selectors
-
విండీస్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు ప్రకటన.. రింకూ సింగ్ ఏడి..?
ఐపీఎల్ 2023లో అద్భుత ప్రదర్శన కనబర్చిన కేకేఆర్ బ్యాటర్ రింకూ సింగ్‌కు విండీస్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టులో చోటు ఖాయమని మీడియా మొత్తం కోడై కూసిన విషయం తెలిసిందే. అయితే మీడియా కథనాలను కాని, రింకూ సింగ్ ప్రదర్శనను కాని పరిగణలోకి తీసుకోని భారత సెలెక్షన్ కమిటీ అతనికి మొండిచేయి చూపించింది. అతని స్థానంలో మిడిలార్డర్ బ్యాటర్ కోటాలో తిలక్ వర్మకు చోటు కల్పించింది. మరో మిడిలార్డర్ బ్యాటర్‌గా వికెట్‌కీపర్ కమ్ బ్యాటర్ సంజూ శాంసన్‌కు అవకాశం ఇచ్చింది. ఐపీఎల్లో రింకూతో సరిసాటిగా రాణించిన యశస్వి జైస్వాల్‌ని కూడా ఎంపిక చేసింది. If Rinku Singh doesn't play for India, it's Indias Loss!! Keep Going @rinkusingh235 🦁pic.twitter.com/mahZ9pdMAB — KKR Bhakt 🇮🇳 ™ (@KKRSince2011) July 5, 2023 యువకులకు మెరుగైన అవకాశాలు కల్పిస్తామని ఊదరగొట్టే భారత సెలెక్టర్లు, సీనియర్ల గైర్హాజరీలోనూ రింకూ సింగ్ లాంటి టాలెంటెడ్ ఆటగాడికి చోటు కల్పించకపోవడంపై అభిమానులు మండిపడుతున్నారు. రింకూను.. మరో సంజూ శాంసన్‌లా (అవకాశాలు ఇవ్వకుండా) తయారు చేస్తారంటూ కామెంట్లు చేస్తున్నారు. రింకూ సూపర్ ఫామ్‌లో ఉన్నప్పుడు అవకాశం ఇవ్వలేదంటూ సెలెక్టర్లపై దుమ్మెత్తిపోస్తున్నారు. Rinku Singh is the most loved cricketer at the moment. Everyone is angry about his exclusion. pic.twitter.com/jkqRALYPK1 — R A T N I S H (@LoyalSachinFan) July 5, 2023 పాపం రింకూ.. అంటూ సోషల్‌మీడియా వేదికగా సానుభూతి చూపిస్తున్నారు. రింకూను ఎంపిక చేయకపోవడం టీమిండియాకే నష్టమని అభిప్రాయపడుతున్నారు. మరికొందరు భారత క్రికెట్లో ఇది సర్వసాధారణమని.. సెలెక్టర్లు టాలెంటెడ్ యువతకు అవకాశాలు ఇస్తే ఆశ్చర్యపోవాలి కాని, ఇలా జరిగితే పెద్ద విశేషమేమి కాదంటున్నారు. రింకూను ఎంపిక చేయకపోవడంపై అతని ఐపీఎల్ జట్టు కేకేఆర్ కూడా స్పందించింది. Justice for Rinku Singh 💔😞#WIvIND #RinkuSingh pic.twitter.com/6GRHR62sGx — Shreyas Aryan (@Ariyen34) July 5, 2023 Knowing BCCI, you might see Rinku Singh getting picked in Tests before the T20I side. — Silly Point (@FarziCricketer) July 5, 2023 రింకూ స్లిప్‌లో క్యాచ్ పడుతున్న ఓ వీడియోను పోస్ట్ చేస్తూ.. నథింగ్ స్లిప్పింగ్ థ్రూ అంటూ కామెంట్ చేసింది. కాగా, 25 ఏళ్ల రింకూ సింగ్ (ఉత్తర్‌ప్రదేశ్) ఇటీవల ముగిసిన ఐపీఎల్లో పలు చిరస్మరణీయ ఇన్నింగ్స్‌లు ఆడి తన జట్టును గెలిపించిన విషయం తెలిసిందే. ఈ సీజన్లో రింకూ 14 మ్యాచ్‌లు ఆడి 59.25 సగటున 149.53 స్ట్రయిక్‌రేట్‌తో 474 పరుగులు సాధించాడు. ఇందులో 4 అర్ధసెంచరీలు ఉన్నాయి. ఇదే సీజన్లో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రింకూ ఆడిన ఇన్నింగ్స్ (యశ్ దయాల్వేసిన ఆఖరి ఓవర్లో వరుసగా 5 సిక్సర్లు) సగటు క్రికెట్ అభిమాని ఎప్పటికీ మరచిపోలేడు. History created by Rinku Singh. What a finish. pic.twitter.com/NDAiGjQVoI — Johns. (@CricCrazyJohns) April 9, 2023 విండీస్‌తో టి20 సిరీస్‌కు భారత జట్టు: ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శుబ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, సూర్య కుమార్ యాదవ్ (వైస్ కెప్టెన్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (కెప్టెన్), అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్. -
భారత క్రికెట్ పరిస్థితి చూస్తే నవ్వొస్తుంది.. సిగ్గుతో తలదించుకోవాలి..!
టీమిండియా మాజీ పేసర్ వెంకటేశ్ ప్రసాద్ భారత దేశవాలీ సెలెక్టర్ల తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డాడు. గడిచిన రంజీ సీజన్లో అత్యధిక వికెట్లు తీసిన కేరళ ఆఫ్ స్పిన్నర్ జలజ్ సక్సేనాను సౌత్ జోన్ తరఫున దులీప్ ట్రోఫీకి ఎంపిక చేయకపోవడంపై ధ్వజమెత్తాడు. మధ్యప్రదేశ్, భారత-ఏ జట్ల తరఫున అత్యుత్తమ ప్రదర్శన కనబర్చినా జలజ్‌ను ఎంపిక చేయకపోవడంపై సెలక్టర్లను నిలదీశాడు. జట్ల ఎంపికలో సెలెక్టర్లు అవళింభిస్తున్న తీరుపై అసహనం వ్యక్తం చేశాడు. భారత క్రికెట్లో హాస్యాస్పదమైన విషయాలు చాలా జరుగుతున్నాయని, జలజ్ ఉదంతం ఇందుకు ఓ ఉదాహరణ మాత్రమే అని అన్నాడు. రంజీల్లో రాణించినా మిగతా దేశవాలీ టోర్నీలకు ఎంపిక చేయకపోతే రంజీ ట్రోఫీ ఆడటంలో అర్ధమే లేదని తెలిపాడు. భారత క్రికెట్లో ఇలాంటి పరిస్థితులను చూస్తుంటే సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తుందని వాపోయాడు. There are many laughable things happening in Indian cricket. The highest wicket taker in Ranji Trophy not being picked even for the South Zone team is as baffling as it gets. Just renders the Ranji Trophy useless..what a shame https://t.co/pI57RbrI81 — Venkatesh Prasad (@venkateshprasad) June 18, 2023 ఈ విషయాలను ఇండియన్ డొమెస్టిక్ క్రికెట్ ఫోరమ్‌కు ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశాడు. బీసీసీఐ జూనియర్ సెలెక్షన్ కమిటీ మాజీ ఛైర్మన్ అయిన వెంకటేశ్ ప్రసాద్ ఈ ఏడాది ఆరంభంలో టీమిండియాకు కేఎల్ రాహుల్‌ను ఎంపిక చేసినప్పుడు కూడా ఇలాగే సెలెక్టర్లను నిలదీశాడు. కేఎల్ రాహుల్ ఫామ్‌లో లేకపోయినా టీమిండియాకు ఎలా ఎంపిక చేస్తారని ప్రసాద్ నాడు సెలెక్టర్లను ప్రశ్నించాడు. కాగా, 36 ఏళ్ల జలజ్ సక్సేనా 2022-23 రంజీ సీజన్లో 7 మ్యాచ్‌ల్లో 6 సార్లు 5 వికెట్ల ఘనత సాధించి 50 వికెట్లు పడగొట్టాడు. ఆ సీజన్లో ఇతనే లీడింగ్ వికెట్‌టేకర్. ఓవరాల్‌గా జలజ్ తన దేశవాలీ కెరీర్లో 133 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు, 104 లిస్ట్-ఏ, 66 టీ20లు ఆడాడు. ఈ మధ్యప్రదేశ్ ఆల్‌రౌండర్ ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున కూడా ఓ మ్యాచ్ ఆడాడు. I DONT understand selection committee these days BABA INDRAJITH plays for Rest of India against MP in the first week of March 2023. There has been no first class matches post that , but he doesn't feature for SOUTH ZONE in the duleep trophy. Can someone tell me why??#bcci — DK (@DineshKarthik) June 14, 2023 ఇదిలా ఉంటే, దులీప్ ట్రోఫీ కోసం ఎంపిక చేసిన సౌత్ జోన్ జట్టుపై టీమిండియా వెటరన్ వికెట్‌కీపర్ దినేశ్ కార్తీక్ సైతం అసంతృప్తి వ్యక్తం చేశాడు. తమిళనాడు ఆటగాడు బాబా ఇంద్రజిత్‌ను జట్టుకు ఎంపిక చేయకపోవడంపై డీకే సౌత్ జోన్ సెలెక్టర్లను నిలదీశాడు. -
గత ఆరేడేళ్ల నుంచి చూస్తున్నా.. సెలక్టర్లకు కొంచెం కూడా తెలివి లేదు: భారత మాజీ క్రికెటర్
ఓవల్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో 209 పరుగుల తేడాతో టీమిండియా ఘోర ఓటమి చవి చూసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి భారత జట్టుపై విమర్శల వర్షం కురుస్తోంది. ముఖ్యంగా జట్టు కెప్టెన్సీపై పెద్ద ఎత్తున చర్చనడుస్తోంది. రోహిత్‌ను తప్పించి మరోక ఆటగాడికి జట్టు పగ్గాలు అప్పజెప్పాలని చాలా మంది మాజీలు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇప్పటిలో రోహిత్ కెప్టెన్సీవచ్చిన డోకా ఏమీ లేదు. ఈ ఏడాది భారత్ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్ తర్వాత టీమిండియా కెప్టెన్సీపై బీసీసీఐ ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ నేపధ్యంలో భారత మాజీ క్రికెటర్ దిలీప్ వెంగ్‌సర్కార్ కీలక వాఖ్యలు చేశాడు. "భారత సెలక్షన్ కమిటీ ఉన్న సెలెక్టర్లకు క్రికెట్‌పై కనీస అవహగన, ముందు చూపు లేనట్లుగా అన్పిస్తోంది. గత ఆరు-ఏడేళ్లుగా ఇదే నేను చూస్తున్నాను. వారు కొన్ని సిరీస్‌లలో ప్రధాన ఆటగాళ్లు అందుబాటులో లేనప్పుడు శిఖర్ ధావన్‌ను భారత కెప్టెన్‌గా చేసారు. అదే వారు చేసిన తప్పు. ఇటువంటి సమయంలోనే యువ ఆటగాళ్లలో ఎవరో ఒకరికి జట్టు పగ్గాలు అప్ప జెప్పి ఫ్యూచర్ కెప్టెన్లను తయారు చేయాలి. కానీ బీసీసీఐ ఆ పని చేయలేదు. రోహిత్ తర్వాత భారత కెప్టెన్‌ను తాయారు చేయడంలో బీసీసీఐ విఫలమైంది. పేరుకే ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డు. అంతేతప్ప కనీసం బెంచ్ బలాన్ని పెంచుకోవడం లేదు. కేవలం ఐపీఎల్ నిర్వహించడం, మీడియా హక్కుల ద్వారా కోట్లాది రూపాయలు సంపాదించడం మాత్రమే కాదు.. జట్టును తీర్చిదిద్దడంపై కూడా దృష్టిసారించాలి" అంటూ బీసీసీఐపై వెంగ్‌సర్కార్ విమర్శల వర్షం కురిపించాడు. చదవండి: IND vs WI: నేషనల్ క్రికెట్ అకాడమీకి వెళ్లనున్న ఇషాన్ కిషన్.. ఎందుకంటే? -
వరల్డ్‌కప్ జట్టులో చోటు దక్కకపోవడంపై అంబటి రాయుడు సంచలన వ్యాఖ్యలు
2019 వరల్డ్‌కప్ జట్టులో చోటు దక్కకపోవడంపై టీమిండియా మాజీ ఆటగాడు అంబటి రాయుడు సంచలన వ్యాఖ్యలు చేశాడు. నాటి సెలెక్షన్ కమిటీలోని కీలక సభ్యుడితో తనకు మనస్పర్దలు ఉండేవని, అతనితో కలిసి క్రికెట్ ఆడే రోజుల్లో విభేదాలు ఏర్పడ్డాయనని, నన్ను వరల్డ్‌కప్ జట్టుకు ఎంపిక చేయకపోవడానికి అదే కారణం అయ్యుండొచ్చని అభిప్రాయపడ్డాడు. ఇటీవల ఓ లోకల్ న్యూస్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాయుడు ఈ మేరకు వ్యాఖ్యానించాడు. కాగా, నాటి జాతీయ సెలెక్టర్లైన ఎంఎస్కే ప్రసాద్ (చీఫ్ సెలెక్టర్), దేవాంగ్ గాంధీ, శరణ్‌దీప్ సింగ్, గగన్ ఖోడా, జతిన్ పరంజపేలు.. అప్పటి ఐపీఎల్ సీజన్లో టాప్ ఫామ్‌లో ఉండిన రాయుడును కాదని త్రీడీ ప్లేయర్ విజయ్ శంకర్‌ను 2019 వన్డే వరల్డ్‌కప్‌కు ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఆ వరల్డ్‌కప్‌లో రాయుడు స్థానంలో టీమిండియాకు ఎంపికైన విజయ్ శంకర్ దారుణంగా విఫలమయ్యాడు. ఈ అంశంపై అప్పట్లో పెద్ద చర్చలే జరిగాయి. రాయుడు సైతం సెలెక్టర్ల వైఖరిని బహిరంగంగా విమర్శించాడు. ఫామ్‌లో ఉన్న తనను ఎంపిక చేయకపోవడంతో మనస్థాపం చెందిన రాయుడు.. ఉన్నపలంగా అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించేశాడు. ఆ తర్వాత తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నప్పటికీ టీమిండియా అవకాశాలు దక్కలేదు. ఇదిలా ఉంటే, అంబటి రాయుడు ఇటీవల ముగిసిన ఐపీఎల్-2023 సీజన్‌తో క్యాష్ రిచ్ లీగ్‌కు కూడా వీడ్కోలు పలికేశాడు. సీఎస్కే టైటిల్ గెలిచిన జట్టులో రాయుడు సభ్యుడిగా ఉన్నాడు. ఇటీవలే అతను ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని కూడా కలిశాడు. రాయుడు తన రాజకీయ అరంగేట్రం కోసమే ఏపీ సీఎం చుట్టూ తిరుగుతున్నాడని ప్రచారం జరుగుతుంది. -
సెలెక్టర్ల కథ ముగించారు.. రోహిత్ శర్మను ఎప్పుడు?
టి20 ప్రపంచకప్‌లో టీమిండియా వైఫల్యం అనంతరం యాక్షన్ ప్లాన్ మొదలుపెట్టిన బీసీసీఐ కన్ను మొదట సెలెక్షన్ కమిటీ మీదనే పడింది. చేతన్ శర్మ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీని శుక్రవారం తొలగించిన బీసీసీఐ కొత్త సెలెక్టర్ల కోసం దరఖాస్తులు ఆహ్వానించింది. టి20 ప్రపంచకప్‌లో జట్టును ఎంపిక చేసిన చేతన్ శర్మ బృందాన్ని తప్పించడం బాగానే ఉన్నప్పటికి.. కెప్టెన్‌గా విఫలమైన రోహిత్ శర్మను ఎప్పుడు తొలగిస్తారంటూ టీమిండియా ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. సెలెక్టర్లు జట్టును ఎంపిక చేసి ఉండొచ్చు.. కానీ తుది జట్టు నిర్ణయం మాత్రం కెప్టెన్, హెడ్కోచ్లపైనే ఆధారపడి ఉంటుంది. మరి అప్పుడు రోహిత్ శర్మను కూడా కెప్టెన్సీ నుంచి తప్పించాల్సిందేనని అభిప్రాయపడ్డారు. ఇక ప్రస్తుత కమిటీలో ఛైర్మన్‌గా చేతన్ శర్మ ఉండగా.. సునీల్ జోషి(సౌత్ జోన్), హర్విందర్ సింగ్(సెంట్రల్ జోన్), దెబాషిశ్ మొహంతి(ఈస్ట్ జోన్) లు ఉన్నారు. గత నెలలోనే కొత్త సెలక్షన్ కమిటీని నియమించనున్నట్లు బీసీసీఐ ప్రధాన కార్యదర్శి జైషా వెల్లడించారు. టి20 ప్రపంచకప్‌లో మొదటి నుంచి టీమిండియా ప్రదర్శన అంతంత మాత్రంగానే ఉంది. ఏదో కోహ్లి, సూర్యకుమార్‌లు మంచి ఫామ్‌తో ఆడారు కాబట్టి టీమిండియా కనీసం సెమీఫైనల్ వరకు రాగలిగింది. ఇక జట్టులో బౌలర్ల వైఫల్యం కొట్టొచ్చినట్లు కనబడింది. ఇక కెప్టెన్‌గా.. బ్యాటర్‌గా రోహిత్ శర్మ దారుణంగా విఫలమయ్యాడు. కోహ్లి అనంతరం మూడు ఫార్మాట్లలో కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన రోహిత్ అంతగా రాణించలేకపోతున్నాడు. ఆసియా కప్‌లో ఓటమి.. తాజాగా టి20 ప్రపంచకప్‌లో సెమీఫైనల్లోనే వెనుదిరగడం అభిమానులకు ఆగ్రహం తెప్పించింది. అయితే రోహిత్ బాధ్యతలు చేపట్టి ఏడాది కూడా కాలేదని.. మరి కొంతకాలం అతన్ని కెప్టెన్‌గా ఉంచితే టీమిండియాకు మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని కొంతమంది పేర్కొన్నారు. ఇక న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లిన టీమిండియాలో సీనియర్ ఆటగాళ్లు ఎవరు లేరు. రోహిత్, కోహ్లి సహా చాలా మంది ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చారు. ఈ విషయంలోనూ అభిమానులు గుర్రుగా ఉన్నారు. టి20 ప్రపంచకప్‌లో సెమీఫైనల్లోనే వెనుదిరిగిన న్యూజిలాండ్ జట్టు పూర్తిస్థాయి జట్టుతో బరిలోకి దిగుతుంటే.. టీమిండియా మాత్రం సీనియర్లకు రెస్ట్ పేరుతో పక్కనబెట్టి యువజట్టును పంపించింది. పొట్టి ప్రపంచకప్‌లో నాసిరకం ప్రదర్శన కనబరిచిన ఆటగాళ్లకు రెస్ట్ ఎందుకంటూ ఏకిపారేశారు. కివీస్ పూర్తి జట్టుతో ఆడుతుంటే.. మనోళ్లు కూడా అలాగే ఆడాలి. రెస్ట్ పేరుతో ఆటగాళ్లను మరింత బద్దకంగా తయారు చేస్తున్నారు. ఇప్పటికే కివీస్‌తో టి20 సిరీస్‌కు హార్దిక్ పాండ్యాను కెప్టెన్ చేశారు. చూస్తుంటే అన్ని ఫార్మాట్లలోనూ అతనే కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశాలు కనిపిస్తున్నాయని అభిమానులు పేర్కొన్నారు. చదవండి: సెలక్షన్ కమిటీ రద్దు.. కొత్త సెలక్టర్ల కోసం బీసీసీఐ ప్రకటన సెలెక్షన్ కమిటీని హఠాత్తుగా తొలగించడానికి కారణాలివే..! -
బీసీసీఐ షాకింగ్ ప్రకటన.. సెలక్షన్ కమిటీ రద్దు
న్యూఢిల్లీ: భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ క్రికెటర్ చేతన్ శర్మ నేతృత్వంలోని జాతీయ పురుషుల క్రికెట్ జట్టు సెలక్షన్ కమిటీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. కొత్త సెలక్టర్ల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు శుక్రవారం రాత్రి ట్విటర్ ద్వారా వెల్లడించింది. దరఖాస్తులు సమర్పించేందుకు నవంబర్ 28 సాయంత్రం 6 గంటల వరకు గడువు ఇచ్చింది. ప్రస్తుత కమిటీలో ఛైర్మన్‌గా చేతన్ శర్మ ఉండగా.. సునీల్ జోషి(సౌత్ జోన్), హర్విందర్ సింగ్(సెంట్రల్ జోన్), దెబాషిశ్ మొహంతి(ఈస్ట్ జోన్) లు ఉన్నారు. గత నెలలోనే కొత్త సెలక్షన్ కమిటీని నియమించనున్నట్లు బీసీసీఐ ప్రధాన కార్యదర్శి జైషా వెల్లడించారు. సెలక్షన్ కమిటీలోని ఐదు స్థానాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునేవారు కనీసం 7 టెస్టు మ్యాచ్‌లు, 30 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు లేదా 10 వన్డేలు లేదా 20 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడి ఉండాలని బీసీసీఐ పేర్కొంది. అలాగే, క్రికెట్‌కు కనీసం 5 ఏళ్ల క్రితం రిటైర్మెంట్ ప్రకటించి ఉండాలని స్పష్టం చేసింది. 🚨NEWS🚨: BCCI invites applications for the position of National Selectors (Senior Men). Details : https://t.co/inkWOSoMt9 — BCCI (@BCCI) November 18, 2022 ఇదీ చదవండి: వెన్నులో వణుకు పుట్టిస్తున్నాడు.. ఇలాంటి బౌలర్ భారత్‌కు అత్యవసరం -
నిందించాల్సింది ఆటగాళ్లను కాదు, వాళ్లను.. ఒక్క లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ కూడా లేడా..?
ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్‌కప్-2022లో టీమిండియా సెమీస్‌లోనే ఇంటిదారి పట్టిన నేపథ్యంలో చాలా వరకు భారత అభిమానులు ఆటగాళ్లను నిందిస్తున్నారు. సోషల్‌మీడియాలో రకరకాల కామెంట్లు పెడుతూ, వారి మనోభావాలను దెబ్బతీస్తున్నారు. గెలిచినప్పుడు ఒకలా.. ఓడినప్పుడు మరోలా ప్రవర్తిస్తూ, మన పరువును మనమే బజారుకీడ్చుకునేలా చేస్తున్నారు. అసలు వరల్డ్‌కప్‌లో, ముఖ్యంగా సెమీస్‌లో ఇంగ్లండ్ చేతిలో టీమిండియా ఘోర ఓటమికి కారణలేంటని విశ్లేషిస్తే.. ఈ పరాభవానికి జట్టు సెలెక్టర్లే ప్రధాన కారణమన్నది అందరూ తెలుసుకోవాల్సిన విషయం. జట్టు ఎంపికలో వారు చేసిన తప్పిదాలే టీమిండియా ఓటమికి పరోక్ష కారణమయ్యాయన్నది అందరూ గమనించాల్సిన అంశం. బౌలింగ్‌లో బుమ్రా స్థానాన్ని భర్తీ చేయడంలో ఘోర వైఫల్యం, టాపార్డర్ బ్యాటింగ్‌లో ఒక్క లెఫ్ట్ హ్యాండర్ బ్యాటర్‌ను కూడా ఎంపిక చేయకపోవడం, ప్రత్యామ్నాయ స్పెషలిస్ట్ ఓపెనర్‌ను ఎంపిక చేయాలన్న ధ్యాసే లేకపోవడం, మిడిలార్డర్లో కీలక ఇన్నింగ్స్‌లు ఆడగల శ్రేయస్ అయ్యర్‌ను కాదని దీపక్ హుడాను ఎంపిక చేయడం, హార్ధిక్ లాంటి నాణ్యమైన పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌ను గుర్తించలేకపోవడం, ఫినిషర్ అంటూ దినేశ్ కార్తీక్‌ను ఎంపిక చేసి ఘోర తప్పిదం చేయడం, టీ20లకు అస్సలు సూట్ కాని అశ్విన్‌ను ఎంపిక చేయడం, కనీసం బౌలింగ్‌కు న్యాయం చేయలేని అక్షర్ పటేల్‌ను ఆల్‌రౌండర్ కోటాలో ఎంపిక చేయడం.. ఇలా చెప్పుకుంటూ పోతే చేతన్ శర్మ నేతృత్వంలోని జాతీయ సెలెక్షన్ కమిటీ వరల్డ్‌కప్ జట్టు ఎంపికలో చాలా ఘోర తప్పిదాలే చేసింది. వీటన్నిటి కంటే ముఖ్యంగా నిఖార్సైన పేసర్లను గుర్తించి, వారిని సానబెట్టడంలో సెలెక్టర్లతో పాటు బీసీసీఐ, నేషనల్ క్రికెట్ అకాడమీలు దారుణంగా విఫలమయ్యాయి. ఈ విషయంలో వీరినే ప్రధానంగా నిందించాలి. నాణ్యమైన పేసర్లను తయారు చేసుకునేందుకు వరల్డ్‌కప్‌కు ముందు చాలా సమయం దొరికినప్పటికీ.. కేవలం ఒకరిద్దరిని పట్టుకుని వేలాడారే తప్పించి, యంగ్ టాలెంట్‌ను అన్వేశించి, వారిని సానబెట్టాలన్న ఆలోచన చేయలేకపోయారు. ఆస్ట్రేలియా పిచ్‌లకు సూటయ్యే ఉమ్రాన్ మాలిక్, మహ్మద్ సిరాజ్, నటరాజన్ లాంటి యువ పేసర్లను పరిగణలోకి తీసుకోకుండా భారీ మూల్యమే చెల్లించుకున్నారు. సెలెక్టర్లు, బీసీసీఐ, ఎన్సీఏ చేసిన ఇన్ని తప్పిదాలను పక్కకు పెట్టి, కేవలం ఒక్క మ్యాచ్‌లో ఓడినందుకు క్రికెటర్లను, కోచ్‌ను నిందించడం ఎంత వరకు సబబో భారత అభిమానులు ఆలోచించాలి. అభిమానులు ఎదో బాధలో ఆటగాళ్లను నిందించారంటే ఓ అర్ధం ఉంది. కొందరు భారత మాజీలయితే తమ స్థాయిని మరిచి కెప్టెన్‌ను, సీనియర్ ఆటగాళ్లను, కోచ్‌ను టార్గెట్ చేయడం హాస్యాస్పదంగా ఉంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, అశ్విన్, షమీ, దినేశ్ కార్తీక్‌లు టీ20 ఫార్మాట్ నుంచి తప్పుకోవాలని, టీమిండియా ఓటమికి నైతిక బాధ్యత వహించి కోచ్ తప్పుకోవాలని వారు కోరడం విడ్డూరంగా ఉంది. చదవండి: రాహుల్ ద్రవిడ్‌కు విశ్రాంతి.. టీమిండియా కోచ్ ఎవరంటే..? -
రెస్ట్ తీసుకుంటే ఫామ్‌లోకి రారు.. కోహ్లి, రోహిత్‌లను ఉద్దేశించి ఇర్ఫాన్ పఠాన్ ఘాటు వ్యాఖ్యలు
Irfan Pathan: జులై 22 నుంచి ప్రారంభంకానున్న విండీస్ టూర్‌కు (వన్డేలు) టీమిండియా సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, రిషబ్ పంత్, మహ్మద్ షమీలకు రెస్ట్ ఇవ్వడంపై భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ మండిపడ్డాడు. సెలెక్టర్లు తరుచూ సీనియర్లకు విశ్రాంతినివ్వడంపై ట్విటర్ వేదికగా అసహనం వ్యక్తం చేశాడు. అసలే ఫామ్ కోల్పోయి నానా తంటాలు పడుతున్న కోహ్లి, రోహిత్‌లను విండీస్‌తో వన్డేలకు పక్కకు పెట్టడం ఎంత వరకు సబబని పరోక్షంగా ప్రశ్నించాడు. రెస్ట్ తీసుకుంటే ఏ ఆటగాడూ ఫామ్‌లోని రాడని ఘాటు వ్యాఖ్యలు చేశాడు. No one comes back to form while resting… — Irfan Pathan (@IrfanPathan) July 6, 2022 ఇర్ఫాన్ తన ట్వీట్లో కోహ్లి, రోహిత్‌ల పేర్లను ప్రస్తావించనప్పటికీ నెటిజన్లకు విషయం అర్ధమై సదరు ట్వీట్‌తో ఏకీభవిస్తున్నారు. ఈ విషయంలో ఇర్ఫాన్ వాదన కరెక్టేనని వారు అభిప్రాయపడుతున్నారు. సోషల్‌మీడియాలో ఇర్ఫాన్ ట్వీట్‌కు మద్దతుగా భారీ ప్రచారం చేస్తున్నారు. ఇర్ఫాన్ ట్వీట్ ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. కాగా, విండీస్‌తో మూడు వన్డేల కోసం 16 మంది సభ్యుల టీమిండియాను సెలెక్టర్లు నిన్న (జులై 6) ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ జట్టుకు సీనియర్ ఆటగాడు శిఖర్ ధవన్ నాయకత్వం వహించనున్నాడు. ఇదిలా ఉంటే, సిరీస్‌కు ఓ కొత్త కెప్టెన్‌ను ప్రకటించడంపై కూడా టీమిండియా అభిమానులు, విశ్లేషకులు ధ్వజమెత్తుతున్నారు.సెలెక్టర్లు తరుచూ కెప్టెన్లను మారుస్తూ టీమిండియాను సర్వనాశనం చేస్తున్నారని వారు మండిపడుతున్నారు. సోషల్‌మీడియాలో సెలెక్టర్లకు వ్యతిరేకంగా కామెంట్లు చేస్తున్నారు. ఒకే నెలలో ఒకే జట్టుకు నలుగురు కెప్టెన్లు ఏంటని నిలదీస్తున్నారు. ఇంగ్లండ్‌తో ఐదో టెస్ట్‌కు రోహిత్ శర్మకు గాయం కావడంతో బుమ్రా సారధ్య బాధ్యతలు చేపట్టగా, కౌంటీ జట్లతో వార్మప్ మ్యాచ్‌లకు దినేశ్ కార్తీక్, ఇంగ్లండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌కు రోహిత్ శర్మ, ఆతర్వాత విండీస్‌తో వన్డేలకు ధవన్ టీమిండియా కెప్టెన్లుగా వ్యవహరించనున్నారు. అంతకుముందు ఐర్లాండ్‌తో టీ20లకు హార్ధిక్ పాండ్య, స్వదేశంలో సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కు రిషబ్ పంత్, సౌతాఫ్రికాలో సిరీస్‌కు కేఎల్ రాహుల్ సారధులుగా వ్యవహరించిన విషయం తెలిసిందే. వెస్టిండీస్‌తో మూడు వన్డేలకు భారత జట్టు : శిఖర్ ధవన్ (కెప్టెన్), రవీంద్ర జడేజా (వైస్ కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శుభమన్ గిల్, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్, సంజూ శాంసన్, శార్దూల్ ఠాకూర్, యుజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్, అవేశ్ ఖాన్, ప్రసిధ్ కృష్ణ, మహ్మద్ సిరాజ్, అర్షదీప్ సింగ్ చదవండి: బజ్‌బాల్.. టెస్ట్ క్రికెట్లో సరికొత్త మంత్ర -
నగాల్‌పై వేటు... యూకీకి చోటు
న్యూఢిల్లీ: డెన్మార్క్‌తో జరిగే డేవిస్ కప్ పోరు కోసం ఐదుగురు సభ్యుల భారత జట్టును అఖిల భారత టెన్నిస్ సమాఖ్య (ఐటా) సెలక్టర్లు ఎంపిక చేశారు. సుమీత్ నగాల్‌ను తప్పించి యూకీ బాంబ్రీకి చోటు కల్పించడం ఈ ఎంపికలో కీలక మార్పు. వరల్డ్ గ్రూప్–1 ప్లే ఆఫ్ ‘టై’లో భాగంగా మార్చి 4, 5 తేదీల్లో భారత్, డెన్మార్క్ తలపడనున్నాయి. ఢిల్లీ జింఖానా క్లబ్‌లోని గ్రాస్ కోర్టుల్లో రెండు రోజుల పాటు సింగిల్స్, డబుల్స్, రివర్స్ సింగిల్స్ మ్యాచ్‌లు జరుగుతాయి. ప్రపంచ 222వ ర్యాంకర్ నగాల్‌ను కాదని 863 ర్యాంకర్ యూకీ బాంబ్రీ, రామ్‌కుమార్ రామనాథన్ (182), ప్రజ్నేశ్ గుణేశ్వరన్ (228)లను సింగిల్స్ మ్యాచ్‌ల కోసం ఎంపిక చేశారు. డబుల్స్‌లో వెటరన్ స్టార్ రోహన్ బోపన్న, దివిజ్ శరణ్‌లకు స్థానం కల్పించారు. గ్రాస్ కోర్టు స్పెషలిస్ట్ కాకపోవడంతో నగాల్‌పై వేటు పడింది. తెలుగు ఆటగాడు సాకేత్ మైనేని, దిగ్విజయ్ ప్రతాప్ సింగ్‌లను రిజర్వ్ ప్లేయర్లుగా ఎంపిక చేసినట్లు ‘ఐటా’ ఒక ప్రకటనలో తెలిపింది. భారత టెన్నిస్ జట్టుకు జీషాన్ అలీ కోచ్‌గా, రోహిత్ రాజ్‌పాల్ నాన్ ప్లేయింగ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తారు. ఎంపికైన జట్టు ఈ నెల 23న న్యూఢిల్లీలో బయోబబుల్‌లోకి వెళుతుంది. కరోనా నేపథ్యంలో ‘ఐటా’ సెలక్షన్ కమిటీ వర్చువల్ పద్ధతిలో సమావేశమై జట్టును ఎంపిక చేసింది. -
సెలక్టర్లు, అంపైర్ల జీతాల పెంపు!
న్యూఢిల్లీ: జాతీయ క్రికెట్ జట్టు సెలక్టర్లు, అంపైర్లు, స్కోరర్లు, వీడియో విశ్లేషకుల జీతాలు భారీగా పెరగనున్నాయి. క్రికెట్ పాలకుల కమిటీ (సీవోఏ)తో పాటు సాబా కరీమ్ ఆధ్వర్యంలోని బీసీసీఐ క్రికెట్ పర్యవేక్షణ విభాగం ఈ నిర్ణయం తీసుకుంది. దీనిని చీఫ్ సెలక్టర్ ఎంఎస్కే ప్రసాద్, సెలక్టర్లు దేవాంగ్ గాంధీ, శరణ్‌దీప్ సింగ్ సేవలకు ప్రతిఫలంగా పేర్కొన్నారు. ప్రస్తుతం చీఫ్ సెలక్టర్‌కు ఏడాదికి రూ.80 లక్షలు, మిగతా ఇద్దరికి రూ.60 లక్షల చొప్పున వేతనం ఇస్తున్నారు. ఇకపై ఈ మొత్తం వరుసగా రూ.కోటి, రూ.75 లక్షల నుంచి రూ.80 లక్షలు కానుంది. దీంతోపాటు ఆరేళ్ల తర్వాత రిఫరీలు, అంపైర్లు, స్కోరర్లు, వీడియో విశ్లేషకుల దేశవాళీ మ్యాచ్ ఫీజులను పెంచారు. ఫస్ట్‌క్లాస్, మూడు రోజుల, 50 ఓవర్ల మ్యాచ్‌కు ఇప్పుడు రూ.20 వేలు ఇస్తుండగా దానిని రెట్టింపు చేశారు. టి20 మ్యాచ్ ఫీజు రూ.10 వేలు ఉండగా రూ.20 వేలు ఇవ్వనున్నారు. రిఫరీలకు నాలుగు రోజుల మ్యాచ్‌కు రూ.30 వేలు, మూడు రోజుల, ఒక రోజు మ్యాచ్‌కు రూ.15 వేలు అందజేస్తారు. స్కోరర్లకు రూ.10 వేలు, వీడియో విశ్లేషకులకు ఇతర మ్యాచ్‌లకు రూ.15 వేలు, టి20లకు రూ.7,500 ఇస్తారు. అయితే... జీతాల పెంపు అంశంలో బీసీసీఐ కోశాధికారి అనిరుధ్ చౌధరిని పరిగణనలోకి తీసుకోకపోవడం బోర్డు పెద్దలు, సీవోఏ మధ్య విభేదాలను మరోసారి బయటపెట్టింది. -
‘ధోని భవిష్యత్‌ను సెలక్టర్లే నిర్ణయించాలి’
సాక్షి, హైదరాబాద్: టీమిండియా సీనియర్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని అద్భుత ఫామ్‌లో ఉన్నాడని, కానీ అతని టీ20 భవిష్యత్‌ను మాత్రం సెలక్టర్లే నిర్ణయించాలని మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ అభిప్రాయపడ్డారు. శనివారం కృష్ణపట్టణం పోర్ట్ గోల్డెన్ ఈగల్స్ గోల్ఫ్ చాంపియన్‌షిప్‌లో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ఎవరూ జీవితాంతం ఆడరు. కానీ ధోని అద్భుతంగా ఆడుతున్నాడు. ఇక ధోని టీ20ల్లో ఆడే విషయాన్ని సెలక్టర్లకే వదిలేస్తున్నా. అతని విషయంలో వారే సరైన నిర్ణయం తీసుకోగలరు. నేను నా అభిప్రాయం చెబితే అది గందరగోళానికి కారణం అవుతోంది. అందుకే చెప్పడం లేదు. చాలా సమయం ఉంది. అతను ఆడాల లేదా అనే విషయం వారే నిర్ణయిస్తారు.’ అని కపిల్ దేవ్ వ్యాఖ్యానించారు. ఇక న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్ అనంతరం ధోని బ్యాటింగ్ వేగంపై సినీయర్ క్రికెటర్ల నుంచి విమర్శల వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. -
హెచ్‌సీఏ సెలక్టర్ల రాజీనామా
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ)లో గురువారం అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. సీనియర్ సెలక్షన్ కమిటీలోని ముగ్గురు సభ్యులలో చైర్మన్ రమేశ్ కుమార్, శ్రీనివాస చక్రవర్తి తమ పదవులకు రాజీనామా చేశారు. రంజీ ట్రోఫీ, అండర్–23 జట్ల ఎంపికలో హెచ్‌సీఏ కార్యదర్శి శేష్ నారాయణ్ అతిగా జోక్యం చేసుకోవడం, ఈ విషయంలో ఆయనతో తలెత్తిన విభేదాలే రాజీనామాకు కారణమని సమాచారం. మరోవైపు అండర్–23 జట్టు కోసం కొత్తగా క్రికెట్ అడ్మినిస్ట్రేటర్ పదవిని సృష్టించి, అన్ని విషయాల్లో ఆయనకు జవాబుదారీగా ఉండాలంటూ హెచ్‌సీఏ నిర్ణయం తీసుకున్నందుకు నిరసనగా జట్టు కోచ్ అనిరుధ్ సింగ్ కూడా తన పదవి నుంచి తప్పుకున్నారు. హైదరాబాద్ రంజీ జట్టు ప్రస్తుతం ఢిల్లీలో రైల్వేస్‌తో తలపడుతుండగా... నేటినుంచి హైదరాబాద్, ఒడిషా మధ్య అండర్–23 మ్యాచ్ జరగనుంది. -
విండీస్ సెలక్టర్లపై గేల్ ధ్వజం
బ్రేవో, పొలార్డ్‌లకు మద్దతు జొహన్నెస్‌బర్గ్: వెస్టిండీస్ ప్రపంచకప్ జట్టులో డ్వేన్ బ్రేవో, కీరన్ పొలార్డ్‌లకు చోటివ్వకపోవడాన్ని విధ్వంసకర ఓపెనర్ క్రిస్ గేల్ తప్పుపట్టాడు. ఈ చర్య హాస్యాస్పదంగా ఉందని సెలక్టర్లపై ధ్వజమెత్తాడు. ‘ఆ ఇద్దరు ఆటగాళ్లు జట్టులో ఎందుకుండకూడదు? బ్రేవో, పొలార్డ్ లేకుండా మాది పటిష్టమైన జట్టు అనిపించుకోదు. ఇది నిజంగా విచారకరం. ఇద్దరు కీలక ఆల్రౌండర్లను టోర్నీకి ముందే మేం కోల్పోవడం గట్టి ఎదురుదెబ్బగానే భావించాలి. దీని వెనుకాల చరిత్ర నాకు తెలీదు. కానీ నా దృష్టిలో అత్యంత చెత్త నిర్ణయం ఇది. వచ్చే ప్రపంచకప్ కోసం సిద్ధంగా ఉండేందుకు ఈ జట్టును ఎంపిక చేశారని బ్రేవో నాతో చెప్పాడు. అంటే ఈ వరల్డ్‌కప్‌ను గెలుచుకోవాల్సిన అవసరం లేదనా వారి ఉద్దేశం. మా క్రికెట్ ఎటు వెళుతుందో అర్థం కావడం లేదు. వన్డే ఫార్మాట్లో మా అతి పెద్ద ఆటగాళ్లు ఇద్దరు లేకుండా ప్రపంచకప్‌కు వెళ్లాల్సి ఉంది. ఇది మమ్మల్ని గాయపరిచింది’ అని గేల్ ఘాటుగా స్పందించాడు.