Selection Committee
-
బంగ్లాతో టెస్టు సిరీస్.. భారత జట్టు ప్రకటన! పంత్ రీ ఎంట్రీ
ముంబై: వికెట్ కీపర్ రిషభ్ పంత్ భారత టెస్టు జట్టులోకి తిరిగొచ్చాడు. 2022 డిసెంబర్లో రోడ్డు ప్రమాదానికి గురైన పంత్ 20 నెలల తర్వాత టెస్టు ఫార్మాట్లో బరిలోకి దిగనున్నాడు. ప్రస్తుతం దులీప్ ట్రోఫీలో భారత్ ‘బి’ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న పంత్ రెండు ఇన్నింగ్స్‌ల్లో వరుసగా 7, 61 పరుగులు చేశాడు. ఈ నెల 19 నుంచి చెన్నైలో బంగ్లాదేశ్‌తో జరగనున్న తొలి టెస్టు కోసం బీసీసీఐ సెలెక్షన్ కమిటీ ఆదివారం రాత్రి 16 మందితో కూడిన జట్టును ప్రకటించింది. ఈ ఏడాది ఆరంభంలో స్వదేశంలో ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు వ్యక్తిగత కారణాలతో దూరమైన విరాట్ కోహ్లి తిరిగి రాగా... ఉత్తర ప్రదేశ్ పేస్ బౌలర్ యశ్ దయాల్ తొలిసారి జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. సీనియర్ పేసర్ షమీ శస్త్రచికిత్స అనంతరం పూర్తిగా కోలుకోకపోవడంతో... సెలెక్టర్లు యశ్ దయాల్‌కు అవకాశం కలి్పంచారు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో 24 మ్యాచ్‌లాడిన యశ్ దయాల్ 76 వికెట్లు పడగొట్టాడు. టి20 ప్రపంచకప్ గెలిచినప్పటి నుంచి కెప్టెన్ రోహిత్ శర్మ, కోహ్లి, బుమ్రా విశ్రాంతి తీసుకుంటుండగా... ఇతర ఆటగాళ్లు దులీప్ ట్రోఫీ ఆడుతున్నారు. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ సందర్భంగా గాయపడి జట్టుకు దూరమైన కేఎల్ రాహుల్ కూడా పునరాగమనం చేశాడు. తొలి టెస్టుకు భారత జట్టు: రోహిత్ శర్మ (కెపె్టన్), యశస్వి జైస్వాల్, శుబ్‌మన్ గిల్, కోహ్లి, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషభ్ పంత్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశి్వన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, ఆకాశ్‌దీప్, జస్ప్రీత్ బుమ్రా, యశ్ దయాల్. -
సెలెక్షన్ కమిటీ సభ్యుడిగా అజయ్ రాత్రా
భారత పురుషుల క్రికెట్ జట్టు సెలెక్షన్ కమిటీ సభ్యుడిగా టీమిండియా మాజీ వికెట్‌కీపర్, బ్యాటర్ అజయ్ రాత్రా ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని బీసీసీఐ క్రికెట్ అడ్వైజరీ కమిటీ (సీఏసీ) మంగళవారం (సెప్టెంబర్ 3) ప్రకటించింది. మాజీ సభ్యుడు సలీల్ అంకోలా స్థానాన్ని రాత్రా భర్తీ చేస్తాడు. టీమిండియా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, అంకోలా ఇద్దరూ ఒకే జోన్‌కు (వెస్ట్) చెందిన వారు కావడంతో అంకోలా సెలెక్షన్ కమిటీ నుంచి వైదొలగాల్సి వచ్చింది. రాత్రా నార్త్ జోన్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ప్రస్తుతం సెలెక్షన్ కమిటీలో శివ్ సుందర్ దాస్, సుబ్రతో బెనర్జీ, శ్రీథరన్ శరత్ సభ్యులుగా ఉన్నారు. తాజాగా రాత్రా వీరి సరసన చేరాడు. 2002లో టీమిండియా తరఫున 6 టెస్ట్‌లు, 12 వన్డేలు ఆడిన రాత్రా దేశవాలీ క్రికెట్లో అసోం, పంజాబ్, ఉత్తర్‌ప్రదేశ్ హెడ్ కోచ్‌గా పని చేశాడు. అతను 2023 దక్షిణాఫ్రికా పర్యటనలో టీమిండియా సపోర్టింగ్ స్టాఫ్‌లో సభ్యుడిగా ఉన్నాడు. అజయ్ రాత్రా టెస్ట్‌ల్లో టీమిండియా తరఫున ఓ సెంచరీ చేశాడు. -
BCCI: బీసీసీఐ సెలక్టర్‌పై వేటు? కారణం అదే! ప్రకటన విడుదల
BCCI Men's Senior Selection Committee: భారత క్రికెట్ నియంత్రణ మండలి మెన్స్ సీనియర్ సెలక్షన్ కమిటీలోని ఓ సభ్యుడిపై వేటు పడింది. అతడి స్థానంలో కొత్త మెంబర్‌ను నియమించేందుకు బోర్డు దరఖాస్తులు ఆహ్వానించింది. కాగా టీ20 ప్రపంచకప్-2022 సెమీస్‌లోనే టీమిండియా వైఫల్యం నేపథ్యంలో బీసీసీఐ చేతన్ శర్మ సారథ్యంలోని సెలక్షన్ కమిటీని రద్దు చేసిన విషయం తెలిసిందే. అతడిపై వేటు అయితే, అనేక చర్చల అనంతరం మళ్లీ చేతన్ శర్మనే చీఫ్ సెలక్టర్‌గా నియమించిన బోర్డు.. సలీల్ అంకోలా, సుబ్రతో బెనర్జీ, శివ్ సుందర్ దాస్, ఎస్.శరత్‌లకు కమిటీలో సభ్యులుగా చోటిచ్చింది. అయితే, ఓ వార్తా సంస్థ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్‌లో చేతన్ శర్మ భారత క్రికెటర్ల గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో అతడిపై వేటు వేసింది బీసీసీఐ. చాలాకాలం పాటు చీఫ్ సెలక్టర్ పోస్టు ఖాళీగా ఉన్న తరుణంలో టీమిండియా మాజీ బౌలర్ అజిత్ అగార్కర్ ఆ పదవిని చేపట్టేలా బోర్డు పెద్దలు చేసిన ప్రయత్నాలు ఫలించాయి. ప్రస్తుతం అగార్కర్ నాయకత్వంలో సెలక్షన్ కమిటీ పనిచేస్తోంది. త్యాగం చేయాల్సి వస్తోంది అయితే, ఇందులో భాగమైన సలీల్ అంకోలా తన పదవిని త్యాగం చేయాల్సి వస్తోంది. బీసీసీఐ రాజ్యాంగం ప్రకారం.. సెలక్షన్ కమిటీలో చీఫ్ సెలక్టర్ సహా నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్, సెంట్రల్ జోన్ల నుంచి ఒక్కో సభ్యుడు ఉండాలి. ప్రస్తుతం ఉన్న కమిటీలో అగార్కర్, సలీల్ వెస్ట్ నుంచి ప్రాతినిథ్యం వహిస్తుండగా.. శివ సుందర్ ఈస్ట్, శరత్ సౌత్, సుబ్రతో బెనర్జీ సెంట్రల్ జోన్ నుంచి ఎంపికయ్యారు. ఈ నేపథ్యంలో నిబంధనల ప్రకారం.. అగార్కర్‌ను కొనసాగించేందుకు నిర్ణయించిన బీసీసీఐ వెస్ట్ నుంచి అదనపు సభ్యుడిగా ఉన్న సలీల్ అంకోలాను తప్పించాలనుకుంటున్నట్లు సమాచారం. ఈ క్రమంలో కొత్త మెంబర్ నియామకం కోసం దరఖాస్తులు ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి సోమవారం ప్రకటన విడుదల చేసినట్లు జాతీయ మీడియా పేర్కొంది. సెలక్షన్ కమిటీ మెంబర్ కావాలంటే అర్హతలు ఏడు టెస్టులు లేదంటే 30 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఉండాలి. 10 అంతర్జాతీయ వన్డేలు లేదంటే 20 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడి ఉండాలి. అదే విధంగా ఆట నుంచి రిటైర్ అయ్యి ఐదేళ్లు పూర్తై ఉండాలి. అదే విధంగా.. గత ఐదేళ్లకాలంలో ఏ క్రికెట్ కమిటీలోనూ సభ్యుడిగా ఉండకూడదు. కాగా బీసీసీఐ తాజా ప్రకటన ప్రకారం సెలక్టర్ పదవి కోసం దరఖాస్తు చేయాలనుకునే వారు జనవరి 25, సాయంత్రం ఆరు లోగా తమ అప్లికేషన్ సమర్పించాలి. -
వాళ్ల గురించి ఫిర్యాదు చేయను.. ఒత్తిళ్ల కారణంగా: సంజూ
తన ప్రయాణంలో ఎదురయ్యే సవాళ్లను ఎలా ఎదుర్కోవాలన్న విషయాల మీద మాత్రమే తాను దృష్టి పెడతానని టీమిండియా బ్యాటర్ సంజూ శాంసన్ అన్నాడు. అంతేతప్ప తనకు తగిలిన ఎదురుదెబ్బల గురించి ఆలోచిస్తూ.. అందుకు కారణమైన వాళ్ల గురించి ఫిర్యాదులు చేస్తూ ఉండిపోనని స్పష్టం చేశాడు. కాగా వన్డే ఫార్మాట్లో సూర్యకుమార్ యాదవ్‌తో పోలిస్తే మెరుగైన రికార్డే ఉన్నప్పటికీ సంజూకు వన్డే వరల్డ్‌కప్-2023 జట్టులో చోటు దక్కలేదు. అంతకు ముందు కీలక సిరీస్‌లలోనూ ఆడే అవకాశం రాలేదు. ఈ నేపథ్యంలో సంజూ శాంసన్‌కు అన్యాయం జరుగుతోందంటూ బీసీసీఐపై ఇప్పటికే అనేకసార్లు తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో సౌతాఫ్రికా పర్యటనలో భాగంగా వన్డే సిరీస్ ఆడే జట్టుకు ఎంపికయ్యాడు ఈ కేరళ బ్యాటర్. వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరించిన మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో సంజూ కేవలం బ్యాటర్‌గానే బరిలోకి దిగాడు. అయితే, మొదటి రెండు వన్డేల్లో ప్రభావం చూపలేకపోయిన సంజూ శాంసన్.. నిర్ణయాత్మక మూడో మ్యాచ్‌లో సెంచరీ చేసి జట్టును గెలిపించాడు. తద్వారా సిరీస్ టీమిండియా సొంతమైంది. ఇక ఎనిమిదేళ్ల కెరీర్లో సంజూకు ఇదే తొలి శతకం కావడం విశేషం. ఈ నేపథ్యంలో బీసీసీఐ టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సంజూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘టీమిండియా క్రికెటర్‌గా.. మీడియా ఒత్తిడి, మైదానం లోపల.. వెలుపలా ఎన్నో సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో నన్ను నేను కోల్పోకుండా ఉండటమే ముఖ్యం. నా మనసును ఎలా నియంత్రించుకోవాలన్న విషయం మీదే దృష్టి పెడతాను. బయట చాలా మంది చాలా రకాలుగా అనుకోవచ్చు. కానీ.. నేను మాత్రం ఎల్లప్పుడూ నన్ను నేను మరింత మెరుగుపరచుకోవడానికే ఎక్కువ సమయం కేటాయిస్తాను. నా లోటుపాట్లు సరిదిద్దుకోవడం, వైఫల్యాలను అధిగమించడంపై ఫోకస్ చేస్తా. అంతేకానీ.. నేను మిస్సైన ఈవెంట్ల గురించి ప్రస్తావిస్తూ.. అందుకు కారణమైన వారి గురించి ఫిర్యాదులు చేస్తూ కూర్చోను. నా నైపుణ్యాలకు ఎలా సానపెట్టాలి? నేను ఓపికగా ఉండగలుగుతున్నానా? స్థాయికి తగ్గట్లు ఆడుతున్నానా? అన్న విషయాల గురించే ఆలోచిస్తా. విజయ్ హజారే ట్రోఫీలో కేరళ సారథిగా నేను ఎంతో కఠిన శ్రమకోర్చాను. ఆలోచనలను నియంత్రించుకుంటూ ఒత్తిడికి లోనుకాకుండా ప్రణాళికలను అమలు చేశాను’’ అని సంజూ శాంసన్ చెప్పుకొచ్చాడు. కాగా దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ-2023లో సంజూ ఎనిమిది మ్యాచ్‌లు ఆడి 293 పరుగులు చేశాడు. ఈ క్రమంలో సౌతాఫ్రికా టూర్‌కు ఎంపికయ్యాడు. చదవండి: టీమిండియాకు ఊహించని షాక్.. సూర్యకుమార్ గాయం తీవ్రం! నెలల పాటు.. -
గాంధీ శాంతి పురస్కార గ్రహీత ఎంపిక కమిటీ సభ్యుడిగా వెంకయ్య
సాక్షి, న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక గాంధీ శాంతి పురస్కార గ్రహీత ఎంపిక కమిటీ సభ్యుడిగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర సాంస్కృతిక శాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. తన నియామకం పట్ల ప్రధాని మోదీకి వెంకయ్య కృతజ్ఞతలు తెలిపారు. 1995లో ఏర్పాటు చేసిన ఈ కమిటీలో ప్రధాని మోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, లోక్‌సభ సభాపతి, లోక్‌సభలో విపక్షనేత, ఇద్దరు ప్రముఖ వ్యక్తులు సభ్యులుగా ఉంటారు. అహింసాయుత పద్ధతుల్లో సామాజిక, ఆర్థిక, రాజకీయ పరివర్తన తీసుకురావడంలో కీలక పాత్ర పోషించే వ్యక్తులు, సంస్థలకు ఏటా గాంధీ శాంతి పురస్కారాన్ని ప్రదానం చేస్తారు. గ్రహీతలకు రూ. కోటి నగదు, ప్రశంసాపత్రం అందజేస్తారు. -
తిలక్ వర్మ... పేరు గుర్తుంచుకోండి!
తిలక్ పేరులో ‘లక్’ ఉంది. ఈ ‘లక్’ చోటు వచ్చేందుకు పనికొస్తుందేమో కానీ... రాణించేందుకు ఏమాత్రం ఉపయోగపడదు. శక్తి, సామర్థ్యాలతో పాటు టెక్నిక్, వచి్చన అవకాశాన్ని సది్వనియోగం చేసుకోవాలన్న పట్టుదల, పాతుకుపోవాలన్న సంకల్పమే ఏ ఆటగాడినైనా నిలబెడతాయి. ఎడంచేతి వాటం బ్యాటర్ తిలక్ వర్మ కూడా అదే చేశాడు. కష్టపడే జట్టులోకి వచ్చాడు. వచ్చాక ప్రత్యర్థి బౌలర్ల భరతం పడుతున్నాడు. బ్యాటింగ్‌లో ఈ నిలకడే భారత టీమ్ మేనేజ్మెంట్ కంట నాలుగో స్థానంపై ఆశాకిరణమయ్యేలా చేస్తోంది. ఠాకూర్ తిలక్ వర్మ ఐపీఎల్లో దంచేస్తుంటే అందరికి తెలిసొచి్చంది. కానీ హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) డివిజన్ లీగ్ క్రికెట్లోనే అతను వార్తల్లో వ్యక్తి అని చాలా మందికి తెలియదు. మూడు రోజుల ఆటలో జట్టును అర్ధ సెంచరీలతో ఆదుకున్నాడు. సెంచరీలతో గెలిపించాడు. ఐపీఎల్ వేలంలోకి వచ్చాక లీగ్‌లో మనోడున్నాడు అనిపించాడు. నిలకడైన ఆటతో మెల్లిగా ముంబై ఇండియన్స్ జట్టు మొనగాడయ్యాడు. ఇప్పుడు కరీబియన్‌కు తీసుకెళ్తే భారత ఆశాకిరణమయ్యాడు. అలా ఒక్కో మెట్టెక్కుతూ... కింది నుంచే పైకొచ్చాడు. గతేడాది ఐపీఎల్లో అరంగేట్రం చేసిన తిలక్ ఆ సీజన్లో ముంబైని మురిపించాడు. షాట్ల ఎంపిక, బంతిని పంపిన ప్లేసింగ్ తీరు, ధాటిగా ఆడే నైపుణ్యం ఇవన్నీ గమనించిన ముంబై యాజమాన్యం అతనికి విరివిగా అవకాశాలిచి్చంది. అన్ని మ్యాచ్‌ల్లో బరిలోకి దింపింది. దాంతో 131.02 స్ట్రయిక్‌రేట్‌తో 397 పరుగులు చేశాడు. 36.09 సగటు నమోదు చేశాడు. ఈ సీజన్లోనూ 11 మ్యాచ్‌ల్లో ఆడిస్తే 164.11 స్ట్రయిక్ రేట్‌తో 343 పరుగులు చేశాడు. సగటేమో 42.87! అంటే ఈ రెండేళ్లలో సగటు, స్ట్రయిక్‌రేట్ రెండు పెంచుకున్నాడు. జట్టు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టాడు. ఈ గణాంకాలతోనే తిలక్ వర్మ అదరగొట్టాడనుకుంటే పొరబడినట్లే! ఎందుకంటే ముంబై కష్టాల్లో ఉంటే ఆటగాళ్లపై ఒత్తిడి పెరిగితే... అతను మాత్రం యథేచ్ఛగా ఆడిన తీరే అందరిమెప్పు పొందేలా చేసింది. క్రికెట్ విశ్లేషకులు, ప్రముఖ టీవీ వ్యాఖ్యా తలే కాదు... దిగ్గజ క్రికెటర్లు సైతం తిలక్ వర్మ ఆటకు, ఆడిన తీరుకు ముచ్చటపడ్డారు. ప్రశంసలు కురిపించారు. విండీస్‌లో సిక్సర్లతో... అతని ప్రతిభను బీసీసీఐ సీనియర్ సెలక్షన్ కమిటీ కూడా గుర్తించి కరీబియన్ పర్యటనకు పంపింది. కేవలం టి20ల్లో మాత్రమే అవకాశమిచ్చింది. అంతర్జాతీయ క్రికెట్లో అరుదుగా లభించిన ఈ సదవకాశాన్ని హైదరాబాదీ లెఫ్ట్ హ్యాండర్ వదులుకోలేదు. కోచ్ రాహుల్ ద్రవిడ్, కెపె్టన్ హార్దిక్ పాండ్యాల గేమ్ ప్లాన్‌లో భాగమైన తిలక్... విండీస్ తురుపుముక్కలైన సీమర్లను సునాయాసంగా ఎదుర్కొన్నాడు. ఎదుర్కొన్న తొలి బంతికి పరుగు తీయలేకపోయాడు... కానీ అంతర్జాతీయ పరుగుల ప్రయాణాన్ని మాత్రం సిక్సర్లతో ప్రారంభించాడు. తొలి రెండు టి20ల్లో 39 పరుగులు, 51 పరుగులు అతనిదే టాప్ స్కోర్! తర్వాత మూడు మ్యాచ్‌ల్లో 49 నాటౌట్, 7 నాటౌట్, 27 పరుగులు... ఇలా ప్రతి మ్యాచ్‌లోనూ బాధ్యత కనబరిచాడు. ఓవరాల్‌గా 173 పరుగులతో ఈ సిరీస్‌లో భారత టాప్ స్కోరర్‌గా అవతరించాడు. అందుకే భారత కెపె్టన్ రోహిత్ ఓ ఇంటర్యూలో హైదరాబాదీ ఆటగాడిని ప్రత్యేకంగా ప్రస్తావించాడు, ప్రశంసించాడు. ఆసియా కప్, ప్రపంచకప్‌లపై... యువరాజ్ సింగ్ రిటైర్మెంట్ తర్వాత బదులు తోచని ప్రశ్నగా మిగిలిపోయిన నాలుగో స్థానం ఇప్పుడు తిలక్‌ను ఊరిస్తోంది. ఆసియా కప్‌లో సెలక్టర్లు మాత్రం అతన్ని కొనసాగించే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. ఇక అక్కడ కూడా మ్యాచ్ మ్యాచ్‌కు ఇలాంటి నిలకడ, ధాటైన జోరు కొనసాగిస్తే మాత్రం స్వదేశంలో జరిగే వన్డే ప్రపంచకప్ కోసం అతని పేరును పరిశీలించడం, చోటివ్వడం ఖాయమవుతుందేమో చూడాలి. –సాక్షి క్రీడా విభాగం -
టీమిండియా చీఫ్ సెలక్టర్‌గా చేతన్ శర్మ.. బీసీసీఐ ప్రకటన
భారత క్రికెట్ జట్టు సీనియర్ సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా చేతన్ శర్మ మరోసారి నియమితుడయ్యాడు. ఈ విషయాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి శనివారం వెల్లడించింది. చేతన్‌తో పాటు ఈ సెలక్షన్ కమిటీలో శివ్ సుందర్ దాస్, సుబ్రతో బెనర్జీ, సలీల్ అంకోలా, శ్రీధరన్ శరత్‌కు చోటు దక్కింది. కాగా టీ20 ప్రపంచకప్-2022లో రోహిత్ సేన దారుణ వైఫల్యం నేపథ్యంలో సెలక్షన్ కమిటీని బీసీసీఐ రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో చేతన్ శర్మ చైర్మన్‌గా ఉన్న కమిటీని రద్దు చేసి ఖాళీ స్థానాల కోసం దరఖాస్తులు ఆహ్వానించింది. ఈ క్రమంలో మరోసారి చేతన్ శర్మ వైపే మొగ్గు చూపిన బీసీసీఐ పెద్దలు అతడిని అప్లై చేసుకోవాల్సిందిగా సూచించినట్లు గతంలో వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఎంఎస్ సులక్షణ నాయక్, అశోక్ మల్హోత్రా, జతిన్ పరాంజపేలతో కూడిన క్రికెట్ అడ్వైజరీ కమిటీ ఆలిండియా మెన్ సెలక్షన్ కమిటీని ఖరారు చేసింది. నవంబరు 18న 5 పోస్టుల కోసం దరఖాస్తులు కోరగా.. మొత్తం 600 మంది అప్లై చేసినట్లు పేర్కొంది. వీరిలో 11 మందిని షార్ట్‌లిస్ట్ చేసి చివరగా కావాల్సిన ఐదుగురిని ఎంపిక చేసినట్లు వెల్లడించింది. ఈ కమిటీకి చైర్మన్‌గా చేతన్ శర్మ ఉంటాడని బీసీసీఐ ప్రకటించింది. చదవండి: కొంచెం చూడరా బాబు.. బంతి వేయకముందే పిచ్ మధ్యలోకి! వీడియో వైరల్ -
రేసు నుంచి వెంకటేశ్ ప్రసాద్ అవుట్!? టీమిండియా చీఫ్ సెలక్టర్‌గా మళ్లీ అతడే!
Team India Chief Selector: టీమిండియా చీఫ్ సెలక్టర్‌గా చేతన్ శర్మ మరోసారి బాధ్యతలు చేపట్టనున్నాడా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. సెలక్షన్ కమిటీ విషయంలో ఈ మాజీ పేసర్కే భారత క్రికెట్ నియంత్రణ మండలి మరోసారి పెద్దపీట వేసినట్లు తెలుస్తోంది. కాగా 2020 డిసెంబరులో సునిల్ జోషి స్థానంలో సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా చేతన్ శర్మ నియమితుడయ్యాడు. ఈ క్రమంలో రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగిన ఈ పంజాబ్ క్రికెటర్‌కు టీ20 ప్రపంచకప్-2022 తర్వాత చేదు అనుభవం ఎదురైంది. ఆసియా కప్, వరల్డ్‌కప్ ఈవెంట్లలో టీమిండియా ఘోర వైఫల్యం నేపథ్యంలో అతడి నేతృత్వంలోని సెలక్షన్ కమిటీని రద్దు చేసింది బీసీసీఐ. ప్రక్షాళన చర్యల్లో భాగంగా కొత్త కమిటీ ఏర్పాటు చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానించింది. అయితే, జాతీయ మీడియా తాజా కథనాల ప్రకారం.. చేతన్ శర్మనే మరోసారి చీఫ్ సెలక్టర్ చేసేందుకు బీసీసీఐ పెద్దలు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా చేతన్ శర్మను దరఖాస్తు చేసుకోవాల్సిందిగా చెప్పినట్లు సమాచారం. నిబంధనలకు అనుగుణంగానే చేతన్‌తో పాటు హర్వీందర్ సింగ్ కూడా తన పదవిలో కొనసాగనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్డీటీవీ కథనం ప్రకారం.. సెలక్షన్ ప్యానెల్లో వీరితో పాటు 13 మంది పేర్లు షార్ట్‌లిస్టు అయినట్లు తెలుస్తోంది. అయితే, చీఫ్ సెలక్టర్ పదవి కోసం పోటీపడ్డ వెంకటేశ్ ప్రసాద్‌కు మాత్రం ఈ జాబితాలో చోటు దక్కలేదు. కాగా గతేడాది టీ20 ప్రపంచకప్ టోర్నీలో రోహిత్ సేన వైఫల్యం నేపథ్యంలో నవంబరులో సెలక్షన్ కమిటీని రద్దు చేశారు. సెమీస్‌లోనే భారత్ ఇంటిబాట పట్టిన తరుణంలో ఈ మేరకు సెలక్టర్లపై వేటు వేశారు. ఈ క్రమంలో ఖాళీ స్థానాల కోసం బీసీసీఐ దరఖాస్తులు ఆహ్వానించింది. ప్రెస్‌నోట్ రిలీజ్లో.. ఇందుకు గల అర్హతలను ప్రస్తావించింది. ‘‘కనీసం ఏడు టెస్టు మ్యాచ్‌లు లేదంటే, 30 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు లేదా 10 వన్డేలు, 20 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడిన వారు. అదే విధంగా ఆటకు వీడ్కోలు పలికి కనీసం ఐదేళ్లు పూర్తి చేసుకున్న వారు’’ అర్హులు అని పేర్కొంది. చదవండి: Ind Vs SL: ఆసియా చాంప్‌తో ఆషామాషీ కాదు! అర్ష్‌దీప్‌పైనే భారం! ఇషాన్, రుతు.. ఇంకా -
BCCI: ఊహాగానాలకు తెర.. జనవరిలో కొత్త సెలెక్షన్ కమిటీ
బీసీసీఐ కొత్త సెలక్షన్ కమిటీ ఏర్పాటు గురించి వస్తున్న ఊహాగానాలకు త్వరలోనే తెరపడనుంది. ఈ నెలాఖరులోగా కమిటీ పేర్లు ఖరారయ్యే అవకాశం ఉంది. వచ్చే ఏడాది జనవరిలో కొత్త సెలక్షన్ కమిటీ ఏర్పడనుందని సమాచారం. ముగ్గురు సభ్యుల క్రికెట్ సలహా మండలి కొత్త సెలక్షన్ కమిటీ సభ్యలను ఎంపిక చేయనుంది. అశోక్ మల్హోత్రా, జతిన్ పరంజపే, సులక్షణ నాయక్‌లు ముంబైలోని బీసీసీఐ ఆఫీసులో డిసెంబర్ 30వ తేదీన సమావేశం కానున్నారు. బీసీసీఐ అధికారులతో చర్చించి సెలక్షన్ కమిటీ సభ్యులకు ఇంటర్వ్యూ నిర్వహించనున్నారు. ఆ తర్వాత ఎంపికైన వాళ్ల పేర్లను ప్రకటించే అవకాశం ఉంది. వచ్చే ఏడాది వన్డే వరల్డ్ కప్‌కి భారత్ ఆతిథ్యం ఇస్తోంది. 2011 తర్వాత ఒక్క మోగా టోర్నమెంట్లో కూడా టీమిండియా విజేతగా నిలవలేదు. దీంతో వచ్చే ఏడాది స్వదేశంలో జరగనున్న వరల్డ్ కప్ ట్రోఫీపై భారత జట్టు కన్నేసింది. ఈ నేపథ్యంలో సెలక్షన్ కమిటీ ఎన్నిక ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ ఏడాది శ్రీలంకలో జరిగిన ఆసియా కప్‌లో భారత జట్టు చెత్త ప్రదర్శనతో ఇంటిదారి పట్టింది. టి20 వరల్డ్ కప్ సెమీఫైనల్లో టీమిండియా ఓటమి అనంతరం జట్టు కూర్పుపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. దాంతో చేతన్ శర్మ కమిటీని రద్దు చేయాలనే డిమాండ్లు వచ్చాయి. సెలక్షన్ కమిటీపై నవంబర్‌లో బీసీసీఐ వేటు వేసింది. ఆ వెంటనే నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ పోస్టులకు అప్లై చేసుకునేవాళ్లకు ఉండాల్సిన అర్హతలను బీసీసీఐ స్పష్టంగా నోటిఫికేషన్లో వెల్లడించింది. చదవండి: Rashid Khan: వద్దనుకున్నోడే మళ్లీ దిక్కయ్యాడు కేన్ మామ డబుల్ సెంచరీ.. కివీస్ తరపున తొలి బ్యాటర్‌గా -
IND v SL 2023: విరామం... విశ్రాంతి... వేటు..! బీసీసీఐకి ఇదేం కొత్త కాదు!
బీసీసీఐకి ఇది కొత్త కాదు... ఏదైనా సిరీస్ కోసం జట్టును దాదాపు అర్ధరాత్రి సమయంలో ప్రకటించడమే కాదు... పేర్లు మినహా ఎంపిక గురించి కనీసం ఏకవాక్య సమాచారం కూడా ఇవ్వకపోవడం రివాజుగా మారింది. ఫలానా ఆటగాడిపై వేటు వేశామనో, ఫిట్నెస్ లేదనో, లేదంటే విశ్రాంతినిచ్చామనో, లేదా ఆటగాడు కోరుకుంటే విరామం ఇచ్చామనో ఏమీ ఉండదు... తగిన కారణం లేకుండా ఆటగాళ్లు పేర్లు మాత్రం మారిపోతాయి. మరో వైపు ఉద్వాసనకు గురైన సెలక్షన్ కమిటీతోనే కొత్త జట్లను కూడా ఎంపిక చేయించడం కూడా ఆశ్చర్యం కలిగించే అంశం. ఈ నేపథ్యంలో తాజాగా శ్రీలంకతో సిరీస్‌లకు ప్రకటించిన జట్లను విశ్లేషిస్తే... వచ్చే ఏడాది స్వదేశంలోనే వన్డే ప్రపంచకప్ జరుగనున్న నేపథ్యంలో సీనియర్ సెలక్షన్ కమిటీ కీలక ఆటగాళ్లపై ఒత్తిడి తగ్గించే నిర్ణయాలే తీసుకుంది. అందువల్లే రోహిత్, కోహ్లి, రిషభ్ పంత్, బుమ్రా, రాహుల్‌లను ఎంపిక చేసే విషయంలో జాగ్రత్తలు తీసుకుంది. అందులో కొందరిని టి20లకు తీసుకుంటే... మరికొందరిని వన్డేలకు ఎంపిక చేసింది. బుమ్రాలాంటి ఆటగాడిని ప్రపంచకప్ దృష్టితో చూసి ఏ సిరీస్‌కూ ఎంపిక చేయలేదు. నిజానికి అతను ఫిట్‌గానే ఉన్నాడు. అయితే తొందరపడి వెంటనే అంతర్జాతీయ క్రికెట్ బరిలో ఇప్పుడపుడే దింపకూడదని సెలక్టర్లు భావించారు. బంగ్లాలో గాయపడిన రోహిత్ ప్రస్తుతం కోలుకున్నాడు. నెట్ ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. ఇంకో వారం, పదిరోజుల్లో అతను పూర్తి ఫిట్నెస్ సంతరించుకుంటాడు. అందువల్లే అతన్ని వన్డేలకు ఎంపిక చేశారు. మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ కోహ్లి, కేఎల్ రాహుల్ విశ్రాంతి కోరకపోయినప్పటికీ సెలక్టర్లే టి20లకు రెస్ట్ ఇచ్చి వన్డే జట్టులోకి తీసుకున్నారు. బుమ్రాను ప్రపంచకప్ దృష్టితో చూసినట్టే... రిషభ్ పంత్‌ను సొంతగడ్డపై ఆసీస్‌తో జరిగే టెస్టు సిరీస్ కోసం బ్రేక్ ఇచ్చారు. కంగరూతో సిరీస్‌లో కీలకపాత్ర పోషించగలడని భావిస్తున్న పంత్‌ను కండిషనింగ్ క్యాంపునకు పంపారు. ఈ ఏడాది అతను అన్ని ఫార్మాట్లలో కలిపి 44 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. బిజీ షెడ్యూలు నుంచి కాస్త తెరిపినివ్వాలనే ఉద్దేశంతోనే అతన్ని బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీకి పంపారు. జడేజా విషయానికి వస్తే ముందుగా అతని మ్యాచ్ ఫిట్నెస్ను పరిశీలించాకే జాతీయ జట్టులోకి తీసుకోవాలని సెలక్షన్ కమిటీ భావించింది. గత సీజన్లో పేస్ బౌలింగ్‌తో ఆకట్టుకున్న ప్రసిధ్ కృష్ణ, ఆల్‌రౌండర్ దీపక్ చహర్ గాయాల నుంచి ఇంకా వంద శాతం కోలుకోలేదు. సీనియర్ సీమర్ భువనేశ్వర్‌ను అసలు పరిశీలించలేదు. దీంతో వచ్చే ప్రపంచకప్‌లో ఆడే టీమిండియా జట్టులో భువనేశ్వర్ భాగంగా లేడని సెలక్టర్లు సంకేతాలు ఇచ్చినట్లయింది. స్పిన్నర్లలో అనుభవజ్ఞుడైన చహల్పైనే సెలక్టర్లు నమ్మకముంచారు. దీంతో రవి బిష్ణోయ్‌కి అవకాశం లేకపోయింది. స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్, హైదరాబాద్ పేసర్ సిరాజ్‌లు ఫామ్‌లోనే ఉన్నారు. వారి ఆటతీరుపై సెలక్టర్లకు అసంతృప్తి ఏమీ లేదు... కానీ పొట్టి సిరీస్‌కు మాత్రం వీళ్లిద్దరికి విశ్రాంతినిచ్చింది. భావి కెప్టెన్ అంచనాలతో... హార్దిక్ పాండ్యా నాయకత్వ సత్తా ఏంటో ఐపీఎల్లో ఒకే ఒక్క సీజన్‌తో చాటిచెప్పాడు. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ గైర్హాజరీలోనూ పగ్గాలు చేపట్టి జట్టును నడిపించాడు. ఈ నేపథ్యంలో భావి కెప్టెన్ అంచనాలున్న ఆల్‌రౌండర్ పాండ్యాకు జట్టులో ఒక రకంగా పూర్తి స్థాయి వైస్ కెప్టెన్సీతో పదోన్నతి ఇచ్చారు. టాపార్డర్‌లో ఇటీవల మంచి అవకాశాలు కల్పించినప్పటికీ పేలవమైన ఆటతీరు కనబరిచిన ధావన్‌పై సెలక్టర్లు వేటు వేశారు. ఇషాన్ కిషన్, శుబ్‌మన్ గిల్‌లాంటి ప్రతిభావంతులు నిలకడగా రాణిస్తుండటంతో ఇక ధావన్ ఆటకు తెరపడినట్లే భావించవచ్చు. -సాక్షి క్రీడా విభాగం చదవండి: సిరీస్ ఓటమిపై బీసీబీ ఆగ్రహం.. ఉన్నపళంగా రాజీనామా -
BCCI: తన గురించి వస్తున్న వార్తలను ఖండించిన మాజీ ఆల్‌రౌండర్
BCCI Selection Committee: జాతీయ సీనియర్ సెలక్షన్ కమిటీ పోస్టుకు తాను దరఖాస్తు చేసుకున్నానన్నంటూ వస్తున్న వార్తలపై టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ హేమంగ్ బదానీ స్పందించాడు. మీడియాలో తన గురించి వస్తున్న కథనాలు అవాస్తవమని కొట్టిపడేశాడు. భారత క్రికెట్ నియంత్రణ మండలి సెలక్షన్ పానెల్లో భాగం కావడం గొప్ప గౌరవమని.. అయితే తాను మాత్రం ప్రస్తుతం ఎలాంటి పోస్టుకు అప్లై చేయలేదని స్పష్టం చేశాడు. కాగా టీ20 ప్రపంచకప్-2022లోనూ టీమిండియా సెమీస్‌లోనే ఇంటిబాట పట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గత కొన్నాళ్లుగా మేజర్ ఈవెంట్లలో భారత జట్టు వైఫల్యం నేపథ్యంలో చేతన్ శర్మ నేతృత్వంలోని జాతీయ సీనియర్ సెలక్షన్ కమిటీని రద్దు చేస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. కొత్త సెలక్షన్ కమిటీ నియామకం నేపథ్యంలో దరఖాస్తులు స్వీకరించేందుకు నవంబరు 28ని చివరి తేదీగా ప్రకటించింది. ఈ క్రమంలో హేమంగ్ బదానీ కూడా అప్లై చేశారని, అంతేగాక సెలక్షన్ కమిటీ చైర్మన్ రేసులో కూడా ఉన్నాడంటూ అతడి పేరు వార్తల్లో నిలిచింది. నేనసలు అప్లై చేయలేదు ఈ విషయంపై స్పందించిన హేమంగ్ బదానీ సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చాడు. ఈ మేరకు.. ‘‘నా అభిమానులు, శ్రేయోభిలాషులు, స్నేహితులు.. మీ అందరికీ ఓ విషయంలో స్పష్టతనివ్వాలనుకుంటున్నాను. బీసీసీఐ సెలక్షన్ ప్యానెల్లో సభ్యుడిగా ఉండటం గొప్ప గౌరవం. అయితే, మీడియాలో వార్తలు వస్తున్నట్లుగా నేను సెలక్షన్ కమిటీ పోస్టుకు దరఖాస్తు చేయలేదు. అప్లై చేసుకున్న వాళ్లందరికీ ఆల్ ది బెస్ట్’’ అంటూ బుధవారం ట్వీట్ చేశాడు. కాగా తమిళనాడు ఆల్‌రౌండర్ హేమంగ్ బదానీ.. 2000- 2004 వరకు టీమిండియా తరఫున 4 టెస్టులు, 40 వన్డేలు ఆడాడు. ఇదిలా ఉంటే.. టీమిండియా మాజీ వికెట్ కీపర్ నయన్ మోంగియా, లెగ్ స్పిన్నర్ ఎల్ శివరామకృష్ణన్, సలీల్ అంకోలా తదితరులు బీసీసీఐ సీనియర్ సెలక్షన్ కమిటీ పోస్టులకు అప్లై చేసుకున్నారు. చదవండి: IND VS NZ 3rd ODI: చెత్త ఫామ్‌పై ప్రశ్న.. సహనం కోల్పోయిన పంత్ IND vs NZ: అప్పుడు రాయుడు.. ఇప్పుడు సంజూకు అన్యాయం: పాక్ మాజీ క్రికెటర్ 🙏🏽🙏🏽 pic.twitter.com/WX2I1vXRxf — Hemang Badani (@hemangkbadani) November 30, 2022 -
BCCI: అగార్కర్, లక్ష్మణ్ ఔట్.. సెలెక్షన్ కమిటీ రేసులో కొత్త పేర్లు
BCCI New Selection Committee: చేతన్ శర్మ నేతృత్వంలోని జాతీయ సెలక్షన్ కమిటీపై బీసీసీఐ ఇటీవలే వేటు వేసిన నేపథ్యంలో కొత్త ప్యానెల్ కోసం దరఖాస్తులను ఆహ్వానించిన విషయం తెలిసిందే. దరఖాస్తు స్వీకరణకు నిన్న (నవంబర్ 28) ఆఖరి తేదీ కావడంతో 100 వరకు అప్లికేషన్లు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే సెలెక్షన్ కమిటీ చైర్మన్ రేసులో ప్రముఖంగా వినిపించిన లక్ష్మన్ శివరామకృష్ణన్, అజిత్ అగార్కర్‌లు దరఖాస్తు చేసుకోలేదన్న వార్త బీసీసీఐ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రస్తుతానికి సెలెక్షన్ కమిటీకి ఆయా జోన్ల నుంచి దరఖాస్తు చేసుకున్న వారిలో హేమంగ్ బదానీ, మణిందర్ సింగ్ పేర్లు చైర్మన్ రేసులో ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఏదిఏమైనప్పటికీ ఫైనల్ రిజల్ట్ రావాలంటే, డిసెంబర్ 15 వరకు వేచి చూడాల్సిందే. ఆయా జోన్ల నుంచి దరఖాస్తు చేసుకున్న పలువురు ప్రముఖుల పేర్లు.. సౌత్ జోన్.. హేమంగ్ బదానీ కన్వల్జిత్ సింగ్ వెస్ట్ జోన్.. మణిందర్ సింగ్ నయన్ మోంగియా సలీల్ అంకోలా సమీర్ దీఘే సెంట్రల్ అండ్ నార్త్ జోన్.. అజయ్ రాత్రా గ్యాను పాండే అమయ్ ఖురాసియా అతుల్ వాసన్ నిఖిల్ చోప్రా రితేందర్ సింగ్ సోధి ఈస్ట్ జోన్.. శివ్ సుందర్ దాస్ ప్రభంజన్ మల్లిక్ ఆర్ఆర్ పరిడా శుభోమోయ్ దాస్ ఎస్ లహిరి -
BCCI: కొత్త చీఫ్ సెలక్టర్ ఎవరంటే..?
టీ20 వరల్డ్‌కప్-2022, అంతకుముందు జరిగిన పలు మెగా టోర్నీల్లో టీమిండియా వైఫల్యం చెందడంతో చేతన్ శర్మ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీపై వేటు పడిన విషయం విధితమే. ఈ కమిటీకి చైర్మన్‌గా చేతన్ శర్మ ఉండగా, హర్విందర్ సింగ్ (సెంట్రల్ జోన్), సునీల్ జోషి (సౌత్ జోన్), దేబశిష్ మొహంతి (ఈస్ట్ జోన్) సభ్యులుగా ఉన్నారు. వీరి పదవీ కాలం మరికొంత కాలం ఉన్నా.. బీసీసీఐ కమిటీని రద్దు చేసి, కొత్త సెలెక్షన్ కమిటీ నియామకం కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. దరఖాస్తు చేసుకోవడానికి నవంబర్ 28వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు గడువు విధించింది. ఈ నేపథ్యంలో కొత్తగా ఏర్పడబోయే సెలక్షన్ కమిటీలో ఎవరెవరు ఉండబోతున్నారనే అంశంపై సర్వత్రా చర్చ జరుగుతుంది. బీసీసీఐ ఉన్నత వర్గాల సమాచారం మేరకు.. సెలక్షన్ కమిటీ రేసులో ప్రముఖంగా ఇద్దరి పేర్లు వినిపిస్తున్నాయి. భారత మాజీ లెగ్ స్పిన్నర్ లక్ష్మణ్ శివరామకృష్ణన్, టీమిండియా మాజీ పేసర్ అజిత్ అగార్కర్ చీఫ్ సెలెక్టర్ పదవి కోసం పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. వీరిలో 2020లో దరఖాస్తు చేసుకున్న శివరామకృష్ణన్‌కు బీసీసీఐ బాస్ రోజర్ బిన్నీ, కార్యదర్శి జై షాల అండదండలు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో కొత్త చీఫ్ సెలెక్టర్‌గా శివరామకృష్ణన్ పేరు దాదాపుగా ఖరారైందని సమాచారం. రేసులో ఉన్న అజత్ అగార్కర్‌కు కూడా బోర్డులోని పలువురు ప్రముఖుల మద్దతు ఉండటంతో అతని అభ్యర్ధిత్వాన్ని కూడా తీసివేయడానికి వీల్లేదని బీసీసీఐ వర్గాల ద్వారా తెలుస్తోంది. సెలెక్షన్ కమిటీ సభ్యులకు ఉండాల్సిన అర్హతలు.. కనీసం 7 టెస్టు మ్యాచ్‌లు లేదా 30 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు లేదా 10 వన్డేలు, 20 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఉండాలి క్రికెట్‌కు వీడ్కోలు పలికి దాదాపు ఐదేళ్లు పూర్తి అయ్యి ఉండాలి ఐదుగురు సభ్యులకు వయసు పరిమితి 60 ఏళ్లులోపే ఉండాలి 5 సంవత్సరాల పాటు ఏదైనా క్రికెట్ కమిటీలో సభ్యుడిగా ఉన్న వ్యక్తి దరఖాస్తు చేసుకొనేందుకు అనర్హుడు -
సెలెక్షన్ కమిటీని హఠాత్తుగా తొలగించడానికి కారణాలివే..!
చేతన్ శర్మ నేతృత్వంలోని జాతీయ సెలక్షన్ కమిటీకి కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) రద్దు చేసిన నేపథ్యంలో యావత్ భారత క్రికెట్ ఒక్కసారిగా కుదుపుకు లోనైంది. భారత క్రికెట్ చరిత్రలో జాతీయ సెలక్షన్ కమిటీని ఇలా హఠాత్తుగా తొలగించిన దాఖలాలు లేకపోవడంతో సర్వత్రా ఇదే అంశంపై చర్చ జరుగుతుంది. భారత క్రికెట్లో చోటు చేసుకున్న ఈ హఠాత్పరిణామంపై అంతార్జతీయ క్రికెట్ సర్కిల్స్‌లో సైతం చర్చ జోరుగా సాగుతుంది. ఇంత ఆదరాబాదరాగా సెలెక్షన్ ప్యానెల్‌పై ఎందుకు వేటు వేయాల్సి వచ్చిందోనని నెటిజన్లు ఆరా తీసే పనిలో పడ్డారు. అయితే సెలెక్షన్ కమిటీపై వేటుకు గట్టి కారణాలే ఉన్నాయని బీసీసీఐ వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది. 2021 జనవరిలో చేతన్ శర్మ నేతృత్వంలో సునీల్ జోషి(సౌత్ జోన్), హర్విందర్ సింగ్(సెంట్రల్ జోన్), దెబాషిశ్ మొహంతి(ఈస్ట్ జోన్)లతో కూడిన జాతీయ సెలెక్షన్ కమిటీ ఎన్నికైంది. నాటి నుంచి కమిటీ తీసుకున్న నిర్ణయాలన్నీ వివాదాస్పదంగా, నాసిరకంగా ఉన్నాయని బీసీసీఐ వివరణ ఇచ్చింది. వీరి హయాంలో టీమిండియా.. 2021 టీ20 వరల్డ్‌కప్‌లో కనీసం నాకౌట్ స్టేజ్‌కు కూడా చేరలేదు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో ఓటమి ఈ ఏడాది ఆసియా కప్‌లో సూపర్-4లోనే పరాభవం తాజాగా టీ20 వరల్డ్‌కప్-2022లో సెమీస్‌లోనే నిష్క్రమణ బుమ్రా, జడేజా పూర్తి ఫిట్‌గా లేకపోయినా ఎంపిక చేయడం ఏడాదికి 8 మంది కెప్టెన్లను మార్చడం న్యూజిలాండ్, బంగ్లాదేశ్ పర్యటనలకు ఎంపిక చేసిన జట్లలో సమతూకం లోపించడం ఇలా పై పేర్కొన్న అంశాలన్నిటినీ పరిగణలోకి తీసుకున్న బీసీసీఐ చేతన్ శర్మ టీమ్‌కు ఉద్వాసన పలికినట్లు వివరణ ఇచ్చింది. ఇదిలా ఉంటే, ఇదే నెలలోనే కొత్త సెలక్షన్ కమిటీని నియమించనున్నట్లు బీసీసీఐ ప్రధాన కార్యదర్శి జై షా వెల్లడించారు. సెలక్షన్ కమిటీలోని ఐదు స్థానాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునేవారు కనీసం 7 టెస్టు మ్యాచ్‌లు, 30 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు లేదా 10 వన్డేలు లేదా 20 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడి ఉండాలని బీసీసీఐ పేర్కొంది. అలాగే, క్రికెట్‌కు కనీసం 5 ఏళ్ల క్రితం రిటైర్మెంట్ ప్రకటించి ఉండాలని స్పష్టం చేసింది. చదవండి: బీసీసీఐ షాకింగ్ ప్రకటన.. సెలక్షన్ కమిటీ రద్దు -
బీసీసీఐ షాకింగ్ ప్రకటన.. సెలక్షన్ కమిటీ రద్దు
న్యూఢిల్లీ: భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ క్రికెటర్ చేతన్ శర్మ నేతృత్వంలోని జాతీయ పురుషుల క్రికెట్ జట్టు సెలక్షన్ కమిటీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. కొత్త సెలక్టర్ల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు శుక్రవారం రాత్రి ట్విటర్ ద్వారా వెల్లడించింది. దరఖాస్తులు సమర్పించేందుకు నవంబర్ 28 సాయంత్రం 6 గంటల వరకు గడువు ఇచ్చింది. ప్రస్తుత కమిటీలో ఛైర్మన్‌గా చేతన్ శర్మ ఉండగా.. సునీల్ జోషి(సౌత్ జోన్), హర్విందర్ సింగ్(సెంట్రల్ జోన్), దెబాషిశ్ మొహంతి(ఈస్ట్ జోన్) లు ఉన్నారు. గత నెలలోనే కొత్త సెలక్షన్ కమిటీని నియమించనున్నట్లు బీసీసీఐ ప్రధాన కార్యదర్శి జైషా వెల్లడించారు. సెలక్షన్ కమిటీలోని ఐదు స్థానాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునేవారు కనీసం 7 టెస్టు మ్యాచ్‌లు, 30 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు లేదా 10 వన్డేలు లేదా 20 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడి ఉండాలని బీసీసీఐ పేర్కొంది. అలాగే, క్రికెట్‌కు కనీసం 5 ఏళ్ల క్రితం రిటైర్మెంట్ ప్రకటించి ఉండాలని స్పష్టం చేసింది. 🚨NEWS🚨: BCCI invites applications for the position of National Selectors (Senior Men). Details : https://t.co/inkWOSoMt9 — BCCI (@BCCI) November 18, 2022 ఇదీ చదవండి: వెన్నులో వణుకు పుట్టిస్తున్నాడు.. ఇలాంటి బౌలర్ భారత్‌కు అత్యవసరం -
బ్రాడ్‌మన్‌తో సరిసమానమైన గణాంకాలు.. అయినా ఏం ప్రయోజనం..!
ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 43 ఇన్నింగ్స్‌ల తర్వాత లెజెండ్ డాన్ బ్రాడ్‌మన్‌తో సరిసమానమైన గణాంకాలు.. తానాడిన ఆఖరి 21 ఇన్నింగ్స్‌ల్లో 9 సెంచరీలు.. ఇందులో ఓ ట్రిపుల్ సెంచరీ, రెండు డబుల్ సెంచరీలు, 4 హాఫ్ సెంచరీలు.. ఓవరాల్‌గా ఫస్ట్‌క్లాస్ కెరీర్లో బ్రాడ్‌మన్ (95.14) తర్వాత అత్యధిక సగటు (81.49).. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రస్తుతం తరం యువ క్రికెటర్లలో ముంబై ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ సాధించినటువంటి ఈ గణాంకాలు మరే ఇతర క్రికెటర్ సాధించలేదనే చెప్పాలి. అయితే, అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు.. ఈ ఆటగాడికి టీమిండియా తలుపులు మాత్రం తెరుచుకోవట్లేదు. దేశవాళీ టోర్నీల్లో భీభత్సమైన ఫామ్‌లో ఉన్నప్పటికీ భారత సెలెక్టర్లు ఈ ముంబైకర్‌ను కనీసం దేకట్లేదు. అడపాదడపా ప్రదర్శన చేసిన వారికి అవకాశాలు కల్పిస్తున్న సెలెక్షన్ కమిటీ.. దేశవాళీ క్రికెట్లో పరుగుల వరద పారిస్తున్న ఈ 25 ఏళ్ల క్రికెటర్‌ను మాత్రం ఎంపిక చేయట్లేదు. బంగ్లాదేశ్ పర్యటన కోసం నిన్న (అక్టోబర్ 31) ప్రకటించిన టీమిండియాలో స్థానం ఆశించి భంగపడ్డ సర్ఫరాజ్ ఖాన్.. తీవ్ర మనోవేదన చెందుతున్నాడు. టీమిండియాకు ఆడటానికి ఇంతకంటే నేనేం చేయగలనని వాపోతున్నాడు. టన్నుల కొద్ది పరుగులు సాధిస్తున్నా సెలెక్టర్లు తనను చిన్న చూపు చూడటంపై విస్మయం వ్యక్తం చేస్తున్నాడు. బంగ్లాదేశ్‌తో టెస్ట్ సిరీస్‌కు ఎంపిక చేస్తామని హామీ ఇచ్చిన సెలెక్టర్లు మాట తప్పారని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. సర్ఫరాజ్ లాంటి టాలెంటెడ్ ఆటగాడిని టీమిండియాకు ఎంపిక చేయకపోవడంపై నెటిజన్లు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పరుగుల సునామీ సృష్టిస్తున్నా ఇతన్ని ఎందుకు ఎంపిక చేయట్లేదో అర్ధం కావట్లేదని జాలి పడతున్నారు. నువ్వేమీ చేశావు నేరం.. నిన్నెక్కడంటిది పాపం అంటూ తెలుగు సినిమా పాటను గుర్తు చేస్తూ సానుభూతి ప్రకటిస్తున్నారు. కాగా, ఇటీవల ముగిసిన రంజీ సీజన్లో భీకరమైన ఫామ్‌లో ఉండిన సర్ఫరాజ్ ఖాన్.. 982 పరుగులతో సీజన్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఫస్ట్ క్లాస్ కెరీర్లో ఇప్పటివరకు 29 మ్యాచ్‌ల్లో 43 ఇన్నింగ్స్‌లు ఆడిన అతను.. 81.33 సగటున 10 సెంచరీలు, 8 హాఫ్ సెంచరీల సాయంతో 2928 పరుగులు చేశాడు. దిగ్గజ డాన్ బ్రాడ్‌మన్ గణాంకాలు కూడా 43 ఇన్నింగ్స్‌ల తర్వాత ఇంచుమించు ఇలాగే ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే సర్ఫరాజ్ ఖాన్ బ్రాడ్‌మన్ కంటే ఓ పరుగు అధికంగానే సాధించాడు. Sarfaraz Khan now has one more run than the DON after 43 FC inns Don Bradman 22 matches, 8 no, 2927 runs, ave 83.63, 100s: 12, 50s: 9 Sarfaraz Khan 29 matches, 7 no, 2928 runs, ave 81.33, 100s: 10, 50s: 8 Note: In his next match in Jan 1930, Bradman made a record unbeaten 452! https://t.co/7HPwPl72fz — Mohandas Menon (@mohanstatsman) October 2, 2022 43 ఇన్నింగ్స్‌ల తర్వాత బ్రాడ్‌మన్ 83.63 సగటున 12 శతకాలు, 9 అర్ధశతకాల సాయంతో 2927 పరుగులు చేయగా.. సర్ఫరాజ్ ఖాన్ అదే 43 ఇన్నింగ్స్‌ల తర్వాత 81.33 సగటున 10 సెంచరీలు, 8 హాఫ్ సెంచరీల సాయంతో 2928 పరుగులు చేశాడు. ఈ 43 ఇన్నింగ్స్‌ల్లో బ్రాడ్‌మన్ 8 సార్లు నాటౌట్‌గా నిలువగా.. సర్ఫరాజ్ 7 సార్ల నాటౌట్‌గా నిలిచాడు. ఇదిలా ఉంటే, సర్ఫరాజ్ ఖాన్ లాగే మరో ముంబై ఆటగాడు పృథ్వీ షా కూడా టీమిండియాలో చోటు ఆశించి భంగపడ్డాడు. బంగ్లా టూర్‌కు జట్టు ప్రకటన తర్వాత షా.. వైరాగ్యంతో కూడిన ఓ ట్వీట్‌ను కూడా చేశాడు. అంతా దేవుడు చూస్తున్నాడంటూ దేవుడిపై భారం వేశాడు. -
గంగూలీ అయిపోయాడు.. ఇప్పుడు చేతన్ శర్మ వంతు?!
బీసీసీఐ అధ్యక్ష పదవి నుంచి టీమిండియా మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీని తప్పుకున్న సంగతి తెలిసిందే. అయితే దాదా తొలగింపుపై ఎంత డ్రామా నడిచిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మొత్తానికి గంగూలీ అధ్యక్ష పదవి నుంచి తప్పించిన బీసీసీఐ మంగళవారం కొత్త పాలక మండలిని ఏర్పాటు చేసింది. తొలి వన్డే ప్రపంచకప్ (1983) గెలిచిన టీమిండియా సభ్యుడు, 67 ఏళ్ల రోజర్ బిన్నీ భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కొత్త అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ తర్వాత మళ్లీ ఆటగాడే బోర్డు పగ్గాలు చేపట్టారు. మంగళవారం జరిగిన బోర్డు వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం)లో పదవులన్నీ కూడా పోటీలేకుండానే నామినేషన్ వేసిన వాళ్లందరికీ దక్కాయి. కొత్త కార్యవర్గంలో రోజర్ బిన్నీ (అధ్యక్షుడు.. బీసీసీఐ కార్యదర్శిగా జై షా, ఉపాధ్యక్షుడిగా రాజీవ్ శుక్లా , సంయుక్త కార్యదర్శిగా దేవ్జిత్ సైకియా,కోశాధికారిగా ఆశిష్ షెలార్‌లు నియమితులయ్యారు. గంగూలీని పదవి నుంచి తొలగించిన బీసీసీఐ ఇప్పుడు జట్టు సెలక్షన్ కమిటీ చైర్మన్.. మాజీ క్రికెటర్ చేతన్ శర్మ వర్గంపై కన్నువేసింది. బీసీసీఐ అధ్యక్షుడి హోదాలో గంగూలీ టీమిండియా మాజీ ఆల్ రౌండర్ చేతన్ శర్మను చీఫ్ సెలెక్టర్ పదవికి ఎంపిక చేశాడు. క్రికెట్ అడ్వైజరీ కమిటీ ఇచ్చిన సిఫారసుల మేరకు 2020 డిసెంబర్లో కొత్త సెలక్షన్ కమిటీని నియమించాడు. సెలక్షన్ కమిటీలోచేతన్ శర్మతో పాటు అభయ్ కురువిల్లా, దేబాశీష్ మొహంతి ఉన్నారు. తాజాగా చేతన్ శర్మ బృంధం తమ పదవులను కోల్పోయే సంకేతాలు బలంగా కనిపిస్తున్నాయి. చేతన్ శర్మ పనితీరు పట్ల బీసీసీఐ కొత్త నాయకత్వం సంతృప్తిగా ఉన్నప్పటికి కొత్త సెలక్షన్ కమిటీని ఎంపిక చేయాలనే ధోరణిలోనే కొత్త పాలకవర్గం ఉన్నట్లు తెలుస్తోంది. మెరుగైన పనితీరు కనబరిచిన చేతన్ శర్మను తొలగించకపోయినా.. అభయ్ కురువిల్లా, దేబాశీష్ మొహంతిని సాగనంపడం ఖాయమని సమాచారం. టి20 ప్రపంచకప్‌లో టీమిండియా చేసే ప్రదర్శన ఆధారంగానే సెలక్షన్ కమిటీ పదవుల మార్పుపై ఒక స్పష్టత రానుంది. వీరి స్థానాల్లో ఇద్దరు మాజీ క్రికెటర్లు.. ఒడిశాకు చెందిన మాజీ ఓపెనర్ శివ సుందర్ దాస్, బెంగాల్ క్రికెటర్ దీప్ దాస్‌గుప్తా, జాతీయ జూనియర్ సెలెక్టర్ రణదేబ్ బోస్ సెలెక్షన్ కమిటీ పదవుల కోసం పోటీలో ఉండొచ్చని అంటున్నారు. అయితే వీరిలో రణదేబ్ బోస్ జాతీయ జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించకపోవడం అతనికి మైనస్. దీనిని పరిగణనలోకి తీసుకుంటే మాత్రం బెంగాల్‌కే చెందిన మాజీ వన్డే ప్లేయర్ లక్ష్మీ రతన్ శుక్లా లేదా ఒడిశాకు చెందిన సంజయ్ రౌల్లో ఒకరిని తీసుకోవచ్చని తెలుస్తోంది. చదవండి: 'లెగ్ స్పిన్ బౌలింగ్ వేయాలా'.. రిజ్వాన్ అదిరిపోయే రిప్లై ఆసియా కప్ టోర్నీలో ఆడలేం: జై షా -
Zimbabwe vs India ODI series: చహర్ పునరాగమనం
ముంబై: జింబాబ్వే గడ్డపై జరిగే 3 వన్డేల సిరీస్ కోసం భారత టీమ్‌ను బీసీసీఐ సెలక్షన్ కమిటీ శనివారం ప్రకటించింది. ఆగస్టు 18, 20, 22 తేదీల్లో ఈ మ్యాచ్‌లు జరుగుతాయి. గాయాల కారణంగా చాలా కాలంగా జట్టుకు దూరమైన దీపక్ చహర్, వాషింగ్టన్ సుందర్ కోలుకొని పునరాగమనం చేయగా, రాహుల్ త్రిపాఠిని తొలిసారి వన్డేలకు ఎంపిక చేశారు. రోహిత్, కోహ్లి, పంత్, షమీ, బుమ్రా, హార్దిక్ ఈ సిరీస్ నుంచి విశ్రాంతి తీసుకోగా... రొటేషన్ పాలసీలో భాగంగా ఇతర కీలక ఆటగాళ్లు శ్రేయస్, సూర్యకుమార్, జడేజా, చహల్, అర్‡్షదీప్‌లను కూడా ఈ టూర్‌కు పంపరాదని సెలక్టర్లు నిర్ణయించారు. కరోనా బారిన పడిన కేఎల్ రాహుల్ కోలుకోకపోవడంతో ఎంపిక చేయలేదు. జట్టు వివరాలు: శిఖర్ ధావన్ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శుబ్‌మన్ గిల్, హుడా, రాహుల్ త్రిపాఠి, ఇషాన్ కిషన్, సామ్సన్, సుందర్, శార్దుల్, అక్షర్, కుల్దీప్, అవేశ్, ప్రసిధ్, సిరాజ్, దీపక్ చహర్. -
రేపే సెలెక్టర్ల సమావేశం.. తేలనున్న 'ఆ నలుగురి' భవితవ్యం
Selectors And BCCI To Meet On Saturday Over Team India T20 World Cup Team: టీ20 ప్రపంచకప్ జట్టులో మార్పులు చేర్పులు చేసేందుకు అక్టోబర్ 10 ఆఖరి తేదీ కావడంతో బీసీసీఐ, సెలెక్షన్ కమిటీలు రేపు(శనివారం) భేటీ కానున్నాయి. ఈ సందర్భంగా భారత టీ20 ప్రపంచకప్ జట్టుకు ఎంపికైన ఆటగాళ్ల భవితవ్యంపై చర్చ జరగనుంది. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్లో తీవ్రంగా నిరాశపరచిన ముంబై ఇండియన్స్ ఆటగాళ్లు హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్లతో పాటు మిస్టరీ స్పిన్నర్, కేకేఆర్ ఆటగాడు వరుణ్ చక్రవర్తిలను జట్టులో కొనసాగించడంపై సెలెక్షన్ కమిటీ తీవ్ర కసరత్తే చేయనుంది. వీరిలో హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తిల ఫిట్నెస్ సమస్య బీసీసీఐ సహా సెలెక్షన్ కమిటీకి పెద్ద తలనొప్పిగా మారింది. ఒకవేళ ఈ నలుగురిని తప్పించి ఇతరులకు చోటు కల్పించాలని సెలెక్షన్ కమిటీ భావిస్తే ఎవరెవరు జట్టులోకి వస్తారన్నదానిపై పెద్ద చర్చే నడుస్తోంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో బీసీసీఐ ఇలాంటి సాహసం చేయకపోవచ్చని విశ్లేషకుల అభిప్రాయం. ఒకట్రెండు మార్పులు చేసినా.. అవి స్టాండ్ బై ఆటగాళ్లను దాటకపోవచ్చని సమాచారం. ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్‌లలో ఒకరిని తప్పించాలని భావిస్తే.. ఆ స్థానాన్ని శ్రేయస్ అయ్యర్‌తో.. హార్దిక్ పాండ్యాపై వేటు వేయాలనుకుంటే శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్‌లలో ఒకరిని జట్టులోని తీసుకునే అవకాశం ఉంది. మోకాళ్ల నొప్పులతో సతమతమవుతున్న వరుణ్ చక్రవర్తి పూర్తి ఫిట్నెస్ సాధించని పక్షంలో అతని స్థానాన్ని ఆర్సీబీ స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్‌తో భర్తీ చేసే అవకాశం ఉందని బీసీసీఐకు చెందిన ఓ అధికారి తెలిపాడు. కాగా, ఈ సమావేశానికి కెప్టెన్ విరాట్ కోహ్లి, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ, ప్రధాన కోచ్ రవిశాస్త్రి కూడా హాజరుకానున్నారు. భారత టీ20 ప్రపంచకప్ జట్టు: విరాట్ కోహ్లి (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (కీపర్), ఇషాన్ కిషన్ (కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రాహుల్ చహర్, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమీ స్టాండ్ బై ప్లేయర్స్: శ్రేయస్ అయ్యర్, శార్దూల్ ఠాకూర్ మరియు దీపక్ చాహర్ చదవండి: దీపక్ చాహర్ లవ్ ప్రపోజల్ సెలబ్రేషన్స్.. ధోని హంగామా చూడాల్సిందే..! -
ఇదేం పద్ధతి?
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ట్రిబ్యునళ్లలో నియామకాల తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. సెర్చ్ అండ్ సెలక్షన్ కమిటీ సిఫారసు చేసిన జాబితాను పక్కనపెట్టి కొందరినే ఏరికోరి నియమించడం ఏమిటని నిలదీసింది. ‘నియామక పత్రాలను పరిశీలిస్తే సెలెక్ట్ లిస్ట్ నుంచి కేవలం ముగ్గురిని ఎంపిక చేసినట్లు స్పష్టమవుతోంది. మిగిలిన వారంతా నిరీక్షణ జాబితాలో ఉన్నవారే. సెలెక్ట్ లిస్ట్‌లోని ఇతరుల పేర్లను తిరస్కరించారు. సర్వీసు చట్టం ప్రకారం.. సెలెక్ట్ లిస్టును కాదని వెయిటింగ్ లిస్టుకు ప్రాధాన్యం ఇవ్వడం సరైంది కాదు. ఇదేం పద్ధతి? ఇదేం ఎంపిక ప్రక్రియ?’ అని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ ఎల్.నాగేశ్వరరావుల సుప్రీంకోర్టు ధర్మాసనం అటార్నీ జనరల్ వేణుగోపాల్‌ను ప్రశ్నించింది. సెలక్షన్ కమిటీ సిఫారసు చేసిన జాబితాలోని పేర్ల నుంచే ట్రిబ్యునళ్లలో ఖాళీలను రెండు వారాల్లోగా భర్తీ చేసేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటుందని వేణుగోపాల్ బదులిచ్చారు. ట్రిబ్యునళ్లలో ఖాళీలను భర్తీ చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను కోర్టు విచారించింది. ఇన్‌కం ట్యాక్స్ అప్పిలేట్ ట్రిబ్యునల్(ఐటీఏటీ) కోసం సెలక్షన్ కమిటీ 41 మందిని సిఫారసు, అందులో నుంచి కేవలం 13 మందిని ఎంపిక చేశారని లాయర్ అరవింద్ దాతర్ చెప్పారు. ఇదేం కొత్త కాదు, ప్రతిసారీ ఇదే కథ అని ధర్మాసనం ఆక్షేపించింది. ట్రిబ్యునళ్లలో నియామకం కోసం తమ దృష్టికి వచ్చిన పేర్లను షార్ట్‌లిస్టు చేయడానికి కోవిడ్ కాలంలో కోర్టు ఎంతగానో శ్రమించిందని సీజేఐ జస్టిస్ రమణ అన్నారు. ఇప్పుడు ఆ ప్రయత్నమంతా వృథా అయ్యిందని అసహనం వ్యక్తం చేశారు. తాజా నియామకాలను పరిశీలిస్తే ట్రిబ్యునళ్లలో సభ్యుల పదవీ కాలం కేవలం సంవత్సరమే ఉందని పేర్కొన్నారు. సంవత్సరం కోసం జడీ్జలు ట్రిబ్యునల్ సభ్యులుగా వెళ్తారా? అని ప్రశ్నించారు. ప్రభుత్వమే పాటించకపోతే ఎలా? సెలక్షన్ కమిటీ సిఫారసులను తిరస్కరించే అధికారం ప్రభుత్వానికి ఉందని వేణుగోపాల్ చెప్పగా ధర్మాసనం ప్రతిస్పందించింది. ‘‘మనది రూల్ ఆఫ్ లా పాటించే దేశం. రాజ్యాంగానికి లోబడి పని చేస్తున్నాం. ‘సిఫారసులను అంగీకరించను’ అని ప్రభుత్వం చెప్పడం సరైంది కాదు’’ అని హితవు పలికింది. నియామకాల ప్రక్రియను ప్రభుత్వమే పాటించకపోతే ఆ ప్రక్రియకు విలువ ఏమున్నట్లు? అని వ్యాఖ్యానించింది. ఆదరాబాదరగా నియమించాలి్సన అవసరమేంటి? నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్(ఎన్సీఎల్ఏటీ) తాత్కాలిక చైర్‌పర్సన్‌గా జస్టిస్ వేణుగోపాల్‌ను ఆదరాబాదరగా నియమించడం పట్ల కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. దీనిపై గురువారం విచారణ చేపడతామని సీజేఐ జస్టిస్ రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం వెల్లడించింది. -
ప్రసిధ్ కృష్ణకు పిలుపు
ముంబై: ఇంగ్లండ్‌తో తలపడే మూడు వన్డేల సిరీస్ కోసం భారత జట్టును సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. 18 మంది సభ్యుల ఈ బృందంలో ముగ్గురు ఆటగాళ్లకు తొలిసారి వన్డే టీమ్‌లో చోటు దక్కింది. కర్ణాటక పేస్ బౌలర్, గతంలో భారత ‘ఎ’ జట్టుకు ఆడిన ప్రసిధ్ కృష్ణ జాతీయ సీనియర్ జట్టులో ఎంపిక కావడం ఇదే తొలిసారి కాగా... ఇప్పటికే టి20లు ఆడిన ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యా, తాజా టి20 సిరీస్‌లో ఆడుతున్న సూర్యకుమార్ యాదవ్‌లకు కూడా అవకాశం దక్కింది. ఐపీఎల్లో కోల్‌కతా జట్టు తరఫున కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రసిధ్‌కు దేశవాళీ వన్డేల్లో మంచి రికార్డు ఉంది. 48 వన్డేల్లో అతను 23.07 సగటుతో 81 వికెట్లు పడగొట్టాడు. భారత్ తరఫున 18 టి20లు ఆడిన కృనాల్ ఇటీవల జరిగిన విజయ్ హజారే ట్రోఫీలో 5 మ్యాచ్‌లలో 2 సెంచరీలు, 2 అర్ధ సెంచరీలతో ఆకట్టుకున్నాడు. టెస్టు సిరీస్ ప్రదర్శన ఆధారంగా సిరాజ్‌కు మరోసారి వన్డే పిలుపు లభించింది. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో టీమ్‌లో ఉన్న మయాంక్, మనీశ్ పాండే, సైనీ, సంజూ సామ్సన్ తమ స్థానాలు కోల్పోయారు. ఇంగ్లండ్‌తో మూడు వన్డేలు ఈనెల 23, 26, 28వ తేదీల్లో పుణేలో జరుగుతాయి. జట్టు వివరాలు: కోహ్లి (కెప్టెన్), రోహిత్, ధావన్, గిల్, అయ్యర్, సూర్యకుమార్, హార్దిక్ పాండ్యా, పంత్, రాహుల్, చహల్, కుల్దీప్, కృనాల్ పాండ్యా, సుందర్, నటరాజన్, భువనేశ్వర్, సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, శార్దుల్. -
‘నా టైమ్ ఎప్పుడొస్తుంది’
సాక్షి క్రీడా విభాగం: సరిగ్గా రెండేళ్లయింది కుల్దీప్ యాదవ్ టెస్టు మ్యాచ్ ఆడి. నాడు సిడ్నీ టెస్టులో 5 వికెట్లు పడగొట్టిన తర్వాత ఏ ముహూర్తాన హెడ్ కోచ్ రవిశాస్త్రి ‘కుల్దీప్ యాదవ్ అద్భుత బౌలర్, అత్యుత్తమ స్పిన్నర్’ అంటూ ప్రశంసించాడో ఆ రోజు నుంచి అదృష్టం అతని గడప తొక్కలేదు. ఇటీవల ముగిసిన సుదీర్ఘ ఆస్ట్రేలియా పర్యటనలో ఒక్క వన్డే మాత్రం ఆడిన కుల్దీప్ సొంత గడ్డపైనైనా తన సుడి మారుతుందని ఆశించాడు. ‘స్వదేశంలో జరిగే మ్యాచ్‌లలో కుల్దీప్ మా ప్రణాళికల్లో భాగంగా ఉన్నాడు’ అంటూ స్వయంగా కోహ్లి గురువారమే చెప్పినా... శుక్రవారానికి వచ్చేసరికి అతనికి మరోసారి మ్యాచ్ దక్కలేదు. వైవిధ్యమైన చైనామన్ బౌలింగ్‌తో ఇంగ్లండ్‌ను కచ్చితంగా కుల్దీప్ ఇబ్బంది పెట్టగలడని అంతా భావించారు. అరుదుగా ఉండే ఎడంచేతి మణికట్టు స్పిన్నర్లు పిచ్‌తో సంబంధం లేకుండా ప్రభావం చూపించగలరు కాబట్టి తొలి టెస్టులో అతనికి చోటు ఖాయంగా కనిపించింది. అయితే టీమ్ మేనేజ్మెంట్ మాత్రం తుది జట్టులో ముగ్గురూ ‘ఫింగర్ స్పిన్నర్’లకే అవకాశమిచ్చింది. అశ్విన్‌లాంటి సీనియర్ ఉన్నప్పుడు అదే శైలి ఉన్న సుందర్‌కు చోటు కల్పించడం ఆశ్చర్యకర నిర్ణయం. జట్టు బ్యాటింగ్‌ను బలోపేతం చేసేందుకే ఇలా చేశారు అంటూ ఒక వాదన వినిపించింది. దీని ప్రకారం కోహ్లి కచ్చితంగా జట్టులో ఒక లెఫ్టార్మ్ స్పిన్నర్ ఉండాల్సిందేనని పట్టు బట్టాడు. పిచ్‌లు భిన్నమైనా... ఇటీవల శ్రీలంక బౌలర్ ఎంబుల్డెనియా ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌కు సమస్యలు సృష్టించడం కూడా అందుకు ఒక కారణం. రవీంద్ర జడేజా లేకపోవడంతో అతడిని పోలిన బౌలింగ్ శైలి, బ్యాటింగ్ చేయగల సామర్థ్యంతో అక్షర్ పటేల్ ఆడటం ఖాయమైపోయింది కూడా. అయితే అక్షర్ అనూహ్యంగా తప్పుకోవడంతో లెక్క మారిపోయింది. చివరి నిమిషంలో ఎంపిక చేసిన నదీమ్‌కు మ్యాచ్ ఆడే అవకాశం లభించింది. కుల్దీప్ను కూడా ఎంపిక చేస్తే చివరి నలుగురు ఏమాత్రం బ్యాటింగ్ చేయలేనివారిగా మారిపోతారు కాబట్టి ఏడో స్థానంలో వాషింగ్టన్ సుందర్ ఉంటే బాగుంటుందని జట్టు భావించింది. ఇటీవలి బ్రిస్బేన్ టెస్టు ప్రదర్శన సుందర్‌కు అదనపు అర్హతగా మారిపోయింది. దాంతో కుల్దీప్కు అవకాశం దక్కలేదు. అయితే చివరకు అనుభవం లేని నదీమ్, సుందర్‌లనే లక్ష్యంగా చేసి ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ పరుగులు రాబట్టారు. ఇద్దరూ కలిసి 3.87 ఎకానమీతో పరుగులు ఇవ్వగా, 19 ఫోర్లు వీరి బౌలింగ్‌లోనే వచ్చాయి. బౌలింగ్‌లో సుందర్‌ను జట్టు పెద్దగా వాడుకోనే లేదు. 41వ ఓవర్‌కు గానీ బౌలింగ్ ప్రారంభించని అతను 12 ఓవర్లు మాత్రమే వేసి ఏకంగా 55 పరుగులు సమర్పించుకున్నాడు. ప్రత్యేక పరిస్థితుల్లో బ్రిస్బేన్ టెస్టు అవకాశం దక్కించుకున్న సుందర్... మూడున్నరేళ్ల తర్వాత స్వదేశంలో ఆడుతున్న తొలి ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లో ఎలాంటి ప్రభావం చూపలేకపోయాడు. అన్నింటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే... కోహ్లి, పుజారా, రోహిత్, రహానే, పంత్‌లాంటి స్టార్ బ్యాట్స్‌మెన్ ఉన్న భారత జట్టు స్వదేశంలో భారీ స్కోరు కోసం ఏడో నంబర్ ఆటగాడి వరకు ఆధారపడుతుందా! టాప్–6 సరిగ్గా బ్యాటింగ్ చేస్తే అసలు లోయర్ ఆర్డర్ అవసరమేముంటుంది? వారు చేయలేని పనిని ఏడు, ఎనిమిదో నంబర్ ఆటగాళ్లు చేస్తారా! మూడేళ్ల తర్వాత... భారత స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఎట్టకేలకు స్వదేశంలో తొలి టెస్టు మ్యాచ్ ఆడాడు. 2018 జనవరిలో కేప్‌టౌన్‌లో అరంగేట్రం చేసిన అతను ఇప్పటి వరకు 17 టెస్టులు ఆడగా, అన్నీ విదేశాల్లోనే జరిగాయి. -
కెప్టెన్‌కే ఏమీ తెలీదు!
సిడ్నీ: ఆస్ట్రేలియా విమానం ఎక్కుతున్న సమయంలో కూడా జట్టు వైస్ కెప్టెన్ తమతో పాటు ఎందుకు రావడం లేదో కెప్టెన్‌కు తెలీదు! ఈ వ్యవహారంపై జట్టు సారథికి సమాచారం ఇవ్వాల్సిన బోర్డు ఏదీ చెప్పకుండా అన్ని విషయాలను దాచి పెట్టింది! భారత క్రికెట్‌కు సంబంధించి తాజా పరిస్థితి ఇది. ఐపీఎల్లో రోహిత్ శర్మ గాయపడటం మొదలు ఇప్పుడు తొలి రెండు టెస్టులకు దూరం కావడం వరకు నెల రోజులుగా సాగుతున్న అతని ఫిట్నెస్ వివాదంలో ఇప్పుడు మరో కొత్త అంశం తెర పైకి వచ్చింది. అసలు రోహిత్ శర్మ గాయం గురించే తనకు పూర్తి సమాచారం లేదని స్వయంగా కెప్టెన్ విరాట్ కోహ్లి వెల్లడించాడు. అసలు ఒక రకమైన అనిశ్చితి, గందరగోళం కనిపించిందని అతను చెప్పడం ఈ వ్యవహారం ఎలా సాగిందో చెబుతోంది. టీమిండియా కెప్టెన్‌కు, బీసీసీఐకి మధ్య ఎలాంటి సమాచార లోపం ఉందో కూడా ఇది చూపిస్తోంది. రోహిత్ వ్యవహారానికి సంబంధించి కోహ్లి చేసిన వ్యాఖ్యలు అతని మాటల్లోనే... ‘దుబాయ్‌లో సెలక్షన్ కమిటీ సమావేశానికి రెండు రోజుల ముందు మాకు ఒక మెయిల్ వచ్చింది. ఐపీఎల్లో గాయపడిన కారణంగా రోహిత్ శర్మ సెలక్షన్‌కు అందుబాటులో లేడని, అతనికి కనీసం రెండు వారాల విశ్రాంతి, రీహాబిలిటేషన్ అవసరమని అందులో ఉంది. దీనికి సంబంధించి మంచి చెడులన్నీ రోహిత్‌కు చెప్పామని, అతను దానిని అర్థం చేసుకున్నాడని కూడా ఉంది. అందుకే ఎంపిక చేయడం లేదని చెప్పారు. అయితే ఆ తర్వాత అతను ఐపీఎల్ ఆడటంతో అంతా బాగుందని, ఆస్ట్రేలియా విమానం ఎక్కుతాడని మేం అనుకున్నాం. అయితే అది జరగలేదు. (289 రోజుల తర్వాత...) మాతో రోహిత్ ఎందుకు ప్రయాణించడం లేదో మాకెవరికీ సమాచారం లేదు. దాని తర్వాత బోర్డు నుంచి అధికారికంగా ఒకే ఒక మెయిల్ వచ్చింది. అందులో రోహిత్ ఎన్సీఏలో ఉన్నాడని, అతని గాయాన్ని పర్యవేక్షిస్తున్నామని, నవంబర్ 11న మరింత స్పష్టత వస్తుందని రాసుంది. సెలక్షన్ కమిటీ సమావేశం జరిగిన రోజు నుంచి మొదలు పెడితే ఐపీఎల్ ముగిసి, ఎన్సీఏలో చేరే వరకు మాకు ఎలాంటి సమాచారం లేదు. దీనిపై పూర్తిగా స్పష్టత లోపించింది. అసలు ఈ వ్యవహారంలో ఇప్పటి వరకు వేచి చూడటమే సరైంది కాదు. అంతా గందరగోళంగా ఉందనేది వాస్తవం. రోహిత్ పరిస్థితికి సంబంధించి ఎంతో అనిశ్చితి నెలకొంది. ఎక్కడా స్పష్టత లేదు’ -
చీఫ్ సెలక్టర్‌గా అజిత్ అగార్కర్!
న్యూఢిల్లీ: సెలక్టర్ల ఎంపికకు సంబంధించి బీసీసీఐ విడుదల చేసిన నోటిఫికేషన్ గడువు నిన్నటితో ముగిసింది. ఐదుగురు సభ్యుల సెలక్షన్ కమిటీలో ఇప్పటికే సౌత్‌జోన్ నుంచి ఖాళీ అయిన ఎమ్మెస్కే ప్రసాద్ (ఆంధ్రప్రదేశ్) స్థానంలో సునీల్ జోషి (కర్ణాటక), సెంట్రల్ జోన్లో గగన్ ఖోడా స్థానంలో హర్వీందర్ సింగ్‌లను మదన్‌లాల్ నేతృత్వంలోని క్రికెట్ అడ్వైజరీ కమిటీ (సీఏసీ) నియమించింది. మిగతా ముగ్గురు సభ్యుల ఎంపికకు కసరత్తు చేస్తోంది. దరఖాస్తుల స్క్రూటినీ అయిన వెంటనే మదన్‌లాల్ నేతృత్వంలోని క్రికెట్ అడ్వైజరీ కమిటీ (సీఏసీ) అర్హత గల అభ్యర్థుల్ని ఇంటర్వ్యూ చేస్తుంది. అనంతరం ఈ సీనియర్ సెలక్షన్ కమిటీ భారత్‌తో పాటు భారత్ ‘ఎ’, దులీప్ ట్రోఫీ, దేవధర్ ట్రోఫీ, చాలెంజర్ ట్రోఫీ, రెస్టాఫ్ ఇండియా జట్లను ఎంపిక చేస్తుంది. దరఖాస్తు చేసుకున్నవారిలో అజిత్ అగార్కర్, చేతన్ శర్మ, మహిందర్ సింగ్, ఎస్ఎస్ దాస్‌లలో ముగ్గురు సెలెక్టర్లుగా ఎంపికవడం ఖాయంగా తెలుస్తోంది. ఇక అజిత్ అగార్కర్, మహిందర్ సింగ్ గత మార్చిలోనే అప్లై చేయగా.. వారికి అవకాశం రాలేదు. ఆ దరఖాస్తులనే సీఏసీ మళ్లీ పరిగణించనుంది. ఇక అంతర్జాతీయ క్రికెట్ ఆడిన అనుభవం ఉన్న అగార్కర్ చీఫ్ సెలక్టర్‌గా సరిపోతాడని కొందరు క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దాంతోపాటు మాజీ పేస్ బౌలర్ దేవాశిష్ మహంతిని జూనియర్ సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా నియమించాలని చెప్తున్నారు. గత సెలక్షన్ కమిటీ భర్తీ ప్రక్రియలో జోన్లవారీగా సభ్యులను ఎంపిక చేసుకుని చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్న బీసీసీఐ.. తాజాగా ఆ సంప్రదాయాన్ని ఫాలో అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. -
సెలక్టర్లు కావలెను..అర్హతలివే..!
న్యూఢిల్లీ: సీనియర్ సెలక్షన్ కమిటీలో త్వరలో ఖాళీ అవుతున్న సెలక్టర్లను భర్తీ చేసేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సిద్ధమైంది. అర్హత గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కోరుతూ మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తులకు ఈ నెల 15 ఆఖరి తేదీ అని అందులో పేర్కొంది. కమిటీలోని దేవాంగ్ గాంధీ (ఈస్ట్‌జోన్), శరణ్‌దీప్ సింగ్ (నార్త్‌జోన్), జతిన్ పరాంజపే (వెస్ట్‌జోన్)ల పదవీ కాలం ఇదివరకే ముగిసినా... ఆసీస్ పర్యటన కోసం జట్లను ఎంపిక చేసేందుకు పొడిగింపు ఇచ్చింది. జట్ల ఎంపిక పూర్తి కావడంతో ఇక సెలక్టర్ల భర్తీపై బోర్డు దృష్టిసారించింది. ఇప్పటికే సౌత్‌జోన్ నుంచి ఖాళీ అయిన ఎమ్మెస్కే ప్రసాద్ (ఆంధ్రప్రదేశ్) స్థానంలో సునీల్ జోషి (కర్ణాటక), సెంట్రల్ జోన్లో గగన్ ఖోడా స్థానంలో హర్వీందర్ సింగ్‌లను నియమించింది. (చదవండి: తొలి టెస్టు తర్వాత స్వదేశానికి కోహ్లి) అర్హతలివే... అంతర్జాతీయ అనుభవం లేకపోయినా... కనీసం 30 దేశవాళీ మ్యాచ్‌లు ఆడిన క్రికెటర్లు సెలక్టర్ల పదవులకు దరఖాస్తు చేసుకోవచ్చు. గరిష్ట వయస్సు 60 ఏళ్లు. అంతర్జాతీయ క్రికెట్లో 7 టెస్టులు లేదంటే 10 వన్డేలు, 20 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడిన అనుభవమైనా ఉండాలి. అయితే ఈసారి అంతర్జాతీయ అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత అని ఎక్కడా పేర్కొనలేదు. 30 దేశవాళీ మ్యాచ్‌లాడినా పరిగణమిస్తామని తెలిపింది. సెలక్షన్ కమిటీ కోసం ఇటీవల దరఖాస్తు చేసుకున్న మాజీ సీమర్ అజిత్ అగార్కర్, మణీందర్ సింగ్‌ల ఎంపికను కూడా పరిశీలిస్తారు. దరఖాస్తుల స్క్రూటినీ అయిన వెంటనే మదన్‌లాల్ నేతృత్వంలోని క్రికెట్ అడ్వైజరీ కమిటీ (సీఏసీ) అర్హత గల అభ్యర్థుల్ని ఇంటర్వ్యూ చేస్తుంది. అనంతరం ఈ సీనియర్ సెలక్షన్ కమిటీ భారత్‌తో పాటు భారత్ ‘ఎ’, దులీప్ ట్రోఫీ, దేవధర్ ట్రోఫీ, చాలెంజర్ ట్రోఫీ, రెస్టాఫ్ ఇండియా జట్లను ఎంపిక చేస్తుంది. (చదవండి: నేను అలాంటి వాడిని కాదు: రోహిత్)