28న సైకాలజిస్ట్ అసోసియేషన్ కార్యవర్గం ఎన్నిక
Published Fri, Aug 26 2016 12:21 AM | Last Updated on Mon, Sep 4 2017 10:52 AM
న్యూశాయంపేట : ప్రోగ్రెసివ్ సైకాలజిస్ట్ అసోసియేషన్ జిల్లా నూతన కార్యవర్గాన్ని ఈ నెల 28న హన్మకొండలోని హౌసింగ్‌బోర్డ్ కాలనీ రోడ్డులో గల మైండ్‌కేర్ సెంటర్‌లో ఎన్నికోనున్నట్లు అసోసియేషన్ జాతీయ సంయుక్త కార్యదర్శి బరుపాటి గోపి తెలిపారు. గురువారం హన్మకొండ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సైకాలజీ పూర్తి చేసిన వారు రూ.300 చెల్లించి సభ్యత్వం తీసుకోవాలని సూచించారు. సభ్యత్వం ఉన్నవారే ఎన్నికల్లో పాల్గొనాలని సూచించారు. అదే రోజున సభ్యులకు శిక్షణ తరగతులు నిర్వహిస్తామని తెలిపారు. ఎన్నికల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాతీయ అధ్యక్షుడు కమలాకర్, రాష్ట్ర కార్యదర్శి వేదప్రకాశ్ హాజరవుతారని చెప్పారు. సమావేశంలో అప్పన మనోజ్‌కుమార్, కుసుమ రమేష్, ఎం.విజయభాస్కర్‌రెడ్డి, భుజేందర్‌రెడ్డి, ఎన్.శ్రీనివాస్,జి.రామాచారి పాల్గొన్నారు.
Advertisement
Advertisement