తొలి టెస్టులో భారత్ ఘనవిజయం
రవిచంద్రన్ అశ్విన్‌కు 6 వికెట్లు
బంగ్లాదేశ్ 234 ఆలౌట్
27 నుంచి కాన్పూర్‌లో రెండో టెస్టు
సొంతగడ్డపై రవిచంద్రన్ అశ్విన్ అటు బ్యాట్‌తో, ఇటు బంతితో విజృంభించిన వేళ... బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ భారీ విజయం సాధించింది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌కు చేరడమే లక్ష్యంగా సాగుతున్న రోహిత్ బృందం ముందు బంగ్లాదేశ్ చేతులెత్తేసింది.
కొండంత లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో అందులో సగం పరుగులైనా చేయకముందే ఆలౌటైంది. ఈ విజయంతో భారత టెస్టు క్రికెట్ చరిత్రలో తొలిసారి గెలుపోటముల నిష్పత్తిలో పరాజయాల కన్నా ఎక్కువ విజయాలు నమోదు చేసుకుంది.
చెన్నై: సమష్టి ప్రదర్శనతో సత్తా చాటిన భారత జట్టు బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో 280 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో 1–0తో ముందంజ వేసింది. భారత్ నిర్దేశించిన 515 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఓవర్‌నైట్ స్కోరు 158/4తో ఆదివారం నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన బంగ్లాదేశ్ చివరకు 62.1 ఓవర్లలో 234 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ నజ్ముల్ హసన్ (127 బంతుల్లో 82; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) ఒంటరి పోరాటం చేయగా... మిగిలిన వాళ్లు విఫలమయ్యారు.
ఐదో వికెట్‌కు షకీబ్ అల్ హసన్ (25)తో కలిసి నజు్మల్ 48 పరుగులు జోడించాడు. ఈ దశలో అశ్విన్ బంతి అందుకోవడంతో పరిస్థితి తలకిందులైంది. ‘లోకల్ బాయ్’ చక్కటి బంతితో షకీబ్‌ను ఔట్ చేయగా... లిటన్ దాస్ (1)ను జడేజా బుట్టలో వేసుకున్నాడు. మిరాజ్ (8) విఫలమయ్యాడు. భారత బౌలర్లలో ఆఫ్‌స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 6 వికెట్లు పడగొట్టగా... రవీంద్ర జడేజా 3 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. చేతిలో ఆరు వికెట్లతో నాలుగో రోజు ఆట కొనసాగించిన బంగ్లాదేశ్ లంచ్ విరామానికి ముందే ఆలౌటైంది.
ఈ ఆరు వికెట్లలో అశ్విన్ , జడేజా చెరో 3 పంచుకున్నారు. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేయడంతో పాటు రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు తీసిన అశ్విన్ కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య శుక్రవారం నుంచి కాన్పూర్‌లో రెండో టెస్టు ప్రారంభం కానుంది.
స్కోరు వివరాలు
భారత్ తొలి ఇన్నింగ్స్: 376; బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్: 149;
భారత్ రెండో ఇన్నింగ్స్: 287/4 డిక్లేర్డ్; బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్: జాకీర్ (సి) యశస్వి (బి) బుమ్రా 33; షాద్‌మన్ (సి) గిల్ (బి) అశ్విన్ 35; నజు్మల్ (సి) బుమ్రా (బి) జడేజా 82; మోమినుల్ హక్ (బి) అశ్విన్ 13; ముషి్ఫకర్ (సి) రాహుల్ (బి) అశ్విన్ 13; షకీబ్ (సి) యశస్వి (బి) అశ్విన్ 25; లిటన్ దాస్ (సి) రోహిత్ (బి) జడేజా 1; మిరాజ్ (సి) జడేజా (బి) అశ్విన్ 8; తస్కీన్ (సి) సిరాజ్ (బి) అశ్విన్ 5; హసన్ మహమూద్ (బి) జడేజా 7; నాహిద్ రాణా (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (62.1 ఓవర్లలో ఆలౌట్) 234. వికెట్ల పతనం: 1–62, 2–86, 3–124, 4–146, 5–194, 6–205, 7–222, 8–222, 9–228, 10–234.
బౌలింగ్: బుమ్రా 10–2–24–1; సిరాజ్ 10–5–32–0; ఆకాశ్‌దీప్ 6–0–20–0; అశ్విన్ 21–0–88–6; జడేజా 15.1–2–58–3.
Comments
Please login to add a commentAdd a comment