బిగ్‌బాస్ తెలుగు ఎనిమిదో సీజన్ కథ సుఖాంతం కాబోతోంది. వచ్చేవారం గ్రాండ్ ఫినాలే జరగనుంది. గౌతమ్, నిఖిల్ మధ్యే బలమైన పోటీ నెలకొంది. వైల్డ్ కార్డ్‌గా వచ్చిన గౌతమ్ విన్నర్ రేసులో ఉంటే అవినాష్ టికెట్ టు ఫినాలే సాయంతో ఏకంగా అందరికంటే ముందు ఫైనలిస్ట్ అయ్యాడు.
రోహిణి ఎలిమినేట్
అటు నవ్వులు పూయిస్తూ, ఇటు టాస్కులు ఆడుతూ సత్తా చాటిన రోహిణి బలమైన ఫ్యాన్ బేస్ లేక ఈ వారం ఎలిమినేట్ అవక తప్పలేదు. అయితే ఈసారి డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని నాగ్ ఆల్‌రెడీ ప్రోమోలో హింటిచ్చేడు. అంటే రోహిణితో పాటు మరొకరు కూడా హౌస్‌ను వీడారు. ఆ కంటెస్టెంట్ మరెవరో కాదు విష్ణుప్రియ. తప్పయినా, ఒప్పయినా తనకు నచ్చింది చేసుకుంటూ పోయిన ఆమె స్వభావాన్ని జనాలు ఇష్టపడ్డారు.
జరగాల్సిన నష్టం జరిగిపోయింది
కానీ పృథ్వీ పట్టించుకోకున్నా అతడి వెంటపడటమే ప్రేక్షకులకు మింగుడుపడలేదు. లవ్ ట్రాక్‌పై పెట్టిన శ్రద్ధ గేమ్స్‌పై పెట్టలేదు. పృథ్వీ వెళ్లిపోయాకే బలంగా ఆడటం మొదలుపెట్టింది. కానీ చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం? జరగాల్సిన నష్టం అప్పటికే జరిగిపోయింది. ఆ ఫైరేదో ముందు నుంచి ఆటలో చూపించి ఉంటే ఈ సీజన్ విన్నర్ అయ్యేది. స్వయంకృతపరాధం వల్ల ఫైనల్స్‌కు వెళ్లకుండానే ఎలిమినేట్ అయింది.
Comments
Please login to add a commentAdd a comment