ICC T20 World Cup 2021: Selectors And BCCI To Take Important Decisions - Sakshi
Sakshi News home page

T20 World Cup Team India: రేపే సెలెక్టర్ల సమావేశం.. తేలనున్న 'ఆ నలుగురి' భవితవ్యం

Published Fri, Oct 8 2021 6:03 PM | Last Updated on Sat, Oct 9 2021 11:42 AM

T20 World Cup 2021: Selectors And BCCI To Meet On Saturday, Important Decisions To Be Made - Sakshi

Selectors And BCCI To Meet On Saturday Over Team India T20 World Cup Team: టీ20 ప్రపంచకప్‌ జట్టులో మార్పులు చేర్పులు చేసేందుకు అక్టోబర్‌ 10 ఆఖరి తేదీ కావడంతో బీసీసీఐ, సెలెక్షన్‌ కమిటీలు రేపు(శనివారం) భేటీ కానున్నాయి. ఈ సందర్భంగా భారత టీ20 ప్రపంచకప్‌ జట్టుకు ఎంపికైన ఆటగాళ్ల భవితవ్యంపై చర్చ జరగనుంది. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్‌లో తీవ్రంగా నిరాశపరచిన ముంబై ఇండియన్స్ ఆటగాళ్లు హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్‌ యాదవ్‌, ఇషాన్‌ కిషన్‌లతో పాటు మిస్టరీ స్పిన్నర్‌, కేకేఆర్‌ ఆటగాడు వరుణ్‌ చక్రవర్తిలను జట్టులో కొనసాగించడంపై సెలెక్షన్‌ కమిటీ తీవ్ర కసరత్తే చేయనుంది.

వీరిలో హార్దిక్ పాండ్యా, వరుణ్‌ చక్రవర్తిల ఫిట్‌నెస్ సమస్య బీసీసీఐ సహా సెలెక్షన్‌ కమిటీకి పెద్ద తలనొప్పిగా మారింది. ఒకవేళ ఈ నలుగురిని తప్పించి ఇతరులకు చోటు కల్పించాలని సెలెక్షన్‌ కమిటీ భావిస్తే ఎవరెవరు జట్టులోకి వస్తారన్నదానిపై పెద్ద చర్చే నడుస్తోంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో బీసీసీఐ ఇలాంటి సాహసం చేయకపోవచ్చని విశ్లేషకుల అభిప్రాయం. ఒకట్రెండు మార్పులు చేసినా.. అవి స్టాండ్ బై ఆటగాళ్లను దాటకపోవచ్చని సమాచారం. ఇషాన్‌ కిషన్‌, సూర్యకుమార్‌ యాదవ్‌లలో ఒకరిని తప్పించాలని భావిస్తే.. ఆ స్థానాన్ని శ్రేయస్ అయ్యర్‌తో.. హార్దిక్ పాండ్యాపై వేటు వేయాలనుకుంటే శార్దూల్ ఠాకూర్‌, దీపక్ చాహర్‌లలో ఒకరిని జట్టులోని తీసుకునే అవకాశం ఉంది.

మోకాళ్ల నొప్పులతో సతమతమవుతున్న వరుణ్‌ చక్రవర్తి పూర్తి ఫిట్‌నెస్‌ సాధించని పక్షంలో అతని స్థానాన్ని ఆర్సీబీ స్పిన్నర్‌ యుజ్వేంద్ర చహల్‌తో భర్తీ చేసే అవకాశం ఉందని బీసీసీఐకు చెందిన ఓ అధికారి తెలిపాడు. కాగా,  ఈ సమావేశానికి కెప్టెన్ విరాట్ కోహ్లి, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ, ప్రధాన కోచ్ రవిశాస్త్రి కూడా హాజరుకానున్నారు. 

భారత టీ20 ప్రపంచకప్ జట్టు: విరాట్ కోహ్లి (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (కీపర్), ఇషాన్ కిషన్ (కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రాహుల్ చహర్, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమీ

స్టాండ్ బై ప్లేయర్స్: శ్రేయస్ అయ్యర్, శార్దూల్ ఠాకూర్ మరియు దీపక్ చాహర్
చదవండి: దీపక్‌ చాహర్‌ లవ్‌ ప్రపోజల్‌ సెలబ్రేషన్స్‌.. ధోని హంగామా చూడాల్సిందే..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement