బిగ్‌బాస్ 8వ సీజన్ చివరకొచ్చేసింది. మరో వారంలో షో ముగిసిపోనున్న దృష్ట్యా.. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ చేశారు. ఇందులో భాగంగా రోహిణిని శనివారం బయటకు పంపేశారు. ఫినాలేలో అడుగుపెట్టనప్పటికీ మంచి గుర్తింపుతో పాటు కళ్లు చెదిరే రెమ్యునరేషన్ కూడా అందుకుంది. ఇంతకీ రోహిణి ఎన్ని వారాలు ఉంది? ఎన్ని లక్షలు సంపాదించింది?
వచ్చేవారమంతా ఫినాలే వీక్ కాబట్టి.. టాప్-5ని మాత్రమే పంపించాలి కాబట్టి ఇప్పుడు రోహిణిని పంపించారు. ఆదివారం ఎపిసోడ్‌లో విష్ణుప్రియని ఎలిమినేట్ చేయబోతున్నారు. కాసేపు విష్ణుప్రియ గురించి పక్కనబెడితే రోహిణి ఈసారి వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చింది. అప్పటివరకు నీరసంగా ఉన్న షోని కాస్త అవినాష్‌తో కలిసి ఎంటర్‌టైన్ చేస్తూ కాస్త రేటింగ్స్ వచ్చేలా చేసింది.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన సూర్య 'కంగువ')
రోహిణిని అయితే పృథ్వీ, విష్ణుప్రియ లాంటి వాళ్లు అసలు నువ్వు కామెడీ చేయడానికి తప్పితే ఎందుకు పనికిరావ్ అని నానా మాటలు అన్నారు. దీంతో తను కేవలం కామెడీకి మాత్రమే కాదని, గేమ్స్ కూడా ఆడగలనని నిరూపించింది. తనని మాటలన్నా పృథ్వీపైనే గెలిచి అదరగొట్టేసింది. అయితే టాప్-5 కోసం కంటెస్టెంట్స్ సెట్ అయిపోయిన దృష్ట్యా రోహిణి తప్పక ఎలిమినేట్ కావాల్సిన పరిస్థితి ఏర్పడింది.
వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చిన రోహిణి.. బిగ్ బాస్ 8వ సీజన్‌లో దాదాపు 9 వారాల పాటు ఉంది. హౌసులోకి వచ్చేముందు వారానికి రూ.2లక్షల చొప్పున ఈమె అగ్రిమెంట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే రూ.18 లక్షల వరకు పారితోషికం సొంతం చేసుకున్నట్లే. గతంలో ఈమె బిగ్‌బాస్‌లో పాల్గొన్న ఈమెకు పెద్దగా ఉపయోగపడలేదు. ఈసారి మాత్రం అటు డబ్బు, ఇటు మరింత గుర్తింపు రోహిణికి దక్కడం విశేషం.
(ఇదీ చదవండి: రోహిణితో పాటు విష్ణుప్రియ అవుట్.. ఆ తప్పిదం వల్లే ఎలిమినేట్!)
Comments
Please login to add a commentAdd a comment