మెగా డాటర్ నిహారిక ఇదివరకే తెలుగులో హీరోయిన్‌గా కొన్ని సినిమాలు చేసింది. పెళ్లి తర్వాత కొన్నాళ్లు యాక్టింగ్ పక్కనబెట్టేసింది. తర్వాత కాస్త గ్యాప్ ఇచ్చి ఒకటి రెండు వెబ్ సిరీసుల్లో నటించింది కానీ అవేమంత చెప్పుకోదగ్గ పాత్రలైతే కాదు. ప్రస్తుతం తమిళంలో 'మద్రాస్‌కారన్' మూవీలో హీరోయిన్‌గా చేస్తోంది. ఇందులో ఓ పాట షాకిచ్చే ఫెర్ఫార్మెన్స్ ఇచ్చింది.
(ఇదీ చదవండి: 'పుష్ప 2' కలెక్షన్స్.. రెండు రోజుల్లో ఏకంగా అన్ని కోట్లు)
ఒక మనసు, హ్యాపీ వెడ్డింగ్ తదితర సినిమాల్లో హీరోయిన్‌గా చేసింది. కాకపోతే ఇవి అనుకున్నంత సక్సెస్ కాలేదు. దీంతో యాక్టింగ్ పక్కనబెట్టేసి, నిర్మాతగా మారింది. ఈ ఏడాది 'కమిటీ కుర్రోళ్లు' అనే అద్భుతమైన సినిమాని అందించింది. సరే ఇవన్నీ పక్కనబెడితే ఈమె హీరోయిన్‌గా చేసిన తమిళ మూవీ నుంచి ఓ పాట రిలీజైంది.తాజాగా పూర్తి వీడియో సాంగ్ విడుదల చేశారు.
ఈ పాటలో అటు రొమాన్స్, ఇటు డ్యాన్సులో నిహారిక రెచ్చిపోయిందని చెప్పొచ్చు. తెలుగులో సినిమాల్లో నటించింది కానీ ఈ తరహా యాక్టింగ్ మాత్రం ఎప్పుడూ చేయలేదు. ఇప్పుడు వచ్చిన వీడియో సాంగ్ చూసి మెగా ఫ్యాన్స్ స్టన్ అయిపోతున్నారు. ఎందుకంటే రొమాన్స్ .. ఆ రేంజులో ఉంది మరి!
(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 8లో చివరి ఎలిమినేషన్.. ఆమెపై వేటు!)
Comments
Please login to add a commentAdd a comment