భారత పురుషుల క్రికెట్ జట్టు సెలెక్షన్ కమిటీ సభ్యుడిగా టీమిండియా మాజీ వికెట్‌కీపర్, బ్యాటర్ అజయ్ రాత్రా ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని బీసీసీఐ క్రికెట్ అడ్వైజరీ కమిటీ (సీఏసీ) మంగళవారం (సెప్టెంబర్ 3) ప్రకటించింది. మాజీ సభ్యుడు సలీల్ అంకోలా స్థానాన్ని రాత్రా భర్తీ చేస్తాడు. టీమిండియా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, అంకోలా ఇద్దరూ ఒకే జోన్‌కు (వెస్ట్) చెందిన వారు కావడంతో అంకోలా సెలెక్షన్ కమిటీ నుంచి వైదొలగాల్సి వచ్చింది.
రాత్రా నార్త్ జోన్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ప్రస్తుతం సెలెక్షన్ కమిటీలో శివ్ సుందర్ దాస్, సుబ్రతో బెనర్జీ, శ్రీథరన్ శరత్ సభ్యులుగా ఉన్నారు. తాజాగా రాత్రా వీరి సరసన చేరాడు. 2002లో టీమిండియా తరఫున 6 టెస్ట్‌లు, 12 వన్డేలు ఆడిన రాత్రా దేశవాలీ క్రికెట్‌లో అసోం, పంజాబ్, ఉత్తర్‌ప్రదేశ్ హెడ్ కోచ్‌గా పని చేశాడు. అతను 2023 దక్షిణాఫ్రికా పర్యటనలో టీమిండియా సపోర్టింగ్ స్టాఫ్‌లో సభ్యుడిగా ఉన్నాడు. అజయ్ రాత్రా టెస్ట్‌ల్లో టీమిండియా తరఫున ఓ సెంచరీ చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment