కార్తీక్ రత్నం, నవీన్ చంద్ర, సాయి కుమార్, కృష్ణ ప్రియ, సుహాస్, పవిత్రా లోకేష్ ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘అర్ధ శతాబ్దం’. రవీంద్ర పుల్లే దర్శకత్వం వహించారు. చిట్టి కిరణ్ రామోజు, తేలు రాధాకృష్ణ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 26 నుంచి ‘ఆహా’లో స్ట్రీమ్ కానుంది. రవీంద్ర పుల్లే మాట్లాడుతూ– జాతి, మత, వర్ణ వివక్షకు వ్యతిరేకంగా ఈ చిత్రం ఉంటుంది. ప్రేమ కోసం జరిగే పోరాటంతో పాటు రాజకీయాలు, కులాల మధ్య జరిగిన వివాదాల నేపథ్యంలో 2003లో జరిగిన కథే ‘అర్ధ శతాబ్దం’. 1950 నుండి 2003 వరకు ఈ కథ జరుగుతుంది’’ అన్నారు.
‘‘మా ‘అర్ధ శతాబ్దం’’ చిత్రాన్ని ఆదరించి సపోర్ట్‌గా నిలిస్తే మరిన్ని చిత్రాలు నిర్మిస్తాం’’ అన్నారు చిట్టి కిరణ్. రాధాకృష్ణ మాట్లాడుతూ– ‘‘22ఏళ్లుగా నటుడిగా ఉన్నాను. ‘అర్ధ శతాబ్దం’ కథ నచ్చడంతో రవీంద్ర, కిరణ్‌లతో భాగస్వామ్యం అయ్యాను. ‘ఆహా’ ద్వారా ఈ చిత్రాన్ని జనాల్లోకి తీసుకెళితో ఆ తర్వాత మరిన్ని చిత్రాలు నిర్మించవచ్చని భావించి ‘ఆహా’లో విడుదల చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: వెంకట్ ఆర్. శాఖమూరి, అష్కర్, ఇ.జె వేణు, సంగీతం: నోఫెల్ రాజ.
చదవండి: ‘జాతిరత్నాల’మధ్య చిచ్చు... నవీన్, దర్శిలకు రాహుల్ వార్నింగ్
Comments
Please login to add a commentAdd a comment