న్యూఢిల్లీ: భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ క్రికెటర్ చేతన్ శర్మ నేతృత్వంలోని జాతీయ పురుషుల క్రికెట్ జట్టు సెలక్షన్ కమిటీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. కొత్త సెలక్టర్ల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున‍్నట్లు శుక్రవారం రాత్రి ట్విటర్ ద్వారా వెల్లడించింది. దరఖాస్తులు సమర్పించేందుకు నవంబర్ 28 సాయంత్రం 6 గంటల వరకు గడువు ఇచ్చింది. ప్రస్తుత కమిటీలో ఛైర్మన్‌గా చేతన్ శర్మ ఉండగా.. సునీల్ జోషి(సౌత్ జోన్), హర్విందర్ సింగ్(సెంట్రల్ జోన్), దెబాషిశ్ మొహంతి(ఈస్ట్ జోన్) లు ఉన్నారు. గత నెలలోనే కొత్త సెలక్షన్ కమిటీని నియమించనున్నట్లు బీసీసీఐ ప్రధాన కార్యదర్శి జైషా వెల్లడించారు.
సెలక్షన్ కమిటీలోని ఐదు స్థానాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునేవారు కనీసం 7 టెస్టు మ్యాచ్‌లు, 30 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు లేదా 10 వన్డేలు లేదా 20 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడి ఉండాలని బీసీసీఐ పేర్కొంది. అలాగే, క్రికెట్‌కు కనీసం 5 ఏళ్ల క్రితం రిటైర్మెంట్ ప్రకటించి ఉండాలని స్పష్టం చేసింది.
🚨NEWS🚨: BCCI invites applications for the position of National Selectors (Senior Men).
— BCCI (@BCCI) November 18, 2022
Details : https://t.co/inkWOSoMt9
ఇదీ చదవండి: వెన్నులో వణుకు పుట్టిస్తున్నాడు.. ఇలాంటి బౌలర్ భారత్‌కు అత్యవసరం
Comments
Please login to add a commentAdd a comment