
తెలుగులో ప్రతి ఏడాది వందల సంఖ్యలో సినిమాలు వస్తూనే ఉంటాయి. కాకపోతే వీటిలో ఓటీటీలోకి మాత్రం కొన్నే వస్తుంటాయి. కొన్ని చిత్రాలు మాత్రం నెలలు లేదా సంవత్సరాల తర్వాత స్ట్రీమింగ్ అవుతుంటాయి. అలా ఓ తెలుగు ఆంథాలజీ మూవీ.. దాదాపు 15 నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చేసింది.
సాయికుమార్, శ్రీనివాసరెడ్డి తదితరులు నటించిన 'మూడో కన్ను' సినిమా గతేడాది జనవరి 26న థియేటర్లలోకి వచ్చింది. కాకపోతే అప్పుడు హనుమాన్ చిత్రం హవా వల్ల ఇలా వచ్చి అలా వెళ్లిపోయింది. దాదాపు ఏడాది మూడు నెలల తర్వాత అమెజాన్ ప్రైమ్ లోకి వచ్చింది. ప్రస్తుతం రెంట్ పద్ధతిలో అందుబాటులో ఉంది.
(ఇదీ చదవండి: ఓటీటీ/ థియేటర్‌లో ఈ వారం 10కి పైగా సినిమాలు విడుదల)
'మూడో కన్ను' విషయానికొస్తే.. తొలి కథలో ఓ అందమైన కుటుంబం ఉంటుంది. వీళ్ల పెంపుడు కుక్క ఓ రోజు చనిపోతుంది. ఏమైంది అనుకునేలోపు హీరో తల్లి మరణిస్తుంది. రెండో కథలో మనిషి తయారు చేసిన కృత్రిమ మాంసం కోసం జరిగిన ఫైట్ ఫార్ములా ఎవరిది? ఎవరు దొంగిలించారనేది స్టోరీ.
మూడో కథలో ఓ నేరస్తుడిని పట్టుకునేందుకు పిల్లాడిని ఉపయోగిస్తారు. ఇంతకీ ఇది ఎవరు చేయించారనేది స్టోరీ. ఈ మూడింటికి సంబంధించిన లింక్, సస్సెన్సే నాలుగో కథ. వీటన్నింటిని అమెరికాలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కించడం విశేషం.
(ఇదీ చదవండి: 'రామ్ చరణ్' రికార్డ్ దాటాలని ప్రాణాలమీదకు తెచ్చుకున్న ఫ్యాన్స్)