'పుష్ప 2' తొలిరోజు వసూళ్లలో బీభత్సం సృష్టించింది. ఏకంగా రూ.294 కోట్ల గ్రాస్ సొంతం చేసుకుని.. ఇప్పటివరకు ఉన్న రికార్డులని పక్కనబెట్టేసింది. అలా దేశంలోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. దీంతో రెండో రోజు ఎంత కలెక్ట్ చేస్తుందా అని అందరూ ఎదురు చూస్తుండగా.. ఇప్పుడు అధికారిక ప్రకటన వచ్చేసింది.
తొలిరోజు రూ.294 కోట్లు కలెక్షన్స్ సాధించిన 'పుష్ప 2'.. రెండో రోజు కాస్త తగ్గింది. రూ.155 కోట్ల గ్రాస్ సొంతం చేసుకుంది. అలా రెండు రోజులకు కలిపి రూ.449 కోట్లు వచ్చాయి. దీంతో రెండో రోజుకే రూ.400 కోట్ల మార్క్ దాటేసిన తొలి చిత్రంగా ఘనత సాధించింది.
(ఇదీ చదవండి: 'పుష్ప2' టికెట్ల ధరలు తగ్గనున్నాయా.. కారణం ఇదేనా..?)
అయితే దక్షిణాదిలో 'పుష్ప 2' మేనియా ఓ మాదిరిగా ఉండగా.. నార్త్‌లో మాత్రం రప్పా రప్పా అనేలా ఉంది. ఎందుకంటే ఉత్తరాది ప్రేక్షకులు ఎగబడి మరీ సినిమా చూస్తున్నారు. థియేటర్లలో రచ్చ రచ్చ చేస్తున్నారు. ఈ ఊపు ఇలానే కొనసాగితే వారం రోజుల్లోనే రూ.1000 కోట్లు వసూళ్లు వచ్చేసిన ఆశ్చర్యపోనక్కర్లేదు.
'పుష్ప 2'లో స్టోరీ పెద్దగా లేనప్పటికీ.. గూస్ బంప్స్ తెప్పించే సీన్స్ ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి. దీంతో మూడున్నర గంటల నిడివి కూడా తక్కువే అనిపిస్తుంది. పాటలు, ఫైట్స్ దేనికవే రచ్చ రచ్చ అనేలా ఉండటంతో సాధారణ ప్రేక్షకులు కూడా ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నారు.
(ఇదీ చదవండి: Pushpa2: థియేటర్స్‌లో మహిళలకు పూనకాలు.. వీడియో వైరల్)
Comments
Please login to add a commentAdd a comment