తమిళ స్టార్ హీరో సూర్య లేటెస్ట్ మూవీ 'కంగువ'. దాదాపు మూడేళ్ల పాటు కష్టపడి తీసిన ఈ సినిమాని.. కోలీవుడ్ 'బాహుబలి' అని అన్నారు. తీరా చూస్తే రియాలిటీలో తేడా కొట్టేసింది. థియేటర్లలో అయితే పెద్దగా ప్రేక్షకులకు ఎక్కలేదు కానీ ఓటీటీలో కాబట్టి చూసేయొచ్చు. ఇప్పుడు ఈ చిత్రం అనుకున్న టైం కంటే ముందే ఓటీటీలోకి వచ్చేసింది. ఇంతకీ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందంటే?
(ఇదీ చదవండి: బిగ్ బాస్ 8: రోహిణితో పాటు విష్ణుప్రియ ఎలిమినేట్!)
తెలుగులో 'శౌర్యం', 'దరువు' తదితర చిత్రాలతో దర్శకుడిగా పర్వాలేదనిపించుకున్న శివ.. తమిళంలోనూ అజిత్ హీరోగా పలు సినిమాలు తీశాడు. అయితే ఇతడిని నమ్మి 'కంగువ' సినిమా చేశాడు సూర్య. కానీ కష్టపడ్డప్పటికీ కంటెంట్ మరీ తీసికట్టుగా ఉండటంతో బాక్సాఫీస్ దగ్గర ఈ మూవీ డిజాస్టర్‌గా నిలిచింది.
నవంబర్ 14న థియేటర్లలో రిలీజైతే.. ఇప్పుడు అంటే డిసెంబరు 8న అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి 'కంగువ' వచ్చేసింది. ప్రస్తుతం తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ వెరన్స్ స్ట్రీమింగ్ అవుతున్నాయి. అయితే మరీ మూడు వారాలకే ఇలా డిజిటల్‌గా అందుబాటులోకి రావడం విశేషం.
(ఇదీ చదవండి: రెచ్చిపోయిన నిహారిక.. రొమాన్స్‌తో పాటు డ్యాన్స్‌లోనూ)
Comments
Please login to add a commentAdd a comment