ఓటీటీలోకి మరో క్రేజీ సినిమా వచ్చేసింది. కొన్నిరోజుల క్రితం కేవలం తమిళ వెర్షన్.. అమెజాన్ ప్రైమ్‌లోకి రాగా, ఇప్పుడు తెలుగు వెర్షన్ మరో ఓటీటీలో అందుబాటులోకి వచ్చేసింది. కాకపోతే ఇక్కడే చిన్న తిరకాసు కూడా ఉంది. ఇంతకీ ఇదే సినిమా? తెలుగు వెర్షన్ ఎందులో ఉంది?
'జైలర్' దర్శకుడు నెల్సన్ నిర్మించిన లేటెస్ట్ తమిళ సినిమా 'బ్లడీ బెగ్గర్'. కవిన్ హీరోగా నటించిన ఈ డార్క్ కామెడీ మూవీ.. తెలుగులో నవంబర్ 7న థియేటర్లలో రిలీజైంది. పెద్దగా ప్రమోషన్స్ చేయకపోవడంతో అలా వచ్చి ఇలా వెళ్లిపోయింది. తొలుత దీని తమిళ వెర్షన్ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో రిలీజ్ చేశారు. ఇప్పుడు తెలుగు వెర్షన్ సన్ నెక్స్ట్ ఓటీటీలో స్ట్రీమింగ్‌లోకి తీసుకొచ్చారు.
(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 8: రోహిణి ఎలిమినేట్.. ఎన్ని లక్షలు సంపాదించింది?)
ప్రస్తుతానికి మన దగ్గర తప్పితే మిగతా దేశాల్లో సన్ నెక్స్ట్ ఓటీటీలో తెలుగు వెర్షన్ రిలీజ్ చేశారు. మరికొన్ని రోజుల్లో భారత్‌లోనూ 'బ్లడీ బెగ్గర్' మూవీ తెలుగు డబ్బింగ్ స్ట్రీమింగ్ చేసే అవకాశాలున్నాయి.
'బ్లడీ బెగ్గర్' విషయానికొస్తే.. కళ్లు లేని కబోదిని బాబు, నడవలేని అభాగ్యుడిని బాబు అని మాయమాటలు చెప్పి డబ్బులు అడుక్కునే ఓ బిచ్చగాడు (కవిన్). ఓ రోజు దినం భోజనాల కోసమని ఓ పెద్ద బంగ్లాకి వెళ్తాడు. తిరిగి ఇంటికి వెళ్లకుండా దొంగచాటుగా బంగ్లాలోకి దూరుతాడు. కాసేపు బాగానే ఎంజాయ్ చేస్తాడు కానీ ఊహించని విధంగా లోపల ఇరుక్కుపోతాడు. తర్వాత ఏమైంది? బంగ్లా ఓనర్స్ ఇతడిని ఎందుకు చంపాలనుకున్నారు? చివరకు బతికి బయటపడ్డాడా లేదా అనేదే స్టోరీ.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన సూర్య 'కంగువ')
Comments
Please login to add a commentAdd a comment