day 2
-
'పుష్ప 2' కలెక్షన్స్.. రెండు రోజుల్లో ఏకంగా అన్ని కోట్లు
'పుష్ప 2' తొలిరోజు వసూళ్లలో బీభత్సం సృష్టించింది. ఏకంగా రూ.294 కోట్ల గ్రాస్ సొంతం చేసుకుని.. ఇప్పటివరకు ఉన్న రికార్డులని పక్కనబెట్టేసింది. అలా దేశంలోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. దీంతో రెండో రోజు ఎంత కలెక్ట్ చేస్తుందా అని అందరూ ఎదురు చూస్తుండగా.. ఇప్పుడు అధికారిక ప్రకటన వచ్చేసింది.తొలిరోజు రూ.294 కోట్లు కలెక్షన్స్ సాధించిన 'పుష్ప 2'.. రెండో రోజు కాస్త తగ్గింది. రూ.155 కోట్ల గ్రాస్ సొంతం చేసుకుంది. అలా రెండు రోజులకు కలిపి రూ.449 కోట్లు వచ్చాయి. దీంతో రెండో రోజుకే రూ.400 కోట్ల మార్క్ దాటేసిన తొలి చిత్రంగా ఘనత సాధించింది.(ఇదీ చదవండి: 'పుష్ప2' టికెట్ల ధరలు తగ్గనున్నాయా.. కారణం ఇదేనా..?)అయితే దక్షిణాదిలో 'పుష్ప 2' మేనియా ఓ మాదిరిగా ఉండగా.. నార్త్‌లో మాత్రం రప్పా రప్పా అనేలా ఉంది. ఎందుకంటే ఉత్తరాది ప్రేక్షకులు ఎగబడి మరీ సినిమా చూస్తున్నారు. థియేటర్లలో రచ్చ రచ్చ చేస్తున్నారు. ఈ ఊపు ఇలానే కొనసాగితే వారం రోజుల్లోనే రూ.1000 కోట్లు వసూళ్లు వచ్చేసిన ఆశ్చర్యపోనక్కర్లేదు.'పుష్ప 2'లో స్టోరీ పెద్దగా లేనప్పటికీ.. గూస్ బంప్స్ తెప్పించే సీన్స్ ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి. దీంతో మూడున్నర గంటల నిడివి కూడా తక్కువే అనిపిస్తుంది. పాటలు, ఫైట్స్ దేనికవే రచ్చ రచ్చ అనేలా ఉండటంతో సాధారణ ప్రేక్షకులు కూడా ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నారు.(ఇదీ చదవండి: Pushpa2: థియేటర్స్‌లో మహిళలకు పూనకాలు.. వీడియో వైరల్) -
'లక్కీ భాస్కర్' కలెక్షన్.. రెండు రోజుల్లో ఎన్ని కోట్లంటే?
దీపావళికి తెలుగు రాష్ట్రాల్లో రిలీజైన సినిమాల్లో 'లక్కీ భాస్కర్' జోరు చూపిస్తోంది. మిగిలిన మూవీస్ కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ దుల్కర్ చిత్రానికి ఆడియెన్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు అనిపిస్తుంది. రెండు రోజుల్లో వచ్చిన కలెక్షన్స్ చూస్తే అదే నిజమనిపిస్తోంది.(ఇదీ చదవండి: 'లక్కీ భాస్కర్' సినిమా రివ్యూ)'సీతారామం' ఫేమ్ దుల్కర్ సల్మాన్ నటించిన లేటెస్ట్ తెలుగు మూవీ 'లక్కీ భాస్కర్'. బ్యాంకింగ్ రంగంలోని మోసాలకు ఫ్యామిలీ ఎమోషన్స్ జోడిస్తూ తీసిన ఈ చిత్రానికి హిట్ టాక్ వచ్చింది. దీంతో తొలి రోజు రూ.12.7 కోట్లు గ్రాస్ రాగా, రెండో రోజు కూడా అంతే స్టడీగా వచ్చాయి. కాస్త రూ.13.5 కోట్ల గ్రాస్ సొంతం చేసుకుంది. అలా రెండు రోజుల్లో రూ.26.2 కోట్లు గ్రాస్ వసూళ్లు సాధించినట్లు నిర్మాతలు పోస్టర్ రిలీజ్ చేసి అధికారికంగా ప్రకటించారు.దుల్కర్‌తో పాటు మీనాక్షి చౌదరి కూడా యాక్టింగ్‌తో ఆకట్టుకుంది. వెంకీ అట్లూరి రచన-దర్శకత్వం ఒకెత్తయితే, జీవీ ప్రకాశ్ కుమార్ అందించిన సంగీతం మరో ఎత్తు. ఓవరాల్‌గా బాక్సాఫీస్ దగ్గర 'లక్కీ భాస్కర్' నెమ్మదిగా పికప్ అవుతోంది. ఈ వీకెండ్ ముగిసేసరికి రూ.50 కోట్ల వసూళ్లు మార్క్ చేరుకుంటుదేమో చూద్దాం!(ఇదీ చదవండి: దీపావళికి నాలుగు కొత్త సినిమాలు.. ఏది ఎలా ఉందంటే?)Our Baskhar is 𝐔𝐍𝐒𝐓𝐎𝐏𝐏𝐀𝐁𝐋𝐄 at the box office, 𝟐𝟔.𝟐 𝐂𝐑+ 𝐆𝐑𝐎𝐒𝐒 worldwide in 2 Days! 🔥💰#BlockbusterLuckyBaskhar 💥💥𝑼𝑵𝑰𝑽𝑬𝑹𝑺𝑨𝑳 𝑫𝑰𝑾𝑨𝑳𝑰 𝑩𝑳𝑶𝑪𝑲𝑩𝑼𝑺𝑻𝑬𝑹 🏦 #LuckyBaskhar In Cinemas Now - Book your tickets 🎟 ~ https://t.co/Gdd57KhHT3… pic.twitter.com/KHw1GjC2kL— Dulquer Salmaan (@dulQuer) November 2, 2024 -
ఆర్డీటీ స్టేడియంలో దులిప్ ట్రోఫీ.. రెండో రోజు ఇలా(ఫొటోలు)
-
'కల్కి' రెండో రోజు కలెక్షన్స్.. కాస్త తగ్గాయి కానీ!
బాక్సాఫీస్ దగ్గర 'కల్కి 2898' జోరు మామూలుగా లేదు. తొలిరోజే రూ.191 కోట్ల మేర గ్రాస్ వసూళ్లు సాధించిన ఈ సినిమా.. రెండో రోజు కూడా అదే జోరు చూపించింది. కాకపోతే కాస్త తగ్గుదల చూపించింది. త్రిబుల్ సెంచరీ కొద్దిలో మిస్ అయింది. ఈ మేరకు నిర్మాణ సంస్థ అధికారిక పోస్టర్ రిలీజ్ చేసింది.(ఇదీ చదవండి: 'కల్కి 2' షూటింగ్ 60% అయిపోయింది.. నిర్మాత కామెంట్స్)టాలీవుడ్లోనే భారీ బడ్జెట్‌తో తీసిన 'కల్కి'.. రెండు రోజుల క్రితం థియేటర్లలోకి వచ్చింది. పాజిటివ్ టాక్ తెచ్చుకుని దూసుకుపోతోంది. ఇప్పటికే ఓవర్సీస్లో 7 మిలియన్ డాలర్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇకపోతే ప్రపంచవ్యాప్తంగా తొలిరోజు రూ.191.5 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాగా.. రెండో రోజు రూ.107 కోట్లు సొంతం చేసుకుంది.తద్వారా ప్రపంచవ్యాప్తంగా రెండు రోజుల్లో రూ.298.5 కోట్లు వచ్చినట్లు నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ పోస్టర్ రిలీజ్ చేసింది. దీని బట్టి చూస్తుంటే వీకెండ్ అయ్యేసరికి ఎంత? లాంగ్ రన్లో ఎంత కలెక్ట్ చేస్తుందోనని ఫ్యాన్స్ అప్పుడే లెక్కలు వేసేస్తున్నారు.(ఇదీ చదవండి: మహాభారతం గురించే డిస్కషన్.. ఇదంతా 'కల్కి' వల్లే) -
బాక్సాఫీస్ దగ్గర 'గం గం గణేశా'.. రెండు రోజుల వసూళ్లు ఎంతంటే?
ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'గం గం గణేశా'. చాన్నాళ్ల పాటు సరైన సినిమాలు లేకపోవడంతో థియేటర్లు బోసిపోయాయి. అలాంటి టైంలో అంటే రీసెంట్ శుక్రవారం ఏకంగా మూడు తెలుగు మూవీస్ రిలీజయ్యాయి. వీటిలో ఒకటే ఇది. రోజు రోజుకి మెరుగైన వసూళ్లు సాధిస్తున్న ఈ చిత్రం రెండు రోజుల్లో ఎన్ని కోట్లు దక్కించుకుంది? ప్రస్తుతం పరిస్థితి ఏంటి?(ఇదీ చదవండి: హీరో ఆత్మహత్య చేసుకున్న ఫ్లాట్‌లో హీరోయిన్ మకాం)'బేబి' మూవీతో గతేడాది హిట్ కొట్టిన ఆనంద్ దేవరకొండ.. ఇప్పుడు జానర్ మార్చి మరో మూవీతో ప్రేక్షకుల్ని పలకరించాడు. క్రైమ్ కామెడీతో తీసిన 'గం గం గణేశా' తొలిరోజు రూ.1.20 కోట్ల గ్రాస్ సొంతం చేసుకుంది. వీకెండ్ కావడంతో రెండో రోజు థియేటర్లకి జనాలు బాగానే వచ్చారు. తద్వారా రెండో రోజు రూ.1.50 కోట్లకి పైగా గ్రాస్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.ఈ లెక్కన ఓవరాల్‌గా చూసుకుంటే 'గం గం గణేశా' సినిమాకు రెండు రోజుల్లో రూ.2.60 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు దక్కినట్లు సమాచారం. మరి ఇంకా చాలానే రాబట్టాల్సి ఉంది. మరి సేఫ్ జోన్లోకి వెళ్తుందా లేదా అనేది మరో రెండు మూడు రోజుల్లో తెలిసిపోతుంది.(ఇదీ చదవండి: 'బేబి' హీరోయిన్ నుంచి త్వరలో గుడ్ న్యూస్?) -
'సలార్' కలెక్షన్స్ రచ్చ.. రెండు రోజుల్లో ఏకంగా అన్ని కోట్లు
సలారోడు.. బాక్సాఫీస్‌ని ఊచకోత కోస్తున్నాడు. ప్రభాస్ దెబ్బకు ఫ్యాన్స్ మాస్ జపం చేస్తున్నారు. దీనికి తగ్గట్లే కలెక్షన్స్ దుమ్మురేపుతున్నాయి. అయితే తొలిరోజు వసూళ్లతో పలు రికార్డులు సెట్ చేసిన 'సలార్'.. రెండోరోజుకి కాస్త నెమ్మదించింది. ఇంతకీ రెండు రోజుల్లో ఈ సినిమాకు ఎన్ని డబ్బలు వచ్చాయి? అసలేం జరుగుతోంది? (ఇదీ చదవండి: ఓటీటీలోకి ఆ హిట్ మూవీ.. రెండు నెలల తర్వాత ఇప్పుడు స్ట్రీమింగ్) డార్లింగ్ ప్రభాస్ చాలా ఏళ్ల తర్వాత చేసిన మాస్ మూవీ 'సలార్'. పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్న తర్వాత ప్రభాస్ నుంచి 'సాహో' లాంటి మాస్ చిత్రం వచ్చింది. కానీ ఎందుకో ఇది అభిమానుల్ని సంతృప్తి పరచలేకపోయింది. ఆ తర్వాత వచ్చిన 'రాధేశ్యామ్', 'ఆదిపురుష్' ఆడియెన్స్‌ని ఆకట్టుకోవడంలో ఫెయిలయ్యాయి. ఇప్పుడు వీళ్లందరినీ 'సలార్' ఫుల్ సాటిస్పై చేస్తోంది. అందుకు తగ్గట్లే కలెక్షన్స్ వస్తున్నాయి. టాక్‌తో సంబంధం లేకుండా తొలిరోజు రూ.178.7 కోట్లు వసూలు చేసిన సలార్.. రెండో రోజు పూర్తయ్యేసరికి 295.7 కోట్ల వసూళ్లు సాధించింది. అంటే తొలిరోజుతో పోలిస్తే శనివారం కలెక్షన్స్ కాస్త తగ్గాయి. సరిగా చెప్పాలంటే రెండో రోజు మాత్రం రూ.117 కోట్ల వరకు ప్రపంచవ్యాప్తంగా సొంతం చేసుకుంది. ఆదివారం కూడా 100 కోట్ల తగ్గకుండా వస్తాయి. వచ్చే వారం పెద్దగా చెప్పుకోదగ్గ మూవీస్ ఏం లేవు కాబట్టి త్వరలో రూ.1000 కోట్ల మార్క్ దాటేసినా పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. (ఇదీ చదవండి: 'సలార్' ఊరమాస్ కలెక్షన్స్.. కొద్దిలో మిస్ అయిన 'ఆర్ఆర్ఆర్' రికార్డ్!) 𝑻𝒉𝒆 𝑯𝒖𝒏𝒕𝒊𝒏𝒈 𝑺𝒆𝒂𝒔𝒐𝒏 𝑩𝒆𝒈𝒊𝒏𝒔…🔥💥#SalaarCeaseFire dominates the global-box office, crossing 𝟐𝟗𝟓.𝟕 𝐂𝐑𝐎𝐑𝐄𝐒 𝐆𝐁𝐎𝐂 (worldwide) 𝐢𝐧 𝟐 𝐃𝐚𝐲𝐬!#BlockbusterSalaar #RecordBreakingSalaar #SalaarRulingBoxOffice#Salaar #Prabhas #PrashanthNeel… pic.twitter.com/suEQftytyj — Salaar (@SalaarTheSaga) December 24, 2023 -
'ఆదిపురుష్' రెండో రోజు కలెక్షన్స్.. ఆ మార్క్ దాటేసింది!
'ఆదిపురుష్' దూకుడు అస్సలు తగ్గట్లేదు. టాక్ అటుఇటు అయినప్పటికీ బాక్సాఫీస్ దగ్గర కోట్లకు కోట్లు వచ్చిపడుతూనే ఉన్నాయి. తొలిరోజు రూ.140 కోట్ల గ్రాస్ వసూలు చేసిన ఈ మూవీ.. రెండోరోజు అంతకాకపోయినప్పటికీ బాగానే వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే రెండురోజుల్లోనే అరుదైన మార్క్ ని క్రాస్ చేసిన మూవీగా రికార్డు సృష్టించింది. ప్రస్తుతం ఈ విషయం ఫ్యాన్స్ కి ఫుల్ మజా ఇస్తోంది. ఇంతకీ 'ఆదిపురుష్' కలెక్షన్స్ సంగతేంటి? 'బాహుబలి' తర్వాత ప్రభాస్ చేసిన 'సాహో', 'రాధేశ్యామ్' పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. దీంతో 'ఆదిపురుష్' ఆ కొరత తీరుస్తుందని అభిమానులు అనుకున్నారు. కానీ ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేయడంలో ఇదీ కూడా ఫెయిలైనట్లు తెలుస్తోంది. సినిమా చూసిన వాళ్లే ఇలా చెబుతున్నారు. అయితే ఈ కామెంట్స్ ఏవీ కలెక్షన్స్ పై పెద్దగా ప్రభావం చూపట్లేదనిపిస్తోంది. తొలిరోజు రూ.140 కోట్ల గ్రాస్ వసూలు చేసిందని స్వయంగా నిర్మాణ సంస్థనే ప్రకటన విడుదల చేసింది. రెండో రోజు కలెక్షన్స్ కి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది. ఫస్ట్ డే రూ.140 కోట్లు కలెక్ట్ చేసిన ఈ మూవీ.. రెండో రోజు మాత్రం కాస్త డల్ అయింది. రెండోరోజు ఓవరాల్ గా రూ.100 కోట్ల గ్రాస్ సొంతం చేసుకుందని పోస్టర్ రిలీజ్ చేశారు. ఫలితంగా రెండు రోజుల్లోనే రూ.240 కోట్ల వసూళ్లు సాధించింది. ఇలా తొలి రెండు రోజుల్లోనే ఎక్కువ వసూళ్ల సాధించిన చిత్రాల లిస్టులో 'ఆదిపురుష్' టాప్-5లోకి చేరినట్లే. Adipurush continues to mesmerise audiences worldwide, surpassing expectations with a bumper opening of ₹140 CR on Day 1, it adds ₹100 CR on Day 2, taking the total collection to a phenomenal ₹240 CR in just two days! Jai Shri Ram 🙏https://t.co/0gHImE23yj#Prabhas @omraut… pic.twitter.com/EOCb2GroSQ — T-Series (@TSeries) June 18, 2023 (ఇదీ చదవండి: 'ఆదిపురుష్' రిజల్ట్.. ఇలా జరగడానికి కారణాలేంటి?) -
IND VS AUS 1st Test Day 2: నిరాశపరిచిన కోహ్లి.. తొలి బంతికే..!
BGT 2023: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ-2023లో భాగంగా నాగ్‌పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్ట్‌లో టీమిండియా తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దిశగా సాగుతుంది. రెండో రోజు లంచ్ సమయానికి భారత్ స్కోర్ 3 వికెట్ల నష్టానికి 151గా ఉండింది. అయితే లంచ్ విరామం తర్వాత తొలి బంతికే టీమిండియాకు భారీ షాక్ తగిలింది. లంచ్ తర్వాత తొలి బంతికే విరాట్ కోహ్లి (26 బంతుల్లో 12; 2 ఫోర్లు) ఔటయ్యాడు. కోహ్లి వికెట్ కూడా ఆసీస్ యువ స్పిన్నర్ టాడ్ మర్ఫీ ఖాతాలోకే వెళ్లింది. టీమిండియా కోల్పోయిన నాలుగు వికెట్లు ఈ యువ స్పిన్నరే పడగొట్టడం విశేషం. లెగ్‌సైడ్ వెళ్తున్న బంతిని గ్లాన్స్ చేసే క్రమంలో వికెట్‌కీపర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు కోహ్లి. ఎన్నో అంచనాల నడుమ బరిలోకి దిగిన కోహ్లి ఏ మెరుపులు లేకుండా ఔట్ కావడంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. కోహ్లి సెంచరీ చేస్తాడని ప్లకార్డులు, బ్యానర్లు రెడీ చేసుకున్న అభిమానులు అతను ఔట్ కాగానే వాటిని దాచేశారు. సెకెండ్ ఇన్నింగ్స్‌లోనైనా కింగ్ సెంచరీ చేయకపోడా అన్న ఆశతో వారు కనిపించారు. మరోపక్క కెప్టెన్ రోహిత్ శర్మ ఒక్కో పరుగూ చేస్తూ సెంచరీకి చేరువయ్యాడు. 57 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 163/4గా ఉంది. రోహిత్‌కు (89) జతగా సూర్యకుమార్ యాదవ్ (8) క్రీజ్‌లో ఉన్నాడు. కాగా, ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 177 పరుగులకు ఆలౌటైన విషయం తెలిసిందే. టీమిండియా స్పిన్నర్లు రవీంద్ర జడేజా (5/47), రవిచంద్రన్ అశ్విన్ (3/42) ఆసీస్ పతనాన్ని శాసించారు. షమీ, సిరాజ్‌లకు చెరో వికెట్ దక్కింది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో లబూషేన్ (49) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. స్టీవ్ స్మిత్ (37), హ్యాండ్స్కోంబ్ (31), అలెక్స్ క్యారీ (36)లకు మంచి ఆరంభాలే లభించినా, వాటిని భారీ స్కోర్లుగా మలచడంలో వారు విఫలమయ్యారు. ఈ నలుగురు మినహా ఆసీస్ ఇన్నింగ్స్‌లో ఇంకెవ్వరూ కనీసం రెండంకెల స్కోర్ కూడా చేయలేదు. -
హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్: రెండో రోజు విశేషాలు ఇవే..
హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ కార్యక్రమాల్లో భాగంగా రెండో రోజు శనివారం ఉదయం 10 గంటలకు ‘ది లాస్ట్ హీరోస్–ఫూట్ సోల్జియర్స్ ఆఫ్ ఇండియన్ ఫ్రీడ మ్’ అనే అంశంపై సీనియర్ పాత్రికేయులు, రచయిత పాలగుమ్మి సాయినాథ్ ప్రసంగించనున్నారు. కార్యక్రమానికి సునీతారెడ్డి సమన్వయకర్తగా వ్యవహరిస్తారు. ► ఉదయం 10.50 నుంచి 11.35 గంటల వరకు ‘కాన్స్టిట్యూషన్ : ఏ సిస్ఫియన్ లైఫ్ ఇన్ లా’ అనే అంశంపై ప్రొఫెసర్ కల్పన కన్నబీరన్, ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడతారు. ప్రముఖ రచయిత్రి ఓల్గా సమన్వయకర్తగా వ్యవహరిస్తారు. ► ఉదయం 11.40 గంటల నుంచి 12.25 వరకు ఎవరెస్టు అధిరోహించిన విజేతలు అపర్ణ తోట, పూర్ణ మాలావత్లతో ఉమా సుధీర్ ప్రత్యేక కార్యక్రమం. ► కావ్యధార వేదికపై ఉదయం10.50 గంటలకు బహు భాషా కవితా పఠనం. దీప్తి నావల్, జెర్రీ పింటో, కల్యాణీ ఠాకూర్లు పాల్గొంటారు. ► స్టోరీ టెల్లింగ్‌లో భాగంగా ఉదయం 10 .30 నుంచి 11.20 వరకు ప్రముఖ స్టోరీ టెల్లర్ దీపాకిరణ్ ఆసక్తికరమైన కథలు చెబుతారు. ► మధ్యాహ్నం 2 గంటల నుంచి 2.45 వరకు గోవా భాషలు (గోవా బార్డరీ బర్రెట్టో) అనే అంశంపైన ప్రముఖ కొంకణి రచయిత దామోదర్ మౌజో,జెర్రీ పింటో మాట్లాడతారు. గిరిధర్‌రావు సమన్వకర్తగా వ్యవహరిస్తారు. ► మధ్యాహ్నం 3.40 నుంచి 4.25 వరకు విమెన్ ఇన్ సైన్స్ అనే అంశంపైన చర్చా కార్యక్రమం ఉంటుంది. నస్రీన్ ,వినీత బాల్, సాగరి రాందాస్, తదితరులు పాల్గొంటారు. ► సాయంత్రం 5.20 నుంచి 6.20 గంటల వరకు ఫుగ్డీ అండ్ ధాలో కొంకణి జానపద నృత్యరూపకం. ధ్యానజ్యోతి మహిళా మండలి ఈ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ► సాయంత్రం 6.30 నుంచి 8 గంటల వరకు నాన్ నూకడ్ వేదికపై ప్రత్యేక సంగీత కార్యక్రమం. వరిజశ్రీ వేణుగోపాల్ నిర్వహిస్తారు. -
రెండో రోజు ముగిసిన ఆట.. భారత్‌పై 345 పరుగుల ఆధ్యిక్యంలో ఇంగ్లండ్
లీడ్స్‌లో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లండ్ భారీ స్కోరు దిశగా సాగుతుంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ జట్టు ఎనిమిది వికెట్ల నష్టానికి 423 పరుగులను చేసింది. ప్రస్తుతం క్రీజులో క్రెగ్ ఒవర్టన్ 24 నాటౌట్, ఓల్లీ రాబిన్సన్ (0) నాటౌట్‌గా ఉన్నారు. భారత బౌలర్లు రెండో రోజు ప్రారంభం నుంచి వికెట్లు దక్కలేదు. ఇంగ్లండ్ బ్యాట్మెన్స్ భారత బౌలర్లపై తొలి రోజునుంచి ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. చివరి సెషన్ తప్ప మిగతా సెషన్లో భారత బౌలర్లు తేలిపోయారు. భారత్‌పై 345 పరుగుల ఆధ్యిక్యంలో ఇంగ్లండ్ కొనసాగుతుంది. ఏడో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్.. మొయిన్ అలీ(8) ఔట్ రూట్(121)ను క్లీన్ బౌల్డ్ చేసిన బుమ్రా.. ఇంగ్లండ్ ఆరో వికెట్ డౌన్ కొరకరాని కొయ్యలా మారిన రూట్(121; 14 ఫోర్లు)ను బుమ్రా క్లీన్ బౌల్డ్ చేశాడు. ఇప్పటికే చేయాల్సిన నష్టం అంతా చేసేసని ఇంగ్లండ్ కెప్టెన్.. ఆరో వికెట్‌గా వెనుదిరిగాడు. క్రీజ్‌లో మొయిన్ అలీ(8), సామ్ కర్రన్ ఉన్నారు. 118 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్ స్కోర్ 383/6. షమీ విజృంభణ.. 10 పరుగుల వ్యవధిలో రెండు వికెట్లు రూట్ శతక్కొట్టాక ఇంగ్లండ్ జట్టు వేగంగా పరుగులు రాబట్టే క్రమంలో రెండు కీలక వికెట్లు కోల్పోయింది. ఈ రెండు వికెట్లు షమీ ఖాతాలోకి వెళ్లాయి. ఇంగ్లండ్ ఇన్నింగ్స్108 ఓవర్లో 350/3 స్కోర్ వద్ద షమీ బెయిర్‌స్టో(29; 4 ఫోర్లు, సిక్స్)ను బోల్తా కొట్టించగా, సరిగ్గా పది పరుగుల వ్యవధిలో బట్లర్(7; ఫోర్)ను కూడా పెవిలియన్‌కు పంపాడు. 112 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్ స్కోర్ 360/5. క్రీజ్‌లో రూట్(105), మొయిన్ అలీ(0) ఉన్నారు. ప్రస్తుతం ఇంగ్లండ్ 282 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. శతక్కొట్టిన రూట్.. భారీ ఆధిక్యం దిశగా ఇంగ్లండ్ ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. ప్రస్తుత సిరీస్‌లో వరుసగా మూడో శతకాన్ని సాధించాడు. ఈ క్రమంలో అతను కెరీర్లో 22వ శతకాన్ని బాదేశాడు. 96 పరుగుల వద్ద ఇషాంత్ బౌలింగ్‌లో బౌండరీ బాది రూట్ సెంచరీ సాధించాడు. 103.2 తర్వాత ఇంగ్లండ్ స్కోర్ 329/3. క్రీజ్‌లో రూట్‌కు తోడుగా బెయిర్ స్టో(15) ఉన్నాడు. కాగా, రూట్‌కు ఈ శతకం కెరీర్లో చాలా ప్రత్యేకంగా నిలువనుంది. ఈ సెంచరీ ద్వారా అతను పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ఒకే క్యాలెండర్ ఇయర్లో ఇంగ్లండ్ తరఫున అత్యధిక సెంచరీలు(6) సాధించిన ఆటగాడిగా మైకేల్ వాన్(1997లో 6 సెంచరీలు), డెన్నిస్ క్రాంప్టన్(1947లో 6 శతకాలు)ల సరసన నిలిచాడు. అలాగే భారత్‌పై అత్యధిక సెంచరీలు(8) సాధించిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. మూడో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్.. మలాన్(70) ఔట్ టీమిండియాకు ఎట్టకేలకు మరో బ్రేక్ లభించింది. టీ విరామానికి ముందు డేవిడ్ మలాన్(70; 11 ఫోర్లు)ను సిరాజ్ బోల్తా కొట్టించాడు. సిరాజ్ బౌలింగ్‌లో వికెట్‌కీపర్ పంత్‌కు క్యాచ్ ఇచ్చి మలాన్ వెనుదిరిగాడు. 94 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్ స్కోర్ 298/3. ప్రస్తుతం ఆ జట్టు 220 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. భారీ ఆధిక్యం దిశగా ఇంగ్లండ్.. రూట్(70*), మలాన్(64*) అర్ధసెంచరీలు తొలి సెషన్లో రెండు వికెట్లు పడగొట్టి, ఆతిధ్య జట్టుకు పగ్గాలు వేసేలా కనిపించిన టీమిండియా.. ఆ తర్వాత వికెట్ కోసం శతవిధాల ప్రయత్నిస్తున్నప్పటికీ, ప్రయోజనం లేకుండా పోయింది. ఓపెనర్లు వెనుదిరిగాక క్రీజ్‌లోకి వచ్చిన మలాన్(64; 10 ఫోర్లు), జో రూట్(70; 8 ఫోర్లు)లు పసలేని టీమిండియా బౌలింగ్‌పై పూర్తి ఆధిపత్యాన్ని కనబర్చారు. ముఖ్యంగా రూట్ వేగంగా పరుగులు సాధిస్తూ భారత బౌలర్లను ఆటాడుకుంటున్నాడు. ఫలితంగా 90 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్ స్కోర్ 282/2గా ఉంది. ప్రస్తుతం ఆ జట్టు 204 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. రెండో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్.. హసీబ్ హమీద్(68) బౌల్డ్ ఓవర్‌నైట్ స్కోర్ 120/0తో రెండో రోజు ఆటను ఆరంభించిన ఇంగ్లండ్ జట్టు.. తొలి సెషన్లోనే ఇద్దరు ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. తొలుత 135 పరుగుల వద్ద బర్న్స్(61)ను షమీ పెవిలియన్‌కు పంపగా, 159 పరుగుల వద్ద హసీబ్ హమీద్(68; 12 ఫోర్లు)ను జడేజా క్లీన్ బౌల్డ్ చేశాడు. క్రీజ్‌లో డేవిడ్ మలాన్(18), జో రూట్(0) ఉన్నారు. ప్రస్తుతం ఇంగ్లండ్ 81 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. ఎట్టకేలకు తొలి వికెట్.. షమీకి చిక్కిన బర్న్స్ (61) ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియాకు ఎట్టకేలకు బ్రేక్ దొరికింది. ఆ జట్టు ఓపెనర్, బర్త్‌డే బాయ్ రోరీ బర్న్స్(61; 6 ఫోర్లు, సిక్స్) షమీ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. 50 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్ స్కోర్ 135/1. క్రీజ్‌లో హసీబ్ హమీద్(66), డేవిడ్ మలాన్(0) ఉన్నారు. 120/0 వద్ద రెండో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్.. మరో 15 పరుగులు జోడించి బర్న్స్ వికెట్‌ను కోల్పోయింది. కాగా, ఇంగ్లండ్ బౌలర్ల ధాటికి టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 78 పరుగలకే చాపచుట్టేసిన విషయం తెలిసిందే. చదవండి: నేటి నుంచి ధనాధన్ క్రికెట్ లీగ్ ప్రారంభం.. భారత్‌లోనూ ప్రత్యక్ష ప్రసారం -
మనదే పైచేయి...
సిడ్నీ: ఆస్ట్రేలియాతో మూడో టెస్టులో రెండో రోజు భారత్ మెరుగైన ప్రదర్శన కనబర్చింది. శుక్రవారం ఆట ముగిసే సమయానికి భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల నష్టానికి 96 పరుగులు చేసింది. శుబ్‌మన్ గిల్ (101 బంతుల్లో 50; 8 ఫోర్లు), రోహిత్ శర్మ (26) తొలి వికెట్‌కు 70 పరుగులు జోడించి వెనుదిరగ్గా... ప్రస్తుతం పుజారా (9 బ్యాటింగ్), రహానే (5 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నారు. భారత్ మరో 242 పరుగులు వెనుకబడి ఉంది. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 166/2తో ఆట కొనసాగించిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 338 పరుగులకు ఆలౌటైంది. స్టీవ్ స్మిత్ (226 బంతుల్లో 131; 16 ఫోర్లు) శతకం పూర్తి చేసుకోగా, లబ్‌షేన్ (196 బంతుల్లో 91; 11 ఫోర్లు) ఆ అవకాశం చేజార్చుకున్నాడు. భారత బౌలర్లలో జడేజా 4 వికెట్లు పడగొట్టగా...బుమ్రా, సైనీ చెరో 2 వికెట్లు తీశారు. జడేజా జోరు... భారీ స్కోరు లక్ష్యంగా రెండో రోజు ఆట ఆరంభించిన ఆస్ట్రేలియాను భారత బౌలర్లు కట్టడి చేశారు. ఫలితంగా స్మిత్ మినహా మిగతా వారంతా పరుగులు చేయడానికి ఇబ్బంది పడి ఒత్తిడిలో వికెట్లు చేజార్చుకున్నారు. శుక్రవారం 11 ఓవర్ల ఆట తర్వాత వానతో స్వల్ప విరామం వచ్చింది. అయితే ఆ తర్వాత సెంచరీ దిశగా సాగుతున్న లబ్‌షేన్‌ను చక్కటి బంతితో అవుట్ చేసి జడేజా 100 పరుగుల మూడో వికెట్ భాగస్వామ్యానికి తెరదించాడు. కొద్దిసేపటికే జడేజా బౌలింగ్‌లోనే ముందుకొచ్చి ఆడబోయి వేడ్ (13) వెనుదిరిగాడు. ఈ దశలో వర్షం కారణంగా మళ్లీ 23 నిమిషాలు ఆట సాగలేదు. అనంతరం కొత్త బంతితో బుమ్రా చెలరేగిపోయాడు. గ్రీన్ (0)ను వికెట్లు ముందు దొరకబుచ్చుకున్న అతను... కెప్టెన్ పైన్ (1) స్టంప్స్‌ను ఎగరగొట్టాడు. కమిన్స్ (0) కూడా పెవిలియన్ చేరడంతో ఆసీస్ కష్టాలు పెరిగాయి. ఈ దశలో మిషెల్ స్టార్క్ (30 బంతుల్లో 24; 2 ఫోర్లు, 1 సిక్స్) కొంత దూకుడుగా ఆడి స్మిత్‌కు సహకరించాడు. అయితే స్టార్క్‌ను షార్ట్ బంతితో సైనీ అవుట్ చేసిన తర్వాత ఆసీస్ ఆలౌట్ అయ్యేందుకు ఎక్కువ సమయం పట్టలేదు. రోహిత్ వర్సెస్ లయన్ సుదీర్ఘ విరామం తర్వాత టెస్టు మ్యాచ్‌లో బరిలోకి దిగిన రోహిత్ శర్మ జాగ్రత్తగా ఆడాడు. ముఖ్యంగా ఆఫ్‌స్పిన్నర్ లయన్‌తో అతని పోరు ఆసక్తికరంగా సాగింది. లయన్ తొలి ఆరు ఓవర్లను పూర్తిగా రోహిత్ ఒక్కడే ఎదుర్కొన్నాడు. ఈ 42 బంతుల్లో ఒకరిపై మరొకరు ఆధిపత్యం ప్రదర్శించేందుకు ప్రయత్నించగా... 4 మెయిడిన్ ఓవర్లు వేసిన లయన్ 14 పరుగులు ఇచ్చాడు. లయన్ రెండో ఓవర్లోనే ముందుకు దూసుకొచ్చి లాంగాన్ మీదుగా రోహిత్ భారీ సిక్సర్ కొట్టాడు. ఇది అంతర్జాతీయ క్రికెట్లో ఆస్ట్రేలియాపై రోహిత్‌కు 100వ సిక్సర్ కావడం విశేషం. అదే ఓవర్లో రోహిత్ మరో ఫోర్ కూడా కొట్టాడు. రోహిత్ స్కోరు 24 వద్ద అంపైర్ ఎల్బీడబ్ల్యూగా ప్రకటించడంతో లయన్‌లో ఆనందం కనిపించింది. అయితే రివ్యూలో అది నాటౌట్‌గా తేలింది. చివరకు హాజల్‌వుడ్ బౌలింగ్‌లో అతనికే సునాయాస క్యాచ్ ఇచ్చి భారత ఓపెనర్ వెనుదిరిగాడు. శుక్రవారం 30వ పుట్టిన రోజు జరుపుకున్న హాజల్‌వుడ్‌కు ఇది 300వ అంతర్జాతీయ వికెట్. గిల్ వర్సెస్ కమిన్స్ తన తొలి టెస్టులోనే చక్కటి బ్యాటింగ్‌తో ఆకట్టుకున్న శుబ్‌మన్ గిల్ దానిని ఇక్కడా కొనసాగించాడు. ముఖ్యంగా వరల్డ్ నంబర్‌వన్ బౌలర్ కమిన్స్‌ను అతను సమర్థంగా ఎదుర్కొన్న తీరు అభినందనీయం. కమిన్స్ తొలి 7 ఓవర్లను గిల్ ఒక్కడే ఆడాడు. ముఖ్యంగా ఆఫ్ సైడ్‌లో పడిన షార్ట్ బంతిని చివరి క్షణంలో పాయింట్ దిశగా ఆడి అతను బౌండరీగా మలచిన షాట్ ఇన్నింగ్స్‌కే ఆకర్షణగా నిలిచింది. స్టార్క్, లయన్ బౌలింగ్‌లలో కూడా గిల్ చూడచక్కటి ఫోర్లు కొట్టాడు. ఈ క్రమంలో 100 బంతుల్లో అతను తన కెరీర్ తొలి అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే ఆ వెంటనే కమిన్స్ బౌలింగ్‌లోనే గిల్ ఇన్నింగ్స్ ముగిసింది. ఇద్దరూ ఓపిగ్గా... శుభారంభం తర్వాత 15 పరుగుల వ్యవధిలో 2 వికెట్లు కోల్పోవడంతో భారత్ ఆత్మ రక్షణలో పడింది. మరో వికెట్ చేజార్చుకుంటే జట్టు ఇబ్బందుల్లో పడే అవకాశం ఉండటంతో పుజారా, రహానే చాలా జాగ్రత్తగా ఆడారు. పరుగులు తీయడంకంటే వికెట్ కాపాడుకోవడానికే ప్రాధాన్యమిచ్చారు. ఫలితంగా 12.5 ఓవర్లలో వీరిద్దరు 11 పరుగులు మాత్రమే జోడించగలిగారు! ఆసీస్ బౌలర్లు కూడా చక్కటి లైన్ అండ్ లెంగ్త్‌ను కొనసాగిస్తూ ఎక్కడా ఎలాంటి అవకాశం ఇవ్వకపోవడం కూడా దీనికి కారణం. స్మిత్ సూపర్...! ‘స్టీవ్ స్మిత్‌కు నేను కోచింగ్ ఇవ్వడం ఏమిటి... తనకు తానే అతను కోచింగ్ ఇచ్చుకుంటాడు. అదే అన్నింటికంటే బాగా పని చేస్తుంది చూడండి’... సిడ్నీ టెస్టు ఆరంభానికి ముందు ఆస్ట్రేలియా కోచ్ జస్టిన్ లాంగర్ చేసిన వ్యాఖ్య ఇది. నిజానికి స్మిత్ గొప్పతనం గురించి కొత్తగా చెప్పాల్సిందేమీ లేదు. అతను సాధించిన పరుగులు, రికార్డులు దానిని చూపిస్తాయి. అయితే తొలి రెండు టెస్టుల్లో ఘోర వైఫల్యంతో ఒక్కసారిగా అతనిపై విమర్శలు మొదలయ్యాయి. ముఖ్యంగా అశ్విన్ బౌలింగ్‌లో అతను అవుటైన తీరు ఆశ్చర్యం కలిగించింది. అయితే గొప్ప ఆటగాళ్లు తమ తప్పులు సరిదిద్దుకోవడానికి ఎక్కువ సమయం తీసుకోరని స్మిత్ తన ఇన్నింగ్స్‌తో నిరూపించాడు. మొదటి రోజున ఆత్మవిశ్వాసంతో ఆడి 31 పరుగులతో ముగించిన అతను... శుక్రవారం బుమ్రా బౌలింగ్‌లో చూడచక్కటి కవర్ డ్రైవ్ బౌండరీతో మొదలు పెట్టాడు. ఆకట్టుకునే డ్రైవ్‌లు, తనదైన ట్రేడ్‌మార్క్ ఫ్లిక్ షాట్లతో చకచకా దూసుకుపోయాడు. భారత్ కొత్త బంతి తీసుకునే సమయానికి 142 బంతులు ఎదుర్కొన్న స్మిత్ 7 బంతులను మాత్రమే అవీ ఆఫ్ స్టంప్‌కు దూరంగా వెళుతున్న వాటినే వదిలేశాడంటే అతను ఎంత సాధికారికంగా ఆడాడో చెప్పవచ్చు. సైనీ బౌలింగ్‌లో స్క్వేర్ లెగ్ దిశగా ఆడి మూడు పరుగులు తీయడంతో 201 బంతుల్లో అతని సెంచరీ పూర్తయింది. ఈ మాజీ కెప్టెన్ కెరీర్లో ఇది 27వ శతకం కాగా, భారత్‌పై ఎనిమిదోది. సెంచరీ మార్క్ చేరగానే అతను భావోద్వేగాలు దాచుకోలేకపోయాడు. గాల్లోకి బ్యాట్‌కు పంచ్‌లు విసురుతూ సింహనాదం చేయడం చూస్తే అతని దృష్టిలో ఈ ఇన్నింగ్స్ విలువేమిటో అర్థమవుతుంది. సెంచరీ తర్వాతా స్మిత్ జోరు చూస్తే అతడిని అవుట్ చేయడం ఇక ఏ భారత బౌలర్ వల్ల కాదనిపించింది. చివరకు అదే జరిగినట్లు రనౌట్‌తో మాత్రమే అతను వెనుదిరగాల్సి వచ్చింది. ఆస్ట్రేలియా నాలుగో వికెట్ కోల్పోయిన తర్వాత 106 పరుగులు చేస్తే అందులో స్మిత్ చేసినవే 71 పరుగులు ఉండటం విశేషం. స్కోరు వివరాలు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: పకోవ్‌స్కీ (ఎల్బీ) (బి) సైనీ 62; వార్నర్ (సి) పుజారా (బి) సిరాజ్ 5; లబ్‌షేన్ (సి) రహానే (బి) జడేజా 91; స్మిత్ (రనౌట్) 131; వేడ్ (సి) బుమ్రా (బి) జడేజా 13; గ్రీన్ (ఎల్బీ) (బి) బుమ్రా 0; పైన్ (బి) బుమ్రా 1; కమిన్స్ (బి) జడేజా 0; స్టార్క్ (సి) గిల్ (బి) సైనీ 24; లయన్ (ఎల్బీ) (బి) జడేజా 0; హాజల్‌వుడ్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (105.4 ఓవర్లలో ఆలౌట్) 338 వికెట్ల పతనం: 1–6, 2–106, 3–206, 4–232, 5–249, 6–255, 7–278, 8–310, 9–315, 10–338. బౌలింగ్: బుమ్రా 25.4–7–66–2, సిరాజ్ 25–4–67–1, అశ్విన్ 24–1–74–0, సైనీ 13–0–65–2, జడేజా 18–3–62–4. భారత్ తొలి ఇన్నింగ్స్: రోహిత్ (సి అండ్ బి) హాజల్‌వుడ్ 26; గిల్ (సి) గ్రీన్ (బి) కమిన్స్ 50; పుజారా (బ్యాటింగ్) 9; రహానే (బ్యాటింగ్) 5; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (45 ఓవర్లలో 2 వికెట్లకు) 96 వికెట్ల పతనం: 1–70, 2–85. బౌలింగ్: స్టార్క్ 7–4–19–0, హాజల్‌వుడ్ 10–5–23–1, కమిన్స్ 12–6–19–1, లయన్ 16–7–35–0 -
భారీ లక్ష్యాన్ని ఈదుతుందా..!
భారత్-బంగ్లాదేశ్ ల మధ్య హైదరాబాద్‌లో జరగుతున్న ఏకైక టెస్టు రెండో రోజు ఆట ముగిసింది. తొలి ఇన్నింగ్స్‌ను 687/6 వద్ద భారత్ డిక్లేర్ చేసింది. ఆ తర్వాత బరిలోకి దిగిన బంగ్లాదేశ్ 38 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ సౌమ్య సర్కార్(15) తక్కువ పరుగులకే వెనుదిరిగాడు. ప్రస్తుతం మొమినుల్ హక్(1) నాటౌట్, తమీమ్ ఇక్బాల్(24) నాటౌట్లు క్రీజులో కొనసాగుతున్నారు. భారత బౌలర్లలో ఉమేశ్ యాదవ్ కు ఒక వికెట్ దక్కింది. రెండో రోజు కేవలం 11 ఓవర్లను మాత్రమే ఎదుర్కొన్న బంగ్లా బ్యాట్స్ మన్లు కాస్త ఇబ్బంది పడినట్లే కనిపించారు. మరి బంగ్లాదేశ్ భారత్ నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకుంటుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ.