భారీ లక్ష్యాన్ని ఈదుతుందా..!
భారత్-బంగ్లాదేశ్ ల మధ్య హైదరాబాద్‌లో జరగుతున్న ఏకైక టెస్టు రెండో రోజు ఆట ముగిసింది. తొలి ఇన్నింగ్స్‌ను 687/6 వద్ద భారత్ డిక్లేర్ చేసింది. ఆ తర్వాత బరిలోకి దిగిన బంగ్లాదేశ్ 38 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ సౌమ్య సర్కార్(15) తక్కువ పరుగులకే వెనుదిరిగాడు. ప్రస్తుతం మొమినుల్ హక్(1) నాటౌట్, తమీమ్ ఇక్బాల్(24) నాటౌట్‌లు క్రీజులో కొనసాగుతున్నారు. భారత బౌలర్లలో ఉమేశ్ యాదవ్ కు ఒక వికెట్ దక్కింది.
రెండో రోజు కేవలం 11 ఓవర్లను మాత్రమే ఎదుర్కొన్న బంగ్లా బ్యాట్స్ మన్లు కాస్త ఇబ్బంది పడినట్లే కనిపించారు. మరి బంగ్లాదేశ్ భారత్ నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకుంటుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ.