బంగ్లాదేశ్‌తో తొలి టెస్టుకు భారత జట్టు ప్రకటన
పేస్ బౌలర్ యశ్ దయాల్‌కు తొలిసారి చోటు
ముంబై: వికెట్ కీపర్ రిషభ్ పంత్ భారత టెస్టు జట్టులోకి తిరిగొచ్చాడు. 2022 డిసెంబర్‌లో రోడ్డు ప్రమాదానికి గురైన పంత్ 20 నెలల తర్వాత టెస్టు ఫార్మాట్‌లో బరిలోకి దిగనున్నాడు. ప్రస్తుతం దులీప్ ట్రోఫీలో భారత్ ‘బి’ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న పంత్ రెండు ఇన్నింగ్స్‌ల్లో వరుసగా 7, 61 పరుగులు చేశాడు. ఈ నెల 19 నుంచి చెన్నైలో బంగ్లాదేశ్‌తో జరగనున్న తొలి టెస్టు కోసం బీసీసీఐ సెలెక్షన్ కమిటీ ఆదివారం రాత్రి 16 మందితో కూడిన జట్టును ప్రకటించింది.
ఈ ఏడాది ఆరంభంలో స్వదేశంలో ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు వ్యక్తిగత కారణాలతో దూరమైన విరాట్ కోహ్లి తిరిగి రాగా... ఉత్తర ప్రదేశ్ పేస్ బౌలర్ యశ్ దయాల్ తొలిసారి జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. సీనియర్ పేసర్ షమీ శస్త్రచికిత్స అనంతరం పూర్తిగా కోలుకోకపోవడంతో... సెలెక్టర్లు యశ్ దయాల్‌కు అవకాశం కలి్పంచారు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో 24 మ్యాచ్‌లాడిన యశ్ దయాల్ 76 వికెట్లు పడగొట్టాడు. టి20 ప్రపంచకప్ గెలిచినప్పటి నుంచి కెప్టెన్ రోహిత్ శర్మ, కోహ్లి, బుమ్రా విశ్రాంతి తీసుకుంటుండగా... ఇతర ఆటగాళ్లు దులీప్ ట్రోఫీ ఆడుతున్నారు. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ సందర్భంగా గాయపడి జట్టుకు దూరమైన కేఎల్ రాహుల్ కూడా పునరాగమనం చేశాడు.
తొలి టెస్టుకు భారత జట్టు: రోహిత్ శర్మ (కెపె్టన్), యశస్వి జైస్వాల్, శుబ్‌మన్ గిల్, కోహ్లి, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషభ్ పంత్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశి్వన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, ఆకాశ్‌దీప్, జస్‌ప్రీత్ బుమ్రా, యశ్ దయాల్.
Comments
Please login to add a commentAdd a comment