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ కేసులో ఆత్మహత్యకు పాల్పడిన డాక్టర్ శశికుమార్ స్నేహితురాలు చంద్రకళ స్టేట్మెంట్ను మంగళవారం నారాయణగూడ పోలీసులు రికార్డు చేశారు. చంద్రకళ ఏం చెప్పారంటే ' సోమవారం సాయంత్రం కాల్పులు జరిపిన తర్వాత శశికుమార్ నేరుగా నా నివాసానికి వచ్చాడు. తీవ్ర ఒత్తిడిలో ఉన్నానని..ఫాంహౌస్‌కు తీసుకెళ్లాలని కోరాడు. నేను నా కారులో శశికుమార్‌ని ఫాంహౌస్‌కు తీసుకెళ్లాను. ఫాంహౌస్‌లో శశికుమార్‌ను విడిచిపెట్టి జాగ్రత్తగా చూసుకోమని వాచ్మెన్ శంకరయ్యకు చెప్పాను. నేను తిరిగి ఇంటికి వచ్చాక రాత్రి 10 గంటల పమయంలో వాచ్మెన్ ఫోన్ చేశాడు. ఆ ఫోన్లోనే నేను శశికుమార్‌తో 10 నిమిషాలు మాట్లాడాను. తాను ఆత్మహత్య చేసుకుంటాన్నానని చెప్పి ఫోన్ కట్ చేశాడు. నేను వెంటనే పంజాగుట్ట పోలీసులకు సమాచారం ఇచ్చాను. పోలీసులతో కలసి ఫాంహౌస్‌కు వెళ్లాను. అప్పటికే శశికుమార్ చనిపోయాడు'. వ్యాపార లావాదేవిలలో తగాదాల కారణంగా సోమవారం సాయంత్రం డాక్టర్ ఉదయ్ కుమార్‌పై మరో డాక్టర్ శశికుమార్ కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. -
సాయికుమార్, ఆది వల్లే ఆ షాక్ నుంచి తేరుకున్నా!
‘ఆ నలుగురు’ సినిమా ఒక్కటి చాలు... రచయితగా మదన్ టాలెంట్ గురించి చెప్పడానికి. ‘పెళ్లైన కొత్తలో’ చిత్రంతో దర్శకునిగా కూడా భేష్ అనిపించుకున్నారాయన. ఆది, అదా శర్మ జంటగా ఆయన డెరైక్ట్ చేసిన ‘గరం’ ఈ 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా మదన్‌తో జరిపిన భేటీ... * మీ ఇమేజ్ దృష్ట్యా ‘గరం’ టైటిల్‌తో మీ నుంచి సినిమా ఎక్స్పెక్ట్ చేయలేదు? (నవ్వుతూ) యాక్చువల్‌గా నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు. శ్రీనివాస్ గవిరెడ్డి ఈ లైన్ చెప్పినప్పుడు నాకు చాలా నచ్చింది. గరం అంటే కోపానికి పర్యాయ పదం అనుకుంటారు. ఇందులో రొమాన్స్ ఉంది. ఆ ఫీల్‌ని కూడా గరం అనొచ్చు. ఫ్యామిలీ ఎమోషన్స్‌ను కూడా అలా అనొచ్చు. ఈ సినిమాలో ప్రేమ, రొమాన్స్, యాక్షన్, ఫ్యామిలీ ఎమోషన్స్ అన్నీ ఉన్నాయి. * ఈ సినిమా మధ్యలో ఆగడం, ఆ తర్వాత సాయికుమార్ టేకప్ చేయడం.. ఈ ప్రాసెస్ గురించి చెబుతారా? 2014లో ఓ షెడ్యూల్ చేశాం. ఆ తర్వాత జరిగిన యాక్సిడెంట్ వల్ల సినిమా ఆగింది. ఒక మంచి కథతో తీస్తున్న సినిమా ఆగడం నచ్చక హీరో ఆది తన తండ్రి సాయికుమార్ని ఒప్పించి, ఈ చిత్రాన్ని నిర్మించేలా చేశాడు. సాయికుమార్ ప్రాజెక్ట్‌ని టేకప్ చేశాక కేక్ వాక్‌లా అయ్యింది. నిర్మాతలు సురేఖ, వసంతా శ్రీనివాస్‌ల సహకారం మర్చిపోలేనిది. ఏది అడిగినా కాదన కుండా సమకూర్చి, సినిమా బాగా రావడానికి కారణమయ్యారు. మళ్లీ నా కెరీర్లో సాయికుమార్ అంతటి బెస్ట్ ప్రొడ్యూసర్ దొరుకుతారో లేదో? * ఇంతకూ ఆ యాక్సిడెంట్ గురించి చెప్పలేదు? ‘గరం’ ప్రాజెక్ట్ సెట్ అవ్వడానికి కారణం నా మిత్రుడు నాగిరెడ్డి. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత, నా రైట్ హ్యాండ్లాంటివాడు. ఈ చిత్రానికి సంబంధించిన పనుల మీద వెళుతూ జరిగిన యాక్సిడెంట్లో చనిపోయాడు. నేను చాన్నాళ్లు ఆ షాక్‌లోనే ఉండిపోయాను. సాయికుమార్, ఆది, నా కుటుంబ సభ్యులు, మిత్రుల వల్లే ఆ షాక్ నుంచి బయటపడగలిగాను. ఆది నమ్మకమే స్ఫూర్తిగా... ఈ సినిమా కోసం ఇటలీలోని గోర్మిటి అనే ఎత్తై ప్రదేశంలో ఒక సీన్ తీశాం. ఎముకలు కొరికే చలి. ఒంటి మీద పల్చని షర్ట్, ఫ్యాంట్‌తో ఆది ఆ సీన్ చేయాలి. మేమంతా కింద ఉన్నాం. తను పైకి ఎక్కాడు. ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకూ అక్కడే నిలబడ్డాడు. వాతావరణం అనుకూలించక ఆ రోజు షాట్ తీయలేదు. మర్నాడు మేం ఎక్కడ ఆ షాట్ వద్దంటామేమోనని ముందే కొండ ఎక్కేశాడు. అంత డెడికేషన్. ఈ చిత్రంపై ఆది పట్టుదల, నమ్మకం నాకు చాలా స్ఫూర్తిగా నిలిచాయి. కచ్చితంగా మా అందరికీ మంచి ఫలితం దక్కుతుందనే నమ్మకం ఉంది. * మంచి కంటెంట్‌తో సినిమాలు తీసే దర్శకుడు మీరు. మరి.. ఆదిలాంటి కమర్షియల్ హీరోకి కావాల్సిన ఎలిమెంట్స్ ఈ కథలో ఉన్నాయా? ‘పెళ్లైన కొత్త’లోని తీసుకుంటే.. వైవాహిక అనుబంధాన్ని కమర్షియల్‌గానే డీల్ చేశాను. బేసిక్‌గా నేను సోల్ లేకుండా సినిమా చేయడానికి ఇష్టపడను. ‘గరం’ ప్రేమ నేపథ్యంలో సాగే చిత్రం. వరాలు పాత్రను ఆది నరనరాన జీర్ణించు కుని చేశాడు. ఇప్పటివరకు చేసిన చిత్రాల ద్వారా ఆది బాగా డ్యాన్సులు, ఫైట్లు చేయగలడని ప్రూవ్ చేసుకున్నాడు. నటనాపరంగా కూడా మంచి మార్కులే తెచ్చుకున్నాడు. ఈ సినిమా నటుడిగా తనకు ఇంకా మంచి పేరు తెచ్చిపెట్టే విధంగా ఉంటుంది. డైలాగ్ డెలివరీకి ప్రత్యేకంగా ప్రశంసలు లభిస్తాయి. ఆది హార్డ్ వర్క్, నమ్మకమే ఈ సినిమా. * సినిమా సినిమాకీ గ్యాప్ తీసుకుంటున్నారు.. కారణం ఏంటి? ఒకానొక దశలో సినిమా పరిశ్రమ నుంచి వెళ్లిపోదామనుకున్నాను. దానికో కారణం ‘ప్రవరాఖ్యుడు’ ఆశించిన ఫలితం ఇవ్వకపోవడం. ఆ సినిమా విడుదలైన రెండో రోజుకే రాజకీయాలపరంగా ఏర్పడిన పరిస్థితుల కారణంగా థియేటర్లు మూతపడ్డాయి. అప్పటికి ఆంధ్రా సైడ్ మంచి టాక్ వచ్చింది. ఆ తర్వాత అక్కడా థియేటర్లు మూతపడ్డాయి. ఒక మంచి సినిమా అలా ఇగ్నోర్ అయిపోయినందుకు బాధపడ్డా. సినిమాలు ఎందుకులే? అనుకోవడానికి అదో కారణం. ఆ తర్వాత చేసిన రెండు వ్యాపారాలు వర్కవుట్ కాలేదు. దాంతో సినిమా పరిశ్రమే కరెక్ట్ అనిపించింది. * మీ ప్రతిభకు తగ్గ గుర్తింపు లభించలేదనే బాధ ఏదైనా ఉందా? మొదట్లో ఉండేది. ఆ తర్వాత అలా ఆశించడం సరికాదని తెలుసుకున్నా. గుర్తింపు రావడం అంటే ఏంటి? నలుగురూ అభినందించడమే కదా. ఇప్పుడు నేనో మంచి సినిమా చూశాననుకోండి.. ‘బాగుంది’ అనుకుంటాను తప్ప స్వయంగా ఫోన్ చేసి చెప్పను. అంటే.. ఆ సినిమా తీసినవాళ్లకు గుర్తింపు లేనట్లా? అలాగే నాకు స్వయంగా ఫోన్ చేయకపోయినా మనసులో అభినందించి ఉండొచ్చు. అసలెవరూ గుర్తించకపోతే అప్పుడు మన ఎఫర్ట్‌లో లోపం ఉన్నట్లు లెక్క. * మీ తదుపరి చిత్రాలు? ‘గరం’ మీద ఆధారపడి ఉంటుంది. ఆ సినిమాకి వచ్చే మార్కెట్‌ని బట్టి నాకు ఫోన్ కాల్స్ వస్తాయి (నవ్వుతూ). -
బ్యాంకు మేనేజర్ వేధిస్తున్నాడని..
కోదాడరూరల్: బ్యాంకు మేనేజర్ వేధిస్తున్నాడని ఓ బిజినెస్ కరస్పాండెంట్ ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన కోదాడ మండల పరిధి అనంతగిరి చౌరస్తాలో శుక్రవారం చోటుచేసుకుంది. బాధితుడు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని ఖానాపురం గ్రామానికి చెందిన సముద్రాల సాయికుమార్ అనంతగిరి ఎస్బీహెచ్ బ్యాంకు పరిధిలో బిజినెస్ కరస్పాండెంట్ ఏజెంట్‌గా (బీసీఏ) ఉంటూ తన ఏరియాలో జీరో అకౌంట్లో తీసుకున్నాడు. ఇతడికి జీరో అకౌంట్లు తీసేందుకు ఎస్బీహెచ్ బ్యాంకు వారే ఎక్యుప్మెంట్స్ ఇచ్చారు. గత మే నెలలో 92 మంది ఖాతాలు తీసేందుకు సంబంధిత డాక్యుమెంట్స్‌ను బ్యాంకులో ఇచ్చి అప్లోడ్ చేయమన్నాడు. ఈ సమయంలో బ్యాంకు మేనేజర్ బదిలీపై వెళ్లాడు. అప్పటి నుంచి సాయికుమార్ ఖాతాల కోసం బ్యాంకు చుట్టూ తిరుగుతున్నాడు. ఇటీవల కాలంలో ఖాతా కోసం దరఖాస్తు చేసుకున్న కస్టమర్లు సాయికుమార్‌ను బ్యాంక్ పాస్‌పుస్తకాలు ఇవ్వాలని ఒత్తిడి పెంచారు. అతను కొద్ది రోజుల క్రి తం బ్యాంకుకు వెళ్లి తాను తెచ్చిన జీరో అకౌంట్ తె రవాలని ప్రాథేయపడ్డాడు. కొత్తగా వచ్చిన మేనేజర్ బ్యాంకు అకౌంట్లు తెరవకుండా తిరిగి దరఖాస్తు చేసుకోవాలని తెలిపాడు. ఈ విషయంపై ఈ నెల 1న సాయికుమార్ సూర్యాపేటలోని ఎజీఎంకు ఫిర్యాదు చేశాడు. అక్కడ ఆయన 3న బ్యాంకుకు వెళ్లి అకౌంట్లు తీసుకోవాలని సూచించాడు. బ్యాంకుకు వెళితే మేనేజర్ నా మీద ఎంజీఎంకు ఫిర్యాదు చేస్తావానీపై ఎస్టీ కేసు పెడతానని సాయికుమార్‌ను వేధించాడు. దీంతో మనస్తాపానికి గురైన సాయికుమార్ అనంతగిరి చౌరస్తాలో పురుగు మందు తాగా డు. బ్యాంక్‌కు వెళ్తుండగా మార్గ మధ్యలో ఆటో డ్రైవ ర్లు గమనించి అతడిని కోదాడలోని ఓ ఆస్పత్రికి తరలించి కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. ప్ర స్తుతం అతని పరిస్థితి విషమంగా ఉందని రెండురోజులు గడిస్తేగాని ఎం చెప్పలేమని వైద్యుడు తెలిపారని కుటుంబసభ్యులు తెలిపారు. ఈ సంఘటనపై వేధింపులకు గురి చేసిన బ్యాంకు మేనేజర్, అకౌంటెంట్‌పై చర్యలు తీసుకోవాలని బాధితుడి భార్య వినీత కోదాడ రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. -
సంక్రాంతి మూడ్‌లో ఎయిర్ పోర్ట్
సంక్రాంతి పండక్కి రెల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లే కాదు ఎయిర్ పోర్ట్‌లు కూడా కిక్కిరిసి కనిపిస్తున్నాయి. దీంతో సెలబ్రిటీలకు కూడా క్యూలో నిలబడటం తప్పేలా లేదు. ఈ రోజు( మంగళవారం) శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో పరిస్థితి ఎలా ఉందో తన ట్విట్టర్లో పోస్ట్ చేశాడు హీరో ఆది. భారీ క్యూ లైన్ల ముందు నిలబడి సెల్పీ దిగి ట్వీట్ చేశాడు. ఎయిర్ పోర్ట్‌లో కూడా సంక్రాంతి మూడ్ అంటూ సరదాగా కామెంట్ చేశాడు. ఈ మధ్యే తండ్రిగా ప్రమోషన్ పొందిన ఆది ప్రస్తుతం తన తాజా చిత్రం 'గరం' రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఇప్పటి వరకు సాఫ్ట్ చిత్రాలకు మాత్రమే దర్శకత్వం వహించిన మదన్ ఈ సినిమాతో తొలిసారిగా మాస్ ఫార్ములాను ట్రై చేస్తున్నాడు. అంతేకాదు ఈ ఏడాది తండ్రి సాయి కుమార్ తో కలిసి నటించడానికి ప్లాన్ చేసుకుంటున్నాడు ఈ యంగ్ హీరో. Happy holidays airport all in sankranti mood :) pic.twitter.com/caeqne97Lx — Actor Aadi (@Aadi_Offl) January 12, 2016 -
శ్రీవారిని దర్శించుకున్న సినీ ప్రముఖులు
తిరుమల: తిరుమల శ్రీవారిని ఆదివారం పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శనంలో ప్రముఖ నటుడు సాయికుమార్, ప్రముఖ సినీ గాయకులు మనో, సునీత, వందేమాతం శ్రీనివాస్ తదితరులు శ్రీవారి సేవలో పాల్గొన్నారు. అనంతరం వారికి టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. -
ఈ గరం... అందరికీ ప్రియం!
‘‘మదన్ మంచి టేస్ట్‌ఫుల్ డెరైక్టర్. సాయికుమార్ గారు నిర్మాతగానూ, ఆది హీరోగానూ ఈ సినిమాతో బిగ్ కమర్షియల్ సక్సెస్ సాధించాలి’’ అని హీరో గోపీచంద్ ఆకాంక్షించారు. ఆది, అదాశర్మ జంటగా మదన్ దర్శకత్వంలో వసంతా శ్రీనివాస్ సమర్పణలో శ్రీనివాసాయి స్క్రీన్స్ బ్యానర్‌పై పి. సురేఖ నిర్మించిన చిత్రం ‘గరం’. అగస్త్య స్వరాలందించిన ఈ సినిమా పాటల సీడీని బుధవారం రాత్రి హైదరాబాద్‌లో గోపీచంద్ ఆవిష్కరించి, హీరోయిన్ రకుల్ ప్రీత్‌సింగ్‌కు అందించారు. ఈ సందర్భంగా ఆది మాట్లాడుతూ - ‘‘మదన్‌గారు ఈ చిత్రాన్ని చాలా కమర్షియల్‌గా హ్యాండిల్ చేశారు. నరేశ్‌గారి పాత్ర హైలైట్. అగస్త్య ఇచ్చిన ట్యూన్లు, రీరికార్డింగ్ బ్యూటిఫుల్’’ అని చెప్పారు. హీరో రాజ్ తరుణ్ మాట్లాడుతూ - ‘‘ఆది డ్యాన్స్‌లు చితగ్గొట్టేశాడు. ఈ సంస్థలో నేను కూడా సినిమా చేయాలనుకుంటున్నా’’ అని తెలిపారు. ఆది లాంటి హార్డ్ వర్కింగ్ హీరోని ఇంతవరకూ చూడలేదని హీరో నిఖిల్ పేర్కొన్నారు. సాయి కుమార్ ఈ సినిమాతో గొప్ప నిర్మాత అవుతారని సీనియర్ నరేశ్ అన్నారు. ఆది రియల్‌గా ఎనర్జిటిక్ హీరో అని ఫైట్ మాస్టర్ థ్రిల్లర్ మంజు చెప్పారు. ‘గరం’ అందరికీ ప్రియం అని సాయికుమార్ నమ్మకం వ్యక్తపరిచారు. ఈ వేడుకలో రానా, అభిరామ్ దగ్గుబాటి, సందీప్ కిషన్, అచ్చిరెడ్డి, రాధామోహన్, కేవీవీ సత్యనారాయణ, సుశాంత్, రఘు కారుమంచి, భాస్కరభట్ల, షకలక శంకర్, సత్యప్రకాశ్, బీఏ రాజు, వీరభద్రమ్, బాబ్జీ, ‘గరం’ టీమ్ నుంచి దర్శకుడు మదన్, కెమేరామన్ సురేందర్‌రెడ్డి, ఇతర సభ్యులు మాట్లాడారు. -
చుట్టాలబ్బాయి పుట్టినరోజు
యంగ్ హీరో ఆది తన పుట్టిన రోజును మరింత ఆనందంగా జరుపుకుంటున్నాడు. తన లేటెస్ట్ సినిమా ఆడియో రిలీజ్‌తో పాటు మరో రెండు విశేషాలు ఈ రోజు(బుధవారం) పుట్టిన రోజుకు ఉన్నాయి. గత ఏడాది రాజమండ్రి అమ్మాయి అరుణను పెళ్లి చేసుకున్న ఆది, గత వారం తండ్రిగా ప్రొమోషన్ పొందాడు. అంతేకాదు ఆది తండ్రి ప్రముఖ నటుడు సాయికుమార్ లీడ్ రోల్లో తెరకెక్కిన కన్నడ సినిమా 'రంగితరంగ' ఈ ఏడాది ఆస్కార్ రేసులో నిలవటంతో ట్రిపుల్ హ్యాపీగా తన పుట్టిన రోజు వేడుకలను జరుపుకుంటున్నాడు. ఆది పుట్టిన రోజు సందర్భంగా 'గరం' చిత్ర ఆడియో ఇవాళ సాయంత్రం గ్రాండ్‌గా రిలీజ్ అవుతోంది. దీంతో పాటు ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న మరో సినిమా 'చుట్టాలబ్బాయి' ఫస్ట్ లుక్‌ను కూడా రిలీజ్ చేసి, ఆది అభిమానులకు గిఫ్ట్ ఇచ్చారు చిత్రయూనిట్. ఇలా యమా హ్యాపీగా ఉన్న ఆది జీవితంలోకి మంచి సక్సెస్ కూడా రావాలని శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు శ్రేయోభిలాషులు. -
ఆస్కార్‌కు సాయికుమార్ సినిమా
అంతర్జాతీయ సినీ అభిమానులు ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డుల పోటీకి మన తెలుగు నటుడి సినిమా ఎంపికైంది. అయితే ఈ ఘనత సాధించింది తెలుగు సినిమా మాత్రం కాదు. దక్షిణాదిలో ప్రముఖ నటుడిగా ఉన్న సాయికుమార్ ప్రధాన పాత్రలో నటించిన కన్నడ సినిమా 'రంగితరంగ' ఆస్కార్ ఫైనల్స్‌కు ఎంపిక అయ్యింది. ఇటీవలే తాత అయిన సాయికుమార్ ఈ వార్తతో మరింత ఆనందంగా ఉన్నారు. కొత్త దర్శకుడు అనూప్ భండారీ దర్శకత్వంలో తెరకెక్కిన 'రంగితరంగ' కమర్షియల్ సక్సెస్ సాధించటంతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. ఇప్పటికే ఆస్కార్ అవార్డ్స్ ఫైనల్స్‌కు చేరిన ఈ సినిమా వచ్చే నెల జరగనున్న 88వ అకాడమీ అవార్డ్స్ ఫంక్షన్లో అవార్డు సాధించటం ఖాయమన్న నమ్మకంతో ఉన్నారు చిత్రయూనిట్. హీరోగా మంచి విజయాలు సాధించిన సాయికుమార్ ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా కొనసాగుతున్నారు. -
యంగ్ హీరో ఆదికి తండ్రిగా ప్రమోషన్
త్వరలో గరం సినిమాతో ఆడియన్స్ ముందుకు రావడానికి రెడీ అవుతున్న యంగ్ హీరో ఆది.. సినిమా రిలీజ్ కు ముందే మరో శుభవార్త చెప్పాడు. గురువారం మధ్యాహ్నం ఆది భార్య అరుణ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. రాజమండ్రిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆది దంపతులకు ఆడబిడ్డ పుట్టింది. తల్లి, బిడ్డ ఇద్దరు ఆరోగ్యంగా ఉన్నట్టు కుటుంబసభ్యులు తెలిపారు. కొడుకును హీరోగా నిలబెట్టడం కోసం సాయికుమార్ తొలిసారి నిర్మాతగా మారి తెరకెక్కించిన సినిమా గరం త్వరలో రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇప్పటివరకు లవర్ బోయ్ ఇమేజ్ సొంతం చేసుకున్న ఆది ఈ సినిమాతో మాస్ హీరోగా మారాలని ట్రై చేస్తున్నాడు. మదన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అదాశర్మ హీరోయిన్ గా నటించింది. అగస్త్య సంగీతం అందించారు. -
బాలికపై అత్యాచారం.. యువకుడి అరెస్ట్
బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడిన యువకుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన సంఘటన మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిదిలో జరిగింది. సీఐ శేఖర్‌గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.....మౌలాలి గాయత్రీనగర్‌కు చెందిన కేశవ సాయికుమార్(21) రామంతాపూర్ పాలిటెక్నిక్ కాలేజీలో రెండో సంవత్సరం చదువుతున్నాడు. మౌలాలి కమాన్ ప్రాంతంలో నివాసం ఉండే ఓ బాలిక(17) అదే కాలేజీలో మొదటి సంవత్సరం చదువుతోంది. ఈ క్రమంలో ఇద్దరికీ పరిచయం ఏర్పడింది. కాగా గత నెల 24వ తేదీన కేశవ సాయికుమార్ బాలికను మాయమాటలు చెప్పి పశ్చిమగోదావరి జిల్లా భీమవరంకు తీసుకెళ్లాడు. అక్కడ ఆమెపై అత్యాచారం చేశాడు. అక్కడినుండి తప్పించుకున్న బాలిక ఈ నెల 4వ తేదీన మౌలాలిలోని తన ఇంటికి చేరుకుంది. జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపింది. దీంతో వారు మల్కాజిగిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు... అప్పటి నుంచి పరారీలో ఉన్న కేశవ సాయికుమార్‌ను గురువారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. -
సీనియర్ యాక్టర్ కొత్త క్యారెక్టర్
నటుడిగా ఎన్నో విభిన్న పాత్రలు పోషించిన నటుడు సాయికుమార్. డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, హీరోగా, విలన్‌గా అలరించిన సాయి కుమార్, ఇప్పుడు తన కుమారుడి కోసం కొత్త అవతారం ఎత్తాడు. హీరోగా ప్రూవ్ చేసుకోవడానికి కష్టపడుతున్న తనయుడు ఆదిని ప్రమోట్ చేయటం కోసం నిర్మాతగా మారాడు ఈ సీనియర్ నటుడు. ప్రస్తుతం ఆది హీరోగా 'గరం' సినిమాను నిర్మిస్తున్నాడు సాయికుమార్. ఈ సినిమాకు నిర్మాతగా సాయికుమార్ భార్య సురేఖ వ్యవహరిస్తున్నారు. ఆదికి జంటగా ఆదాశర్మ నటిస్తున్న ఈ సినిమాను పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్నారు. ఇంట్రస్టింగ్ పాయింట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా, ఆది కెరీర్‌కు మంచి బ్రేక్ ఇస్తుందని నమ్ముతున్నాడు సాయికుమార్. రొటీన్ కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్, యాక్షన్, రొమాన్స్ లాంటి అన్ని రకాల ఎలిమెంట్స్ ఈ సినిమాలో పర్ఫెక్ట్ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అంతేకాదు సినిమా రిలీజ్ విషయంలో కూడా బడా డిస్ట్రిబ్యూటర్స్ సాయం తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నాడు. మరి నటుడిగా మంచి విజయాలు సాధించిన సాయికుమార్, నిర్మాతగా ఎంత వరకు సక్సెస్ అవుతాడో చూడాలి. -
‘శంకుస్థాపన’కు సాయికుమార్ యాంకరింగ్
సాక్షి, విజయవాడ బ్యూరో: రాష్ట్ర రాజధాని అమరావతి శంకుస్థాపన సభా నిర్వహణను(యాంకరింగ్) సినీ నటుడు సాయికుమార్‌కు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. శంకుస్థాపన ఏర్పాట్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం నిర్వహించిన సమీక్షలో దీనిపై చర్చించారు. సభ ప్రారంభానికి ముందు ప్రఖ్యాత కళాకారుడు శివమణి వాద్య ప్రదర్శన, కూచిభొట్ల ఆనంద్ నేతృత్వంలో మన అమరావతి, రైతుకు వందనం జానపద, కూచిపూడి నృత్యరూపకాలను ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.